సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
corona virus

తమలపాకు షర్బత్‌తో చల్ల చల్లగా..!

Preparation of betel leaves Sharbat or Tamalapaku

సుర్రుమనిపిస్తున్న ఎండకి సమాధానం చెప్పాలంటే ఆరోగ్యాన్నిచ్చే ఈ పాన్‌ షర్బత్‌ తయారీ గురించి తెలుసుకోవాల్సిందే!

తమలపాకు షర్బత్‌
కావాల్సినవి: తమలపాకులు- ఆరు, యాలకులు - ఆరు (కొన్ని నీళ్లలో నానబెట్టుకోవాలి), గుల్‌ఖండ్‌ - అర కప్పు, సోంపు - పావు కప్పు (కప్పు నీటిలో రెండు గంటలపాటు నానబెట్టుకోవాలి), చక్కెర - కప్పు, నీళ్లు - తగినన్ని.
తయారీ: తమలపాకులను శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసి మిక్సీలో వేసుకోవాలి. ముందుగా నానబెట్టి పెట్టుకున్న యాలకులను నీళ్లతో సహా వీటిలో పోసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో గుల్‌ఖండ్‌ కలిపి మరోసారి మిక్సీ పట్టాలి.

మరో గిన్నెలో సోంపును వడకట్టి నీళ్లు తీసుకోవాలి. చిన్న జార్‌లో సోంపు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే కొద్ది కొద్దిగా సోంపు నీళ్లు పోస్తూ మెత్తగా ముద్దలా చేసుకోవాలి. మరో గిన్నెలో కప్పు చక్కెర వేసి అర కప్పు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. చక్కెర కరుగుతున్న సమయంలో తయారుచేసి పెట్టుకున్న తమలపాకు మిశ్రమం, సోంపు ముద్ద, కొన్ని నీళ్లు పోసి బాగా కలపాలి. పదినిమిషాలపాటు సన్నని మంట మీద ఉడికించాలి. కావాలనుకుంటే చిటికెడు ఫుడ్‌ కలర్‌ (గ్రీన్‌) వేసుకోవచ్చు. రసం చిక్కగా అయ్యాక చెంచా నిమ్మరసం కలపాలి. దీన్ని చల్లార్చి వడకట్టుకోవాలి. ఈ రసాన్ని సీసాలో పోసి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే దాదాపు నెలరోజుల వరకు వాడుకోవచ్చు. ఇప్పుడు గ్లాసు చల్లటి నీటిలో రెండు చెంచాల తమలపాకు రసాన్ని పోసి, కావాలనుకుంటే రెండు మూడు ఐసు ముక్కలు వేసుకుని బాగా కలిపి చల్లచల్లగా తాగొచ్చు.

women icon@teamvasundhara
causes-and-precautions-for-d-vitamin-deficiency-in-telugu
women icon@teamvasundhara
health-benefits-of-triphala-powder-by-expert
women icon@teamvasundhara
health-benefits-of-sago-rice
women icon@teamvasundhara
health-benefits-of-bottle-gourd-or-sorakaya
women icon@teamvasundhara
health-benefits-of-anjeer-fruit
women icon@teamvasundhara
health-benefits-of-almonds
women icon@teamvasundhara
health-benefits-of-moong-dal-in-summer
women icon@teamvasundhara
corona-virus-covid-19-black-pepper-tea-benefits