సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
corona virus

ఆకే కదాని.. తీసేయకండి!

Health Benefits of Curry Leaves

కూరలో కరివేపాకులా అని తేలిగ్గా తీసిపారేస్తాం కానీ... దానిలోని పోషకాల గురించి తెలిస్తే పొరపాటున కూడా ఆ మాట అనం....

కరివేపాకుని కృష్ణనింబా లేదా తీపి వేప అనికూడా అంటారు. దీంట్లో కొవ్వు ఉండదు, పీచు ఉంటుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచే విటమిన్‌ ఎ, బి, సిలతోపాటూ క్యాల్షియం అధికంగా ఉంటుంది. నువ్వులతో సమానమైన క్యాల్షియం కరివేపాకు నుంచి అందుతుంది.
రోగనిరోధక శక్తి
ఇది రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందుకే ఇది ఏడాది పొడవునా వాడదగ్గ ఆహారం, ఔషధం కూడా.190520vasu3a.jpg
అజీర్తి ఉండదు
పచ్చి ఆకులను నమిలితే చిగుళ్లు గట్టిపడతాయి. అజీర్తి సమస్య ఉండదు. సుఖ విరేచనం అవుతుంది. అయితే అధికంగా తీసుకుంటే మాత్రం మలబద్ధకం ఎదురవుతుంది.
మొదటిముద్ద
ఈ ఆకులను మజ్జిగలో వేసుకుని తాగితే కడుపులో మంట, నీళ్ల విరేచనాలు తగ్గుతాయి. ఫ్రీరాడికల్స్‌ను తగ్గించే గుణం వీటికి ఉంది. వాపులు, నీరుపట్టినవాళ్లు కరివేపాకు కషాయం తాగితే ఫలితం ఉంటుంది. పెద్ద చెంచాడు కరివేపాకు పొడిలో చిటికెడు ఇంగువ పొడి కలిపి మొదటి ముద్దను తీసుకుంటే నెలసరి సక్రమంగా వస్తుంది. నోటిపూత కూడా తగ్గుతుంది.
మధుమేహం
కరివేపాకు పొడిలో ఉండే పీచు మధుమేహాన్ని నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కంటి సమస్యలు ఉన్నవాళ్లకు, దృష్టిలోపం పెరగకుండా ఉండటానికి ఇది చాలా మంచిది. ఆకులను నీడలో ఎండపెట్టాలి కానీ నేరుగా ఎండలో పెట్టకూడదు. తడిచిన ఆకులను వాడకూడదు. నేతిలో వేయించిన ఆకులు మంచివి.
పైపూత
కరివేపాకు కాలేయ సమస్యలను తగ్గిస్తుంది. బ్యాక్టీరియల్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. ఆకులను మెత్తగా నూరి గడ్డలు, పొక్కులకు పైపూతగా వాడొచ్చు. దీంట్లోని తైలం జుట్టు పెరగడానికి తోడ్పడుతుంది. దీంట్లోని అమైనో ఆమ్లాలు గుండె కండరాలకు మేలు చేస్తాయి.
ఉపశమనం
కంటికి, కాలేయానికి, పేగులకు మంచిది. నేతిలో వేయించిన కరివేపాకు పొడిని తీసుకుంటే రక్త విరేచనాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇలా చేయొచ్చు
కరివేపాకు పొడిలో రెండు నిమ్మకాయలు పిండి, కాస్త ఉప్పు, కారం వేసి చివరగా తాలింపు వేసుకుంటే అన్నం, ఇడ్లీల్లోకి చాలా బాగుంటుంది.
ఒత్తిడి మాయం
మానసిక ఒత్తిడి, నరాల బలహీనతను తగ్గిస్తుంది. దీంట్లో ఉండే విటమిన్‌- ఎ, బి2ల వల్ల తలనొప్పి, నరాల నొప్పులు బాధించకుండా ఉంటాయి. మెదడును చురుగ్గా ఉంచే ఆహారం ఇది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి కరివేపాకు పొడిని రోజూ తీసుకోవచ్చు.

- డాక్టర్‌ పెద్ది రమాదేవి, ఆయుర్వేద నిపుణులు‌

women icon@teamvasundhara
causes-and-precautions-for-d-vitamin-deficiency-in-telugu
women icon@teamvasundhara
health-benefits-of-triphala-powder-by-expert
women icon@teamvasundhara
health-benefits-of-sago-rice
women icon@teamvasundhara
health-benefits-of-bottle-gourd-or-sorakaya
women icon@teamvasundhara
health-benefits-of-anjeer-fruit
women icon@teamvasundhara
health-benefits-of-almonds
women icon@teamvasundhara
health-benefits-of-moong-dal-in-summer
women icon@teamvasundhara
corona-virus-covid-19-black-pepper-tea-benefits