సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
corona virus

బరువును అదుపులో ఉంచే సొరకాయ..!

Health Benefits of bottle gourd or Sorakaya

వేడిని అదుపులో ఉంచడానికి ఇతరత్రా ఎన్ని చర్యలు తీసుకున్నా... తీసుకునే ఆహారం విషయంలోనూ జాగ్రత్త తప్పనిసరి. ఈ కాలంలో పోషకాలను అందిస్తూ... శరీర తాపాన్ని తగ్గించడంలో సొరకాయని మించింది లేదంటారు పోషకాహార నిపుణులు. ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందామా?

* సొరకాయలో క్యాలరీలు చాలా తక్కువ. వంద గ్రాముల కాయ నుంచి శరీరానికి అందేవి 15 క్యాలరీలే. నీరు మాత్రం 96శాతం ఉంటుంది. వీటిల్లో జీర్ణశక్తికి సహకరించే పీచు పుష్కలంగా దొరుకుతుంది. ఇది అతిగా తినే అలవాటుని తగ్గిస్తుంది. శరీర బరువుని అదుపులో ఉంచుతుంది.
* వేసవిలో శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు పోతుంది. నీటినిల్వలు తగ్గి నిస్సత్తువ ఆవరిస్తుంది. ఈ పరిస్థితి తలెత్తకూడదంటే... సొరకాయని తరచూ తింటే మేలు. ఇది అతిదాహం
తగ్గిస్తుంది.
* శరీరానికి హానిచేసే శాచురేటెడ్‌ కొవ్వు, కొలెస్ట్రాల్‌ ఇందులో ఉండవు. వ్యాధినిరోధక శక్తిని పెంచే విటమిన్‌ సి, రైబోఫ్లెవిన్‌, జింక్‌, థయామిన్‌, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
*ఇనుముతో పాటూ ఆనపకాయలో ఉండే విటమిన్‌ బి, సిలు వ్యాధినిరోధకశక్తిని పెంచితే దీనిలోని పొటాషియం బీపీ పెరగకుండా కాపాడుతుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు దీనిని ఆహారంగా తీసుకుంటే మేలు. కొద్ది మొత్తంలో లభించే సూక్ష్మ పోషక ఖనిజాలు గుండెజబ్బులు రాకుండా చూస్తాయి.





women icon@teamvasundhara
causes-and-precautions-for-d-vitamin-deficiency-in-telugu
women icon@teamvasundhara
health-benefits-of-triphala-powder-by-expert
women icon@teamvasundhara
health-benefits-of-sago-rice
women icon@teamvasundhara
juices-that-help-you-to-detoxify-your-body
women icon@teamvasundhara
health-benefits-of-anjeer-fruit
women icon@teamvasundhara
health-benefits-of-almonds
women icon@teamvasundhara
health-benefits-of-moong-dal-in-summer
women icon@teamvasundhara
corona-virus-covid-19-black-pepper-tea-benefits