సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
corona virus

రోగనిరోధక శక్తిని పెంచే సెనగలు..!

Health Benefits of Chickpea or Senagalu

ఇలా ఉడకబెట్టి... అలా తాలింపు వేస్తే రుచికరమైన సాయంత్రం స్నాక్‌ రెడీ! పిల్లలైనా, పెద్దలైనా ఇష్టంగా తినే సెనగలను తేలిగ్గా తయారుచేసుకోవచ్చు. వీటిలో పోషకాలూ నిండుగా ఉంటాయి...

ఉత్తమ టిఫిన్‌..

మిగతా పప్పుగింజలతో పోలిస్తే సెనగల నుంచి అధిక మొత్తంలో మాంసకృత్తులు లభిస్తాయి. ఇవి ఆహారాన్ని నిదానంగా జీర్ణమయ్యేలా చేసి పొట్ట నిండిన భావన కలిగిస్తాయి. బరువు తగ్గాలనుకునేవారు వీటిని అల్పాహారంగా తీసుకోవచ్చు.

వీటితో కలిపితే..

సెనగలను బియ్యం, గోధుమలు... ఇలా ఇతర ధాన్యాలతో కలిపి తీసుకుంటే మాంసకృత్తులు సమృద్ధిగా అందుతాయి.

Chickpeasbenefits650-1.jpg

తిని నీళ్లు తాగితేనే..

వీటిలో పీచు ఎక్కువ. అందుకే సెనగలను క్రమం తప్పకుండా తీసుకునేవారిలో మలబద్ధకం సమస్య ఉండదని పరిశోధనలు చెబుతున్నాయి. కాకపోతే సెనగలు తిని నీళ్లు కూడా బాగా తాగినప్పుడే ఈ ఫలితం కనిపిస్తుంది. వీటిలోని పీచు పేగుల ఆరోగ్యాన్ని కాపాడి కొలెస్ట్రాల్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. దాంతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలావరకు తగ్గుతుంది. అలాగే పీచు రక్తంలో చక్కెర స్థాయులను కూడా బాగా నియంత్రిస్తుంది.

ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే..

సెనగల్లో క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌ లాంటి ఖనిజాలుంటాయి. సెలీనియం అనే సూక్ష్మపోషకంతోపాటు ఫోలేట్‌, బీటా కెరొటిన్‌ విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు నిండుగా ఉండి మనలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

గుండెజబ్బులు ఉన్నవారు..

ఈ పప్పుల్లో కొద్దిమొత్తంలో కొవ్వులుంటాయి. అవి కూడా శరీరానికి మేలు చేసే అన్‌శాచురేటెడ్‌ రూపంలో లభిస్తాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అందుకే హృద్రోగులకు పోషకాహార నిపుణులు వీటిని తినమని చెబుతారు. వీటిలోని బయోయాక్టివ్‌ సమ్మేళనాలు గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి.

జాగ్రత్త..

సెనగలను పచ్చిగా తినొద్దు. బాగా నానబెట్టి ఉడికించి మాత్రమే తినాలి. నానబెట్టి మొలకల్లా తీసుకోవచ్చు. నానబెట్టి, వేయించి తీసుకోవచ్చు.

women icon@teamvasundhara
causes-and-precautions-for-d-vitamin-deficiency-in-telugu
women icon@teamvasundhara
health-benefits-of-triphala-powder-by-expert
women icon@teamvasundhara
health-benefits-of-sago-rice
women icon@teamvasundhara
juices-that-help-you-to-detoxify-your-body
women icon@teamvasundhara
health-benefits-of-anjeer-fruit
women icon@teamvasundhara
health-benefits-of-almonds
women icon@teamvasundhara
health-benefits-of-moong-dal-in-summer
women icon@teamvasundhara
corona-virus-covid-19-black-pepper-tea-benefits