సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
corona virus

పోషకాల గని బొప్పాయి..!

Health Benefits of Papaya

కరోనాను అడ్డుకునేది లాక్‌డౌన్‌. దాన్ని దాటుకొని వచ్చే వైరస్‌ను తిప్పికొట్టేది మనలోని రోగనిరోధక శక్తే! అందుబాటు ధరలో ఉండే పోషకాల గని బొప్పాయి. ఈ పండుకు మన ఆహారంలో చోటిస్తే చాలు.. తక్షణ రక్షణ సిద్ధిస్తుంది.●

* బొప్పాయిలోని ఎ, సి, కె విటమిన్లు ఇమ్యూనో బూస్టర్లుగా పనిచేస్తాయి. శరీరంలోని కణజాల వృద్ధికి, చర్మ ఆరోగ్యానికి తోడ్పడతాయి.
26042020vasu3b.jpg* ఇందులో నీరు, పీచు తగిన పరిమాణంలో ఉంటాయి. ఫోలిక్‌ ఆమ్లం, పొటాషియం, మెగ్నీషియం, కాపర్‌, జింక్‌ అదనపు శక్తినిస్తాయి.
* ఒక కప్పు (వంద గ్రాములు) బొప్పాయి తింటే 40 క్యాలరీలు లభిస్తాయి. రోజులో మనకు అవసరమయ్యే విటమిన్‌-ఎలో 20 శాతం, విటమిన్‌-సిలో 70 శాతం లభిస్తుంది.
* తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు దీనిని హాయిగా తినొచ్చు. 100 గ్రాముల బొప్పాయిలో చక్కెర ఎనిమిది గ్రాములే ఉంటుంది.
* కాలేయ సంబంధ వ్యాధులు, చర్మ సమస్యలు, వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటుందీ ఫలం.
* బొప్పాయిలోని పపైన్‌ అనే ఎంజైమ్‌ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తరచూ గ్లాసు రసం తీసుకుంటే మలబద్ధకం ఉండదు.
* ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియంట్లు.. ఫ్రీరాడికల్స్‌తో పోరాడి గుండె జబ్బులు, క్యాన్సర్‌ లాంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి.
పిల్లలు, వృద్ధులు 150 గ్రాముల వరకు రోజూ తీసుకోవచ్చు. మధుమేహ రోగులూ తినొచ్చు.





women icon@teamvasundhara
causes-and-precautions-for-d-vitamin-deficiency-in-telugu
women icon@teamvasundhara
health-benefits-of-triphala-powder-by-expert
women icon@teamvasundhara
health-benefits-of-sago-rice
women icon@teamvasundhara
juices-that-help-you-to-detoxify-your-body
women icon@teamvasundhara
health-benefits-of-chickpea-or-senagalu
women icon@teamvasundhara
health-benefits-of-almonds
women icon@teamvasundhara
health-benefits-of-moong-dal-in-summer
women icon@teamvasundhara
corona-virus-covid-19-black-pepper-tea-benefits