సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
corona virus

పెసరపప్పుతో సలాడ్‌ ట్రై చేశారా?

Health benefits of moong dal in summer

క్షణాల్లో ఉడికిపోతుంది... రుచిలో అదిరిపోతుంది! పోషకాలతో పోటీపడుతుంది. వ్యాధినిరోధక శక్తి పుష్కలంగా ఉండే పెసరపప్పు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...
* ఒంట్లోని వేడిని, కఫాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. మలబద్ధకం సమస్య ఉండదు. దీంట్లో విటమిన్‌-బి1, బి2 అధికంగా ఉండటం వల్ల మనలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. పెసరపప్పును ఉడకబెట్టి, నానబెట్టి రెండు రకాలుగానూ వాడొచ్చు.
* పెసరపప్పుతో పచ్చడి, పెసరకట్టు మాత్రమే కాకుండా సలాడ్‌ కూడా తయారుచేయొచ్చు. తక్కువ సమయంలో జీర్ణమవుతుంది. ఈ వేసవి కాలంలో చలువ చేస్తుంది. ముఖ్యంగా కళ్లకు చాలా మంచిది. మిగతా పప్పుల్లా కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు ఉండవు. కొంతమందిలో మాత్రమే గ్యాస్‌ సమస్య ఎదురవుతుంది.
పిండిపదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు, క్యాల్షియం, ఫాస్ఫరస్‌, ఇనుము, విటమిన్‌-ఎ1, బి1, బి2, పొటాషియం, సోడియంలాంటి పోషకాలెన్నో దీంట్లో ఉన్నాయి. మొలకెత్తిన పెసల్లో విటమిన్‌-సి పుష్కలంగా ఉంటుంది.


కలరా, చికెన్‌ పాక్స్‌, వైరల్‌ ఫీవర్‌లు వచ్చినప్పుడు కూడా దీన్ని ఇవ్వవచ్చు. ఇది నీరసాన్ని తగ్గించి శక్తిని అందిస్తుంది. చిన్న పిల్లలకూ మంచిది. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా తినే కచోరి తయారీలోనూ పెసర పప్పును వాడతారు.

29042020vasu2b.jpg

పెసరకట్టు: చాలా ప్రాంతాల్లో వేసవికాలంలో పెసరకట్టుని ఇష్టంగా చేసుకుని తింటారు. పెసరపప్పును ఉడకబెట్టి వార్చి ఆ నీళ్లకు తాలింపు వేసి దీన్ని తయారుచేస్తారు. కామెర్లు వచ్చిన వాళ్లకు, కాలేయ సమస్యలు ఉన్నవాళ్లకు ఇది ఎంతో మంచిది.
* ఇది గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు, చిన్న పిల్లలకు మంచిది. త్వరగా జీర్ణమవుతుంది.

29042020vasu2c.jpg
పెసరపప్పు సలాడ్‌: నానబెట్టి నీళ్లు తీసిన పెసరపప్పులో తురిమిన కొబ్బరి, క్యారెట్‌, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేయాలి. చివర్లో కొద్దిగా నిమ్మరసం పిండాలి. వేసవికాలంలో ఇలా చేసుకుని తినడం వల్ల చలువ చేస్తుంది. త్వరగా జీర్ణమవుతుంది. అధిక దాహాన్ని తగ్గిస్తుంది.

- డా. పెద్ది రమాదేవి, ఆయుర్వేద నిపుణులు

women icon@teamvasundhara
causes-and-precautions-for-d-vitamin-deficiency-in-telugu
women icon@teamvasundhara
health-benefits-of-triphala-powder-by-expert
women icon@teamvasundhara
health-benefits-of-sago-rice
women icon@teamvasundhara
juices-that-help-you-to-detoxify-your-body
women icon@teamvasundhara
health-benefits-of-chickpea-or-senagalu
women icon@teamvasundhara
health-benefits-of-papaya
women icon@teamvasundhara
super-healthy-seeds-you-should-eat
women icon@teamvasundhara
corona-virus-covid-19-black-pepper-tea-benefits