scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'నాన్నే కాటేయాలని చూశాడు..!'

'కంటికి రెప్పలా కాచుకోవాల్సిన తండ్రే కామంతో కళ్లు మూసుకుపోయి కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టాడు.. అప్పటికి ఆమె ఎనిమిదో తరగతి చదువుతోంది. జరిగిన విషయాన్ని తల్లి దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే అతను భార్య కాళ్ల మీద పడి ఇంకెప్పుడూ ఇలా జరగదంటూ కపట ప్రేమను ప్రదర్శించాడు. కానీ ఆ ముసుగు కొన్ని రోజులు మాత్రమే నిలిచింది.. మళ్లీ కూతురిపై అత్యాచారానికి పాల్పడడంతో ఈసారి ఆ అమ్మాయి వూరుకోలేదు.. నేరుగా పోలీసులను ఆశ్రయించింది. అమ్మాయిలు వేధింపుల విషయంలో మౌనం వహించడం తగదు అంటోంది. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఏం జరిగింది?? తెలియాలంటే ఇది చదవాల్సిందే..'

Know More

Movie Masala

 
category logo

బైడెన్‌ బృందంలో భారతీయ వనితలు!

Indian American Women Get Key Roles In Joe Biden Administration in Telugu

Photos: Instagram

బైడెన్‌-హ్యారిస్‌ ప్రమాణ స్వీకారం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఆ తరుణం ఆసన్నమైంది. ఈక్రమంలో అమెరికా చరిత్రలోనే మొదటిసారిగా ఏకంగా 20 మంది భారతీయ అమెరికన్లకు తన పాలక వర్గంలో చోటు కల్పించారు బైడెన్‌. వీరిలో 13 మంది మహిళలే కావడం విశేషం. అమెరికా జనాభాలో ఇండియన్ అమెరికన్ల వాటా ఒక శాతం కంటే తక్కువే అయినా...అమెరికా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోన్న ఈ వర్గానికి బైడెన్‌ తన యంత్రాంగంలో పెద్దపీట వేశారు. ఈ సందర్భంగా బైడెన్‌ టీంలో చోటు దక్కించుకొని అగ్రరాజ్య పాలక వ్యవహారాల్లో పాలు పంచుకునేందుకు సిద్ధపడిన ఆ ప్రవాస భారతీయ మహిళల గురించి తెలుసుకుందాం రండి..

కమలా హ్యారిస్‌

అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు ఇండో అమెరికన్‌ కమలాదేవి హ్యారిస్‌. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవి చేజిక్కించుకొని.. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి మహిళగా, తొలి నల్ల జాతీయురాలిగా, తొలి ప్రవాస భారతీయురాలిగా ఎన్నెన్నో ప్రత్యేకతల్ని సొంతం చేసుకున్నారామె. చెన్నైకి చెందిన శ్యామలా గోపాలన్‌, జమైకాకు చెందిన డొనాల్డ్‌ హ్యారిస్‌ దంపతులకు జన్మించిన కమల చదువుకునే రోజుల్లోనే విద్యార్థి నాయకురాలిగా పోటీ చేశారు. అనంతరం క్యాలిఫోర్నియాలోని అలమెడా కౌంటీకి డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీగా పని చేశారు. శాన్‌ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో కెరీర్ క్రిమినల్ యూనిట్‌లో మేనేజింగ్ అటార్నీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆపై శాన్‌ఫ్రాన్సిస్కో సిటీ అటార్నీ జనరల్‌గా రెండు పర్యాయాలు ఎన్నికై సమర్థంగా తన బాధ్యతలు నిర్వహించారు కమల. 2003లో ఆ పదవి చేపట్టిన కమల 2011 వరకు అందులోనే కొనసాగారు. ఆపై కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా ఎన్నికయ్యారు. ఇక 2017లో క్యాలిఫోర్నియా సెనేటర్‌గా కీలక బాధ్యతలు చేపట్టారు. తాజాగా అమెరికా ఉపాధ్యక్షురాలిగా పీఠాన్ని అధిష్టించి చరిత్ర సృష్టించారు.


నీరా టాండన్‌

View this post on Instagram

A post shared by Neera Tanden (@neeratanden)

కమల తర్వాత బైడెన్‌ టీంలో చోటుదక్కించుకున్న మరో ఇండియన్ అమెరికన్‌ నీరా టాండన్‌. ఈమె ‘ఆఫీస్ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌ (ఓఎంబీ) డైరెక్టర్‌ ’గా బాధ్యతలు చేపట్టారు. ఈ పదవి దక్కించుకున్న తొలి మహిళ, తొలి ఇండియన్‌ అమెరికన్‌ నీరా కావడం విశేషం. 50 ఏళ్ల వయసున్న టాండన్‌ ప్రస్తుతం ‘సెంటర్‌ ఫర్‌ అమెరికన్‌ ప్రోగ్రెస్‌’కు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో హెల్త్‌ కేర్‌ అడ్వైజర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారామె. ఇక 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆనాటి డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు సలహాదారుగా కూడా పనిచేశారు.


సమీరా ఫజిలి

View this post on Instagram

A post shared by DissDash (@dissdash_world)

కశ్మీర్‌ మూలాలున్న సమీరా ఫజిలి అమెరికా జాతీయ ఆర్థిక మండలి(ఎన్ఈసీ) డిప్యూటీ డైరెక్టర్‌గా బైడెన్‌ బృందంలో కీలక బాధ్యతలు అందుకున్నారు. ఆమె పుట్టక ముందే ఆమె తల్లిదండ్రులు 1970లో అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా అనుచరురాలిగా గుర్తింపు పొందిన సమీర గతంలో అట్లాంటా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆర్థికాభివృద్ధి డైరెక్టర్‌గా పనిచేశారు. అలాగే ఎన్‌ఈసీ సీనియర్‌ పాలసీ అడ్వైజర్‌గా విధులు నిర్వర్తించారు. ఇక ఒబామా అధ్యక్షుడిగా ఉన్న హయాంలో విదేశీ వ్యవహారాల సీనియర్‌ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తించారు.


వనితా గుప్తా

బైడెన్‌ పాలక వర్గంలో చోటు దక్కించుకున్న మరో ఇండియన్‌ అమెరికన్‌ వనితా గుప్తా. ఈ క్రమంలో ఆమె అమెరికా అసోసియేట్‌ అటార్నీ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. తద్వారా అమెరికా చరిత్రలో ఈ పదవిని అధిరోహించిన తొలి శ్వేతజాతీయేతర మహిళగా అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నారామె. వనిత తల్లిదండ్రులది ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌. ఫిలడెల్ఫియాలో పుట్టి పెరిగిన ఆమె న్యాయవాద విద్యను అభ్యసించారు. అనంతరం అమెరికాలోని అతిపెద్ద మానవ హక్కుల సంస్థ అయిన అమెరికన్‌ సివిల్‌ లిబర్టీస్‌ యూనియన్‌ స్టాఫ్‌ అటార్నీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఒబామా హయాంలో న్యాయశాఖలోని పౌరహక్కుల విభాగానికి నాయకత్వం వహించారు. ఈక్రమంలోనే విద్య, ఉపాధి రంగాల్లో వివక్ష, మానవ అక్రమ రవాణా, LGBTQ వ్యక్తుల హక్కులు, వలసదారులకు సంబంధించిన కేసుల్లో బాధితుల పక్షాన నిలబడి వారికి న్యాయం దక్కేలా పోరాడారు.


ఐషా షా

కశ్మీర్‌లో పుట్టి పెరిగిన ఐషా షా శ్వేత సౌధంలోని డిజిటల్‌ స్ట్రాటజీ కార్యాలయంలో పార్ట్‌నర్‌షిప్‌ మేనేజర్‌గా విధులు చేపట్టారు. ప్రస్తు్తం లూసియానాలో నివాసముంటోన్న షా గతంలో బైడెన్‌-హ్యారిస్‌ ఎన్నికల ప్రచారంలో డిజిటల్‌ పార్ట్‌నర్‌షిప్‌ మేనేజర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆమె స్మిత్సోనియన్ ఇన్‌స్టిట్యూషన్‌ అడ్వాన్స్‌మెంట్ స్పెషలిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతకుముందు ‘జాన్‌ ఎఫ్‌ కెన్నడీ సెంటర్‌ ఫర్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ కార్పొరేట్‌ ఫండ్‌’లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేశారు. ఇక ఐషా తల్లికి హైదరాబాద్‌తో కూడా సంబంధాలున్నాయి.


మాలా అడిగా

ఇల్లినాయిస్‌కు చెందిన మాలా అడిగా అమెరికా ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ పాలసీ డైరెక్టర్‌గా బైడెన్‌ బృందంలో కీలక బాధ్యతలు అందుకున్నారు. ఈమె గతంలో జిల్‌కు సీనియర్‌ సలహాదారుగా, బైడెన్‌-హ్యారిస్‌ ప్రచార బృందంలో సీనియర్‌ పాలసీ సలహాదారుగా విధులు నిర్వర్తించారు. అంతకుముందు ఒబామా హయాంలో అసోసియేట్‌ అటార్నీ జనరల్‌ కౌన్సిల్‌ సభ్యురాలిగా కీలక పదవిని అధిరోహించారీ ఇండియన్‌ అమెరికన్‌. ఆపై బ్యూరో ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ కల్చరల్‌ డిప్యూటీ అసిస్టెంట్‌ సెక్రటరీగానూ బాధ్యతలు చేపట్టారు. వీటితో పాటు బైడెన్‌ ఫౌండేషన్‌లో ఉన్నత విద్య, సైనిక కుటుంబాల విభాగానికి డైరెక్టర్‌గా వ్యవహరించారు.


సబ్రినా సింగ్‌

అమెరికా పాలనా యంత్రాంగంలో చోటు దక్కించున్న మరో ఇండియన్‌ అమెరికన్‌ సబ్రినా సింగ్‌. ఆమె ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీగా విధులు చేపట్టారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కమలా హ్యారిస్‌ మీడియా కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు సబ్రినా. అంతకుమందు న్యూజెర్సీ సెనేటర్‌ కోరీ బుకర్‌, న్యూయార్క్‌ మాజీ మేయర్‌ మైక్‌ బ్లూమింగ్‌ వద్ద వివిధ హోదాల్లో పనిచేశారు సబ్రినా.


గరిమా వర్మ

bidenteamghg650-1.jpg
Twitter Photo

అమెరికా ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ బృందంలో కీలక పదవిని దక్కించుకున్నారు భారత సంతతికి చెందిన గరిమా వర్మ. ఆమె జిల్‌ కార్యాలయంలో డిజిటల్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇండియాలో పుట్టిన గరిమ ఓహాయో, సెంట్రల్‌ వ్యాలీ ఆఫ్‌ క్యాలిఫోర్నియాలో పెరిగారు. బైడెన్‌-హ్యారిస్‌ ఎన్నికల ప్రచార బృందంలో కంటెంట్‌ స్ట్రాటజిస్ట్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఫిల్మ్‌ మార్కెటింగ్‌లోనూ అనుభవమున్న ఆమె వాల్ట్‌ డిస్నీ కంపెనీకి చెందిన ఏబీసీ నెట్‌వర్క్‌ టెలివిజన్‌లోనూ పనిచేశారు.


ఉజ్రా జెయా

బైడెన్‌ బృందంలో చోటు దక్కించుకున్న మరో ఇండియన్ అమెరికన్ ఉజ్రా జెయా. స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌లో 30 ఏళ్ల అనుభవమున్న ఆమె విదేశాంగ శాఖలో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు. ఉత్తరాసియా, దక్షిణాసియా, ఐరోపా మానవహక్కులకు సంబంధించిన అంశాలలో ఎంతో నిష్ణాతురాలైన జెయా 2014 నుంచి 2017 వరకు ప్యారిస్‌లోని యూఎస్‌ ఎంబసీలో ఛార్జ్‌ అఫైర్స్‌, డిప్యూటీ చీఫ్‌ ఆఫ్ మిషన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.


సోనియా అగర్వాల్‌

బైడెన్‌ అధికార యంత్రాంగంలో కీలకమైన క్లైమేట్‌ పాలసీలో సీనియర్‌ సలహాదారుగా సోనియా అగర్వాల్‌ నియమితులయ్యారు. పంజాబ్‌కు చెందిన ఆమె వైట్‌హౌస్‌లోని క్లైమేట్‌ పాలసీ ఆఫీసులోని ఇన్నోవేషన్‌ విభాగ బాధ్యతలను కూడా చూసుకుంటారు. అమెరికాలోని ఓహాయోలో పుట్టిపెరిగిన ఆమె స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ అందుకున్నారు. పర్యావరణం, ప్రజారోగ్యం అంశాలపై ఎంతో పట్టున్న ఆమె గతంలో ‘ఎనర్జీ ఇన్నోవేషన్‌’ సంస్థకు సహ వ్యవస్థాపకురాలిగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆ సంస్థకు స్ట్రాటజీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.


సుమోనా గుహ

వైట్‌హౌస్‌కు కీలకమైన నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌కు ఎంపికైన ముగ్గురు భారతీయ అమెరికన్లలో సుమోనా గుహ ఒకరు. బైడెన్‌-హ్యారిస్‌ అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో దక్షిణాసియా విదేశాంగ వ్యవహారాల కార్యనిర్వాహక బృందానికి ఉపాధ్యక్షురాలిగా గుహ పనిచేశారు. అంతకుముందు ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడైన బైడెన్‌కు జాతీయ భద్రతా వ్యవహారాల ప్రత్యేక సలహాదారుగా వ్యవహరించారు. స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌, వైట్‌హౌస్‌, క్యాపిటల్‌ హిల్‌కు సంబంధించిన వ్యవహారాల్లో ఆమెకు 20 ఏళ్ల అనుభవం ఉంది. ఈక్రమంలోనే వైట్‌హౌస్‌లో కీలకమైన నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సెల్‌‌కు ఎంపికయ్యారామె.


శాంతి కలథిల్‌

ఈమెది క్యాలిఫోర్నియాలో స్థిరపడ్డ మలయాళ కుటుంబం. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో ఉన్నత విద్యను అభ్యసించిన ఆమె ‘ఆసియన్‌ వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌’కు హాంకాంగ్‌ రిపోర్టర్‌గా పనిచేశారు. యూఎస్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌, జార్జిటౌన్‌ యూనివర్సిటీ, వరల్డ్‌ బ్యాంక్‌.. లాంటి ప్రతిష్ఠాత్మకమైన సంస్థల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ‘నేషనల్‌ ఎండోమెంట్‌ ఫర్‌ డెమొక్రసీ’లోని ఇంటర్నేషనల్‌ ఫోరమ్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ స్టడీస్‌లో సీనియర్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మానవహక్కులపై గట్టిగా తన గళాన్ని వినిపించే శాంతికి చైనీస్‌, మాండరిన్‌ భాషలపైనా పట్టుంది. ఇప్పుడామె అమెరికా విదేశాంగ విధానంలో ప్రజాస్వామ్యం, మానవహక్కుల వ్యవహారాల సమన్వయకర్తగా పనిచేయనున్నారు.


రీమా షా

రీమా షా పూర్వీకులది గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతం. క్యాలిఫోర్నియాలో పుట్టి పెరిగిన ఆమె హార్వర్డ్‌ యూనివర్సిటీ, కేంబ్రిడ్జి యూనివర్సిటీ, యేల్‌ లా స్కూల్‌లో న్యాయవాద విద్యను అభ్యసించారు. క్యాలిఫోర్నియా నార్త్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌, అమెరికా సుప్రీంకోర్టులో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం వాషింగ్టన్‌లో నివాసముంటోన్న రీమా శ్వేతసౌధంలో డిప్యూటీ అసోసియేట్‌ కౌన్సెల్‌‌గా బాధ్యతలు స్వీకరించారు.


నేహా గుప్తా

వైట్‌హౌస్‌ న్యాయవాద బృందంలో అసోసియేట్‌ కౌన్సెల్‌‌గా బాధ్యతలు చేపట్టిన నేహా గుప్తా తల్లిదండ్రులు కూడా భారతీయులే! న్యూయార్క్‌లో పుట్టి పెరిగిన ఆమె స్టాన్‌ఫోర్డ్‌ లా స్కూల్‌, హార్వర్డ్‌ కాలేజీల నుంచి న్యాయశాస్త్రంలో పట్టాలు పొందారు. అనంతరం శాన్‌ఫ్రాన్సిస్కో సిటీ అటార్నీ కార్యాలయంలో డిప్యూటీ సిటీ అటార్నీగా పనిచేశారు. పౌరహక్కులు, మానవహక్కులపై తన గళాన్ని వినిపించే నేహ.. బైడెన్‌-హ్యారిస్‌ ఎన్నికల ప్రచారంలో కూడా కీలక పాత్ర పోషించారు.

women icon@teamvasundhara
tmc-president-mamata-banerjee-biography-on-the-occasion-of-assembly-elections

ఎదురు లేని 'దీదీ'!

సాధారణ కార్యకర్తగా రాజకీయాల్లోకి ప్రవేశించి అనతికాలంలోనే ప్రజలందరి చేతా ‘దీదీ’ అని పిలిపించుకోవడం ఒక్క మమతా బెనర్జీకే చెల్లింది. తన రాజకీయ ప్రయాణంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చెదరని దృఢ సంకల్పంతో ముందుకు కదిలారామె. కాంగ్రెస్‌వాదిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించినప్పటికీ.. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రిగానే ఆమె ఎక్కువ గుర్తింపు పొందారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నా.. సాధారణ జీవితం గడపడం ఆమెకి మాత్రమే సొంతం. అవే ఆమెను పశ్చిమ బంగ ప్రజల చేత మనసారా 'దీదీ' అని పిలిపించుకొనేలా చేశాయి. అంతేకాదు.. తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో తిరుగులేని విజయంతో వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు దోహదం చేశాయి. ఈ నేపథ్యంలో మమతాబెనర్జీ రాజకీయ జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు మీకోసం..

Know More

women icon@teamvasundhara
a-gynecologist-doctor-doing-normal-delivery-for-covid-infected-pregnant-women-shares-her-experiences
women icon@teamvasundhara
from-surviving-abusive-marriages-to-becoming-a-fitness-trainer-here-is-jasmine-m-moosa-inspirational-story

తొలి రాత్రే నా కాళ్లు, చేతులు కట్టేసి నన్ను రేప్‌ చేశాడు!

ఆడపిల్లను బాధ్యతగా కంటే బరువుగా భావించే తల్లిదండ్రులూ నేటి సమాజంలో ఉన్నారు. అందుకే వయసులోకి రాకముందే పెళ్లి చేసి అత్తారింటికి పంపించేసి ఆ బరువు దించుకుంటున్నారు. వారు అక్కడ చిత్రహింసలకు గురైనా అత్తారింట్లో ఇవన్నీ కామనే అని వారిని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇదిగో తనదీ అచ్చం ఇలాంటి పరిస్థితే అంటోంది కేరళలోని క్యాలికట్‌కు చెందిన జాస్మిన్‌ ఎం మూస. చదువుకోవాల్సిన వయసులో తన తల్లిదండ్రుల బలవంతంతో బాల్యవివాహం చేసుకొని అష్టకష్టాలను అనుభవించిందామె. రెండో పెళ్లీ చేదు అనుభవాలనే మిగిల్చింది. ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమె.. తనకోసం తాను బతకాలనుకుంది.. తన నుంచి తన జీవితాన్ని ఎవరూ తీసుకుపోలేరని దృఢంగా నిశ్చయించుకొని అడుగు ముందుకేసింది. ఇప్పుడు ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ‘జీవితంలో మనం తీసుకునే ఓ మంచి నిర్ణయం మొత్తం జీవితాన్నే మలుపు తిప్పుతుందం’టోన్న ఆమె తన కథను కొన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా అది వైరలైంది. ఎంతోమందిలో స్ఫూర్తిని కలిగిస్తోంది.

Know More

women icon@teamvasundhara
chloe-zhao-becomes-second-woman-to-win-best-director-at-academy-awards-and-frances-mcdormand-won-best-actress-category

ఆమె ప్రతిభను ‘ఆస్కార్‌’ మెచ్చింది!

93 ఏళ్ల ఆస్కార్‌ చరిత్రలో ఎటు చూసినా పురుషాధిక్యమే రాజ్యమేలుతోంది! ఏ విభాగంలో చూసినా ఇటు నామినేషన్లు, అటు అవార్డులు పురుషులవే అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇలా ఇన్నేళ్ల అకాడమీ అవార్డుల చరిత్రలో వివిధ విభాగాల్లో మహిళలు నామినేషన్లు వేసినా.. వారిని పురస్కారం వరించడం మాత్రం అరుదే అన్నది చాలామంది భావన. ఇలాంటి అందరి ఆలోచనలు పటాపంచలు చేస్తూ చరిత్ర సృష్టించారు 39 ఏళ్ల క్లోవీ చావ్‌. చైనీస్‌-అమెరికన్‌ డైరెక్టర్‌, ఫిల్మ్‌మేకర్‌ అయిన ఆమె.. తాను తెరకెక్కించిన ‘నోమడ్‌ల్యాండ్’ సినిమాకు గాను ఉత్తమ దర్శకురాలిగా ఈ ఏడాది ఆస్కార్‌ పురస్కారాన్ని అందుకున్నారు. దీంతో దర్శకత్వ విభాగంలో ఆస్కార్‌ అందుకున్న రెండో మహిళా దర్శకురాలిగా, తొలి ఆసియన్‌ మహిళా డైరెక్టర్‌గా, ఈ ఘనత సొంతం చేసుకున్న తెల్లజాతికి చెందని తొలి మహిళగా ఇలా ఎన్నెన్నో ప్రత్యేకతల్ని సొంతం చేసుకున్నారామె. అంతేకాదు.. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి విభాగాల్లోనూ క్లోవీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికే ఆస్కార్‌ అవార్డులు దక్కడం విశేషం.

Know More

women icon@teamvasundhara
these-two-covid-warriors-ferries-bodies-of-covid-19-patients-to-graveyards-for-free-and-perform-last-rights

దిక్కూ మొక్కూ లేని కొవిడ్‌ మృతులకు అన్నీ తామే అయి..!

గంటగంటకూ బయటపడుతోన్న వేలాది కేసులు.. ఆసుపత్రుల్లో బెడ్లు సరిపోక ఆరుబయట బారులు తీరిన అంబులెన్సులు.. ప్రాణవాయువు కొరతతో విలవిల్లాడుతోన్న ప్రాణాలు.. అంతిమ సంస్కారాలకూ రోజులకు రోజులు ఎదురుచూడాల్సిన దయనీయ స్థితి.. ఇవన్నీ దేశంలో కరోనా ప్రళయానికి ప్రత్యక్ష సాక్ష్యాలు! రెండో దశలో రోజురోజుకీ రెచ్చిపోతోన్న ఈ మాయదారి మహమ్మారి ఎంతోమంది ఉసురు తీసుకుంటోంది.. మరెంతోమందిని ఒకరికొకరు కాకుండా చేస్తోంది. ఇక వైరస్‌ భయంతో ఎంతోమందికి తమ ఆత్మీయుల కడసారి చూపు కూడా దక్కట్లేదు.. మరికొన్ని మృతదేహాలు అంతిమసంస్కారాలకు నోచుకోక ఆస్పత్రి మార్చురీల్లో అనాథ శవాల్లా పడి ఉన్నాయి. ఇలాంటి దయనీయ పరిస్థితులు లక్నోకు చెందిన వర్షా వర్మను కదిలించాయి. దేశం ఆపదలో ఉన్న ఇలాంటి సమయంలో తన వంతుగా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్న ఆమె.. అక్కడి స్థానిక ఆస్పత్రుల్లో కొవిడ్‌ మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూ కరోనా వారియర్‌గా మన్ననలందుకుంటోంది.

Know More

women icon@teamvasundhara
ira-guha-helps-poor-women-get-access-to-menstrual-cups-in-telugu

అందుకే మా మెన్‌స్ట్రువల్‌ కప్‌ ఒకటి కొంటే మరొకటి ఉచితం!

కాలం మారుతోంది.. టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది.. అందుకు అనుగుణంగానే మహిళల్లో పిరియడ్‌ పావర్టీ (నెలసరి పేదరికం)ని దూరం చేయడానికి, వారి వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడడానికి ఎన్నెన్నో సరికొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి. అలా ఎన్నొస్తే ఏం లాభం.. వాటి ధర ఆకాశాన్నంటుతోంది.. పేదవారికి, గ్రామీణ మహిళలకు అవి అందనంత ఎత్తులో ఉంటున్నాయి. ఒకవేళ అందుబాటులో ఉన్నాయని తక్కువ ధరలో లభించే ఉత్పత్తుల్ని వాడితే అవి వారి ఆరోగ్యానికే చేటు చేస్తున్నాయి. ఇదే విషయాన్ని దగ్గర్నుంచి గమనించింది బెంగళూరుకు చెందిన ఇరా గుహ. మార్కెట్లో నాణ్యత లేని ఉత్పత్తుల్ని వాడడం వల్ల అవి వారి ప్రత్యుత్పత్తి వ్యవస్థకే చేటుచేస్తున్నాయని తెలుసుకొని తానే స్వయంగా ఓ మెన్‌స్ట్రువల్‌ కప్‌ను డిజైన్‌ చేసి అభివృద్ధి చేసింది. ‘బై వన్‌ డొనేట్‌ వన్‌’ పేరుతో తాను ప్రారంభించిన ఈ నెలసరి ఉద్యమంతో నెలసరి పేదరికాన్ని పూర్తిగా రూపుమాపాలని కృషి చేస్తోందామె. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తోన్న కప్స్‌తో పోల్చితే తాను రూపొందించిన కప్‌కి ఓ ప్రత్యేకత ఉందంటూ దీన్ని అభివృద్ధి చేసే క్రమంలో తనకెదురైన అనుభవాలను ఇలా పంచుకుంది ఇరా.

Know More

women icon@teamvasundhara
worlds-oldest-office-manager-is-a-90-year-old-woman-from-japan

పని రాక్షసి.. ఈ 90 ఏళ్ల బామ్మ!

ఉద్యోగంలో చేరిన కొత్తలో చాలామంది ఉత్సాహంగా పనిచేస్తుంటారు. సంస్థ నియమనిబంధనలకు అనుగుణంగా సమయపాలన పాటిస్తూ...అవసరమనుకుంటే అదనపు సమయం వెచ్చిస్తూ విధులు నిర్వర్తించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే కారణాలేవైనా కొంతమందిలో రాన్రానూ ఆ ఆసక్తి క్రమంగా సన్నగిల్లుతుంటుంది. ‘ఈ ఉద్యోగం చేయడం నా వల్ల కాదు బాబోయ్‌!’ అని నిట్టూరుస్తుంటారు. దీంతో పదే పదే కంపెనీలు మారుతుంటారు. ఇక ఆరుపదుల వయసు వచ్చే సరికి రిటైర్మెంట్‌ తీసుకుని సంతోషంగా విశ్రాంతి తీసుకుంటుంటారు. అయితే జపాన్‌కు చెందిన ఓ వృద్ధురాలు మాత్రం 90 ఏళ్ల వయసులోనూ ఆఫీసుకు వచ్చి ఉత్సాహంగా విధులు నిర్వర్తిస్తున్నారు. వారంలో ఐదు రోజులు, రోజుకు ఏడున్నర గంటల పాటు పనిచేస్తూ అందరికీ స్ఫూర్తినిస్తున్నారు. ఈక్రమంలోనే ‘ప్రపంచంలోనే అత్యధిక వయసున్న ఆఫీస్‌ మేనేజర్‌’గా గిన్నిస్‌ రికార్డు పుటల్లోకి ఎక్కారీ గ్రాండ్‌ ఓల్డ్‌ వుమన్‌. ఇంతకీ ఎవరామె? లేటు వయసులోనూ అంత ఉత్సాహంతో ఎలా పనిచేయగలుగుతున్నారో తెలుసుకుందాం రండి..!

Know More

women icon@teamvasundhara
meet-aminat-idrees-the-taekwondo-champion-at-8-months-pregnant

నిండు గర్భంతోనే తైక్వాండో విన్యాసాలు చేస్తూ..

క్రమంగా పెరిగే పొట్ట వల్ల గర్భిణులు అసౌకర్యానికి గురవడం మామూలే! ఈ క్రమంలో ఆయాసంతో ఏ పనీ చేసుకోలేరు.. కడుపు నిండా భోజనం కూడా చేయలేరు. ముఖ్యంగా మూడో త్రైమాసికంలో చాలా వరకు విశ్రాంతి తీసుకోవడానికే మొగ్గు చూపుతుంటారు కాబోయే అమ్మలు. అయితే కొందరు మహిళలు మాత్రం నిండు గర్భంతో కూడా చురుగ్గా ఆయా క్రీడల్లో పాల్గొనడం, వ్యాయామాలు చేయడం మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. నైజీరియాకు చెందిన తైక్వాండో క్రీడాకారిణి అమినత్‌ ఇడ్రీస్‌ కూడా ఇదే కోవలోకి వస్తుంది. ప్రస్తుతం ఎనిమిది నెలల నిండు గర్భిణి అయిన ఆమె.. ఈ దశలో విశ్రాంతి తీసుకోవడం కంటే తన ఆటకే అధిక ప్రాధాన్యమిచ్చింది. ఇప్పుడు ఆ దేశంలో జరుగుతోన్న నేషనల్‌ స్పోర్ట్స్‌ ఫెస్టివల్‌లో పాల్గొని అలవోకగా తైక్వాండో విన్యాసాలు చేయడమే కాదు.. పసిడి పతకం కూడా కైవసం చేసుకుంది. ఇలా నిండు గర్భంతో ఆమె చేస్తోన్న విన్యాసాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆటపై తనకున్న అంకితభావంతో బంగారు పతకం ఒడిసిపట్టిన ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Know More

women icon@teamvasundhara
104-year-old-colombian-woman-beats-covid-twice-receives-heartfelt-sendoff-by-hospital

104 ఏళ్ల వయసులో రెండుసార్లు కరోనాను జయించింది!

ప్రపంచంపై కరోనా ప్రకోపం చల్లారడం లేదు. మధ్యలో కొన్ని రోజులు కనికరించినట్లు కనిపించినా మళ్లీ పంజా విసురుతోందీ మహమ్మారి. వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్నా, లాక్‌డౌన్‌ నిబంధనలు అమలవుతున్నా తన పని తాను చేసుకుంటూ పోతోంది. పైగా మొదటి దశ కంటే రెట్టింపు వేగంతో తన ప్రభావం చూపిస్తోందీ డేంజరస్‌ వైరస్‌. దీంతో మళ్లీ మునుపటి పరిస్థితులు వస్తాయేమోనని ప్రతి ఒక్కరూ, ప్రత్యేకించి వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు తెగ ఆందోళన చెందుతున్నారు. అయితే మరోపక్క ఆరోగ్యకరమైన జీవనశైలి, సానుకూల దృక్పథం ఉంటే ఎలాంటి మహమ్మారినైనా ఎదుర్కోగలమని ఎందరో శతాధిక వృద్ధులు నిరూపిస్తూనే ఉన్నారు. తద్వారా తమ లాంటి బాధితులకు బతుకుపై భరోసా కల్పిస్తున్నారు. తాజాగా కొలంబియాకు చెందిన 104 ఏళ్ల మహిళ కరోనాను జయించారు. అది కూడా రెండోసారి.

Know More

women icon@teamvasundhara
karnataka-activist-archana-kr-whose-long-fight-for-clean-toilets-in-govt-schools-just-bore-fruit

స్కూళ్లలో ఆ సమస్యను పరిష్కరించి హీరో అయింది!

ఒక సమస్య మనల్ని ప్రభావితం చేస్తే దాన్ని పరిష్కరించడానికి మనం ఎక్కడిదాకా అయినా వెళ్లడానికి సిద్ధపడతాం. అలాంటి ఓ సామాజిక సమస్యకు శాశ్వతంగా తెరదించడానికి ఏకంగా ప్రభుత్వాన్నే కదిలించింది కర్ణాటకకు చెందిన ఓ యంగ్‌ సోషల్‌ యాక్టివిస్ట్‌. తాను చదివిన స్కూల్లో సరైన టాయిలెట్లు లేక తాను పడిన ఇబ్బందిని గుర్తు చేసుకుంటూ.. ఇప్పటికీ చాలామంది అమ్మాయిలు అలాంటి దుస్థితినే ఎదుర్కొంటున్నారని తెలుసుకుంది. ఇదే సమస్యను తన ఆన్‌లైన్‌ పిటిషన్‌ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరీ పోరాడింది. ఇలా తన రెండేళ్ల పోరాటానికి ఇటీవలే ముగింపు పలుకుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి టాయిలెట్ల అభివృద్ధి కోసం వంద కోట్లు కేటాయించడంతో ఒక్కసారిగా హీరో అయిపోయిందామె. ఆమే బెంగళూరుకు చెందిన శానిటేషన్‌ క్యాంపెయినర్‌ అర్చన కేఆర్‌. ఇలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంతోషకరంగానే ఉన్నా అది పూర్తి ఆచరణలో పెట్టాకే తన పోరాటానికి సంపూర్ణ ఫలితం ఉంటుందంటోన్న ఈ యంగ్‌ యాక్టివిస్ట్‌ తన గురించి, తన పోరాటం గురించి ఇలా చెప్పుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
hyderabad’s-syamala-goli-becomes-second-woman-ever-to-swim-across-palk-strait

ఫిట్‌నెస్‌ కోసం ఈత నేర్చుకుంది.. ఇప్పుడు రికార్డు సృష్టించింది!

చురకత్తుల్లా దూసుకొచ్చే అలల్ని వెనక్కి నెడుతూ, ప్రమాదకరమైన జలచరాల బారి నుంచి తప్పించుకుంటూ అంతులేని సముద్రంలో ఈత కొట్టడమంటే అంత ఆషామాషీ విషయం కాదు.. అందుకు ఎంతో తెగువ, పట్టుదల కావాలి. ఆ రెండూ తనలో ఉన్నాయని నిరూపించింది ఆంధ్రప్రదేశ్‌కి చెందిన 47 ఏళ్ల శ్యామల గోలి. అత్యంత ప్రమాదకరమైనదిగా భావించే పాక్‌ జలసంధిని తాజాగా ఈది సరికొత్త చరిత్రకు తెరలేపిందామె. భారత్‌-శ్రీలంకల్ని కలిపే ఈ 30 కిలోమీటర్ల నీటి వారధిని కేవలం 13 గంటల్లోనే ఛేదించిందామె. తద్వారా ఈ అరుదైన ఘనత సాధించిన తొలి తెలుగు మహిళగా, ప్రపంచంలోనే రెండో మహిళగా చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. అంతేకాదు.. శ్యామల తన 47 ఏళ్ల వయసులో ఈ సాహసానికి పూనుకోవడం మరో విశేషం! ‘మహిళలు ఏదైనా చేయాలనుకుంటే అది సాధించి చూపించగల సమర్థులు’ అంటోన్న ఈ మహిళా స్విమ్మర్‌ తన గురించి ఏం చెబుతున్నారో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
former-england-cricketer-sarah-taylor-joins-coaching-staff-of-sussex-country-men’s-team

అందుకే ఈసారి ఇలా వస్తున్నా!

మగవారికి మాత్రమే సొంతమనే క్రికెట్‌లో మహిళలూ రాజ్యమేలుతున్నారు. టెస్టు, వన్డే, టీ20... ఇలా ఏ ఫార్మాట్‌లోనైనా పురుషులకేం తీసిపోమంటూ రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతున్నారు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌లో పదివేల పరుగులు పూర్తి చేసుకున్న మన మిథాలీనే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఇలా మైదానంలో అత్యద్భుత ఆటతీరుతో అశేష అభిమానం సంపాదించుకుంటున్న మహిళా క్రీడాకారులు... అవకాశమొస్తే ఆటలో ఎలాంటి బాధ్యతలనైనా స్వీకరించేందుకు ‘సై’ అంటున్నారు. ఇందుకు తగ్గట్టే క్రికెట్‌తో పాటు వివిధ క్రీడల్లో కోచ్‌లుగా, మెంటర్లుగా, ఫిట్‌నెస్‌ ట్రైనర్లుగా... ఎంపికవుతున్నారు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ సారా టేలర్ క్రికెట్లో నూతన అధ్యాయానికి నాంది పలికింది. గతంలో అంతర్జాతీయ క్రికెట్‌లో పురుషులతో పోటీ పడి రికార్డులు సృష్టించిన ఆమె తాజాగా ఓ పురుషుల క్రికెట్‌ జట్టుకు కోచ్‌గా ఎంపికైంది. ఇంగ్లండ్‌ దేశవాళీ జట్టు ససెక్స్‌కు వికెట్‌ కీపింగ్‌ కోచ్‌గా పనిచేయనున్న సారా... ఈ ఘనత సాధించిన తొలి మహిళ కావడం విశేషం.

Know More

women icon@teamvasundhara
mithali-raj-first-indian-woman-cricketer-to-complete-10000-runs-in-international-cricket

ఈ పరుగుల రారాణి.. లేడీ సచిన్‌!

క్రికెట్ ఆడడానికే పుట్టిందేమో అన్నట్లుగా క్రికెట్‌నే తన జీవిత పరమావధిగా మార్చుకుందామె. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అందుకొని దేశానికే గర్వకారణంగా నిలిచింది. కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించడం, నాయకురాలిగా సహచరులకు నైపుణ్యాల్ని నేర్పించడం, ప్రతికూల పరిస్థితుల్లో జట్టును విజయతీరాలకు చేర్చడం.. ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఎన్నో రికార్డులు, అవార్డులు-రివార్డులు ఆమె సిగలో చేరి మురిశాయి. అలా భారత్‌లో మహిళల క్రికెట్‌కు వన్నెలద్దిన ఘనత 'ది వన్ అండ్ ఓన్లీ' మిథాలీ రాజ్‌కే దక్కుతుందనడం అతిశయోక్తి కాదు.

Know More

women icon@teamvasundhara
geeta-phogat-is-back-to-wrestling-after-maternity-break-and-shares-her-post-pregnancy-challenges

అమ్మయ్యాక రెట్టింపు ఉత్సాహంతో వచ్చేస్తున్నా!

అమ్మతనం అనేది ప్రతి మహిళ జీవితంలో ఓ మహర్దశ లాంటిది.. అందుకే తమ చిన్నారి ఆలనాపాలనలో మునిగితేలుతూ ఎన్నెన్నో మధురానుభూతుల్ని మూటగట్టుకుంటుంటారు కొత్తగా తల్లైన మహిళలు. అక్కడితో ఆగిపోకుండా అంతకుమించిన ఉత్సాహంతో కెరీర్‌లో రెండో ఇన్నింగ్స్‌ని ప్రారంభించడానికీ ఉవ్విళ్లూరుతుంటారు. ప్రస్తుతం తాను కూడా అందుకు సిద్ధంగా ఉన్నానంటోంది రెజ్లింగ్‌ క్వీన్‌ గీతా ఫోగట్‌. రెండేళ్ల క్రితం ముద్దుల బాబుకు జన్మనిచ్చిన ఆమె.. తిరిగి పూర్తి ఫిట్‌నెస్‌ సాధించి మళ్లీ రెజ్లింగ్‌ మ్యాట్‌పై అడుగుపెట్టింది. ఇదే విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ మురిసిపోయింది గీత.

Know More

women icon@teamvasundhara
cancer-survivor-with-prosthetics-becomes-the-youngest-american-to-go-to-space

అప్పుడు క్యాన్సర్‌ను జయించింది.. ఇప్పుడు అంతరిక్ష యాత్రకు వెళ్తోంది!

క్యాన్సర్‌.. ఈ మహమ్మారి బారిన పడ్డామంటే ఇక జీవితం అంతమైపోయినట్లే అనుకుంటాం.. జీవన శైలి మార్పులు, చికిత్సలతో ఈ వ్యాధిని జయించినా ఏదో ఉన్నామంటే ఉన్నామన్నట్లుగా బతుకీడుస్తుంటారు చాలామంది! అయితే తాను మాత్రం అలా జీవచ్ఛవంగా బతకాలనుకోలేదు. పదేళ్ల వయసులో ఏ క్యాన్సర్‌ అయితే తనని కబళించడానికి ప్రయత్నించిందో.. దానికే ఎదురెళ్లి పోరాటం చేయాలనుకుంది. ఈ క్రమంలో తాను చికిత్స తీసుకున్న ఆస్పత్రిలోనే నర్సుగా చేరి.. వివిధ అనారోగ్యాలతో అక్కడ చికిత్స పొందుతోన్న పిల్లలకు సేవలు చేయడంతో పాటు తన మాటలతో, అనుభవాలతో వారిలో ధైర్యాన్ని నింపుతోంది. బతుకు పట్ల ఆశను కల్పిస్తోంది. అంతటితో ఆగిపోకుండా.. ఈ ఏడాది చివర్లో స్పేస్ ఎక్స్‌ చేపట్టబోయే తొలి ప్రైవేట్‌ అంతరిక్ష యాత్ర ద్వారా రోదసీలోకి వెళ్లే అరుదైన అవకాశాన్ని సైతం దక్కించుకుందామె. ఆమే.. అమెరికాకు చెందిన 29 ఏళ్ల హేలే ఆర్సెనాక్స్‌. దీంతో కృత్రిమ అవయవంతో అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి వ్యక్తిగా, అతి పిన్న అమెరికన్‌గా చరిత్రలో నిలిచిపోనుందామె. క్యాన్సర్‌ను జయించిన వారు ఏదైనా సాధించగల సమర్థులు అని నిరూపించేందుకు ఉవ్విళ్లూరుతున్నానంటోన్న ఈ క్యాన్సర్‌ విజేత కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
62-year-old-grand-mother-wins-internet-with-beautiful-dance-moves-bollywood-stars-praises-her-talent

సెలబ్రిటీలకే సవాలు విసురుతున్న ఈవిడ డ్యాన్స్ చూశారా?

సాధారణంగా అరవై ఏళ్లు పైబడిన మహిళలకు ఒంట్లో సత్తువ తక్కువగానే ఉంటుంది. బాధ్యతలన్నీ తీరిపోయి ఉంటాయి కాబట్టి ఈ వయసులో విశ్రాంతి తీసుకునేందుకే ఎక్కువ మొగ్గు చూపుతుంటారు. ఇంట్లోని మనవలు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తుంటారు. అయితే ముంబయికి చెందిన రవిబాల శర్మ అనే వృద్ధురాలు మాత్రం 62 ఏళ్ల వయసులోనూ ఎంతో హుషారుగా స్టెప్పులేస్తున్నారు. అద్భుతమైన హావభావాలు పలికిస్తూ సినిమా తారలకు సవాల్‌ విసురుతున్నారు. ఇంతియాజ్ అలీ, దిల్జిత్‌ దోసాంజ్‌ లాంటి సెలబ్రిటీలతో పాటు ప్రముఖ కొరియోగ్రాఫర్లు సైతం ఆమె డ్యాన్స్‌ ప్రతిభకు ఫిదా అవుతున్నారు.

Know More

women icon@teamvasundhara
meet-swati-mohan-the-indian-origin-scientist-who-landed-the-mars-rover-on-red-planet

ఆ టీవీ సిరీస్ చూశాకే అదంటే ఇష్టం పెరిగింది!

అంతులేని అంతరిక్షంలో ఎన్నో వింతలు, మరెన్నో అద్భుతాలు! వాటి గురించి తెలుసుకోవాలన్న తపన మనకు తనివి తీరనీయదు. ఆ విశేషాల గురించి అర్థం చేసుకునే క్రమంలో మనల్ని మనమే మరచిపోతాం.. ఇదిగో ఇలాంటి మక్కువే ఆమెను ఏకంగా తన కెరీర్‌నే మార్చుకునేలా చేసింది. ఖగోళంలో ఏముందో తెలుసుకోవాలన్న ఆతృతే ఆమెను గత కొన్నేళ్లుగా నాసాతో కలిసి నడిచేలా చేస్తోంది. ఇక తాజాగా అరుణ గ్రహం (మార్స్‌/అంగారకుడు)పై పర్సెవరెన్స్‌ రోవర్‌ సురక్షితంగా ల్యాండ్‌ అవడంతో ప్రస్తుతం ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది. ఆమే భారత సంతతికి చెందిన డాక్టర్‌ స్వాతీ మోహన్‌. గతేడాది నాసా ప్రయోగించిన మార్స్‌ రోవర్‌ మెషీన్‌ ప్రయోగానికి ఆపరేషన్స్‌ హెడ్‌గా వ్యవహరిస్తోన్న ఆమె.. తాజాగా ఈ ప్రయోగం విజయవంతం అవడంలో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఈ విక్టరీ గురించి స్వాతి ఏమంటున్నారో తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
meet-saima-ubaid-first-woman-from-jammu-and-kashmir-to-earn-laurels-as-a-power-lifter

భర్త కాస్త ప్రోత్సహిస్తే ఇలా ఎందులో అయినా గెలిచేయచ్చు!

జమ్మూకశ్మీర్... అద్భుతమైన ప్రకృతి సంపదకు నిలయమైన ఈ రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక రూపంలో అల్లర్లు జరుగుతుంటూనే ఉంటాయి. అంతేకాదు ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇక్కడి మహిళలపై ఆంక్షలు కూడా అధికంగానే ఉంటాయి. అయినప్పటికీ వాటిని బద్దలు కొట్టుకుని ముందుకొచ్చి తమను తాము నిరూపించుకుంటున్నారు కొంతమంది మహిళలు. అలాంటి కోవకే చెందుతుంది శ్రీనగర్‌కు చెందిన 27 ఏళ్ల సైమా ఉబైద్‌. జమ్మూకశ్మీర్‌లో పవర్‌ లిఫ్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్న తొలి మహిళగా చరిత్ర సృష్టించిన ఆమె అతిక్లిష్టమైన బరువులను సైతం అవలీలగా ఎత్తుతోంది. తద్వారా వెయిట్‌ లిఫ్టింగ్‌లో మహిళలు రాణించలేరన్న అపోహను చెరిపేస్తూ నేటి తరం అమ్మాయిలకు ఆదర్శంగా నిలుస్తోంది.

Know More

women icon@teamvasundhara