scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'బావే నమ్మించి మోసం చేశాడు..!'

'మన దేశంలో మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు రూపొందించినా లైంగిక వేధింపులు ఎదుర్కొనే అమ్మాయిల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ బాధితుల్లో చిన్నపిల్లలు కూడా ఉండడం చింతించాల్సిన విషయం. అంతకంటే దౌర్భాగ్యం ఏంటంటే.. అసలు తాము వేధింపులకు గురవుతున్నట్లు కూడా ఆ చిన్న వయసులో కొందరికి తెలియకపోవడం! ఫలితంగా పురుషుల్లో ఎవరిని నమ్మాలన్నా మనసులో భయం గూడుకట్టుకొని పోతోంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల నుంచే బయటపడిన ఓ అమ్మాయి యుక్తవయసుకు వచ్చిన తర్వాత మరొక అబ్బాయిని నమ్మింది. గాఢంగా ప్రేమించింది.. కానీ అతడు కూడా ఆమెను వంచించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది? మొదలైన ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఆమె మనసు పలికే హృదయరాగం వినాల్సిందే..'

Know More

Movie Masala

 
category logo

నా కూతుళ్లకు ఆ పరిస్థితి రాకూడదనే ‘సాల్ట్‌’ని ప్రారంభించా!

A Mother of Five Daughters Found Saalt Menstrual Cup for De-Stigmatizing Periods

పిరియడ్స్‌.. దీని గురించి నలుగురిలో మాట్లాడడానికి ఇప్పటికీ చాలామందికి సిగ్గు. ఈ క్రమంలో వారికెదురయ్యే సమస్యల్ని కనీసం సొంత వాళ్లతో కూడా చెప్పుకోవడానికి ఇష్టపడట్లేదు కొందరు. ఇక, శ్యానిటరీ న్యాప్‌కిన్లు కొనేందుకు వెళ్తే ఎక్కడ తమను ఎగాదిగా చూస్తారోనన్న బిడియం మరికొంతమంది కాళ్లకు సంకెళ్లు వేస్తుంది. ఇలా నెలసరి విషయంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలు మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఉన్నాయనడం అతిశయోక్తి కాదు..! అయితే ఈ పద్ధతిని మార్చడానికే కొంతమంది వ్యక్తులు శక్తులుగా మారి అహర్నిశలూ ప్రయత్నిస్తున్నారు. ఆ కోవకే చెందుతారు వెనెజులాకు చెందిన చేరీ హోగర్‌. ఒకానొక దశలో నెలసరి సమయంలో వాడే శ్యానిటరీ ఉత్పత్తులకు తన దేశంలో కొరత ఏర్పడడం ఆమెను ఆలోచనలో పడేసింది. వ్యక్తిగత ఉత్పత్తులు దొరక్క మహిళలు ఎదుర్కొనే ఇబ్బందుల్ని అంచనా వేసిన ఆమె.. అలాంటి పరిస్థితి తన కూతుళ్లకు రాకూడదని నిర్ణయించుకున్నారు. అందుకు ఆమె చేసిన ఆలోచనే ఈ ‘సాల్ట్‌’. అసలేంటీ సాల్ట్‌? దీనికి, నెలసరికి సంబంధమేంటి? రండి.. ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..!

View this post on Instagram

A post shared by Cherie Hoeger/Founder @saaltco (@cherie.hoeger) on


దేశం, ప్రాంతం అని కాదు.. ఎక్కడ చూసినా నెలసరి గురించిన అపోహలు, మూఢనమ్మకాల్లోనే చాలామంది ప్రజలు మగ్గుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇంకా కొన్ని చోట్లైతే కనీసం ఆ సమయంలో వాడే శ్యానిటరీ న్యాప్‌కిన్లు, ట్యాంపూన్స్‌ దొరకడం కూడా గగనమవుతోంది. ఇలాంటి అనుభవమే ఓసారి మా ఆంటీ నాతో పంచుకుంది. ఇక్కడే వెనెజులాలో నివాసముండే ఆమె నుంచి ఓ రోజు నాకు ఫోన్‌ వచ్చింది. అక్కడి సూపర్‌ మార్కెట్‌్నలో, గ్రాసరీ షాపుల్లో.. ఎక్కడా శ్యానిటరీ న్యాప్‌కిన్లు గానీ, ట్యాంపూన్లు గానీ దొరకట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

View this post on Instagram

A post shared by Cherie Hoeger/Founder @saaltco (@cherie.hoeger) on


ఆ పరిస్థితి నా కూతుళ్లకు రావద్దు!
నిజానికి నెలనెలా మహిళలకు వాటి అవసరం ఎంతో ఉంటుంది. ఒకవేళ అవే దొరకని పక్షంలో క్లాత్స్‌ వంటి ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకుంటే అది ప్రత్యుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. నాకు ఐదుగురు ఆడపిల్లలు! వారికి ఇలాంటి కొరత వస్తే ఎంత ఇబ్బందవుతుంది? నాలాగా, నా పిల్లల్లాగా ఇంకా చాలామంది ఈ సమయంలో అవస్థలు పడాల్సి వస్తుంది. ఇవే ఆలోచనలు నా మనసును ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి ఏదో ఒక మార్గం వెతకాలి అనుకున్నా. అలా ఆలోచనల్లో మునిగిపోయిన నాకు సడెన్‌గా రీయూజబుల్‌ మెన్‌స్ట్రువల్‌ కప్ ఐడియా తట్టింది. అయితే ముందు నుంచీ ఏదో ఒక బిజినెస్‌ చేయాలన్న ఆలోచన నాకు, నా భర్తకు ఉంది.. ఈ క్రమంలోనే మాకొచ్చిన ఆలోచనల్ని ఒకరికొకరం పంచుకునే వాళ్లం. అలా ఈసారి ఈ పిరియడ్‌ కప్‌ గురించి మావారితో చెప్పాను. తనూ వెంటనే సరేనన్నాడు.

View this post on Instagram

A post shared by Cherie Hoeger/Founder @saaltco (@cherie.hoeger) on


ఆ ప్రమాణాలే లక్ష్యంగా..!
అయితే ఈ మెన్‌స్ట్రువల్‌ కప్‌ తయారుచేయాలనుకున్నప్పుడే ఇదెంత నాణ్యతతో ఉండాలి? దీనిలో ఎలాంటి సౌలభ్యాలుంటే మహిళలకు ఉపయుక్తంగా ఉంటుందన్న విషయాల గురించి కూడా ఆలోచించాను. ‘నేను తయారు చేయబోయే పిరియడ్‌ కప్‌ తిరిగి ఉపయోగించుకునే విధంగా ఉండాలి.. విషపూరితమైనది కాకుండా (నాన్‌ టాక్సిక్‌), సౌకర్యవంతంగా ఉండాలి.. కనీసం 12 గంటల దాకా రక్షణ కల్పించాలి.. 10 ఏళ్లైనా మన్నాలి.. దీనివల్ల ఎలాంటి అనారోగ్యాలూ తలెత్తకూడదు..’ అలాంటి కప్‌ తయారుచేద్దామన్న ఆలోచన చేశాను. అయితే అంతకంటే ముందు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పిరియడ్‌ కప్స్‌ గురించి పరిశోధన చేయాలనుకున్నా. ఈ క్రమంలోనే కొన్ని కప్స్‌ కొనుగోలు చేసి నేనే స్వయంగా పరిశీలించా. కానీ నేను అనుకున్న నాణ్యతా ప్రమాణాలను ఒక్క పిరియడ్‌ కప్‌ కూడా అందుకోలేకపోయింది. దీంతో పాటు నెలసరి ఉత్పత్తులపై మరిన్ని పరిశోధనలు కూడా చేశాను. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకొని మెన్‌స్ట్రువల్‌ కప్‌ తయారుచేయడానికి నా భర్తతో కలిసి కసరత్తులు మొదలుపెట్టాను.

View this post on Instagram

A post shared by Cherie Hoeger/Founder @saaltco (@cherie.hoeger) on


20 వేల డాలర్లు పెట్టుబడి పెట్టి..!
ఈ క్రమంలో మేమే స్వయంగా కప్‌ డిజైన్స్‌ నమూనాలను 3డీ క్యాడ్‌ సిస్టమ్‌లో తయారుచేయడం మొదలుపెట్టాం. ఇక ఒక్కో డిజైన్‌ నమూనాను తయారుచేయడం, దాని ఉత్పత్తి బాధ్యతలను ఓ ఫ్యాక్టరీకి అప్పగించడం, తీరా ఆ కప్పు నాణ్యత, ఇతర ప్రమాణాలు మా ఆలోచనలకు తగ్గట్లుగా లేకపోవడంతో చాలా నిరాశ చెందేవాళ్లం. ఇలా సుమారు 13 సార్లు ప్రయత్నించాం. 14వ సారి మా కల ఫలించింది. మేము అనుకున్న నాణ్యతా ప్రమాణాలతో కూడిన మెన్‌స్ట్రువల్‌ కప్‌ రడీ అయింది. ఇందుకు మేము సుమారు 20 వేల డాలర్లు (రూ. 14 లక్షలకు పైమాటే) పెట్టుబడిగా పెట్టాం. ఇంత డబ్బు ఖర్చయినా మేము అనుకున్న ఉత్పత్తి మా కళ్ల ముందుకొచ్చేసరికి చాలా సంతోషంగా అనిపించింది. మాలో ఆత్మవిశ్వాసం రెట్టించింది. ఇక దీన్ని పూర్తిస్థాయిలో పరిశీలించడానికి ఓ నిపుణుల బృందాన్ని నియమించుకున్నాం. వారిచ్చిన ఫీడ్బ్యాక్‌, ఇతర సలహాల్ని పరిగణనలోకి తీసుకొని అంబర్‌ ఫాసన్‌ అనే మరో మహిళతో కలిసి 2018, ఫిబ్రవరిలో ‘సాల్ట్‌.కామ్‌’ పేరుతో ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించాం.

View this post on Instagram

A post shared by Cherie Hoeger/Founder @saaltco (@cherie.hoeger) on


అదే మా అంతిమ లక్ష్యం!
మహిళల నెలసరి పరిశుభ్రతే ఈ స్టార్టప్‌ ప్రారంభానికి పునాది. అంతేకాదు.. ప్రతి ఒక్కరికీ పిరియడ్‌ కేర్‌ అవసరం.. అందుకోసం ఉపయోగించే వస్తువులు సురక్షితంగా, అందరికీ అందుబాటు ధరల్లో, సహజసిద్ధంగా ఉండాలన్నదే మా ప్రధాన ఉద్దేశం. ఈ లక్ష్యంతోనే గత రెండేళ్లుగా మేము రూపొందిస్తోన్న సాల్ట్‌ కప్‌కి మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం మా ఉత్పత్తులు ఆన్‌లైన్‌లోనే కాదు.. ఇక్కడి పలు స్టోర్లలోనూ లభిస్తున్నాయి. అలాగే దీంతో పాటు మా వెబ్‌సైట్‌ ద్వారా నెలసరి పరిశుభ్రత గురించి కూడా మహిళల్లో అవగాహన పెంచుతున్నాం. ఒకసారి వాడి పడేసే ఉత్పత్తుల వల్ల అటు మనకు, ఇటు పర్యావరణానికీ నష్టమే! కాబట్టి అలాంటి ఉత్పత్తులు లేకుండా చేసి ప్రపంచంలోనే అత్యుత్తమ రీయూజబుల్‌ పిరియడ్‌ కేర్‌ కంపెనీగా మా సంస్థను తీర్చిదిద్దాలన్నదే నా ముందున్న లక్ష్యం. అంతేకాదు.. ప్రస్తుతం మా ఆదాయంలో 2 శాతాన్ని నెలసరి పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, బాలికలకు విద్యా ఉపకార వేతనం.. వంటి అంశాల కోసం కేటాయిస్తున్నాం. అలాగే కొన్ని దేశాలకు మేము తయారుచేస్తోన్న పిరియడ్‌ కప్స్‌ని ఉచితంగా అందిస్తున్నాం కూడా! ఇలా మొత్తానికి మహిళల్లో నెలసరిపై ఉన్న అపోహల్ని, మూఢనమ్మకాల్ని తొలగించడానికి, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన పెంచడానికి మా వంతుగా కృషి చేస్తున్నాం. మీరు కూడా నెలసరి గురించి ఏవైనా సమస్యలుంటే మీలోనే దాచుకోకుండా నిర్భయంగా, నిర్మొహమాటంగా నలుగురితో పంచుకోండి.. దానివల్ల మీ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది.

View this post on Instagram

A post shared by Cherie Hoeger/Founder @saaltco (@cherie.hoeger) on


ఇక ఆఖరుగా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటోన్న మహిళలకు నేను చెప్పదలచుకున్నది ఒక్కటే.. వ్యాపారం చేసే క్రమంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురవుతాయి.. ఇంకెన్నో సవాళ్లు మన ప్రయత్నాన్ని ముందుకు సాగనివ్వవు. మనం తయారుచేసే ఉత్పత్తులు ఒకే ప్రయత్నంలో సక్సెస్‌ కాకపోవచ్చు.. అయినా ఓపికతో ఉండాలి.. సక్సెసయ్యేదాకా ప్రయత్నాన్ని విరమించుకోకూడదు. వీటన్నింటికీ ఎదురీది నిలబడితేనే మన వ్యాపారం సఫలీకృతమవుతుంది. ఇలా వచ్చిన సక్సెస్‌ జీవితాంతం మనతోనే ఉంటుంది.. నా వ్యాపారంలో నేను నేర్చుకున్న పాఠమిదే!

Photo: Instagram





women icon@teamvasundhara
cancer-survivor-with-prosthetics-becomes-the-youngest-american-to-go-to-space

అప్పుడు క్యాన్సర్‌ను జయించింది.. ఇప్పుడు అంతరిక్ష యాత్రకు వెళ్తోంది!

క్యాన్సర్‌.. ఈ మహమ్మారి బారిన పడ్డామంటే ఇక జీవితం అంతమైపోయినట్లే అనుకుంటాం.. జీవన శైలి మార్పులు, చికిత్సలతో ఈ వ్యాధిని జయించినా ఏదో ఉన్నామంటే ఉన్నామన్నట్లుగా బతుకీడుస్తుంటారు చాలామంది! అయితే తాను మాత్రం అలా జీవచ్ఛవంగా బతకాలనుకోలేదు. పదేళ్ల వయసులో ఏ క్యాన్సర్‌ అయితే తనని కబళించడానికి ప్రయత్నించిందో.. దానికే ఎదురెళ్లి పోరాటం చేయాలనుకుంది. ఈ క్రమంలో తాను చికిత్స తీసుకున్న ఆస్పత్రిలోనే నర్సుగా చేరి.. వివిధ అనారోగ్యాలతో అక్కడ చికిత్స పొందుతోన్న పిల్లలకు సేవలు చేయడంతో పాటు తన మాటలతో, అనుభవాలతో వారిలో ధైర్యాన్ని నింపుతోంది. బతుకు పట్ల ఆశను కల్పిస్తోంది. అంతటితో ఆగిపోకుండా.. ఈ ఏడాది చివర్లో స్పేస్ ఎక్స్‌ చేపట్టబోయే తొలి ప్రైవేట్‌ అంతరిక్ష యాత్ర ద్వారా రోదసీలోకి వెళ్లే అరుదైన అవకాశాన్ని సైతం దక్కించుకుందామె. ఆమే.. అమెరికాకు చెందిన 29 ఏళ్ల హేలే ఆర్సెనాక్స్‌. దీంతో కృత్రిమ అవయవంతో అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి వ్యక్తిగా, అతి పిన్న అమెరికన్‌గా చరిత్రలో నిలిచిపోనుందామె. క్యాన్సర్‌ను జయించిన వారు ఏదైనా సాధించగల సమర్థులు అని నిరూపించేందుకు ఉవ్విళ్లూరుతున్నానంటోన్న ఈ క్యాన్సర్‌ విజేత కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
62-year-old-grand-mother-wins-internet-with-beautiful-dance-moves-bollywood-stars-praises-her-talent

సెలబ్రిటీలకే సవాలు విసురుతున్న ఈవిడ డ్యాన్స్ చూశారా?

సాధారణంగా అరవై ఏళ్లు పైబడిన మహిళలకు ఒంట్లో సత్తువ తక్కువగానే ఉంటుంది. బాధ్యతలన్నీ తీరిపోయి ఉంటాయి కాబట్టి ఈ వయసులో విశ్రాంతి తీసుకునేందుకే ఎక్కువ మొగ్గు చూపుతుంటారు. ఇంట్లోని మనవలు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తుంటారు. అయితే ముంబయికి చెందిన రవిబాల శర్మ అనే వృద్ధురాలు మాత్రం 62 ఏళ్ల వయసులోనూ ఎంతో హుషారుగా స్టెప్పులేస్తున్నారు. అద్భుతమైన హావభావాలు పలికిస్తూ సినిమా తారలకు సవాల్‌ విసురుతున్నారు. ఇంతియాజ్ అలీ, దిల్జిత్‌ దోసాంజ్‌ లాంటి సెలబ్రిటీలతో పాటు ప్రముఖ కొరియోగ్రాఫర్లు సైతం ఆమె డ్యాన్స్‌ ప్రతిభకు ఫిదా అవుతున్నారు.

Know More

women icon@teamvasundhara
meet-swati-mohan-the-indian-origin-scientist-who-landed-the-mars-rover-on-red-planet

ఆ టీవీ సిరీస్ చూశాకే అదంటే ఇష్టం పెరిగింది!

అంతులేని అంతరిక్షంలో ఎన్నో వింతలు, మరెన్నో అద్భుతాలు! వాటి గురించి తెలుసుకోవాలన్న తపన మనకు తనివి తీరనీయదు. ఆ విశేషాల గురించి అర్థం చేసుకునే క్రమంలో మనల్ని మనమే మరచిపోతాం.. ఇదిగో ఇలాంటి మక్కువే ఆమెను ఏకంగా తన కెరీర్‌నే మార్చుకునేలా చేసింది. ఖగోళంలో ఏముందో తెలుసుకోవాలన్న ఆతృతే ఆమెను గత కొన్నేళ్లుగా నాసాతో కలిసి నడిచేలా చేస్తోంది. ఇక తాజాగా అరుణ గ్రహం (మార్స్‌/అంగారకుడు)పై పర్సెవరెన్స్‌ రోవర్‌ సురక్షితంగా ల్యాండ్‌ అవడంతో ప్రస్తుతం ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది. ఆమే భారత సంతతికి చెందిన డాక్టర్‌ స్వాతీ మోహన్‌. గతేడాది నాసా ప్రయోగించిన మార్స్‌ రోవర్‌ మెషీన్‌ ప్రయోగానికి ఆపరేషన్స్‌ హెడ్‌గా వ్యవహరిస్తోన్న ఆమె.. తాజాగా ఈ ప్రయోగం విజయవంతం అవడంలో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఈ విక్టరీ గురించి స్వాతి ఏమంటున్నారో తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
meet-saima-ubaid-first-woman-from-jammu-and-kashmir-to-earn-laurels-as-a-power-lifter

భర్త కాస్త ప్రోత్సహిస్తే ఇలా ఎందులో అయినా గెలిచేయచ్చు!

జమ్మూకశ్మీర్... అద్భుతమైన ప్రకృతి సంపదకు నిలయమైన ఈ రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక రూపంలో అల్లర్లు జరుగుతుంటూనే ఉంటాయి. అంతేకాదు ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇక్కడి మహిళలపై ఆంక్షలు కూడా అధికంగానే ఉంటాయి. అయినప్పటికీ వాటిని బద్దలు కొట్టుకుని ముందుకొచ్చి తమను తాము నిరూపించుకుంటున్నారు కొంతమంది మహిళలు. అలాంటి కోవకే చెందుతుంది శ్రీనగర్‌కు చెందిన 27 ఏళ్ల సైమా ఉబైద్‌. జమ్మూకశ్మీర్‌లో పవర్‌ లిఫ్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్న తొలి మహిళగా చరిత్ర సృష్టించిన ఆమె అతిక్లిష్టమైన బరువులను సైతం అవలీలగా ఎత్తుతోంది. తద్వారా వెయిట్‌ లిఫ్టింగ్‌లో మహిళలు రాణించలేరన్న అపోహను చెరిపేస్తూ నేటి తరం అమ్మాయిలకు ఆదర్శంగా నిలుస్తోంది.

Know More

women icon@teamvasundhara
meet-gqs-most-influential-young-indian-women-in-telugu

ఈ అమ్మాయిలంతా గేమ్‌ని మార్చేశారు... హీరోలయ్యారు!

ఫలానా రంగమని గిరిగీసుకోకుండా.. ఏ రంగంలోనైనా తమ ప్రతిభాపాటవాలతో దూసుకుపోతున్నారు అతివలు. మరికొందరైతే విభిన్న రంగాలను ఎంచుకొని తమలోని సృజనాత్మకతను చాటుతూ నలుగురికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి వారినే ఎంపిక చేసి అత్యంత ప్రభావశీలురైన యువ భారతీయులుగా గుర్తించింది జీక్యూ ఇండియా. వినోదం, కళలు, వ్యాపారం.. తదితర రంగాల్లో చిన్న వయసులోనే ప్రతిభ చాటుతోన్న వారిని ఒక్కచోట చేర్చి ‘పీపుల్‌ లీడింగ్‌ ద ఛేంజ్‌’ పేరుతో విడుదల చేసిన ఈ జాబితాలో 25 మంది చోటు దక్కించుకున్నారు. వీరిలో బాలీవుడ్‌ నటి-నిర్మాత అనుష్కా శర్మతో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు మహిళలు కూడా స్థానం సంపాదించారు. మరి, వారెవరు? తమదైన ప్రతిభతో అందరినీ ఎలా ప్రభావితం చేశారో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
44-years-woman-in-mumbai-sets-new-record-by-beating-23-men-in-a-24-hour-stadium-run

పరుగే పరుగు... 23 మంది మగాళ్లూ అందుకోలేకపోయారు!

శారీరక, మానసిక ఆరోగ్యానికి వ్యాయామాలు ఎంత అవసరమో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అందుకే వాటిని దైనందిన జీవితంలో భాగం చేసుకోవడమే కాదు... వాటిపై ఉన్న మక్కువతో కొందరు ఫిట్‌నెస్‌ నిపుణులుగా కూడా మారుతుంటారు. ఈ క్రమంలోనే తమకొచ్చిన విద్యతో రికార్డులు సృష్టించాలని ఉవ్విళ్లూరుతుంటారు. సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది 44 ఏళ్ల వయసున్న ప్రీతి లాలా. తాజాగా ముంబయిలో నిర్వహించిన 24 గంటల సుదీర్ఘ మారథాన్‌లో 23 మంది పురుషులతో పోటీ పడి గెలిచిందామె. ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా 193 కిలోమీటర్ల సుదీర్ఘ దూరం పరిగెత్తి మరీ ప్రీతి ఈ పోటీలో విజేతగా నిలవడం విశేషం. మరి నాలుగు పదుల వయసులోనూ జింకలా పరిగెత్తి అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ సూపర్‌ రన్నర్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
jaipur-mayor-shows-the-ways-works-till-a-few-hours-before-delivering-her-baby

నొప్పులొచ్చే వరకు ఈ మేయరమ్మ డ్యూటీ మాత్రం మానలేదు!

నెలలు నిండుతున్న కొద్దీ అతి సుకుమారంగా తయారవుతుంటారు గర్భిణులు. కడుపులోని బిడ్డకు అసౌకర్యం కలుగుతుందేమోనన్న ఉద్దేశంతో ఎక్కడికీ వెళ్లకుండా ఇంటిపట్టునే ఉండిపోతారు. కఠినమైన పనులకు దూరంగా ఉంటూ కుటుంబ సమక్షంలోనే ఉండి జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటిది ప్రజాసేవే పరమావధిగా భావించే ఓ మహిళ ప్రసవానికి కొన్ని గంటల ముందు వరకు కూడా అధికారిక బాధ్యతలు నిర్వర్తించింది. నిండు గర్భంతో ఉన్నప్పటికీ పొద్దుపోయేదాకా కార్యాలయంలోనే ఉన్న ఆమె... విధులన్నీ ముగించుకున్నాకే ఆస్పత్రికి వెళ్లి పండంటి బిడ్డను ప్రసవించింది.

Know More

women icon@teamvasundhara
odisha-forest-officer-receives-un-asia-environmental-enforcement-award

అక్రమార్కుల పని పట్టింది... ఆ అవార్డు అందుకుంది!

సాధారణంగా అటవీ శాఖలో ఉద్యోగాలంటే ఎన్నో సవాళ్లతో కూడుకున్నవి. నిత్యం అడవిలో క్రూర జంతువులు, ప్రతికూల పరిస్థితుల మధ్య విధులు నిర్వర్తించాలి. దొంగలు, స్మగ్లర్ల బారి నుంచి తమను తాము కాపాడుకుంటూ.. జంతువులు, అటవీ సంపదకు రక్షణగా నిలవాలి. పనిపట్ల నిబద్ధత, అంకితభావం, సవాళ్లను ఎదుర్కొనే తత్వం... తదితర లక్షణాలు ఉంటే తప్ప అందరూ ఈ ఉద్యోగాలు చేయలేరు. ఈక్రమంలో ఒడిశాకు చెందిన అటవీ అధికారిణి సస్మితా లెంకా తన విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించినందుకు గానూ ‘ఐక్యరాజ్యసమితి ఆసియా ఎన్విరాన్‌మెంటల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్’ పురస్కారాన్ని అందుకున్నారు. తద్వారా ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న తొలి భారతీయురాలిగా అరుదైన గుర్తింపు దక్కించుకున్నారు.

Know More

women icon@teamvasundhara
no-mountain-is-too-high-to-scale-for-this-kerala-lawyer-even-at-50

50 ఏళ్ల వయసులో తన కలను సాకారం చేసుకుంది!

ఆసక్తి ఉంటే ఏ పని చేయడానికైనా వయసుతో నిమిత్తం లేదని ఇప్పటికే చాలామంది మహిళలు నిరూపించారు. కొందరు మహిళలు తమ పిల్లలతో కలిసి పైచదువులు చదువుతుంటే మరికొందరు వృద్ధాప్యంలో తమ మనవళ్లు, మనవరాళ్లతో కలిసి డిగ్రీ పట్టాలు అందుకున్నవారూ ఉన్నారు. సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది కేరళకు చెందిన జయశ్రీ. పేదరికం అడ్డొచ్చినా పాతికేళ్ల క్రితమే పీజీ పూర్తి చేసిన ఆమె పెళ్లి, పిల్లల బాధ్యత కోసం తన కలల కెరీర్‌ను త్యాగం చేయాల్సి వచ్చింది. కానీ లాయర్‌ కావాలన్న కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. ఈక్రమంలో పిల్లలిద్దరూ పెరిగి పెద్దవడంతో మళ్లీ తన లక్ష్యాన్ని పట్టాలెక్కించింది. భర్త ప్రోత్సాహంతో 50 ఏళ్ల వయసులో ఎల్‌ఎల్‌బీ పట్టాను అందుకుని నల్లకోటు ధరించాలన్న తన కలను సాకారం చేసుకుంది. మరి, ఇదంతా ఆమెకు ఎలా సాధ్యమైందో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
meet-the-sisters-whose-maternity-wear-startup-has-caught-the-attention-of-kareena-kapoor-khan

కరీనా ధరించిన ఆ మెటర్నిటీ డ్రస్‌ మేము రూపొందించిందే!

అకేషన్‌ ఏదైనా ఫ్యాషన్‌కే అధిక ప్రాధాన్యమిస్తున్నారు ఈ తరం మహిళలు. ఆఫీస్‌/కాలేజీలకు వెళ్లేటప్పుడు ధరించే క్యాజువల్‌ వేర్‌ దగ్గర్నుంచి పార్టీలు, ప్రత్యేక సందర్భాలకు ఎంచుకునే అవుట్‌ఫిట్స్‌ దాకా.. ఇలా ప్రతిసారీ ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవాలని ఆరాటపడుతున్నారు. అంతేనా.. గర్భం ధరించినా స్టైలిష్‌గా, కంఫర్టబుల్‌గా మెరిసిపోవాలనుకునే అతివల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. అయితే ఇలాంటి మెటర్నిటీ వేర్‌ గురించి మార్కెట్లో వెతికితే ఆయా దుస్తుల డిజైన్‌ను బట్టి వాటి ధర వేలకు వేలే ఉంటుంది. దీంతో చాలామంది కాబోయే అమ్మలు వాటిని కొనలేక నిరాశతోనే వెనుదిరగాల్సి వస్తుంది. అయితే ఇలాంటి వారి అవసరాన్ని అర్థం చేసుకున్నారు దిల్లీకి చెందిన అక్కచెల్లెళ్లు ఆంచల్‌ జౌరా, ఆష్నా షా. తక్కువ ధరలోనే నాణ్యమైన, సౌకర్యవంతమైన మెటర్నిటీ వేర్‌ను రూపొందిస్తూ కాబోయే అమ్మల మనసు దోచుకుంటున్నారు. అంతేకాదు.. బాలీవుడ్‌ టు-బి-మామ్‌ కరీనా కపూర్‌ కూడా వీరు రూపొందించిన ఓ క్యూట్‌ మెటర్నిటీ వేర్‌లో మెరిసిపోవడం, ఆ ఫొటోలు కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారడంతో అందరూ ఈ సిస్టర్స్‌ ఫ్యాషన్‌ లేబుల్‌ గురించి తెగ వెతికేస్తున్నారు. మరి, తమ స్వీయ అనుభవమే తమతో ఈ మెటర్నిటీ ఫ్యాషన్‌ బ్రాండ్‌ని ప్రారంభించేలా చేసిందంటోన్న ఈ అక్కాచెల్లెళ్ల సక్సెస్‌ స్టోరీ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
nasa-appoints-bhavya-lal-as-acting-chief-of-staff-in-telugu

ఆమె అపార అనుభవమే ఆ పదవికి ఎంపికయ్యేలా చేసింది!

అమెరికా నూతన అధ్యక్షుడిగా ఇటీవల జో బైడెన్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ అగ్రరాజ్యపు తొలి ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక తన ప్రభుత్వంలో పలువురు భారతీయ అమెరికన్లకు పెద్దపీట వేసిన బైడెన్‌ మహిళలకు కూడా సముచిత స్థానం కల్పిస్తున్నారు. ప్రమాణస్వీకారానికి ముందే 13 మంది భారతీయ అమెరికన్‌ మహిళలకు తన పాలక వర్గంలో చోటు కల్పించిన ఆయన తాజాగా మరో ఇండో అమెరికన్‌ మహిళకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఇందులో భాగంగా ప్రతిష్ఠాత్మక అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా(నేషనల్‌ ఏరోనాటిక్స్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌)కు ‘యాక్టింగ్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌’గా భవ్యాలాల్‌ను నియమించారు.

Know More

women icon@teamvasundhara
viral-pic-of-andhra-cop-saluting-daughter-heres-the-story-behind-it

అలా నాన్నకు బాస్‌నయ్యా!

తన గుండెల మీద ఎత్తుకొని ఆడించిన కూతురు తన పైఅధికారిగా వచ్చినప్పుడు ఆ తండ్రి కళ్లల్లో కలిగే ఆనందం, గర్వంతో ఆమెకు చేసే సెల్యూట్‌లో ఎంత ప్రేమ, సంతృప్తి దాగుంటాయో మాటల్లో చెప్పలేం. అలాంటి పుత్రికోత్సాహంలో మునిగిపోయిన ఆ తండ్రి, ఆయన్నే రోల్‌మోడల్‌గా తీసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఆ కూతురికి సంబంధించిన ఓ ఫొటో ఒకటి ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరలైన సంగతి తెలిసిందే. ఈ తండ్రీకూతుళ్లు మరెవరో కాదు.. గుంటూరు జిల్లా డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తోన్న యండ్లూరు జెస్సీ ప్రశాంతి - అదే జిల్లా సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా కొనసాగుతోన్న యండ్లూరు శ్యామ్‌ సుందర్‌. ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొన్న వీరిద్దరూ ఎదురుపడి సెల్యూట్‌ చేసుకోవడం.. అందులోనూ తనకంటే పైహోదాలో ఉన్న కూతురికి తండ్రి సెల్యూట్‌ చేస్తూ ఉప్పొంగిపోవడం.. అందరినీ కట్టిపడేశాయనడంలో సందేహం లేదు. అయితే తానింత ఉన్నత శిఖరాలను అధిరోహించడం వెనుక తన తండ్రి ప్రోత్సాహం, అండదండలు ఎంతగానో ఉన్నాయంటున్నారు డీఎస్పీ ప్రశాంతి. తన తండ్రితో తనకున్న అనుబంధాన్ని, అడుగడుగునా ఆమెలో స్ఫూర్తి నింపిన వైనాన్ని ఓ ప్రముఖ సోషల్‌ మీడియా బ్లాగ్‌తో ఇటీవలే పంచుకున్నారామె. మరి, ఈ ‘తండ్రిని మించిన తనయ’ ఆమె గురించి, ఆమె ఆశయం గురించి ఏం చెబుతున్నారో తెలుసుకుందామా?!

Know More

women icon@teamvasundhara
estonia-becomes-only-country-to-currently-have-both-a-female-prime-minister-and-president

అక్కడ ప్రెసిడెంట్‌, పీఎం ఇద్దరూ మహిళలే!

‘పాలిచ్చి పెంచిన తల్లులు సర్‌...! వాళ్లకు పాలించడం ఓ లెక్కా’...! ఆడవాళ్ల శక్తి సామర్థ్యాలను వర్ణిస్తూ ‘అరవింద సమేత’ చిత్రంలో ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగ్‌ ఇది. అంతటి శక్తి సామర్థ్యాలున్నాయి కాబట్టే ఒకప్పుడు వంటింటికే పరిమితమనుకున్న స్త్రీలు నేడు ఆకాశంలో సగమంటూ రాకెట్లలో రివ్వున దూసుకుపోతున్నారు. అద్భుతమైన పాలనా దక్షతతో దేశాధ్యక్షులుగా, ప్రధానమంత్రులుగా దేశ సేవ చేస్తున్నారు. తాజాగా యూరప్‌ ఖండంలో అతి చిన్న దేశమైన ఈస్టోనియాకు కొత్త ప్రధానమంత్రిగా కాజా కల్లాస్‌ ప్రమాణస్వీకారం చేశారు. తద్వారా ఆ దేశ ప్రధాని పీఠాన్ని అధిరోహించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు.

Know More

women icon@teamvasundhara
jyoti-nainwal-fulfills-her-martyr-husband’s-dying-wish-all-set-to-join-indian-army-as-an-officer

నన్నిలా చూసి ఆయనెక్కడున్నా సంతోషిస్తారు!

దేశ రక్షణ కోసం ప్రాణాల్ని సైతం పణంగా పెట్టడానికి సిద్ధపడతారు వీర సైనికులు. ఆ వీరుల్ని కట్టుకున్న భార్యలు కూడా అంతే గుండె ధైర్యాన్ని, నిండైన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తారు. అందుకే భర్త యుద్ధంలో అమరుడైనా ‘నేను సైతం’ అంటూ అటు భర్త అడుగుజాడల్లో నడవడానికి, ఇటు దేశ రక్షణ బాధ్యతల్ని చేపట్టడానికి సిద్ధపడతారు. రెండేళ్ల క్రితం ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో అమరుడైన నాయక్‌ దీపక్‌ నైన్‌వాల్‌ సతీమణి జ్యోతీ నైన్‌వాల్‌ కూడా ఆ కోవలోకే చెందుతారు. భార్యాభర్తలంటే ప్రతి అడుగులోనూ ఒకరికొకరు తోడుండాలి.. ఇద్దరూ ఒకరి నుంచి మరొకరు పాఠాలు నేర్చుకోవాలి. అలా తన భర్త నుంచి ధైర్యం అనే పాఠం నేర్చుకున్నారు జ్యోతి. అందుకే దేశ సేవలో అమరుడైన తన భర్త ఆశయాన్ని తాను భుజాలపైకెత్తుకున్నారు. ఇండియన్‌ ఆర్మీలో చేరేందుకు సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలో తన భర్త కలల్ని నెరవేర్చుతానంటూ నిండైన ఆత్మవిశ్వాసంతో జనవరి 29న శిక్షణలో చేరబోతున్న ఈ వీర సతీమణి గురించి పలు విషయాలు తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
women-who-got-padma-awards

‘పద్మా’ల్లా వికసించారు!

‘పద్మ’ పురస్కారాలు... ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ప్రకటించే ఈ అవార్డులను దేశంలోనే అత్యున్నతమైన పురస్కారాలుగా పరిగణిస్తారు. వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తూ, కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచిన వారికి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఈక్రమంలో 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2021 సంవత్సరానికి గానూ పద్మ అవార్డుల జాబితాను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఏడుగురికి పద్మవిభూషణ్‌, 10 మందికి పద్మభూషణ్‌, 102 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. అలా ఈ ఏడాది మొత్తం 119 మంది ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలకు ఎంపిక కాగా, అందులో 29 మంది మహిళలు ఉండడం విశేషం. మరి, ఆ మహిళామణులు, వారు అందించిన సేవల గురించి మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
womens-in-republic-day-celebrations

ఫైటర్‌ జెట్స్‌తో నింగిలో ‘త్రివర్ణ పతాకం’ రెపరెపలాడిస్తా!

చిన్నప్పటి నుంచి ఏ బొమ్మ గీసినా అందులో మువ్వన్నెల జెండా ఉండేలా చూసుకోవడం ఆమెకు అలవాటు. త్రివర్ణ పతాకంపై తనకున్న ప్రేమే ఆమెకు బోలెడన్ని బహుమతులు తెచ్చిపెట్టింది. జాతీయజెండాపై తనకున్న మమకారమే జీవితంలో ఎన్ని కఠిన సవాళ్లనైనా ఎదుర్కొనే శక్తిసామర్థ్యాలనిచ్చింది. అదే తనను భారత వైమానిక దళంలో ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా చేరేలా చేసి దేశానికి సేవలందించే సువర్ణావకాశం తెచ్చిపెట్టింది. తద్వారా దేశమంతా తన గురించి మాట్లాడుకునేలా చేసింది. ఆమే ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ స్వాతి రాథోడ్‌. ఇక ఇప్పుడు మరోసారి ఆమె గురించి దేశ ప్రజలంతా మాట్లాడుకుంటున్నారు. కారణం...గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనే అద్భుత అవకాశం ఆమె తలుపు తట్టడమే! ఈ వేడుకల్లో భాగంగా ఫైటర్‌ జెట్‌ విమానాలతో కనుల విందుగా సాగే ‘ఫ్లైపాస్ట్‌’ కవాతుకు స్వాతి నాయకత్వం వహించనుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించనుందీ డేరింగ్‌ లేడీ.

Know More

women icon@teamvasundhara
malayalam-actress-rajini-chandy-shares-her-views-about-her-latest-photshoot

అది నా ఇష్టం.. నచ్చితే స్వీకరించండి.. నచ్చకపోతే వదిలేయండి!

ఎవరైనా వయసు పైబడిన మహిళలు చీరలో కాకుండా కాస్త మోడ్రన్‌గా తయారై, మేకప్‌ వేసుకొని కనిపిస్తే.. ‘ఈ వయసులో ఈవిడకు ఇవన్నీ అవసరమా.. ఇంట్లో కృష్ణా, రామా అంటూ కూర్చోక!’ అనుకునే వారు చాలామందే! అలాంటిది ఏకంగా ఏడు పదుల వయసులో పూర్తి స్థాయి మోడ్రన్‌గా రడీ అయి ఫొటోషూట్‌ తీయించుకోవడమంటే అదో సాహసమే అని చెప్పాలి. అలాంటి సాహసమే చేశారు మలయాళ నటి రజనీ చాందీ. ఆరు పదుల వయసులో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఏడు పదుల వయసులో మోడ్రన్‌ ఫొటోషూట్‌లో మెరిసి మహిళలు తమ అభిరుచుల్ని నెరవేర్చుకోవడానికి వయసు అడ్డు కానే కాదని నిరూపించారు. ఎవరేమనుకున్నా, ఎలా కామెంట్‌ చేసినా నాకు నచ్చినట్లు నేనుంటానంటోన్న రజనీ.. వయసు మీరిన మహిళల్లో స్ఫూర్తి నింపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానంటున్నారు.

Know More

women icon@teamvasundhara
indian-american-women-get-key-roles-in-joe-biden-administration-in-telugu

బైడెన్‌ బృందంలో భారతీయ వనితలు!

బైడెన్‌-హ్యారిస్‌ ప్రమాణ స్వీకారం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఆ తరుణం ఆసన్నమైంది. ఈక్రమంలో అమెరికా చరిత్రలోనే మొదటిసారిగా ఏకంగా 20 మంది భారతీయ అమెరికన్లకు తన పాలక వర్గంలో చోటు కల్పించారు బైడెన్‌. వీరిలో 13 మంది మహిళలే కావడం విశేషం. అమెరికా జనాభాలో ఇండియన్ అమెరికన్ల వాటా ఒక శాతం కంటే తక్కువే అయినా...అమెరికా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోన్న ఈ వర్గానికి బైడెన్‌ తన యంత్రాంగంలో పెద్దపీట వేశారు. ఈ సందర్భంగా బైడెన్‌ టీంలో చోటు దక్కించుకొని అగ్రరాజ్య పాలక వ్యవహారాల్లో పాలు పంచుకునేందుకు సిద్ధపడిన ఆ ప్రవాస భారతీయ మహిళల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
kamala-harris-becomes-the-first-woman-vice-president-of-the-us

అమ్మే నా రియల్‌ హీరో.. ఎప్పటికీ నేను శ్యామల కూతురినే!

ప్రపంచానికి పెద్దన్న అని చెప్పుకునే అమెరికా రాజకీయాలంటే ప్రపంచమంతా ఆసక్తి చూపిస్తుంది. అందుకు తగ్గట్టే ఈసారి కూడా అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికలు ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపించాయి. పోలింగ్‌ మొదలుకుని మొన్నటి క్యాపిటల్‌ భవనంపై దాడి వరకూ గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా రాజకీయాలు అత్యంత ఉత్కంఠను రేకెత్తించాయి. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల కోసం భారతీయులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అందుకు కారణం ‘కమలాదేవి హ్యారిస్‌’ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారతీయ మూలాలున్న ఆమె అగ్రరాజ్య ఉపాధ్యక్షురాలయ్యారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి మహిళగా, తొలి నల్ల జాతీయురాలిగా, తొలి ప్రవాస భారతీయురాలిగా.. ఇలా ఎన్నో ప్రత్యేకతల్ని సొంతం చేసుకున్నారామె. ఈ సందర్భంగా ఉపాధ్యక్షురాలిగా అగ్రరాజ్య రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్న ఈ సూపర్‌ వుమన్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
doctor-v-shantha-renowned-indian-oncologist-passes-away-pm-modi-pays-homage

శాంతమ్మా.. ఎప్పటికీ మా గుండెల్లోనే ఉంటారు!

‘వైద్యో నారాయణో హరి’ అంటూ వైద్యులను సాక్షాత్తూ నారాయణుడి (భగవంతుడు)తో పోల్చారు మన పెద్దలు. తాము నేర్చుకున్న విద్యతో తరతమ భేదం లేకుండా సహాయం చేయమనే ‘వైద్య వృత్తి’ నిజంగానే ఎంతో పవిత్రమైనది. అలాంటి వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి, దేశ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించారు డాక్టర్‌ విశ్వనాథన్‌ శాంత. తన జీవితంలో ఏనాడూ వైద్యాన్ని వృత్తిగా, వ్యాపారంగా చూడని ఆమె... పేదలు, అణగారిన వర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఎంతో కృషి చేశారు. మందు లేని మహమ్మారి క్యాన్సర్‌పై అసమాన పోరాటం చేస్తూ లక్షలాది మంది క్యాన్సర్‌ పీడితులకు ప్రాణం పోశారు. తన జీవితంలో సుదీర్ఘకాలం పాటు రోగులకు సేవ చేసి వైద్య వృత్తికే వన్నె తెచ్చిన శాంత (93) జనవరి 19న తుదిశ్వాస విడిచారు. ఛాతీ నొప్పితో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ క్రమంలో వైద్య రంగానికి ఆమె అందించిన సేవలను స్మరించుకుంటూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు ప్రముఖులు ఆమెకు నివాళి అర్పిస్తున్నారు.

Know More

women icon@teamvasundhara
meet-jill-biden-from-teacher-to-us-first-lady-in-telugu

బైడెన్‌ ప్రేమను ఆరోసారి అంగీకరించిందట !

అర్ధాంగి అంటే భర్త జీవితంలో అర్ధ భాగం కావడమే కాదు.. వారి ప్రతి అడుగులోనూ తోడుండాలంటారు. ఈ మాటలు అమెరికా మొదటి మహిళ జిల్‌ బైడెన్‌కు అచ్చు గుద్దినట్లు సరిపోతాయి. జోతో ఏడడుగులు నడిచిన క్షణం నుంచి ఆయన మొదటి భార్య పిల్లలకు తల్లయ్యారు జిల్‌.. ఆపై అటు తన ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే.. ఇటు అమెరికా రెండో మహిళగా తన బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తించారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భర్తకు ప్రతి అడుగులోనూ తోడుంటూ జీవిత భాగస్వామికి అసలు సిసలైన అర్థం చెప్పారామె. ఎన్నికల్లో భర్త విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటూ ‘ఆయన మనందరి కుటుంబాలకు కాబోయే అధ్యక్షులు’ అంటూ ట్వీట్‌ చేసిన జిల్‌.. జో ప్రేమ ప్రతిపాదనను ఆరోసారి అంగీకరించారన్న విషయం మనలో చాలామందికి తెలియదు. అంతేనా.. ఇటు కుటుంబాన్ని, అటు వృత్తినీ బ్యాలన్స్‌ చేసుకుంటూనే.. మరోవైపు ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో సైతం భాగమయ్యారామె. మరి, అమెరికా మొదటి మహిళగా శ్వేత సౌధంలోకి అడుగుపెట్టే సందర్భంలో ఈ పవర్‌ఫుల్‌ లేడీ గురించి, జో-జిల్‌ అందమైన ప్రేమకథ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
thrissur-woman-rebuilds-chips-business-after-robbery-left-her-with-rs-100

దోపిడీలో సర్వం పోయినా హాట్‌ చిప్స్‌తో మళ్లీ లక్షలు సంపాదిస్తోంది!

‘అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది... కష్టాల వారధి దాటిన వారికి అది సొంతమవుతుంది..’ అన్నాడో సినీ కవి. ఈ మాటలు అక్షరాలా సత్యమని నిరూపిస్తోంది కేరళకు చెందిన ఓ మహిళ. లక్షలు ఆర్జించిపెడుతున్న స్వీట్ షాప్ కాస్తా దోపిడీకి గురైతే ఒక్కసారిగా రోడ్డున పడింది. అలాగని చేతకానిదానిలా ఏడుస్తూ కూర్చోలేదు. పడిలేచిన కెరటంలా రెట్టింపు వేగంతో జీవితంలో మళ్లీ ముందుకు దూసుకువచ్చింది. కష్టాలకు కుంగిపోకుండా తన సంకల్పబలంతో విజయం సాధించి వార్తల్లో నిలిచింది. అందరి జీవితాల్లో కష్టాలనేవి సర్వసాధారణమని.. అయితే వాటినే తలుచుకుంటూ కూర్చోవడం కంటే... ఆ పరిస్థితులను అధిగమించే మార్గం అన్వేషించినప్పుడే మన జీవితానికి ఓ అర్థం ఉంటుందని చెబుతూ అందరికీ స్ఫూర్తినిస్తున్న ఆ మహిళ విజయ గాథను మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
who-is-vanita-gupta?-get-to-know-joe-biden-pick-to-serve-as-us-associate-attorney-general

అందుకే ఈ లాయరమ్మకు అమెరికాలో అంత గౌరవం!

భారతగడ్డపై పుట్టి పెరిగి, విదేశాల్లో స్థిరపడి, అక్కడ వివిధ రంగాల్లో సత్తా చాటుతోన్న మహిళలు ఎందరో ఉన్నారు. ప్రవాస భారతీయులుగా శాస్ర్త, సాంకేతిక రంగాల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటూ ఉన్నత అవకాశాలను అందుకుంటున్నారు. అదేవిధంగా వివిధ దేశాల రాజకీయాల్లోనూ స్పష్టమైన ముద్ర వేసి అక్కడ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు. ఇక ప్రపంచానికి పెద్దన్న అని చెప్పుకునే అమెరికా రాజకీయాల్లో భారతీయులే కీలకంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి అగ్రరాజ్యంలో మరో భారతీయ సంతతి మహిళకు అరుదైన గౌరవం దక్కింది. ఈ క్రమంలో అమెరికా అసోసియేట్‌ అటార్నీ జనరల్‌గా భారతీయ అమెరికన్‌ న్యాయవాది వనితా గుప్తా నామినేట్‌ అయ్యారు. వనిత నియామకాన్ని సెనేట్ ఆమోదిస్తే... అమెరికా చరిత్రలో ఈ ప్రతిష్ఠాత్మక స్థానాన్ని అధిరోహించిన తొలి శ్వేత జాతీయేతర మహిళగా అరుదైన చరిత్ర సృష్టించనుంది వనిత.

Know More

women icon@teamvasundhara
breaking-another-glass-ceiling-these-women-make-history-in-telugu

మహిళా శక్తికి ప్రతిరూపాలు ఈ వనితలు!

‘పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడం అంత సులభం కాదు’...ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఏ రంగంలోనైనా మహిళలు పురుషులతో సమానంగా పనిచేసేందుకు పోటీ పడుతున్నారు. ఎంత కష్టంతో కూడిన రంగమైనా సరే...సవాళ్లకు ఎదురొడ్డి మరీ అందులో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఫుడ్‌ డెలివరీ, క్యాబ్‌ డ్రైవింగ్‌, లోకో పైలట్‌, పైలట్‌.. వంటి అధిక శారీరక శ్రమతో కూడిన రంగాల్లోనూ ఎందరో మహిళలు సమర్థంగా విధులు నిర్వర్తిస్తుండడమే ఇందుకు నిదర్శనం. ఈక్రమంలో మహిళల శక్తి సామర్థ్యాలేంటో మరోసారి ప్రపంచానికి చాటి చెబుతూ ఎయిర్‌ ఇండియా మహిళా పైలట్ల బృందం ఉత్తర ధ్రువం మీదుగా విమానం నడిపేందుకు సిద్ధపడింది. ఇక మరోవైపు పశ్చిమ రైల్వేకు చెందిన మహిళా సిబ్బంది తాజాగా గూడ్స్‌ రైలును నడిపి సరికొత్త అధ్యాయానికి తెరతీసింది.

Know More

women icon@teamvasundhara
kerala-woman-who-worked-as-part-time-sweeper-at-panchayat-office-is-now-its-president
women icon@teamvasundhara
apollo-hospitals-vice-chairperson-shobana-kamineni-cycled-600-km-her-birthday-day

అందుకే ఈ వయసులో 600 కిలోమీటర్ల సైకిల్‌ యాత్ర చేశా!

వ్యాయామం చేయడం, ఫిట్‌నెస్‌ సాధించడం.. ఇవి ఫలానా వయసుకే పరిమితమా? అంటే కాదని నిరూపిస్తున్నారు ఎందరో మహిళలు. వయసు పెరుగుతున్నా విభిన్న వ్యాయామాలు చేస్తూ, మారథాన్‌లలో పాల్గొంటూ అదరగొడుతున్నారు. అలాంటి వారిలో అపోలో హాస్పిటల్స్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ శోభనా కామినేని ఒకరు. ఇటీవలే హైదరాబాద్‌ నుంచి చెన్నైకి 600 కిలోమీటర్ల సైకిల్‌ రైడ్‌ పూర్తి చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారామె. అది కూడా తన 60వ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ ఫీట్‌ పూర్తి చేయడం విశేషం. మరి, ఈ వయసులో ఇంత సాహసం చేయడం వెనుక ఏదైనా ముఖ్య కారణముందా? అని అడిగితే.. మహిళలు తలచుకుంటే సాధించలేనిదేదీ లేదని నిరూపించడానికే ఇలా చేశానంటున్నారామె. ఈ నేపథ్యంలో ఈ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ సైకిల్‌ యాత్ర గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
story-of-karuna-singh-wife-of-lt-cdr-d-s-chauhan-soon-to-join-indian-army

పెళ్లైన 40 రోజులకే లోకం విడిచి వెళ్లారు.. అయినా నాతోనే ఉంటారు!

అందరమ్మాయిల్లాగే భవిష్యత్తు పైన ఎన్నో కలలు, ఆశయాలతో చదువు పూర్తి చేసిందామె. అదే సమయంలో కన్న తండ్రి కాలం చేయడంతో తీవ్ర నిరాశలోకి కూరుకుపోయింది. అయినా ఆ బాధలోంచి తేరుకొని మంచి ఉద్యోగం సంపాదించుకుంది. ఆపై సద్గుణవంతుడైన భాగస్వామిని భర్తగా పొందింది. వీరిద్దరి అన్యోన్యతను చూసి విధికి కన్ను కుట్టినట్లుంది. దురదృష్టవశాత్తూ పెళ్లైన 40 రోజులకే తన ఐదో తనాన్ని దూరం చేసింది. ఆ సమయంలో ‘నాకు సమస్యల మీద సమస్యలొస్తున్నాయంటే ఆ దేవుడు నన్ను ఓ గొప్ప కార్యంలో భాగం చేయాలనుకుంటున్నాడేమో!’ అనుకుందే తప్ప అధైర్యపడలేదామె. అందుకే దేశ రక్షణలో అమరుడైన తన భర్త ఆశయాన్ని భుజాలపైకెత్తుకుంది. పరీక్షలో పాసై త్వరలోనే సైన్యంలో శిక్షణ పొందేందుకు సన్నద్ధమవుతోంది. ఆమే.. ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య యుద్ధ నౌక ప్రమాదంలో అసువులు బాసిన లెఫ్టినెంట్‌ కమాండర్‌ ధర్మేంద్ర సింగ్ చౌహాన్ సతీమణి కరుణా సింగ్‌. తన కలను పక్కన పెట్టి కట్టుకున్న భర్త ఆశయం కోసం కదిలిన ఈ వీర వనిత ధీర గాథ ఆమె మాటల్లోనే..!

Know More

women icon@teamvasundhara
68-years-old-lady-earning-millions-by-making-island-in-waterlogged-fields