scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

మేడమ్.. అందుకే మీరంటే మాకిష్టం.. మీరే మాకు స్ఫూర్తి!

Unknown Facts about the great Philanthropist and Author Sudha Murthy

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఐటీ సంస్థ వ్యవస్థాపకుడికి భార్య ఆమె.. దేశంలోనే సంపన్న మహిళల్లో ఒకరిగా ఆమె స్థానం ఎప్పటికీ పదిలమే! అయినా ఓ సామాన్య మహిళలాగే సాదాసీదాగా ఉండడమంటేనే ఆమెకు ఇష్టం. డబ్బు, హోదా ఉన్నాయన్న అహంకారం, గర్వం ఇసుమంతైనా ఆమెలో కనిపించవు.
అది ఎంత పెద్ద సందర్భమైనా, మహామహులు పాల్గొనే కార్యక్రమమైనా.. సంప్రదాయ చీరకట్టులో, అదీ చాలా సింపుల్‌గానే వెళ్లడానికి ఇష్టపడతారామె.
ఇలా ఎంత చెప్పినా తరగని సద్గుణ సంపదను, నిలువెల్లా నిరాడంబరతను నింపుకొన్న ఆమెకు సమాజ సేవ చేయడమంటే మిక్కిలి మక్కువ. సందర్భం వచ్చినప్పుడల్లా అవసరార్థులకు కోట్ల రూపాయల్ని విరాళంగా అందించడానికి ఆమె ఎప్పుడూ ముందే ఉంటారు. అందుకే అందరిచేతా సేవా మూర్తిగా మన్ననలందుకుంటున్నారు. ఆమె మరెవరో కాదు.. ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ సుధా మూర్తి.
తమ సంస్థ తరఫున పేదలకు ఇళ్లు కట్టించడం దగ్గర్నుంచి.. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను ఆదుకునేదాకా అడుగడుగునా ఆమె సేవా హస్తం ఉంటుందనడం అతిశయోక్తి కాదు. మరి, ఇలాంటి సేవా మూర్తి ఓ దేవాలయం ఆవరణలో కూరగాయలు అమ్ముతున్నారంటే మీరు నమ్ముతారా? తాజాగా అలాంటి ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరలైంది. అది చూసిన వారంతా ‘సుధామూర్తి.. కూరగాయలు అమ్మడమేంటి?’ అని ముక్కున వేలేసుకున్నారు. కానీ ఆ తర్వాత అసలు నిజమేంటో తెలుసుకొని ఆమె సింప్లిసిటీకి అందరూ మరోసారి సలామ్‌ కొట్టారు. ఈ ఒక్క సందర్భమనే కాదు.. ఈ సేవా మూర్తి జీవితంలో అందరికీ ఆదర్శప్రాయమైన కోణాలు ఇంకా ఎన్నో.. ఎన్నెన్నో!

సుధా మూర్తి.. ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌గానే కాకుండా.. సందర్భం వచ్చినప్పుడల్లా అవసరార్థులను ఆదుకుంటూ తనలోని దాతృత్వాన్ని చాటుతుంటారామె. అందుకే ఆమెకు సంబంధించిన ప్రతి వార్తా ఇంటర్నెట్‌లో సెన్సేషనే! ఆమె ప్రతి ఫొటో సోషల్‌ మీడియాలో వైరలే! సుధా మూర్తికి సంబంధించిన అలాంటి ఫొటో ఒకటి తాజాగా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. ఒక దేవాలయం ఆవరణలో చుట్టూ కాయగూరలు, మధ్యలో ఆమె కూర్చున్నట్లుగా ఉన్న ఆ ఫొటో- ‘తనలోని అహంకారాన్ని త్యజించడానికి ఏడాదికో రోజు సుధా మూర్తి ఇలా కాయగూరలు అమ్ముతారు’ అన్న క్యాప్షన్‌తో ట్విట్టర్‌లో పోస్ట్‌ అయింది. ఇది చూసిన చాలామంది ‘సుధా మూర్తి ఏంటి.. కాయగూరలు అమ్మడమేంటి?!’ అని ఆశ్చర్యపోయారు. కానీ అందులో నిజానిజాలేంటో ఆ తర్వాత తెలుసుకొని ఆమె సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు.

అది నా అదృష్టం!


తాను కాయగూరల మధ్యలో కూర్చున్న మాట వాస్తవమేనని, కానీ వాటిని అమ్మట్లేదంటూ తాజాగా దాని వెనకున్న స్టోరీని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు మిసెస్‌ మూర్తి. నిజానికి ఆ ఫొటో ఇప్పటిది కాదు.. గతంలో తన ఇంటికి దగ్గర్లోని రాఘవేంద్ర మఠంలో భగవంతుడి సేవలో నిమగ్నమైనప్పుడు తీసింది అంటూ చెప్పుకొచ్చారామె.

‘మా ఇంటికి దగ్గర్లోని రాఘవేంద్ర మఠంలో ఏటా మూడు రోజుల పాటు వేడుకలు జరుగుతాయి. ఇందులో భాగంగా భక్తులకు పెద్ద ఎత్తున భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఆ భోజనాల ప్రిపరేషన్‌లో భాగంగానే కావాల్సిన కాయగూరల్ని ఎంచుకోవడానికి ఇలా మధ్యలో కూర్చున్నా. చిన్నప్పుడు మా బామ్మతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొనేదాన్ని. అలా ఏటా ఈ కార్యక్రమంలో భాగమవడం నాకు అలవాటైంది. ఇందులో ఏదో తెలియని సంతృప్తి దాగుంది. మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంటుంది. భగవంతుడి ముందు అందరూ సమానమే.. నిజానికి ఆయనకు సేవ చేసే భాగ్యం కలగడం నా అదృష్టం.

ఇక ఈ వేడుకల్లో భాగంగా మూడు రోజుల పాటు రోజూ ఉదయం 6.30 గంటలకు దేవాలయానికి చేరుకుంటా. 10 గంటల వరకు అక్కడే ఉండి ఆపై అటు నుంచి అటే ఆఫీస్‌కి వెళ్లిపోతా. 5 గంటల కల్లా ఆఫీసు పనులు ముగించుకొని 5.30 గంటల కల్లా మళ్లీ మఠానికి చేరుకుంటా. రాత్రి 10.30 గంటల దాకా దైవ సన్నిధిలో గడిపి ఆ తర్వాత ఇంటికొచ్చేస్తా. ప్రతి ఏటా ఈ రొటీన్‌నే ఫాలో అవుతున్నా. ఈ వేడుకలు నా మనసుకు ఎంతగానో హత్తుకుంటాయి..’ అంటూ తనలోని భక్తి భావాన్ని చాటుకున్నారు సుధ. ఇలా తన ఫొటో వెనకున్న అసలు కథేంటో తెలుసుకొని ఆమె దైవభక్తికి, భగవంతుడి ముందు అందరూ సమానమేనని ఆమె నమ్మే సూత్రానికి పలువురు ఫిదా అయిపోతున్నారు.

సేవ వైపు అలా అడుగులు పడ్డాయి!

sudhamurthyprofileinfo650-2.jpg

చిన్నతనం నుంచీ భగవంతుడి సేవలో తరించిపోయిన సుధ.. మానవ సేవలోనూ అంతటి సంతృప్తి దాగుందంటారు. ఈ విషయం తన కూతురి ద్వారానే తనకు అవగతమైందంటున్నారామె. ‘ప్రజలకు సేవ చేయడంలో నాకు ప్రశాంతత దొరుకుతుంది. ఆ సంతృప్తి ముందు అన్నీ దిగదుడుపే అనిపిస్తుంది. నిజానికి ఈ విషయం నా కూతురే నాకు తెలియజేసింది.

‘నీకు జీవితంలో ఎన్నో విషయాలు తెలుసు.. నువ్వెంతో అనుభవజ్ఞురాలివి. అయితే అంతిమంగా నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావ్‌? నీ జీవితానికంటూ సార్థకత ఉండాలంటే ఏం చేయాలనుకుంటున్నావ్‌?’ అని నా కూతురు నన్ను ప్రశ్నించింది. ఆ ప్రశ్నే నన్ను ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌కు బాటలు పరిచేలా చేసింది. ప్రస్తుతం సేవా కార్యక్రమాల్లో తరించేలా చేస్తోంది..’ అంటూ సేవా పథం వైపు తాను వేసిన అడుగుల గురించి చెబుతారు మిసెస్‌ మూర్తి.

1996లో తాను స్థాపించిన ‘ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్’ ద్వారా తన సేవా కార్యక్రమాలను రోజురోజుకీ విస్తరింపజేస్తున్నారామె. ఆ సంస్థలో ట్రస్టీగా కొనసాగుతున్నారు. ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత, పరిశుభ్రత, కళలు, సంప్రదాయం.. వంటి అంశాలను ప్రోత్సహిస్తూ.. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ముందుకు సాగుతోందీ సంస్థ. విద్యలో భాగంగా ఇప్పటివరకు పలు పాఠశాలల్లో 70 వేల గ్రంథాలయాలను నెలకొల్పారు మిసెస్‌ మూర్తి. అలాగే బెంగళూరు సిటీని స్వచ్ఛత బాట పట్టించేందుకు కొన్ని వందల టాయిలెట్లను ఏర్పాటు చేయించారు. ఇతర గ్రామీణ ప్రాంతాల్లోనైతే వీటి సంఖ్య 16 వేలకు పైమాటే! ఇక ఎక్కడ వరదలొచ్చినా సహాయం చేయడానికి అందరికంటే ముందు వరుసలో ఉంటారు సుధ. ఈ క్రమంలోనే వరదల్లో సర్వం కోల్పోయిన వారికి తన ఫౌండేషన్‌ ద్వారా ఇప్పటివరకు సుమారు 2,300 ఇళ్లు కట్టించి అందజేశారు.

ఆలిగా.. ఇల్లాలిగా!

sudhamurthyprofileinfo650-4.jpg

‘ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ పాత్ర తప్పకుండా ఉంటుంద’న్న మాటలు సుధా మూర్తి విషయంలో అక్షర సత్యం. తన భర్త నారాయణ మూర్తి ‘ఇన్ఫోసిస్‌ సంస్థ’ ఆలోచనతో వచ్చినప్పుడు ఆయనపై ఉన్న నమ్మకంతో మారు మాట్లాడకుండా ముంబయికి మకాం మార్చారామె. అంతేకాదు.. ఆ సమయంలో తన భర్త చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా తాను దాచుకున్న పది వేల రూపాయలు పెట్టుబడిగా అందించి గృహలక్ష్మి అనిపించుకున్నారు. అంతేకాదు.. మూడేళ్ల పాటు ఇంటి ఖర్చులు, అవసరాలన్నీ తానే చూసుకుంటానని, మీరు మాత్రం సంస్థ అభివృద్ధి పైనే పూర్తి ధ్యాస పెట్టాలంటూ ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు మిసెస్‌ మూర్తి.

అంతేకాదు.. 1960ల్లో పురుషాధిపత్యం రాజ్యమేలుతోన్న తరుణంలోనే ఇంజినీరింగ్‌ విద్యనభ్యసించి చదువుపై తనకున్న మక్కువను చాటుకున్నారామె. ఇలా తన చదువును వృథా కానీయకుండా.. ఇంటి ఆర్థిక అవసరాల కోసం వాల్‌చంద్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌లో సీనియర్‌ సిస్టమ్‌ అనలిస్ట్‌గా ఉద్యోగంలో చేరారు. మరోవైపు ఇంటి పనుల్నీ బ్యాలన్స్‌ చేసుకుంటూ ముందుకు సాగారామె. అంతటితో ఆగకుండా ఇన్ఫోసిస్‌ సంస్థను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రోగ్రామర్‌గా కూడా మారారు సుధ. ఇలా భర్తకు చేదోడువాదోడుగా నిలిచే భార్యగా, ఇంటిని నడిపించే ఇల్లాలిగా.. రెండు విధాలుగా సక్సెసయ్యారు మిసెస్‌ మూర్తి.

నిరాడంబరత ఆమె రక్తంలోనే ఉంది!

sudhamurthyprofileinfo650-3.jpg

పుట్టుకతోనే సింప్లిసిటీని పుణికిపుచ్చుకున్నారేమో అనిపిస్తుంది సుధా మూర్తిని చూస్తే! కాలేజీలో చదివే రోజుల నుంచే సంప్రదాయ చీరకట్టుకే విలువనిస్తూ వస్తోన్న సుధ.. నేటికీ అదే ఆహార్యాన్ని కొనసాగిస్తున్నారు. ఎంత ఎదిగినా మనం పాటించే విలువలే మనమేంటో చెబుతాయన్నట్లుగా.. తాను ప్రస్తుతం కోట్లకు పడగెత్తినా, దేశంలోనే అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా నిలిచినా.. సాదాసీదాగా ఉండడానికే ప్రాధాన్యమిస్తారామె. ఏ సందర్భమైనా, మహామహులు పాల్గొనే వేడుకైనా చక్కటి చీరకట్టు, నుదుటన బొట్టు, మెడలో నల్లపూసలు, సిగ.. ఇలా భారతీయత తొణికిసలాడే ఆహార్యం ఆమెకే సాధ్యమేమో అనిపించక మానదు!

‘కాశీలో పుణ్యస్నానం ఆచరించి.. మనకు నచ్చిన వస్తువులు వదిలేయడం సంప్రదాయం. అలా నా విషయంలో నేను షాపింగ్‌ని వదిలేశా.. అందులోనూ ముఖ్యంగా చీరల్ని! అలా అప్పట్నుంచి ఇప్పటిదాకా చీరలు కొనలేదు. కేవలం మరీ ముఖ్యమైన వస్తువుల్ని మాత్రమే కొంటుంటా.. చీరకట్టులోనే నాకు ఎంతో సౌకర్యవంతంగా అనిపిస్తుంటుంది. అందుకే ఇతరుల మాటలు, మన గురించి వారు ఏం ఆలోచిస్తున్నారన్న విషయాల గురించి నేను పట్టించుకోను.. నాకు కంఫర్టబుల్‌గా ఉండే వాటినే ఎంచుకుంటా..’ అంటూ తన సింప్లిసిటీని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న తన నైజాన్ని చాటుతున్నారు సుధ.

365 రోజులు.. 265 సినిమాలు!

sudhamurthyprofileinfo650-1.jpg

సుధా మూర్తి అంటే తన నిరాడంబరత, సేవా గుణమే గుర్తొస్తాయి. ఇలా తను నిరంతరాయంగా సేవలోనే తరించినా.. తనకంటూ కాస్త సమయం కేటాయించుకుంటారామె. ఈ క్రమంలోనే తనకు నచ్చిన అంశాలపై దృష్టి పెడతానని ఓ సందర్భంలో పంచుకున్నారు సుధ. ‘ఓ సోషల్‌ వర్కర్‌గా, రచయిత్రిగానే నేను మీకు తెలుసు. కానీ నా గురించి మీలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. నేనో పెద్ద సినిమా లవర్‌ని! నా హోమ్‌ థియేటర్‌లో 500లకు పైగా సినిమా డీవీడీలుంటాయి. సినిమా అంటే చాలామంది కథ, హీరో, హీరోయిన్‌.. వీటినే గమనిస్తారు. కానీ నేను అలా కాదు. వాటితో పాటు డైరెక్షన్‌, ఎడిటింగ్‌.. వంటి అన్ని కోణాల్ని పరిశీలిస్తూ సినిమాను ఎంజాయ్‌ చేస్తా. నిజానికి నేను సినిమా జర్నలిస్ట్‌ని కావాల్సింది! సినిమాలంటే నాకు అంత పిచ్చి మరి! సంవత్సరం మొత్తమ్మీద 265 సినిమాలు చూస్తా..’ అంటూ సినిమాలపై తన మక్కువను పంచుకున్నారామె. అంతేకాదు.. ఎవరైనా సరే.. తమ వృత్తిగత జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తమ వ్యక్తిగత ఆసక్తుల పైనా దృష్టి పెట్టాలని చెప్పకనే చెప్పారీ సూపర్‌ ఉమన్.

పుస్తకాల పురుగు!

మిసెస్‌ మూర్తికి పుస్తకాలంటే ఎనలేని మక్కువ. అదే తనను గొప్ప రచయిత్రిగా మలిచిందంటారామె. పిల్లల పుస్తకాల దగ్గర్నుంచి షార్ట్‌ స్టోరీస్‌, సాంకేతిక పుస్తకాలు, ట్రావెలాగ్స్‌, నవలలు, నాన్‌-ఫిక్షన్‌ పుస్తకాలెన్నో రచించిన సుధ.. అత్యుత్తమ రచయిత్రిగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఎవరింట్లో అయితే పుస్తకాలు ఉండవో వారే అసలైన పేదవారు అంటారామె.

‘మా పెళ్లైన కొత్తలో తెలిసిన వారు డిన్నర్‌కి పిలిచారు. అయితే వెళ్లడానికి ముందే నా భర్త నాతో.. ‘వాళ్లు చాలా ధనవంతులు.. వారి ఇల్లు చాలా అందంగా ఉంటుంది..’ అని చెప్పారు. వాళ్లు నాకు ఓ చీరను కూడా బహుమతిగా ఇచ్చారనుకోండి. అయితే తిరిగి ఇంటికొచ్చాక ‘వాళ్లు ధనవంతులన్నారు.. కానీ వాళ్లు చాలా బీదవారు.. ఎందుకంటే వారింట్లో ఒక్క పుస్తకం కూడా లేదు..’ అని నా భర్తకు చెప్పాను.. అంతెందుకు ఇప్పటికీ ఏదైనా ప్రత్యేక సందర్భమొస్తే పుస్తకాలే గిఫ్ట్‌గా ఇస్తుంటా..’ అంటూ పుస్తకాలపై తనకున్న ఇష్టాన్ని ఒక్క ఉదాహరణతో చెప్పేశారు సుధ. అంతేకాదు.. దాదాపు 20 వేలకు పైగా పుస్తకాలతో తన ఇంట్లో ఓ గ్రంథాలయాన్నే ఏర్పాటు చేసుకున్నారీ బుక్‌ లవర్.

ఓ కూతురిగా, భార్యగా, ఇల్లాలిగా, మానవతావాదిగా.. ఇలా ప్రతి దశలోనూ తనకు తానే సాటిగా ఎదిగారు సుధా మూర్తి. నిలువెత్తు నిరాడంబరతకు, సేవా దృక్పథానికి ఆమె మారు పేరు. అన్నిటికీ మించి బహుముఖ పాత్రల్లో ఆమె ప్రదర్శించే కార్య దక్షతను స్ఫూర్తిగా తీసుకొని విజయ శిఖరాలు అధిరోహించిన మహిళామణులెందరో! అందుకే ఆమె జీవితం ఎంతోమంది అతివలకు ఆదర్శప్రాయం..!
సెల్యూట్ మేడమ్!

women icon@teamvasundhara
women-who-got-padma-awards

‘పద్మా’ల్లా వికసించారు!

‘పద్మ’ పురస్కారాలు... ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ప్రకటించే ఈ అవార్డులను దేశంలోనే అత్యున్నతమైన పురస్కారాలుగా పరిగణిస్తారు. వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తూ, కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచిన వారికి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఈక్రమంలో 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2021 సంవత్సరానికి గానూ పద్మ అవార్డుల జాబితాను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఏడుగురికి పద్మవిభూషణ్‌, 10 మందికి పద్మభూషణ్‌, 102 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. అలా ఈ ఏడాది మొత్తం 119 మంది ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలకు ఎంపిక కాగా, అందులో 29 మంది మహిళలు ఉండడం విశేషం. మరి, ఆ మహిళామణులు, వారు అందించిన సేవల గురించి మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
womens-in-republic-day-celebrations

ఫైటర్‌ జెట్స్‌తో నింగిలో ‘త్రివర్ణ పతాకం’ రెపరెపలాడిస్తా!

చిన్నప్పటి నుంచి ఏ బొమ్మ గీసినా అందులో మువ్వన్నెల జెండా ఉండేలా చూసుకోవడం ఆమెకు అలవాటు. త్రివర్ణ పతాకంపై తనకున్న ప్రేమే ఆమెకు బోలెడన్ని బహుమతులు తెచ్చిపెట్టింది. జాతీయజెండాపై తనకున్న మమకారమే జీవితంలో ఎన్ని కఠిన సవాళ్లనైనా ఎదుర్కొనే శక్తిసామర్థ్యాలనిచ్చింది. అదే తనను భారత వైమానిక దళంలో ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా చేరేలా చేసి దేశానికి సేవలందించే సువర్ణావకాశం తెచ్చిపెట్టింది. తద్వారా దేశమంతా తన గురించి మాట్లాడుకునేలా చేసింది. ఆమే ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ స్వాతి రాథోడ్‌. ఇక ఇప్పుడు మరోసారి ఆమె గురించి దేశ ప్రజలంతా మాట్లాడుకుంటున్నారు. కారణం...గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనే అద్భుత అవకాశం ఆమె తలుపు తట్టడమే! ఈ వేడుకల్లో భాగంగా ఫైటర్‌ జెట్‌ విమానాలతో కనుల విందుగా సాగే ‘ఫ్లైపాస్ట్‌’ కవాతుకు స్వాతి నాయకత్వం వహించనుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించనుందీ డేరింగ్‌ లేడీ.

Know More

women icon@teamvasundhara
malayalam-actress-rajini-chandy-shares-her-views-about-her-latest-photshoot

అది నా ఇష్టం.. నచ్చితే స్వీకరించండి.. నచ్చకపోతే వదిలేయండి!

ఎవరైనా వయసు పైబడిన మహిళలు చీరలో కాకుండా కాస్త మోడ్రన్‌గా తయారై, మేకప్‌ వేసుకొని కనిపిస్తే.. ‘ఈ వయసులో ఈవిడకు ఇవన్నీ అవసరమా.. ఇంట్లో కృష్ణా, రామా అంటూ కూర్చోక!’ అనుకునే వారు చాలామందే! అలాంటిది ఏకంగా ఏడు పదుల వయసులో పూర్తి స్థాయి మోడ్రన్‌గా రడీ అయి ఫొటోషూట్‌ తీయించుకోవడమంటే అదో సాహసమే అని చెప్పాలి. అలాంటి సాహసమే చేశారు మలయాళ నటి రజనీ చాందీ. ఆరు పదుల వయసులో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఏడు పదుల వయసులో మోడ్రన్‌ ఫొటోషూట్‌లో మెరిసి మహిళలు తమ అభిరుచుల్ని నెరవేర్చుకోవడానికి వయసు అడ్డు కానే కాదని నిరూపించారు. ఎవరేమనుకున్నా, ఎలా కామెంట్‌ చేసినా నాకు నచ్చినట్లు నేనుంటానంటోన్న రజనీ.. వయసు మీరిన మహిళల్లో స్ఫూర్తి నింపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానంటున్నారు.

Know More

women icon@teamvasundhara
indian-american-women-get-key-roles-in-joe-biden-administration-in-telugu

బైడెన్‌ బృందంలో భారతీయ వనితలు!

బైడెన్‌-హ్యారిస్‌ ప్రమాణ స్వీకారం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఆ తరుణం ఆసన్నమైంది. ఈక్రమంలో అమెరికా చరిత్రలోనే మొదటిసారిగా ఏకంగా 20 మంది భారతీయ అమెరికన్లకు తన పాలక వర్గంలో చోటు కల్పించారు బైడెన్‌. వీరిలో 13 మంది మహిళలే కావడం విశేషం. అమెరికా జనాభాలో ఇండియన్ అమెరికన్ల వాటా ఒక శాతం కంటే తక్కువే అయినా...అమెరికా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోన్న ఈ వర్గానికి బైడెన్‌ తన యంత్రాంగంలో పెద్దపీట వేశారు. ఈ సందర్భంగా బైడెన్‌ టీంలో చోటు దక్కించుకొని అగ్రరాజ్య పాలక వ్యవహారాల్లో పాలు పంచుకునేందుకు సిద్ధపడిన ఆ ప్రవాస భారతీయ మహిళల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
kamala-harris-becomes-the-first-woman-vice-president-of-the-us

అమ్మే నా రియల్‌ హీరో.. ఎప్పటికీ నేను శ్యామల కూతురినే!

ప్రపంచానికి పెద్దన్న అని చెప్పుకునే అమెరికా రాజకీయాలంటే ప్రపంచమంతా ఆసక్తి చూపిస్తుంది. అందుకు తగ్గట్టే ఈసారి కూడా అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికలు ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపించాయి. పోలింగ్‌ మొదలుకుని మొన్నటి క్యాపిటల్‌ భవనంపై దాడి వరకూ గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా రాజకీయాలు అత్యంత ఉత్కంఠను రేకెత్తించాయి. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల కోసం భారతీయులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అందుకు కారణం ‘కమలాదేవి హ్యారిస్‌’ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారతీయ మూలాలున్న ఆమె అగ్రరాజ్య ఉపాధ్యక్షురాలయ్యారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి మహిళగా, తొలి నల్ల జాతీయురాలిగా, తొలి ప్రవాస భారతీయురాలిగా.. ఇలా ఎన్నో ప్రత్యేకతల్ని సొంతం చేసుకున్నారామె. ఈ సందర్భంగా ఉపాధ్యక్షురాలిగా అగ్రరాజ్య రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్న ఈ సూపర్‌ వుమన్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
doctor-v-shantha-renowned-indian-oncologist-passes-away-pm-modi-pays-homage

శాంతమ్మా.. ఎప్పటికీ మా గుండెల్లోనే ఉంటారు!

‘వైద్యో నారాయణో హరి’ అంటూ వైద్యులను సాక్షాత్తూ నారాయణుడి (భగవంతుడు)తో పోల్చారు మన పెద్దలు. తాము నేర్చుకున్న విద్యతో తరతమ భేదం లేకుండా సహాయం చేయమనే ‘వైద్య వృత్తి’ నిజంగానే ఎంతో పవిత్రమైనది. అలాంటి వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి, దేశ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించారు డాక్టర్‌ విశ్వనాథన్‌ శాంత. తన జీవితంలో ఏనాడూ వైద్యాన్ని వృత్తిగా, వ్యాపారంగా చూడని ఆమె... పేదలు, అణగారిన వర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఎంతో కృషి చేశారు. మందు లేని మహమ్మారి క్యాన్సర్‌పై అసమాన పోరాటం చేస్తూ లక్షలాది మంది క్యాన్సర్‌ పీడితులకు ప్రాణం పోశారు. తన జీవితంలో సుదీర్ఘకాలం పాటు రోగులకు సేవ చేసి వైద్య వృత్తికే వన్నె తెచ్చిన శాంత (93) జనవరి 19న తుదిశ్వాస విడిచారు. ఛాతీ నొప్పితో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ క్రమంలో వైద్య రంగానికి ఆమె అందించిన సేవలను స్మరించుకుంటూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు ప్రముఖులు ఆమెకు నివాళి అర్పిస్తున్నారు.

Know More

women icon@teamvasundhara
meet-jill-biden-from-teacher-to-us-first-lady-in-telugu

బైడెన్‌ ప్రేమను ఆరోసారి అంగీకరించిందట !

అర్ధాంగి అంటే భర్త జీవితంలో అర్ధ భాగం కావడమే కాదు.. వారి ప్రతి అడుగులోనూ తోడుండాలంటారు. ఈ మాటలు అమెరికా మొదటి మహిళ జిల్‌ బైడెన్‌కు అచ్చు గుద్దినట్లు సరిపోతాయి. జోతో ఏడడుగులు నడిచిన క్షణం నుంచి ఆయన మొదటి భార్య పిల్లలకు తల్లయ్యారు జిల్‌.. ఆపై అటు తన ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే.. ఇటు అమెరికా రెండో మహిళగా తన బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తించారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భర్తకు ప్రతి అడుగులోనూ తోడుంటూ జీవిత భాగస్వామికి అసలు సిసలైన అర్థం చెప్పారామె. ఎన్నికల్లో భర్త విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటూ ‘ఆయన మనందరి కుటుంబాలకు కాబోయే అధ్యక్షులు’ అంటూ ట్వీట్‌ చేసిన జిల్‌.. జో ప్రేమ ప్రతిపాదనను ఆరోసారి అంగీకరించారన్న విషయం మనలో చాలామందికి తెలియదు. అంతేనా.. ఇటు కుటుంబాన్ని, అటు వృత్తినీ బ్యాలన్స్‌ చేసుకుంటూనే.. మరోవైపు ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో సైతం భాగమయ్యారామె. మరి, అమెరికా మొదటి మహిళగా శ్వేత సౌధంలోకి అడుగుపెట్టే సందర్భంలో ఈ పవర్‌ఫుల్‌ లేడీ గురించి, జో-జిల్‌ అందమైన ప్రేమకథ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
thrissur-woman-rebuilds-chips-business-after-robbery-left-her-with-rs-100

దోపిడీలో సర్వం పోయినా హాట్‌ చిప్స్‌తో మళ్లీ లక్షలు సంపాదిస్తోంది!

‘అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది... కష్టాల వారధి దాటిన వారికి అది సొంతమవుతుంది..’ అన్నాడో సినీ కవి. ఈ మాటలు అక్షరాలా సత్యమని నిరూపిస్తోంది కేరళకు చెందిన ఓ మహిళ. లక్షలు ఆర్జించిపెడుతున్న స్వీట్ షాప్ కాస్తా దోపిడీకి గురైతే ఒక్కసారిగా రోడ్డున పడింది. అలాగని చేతకానిదానిలా ఏడుస్తూ కూర్చోలేదు. పడిలేచిన కెరటంలా రెట్టింపు వేగంతో జీవితంలో మళ్లీ ముందుకు దూసుకువచ్చింది. కష్టాలకు కుంగిపోకుండా తన సంకల్పబలంతో విజయం సాధించి వార్తల్లో నిలిచింది. అందరి జీవితాల్లో కష్టాలనేవి సర్వసాధారణమని.. అయితే వాటినే తలుచుకుంటూ కూర్చోవడం కంటే... ఆ పరిస్థితులను అధిగమించే మార్గం అన్వేషించినప్పుడే మన జీవితానికి ఓ అర్థం ఉంటుందని చెబుతూ అందరికీ స్ఫూర్తినిస్తున్న ఆ మహిళ విజయ గాథను మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
who-is-vanita-gupta?-get-to-know-joe-biden-pick-to-serve-as-us-associate-attorney-general

అందుకే ఈ లాయరమ్మకు అమెరికాలో అంత గౌరవం!

భారతగడ్డపై పుట్టి పెరిగి, విదేశాల్లో స్థిరపడి, అక్కడ వివిధ రంగాల్లో సత్తా చాటుతోన్న మహిళలు ఎందరో ఉన్నారు. ప్రవాస భారతీయులుగా శాస్ర్త, సాంకేతిక రంగాల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటూ ఉన్నత అవకాశాలను అందుకుంటున్నారు. అదేవిధంగా వివిధ దేశాల రాజకీయాల్లోనూ స్పష్టమైన ముద్ర వేసి అక్కడ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు. ఇక ప్రపంచానికి పెద్దన్న అని చెప్పుకునే అమెరికా రాజకీయాల్లో భారతీయులే కీలకంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి అగ్రరాజ్యంలో మరో భారతీయ సంతతి మహిళకు అరుదైన గౌరవం దక్కింది. ఈ క్రమంలో అమెరికా అసోసియేట్‌ అటార్నీ జనరల్‌గా భారతీయ అమెరికన్‌ న్యాయవాది వనితా గుప్తా నామినేట్‌ అయ్యారు. వనిత నియామకాన్ని సెనేట్ ఆమోదిస్తే... అమెరికా చరిత్రలో ఈ ప్రతిష్ఠాత్మక స్థానాన్ని అధిరోహించిన తొలి శ్వేత జాతీయేతర మహిళగా అరుదైన చరిత్ర సృష్టించనుంది వనిత.

Know More

women icon@teamvasundhara
breaking-another-glass-ceiling-these-women-make-history-in-telugu

మహిళా శక్తికి ప్రతిరూపాలు ఈ వనితలు!

‘పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడం అంత సులభం కాదు’...ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఏ రంగంలోనైనా మహిళలు పురుషులతో సమానంగా పనిచేసేందుకు పోటీ పడుతున్నారు. ఎంత కష్టంతో కూడిన రంగమైనా సరే...సవాళ్లకు ఎదురొడ్డి మరీ అందులో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఫుడ్‌ డెలివరీ, క్యాబ్‌ డ్రైవింగ్‌, లోకో పైలట్‌, పైలట్‌.. వంటి అధిక శారీరక శ్రమతో కూడిన రంగాల్లోనూ ఎందరో మహిళలు సమర్థంగా విధులు నిర్వర్తిస్తుండడమే ఇందుకు నిదర్శనం. ఈక్రమంలో మహిళల శక్తి సామర్థ్యాలేంటో మరోసారి ప్రపంచానికి చాటి చెబుతూ ఎయిర్‌ ఇండియా మహిళా పైలట్ల బృందం ఉత్తర ధ్రువం మీదుగా విమానం నడిపేందుకు సిద్ధపడింది. ఇక మరోవైపు పశ్చిమ రైల్వేకు చెందిన మహిళా సిబ్బంది తాజాగా గూడ్స్‌ రైలును నడిపి సరికొత్త అధ్యాయానికి తెరతీసింది.

Know More

women icon@teamvasundhara
kerala-woman-who-worked-as-part-time-sweeper-at-panchayat-office-is-now-its-president
women icon@teamvasundhara
apollo-hospitals-vice-chairperson-shobana-kamineni-cycled-600-km-her-birthday-day

అందుకే ఈ వయసులో 600 కిలోమీటర్ల సైకిల్‌ యాత్ర చేశా!

వ్యాయామం చేయడం, ఫిట్‌నెస్‌ సాధించడం.. ఇవి ఫలానా వయసుకే పరిమితమా? అంటే కాదని నిరూపిస్తున్నారు ఎందరో మహిళలు. వయసు పెరుగుతున్నా విభిన్న వ్యాయామాలు చేస్తూ, మారథాన్‌లలో పాల్గొంటూ అదరగొడుతున్నారు. అలాంటి వారిలో అపోలో హాస్పిటల్స్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ శోభనా కామినేని ఒకరు. ఇటీవలే హైదరాబాద్‌ నుంచి చెన్నైకి 600 కిలోమీటర్ల సైకిల్‌ రైడ్‌ పూర్తి చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారామె. అది కూడా తన 60వ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ ఫీట్‌ పూర్తి చేయడం విశేషం. మరి, ఈ వయసులో ఇంత సాహసం చేయడం వెనుక ఏదైనా ముఖ్య కారణముందా? అని అడిగితే.. మహిళలు తలచుకుంటే సాధించలేనిదేదీ లేదని నిరూపించడానికే ఇలా చేశానంటున్నారామె. ఈ నేపథ్యంలో ఈ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ సైకిల్‌ యాత్ర గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
story-of-karuna-singh-wife-of-lt-cdr-d-s-chauhan-soon-to-join-indian-army

పెళ్లైన 40 రోజులకే లోకం విడిచి వెళ్లారు.. అయినా నాతోనే ఉంటారు!

అందరమ్మాయిల్లాగే భవిష్యత్తు పైన ఎన్నో కలలు, ఆశయాలతో చదువు పూర్తి చేసిందామె. అదే సమయంలో కన్న తండ్రి కాలం చేయడంతో తీవ్ర నిరాశలోకి కూరుకుపోయింది. అయినా ఆ బాధలోంచి తేరుకొని మంచి ఉద్యోగం సంపాదించుకుంది. ఆపై సద్గుణవంతుడైన భాగస్వామిని భర్తగా పొందింది. వీరిద్దరి అన్యోన్యతను చూసి విధికి కన్ను కుట్టినట్లుంది. దురదృష్టవశాత్తూ పెళ్లైన 40 రోజులకే తన ఐదో తనాన్ని దూరం చేసింది. ఆ సమయంలో ‘నాకు సమస్యల మీద సమస్యలొస్తున్నాయంటే ఆ దేవుడు నన్ను ఓ గొప్ప కార్యంలో భాగం చేయాలనుకుంటున్నాడేమో!’ అనుకుందే తప్ప అధైర్యపడలేదామె. అందుకే దేశ రక్షణలో అమరుడైన తన భర్త ఆశయాన్ని భుజాలపైకెత్తుకుంది. పరీక్షలో పాసై త్వరలోనే సైన్యంలో శిక్షణ పొందేందుకు సన్నద్ధమవుతోంది. ఆమే.. ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య యుద్ధ నౌక ప్రమాదంలో అసువులు బాసిన లెఫ్టినెంట్‌ కమాండర్‌ ధర్మేంద్ర సింగ్ చౌహాన్ సతీమణి కరుణా సింగ్‌. తన కలను పక్కన పెట్టి కట్టుకున్న భర్త ఆశయం కోసం కదిలిన ఈ వీర వనిత ధీర గాథ ఆమె మాటల్లోనే..!

Know More

women icon@teamvasundhara
68-years-old-lady-earning-millions-by-making-island-in-waterlogged-fields

women icon@teamvasundhara
meet-pooja-devi-the-first-woman-bus-driver-from-jammu-and-kashmir

‘ఆడవాళ్లు బస్సు నడపడమేమిటీ' అన్నారు!

‘ఆకాశంలో సగం... అవకాశాల్లో సగం’ అంటూ ఇప్పుడు ఏ రంగంలోనైనా స్త్రీలు పురుషులతో సమానంగా పని చేసేందుకు పోటీ పడుతున్నారు. ఎంత కష్టమైనా సరే... సవాలుగా తీసుకుని మరీ ఆ రంగంలో తమ సామర్థ్యాన్ని చాటుకుంటున్నారు. శారీరక శ్రమతో కూడిన బాధ్యతలను సైతం చక్కగా నిర్వర్తిస్తున్నారీ తరం మహిళలు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే స్త్రీలపై ఎక్కువ ఆంక్షలుండే జమ్మూ కశ్మీర్‌లో తొలిసారిగా ఓ మహిళ బస్సు స్టీరింగ్ పట్టుకుంది. కుటుంబ అవసరాల కోసం తన కుమారుడిని వెంట పెట్టుకుని మరీ బస్సు నడిపింది. మరి ఇంతకీ ఎవరా మహిళ? ఎందుకు బస్సు డ్రైవర్‌గా మారిందో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
meet-usha-soman-who-makes-us-believe-that-age-is-just-a-number

ఇలాంటి 'వండర్ ఉమన్' ఉంటే ఫ్యామిలీ అంతా ఫిట్ గానే ఉంటుంది!

ఫిట్‌నెస్‌.. ఇది ఒక వయసుకే పరిమితమనుకుంటాం.. ఆ వయసులోనైతేనే విభిన్న వ్యాయామాలు చేయడానికి శరీరం సహకరిస్తుందనుకుంటాం. కానీ ఇదే ప్రశ్న ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ మిలింద్‌ సోమన్‌ తల్లి ఉషా సోమన్‌ని అడిగితే ‘ఫిట్‌నెస్‌కి వయసుతో సంబంధమేముంది? దానిపై మనసు పెడితే చాలు.. ఏ వయసులోనైనా దీన్ని మనం సొంతం చేసుకోవచ్చు..’ అని నిర్మొహమాటంగా చెబుతారామె. ‘వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే!’ అనే ఫిలాసఫీని నమ్మే ఈ ఫిట్‌నెస్‌ ఔత్సాహికురాలు 81 ఏళ్ల వయసులోనూ ఎలాంటి వ్యాయామమైనా అలవోకగా చేసేస్తుంటారు. అది కూడా సంప్రదాయ చీరకట్టులో చేస్తూ అందరినీ ఒకింత అబ్బురపరుస్తారు!

Know More

women icon@teamvasundhara
a-woman-farmer-on-why-she-is-protesting-at-delhi-border

women icon@teamvasundhara
meet-the-woman-behind-ipo-star-mrs-bectors-food-specialities

ఈ బిస్కట్ల రారాణి విజయగాథ విన్నారా?

‘ఆడపిల్లలకు చదువెందుకు.. ఉద్యోగమెందుకు..? హాయిగా పెళ్లి చేసుకొని భర్తను, పిల్లల్ని, కుటుంబాన్ని చూసుకోక!’ అనే రోజులవి! అలాంటి ఆలోచనలతోనే ఆమెను 17 ఏళ్ల వయసులోనే ఓ అయ్య చేతిలో పెట్టారు ఆమె తల్లిదండ్రులు! కానీ ఆమెకేమో బాగా చదువుకోవాలి, ఏదైనా కొత్తగా చేయాలన్న తపన ఉండేది. ఇందుకు అత్తింటి వాళ్లు అడ్డు చెప్పినా.. భర్త మాత్రం తన పూర్తి సహకారం అందించారు. అలా నాడు బేకింగ్‌లో ప్రయోగాలు చేస్తూ తన పెరట్లోనే చిన్న బేకరీ షాపుగా ప్రారంభమైన ఆమె వ్యాపారం.. నేడు ఉత్తర భారతదేశంలోనే దిగ్గజ సంస్థగా ఎదిగింది. దేశంలో ఓ ట్రేడ్‌మార్క్గా ఎదగడమే కాదు.. మేటి అంతర్జాతీయ బ్రాండ్లకు ముడిసరుకుల్ని పంపిణీ చేసే స్థాయికి చేరుకుంది. ఇదంతా ఆమె కృషి, పట్టుదల వల్లే సాధ్యమైంది. కాబట్టే నేడు ఈ కంపెనీ షేర్లు స్టాక్‌మార్కెట్లో లిస్ట్‌ అయ్యాయి. పబ్లిక్ ఇష్యూ నుంచి వందల కోట్లు సేకరించడమే కాదు.. ఈ ఏడాది అత్యధికంగా సబ్‌స్క్రైబ్‌ అయిన ఐపీవోల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది కూడా! ఆ దిగ్గజ సంస్థే ‘మిసెస్‌ బెక్టార్‌ - క్రీమికా’. విదేశీ బ్రాండ్ల పోటీని తట్టుకొని దేశీయ మార్కెట్లో ఈ సంస్థను అగ్రగామిగా నిలిపిన ఘనత ఈ సంస్థ అధినేత్రి రజనీ బెక్టార్‌దే!

Know More

women icon@teamvasundhara
ankita-gaur-five-month-pregnant-mom-to-be-finishes-tcs-work-10k-bengaluru

ఐదు నెలల గర్భంతో పది కిలోమీటర్లు పరిగెత్తా!

నెలలు నిండుతున్న కొద్దీ అతి సుకుమారంగా తయారవుతుంటారు గర్భిణులు. కడుపులోని బిడ్డకు అసౌకర్యంగా ఉంటుందేమోనన్న ఉద్దేశంతో కొన్ని కఠినతరమైన పనులు చేయడానికి సంకోచిస్తుంటారు. ఇక ఈ సమయంలో వ్యాయామం మంచిదని చెప్పినా దాని జోలికి వెళ్లని వారూ లేకపోలేదు. ఇంట్లో ఉండే కొందరు పెద్ద వాళ్లు కూడా గర్భిణులు ఏది చేస్తామన్నా ససేమిరా అంటుంటారు. కానీ వీటన్నింటినీ అధిగమించి వ్యాయామాలు చేస్తూ, మారథాన్‌లలో పాల్గొంటూ నలుగురిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నారు ఈ తరం మహిళలు. అలాంటి వారిలో ఒకరే బెంగళూరుకు చెందిన అంకితా గౌర్‌. ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి అయిన ఆమె తాజాగా టీసీఎస్‌ వరల్డ్‌ 10కె రన్‌లో పాల్గొంది. గంటలోనే పది కిలోమీటర్లు పరుగెత్తి.. గర్భంతో ఉన్న వారికి పరుగు మంచి వ్యాయామమని చాటుతోంది. తొమ్మిదేళ్లుగా పరుగునే ఊపిరిగా మార్చుకున్నానని, ఆ ఉత్సాహమే గర్భంతోనూ తనను పరిగెత్తేలా చేసిందని చెబుతోన్న ఈ న్యూ మామ్‌ తన గురించి ఏం చెబుతుందో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
baloch-activist-gender-inequality-critic-karima-baloch-found-dead-in-canada

అందుకే కరీమా ఎప్పటికీ ఓ హీరోనే!

పరువు పేరుతో హత్యలు చేయడం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, లింగ వివక్ష, ప్రసూతి మరణాలు, అత్యాచారాలు, యాసిడ్‌ దాడులు.. ఇలా చెప్పుకుంటూ పోతే మహిళల్ని ఓ గడ్డి పరకలా భావిస్తుంటారక్కడ! ఒకవేళ వీటిని ఎదిరిస్తే వారికి మరణ శాసనం తప్పదు. మహిళల పట్ల ఇంతటి క్రూరమైన వివక్ష ఉంది కాబట్టే పాక్‌ ఆక్రమిత బలోచిస్థాన్‌ స్త్రీలకు అసురక్షితమైన ప్రదేశాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఇలాంటి చోటే పుట్టి పెరిగింది కరీమా బలోచ్‌. అయితే అందరు మహిళల్లా అణిగిమణిగి ఉండాలనుకోలేదామె. మహిళా హక్కులపై ఉద్యమించింది.. అక్కడి మహిళలు ఎదుర్కొంటోన్న దుస్థితిని అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టింది. అలాంటి ఉద్యమకారిణి గొంతు నేడు మూగబోయింది. 2016 నుంచి కెనడాలో శరణార్థిగా ఉంటోన్న కరీమా రెండు రోజుల క్రితం హత్యకు గురైంది. అయితే దీని వెనుక పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ హస్తం ఉందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా మహిళలకు న్యాయం జరగాలని ముక్తకంఠంతో నినదించిన ఈ ఉద్యమకారిణి తన కొన ఊపిరిదాకా అదే పట్టుదలను కొనసాగించడం ఆమె ధైర్యానికి ప్రతీక!

Know More

women icon@teamvasundhara
meet-the-chief-justice-of-telangana-high-court-here-is-hima-kohli-story

మనకే కాదు.. ప్రకృతికీ న్యాయం జరగాలంటారామె!

మనదేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల గురించి అడిగితే పురుషుల పేర్లే ఎక్కువగా వినిపిస్తాయి. సంచలనమైన తీర్పులు ఇచ్చిన సందర్భంలో మినహా.. మహిళా న్యాయమూర్తుల గురించి పెద్దగా బయటికి తెలియదు. అయినప్పటికీ తమ అచంచల ప్రతిభాపాటవాలతో.. ఈ రంగంలో కొందరు ఉన్నత స్థానాలకు చేరుకొంటున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ధర్మాసనాల్లో జడ్జిలుగా కొనసాగుతున్నారు. హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తి స్థాయికి ఎదుగుతున్నారు. ఆ కోవకే చెందుతారు తాజాగా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితురాలైన జస్టిస్‌ హిమా కోహ్లీ. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించనున్న తొలి మహిళ ఆమెనే కావడం విశేషం. ఈ సందర్భంగా ఈ సీనియర్‌ మహిళా జడ్జి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
nepals-female-soldiers-break-taboos-to-tackle-covid-crisis
women icon@teamvasundhara
ips-ankita-sharma-teaches-students-studying-upsc-so-that-their-dreams-are-not-left-incomplete-due-to-poverty

ఈ లేడీ సింగం.. అమ్మాయిల సివిల్స్ కలను నెరవేర్చే టీచరమ్మ కూడా!

ఐఏఎస్‌, ఐపీఎస్‌.. వంటి దేశ అత్యున్నత ప్రభుత్వోద్యోగాల్లో చేరాలన్న కల ప్రతి ఒక్కరికీ ఉంటుంది. సవాళ్లను ఎదుర్కొంటూ, ఓటమిని జయిస్తూ ముందుకు సాగితేనే ఈ కొలువులు మన సొంతమవుతాయి. అయితే వీటిలో విజయం సాధించిన కొంతమంది ‘హమ్మయ్య.. నా కల నెరవేరింది’ అని సంతృప్తి పడిపోతే.. ఇంకొందరేమో తనలా మరికొందరు కూడా తమ కలల్ని నెరవేర్చుకోవాలని ఆకాంక్షిస్తుంటారు. ఈ క్రమంలో తమలో ఉన్న విజ్ఞానాన్ని నలుగురికీ పంచుతుంటారు. ఇందుకు అసలు సిసలైన ఉదాహరణే ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పూర్‌కు చెందిన పోలీసాఫీసర్‌ అంకితా శర్మ. సివిల్స్‌ ప్రిపరేషన్‌ కోసం వేలకు వేలు డబ్బులు పోసే స్థోమత లేని అమ్మాయిల్ని చేరదీసి తానే ఉచితంగా కోచింగ్‌ ఇస్తున్నారామె. అది కూడా ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్లో కూడా! ఓవైపు వృత్తిపరంగా నేరస్థుల గుండెల్లో గుబులు రేపుతోన్న ఈ సూపర్‌ కాప్‌.. ఇటు టీచర్‌గా మారి ఎందరో విద్యార్థుల కలల్ని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారు. తాను చదువుకునే రోజుల్లో ఎదుర్కొన్న సవాళ్లే తనను ఈ దిశగా నడిపించాయంటోన్న ఈ మహిళా పోలీసాఫీసర్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
hcl-tech-chief-roshini-nadar-malhotra-india’s-wealthiest-woman-here-is-the-full-list

దేశంలో అత్యంత సంపన్న మహిళలు వీరే!

రంగమేదైనా మహిళలు తమ పూర్తి స్థాయి ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తూ అందులో తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు. ప్రత్యేకించి వ్యాపార రంగంలో తమదైన మెలకులను ప్రదర్శిస్తున్నారు కొందరు అతివలు. ప్రతికూల పరిస్థితులు, సవాళ్లను ఎదుర్కొని గ్రేట్‌ బిజినెస్‌ వుమన్‌గా పేరు తెచ్చుకుంటున్నారు. అంతేకాదు ఎక్కువ మొత్తంలో ఆదాయం ఆర్జిస్తూ అత్యంత సంపన్నమైన మహిళలుగా సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో దేశంలో అత్యంత సంపన్న మహిళలందరినీ ఒక చోట చేర్చుతూ కోటక్‌ వెల్త్‌-హురన్ ఇండియా సంయుక్తంగా ఓ జాబితా రూపొందించింది. ‘కోటక్‌ వెల్త్‌ హురున్‌-లీడింగ్‌ వెల్దీ వుమెన్‌ 2020’ పేరుతో మొత్తం 100 మంది భారతీయ సంపన్న మహిళల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో హెచ్‌సీఎల్‌ ఛైర్‌పర్సన్‌ రోష్నీ నాడార్‌ అగ్రస్థానంలో నిలిచారు.

Know More

women icon@teamvasundhara
para-badminton-player-manasi-joshi-recalls-the-day-she-lost-her-leg-reflects-on-how-her-life-has-changed

అవకాశమొస్తే ఆ జీవితాన్నే ఎంచుకుంటా!

భవిష్యత్తుపై బోలెడు ఆశలు పెట్టుకున్న ఆమెను 22 ఏళ్లకే విధి వెక్కిరించింది. ఒంటికాలితో జీవితాన్ని అంధకారం చేయాలనుకుంది. అయితే కష్టాలు, కన్నీళ్లు ఆమెను మరింత కఠినంగా మార్చాయి. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని అందించాయి. అందుకే కృత్రిమ కాలితోనే బ్యాడ్మింటన్‌ రాకెట్‌ పట్టుకుని బరిలోకి దిగింది. మొండి పట్టుదలతో పతకాల జోరు కొనసాగించింది. ఆమే పారా అథ్లెట్‌ మానసి జోషి. ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు’ అన్న మాటలకు కచ్చితమైన ఉదాహరణగా నిలిచే మానసి.. సరిగ్గా నిల్చోవడానికి కాలు లేకపోయినా పారా బ్యాడ్మింటన్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. దేశానికి పతకాల పంట పండిస్తోంది. తన పోరాట స్ఫూర్తితో ఎంతోమంది అమ్మాయిలు, తనలాంటి దివ్యాంగుల్లో స్ఫూర్తి నింపుతోంది.

Know More

women icon@teamvasundhara
sania-mirza-writes-emotional-ode-to-all-mothers-in-viral-post

ఇజాన్ పుట్టాకే అవన్నీ నాకు అర్థమయ్యాయి!

అమ్మతనం.. ఈ లోకంలో అన్నింటికంటే అమూల్యమైనది. స్వయంగా అనుభవిస్తే తప్ప అందులో ఉన్న కమ్మదనాన్ని మనం ఆస్వాదించలేం. అంతేకాదు.. బాధ్యత, ఓపిక, మనల్ని మనం ప్రేమించుకోవడం, నిస్వార్థమైన ప్రేమను పంచడం.. ఇలా ఎన్నో విషయాలు నేర్పుతుందీ అద్భుతమైన భావన. ఇలాగే అమ్మతనం తననీ ఓ మంచి మనిషిని చేసిందంటోంది హైదరాబాదీ టెన్నిస్ స్టార్‌ సానియా మీర్జా. రెండేళ్ల క్రితం ఇజాన్‌కు జన్మనిచ్చిన ఈ సూపర్‌ మామ్‌.. ఆ తర్వాత ఎంతో కష్టపడి ఫిట్‌గా మారి ఈ ఏడాది కోర్టులోకి అడుగుపెట్టింది. రెండో ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచి తల్లయ్యాకా మహిళలు తమ కెరీర్‌లో దూసుకుపోగల సమర్థులు అని నిరూపించింది. ఇలా తన పోస్ట్‌ ప్రెగ్నెన్సీ జర్నీకి అమెరికన్‌ టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ స్ఫూర్తి అంటూ తాజాగా ఓ సుదీర్ఘ లేఖ రాసింది సానియా. అమ్మతనం తనకు అందించిన అనుభవాలు, ప్రసవానంతరం బరువు తగ్గడం, సెరెనా తనలో ప్రేరణ నింపిన విధానం, వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌.. ఇలా ఎన్నెన్నో విషయాలు రంగరించి రాసిన ఆ లేఖ సోషల్‌ మీడియాలో వైరలవడమే కాదు.. ఎంతోమంది తల్లుల్లో స్ఫూర్తి నింపుతోంది.

Know More

women icon@teamvasundhara
things-to-know-about-anupa-das-third-woman-to-become-a-crorepati-in-kbc-season-12

ఈ కోటి రూపాయలతో మా అమ్మను క్యాన్సర్‌ నుంచి కాపాడుకుంటా!

కౌన్ బనేగా కరోడ్పతి... 20 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ షోకు నేటికీ ఏ మాత్రం క్రేజ్‌ తగ్గలేదు. బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ బుల్లితెర కార్యక్రమంలో పాల్గొనాలని, హాట్ సీట్ వరకు చేరుకోవాలని ఎంతోమంది ప్రయత్నిస్తారు. ఈ షో ద్వారా వచ్చిన పేరు, ప్రైజ్‌ మనీతో తమ కలలను సాకారం చేసుకోవాలని అనుకుంటారు. కానీ ఆ అదృష్టం కొందరికే దక్కుతుంది. అలాంటి వారిలో ఒకరు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అనూపాదాస్. వృత్తిరీత్యా టీచర్‌ అయిన ఆమె ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి అంటే గత 20 ఏళ్లుగా దీనిలో పాల్గొనాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తాజాగా తన కలను సాకారం చేసుకోవడమే కాకుండా ఏకంగా కోటి రూపాయలు గెలుచుకుంది.

Know More

women icon@teamvasundhara
farah-khan-writes-open-letter-on-choosing-to-become-mom-at-43-via-ivf

ఆ విషయంలో నా మనసు చెప్పిందే విన్నా.. దాన్నే లాక్ చేశా!

‘లోకులు కాకులు.. అవసరం ఉన్నా లేకపోయినా ఇతరుల విషయాల్లో తలదూర్చుతుంటారు. పెళ్లి, పిల్లలు, కెరీర్‌.. ఇలా అన్ని విషయాల్లో నిర్ణయాధికారం వారిదే అన్నట్లుగా మాట్లాడతారు.. అయితే ఇలా ఎవరెన్ని చెప్పినా మీరు మాత్రం మీ మనసు చెప్పిందే వినండి..!’ అంటున్నారు ప్రముఖ దర్శకనిర్మాత ఫరా ఖాన్‌. 43 ఏళ్ల వయసులో ఐవీఎఫ్‌ ద్వారా ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన ఈ సెలబ్రిటీ మామ్‌.. వయసుకు, పిల్లల్ని కనడానికి సంబంధం లేదంటున్నారు. సైన్స్‌ అభివృద్ధి చెందుతోన్న ఈ కాలంలో తమకు నచ్చినప్పుడు, అందుకు మానసికంగా సిద్ధమైనప్పుడు పిల్లల్ని కనొచ్చంటున్నారు. ఈ నేపథ్యంలో తన ఐవీఎఫ్‌ స్టోరీని, ఈ క్రమంలో తనకెదురైన అనుభవాలను గుదిగుచ్చి ఓ సుదీర్ఘ లేఖ రాశారామె. వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ గురించి మహిళలందరికీ దిశానిర్దేశం చేసేలా ఉన్న ఈ లేఖ సారాంశమేంటో తెలుసుకుందాం రండి..

Know More