scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

ఈ 80 ఏళ్ల టీచరమ్మ ఆన్‌లైన్‌లో పాఠాలు చెబుతోంది!

Ambuja Iyer, This 80 years old teaching mathematics online during this pandemic

Photo: Facebook

గణితం.. ఎంత సులభమైన పద్ధతుల్లో వివరించినా ఇది కఠినమైన సబ్జెక్టే అనేది చాలామంది భావన. అయితే దాన్ని విద్యార్థులకు ఇష్టమైన సబ్జెక్టుగా మార్చే బాధ్యత టీచర్లదే అంటున్నారు బెంగళూరుకు చెందిన అంబుజా అయ్యర్‌. ప్రస్తుతం దిల్లీలో నివసిస్తోన్న ఈ 80 ఏళ్ల టీచరమ్మ.. తన 50 ఏళ్ల టీచింగ్‌ కెరీర్‌లో కొన్ని వేలమంది విద్యార్థుల్ని గణితంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దారు. హాయిగా విశ్రాంతి తీసుకోవాల్సిన ఈ మలివయసులోనూ ఆన్‌లైన్‌లో పిల్లలకు పాఠాలు బోధిస్తూ.. వృత్తిని కొనసాగించడానికి వయసుతో పనేముంది అని నిరూపిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ నేపథ్యంలో బడులన్నీ మూతపడడంతో ఆన్‌లైన్‌లో పాఠాలు చెబుతోన్న ఈ మ్యాథ్స్‌ టీచర్‌.. డిజిటల్‌ వేదికగా సులభంగా ఎలా పాఠాలు చెప్పాలో సంబంధిత చిట్కాల్ని కూడా ఇతర టీచర్లకు అందిస్తున్నారు. మరి, మలి వయసులోనూ మ్యాథ్స్‌పై తనకున్న మక్కువను చూపుతూ, వృత్తి పట్ల తన అంకితభావాన్ని చాటుతోన్న ఈ ఆదర్శ గురువు గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం రండి..
మార్చి నుంచి మన దేశంలో పాగా వేసింది మాయదారి మహమ్మారి కరోనా వైరస్‌. దీంతో ఉద్యోగాలు పోయిన వారు ఎంతలా బాధపడ్డారో.. స్కూలుకెళ్లే చిన్నారులూ అంతే దిగాలు పడ్డారు. కారణం.. ఓవైపు పరీక్షలు వాయిదా పడుతూ చివరికి రద్దు కావడం.. తదుపరి విద్యా సంవత్సరం ఎప్పట్నుంచి ప్రారంభమవుతుందో తెలియక వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇలాంటి పరిస్థితుల్లో నేనున్నానంటూ విద్యార్థులందరికీ అండగా నిలుస్తున్నారు 80 ఏళ్ల అంబుజా అయ్యర్‌. ప్రస్తుతం బడులన్నీ మూతపడడంతో 6-10 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌లోనే గణితం బోధిస్తూ వారికి ఈ సబ్జెక్ట్‌పై పట్టు సడలకుండా ఓ టీచర్‌గా తనవంతు సహకారం అందిస్తున్నారు.

అందుకే పైచదువులకు నోచుకోలేదు!
బెంగళూరుకు చెందిన అయ్యర్‌ 17 ఏళ్లకే డిగ్రీ పూర్తిచేశారు. చిన్నతనం నుంచి చదువునే ప్రాణంగా ప్రేమిస్తూ మంచి ప్రతిభ కనబరిచిన ఆమెకు.. ఆ పైచదువుల కోసం ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ నుంచి ఆహ్వానం అందింది. దీంతో ఎంతో సంతోషించిన ఆమె ఆశలన్నీ తృటిలోనే ఆవిరయ్యాయి. అదే సమయంలో ఆమె తండ్రి చనిపోవడంతో కుటుంబ భారమంతా అయ్యర్‌పైనే పడింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు కూడా అంతంతమాత్రంగానే ఉండడంతో యుక్తవయసులోనే ఉద్యోగ ప్రయత్నాలకు పూనుకున్నారామె. దీంతో ఆమెకు ఓ స్కూల్‌లో సబ్‌స్టిట్యూట్‌ టీచర్‌గా తొలి ఉద్యోగం లభించింది. అలా ఆ స్కూల్‌లో గణితం బోధించే టీచర్‌ రానప్పుడల్లా అయ్యర్‌తో జామెట్రీ (రేఖాగణితం) చెప్పించేది స్కూల్ యాజమాన్యం. ఈ క్రమంలోనే టీచింగ్‌ రంగంలో ఉన్న అసలు మజా ఏంటో అర్థం చేసుకున్న అయ్యర్‌.. అదే తన అంతిమ గమ్యమని తెలుసుకున్నారు.. పూర్తి స్థాయి టీచర్‌గా మారాలని నిర్ణయించుకున్నారు.
50 ఏళ్లు.. 50 వేల మంది..!
అలా పూర్తిస్థాయి మ్యాథ్స్‌ టీచర్‌గా మారిన అయ్యర్‌.. ఆపై పలు పాఠశాలలు/కళాశాలల్లో 50 ఏళ్ల పాటు టీచర్‌గా పనిచేశారు. ఈ క్రమంలో సుమారు 50వేల మందికి పైగా విద్యార్థులకు గణితం బోధించారు.. మ్యాథ్స్‌ని కఠినమైన సబ్జెక్టుగా భావించే ఎంతోమందిని ఇందులో నిష్ణాతులుగా తీర్చిదిద్దారు. ఉపాధ్యాయులు చెప్పే ప్రతి విషయం విద్యార్థులకు ఆ సమయంలోనే కాదు.. భవిష్యత్తులోనూ ఉపయోగపడాలని, వారు ఉన్నత స్థితికి ఎదిగేందుకు దోహదపడాలని అంటారామె.

‘మన సమాజంలో టీచర్లకు ఓ ప్రత్యేకమైన స్థానం, గౌరవం ఉన్నాయి. ఒక టీచర్‌గా పిల్లలకు బోధించే ప్రతి విషయం వారికి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు పనికొస్తుంది. వారు ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు దోహదం చేస్తుంది. నిజానికి పిల్లలందరూ టీచర్లు చెప్పే విషయాలను గుర్తుపెట్టుకొని ఆచరించి ఉన్నత స్థితికి చేరుకుంటే అదే వారు టీచర్లకిచ్చే అసలైన గురుదక్షిణ. ఉపాధ్యాయులు కూడా అదే కోరుకుంటారు..’ అంటారు అయ్యర్.

ఆ తపనే కావాలి!
ఇక గణితం అంటే చాలామంది భయపడతారని, ఆ భయాన్ని పొగొట్టే బాధ్యత టీచర్లదే అంటారామె. ‘బోధన అనేది తరగతి గది, కులం, మతం, జాతి, చర్మ ఛాయ.. వీటన్నింటికీ అతీతం. అలాగే చాలామంది గణితం అంటేనే భయపడిపోతారు. ఎంత చేసినా దాన్ని నేర్చుకోవడం అసాధ్యం అని భావిస్తుంటారు. ఇలా పిల్లల్లో గణితం పట్ల ఉన్న భయాన్ని పోగొట్టే బాధ్యతను టీచర్లే తమ భుజాలపై వేసుకోవాలి. మ్యాథ్స్‌పై ఇష్టంతో ఆ సబ్జెక్ట్‌ నేర్చుకోవడానికి చాలామంది పేద పిల్లలు నా దగ్గరికి వస్తుంటారు. నిజానికి వారి కళ్లలో నేర్చుకోవాలన్న తపన చూస్తేనే నాకు ఎంతో ప్రోత్సాహకరంగా అనిపిస్తుంటుంది. ఇంకా ఇంకా బోధించాలన్న ఆసక్తిని నాలో పెంచుతుంది. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎంతో ఆసక్తిగా, సులభంగా ఆన్‌లైన్‌ క్లాసులు తీసుకోవడానికి కూడా విద్యార్థుల్లో ఉన్న ఈ తపనే నన్ను ముందుకు నడిపిస్తోంది..
ఇక నేను టీచర్‌గా పనిచేసినప్పుడు కూడా పిల్లలకు హోమ్‌వర్క్‌ ఇవ్వకపోయేదాన్ని. ఆ పనేదో వాళ్లతో స్కూల్లోనే పూర్తి చేయించి ఇంటికి పంపించేదాన్ని. ఫలితంగా ఏమైనా సందేహాలుంటే తరగతి గదిలోనే నివృత్తి అయ్యేవి.. ఇది క్రమంగా ఆ సబ్జెక్ట్‌పై ఆసక్తిని పెంచి భయమన్న మాటను వారి నుంచి దూరం చేస్తుంది..’ అంటారు అయ్యర్.

ఉచితంగా క్లాసులు!
50 ఏళ్లుగా టీచింగ్‌ రంగంలో కొనసాగిన ఆమె.. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో స్కూల్స్‌ అన్నీ మూతపడడంతో ఆన్‌లైన్‌లోనే విద్యార్థులకు ఉచితంగా పాఠాలు బోధిస్తున్నారు. ఈ క్రమంలోనే ‘మ్యాథ్ మ్యాజిక్‌ అంబుజా అయ్యర్‌’ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించి దాని ద్వారా 6-10 తరగతుల విద్యార్థులకు గణితం బోధిస్తున్నారు అయ్యర్‌. దీనికి సంబంధించిన మెటీరియల్‌ని ముందుగానే సిద్ధం చేసుకొని, తన టైపిస్ట్‌తో టైప్‌ చేయించుకొని అన్ని విధాలుగా సన్నద్ధమయ్యాకే సెషన్‌ మొదలుపెడతారీ గ్రేట్‌ టీచర్‌. ‘ఒక టీచర్‌గా నా జర్నీ అద్భుతంగా సాగింది.. ఈ క్రమంలో నేను ఎంతో సాధించానని తెలిసినా ఇంతటితో ఈ ప్రయాణాన్ని ఆపను. ఇకపై కూడా ఇదే ఉత్సాహంతో, తపనతో మరింత మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దుతా..’ అంటూ సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు అయ్యర్.

టీచర్లకూ పాఠాలు!

ప్రస్తుత పరిస్థితుల్లో అయ్యర్‌ విద్యార్థులకే కాదు.. టీచర్లకూ పాఠాలు బోధిస్తున్నారు. ఇప్పటిదాకా తరగతి గదికే పరిమితమైన వారు ఒక్కసారిగా ఆన్‌లైన్‌ బోధన అనే సరికి ఇబ్బంది పడిపోతున్నారని, కొన్ని మెలకువలు నేర్చుకుంటే డిజిటల్‌ బోధన ఎంతో సులభం అంటున్నారీ టీచరమ్మ. 
‘గణితం పట్ల విద్యార్థుల్లో నెలకొన్న భయాన్ని తొలగించాలనుకున్న నేను ఆ దిశగా సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతున్నా. అయితే ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో ఆన్‌లైన్‌ విద్యావిధానం అతిపెద్ద సవాలుగా మారింది. అప్పటిదాకా తరగతి గదికే పరిమితమై పాఠాలు చెప్పిన టీచర్లు ఒక్కసారిగా డిజిటల్‌ తరగతులు అనేసరికి అందులో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ బోధన ఆన్‌లైన్‌ అయినా, ఆఫ్‌లైన్‌ అయినా పెద్ద తేడా ఏమీ ఉండదు.. అయితే పిల్లలకు ఎంత ఆసక్తిగా, క్రియేటివ్‌గా బోధిస్తున్నారన్నదే ఇక్కడ ముఖ్యం.. ఈ క్రమంలో వారిలో ఎంత ఆత్మవిశ్వాసం నింపుతున్నారన్నదే కీలకం..’ అంటూ టీచర్లకూ గైడ్‌ చేస్తున్నారు అయ్యర్‌. ఇందుకోసం ‘మ్యాథ్‌ ఫోరం’ పేరుతో వాట్సాప్‌లో ఓ గ్రూప్‌ క్రియేట్‌ చేసి.. దాని ద్వారా టీచర్లకు ఆన్‌లైన్‌ బోధనకు సంబంధించిన సలహాలు, సూచనలు అందిస్తున్నారామె. 50 మంది టీచర్లతో ప్రారంభమైన ఈ గ్రూప్‌లో ప్రస్తుతం 200 మంది సభ్యులున్నారు. ఇలా మన దేశంలోనే కాదు.. దుబాయ్‌, యూఎస్‌ఏ, యూకే, ఇండోనేషియా.. వంటి ఇతర దేశాల్లో ఉన్న టీచర్లకూ టీచింగ్‌ మెలకువలు నేర్పుతున్నారీ గ్రేట్‌ టీచరమ్మ.

తన 50 ఏళ్ల టీచింగ్‌ కెరీర్‌లో ఎంతోమంది విద్యార్థుల్ని ఉన్నత విద్యావంతుల్ని చేసి, గణితమంటే వారిలో ఉన్న భయాన్ని పోగొట్టిన ఈ టీచరమ్మ.. మలి వయసులోనూ తన వృత్తి పట్ల మక్కువ వీడలేదు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లోనూ విద్యార్థులకు పాఠాలు చెబుతూ, ఇటు టీచర్లనూ గైడ్‌ చేస్తూ ‘గురువు’ అన్న పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు అయ్యర్!

హాట్సాఫ్‌ ది గ్రేట్‌ టీచర్!





women icon@teamvasundhara
indian-american-women-get-key-roles-in-joe-biden-administration-in-telugu

బైడెన్‌ బృందంలో భారతీయ వనితలు!

బైడెన్‌-హ్యారిస్‌ ప్రమాణ స్వీకారం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఆ తరుణం ఆసన్నమైంది. ఈక్రమంలో అమెరికా చరిత్రలోనే మొదటిసారిగా ఏకంగా 20 మంది భారతీయ అమెరికన్లకు తన పాలక వర్గంలో చోటు కల్పించారు బైడెన్‌. వీరిలో 13 మంది మహిళలే కావడం విశేషం. అమెరికా జనాభాలో ఇండియన్ అమెరికన్ల వాటా ఒక శాతం కంటే తక్కువే అయినా...అమెరికా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోన్న ఈ వర్గానికి బైడెన్‌ తన యంత్రాంగంలో పెద్దపీట వేశారు. ఈ సందర్భంగా బైడెన్‌ టీంలో చోటు దక్కించుకొని అగ్రరాజ్య పాలక వ్యవహారాల్లో పాలు పంచుకునేందుకు సిద్ధపడిన ఆ ప్రవాస భారతీయ మహిళల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
kamala-harris-becomes-the-first-woman-vice-president-of-the-us

అమ్మే నా రియల్‌ హీరో.. ఎప్పటికీ నేను శ్యామల కూతురినే!

ప్రపంచానికి పెద్దన్న అని చెప్పుకునే అమెరికా రాజకీయాలంటే ప్రపంచమంతా ఆసక్తి చూపిస్తుంది. అందుకు తగ్గట్టే ఈసారి కూడా అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికలు ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపించాయి. పోలింగ్‌ మొదలుకుని మొన్నటి క్యాపిటల్‌ భవనంపై దాడి వరకూ గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా రాజకీయాలు అత్యంత ఉత్కంఠను రేకెత్తించాయి. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల కోసం భారతీయులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అందుకు కారణం ‘కమలాదేవి హ్యారిస్‌’ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారతీయ మూలాలున్న ఆమె అగ్రరాజ్య ఉపాధ్యక్షురాలయ్యారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి మహిళగా, తొలి నల్ల జాతీయురాలిగా, తొలి ప్రవాస భారతీయురాలిగా.. ఇలా ఎన్నో ప్రత్యేకతల్ని సొంతం చేసుకున్నారామె. ఈ సందర్భంగా ఉపాధ్యక్షురాలిగా అగ్రరాజ్య రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్న ఈ సూపర్‌ వుమన్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
doctor-v-shantha-renowned-indian-oncologist-passes-away-pm-modi-pays-homage

శాంతమ్మా.. ఎప్పటికీ మా గుండెల్లోనే ఉంటారు!

‘వైద్యో నారాయణో హరి’ అంటూ వైద్యులను సాక్షాత్తూ నారాయణుడి (భగవంతుడు)తో పోల్చారు మన పెద్దలు. తాము నేర్చుకున్న విద్యతో తరతమ భేదం లేకుండా సహాయం చేయమనే ‘వైద్య వృత్తి’ నిజంగానే ఎంతో పవిత్రమైనది. అలాంటి వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి, దేశ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించారు డాక్టర్‌ విశ్వనాథన్‌ శాంత. తన జీవితంలో ఏనాడూ వైద్యాన్ని వృత్తిగా, వ్యాపారంగా చూడని ఆమె... పేదలు, అణగారిన వర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఎంతో కృషి చేశారు. మందు లేని మహమ్మారి క్యాన్సర్‌పై అసమాన పోరాటం చేస్తూ లక్షలాది మంది క్యాన్సర్‌ పీడితులకు ప్రాణం పోశారు. తన జీవితంలో సుదీర్ఘకాలం పాటు రోగులకు సేవ చేసి వైద్య వృత్తికే వన్నె తెచ్చిన శాంత (93) జనవరి 19న తుదిశ్వాస విడిచారు. ఛాతీ నొప్పితో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ క్రమంలో వైద్య రంగానికి ఆమె అందించిన సేవలను స్మరించుకుంటూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు ప్రముఖులు ఆమెకు నివాళి అర్పిస్తున్నారు.

Know More

women icon@teamvasundhara
meet-jill-biden-from-teacher-to-us-first-lady-in-telugu

బైడెన్‌ ప్రేమను ఆరోసారి అంగీకరించిందట !

అర్ధాంగి అంటే భర్త జీవితంలో అర్ధ భాగం కావడమే కాదు.. వారి ప్రతి అడుగులోనూ తోడుండాలంటారు. ఈ మాటలు అమెరికా మొదటి మహిళ జిల్‌ బైడెన్‌కు అచ్చు గుద్దినట్లు సరిపోతాయి. జోతో ఏడడుగులు నడిచిన క్షణం నుంచి ఆయన మొదటి భార్య పిల్లలకు తల్లయ్యారు జిల్‌.. ఆపై అటు తన ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే.. ఇటు అమెరికా రెండో మహిళగా తన బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తించారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భర్తకు ప్రతి అడుగులోనూ తోడుంటూ జీవిత భాగస్వామికి అసలు సిసలైన అర్థం చెప్పారామె. ఎన్నికల్లో భర్త విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటూ ‘ఆయన మనందరి కుటుంబాలకు కాబోయే అధ్యక్షులు’ అంటూ ట్వీట్‌ చేసిన జిల్‌.. జో ప్రేమ ప్రతిపాదనను ఆరోసారి అంగీకరించారన్న విషయం మనలో చాలామందికి తెలియదు. అంతేనా.. ఇటు కుటుంబాన్ని, అటు వృత్తినీ బ్యాలన్స్‌ చేసుకుంటూనే.. మరోవైపు ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో సైతం భాగమయ్యారామె. మరి, అమెరికా మొదటి మహిళగా శ్వేత సౌధంలోకి అడుగుపెట్టే సందర్భంలో ఈ పవర్‌ఫుల్‌ లేడీ గురించి, జో-జిల్‌ అందమైన ప్రేమకథ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
thrissur-woman-rebuilds-chips-business-after-robbery-left-her-with-rs-100

దోపిడీలో సర్వం పోయినా హాట్‌ చిప్స్‌తో మళ్లీ లక్షలు సంపాదిస్తోంది!

‘అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది... కష్టాల వారధి దాటిన వారికి అది సొంతమవుతుంది..’ అన్నాడో సినీ కవి. ఈ మాటలు అక్షరాలా సత్యమని నిరూపిస్తోంది కేరళకు చెందిన ఓ మహిళ. లక్షలు ఆర్జించిపెడుతున్న స్వీట్ షాప్ కాస్తా దోపిడీకి గురైతే ఒక్కసారిగా రోడ్డున పడింది. అలాగని చేతకానిదానిలా ఏడుస్తూ కూర్చోలేదు. పడిలేచిన కెరటంలా రెట్టింపు వేగంతో జీవితంలో మళ్లీ ముందుకు దూసుకువచ్చింది. కష్టాలకు కుంగిపోకుండా తన సంకల్పబలంతో విజయం సాధించి వార్తల్లో నిలిచింది. అందరి జీవితాల్లో కష్టాలనేవి సర్వసాధారణమని.. అయితే వాటినే తలుచుకుంటూ కూర్చోవడం కంటే... ఆ పరిస్థితులను అధిగమించే మార్గం అన్వేషించినప్పుడే మన జీవితానికి ఓ అర్థం ఉంటుందని చెబుతూ అందరికీ స్ఫూర్తినిస్తున్న ఆ మహిళ విజయ గాథను మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
who-is-vanita-gupta?-get-to-know-joe-biden-pick-to-serve-as-us-associate-attorney-general

అందుకే ఈ లాయరమ్మకు అమెరికాలో అంత గౌరవం!

భారతగడ్డపై పుట్టి పెరిగి, విదేశాల్లో స్థిరపడి, అక్కడ వివిధ రంగాల్లో సత్తా చాటుతోన్న మహిళలు ఎందరో ఉన్నారు. ప్రవాస భారతీయులుగా శాస్ర్త, సాంకేతిక రంగాల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటూ ఉన్నత అవకాశాలను అందుకుంటున్నారు. అదేవిధంగా వివిధ దేశాల రాజకీయాల్లోనూ స్పష్టమైన ముద్ర వేసి అక్కడ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు. ఇక ప్రపంచానికి పెద్దన్న అని చెప్పుకునే అమెరికా రాజకీయాల్లో భారతీయులే కీలకంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి అగ్రరాజ్యంలో మరో భారతీయ సంతతి మహిళకు అరుదైన గౌరవం దక్కింది. ఈ క్రమంలో అమెరికా అసోసియేట్‌ అటార్నీ జనరల్‌గా భారతీయ అమెరికన్‌ న్యాయవాది వనితా గుప్తా నామినేట్‌ అయ్యారు. వనిత నియామకాన్ని సెనేట్ ఆమోదిస్తే... అమెరికా చరిత్రలో ఈ ప్రతిష్ఠాత్మక స్థానాన్ని అధిరోహించిన తొలి శ్వేత జాతీయేతర మహిళగా అరుదైన చరిత్ర సృష్టించనుంది వనిత.

Know More

women icon@teamvasundhara
breaking-another-glass-ceiling-these-women-make-history-in-telugu

మహిళా శక్తికి ప్రతిరూపాలు ఈ వనితలు!

‘పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడం అంత సులభం కాదు’...ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఏ రంగంలోనైనా మహిళలు పురుషులతో సమానంగా పనిచేసేందుకు పోటీ పడుతున్నారు. ఎంత కష్టంతో కూడిన రంగమైనా సరే...సవాళ్లకు ఎదురొడ్డి మరీ అందులో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఫుడ్‌ డెలివరీ, క్యాబ్‌ డ్రైవింగ్‌, లోకో పైలట్‌, పైలట్‌.. వంటి అధిక శారీరక శ్రమతో కూడిన రంగాల్లోనూ ఎందరో మహిళలు సమర్థంగా విధులు నిర్వర్తిస్తుండడమే ఇందుకు నిదర్శనం. ఈక్రమంలో మహిళల శక్తి సామర్థ్యాలేంటో మరోసారి ప్రపంచానికి చాటి చెబుతూ ఎయిర్‌ ఇండియా మహిళా పైలట్ల బృందం ఉత్తర ధ్రువం మీదుగా విమానం నడిపేందుకు సిద్ధపడింది. ఇక మరోవైపు పశ్చిమ రైల్వేకు చెందిన మహిళా సిబ్బంది తాజాగా గూడ్స్‌ రైలును నడిపి సరికొత్త అధ్యాయానికి తెరతీసింది.

Know More

women icon@teamvasundhara
kerala-woman-who-worked-as-part-time-sweeper-at-panchayat-office-is-now-its-president
women icon@teamvasundhara
apollo-hospitals-vice-chairperson-shobana-kamineni-cycled-600-km-her-birthday-day

అందుకే ఈ వయసులో 600 కిలోమీటర్ల సైకిల్‌ యాత్ర చేశా!

వ్యాయామం చేయడం, ఫిట్‌నెస్‌ సాధించడం.. ఇవి ఫలానా వయసుకే పరిమితమా? అంటే కాదని నిరూపిస్తున్నారు ఎందరో మహిళలు. వయసు పెరుగుతున్నా విభిన్న వ్యాయామాలు చేస్తూ, మారథాన్‌లలో పాల్గొంటూ అదరగొడుతున్నారు. అలాంటి వారిలో అపోలో హాస్పిటల్స్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ శోభనా కామినేని ఒకరు. ఇటీవలే హైదరాబాద్‌ నుంచి చెన్నైకి 600 కిలోమీటర్ల సైకిల్‌ రైడ్‌ పూర్తి చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారామె. అది కూడా తన 60వ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ ఫీట్‌ పూర్తి చేయడం విశేషం. మరి, ఈ వయసులో ఇంత సాహసం చేయడం వెనుక ఏదైనా ముఖ్య కారణముందా? అని అడిగితే.. మహిళలు తలచుకుంటే సాధించలేనిదేదీ లేదని నిరూపించడానికే ఇలా చేశానంటున్నారామె. ఈ నేపథ్యంలో ఈ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ సైకిల్‌ యాత్ర గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
story-of-karuna-singh-wife-of-lt-cdr-d-s-chauhan-soon-to-join-indian-army

పెళ్లైన 40 రోజులకే లోకం విడిచి వెళ్లారు.. అయినా నాతోనే ఉంటారు!

అందరమ్మాయిల్లాగే భవిష్యత్తు పైన ఎన్నో కలలు, ఆశయాలతో చదువు పూర్తి చేసిందామె. అదే సమయంలో కన్న తండ్రి కాలం చేయడంతో తీవ్ర నిరాశలోకి కూరుకుపోయింది. అయినా ఆ బాధలోంచి తేరుకొని మంచి ఉద్యోగం సంపాదించుకుంది. ఆపై సద్గుణవంతుడైన భాగస్వామిని భర్తగా పొందింది. వీరిద్దరి అన్యోన్యతను చూసి విధికి కన్ను కుట్టినట్లుంది. దురదృష్టవశాత్తూ పెళ్లైన 40 రోజులకే తన ఐదో తనాన్ని దూరం చేసింది. ఆ సమయంలో ‘నాకు సమస్యల మీద సమస్యలొస్తున్నాయంటే ఆ దేవుడు నన్ను ఓ గొప్ప కార్యంలో భాగం చేయాలనుకుంటున్నాడేమో!’ అనుకుందే తప్ప అధైర్యపడలేదామె. అందుకే దేశ రక్షణలో అమరుడైన తన భర్త ఆశయాన్ని భుజాలపైకెత్తుకుంది. పరీక్షలో పాసై త్వరలోనే సైన్యంలో శిక్షణ పొందేందుకు సన్నద్ధమవుతోంది. ఆమే.. ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య యుద్ధ నౌక ప్రమాదంలో అసువులు బాసిన లెఫ్టినెంట్‌ కమాండర్‌ ధర్మేంద్ర సింగ్ చౌహాన్ సతీమణి కరుణా సింగ్‌. తన కలను పక్కన పెట్టి కట్టుకున్న భర్త ఆశయం కోసం కదిలిన ఈ వీర వనిత ధీర గాథ ఆమె మాటల్లోనే..!

Know More

women icon@teamvasundhara
68-years-old-lady-earning-millions-by-making-island-in-waterlogged-fields

women icon@teamvasundhara
meet-pooja-devi-the-first-woman-bus-driver-from-jammu-and-kashmir

‘ఆడవాళ్లు బస్సు నడపడమేమిటీ' అన్నారు!

‘ఆకాశంలో సగం... అవకాశాల్లో సగం’ అంటూ ఇప్పుడు ఏ రంగంలోనైనా స్త్రీలు పురుషులతో సమానంగా పని చేసేందుకు పోటీ పడుతున్నారు. ఎంత కష్టమైనా సరే... సవాలుగా తీసుకుని మరీ ఆ రంగంలో తమ సామర్థ్యాన్ని చాటుకుంటున్నారు. శారీరక శ్రమతో కూడిన బాధ్యతలను సైతం చక్కగా నిర్వర్తిస్తున్నారీ తరం మహిళలు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే స్త్రీలపై ఎక్కువ ఆంక్షలుండే జమ్మూ కశ్మీర్‌లో తొలిసారిగా ఓ మహిళ బస్సు స్టీరింగ్ పట్టుకుంది. కుటుంబ అవసరాల కోసం తన కుమారుడిని వెంట పెట్టుకుని మరీ బస్సు నడిపింది. మరి ఇంతకీ ఎవరా మహిళ? ఎందుకు బస్సు డ్రైవర్‌గా మారిందో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
meet-usha-soman-who-makes-us-believe-that-age-is-just-a-number

ఇలాంటి 'వండర్ ఉమన్' ఉంటే ఫ్యామిలీ అంతా ఫిట్ గానే ఉంటుంది!

ఫిట్‌నెస్‌.. ఇది ఒక వయసుకే పరిమితమనుకుంటాం.. ఆ వయసులోనైతేనే విభిన్న వ్యాయామాలు చేయడానికి శరీరం సహకరిస్తుందనుకుంటాం. కానీ ఇదే ప్రశ్న ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ మిలింద్‌ సోమన్‌ తల్లి ఉషా సోమన్‌ని అడిగితే ‘ఫిట్‌నెస్‌కి వయసుతో సంబంధమేముంది? దానిపై మనసు పెడితే చాలు.. ఏ వయసులోనైనా దీన్ని మనం సొంతం చేసుకోవచ్చు..’ అని నిర్మొహమాటంగా చెబుతారామె. ‘వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే!’ అనే ఫిలాసఫీని నమ్మే ఈ ఫిట్‌నెస్‌ ఔత్సాహికురాలు 81 ఏళ్ల వయసులోనూ ఎలాంటి వ్యాయామమైనా అలవోకగా చేసేస్తుంటారు. అది కూడా సంప్రదాయ చీరకట్టులో చేస్తూ అందరినీ ఒకింత అబ్బురపరుస్తారు!

Know More

women icon@teamvasundhara
a-woman-farmer-on-why-she-is-protesting-at-delhi-border

women icon@teamvasundhara
meet-the-woman-behind-ipo-star-mrs-bectors-food-specialities

ఈ బిస్కట్ల రారాణి విజయగాథ విన్నారా?

‘ఆడపిల్లలకు చదువెందుకు.. ఉద్యోగమెందుకు..? హాయిగా పెళ్లి చేసుకొని భర్తను, పిల్లల్ని, కుటుంబాన్ని చూసుకోక!’ అనే రోజులవి! అలాంటి ఆలోచనలతోనే ఆమెను 17 ఏళ్ల వయసులోనే ఓ అయ్య చేతిలో పెట్టారు ఆమె తల్లిదండ్రులు! కానీ ఆమెకేమో బాగా చదువుకోవాలి, ఏదైనా కొత్తగా చేయాలన్న తపన ఉండేది. ఇందుకు అత్తింటి వాళ్లు అడ్డు చెప్పినా.. భర్త మాత్రం తన పూర్తి సహకారం అందించారు. అలా నాడు బేకింగ్‌లో ప్రయోగాలు చేస్తూ తన పెరట్లోనే చిన్న బేకరీ షాపుగా ప్రారంభమైన ఆమె వ్యాపారం.. నేడు ఉత్తర భారతదేశంలోనే దిగ్గజ సంస్థగా ఎదిగింది. దేశంలో ఓ ట్రేడ్‌మార్క్గా ఎదగడమే కాదు.. మేటి అంతర్జాతీయ బ్రాండ్లకు ముడిసరుకుల్ని పంపిణీ చేసే స్థాయికి చేరుకుంది. ఇదంతా ఆమె కృషి, పట్టుదల వల్లే సాధ్యమైంది. కాబట్టే నేడు ఈ కంపెనీ షేర్లు స్టాక్‌మార్కెట్లో లిస్ట్‌ అయ్యాయి. పబ్లిక్ ఇష్యూ నుంచి వందల కోట్లు సేకరించడమే కాదు.. ఈ ఏడాది అత్యధికంగా సబ్‌స్క్రైబ్‌ అయిన ఐపీవోల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది కూడా! ఆ దిగ్గజ సంస్థే ‘మిసెస్‌ బెక్టార్‌ - క్రీమికా’. విదేశీ బ్రాండ్ల పోటీని తట్టుకొని దేశీయ మార్కెట్లో ఈ సంస్థను అగ్రగామిగా నిలిపిన ఘనత ఈ సంస్థ అధినేత్రి రజనీ బెక్టార్‌దే!

Know More

women icon@teamvasundhara
ankita-gaur-five-month-pregnant-mom-to-be-finishes-tcs-work-10k-bengaluru

ఐదు నెలల గర్భంతో పది కిలోమీటర్లు పరిగెత్తా!

నెలలు నిండుతున్న కొద్దీ అతి సుకుమారంగా తయారవుతుంటారు గర్భిణులు. కడుపులోని బిడ్డకు అసౌకర్యంగా ఉంటుందేమోనన్న ఉద్దేశంతో కొన్ని కఠినతరమైన పనులు చేయడానికి సంకోచిస్తుంటారు. ఇక ఈ సమయంలో వ్యాయామం మంచిదని చెప్పినా దాని జోలికి వెళ్లని వారూ లేకపోలేదు. ఇంట్లో ఉండే కొందరు పెద్ద వాళ్లు కూడా గర్భిణులు ఏది చేస్తామన్నా ససేమిరా అంటుంటారు. కానీ వీటన్నింటినీ అధిగమించి వ్యాయామాలు చేస్తూ, మారథాన్‌లలో పాల్గొంటూ నలుగురిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నారు ఈ తరం మహిళలు. అలాంటి వారిలో ఒకరే బెంగళూరుకు చెందిన అంకితా గౌర్‌. ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి అయిన ఆమె తాజాగా టీసీఎస్‌ వరల్డ్‌ 10కె రన్‌లో పాల్గొంది. గంటలోనే పది కిలోమీటర్లు పరుగెత్తి.. గర్భంతో ఉన్న వారికి పరుగు మంచి వ్యాయామమని చాటుతోంది. తొమ్మిదేళ్లుగా పరుగునే ఊపిరిగా మార్చుకున్నానని, ఆ ఉత్సాహమే గర్భంతోనూ తనను పరిగెత్తేలా చేసిందని చెబుతోన్న ఈ న్యూ మామ్‌ తన గురించి ఏం చెబుతుందో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
baloch-activist-gender-inequality-critic-karima-baloch-found-dead-in-canada

అందుకే కరీమా ఎప్పటికీ ఓ హీరోనే!

పరువు పేరుతో హత్యలు చేయడం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, లింగ వివక్ష, ప్రసూతి మరణాలు, అత్యాచారాలు, యాసిడ్‌ దాడులు.. ఇలా చెప్పుకుంటూ పోతే మహిళల్ని ఓ గడ్డి పరకలా భావిస్తుంటారక్కడ! ఒకవేళ వీటిని ఎదిరిస్తే వారికి మరణ శాసనం తప్పదు. మహిళల పట్ల ఇంతటి క్రూరమైన వివక్ష ఉంది కాబట్టే పాక్‌ ఆక్రమిత బలోచిస్థాన్‌ స్త్రీలకు అసురక్షితమైన ప్రదేశాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఇలాంటి చోటే పుట్టి పెరిగింది కరీమా బలోచ్‌. అయితే అందరు మహిళల్లా అణిగిమణిగి ఉండాలనుకోలేదామె. మహిళా హక్కులపై ఉద్యమించింది.. అక్కడి మహిళలు ఎదుర్కొంటోన్న దుస్థితిని అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టింది. అలాంటి ఉద్యమకారిణి గొంతు నేడు మూగబోయింది. 2016 నుంచి కెనడాలో శరణార్థిగా ఉంటోన్న కరీమా రెండు రోజుల క్రితం హత్యకు గురైంది. అయితే దీని వెనుక పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ హస్తం ఉందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా మహిళలకు న్యాయం జరగాలని ముక్తకంఠంతో నినదించిన ఈ ఉద్యమకారిణి తన కొన ఊపిరిదాకా అదే పట్టుదలను కొనసాగించడం ఆమె ధైర్యానికి ప్రతీక!

Know More

women icon@teamvasundhara
meet-the-chief-justice-of-telangana-high-court-here-is-hima-kohli-story

మనకే కాదు.. ప్రకృతికీ న్యాయం జరగాలంటారామె!

మనదేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల గురించి అడిగితే పురుషుల పేర్లే ఎక్కువగా వినిపిస్తాయి. సంచలనమైన తీర్పులు ఇచ్చిన సందర్భంలో మినహా.. మహిళా న్యాయమూర్తుల గురించి పెద్దగా బయటికి తెలియదు. అయినప్పటికీ తమ అచంచల ప్రతిభాపాటవాలతో.. ఈ రంగంలో కొందరు ఉన్నత స్థానాలకు చేరుకొంటున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ధర్మాసనాల్లో జడ్జిలుగా కొనసాగుతున్నారు. హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తి స్థాయికి ఎదుగుతున్నారు. ఆ కోవకే చెందుతారు తాజాగా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితురాలైన జస్టిస్‌ హిమా కోహ్లీ. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించనున్న తొలి మహిళ ఆమెనే కావడం విశేషం. ఈ సందర్భంగా ఈ సీనియర్‌ మహిళా జడ్జి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
nepals-female-soldiers-break-taboos-to-tackle-covid-crisis
women icon@teamvasundhara
ips-ankita-sharma-teaches-students-studying-upsc-so-that-their-dreams-are-not-left-incomplete-due-to-poverty

ఈ లేడీ సింగం.. అమ్మాయిల సివిల్స్ కలను నెరవేర్చే టీచరమ్మ కూడా!

ఐఏఎస్‌, ఐపీఎస్‌.. వంటి దేశ అత్యున్నత ప్రభుత్వోద్యోగాల్లో చేరాలన్న కల ప్రతి ఒక్కరికీ ఉంటుంది. సవాళ్లను ఎదుర్కొంటూ, ఓటమిని జయిస్తూ ముందుకు సాగితేనే ఈ కొలువులు మన సొంతమవుతాయి. అయితే వీటిలో విజయం సాధించిన కొంతమంది ‘హమ్మయ్య.. నా కల నెరవేరింది’ అని సంతృప్తి పడిపోతే.. ఇంకొందరేమో తనలా మరికొందరు కూడా తమ కలల్ని నెరవేర్చుకోవాలని ఆకాంక్షిస్తుంటారు. ఈ క్రమంలో తమలో ఉన్న విజ్ఞానాన్ని నలుగురికీ పంచుతుంటారు. ఇందుకు అసలు సిసలైన ఉదాహరణే ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పూర్‌కు చెందిన పోలీసాఫీసర్‌ అంకితా శర్మ. సివిల్స్‌ ప్రిపరేషన్‌ కోసం వేలకు వేలు డబ్బులు పోసే స్థోమత లేని అమ్మాయిల్ని చేరదీసి తానే ఉచితంగా కోచింగ్‌ ఇస్తున్నారామె. అది కూడా ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్లో కూడా! ఓవైపు వృత్తిపరంగా నేరస్థుల గుండెల్లో గుబులు రేపుతోన్న ఈ సూపర్‌ కాప్‌.. ఇటు టీచర్‌గా మారి ఎందరో విద్యార్థుల కలల్ని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారు. తాను చదువుకునే రోజుల్లో ఎదుర్కొన్న సవాళ్లే తనను ఈ దిశగా నడిపించాయంటోన్న ఈ మహిళా పోలీసాఫీసర్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
hcl-tech-chief-roshini-nadar-malhotra-india’s-wealthiest-woman-here-is-the-full-list

దేశంలో అత్యంత సంపన్న మహిళలు వీరే!

రంగమేదైనా మహిళలు తమ పూర్తి స్థాయి ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తూ అందులో తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు. ప్రత్యేకించి వ్యాపార రంగంలో తమదైన మెలకులను ప్రదర్శిస్తున్నారు కొందరు అతివలు. ప్రతికూల పరిస్థితులు, సవాళ్లను ఎదుర్కొని గ్రేట్‌ బిజినెస్‌ వుమన్‌గా పేరు తెచ్చుకుంటున్నారు. అంతేకాదు ఎక్కువ మొత్తంలో ఆదాయం ఆర్జిస్తూ అత్యంత సంపన్నమైన మహిళలుగా సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో దేశంలో అత్యంత సంపన్న మహిళలందరినీ ఒక చోట చేర్చుతూ కోటక్‌ వెల్త్‌-హురన్ ఇండియా సంయుక్తంగా ఓ జాబితా రూపొందించింది. ‘కోటక్‌ వెల్త్‌ హురున్‌-లీడింగ్‌ వెల్దీ వుమెన్‌ 2020’ పేరుతో మొత్తం 100 మంది భారతీయ సంపన్న మహిళల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో హెచ్‌సీఎల్‌ ఛైర్‌పర్సన్‌ రోష్నీ నాడార్‌ అగ్రస్థానంలో నిలిచారు.

Know More

women icon@teamvasundhara
para-badminton-player-manasi-joshi-recalls-the-day-she-lost-her-leg-reflects-on-how-her-life-has-changed

అవకాశమొస్తే ఆ జీవితాన్నే ఎంచుకుంటా!

భవిష్యత్తుపై బోలెడు ఆశలు పెట్టుకున్న ఆమెను 22 ఏళ్లకే విధి వెక్కిరించింది. ఒంటికాలితో జీవితాన్ని అంధకారం చేయాలనుకుంది. అయితే కష్టాలు, కన్నీళ్లు ఆమెను మరింత కఠినంగా మార్చాయి. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని అందించాయి. అందుకే కృత్రిమ కాలితోనే బ్యాడ్మింటన్‌ రాకెట్‌ పట్టుకుని బరిలోకి దిగింది. మొండి పట్టుదలతో పతకాల జోరు కొనసాగించింది. ఆమే పారా అథ్లెట్‌ మానసి జోషి. ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు’ అన్న మాటలకు కచ్చితమైన ఉదాహరణగా నిలిచే మానసి.. సరిగ్గా నిల్చోవడానికి కాలు లేకపోయినా పారా బ్యాడ్మింటన్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. దేశానికి పతకాల పంట పండిస్తోంది. తన పోరాట స్ఫూర్తితో ఎంతోమంది అమ్మాయిలు, తనలాంటి దివ్యాంగుల్లో స్ఫూర్తి నింపుతోంది.

Know More

women icon@teamvasundhara
sania-mirza-writes-emotional-ode-to-all-mothers-in-viral-post

ఇజాన్ పుట్టాకే అవన్నీ నాకు అర్థమయ్యాయి!

అమ్మతనం.. ఈ లోకంలో అన్నింటికంటే అమూల్యమైనది. స్వయంగా అనుభవిస్తే తప్ప అందులో ఉన్న కమ్మదనాన్ని మనం ఆస్వాదించలేం. అంతేకాదు.. బాధ్యత, ఓపిక, మనల్ని మనం ప్రేమించుకోవడం, నిస్వార్థమైన ప్రేమను పంచడం.. ఇలా ఎన్నో విషయాలు నేర్పుతుందీ అద్భుతమైన భావన. ఇలాగే అమ్మతనం తననీ ఓ మంచి మనిషిని చేసిందంటోంది హైదరాబాదీ టెన్నిస్ స్టార్‌ సానియా మీర్జా. రెండేళ్ల క్రితం ఇజాన్‌కు జన్మనిచ్చిన ఈ సూపర్‌ మామ్‌.. ఆ తర్వాత ఎంతో కష్టపడి ఫిట్‌గా మారి ఈ ఏడాది కోర్టులోకి అడుగుపెట్టింది. రెండో ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచి తల్లయ్యాకా మహిళలు తమ కెరీర్‌లో దూసుకుపోగల సమర్థులు అని నిరూపించింది. ఇలా తన పోస్ట్‌ ప్రెగ్నెన్సీ జర్నీకి అమెరికన్‌ టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ స్ఫూర్తి అంటూ తాజాగా ఓ సుదీర్ఘ లేఖ రాసింది సానియా. అమ్మతనం తనకు అందించిన అనుభవాలు, ప్రసవానంతరం బరువు తగ్గడం, సెరెనా తనలో ప్రేరణ నింపిన విధానం, వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌.. ఇలా ఎన్నెన్నో విషయాలు రంగరించి రాసిన ఆ లేఖ సోషల్‌ మీడియాలో వైరలవడమే కాదు.. ఎంతోమంది తల్లుల్లో స్ఫూర్తి నింపుతోంది.

Know More

women icon@teamvasundhara
things-to-know-about-anupa-das-third-woman-to-become-a-crorepati-in-kbc-season-12

ఈ కోటి రూపాయలతో మా అమ్మను క్యాన్సర్‌ నుంచి కాపాడుకుంటా!

కౌన్ బనేగా కరోడ్పతి... 20 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ షోకు నేటికీ ఏ మాత్రం క్రేజ్‌ తగ్గలేదు. బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ బుల్లితెర కార్యక్రమంలో పాల్గొనాలని, హాట్ సీట్ వరకు చేరుకోవాలని ఎంతోమంది ప్రయత్నిస్తారు. ఈ షో ద్వారా వచ్చిన పేరు, ప్రైజ్‌ మనీతో తమ కలలను సాకారం చేసుకోవాలని అనుకుంటారు. కానీ ఆ అదృష్టం కొందరికే దక్కుతుంది. అలాంటి వారిలో ఒకరు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అనూపాదాస్. వృత్తిరీత్యా టీచర్‌ అయిన ఆమె ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి అంటే గత 20 ఏళ్లుగా దీనిలో పాల్గొనాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తాజాగా తన కలను సాకారం చేసుకోవడమే కాకుండా ఏకంగా కోటి రూపాయలు గెలుచుకుంది.

Know More

women icon@teamvasundhara
farah-khan-writes-open-letter-on-choosing-to-become-mom-at-43-via-ivf

ఆ విషయంలో నా మనసు చెప్పిందే విన్నా.. దాన్నే లాక్ చేశా!

‘లోకులు కాకులు.. అవసరం ఉన్నా లేకపోయినా ఇతరుల విషయాల్లో తలదూర్చుతుంటారు. పెళ్లి, పిల్లలు, కెరీర్‌.. ఇలా అన్ని విషయాల్లో నిర్ణయాధికారం వారిదే అన్నట్లుగా మాట్లాడతారు.. అయితే ఇలా ఎవరెన్ని చెప్పినా మీరు మాత్రం మీ మనసు చెప్పిందే వినండి..!’ అంటున్నారు ప్రముఖ దర్శకనిర్మాత ఫరా ఖాన్‌. 43 ఏళ్ల వయసులో ఐవీఎఫ్‌ ద్వారా ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన ఈ సెలబ్రిటీ మామ్‌.. వయసుకు, పిల్లల్ని కనడానికి సంబంధం లేదంటున్నారు. సైన్స్‌ అభివృద్ధి చెందుతోన్న ఈ కాలంలో తమకు నచ్చినప్పుడు, అందుకు మానసికంగా సిద్ధమైనప్పుడు పిల్లల్ని కనొచ్చంటున్నారు. ఈ నేపథ్యంలో తన ఐవీఎఫ్‌ స్టోరీని, ఈ క్రమంలో తనకెదురైన అనుభవాలను గుదిగుచ్చి ఓ సుదీర్ఘ లేఖ రాశారామె. వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ గురించి మహిళలందరికీ దిశానిర్దేశం చేసేలా ఉన్న ఈ లేఖ సారాంశమేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
four-indian-women-featured-in-bbc-100-women-list-of-2020

ప్రపంచ గతిని మార్చారు.. నలుగురికీ ‘స్ఫూర్తి’గా నిలిచారు!

ప్రపంచాభివృద్ధిలో పలువురు మహిళలు తమదైన పాత్ర పోషిస్తున్నారు. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ అపురూప విజయాలు సాధిస్తూ...తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ మార్గంలో మరింతమంది అడుగులు వేసేలా స్ఫూర్తినిస్తున్నారు. ఈక్రమంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొని ప్రపంచవ్యాప్తంగా తమదైన ముద్ర వేస్తోన్న మహిళల్లో వందమందిని ఎంపిక చేసి ఏటా ఓ జాబితాను విడుదల చేస్తోంది బీబీసీ. అలా ఈ ఏడాది కూడా వివిధ రంగాల్లో తమదైన రీతిలో దూసుకుపోతోన్న 100 మంది అత్యంత స్ఫూర్తిదాయకమైన, ప్రభావశీలురైన మహిళల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో నలుగురు భారతీయ నారీమణులు చోటు దక్కించుకోవడం విశేషం.

Know More

women icon@teamvasundhara
film-maker-nidhi-parmar-dontes-above-40-liters-breast-milk-amid-corona-pandemic

చనుబాలు దానం చేస్తూ పసిపిల్లల ఆకలి తీరుస్తోంది!

అమ్మ పాలు అమృతంతో సమానం. తల్లి పాలల్లో ఉండే ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు... ఇతరత్రా పోషకాలు పిల్లల రోగ నిరోధక శక్తిని పెంచడానికి దోహదం చేస్తాయి. వారిని బాలారిష్టాల నుంచి రక్షిస్తాయి. అందుకే బిడ్డ పుట్టినప్పటి నుంచి కనీసం ఆరు నెలల దాకా తల్లి పాలే పట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతమున్న యాంత్రిక జీవనంలో అమ్మపాలకు చాలా కొరతొచ్చి పడింది. అందుకు కారణాలు అనేకం. ఈ క్రమంలో ముంబయికి చెందిన ఓ ఫిల్మ్‌ మేకర్‌ తన బిడ్డకు అమృతమంటి పాలను అందిస్తూనే, అదనంగా ఉత్పత్తైన పాలను దానం చేసి ఆదర్శంగా నిలుస్తోంది.

Know More

women icon@teamvasundhara
major’s-wife-completes-training-set-to-join-army-two-years-after-his-death

అమరవీరుడైన భర్త ఆశయాన్ని ఇలా నెరవేరుస్తోంది!

ఉన్నతోద్యోగంలో కొనసాగుతోన్న ఆమెను అడుగడుగునా ప్రోత్సహించే భర్త.. దేశ రక్షణే ధ్యేయంగా భావించే అతడికి ఏ అపాయమూ రాకూడదని అనుక్షణం ఆ దేవుడిని ప్రార్థించే భార్య.. ఇలా ఆ ఆలుమగల అన్యోన్యతను చూసి విధికి కన్ను కుట్టినట్లుంది. శత్రు సైన్యం చేసిన దాడి ఆ జంటను శాశ్వతంగా విడదీసింది. ఆమె నుదుటి కుంకుమను తుడిచేసింది. ఆ బాధను దిగమింగుతూ.. దేశ రక్షణే ఆరోప్రాణంగా భావించే తన భర్త కోసం తన ఆశలు, ఆశయాలనే వదులుకుందామె.. తన ఊపిరి ఉన్నంత వరకు అతని అడుగుజాడల్లోనే నడుస్తానని నిర్ణయించుకుంది. భర్త కలల్ని నిజం చేస్తానని కంకణం కట్టుకుంది. అనుకున్నట్లుగానే రెండేళ్ల కఠోర శిక్షణను తాజాగా పూర్తిచేసుకొని త్వరలోనే భారత సైన్యంలో చేరేందుకు సన్నద్ధమవుతోంది.. గుండె ధైర్యంతో, నిండైన ఆత్మవిశ్వాసంతో ఇండియన్‌ ఆర్మీ యూనిఫాం ధరించేందుకు ఉవ్విళ్లూరుతోన్న ఆమే.. అమర వీరుడైన ఆర్మీ మేజర్‌ కౌస్తుభ్‌ రాణే సతీమణి కనిక. తన కొన ఊపిరి దాకా భర్త కల కోసమే పని చేస్తానంటోన్న ఈ వీర నారి తన ఆశయం గురించి ఏం చెబుతున్నారో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
delhi-cop-found-76-missing-children-first-to-be-promoted-out-of-turn-in-telugu

ఆ చిన్నారుల్ని తల్లి ఒడికి చేర్చింది.. అరుదైన ఘనత అందుకుంది!

హైదరాబాద్‌, దిల్లీ, ముంబై... లాంటి మహా నగరాలను ఒకసారి గమనిస్తే వేలాది మంది వీధి బాలలు రోడ్డుపై కనిపిస్తుంటారు. రోడ్డుపై వెళ్లే వారిని డబ్బులు యాచిస్తూ పొట్ట నింపుకొనే ఆ పిల్లలను చూస్తే చాలామందికి జాలి వేయకమానదు. అందులో కొందరు అనాథ పిల్లలున్నప్పటికీ.. తెలిసీ తెలియని వయసులో క్షణికావేశంతోనూ, కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేక ఇంటి నుంచి పారిపోయి వచ్చిన వారే ఎక్కువ! ఈక్రమంలో అలా తప్పిపోయిన చిన్నారులు, బాలలను తిరిగి వారి ఇంటికి చేర్చుతూ అందరి మన్ననలు అందుకుంటున్నారు ఓ మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌. విధి నిర్వహణలో భాగంగా పిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతూ వారి తల్లిదండ్రుల కళ్లల్లో సంతోషం నింపుతున్నారామె. ఇలా తాను చేస్తోన్న మంచి పనితో అటు అందరి మన్ననలు అందుకుంటూనే.. ఇటు తాజాగా అరుదైన పదోన్నతి కూడా పొందారు. మరి, ఆ మహిళా కాప్‌ ఎవరు? తప్పిపోయిన పిల్లల్ని ఎలా వెతికి పట్టుకొని వారి ఇంటికి చేర్చుతున్నారు? వంటి విషయాలు తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
maharashtra-anganwadi-staffer-rows-18-km-every-day-to-tend-to-pregnant-women-newborns-in-villages

వారి కోసం రోజూ 18 కిలోమీటర్లు పడవలో ప్రయాణిస్తోంది!

ఆమె ఒక సాదాసీదా అంగన్‌వాడీ కార్యకర్త. గర్భిణులు, కొత్తగా తల్లైన మహిళలు, చిన్నారుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించడం, వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పోషకాహారం అందించడం ఆమె విధి. ఇలా తన రోజువారీ విధులు నిర్వర్తిస్తోన్న క్రమంలోనే అనుకోకుండా ఈ కరోనా లాక్‌డౌన్‌ వచ్చి పడింది. దాంతో అటు గర్భిణులు, ఇటు బాలింతలు అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లడానికి భయపడిపోయారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో తన పనులేవో తాను పూర్తి చేసుకొని, ఇతర విషయాలను పట్టించుకోకపోయినా ఆమెను ఎవరూ ఏమీ అనరు.. పైగా ప్రభుత్వం నుంచి అందాల్సిన జీతం కూడా సరైన సమయానికి అందుతుంది. కానీ ఇవేమీ ఆలోచించలేదామె. గర్భిణులు, బాలింతలు అంగన్‌వాడీ కేంద్రానికి రాకపోతేనేం.. నేనే వాళ్ల దగ్గరికి వెళ్తానని నిశ్చయించుకుంది. అలా దాదాపు ఏడు నెలలుగా ఆ చుట్టు పక్కల ప్రాంతాలకు వెళ్తూ గర్భిణులకు, బాలింతలకు కావాల్సిన పోషకాహారం అందిస్తోందామె. అది కూడా రోజూ 18 కిలోమీటర్లు పడవలో ప్రయాణిస్తూ మరీ! ఇలా పని పట్ల తనకున్న అంకితభావాన్ని చాటుతోంది కాబట్టే.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. మరి, ఇంతకీ ఎవరామె? రండి.. తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
newzeland-police-introduce-hijab-to-uniform-first-officer-to-wear-it-feels-proud

ఈ యూనిఫాం ధరించడం ఓ సరికొత్త అనుభూతి!

హిజబ్‌... ముస్లిం మహిళలు నలుగురిలోకి వెళ్లాలంటే తప్పక ధరించాల్సిన వస్ర్తధారణ ఇది. తలను, జుట్టును కవర్‌ చేస్తూ క్లాత్‌ చుట్టుకోవడమే ఇందులోని ప్రధానాంశం. ఇక కళ్లు మినహా ఏ ఇతర శరీర భాగం కనిపించకుండా చాలామంది ముస్లిం మహిళలు బుర్ఖా ధరించడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ కట్టుబాట్ల కారణంగా చాలామంది ముస్లిం మహిళలు పోలీస్‌ లాంటి ఉద్యోగాల్లో చేరడానికి ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువమంది ముస్లిం మహిళలను పోలీస్‌ దళాల్లో చేర్చుకునేలా న్యూజిలాండ్‌ ప్రభుత్వం తమ పోలీస్‌ అధికారిక యూనిఫాంలో హిజబ్‌ను ప్రవేశపెట్టింది. ఈక్రమంలో ఇటీవల కానిస్టేబుల్‌గా విధుల్లోకి చేరిన జీనా అలీ హిజబ్‌ ధరించిన తొలి న్యూజిలాండ్‌ మహిళా పోలీస్‌గా అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది.

Know More