scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

నన్ను క్షమించు.. నిన్ను వీడుతున్నా!

Russain Tennis star Maria sharapova announced her retirement

నాలుగేళ్లకే టెన్నిస్‌ కోర్టులో అడుగుపెట్టి ఆరేళ్లకే టెన్నిస్‌ రాకెట్‌ పట్టుకుంది. ఆటకు గ్లామర్‌ సొబగులు అద్ది అతిపిన్న వయసులోనే అద్భుత విజయాలు సాధించింది. చేతిలో పైసాలేని పరిస్థితుల నుంచి ప్రపంచంలో అత్యంత ఖరీదైన క్రీడాకారిణిగా ఎదిగింది. ఇలా ప్రొఫెషనల్‌ టెన్నిస్‌లో తనకంటూ ఓ పేజీని లిఖించుకుంది రష్యన్‌ టెన్నిస్‌ స్టార్‌ మరియా షరపోవా. 28 ఏళ్ల పాటు తన ఆట, అందంతో క్రీడాభిమానుల నీరాజనాలు అందుకున్న ఈ రష్యన్‌ బ్యూటీ ‘ఇక ఆడలేనంటూ’ టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పింది. నాలుగేళ్ల క్రితం నాటి డోపింగ్‌ మరకలకు తోడు ఎప్పటి నుంచో వేధిస్తున్న భుజం గాయం కారణంగా మునుపటిలా ఆటను ఆస్వాదించలేకపోతున్నానంటూ రాకెట్‌ను పక్కన పెట్టేసిందీ టెన్నిస్‌ సెన్సేషన్‌.

View this post on Instagram

A post shared by Maria Sharapova (@mariasharapova) on

ఇక ఆడలేను!
మహిళలు ఎంతో ఇష్టపడే టెన్నిస్‌ క్రీడకు తన ఆటతీరుతో మరిన్ని వన్నెలద్దింది మరియా షరపోవా. ప్రొఫెషనల్‌ టెన్నిస్‌లో ఐదు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు, ఒలింపిక్‌ మెడల్‌ సాధించిన ఆమె.. వరల్డ్‌ టెన్నిస్‌ ర్యాంకింగ్స్‌లో నెం.1 ర్యాంక్‌ను కూడా సొంతం చేసుకుంది. కెరీర్‌ మధ్యలో చాలాసార్లు గాయాలు బాధపెట్టినా ప్రతిసారీ సముద్ర కెరటంలా ఎగిసిపడుతూ అరుదైన విజయాలు సాధించింది. అయితే నాలుగేళ్ల క్రితం నాటి డోపింగ్‌ మరకలు ఈ టెన్నిస్‌ స్టార్‌ కెరీర్‌ను మసక బార్చాయని చెప్పుకోవచ్చు. 15 నెలల నిషేధం తర్వాత కోర్టులో అడుగుపెట్టినా మునుపటిలా ‘ఫామ్‌’ అందుకోలేకపోయింది మరియా. వరుస పరాజయాలు వెక్కిరించాయి. ఒకప్పుడు వరల్డ్‌ నెం.1 టెన్నిస్‌ క్రీడాకారిణిగా ఉన్న షరపోవా ప్రస్తుత ర్యాంక్‌ 373. ఓవైపు వరుస ఓటములు, మరోవైపు భుజం గాయం ఆమెను మరింత కుంగదీశాయి. దీంతో ఇక ఆటకు వీడ్కోలు పలకాల్సిన సమయం ఆసన్నమైందని నిర్ణయించుకుందామె. ఈ క్రమంలో తానింకా టెన్నిస్‌ కోర్టులో అడుగుపెట్టలేనంటూ ఓ వెబ్‌సైట్‌ వేదికగా ప్రకటించింది షరపోవా.

View this post on Instagram

A post shared by Maria Sharapova (@mariasharapova) on

సోచీ టు ఫ్లోరిడా!
1987, ఏప్రిల్‌ 19న యూరీ, ఎలెనా దంపతులకు పుట్టింది షరపోవా. సోవియట్‌ యూనియన్‌లో భాగమైన ‘న్యాగన్‌’ అనే ఓ మారుమూల ప్రాంతం ఆమె సొంతూరు. అయితే చెర్నోబిల్‌ న్యూక్లియర్‌ ప్లాంట్ ప్రమాదం కారణంగా 1989లో షరపోవా కుటుంబం సోచీకి మకాం మార్చింది. నాలుగేళ్ల వయసులో తండ్రితో కలిసి అక్కడి పార్కులో మొదటిసారిగా టెన్నిస్‌ ప్రాక్టీస్‌ మొదలెట్టిన షరపోవా.. ఆ తర్వాత ఓ రష్యన్‌ కోచ్‌ దగ్గర శిక్షణ తీసుకుంది. ఆ సమయంలోనే మాస్కోలో ఓ టెన్నిస్‌ క్లినిక్‌ నిర్వహిస్తున్న టెన్నిస్‌ లెజెండ్‌ మార్టినా నవ్రతిలోవా షరపోవాలోని ప్రతిభను గుర్తించింది. మోనికా సెలెస్‌, అన్నా కోర్నికోవా, అగస్సీ లాంటి దిగ్గజాలు శిక్షణ తీసుకున్న ఫ్లోరిడాలోని నిక్‌బొలేటరీ టెన్నిస్‌ అకాడమీలో ఆమెను చేర్పిస్తే బాగుంటుందని షరపోవా తండ్రి యూరీకి సూచించింది మార్టినా.

View this post on Instagram

A post shared by Maria Sharapova (@mariasharapova) on

రెండేళ్లు అమ్మకు దూరంగా!
అప్పటికే ఒకసారి మకాం మార్చి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన యూరీ.. కూతురు భవిష్యత్‌ కోసం మళ్లీ ఫ్లోరిడాకు తన నివాసం మార్చాడు. అయితే వీసా నిబంధనల కారణంగా షరపోవా తల్లి సోచీలోనే ఉండిపోయింది. దీంతో ఆట కోసం సుమారు రెండేళ్లు తల్లికి దూరంగా ఉండిపోయింది షరపోవా. ఇక ఇంగ్లిష్‌ అర్థం కాకపోయినా కేవలం 700డాలర్లు(సుమారు 50వేలు) చేత పట్టుకొని తన కూతురు షరపోవాతో కలిసి అమెరికాలో అడుగుపెట్టాడు యూరీ. చిన్నా చితకా పనులతో పాటు పార్ట్‌టైమ్‌ జాబ్‌లు కూడా చేశాడు. ఇక తన కోసం తండ్రి పడుతున్న తాపత్రయాన్ని అర్థం చేసుకున్న షరపోవా పూర్తిగా ఆటపైనే దృష్టి సారించింది. స్థానిక టోర్నీల్లో సత్తా చాటుతూ ప్రముఖ ఐఎంజీ సంస్థను ఆకర్షించింది. ఆ సంస్థ అందించే స్పాన్సర్‌షిప్‌తో ఎట్టకేలకు తొమ్మిదేళ్ల వయసులో నిక్‌బొలేటరీ టెన్నిస్‌ అకాడమీలో చేరింది. అక్కడి నుంచే ఆమె విజయ ప్రస్థానం మొదలైందని చెప్పవచ్చు.

View this post on Instagram

A post shared by Maria Sharapova (@mariasharapova) on

రికార్డుల రారాణి!
* 13 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ జూనియర్‌ టెన్నిస్‌ టోర్నీలో విజేతగా నిలిచిన షరపోవా 15 ఏళ్లకే WTA టోర్నమెంట్లలో ఆడడం మొదలుపెట్టింది.
* 2004 షరపోవా జీవితాన్ని మలుపు తిప్పిందని చెప్పుకోవచ్చు. ఆ ఏడాది వింబుల్డన్‌ టైటిల్‌ గెలిచిన ఆమె ఫైనల్‌లో ఏకంగా అమెరికా నల్ల కలువ సెరెనాను మట్టి కరిపించడం విశేషం. అప్పటికామె వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమే.

View this post on Instagram

A post shared by Maria Sharapova (@mariasharapova) on

* 2005లో మొదటిసారిగా మహిళల సింగిల్స్‌లో నంబర్‌ వన్‌ ర్యాంక్‌ సొంతం చేసుకున్న ఈ టెన్నిస్‌ భామ.. ఆ మరుసటి ఏడాదే యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది.
* ఆ సమయంలో మహిళల సింగిల్స్‌లో మకుటం లేని మహారాణిలా దూసుకుపోతున్న షరపోవా ఆధిపత్యానికి ఆమె గాయమే అడ్డుకట్ట వేసింది. తీవ్ర భుజం గాయం కారణంగా 2006-08 మధ్యకాలంలో ఆమె ఆటతీరు మసకబారింది. వరుస వైఫల్యాలతో నంబర్‌ వన్‌ ర్యాంక్‌ కూడా ఆమెకు దూరమైంది.
* చిన్నప్పటి నుంచే ఎన్నో ఎత్తు పల్లాలను అవలీలగా అధిగమించిన షరపోవా ఆటలోనూ అదే సానుకూల దృక్పథాన్ని అనుసరించింది.

View this post on Instagram

A post shared by Maria Sharapova (@mariasharapova) on

* 2008లో సముద్రకెరటంలా దూసుకొచ్చిన ఈ టెన్నిస్‌ స్టార్‌.. ఆస్ర్టేలియన్‌ ఓపెన్‌ను గెలుచుకుని ఘనంగా తన పునరాగమనాన్ని చాటింది. అయితే అదే ఏడాది మరోసారి తన భుజానికి శస్ర్తచికిత్స చేయించుకుంది.

View this post on Instagram

A post shared by Maria Sharapova (@mariasharapova) on

గాయాలు వెనక్కి లాగాయి!
వరుస విజయాలతో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌లో ముందుకు వెళుతున్న షరపోవాను వరుస గాయాలు కూడా ఎప్పటికప్పుడు వెనక్కి లాగాయని చెప్పుకోవచ్చు. 2008లో ఆస్ర్టేలియన్‌ ఓపెన్‌ గెలిచిన తర్వాత ఈ అమ్మడు మళ్లీ WTA టైటిల్‌ గెలవడానికి నాలుగేళ్లు పట్టింది. 2012లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను గెలుచుకున్న ఆమె మరోసారి వరల్డ్‌ నంబర్‌ వన్‌ టెన్నిస్‌ క్రీడాకారిణిగా ఆధిపత్యం చెలాయించింది. ఇక అదే ఏడాది లండన్‌ ఒలింపిక్స్‌లో రజత పతకం కూడా సొంతం చేసుకుంది. 2014లో మరోసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచినా భుజం గాయం మళ్లీ వేధించింది. ఈ క్రమంలో 2016 ఆస్ర్టేలియన్‌ ఓపెన్‌ టోర్నీ సమయంలో ఆమె ‘మెల్డోనిన్‌’ అనే నిషేధిత ఉత్ర్పేరకం వాడినట్లు తేలింది. దీంతో ప్రపంచ టెన్నిస్‌ సమాఖ్య ఆమెపై 15 నెలల సస్పెన్షన్‌ వేటు వేసింది.

View this post on Instagram

A post shared by Maria Sharapova (@mariasharapova) on

ఇక నిషేధం తర్వాత తిరిగి కోర్టులో అడుగుపెట్టిన షరపోవా మునుపటి ఫామ్‌ను అందుకోవడానికి తీవ్రంగా శ్రమించింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీఏ టైటిల్‌ గెలిచి మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపించింది. అయితే భుజం గాయం మళ్లీ తిరగబెట్టింది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ర్టేలియన్‌ ఓపెన్‌లో వైల్డ్‌ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చిన ఈ టెన్నిస్‌ స్టార్‌.. మొదటి రౌండ్‌లోనే పరాజయం పాలైంది. ఆమె ఆటతో పాటే వరల్డ్‌ టెన్నిస్‌ ర్యాంకింగ్‌లో తన ర్యాంక్‌ పూర్తిగా దిగజారుతూ వచ్చింది. ప్రస్తుతం 373 ర్యాంక్‌లో ఉన్న ఆమె మెల్‌బోర్న్‌ టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 26న జరిగిన మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. దీంతో వెంటనే ఆటకు గుడ్‌బై చెప్పేసిందీ టెన్నిస్‌ సెన్సేషన్‌.

View this post on Instagram

A post shared by Maria Sharapova (@mariasharapova) on

‘షుగర్‌పోవా’ పేరుతో..!
ఆటతో పాటు అందంతో క్రీడాభిమానుల నీరాజనాలు అందుకున్న షరపోవా సంపాదనలోనూ అందరికంటే ముందు నిలిచింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించిన ఆమె అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న క్రీడాకారిణిగా ‘ఫోర్బ్స్‌’ లిస్టులో అగ్ర స్థానాన్ని సొంతం చేసుకుంది. మోడలింగ్‌లోనూ ప్రావీణ్యమున్న షరపోవా తన ఆదాయంతో ఏకంగా 11 ఏళ్ల పాటు ‘ఫోర్బ్స్‌’ జాబితాలో అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఇక వ్యాపార రంగంలోనూ సత్తా చాటిన షరపోవా తన పేరుమీద ‘షుగర్‌పోవా’ అనే క్యాండీ కంపెనీని కూడా ప్రారంభించడం విశేషం.

View this post on Instagram

A post shared by Maria Sharapova (@mariasharapova) on

నిన్ను మిస్సవుతున్నా.. క్షమించు!
ఇక టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించిన షరపోవా భావోద్వేగానికి గురైంది. ఈ క్రమంలో టెన్నిస్‌తో తనకున్న అనుబంధానికి అక్షర రూపమిస్తూ ఓ వెట్‌సైట్‌కు వీడ్కోలు సందేశం పంపించింది. ‘చిన్నప్పటి నుంచి నాకెంతో ఇష్టమైన ఆట టెన్నిస్‌. ఇది 28 ఏళ్ల పాటు నాకెన్నో మధురమైన జ్ఞాపకాలను అందించింది. వీటితో పాటు ఓ కుటుంబం, లక్షలాది మంది అభిమానులను అందించిన ఆటను వదిలేయాల్సి వస్తోంది. అందుకే .. నన్ను క్షమించు టెన్నిస్‌.. నేను నీకు గుడ్‌బై చెబుతున్నా. నేను జీవితంలో మరో దశను ప్రారంభించబోతున్నా. భవిష్యత్‌ గురించి నాకెప్పుడూ బెంగ లేదు. అదే నా విజయ రహస్యమనుకుంటా. ప్రయత్నిస్తే ఎప్పటికైనా మన లక్ష్యాన్ని చేరుకోగలమని నా జీవితం నిరూపించింది. ఇక నేను నా లైఫ్‌ను టెన్నిస్‌కు ఇస్తే.. టెన్నిసే తిరిగి నాకు లైఫ్‌ ఇచ్చింది..’ అంటూ తన మనసులోని మాటలను పంచుకుందీ టెన్నిస్‌ స్టార్‌.

View this post on Instagram

A post shared by Maria Sharapova (@mariasharapova) on

మరో శిఖరాన్ని అధిరోహిస్తా!
‘టెన్నిస్‌.. ఇక ప్రతిరోజూ నిన్ను మిస్సవుతాను. నా దినచర్య కూడా పూర్తిగా మారిపోనుంది. ఉదయాన్నే లేవడం, రోజూ ఎడమ కాలికి షూ లేస్‌ కట్టుకోవడం, టెన్నిస్‌ ట్రైనింగ్‌ సెషన్లు, నా టీం, సభ్యులందరినీ మిస్సవుతా. వీటితో పాటు చిన్నప్పుడు టెన్నిస్‌ కోర్టులో నాన్నతో గడిపిన ఆనంద క్షణాలు, గెలిచినా.. ఓడినా ప్రత్యర్థులతో చేయి కలపడాలు, ఎప్పటికప్పుడు నాలోని అత్యుత్తమ ఆటతీరును బయటకు తీసిన ప్రత్యర్థులు.. ఇలా చాలా వాటికి దూరమవుతోన్నా. ఒకసారి నేను వెనుదిరిగి చూసుకుంటే నేను ఎక్కాల్సిన పర్వతం టెన్నిస్‌ అని అర్థమైంది. దీనిని అధిరోహించే క్రమంలో ఎన్నో అడ్డంకులను అధిగమించా. కానీ ఒకసారి శిఖరాన్ని చేరుకున్నాక దానిమీద నుంచి కనిపించే దృశ్యాలు అద్భుతం. ప్రస్తుతం నేను మరో శిఖరాన్ని అధిరోహించాలనుకుంటున్నా. ఈక్రమంలో కొత్త లక్ష్యాలతో కొత్త జీవితం ప్రారంభించబోతున్నా..’ అని తన సందేశంలో వివరించిందీ రష్యన్‌ ముద్దుగుమ్మ.

View this post on Instagram

A post shared by Maria Sharapova (@mariasharapova) on

సేవా కార్యక్రమాల్లోనూ ముందే...!

అందం, అంతకుమించి మంచి మనసున్న షరపోవా సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటుంది. ‘షరపోవా ఛారిటీ ఫౌండేషన్‌’ ను ఏర్పాటుచేసి చిన్న పిల్లల చదువులు, వారి ఇతర అవసరాలకు స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తోందామె. అదేవిధంగా చెర్నోబిల్‌ ప్రభావిత ప్రాంతాల్లోని చిన్నారుల కోసం యూఎన్‌డీపీ(యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌)తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తోందీ టెన్నిస్‌ బ్యూటీ. ఇక 2017, ఫిబ్రవరి 14న యూఎన్‌డీపీ గుడ్‌విల్‌ అంబాసిండర్‌గా నియమితురాలైన సందర్భంగా ఆ సంస్థకు తన ఫౌండేషన్‌ తరఫున పెద్ద ఎత్తున ఆర్థిక విరాళం అందజేసిందీ టెన్నిస్‌ సెన్సేషన్‌. 2014లో తన స్వదేశంలో జరిగిన వింటర్‌ ఒలింపిక్స్‌ కోసం పెద్ద ఎత్తున ప్రమోషన్‌ కార్యక్రమాలు చేపట్టింది షరపోవా. అంతేకాదు ఆ ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుకల్లో రష్యా తరఫున ఫ్లాగ్‌ బేరర్‌గా వ్యవహరించిన ఆమె.. జట్టును ముందుండి నడిపించింది. ఇక 2013లో తన పేరు మీద ప్రారంభించిన ‘షుగర్‌ పోవా’ క్యాండీ అమ్మకాలపై వచ్చిన లాభాలన్నీ ‘షరపోవా ఛారిటీ ఫౌండేషన్‌’ కే చెందుతాయని ప్రకటించి మరోసారి తన పెద్ద మనసును చాటుకుంది. ఇక ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లు ఆడుతూ పెద్ద ఎత్తున విరాళాలు సేకరించిన ఆమె క్యాన్సర్‌పై కూడా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇక తన స్ఫూర్తిదాయకమైన జీవితానికి పుస్తక రూపమిచ్చిన షరపోవా 2017లో ‘అన్‌స్టాపబుల్’ : మై లైఫ్‌ సో ఫార్‌’ పేరుతో ఓ తన ఆత్మకథను రాసి విడుదల చేసింది.

ఏదేమైనా దాదాపు మూడు దశాబ్దాల పాటు టెన్నిస్‌నే ఊపిరిగా భావించి.. ఎందరో క్రీడాభిమానుల మనసుల్లో గూడు కట్టుకున్న షరపోవా టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పింది.. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోంది.. తాను అనుకున్నట్లుగానే తన ఆశయాన్ని నెరవేర్చుకొని మరింత ఉన్నతంగా తన జీవితాన్ని మలచుకోవాలని మనమూ మనసారా కోరుకుందాం..!
ఆల్‌ ది బెస్ట్‌ టెన్నిస్‌ బ్యూటీ!

women icon@teamvasundhara
despite-testing-positive-mp-health-principal-secretary-pallavi-continues-to-work

కరోనా సోకినా బాధ్యత మరువలేదు!

కరోనా కారణంగా దేశమంతా పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలవుతోంది. దీంతో వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలతో పాటు సామన్యులంతా ఇంటికే పరిమితమయ్యారు. ఇక వీలైనంత వేగంగా కరోనాను అరికట్టేందుకు చాలామంది ప్రభుత్వాధికారులు కూడా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా వైద్యశాఖాధికారులు రాత్రి, పగలు అనే తేడాల్లేకుండా విధుల్లో తలమునకలవుతున్నారు. ఎప్పటికప్పుడు కరోనా బాధితులను గుర్తిస్తూ వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే ఈ క్రమంలో దురదృష్టవశాత్తూ కొందరు ప్రభుత్వాధికారులను కూడా ఈ మహమ్మారి కాటేస్తోంది. మధ్యప్రదేశ్‌ ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి పల్లవీ జైన్‌ గోవిల్‌ కూడా తాజాగా కరోనా బారిన పడ్డారు. కానీ ప్రజల సౌకర్యార్థం, వారి రక్షణ కోసం క్వారంటైన్‌ రూం నుంచే విధులు నిర్వహిస్తూ తన సేవా నిరతిని చాటుకుంటున్నారీ ఐఏఎస్‌ ఆఫీసర్‌.

Know More

women icon@teamvasundhara
vizag-originated-jorhat-district-collector-heart-touching-story-in-this-lockdown-period

women icon@teamvasundhara
104-years-italian-lady-and-101-years-spanish-woman-recover

ఈ సెంచరీ బామ్మలు కరోనాను జయించారు!

చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచమంతా పంజా విసురుతోంది. చిన్నా, పెద్దా, పేద, ధనిక అనే తేడాల్లేకుండా అందరినీ బలి తీసుకుంటోంది. ఈ వైరస్‌ ప్రభావంతో ప్రపంచంలోనే అత్యంత మెరుగైన వైద్య సదుపాయాలున్న ఇటలీలో మరణ మృదంగం వినిపిస్తోంది. అయితే గతంతో పోల్చితే ప్రస్తుతం అక్కడి పరిస్థితులు కొంచెం మెరుగయ్యాయని చెప్పచ్చు. కానీ ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే సుమారు 16 వేల మంది మరణించగా, లక్షలాది మంది బాధితులు ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఈ వైరస్‌ కారణంగా ఇటలీలో ప్రాణాలు కోల్పోయిన వారిలో వృద్ధులే అధికమని అక్కడి గణాంకాలు చెబుతున్నాయి. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడమే దీనికి కారణమని, అందుకే కరోనా బారిన పడిన ముసలివారు కోలుకోలేక తనువు చాలిస్తున్నారని పలువురు ప్రముఖులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటలీతో పాటు ప్రపంచంలోని వృద్ధులందరికీ ఊరట కలిగిస్తూ తాజాగా 104 ఏళ్ల ఇటాలియన్‌ బామ్మ ఈ కరోనా నుంచి సురక్షితంగా కోలుకున్నారు. ఆమెతో పాటు స్పెయిన్‌కు చెందిన 101 ఏళ్ల ఓ వృద్ధురాలు కూడా ఈ మహమ్మారి బారి నుంచి బయటపడి ఇటీవల ఇంటికి చేరుకున్నారు.

Know More

women icon@teamvasundhara
8-months-pregnant-nurse-traveled-250-kms-to-serve-covid-patients

నిండు గర్భంతోనే ‘కరోనా’ రోగులకు చికిత్స అందిస్తోంది!

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. దేశాధ్యక్షులు, సెలబ్రిటీలు, సామాన్యులు అనే భేధం లేకుండా.. వేలాదిమందిని బలితీసుకుంటుందీ మహమ్మారి. కరోనా నుండి ప్రపంచాన్ని కాపాడడానికి అలుపెరుగకుండా ప్రయత్నిస్తోన్న డాక్టర్స్‌, నర్సులను చూస్తుంటే దివి నుంచి ఆ దేవుళ్లే వీళ్ల రూపంలో భూమిపైకి వచ్చారేమో అనిపించక మానదు. రోజులకు రోజులు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ.. వారి ఆరోగ్యం ఎలా ఉన్నా.. లెక్కచేయకుండా ప్రజల ప్రాణాల కోసమే అహర్నిశలూ పాటుపడుతున్నారు ఎందరో వైద్య సిబ్బంది. ఈ క్రమంలోనే 8 నెలల నిండు గర్భిణిగా ఉన్నప్పటికీ రోగులకు సేవలందించడానికి ముందుకొచ్చింది తమిళనాడుకు చెందిన ఓ నర్సు. తన ఆరోగ్యం కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమంటూ తన వృత్తి ధర్మాన్ని చాటుతోందామె. ఇంతకీ ఎవరామె? ఏంటా కథ..? రండి.. తెలుసుకుందాం.

Know More

women icon@teamvasundhara
these-woman-social-service-in-this-lockdown-is-exceptional
women icon@teamvasundhara
classical-dancer-performs-mohiniyattam-to-spread-awareness-about-corona

తన కళతోనే ‘కరోనా’పై అవగాహన పెంచుతోంది!

ప్రపంచాన్ని ముప్పతిప్పలు పెట్టి మూడుచెరువుల నీళ్లు తాగిస్తోంది కరోనా. ఇక భారతదేశంలోనూ క్రమంగా విస్తరిస్తోన్న ఈ వైరస్‌ను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలుచేస్తోంది. అదేవిధంగా కరోనా ఉపద్రవానికి సంబంధించి ఎప్పటికప్పుడు దేశ పరిస్థితులను సమీక్షిస్తూ పలు జాగ్రత్తలు, మార్గదర్శకాలు జారీ చేస్తోంది. సామాజిక బాధ్యతగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖ సెలబ్రిటీలు కూడా కరోనా కట్టడిపై అవగాహన కల్పిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. ఈక్రమంలో కేరళకు చెందిన ప్రముఖ క్లాసికల్‌ డ్యాన్సర్‌ డాక్టర్‌ మెథిల్‌ దేవిక కూడా తన నృత్యగానంతో ఈ మహమ్మారిపై అవగాహన కల్పించారు.

Know More

women icon@teamvasundhara
iranian-doctor-shirin-rouhani-dies-while-treating-corona-virus-patients

కరోనా రోగులకు చికిత్స చేస్తూనే కన్నుమూసింది!

కంటికి కనిపించకుండానే ప్రతి ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తోంది కరోనా. చిన్నా, పెద్దా, ధనిక, పేద అన్న తారతమ్యాల్లేకుండా అందరినీ కబళిస్తోన్న ఈ వైరస్‌ కారణంగా ప్రజలందరూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో.. పూజలందుకునే దేవుడి కంటే వైద్యం చేసే డాక్టర్లకే అందరూ చేతులెత్తి మొక్కుతున్నారు. అందుకు తగ్గట్లే వైద్యులు, నర్సులు విధి నిర్వహణలో భాగంగా కుటుంబ సభ్యులకు సైతం దూరంగా ఉంటూ ఈ ప్రాణాంతక వైరస్‌పై పోరాటం సాగిస్తున్నారు. ఈ సందర్భంగా కరోనా రోగులకు చికిత్స అందించే క్రమంలో కొందరు వైద్యులు దురదృష్టవశాత్తూ అదే మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ కోవకే చెందుతారు ఇరాన్‌కు చెందిన డాక్టర్‌ షిరిన్‌ రౌహాని. కరోనా బాధితులను కాపాడడం కోసం తన తుది శ్వాస దాకా అలుపెరగని పోరాటం చేశారామె. అయితే బతుకు పోరులో మాత్రం ఆ మహమ్మారి చేతిలో ఓడిపోయి ప్రాణాలొదిలారీ గ్రేట్‌ డాక్టర్‌.

Know More

women icon@teamvasundhara
chinese-woman-doctor-xia-sisi-dies-from-coronavirus
women icon@teamvasundhara
patna-resident-anita-vinod-recovers-from-covid-19-in-just-11-days

అలా పది రోజుల్లోనే ‘కరోనా’ నుంచి బయటపడ్డా!

కరోనా.. ఈ పేరు వింటేనే ప్రతి ఒక్కరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత మేధావి అయిన మనిషి మనుగడకే సవాలు విసురుతోందీ మహమ్మారి. అటువంటి భయానక వ్యాధిని కూడా జయించి కొందరు మృత్యుంజయులుగా నిలవడం ఎంతో సంతోషించాల్సిన విషయం అని చెప్పచ్చు. ఇలాంటి వారి కథలు తెలుసుకోవడం వల్ల ప్రతి ఒక్కరిలో కరోనాను జయించగలమనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందుకే చాలామంది కొవిడ్‌-19 నుండి కోలుకున్న తర్వాత తమ అనుభవాలను, కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరిస్తూ వీడియోలు, సోషల్‌ మీడియా పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే పాట్నాకు చెందిన అనితా వినోద్‌ అనే మహిళ కూడా కరోనా నుండి పూర్తిగా కోలుకున్న అనంతరం ప్రజలను అప్రమత్తం చేయడానికి తన వంతుగా ముందుకొచ్చింది. కరోనాను ఎదుర్కొనే క్రమంలో తనకెదురైన అనుభవాలను వీడియో రూపంలో అందరితో పంచుకుందీ డేరింగ్‌ ఉమన్‌. బిహార్‌ రాష్ట్రంలో కరోనా బారిన పడిన, ఆ వైరస్‌ నుంచి కోలుకున్న మొదటి వ్యక్తి అనిత. మరి తనెలా ఈ వ్యాధి నుండి బయటపడిందో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
gvmc-commissioner-srujana-left-her-22-days-baby-to-fight-with-corona
women icon@teamvasundhara
uk-journalist-shares-corona-virus-experience

ఇంత ఘోరమైన చావు నాకెందుకిస్తున్నావ్‌ దేవుడా.. అనిపించింది!!

కంటికి కనిపించకుండా ప్రపంచాన్నంతా కలవరపెట్టిస్తోంది కరోనా. చిన్నా, పెద్దా, ధనిక, పేద అన్న తేడాల్లేకుండా అందరినీ కబలిస్తోంది. అగ్రరాజ్యమైన అమెరికా, అత్యాధునిక వైద్య సదుపాయాలుండే ఇటలీ, ధనిక దేశాలైన స్పెయిన్‌, జర్మనీ లాంటి దేశాలకు కూడా చుక్కలు చూపిస్తోంది. ఇక బ్రిటన్‌లోనూ కరోనా జూలు విదిల్చుతోంది. ఏకంగా ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఈ మహమ్మారి బారిన పడ్డారంటేనే అక్కడ పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ దేశ ఆరోగ్య మంత్రి మ్యాట్‌ హాన్‌కాక్‌, బ్రిటన్‌ యువరాజు చార్లెస్‌లకు కూడా ఈ వైరస్‌ సోకింది. అయితే సామాజిక దూరం పాటిస్తూ స్వీయ నిర్బంధంలో ఉంటే ఈ ఉపద్రవం నుంచి సులభంగా బయటపడవచ్చని ఇప్పటికే చాలామంది కొవిడ్‌ బాధితులు తమ స్వీయానుభవంతో నిరూపించారు. తాజాగా తాను కూడా ఈ జాబితాలో ఉన్నానంటోంది బ్రిటన్‌కు చెందిన తోబి అకింగ్‌బాడే. కరోనా బారిన పడి ఇటీవలే కోలుకున్న ఈ 28 ఏళ్ల జర్నలిస్టు తన అనుభవాలను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకుంది. ఇందులో భాగంగా కరోనా లక్షణాలు, ఐసోలేషన్‌లో పడిన బాధలు, వాటిని అధిగమించిన తీరును ట్విట్టర్‌ వేదికగా సవివరంగా అందరితో పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
bollywood-actress-shikha-malhotra-turned-nurse-to-serve-the-coid-19-patients

దయచేసి ‘కరోనా’కు ఆ అవకాశం ఇవ్వకండి!

కరోనా ప్రపంచ విపత్తుగా పరిణమించింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు డబ్బు రూపంలో తమ దాతృత్వాన్ని చాటుకుంటుంటే.. మరి కొందరు వ్యాధి గురించి అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ బాటలోనే తానూ నడుస్తున్నానంటూ తన సేవా భావాన్ని చాటుకుంది బాలీవుడ్‌ నటి శిఖా మల్హోత్రా. ప్రస్తుతం ఈ మహమ్మారి బారి నుండి ప్రజలను కాపాడడానికి డాక్టర్లు, నర్సులు చేస్తోన్న ఎనలేని సేవలకు మరేదీ సాటి రాదని చెప్పచ్చు. అటువంటి మహోన్నత సేవలో తానూ పాలుపంచుకుంటానని ముందుకొచ్చింది నటి శిఖ. 2014లో నర్సింగ్‌ కోర్స్‌ పూర్తిచేసిన ఈ అందాల తార ఇలాంటి విపత్కర సమయంలో తన సేవలను అందిస్తూ అందరి మన్ననలు అందుకుంటోంది. దీనికి సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ.. క్యాప్షన్ల రూపంలో ప్రస్తుతం ఆసుపత్రుల్లో ఉన్న వాస్తవ పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్లు చూపించిందీ తార. మరి ఆ వివరాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
minal-dakhve-bhosle-the-woman-behind-indias-first-covid-testing-kit

కరోనా కిట్‌ అందించాకే డెలివరీకి వెళ్లింది!

దగ్గినా, తుమ్మినా, కాస్తంత నీరసంగా అనిపించినా.. అమ్మో నాకు కరోనా వచ్చిందేమో అని భయపడాల్సిన పరిస్థితులొచ్చాయి. కంటికి కనిపించని అతి సూక్ష్మ వైరసే అయినా ఈ ప్రపంచంలోనే అతి బలవంతుడైన మనిషిని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తోందీ మహమ్మారి. అయితే మరి మనలో కరోనా లక్షణాలు కనిపించినప్పుడు వాటిని నిర్ధరించుకోవడానికి వెంటనే హాస్పిటల్‌కి పరిగెత్తుతుంటాం. అక్కడ కూడా రక్తనమూనాలు సేకరించి తుది ఫలితం వెల్లడించడానికి రోజులకు రోజులు సమయం పట్టేది. ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కరోనా టెస్టింగ్‌ కిట్స్‌ ఆరేడు గంటల్లో ఫలితం తేల్చినా అవి సరిపోవట్లేదు. ఈ సమస్యలన్నీ గుర్తించి చక్కటి పరిష్కారం చూపింది పుణేకు చెందిన ‘మైల్యాబ్‌’ అనే ఫార్మా కంపెనీ. ఈ క్రమంలో దేశంలోనే తొలి కరోనా టెస్ట్‌ కిట్‌ను రూపొందించింది. ‘మైల్యాబ్‌ పరిశోధన అభివృద్ధి విభాగపు’ హెడ్‌, ప్రముఖ వైరాలజిస్ట్‌ మినాల్‌ దఖావే భోస్లే ఈ కిట్‌ తయారీలో కీలక పాత్ర పోషించడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ టెస్ట్‌ కిట్‌ గురించి మినాల్‌ ఏం చెబుతోందో తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
woman-pilot-crew-of-air-india-flight-that-evacuated-students-from-italy-earn-praise-on-social-media

స్వాతి.. నీ ధైర్యం ఎందరికో స్ఫూర్తి..!

ఒకవైపు కరోనా విజృంభణ తీవ్రంగా ఉండడంతో వైద్య సేవలు అందించలేక విదేశీయులను తమ సొంత దేశాలకు వెళ్లిపొమ్మంటూ ఇటలీ ప్రభుత్వం ఆదేశం.. మరోవైపు అంతర్జాతీయ విమాన సేవలు నిలిపివేత. దీంతో ఇటలీలో ఉంటోన్న భారతీయులు దిక్కుతోచని స్థితిలో సతమతమవుతున్నారు. మరికొన్ని రోజులు అక్కడే ఉంటే తాము కూడా కరోనాకు బలవుతామనే భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కాలాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలో ఇటలీలో చిక్కుకుపోయిన 263 మంది భారతీయులను మన దేశానికి సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఓ భారీ బోయింగ్‌ 777 విమానాన్ని సిద్ధం చేసింది ఎయిర్‌ ఇండియా సంస్థ. అయితే ఈ విమానానికి సారథ్యం వహించింది ఓ మహిళ. తనే కెప్టెన్ స్వాతి రావల్‌. ప్రస్తుతం కరోనా వ్యాప్తిలో అగ్రస్థానంలో ఉన్న ఇటలీ లాంటి దేశం నుంచి మన వాళ్లను క్షేమంగా స్వదేశానికి చేర్చి.. రెస్క్యూ ఫ్లైట్‌కు సారథ్యం వహించిన తొలి మహిళా సివిలియన్‌ పైలట్‌గా చరిత్ర సృష్టించిందీ వీరనారి.

Know More

women icon@teamvasundhara
from-cleaner-to-an-english-teacher-in-the-same-school-the-inspirational-story-of-linja

స్వీపర్‌గా పనిచేసిన స్కూల్లోనే టీచరైంది!

చీపురు పట్టిన ఆ చేతులే నేడు చాక్‌పీస్‌ పట్టుకున్నాయి. రోజూ స్కూల్‌ను శుభ్రం చేసే ఆ చేతులే పుస్తకాలు పట్టుకుని పాఠాలు చెబుతున్నాయి. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయి. 12 ఏళ్ల క్రితం స్కూల్లో స్వీపర్‌గా చేరిన ఆర్‌జే లింజా నేడు అదే స్కూల్‌లో టీచర్‌గా సరికొత్త అవతారం ఎత్తింది. అంతేకాదు ఇక్కడితో తన ప్రయాణం ఆగిపోదని మరికొన్ని కొత్త కోర్సులు నేర్చుకుంటోంది. ఆత్మవిశ్వాసముంటే ఆలస్యమైనా విజయం దక్కుతుందని మరోసారి నిరూపించిన ఈ 39 ఏళ్ల కేరళ పంతులమ్మ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
gandhi-hospital-nurses-fight-against-coronavirus

కరోనాపై యుద్ధంలో ఈ నర్సమ్మల పాత్ర అద్వితీయం..!

‘‘అనవసరంగా బయటకు రాకండి.. ఇంటి పట్టునే ఉండండి..’’ ఎల్లలు దాటొచ్చిన కరోనా మహమ్మారిని అరికట్టడానికి ప్రభుత్వం చేస్తున్న సూచనలు. ఈ షరతులు వారికి వర్తించవు. ప్రమాదమని తెలిసినా.. కంటికి కనిపించని శత్రువు కట్టడిలో తలమునకలై ఉన్నారు. కన్నవారు, కట్టుకున్న వాళ్లు, కడుపున పుట్టిన వాళ్లు.. ఇందరు దూరంగా ఉండేలా భయపెడుతున్న ‘కరోనా’కు అడ్డుగా నిలుస్తున్నారు వాళ్లు. సరిహద్దులో పహారా కాస్తున్న వీరజవాన్లుగా ఆస్పత్రిలో నిలబడి బాధితులకు భరోసా కల్పిస్తున్నారీ నర్సమ్మలు. వైరస్‌ పీడితులను కాపాడేందుకు తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
nirbhaya-mother-ashadevi-struggle

నా కూతుర్ని ఎన్నోసార్లు చంపుకొన్నా..!

ఆనాడు కూతురు ఫోన్‌ కోసం ఎదురు చూసింది.. అర్ధరాత్రి దాటే వరకూ రాలేదు. తర్వాత దాదాపు ఏడున్నరేళ్లు న్యాయం కోసం ఎదురు చూసింది.. తెల్లవారుతుండగా వచ్చింది. నిర్భయ తల్లి గెలిచింది. ఆశాదేవి ఆశ నెరవేరింది. తన కూతురుపై పాశవిక దాడి చేసిన క్రూరులు.. ఉరికొయ్యకు వేలాడారన్న విషయం తెలిసి.. ఏళ్లకేళ్లు కన్నీరొలికిన ఆ అమ్మ కళ్లలో ఆనందం కనిపించింది. చట్టంలో లొసుగులపై పిడికిళ్లు బిగించిన ఆమె చేతులు మళ్లీ ఇన్నాళ్లకు విజయ చిహ్నం చూపాయి. అడుగడుగునా ఆటంకాలు ఎదురైనా.. అలుపెరగని దీక్షతో తన కూతురుకి నివాళి ఇచ్చిన నిర్భయ తల్లి పోరాట ప్రస్థానమిది.

Know More

women icon@teamvasundhara
seema-kushwaha-a-lawyer-who-stood-next-to-nirbhayas-mother-during-legal-battle

‘నిర్భయ’కు న్యాయం చేయడానికి ఏడేళ్లు పోరాడింది!

సుమారు ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ‘నిర్భయ’ దోషులు ఉరికంబం ఎక్కారు. ఆ ఆరుగురు కీచకులకు మరణదండన అమలు కావడంలో నిర్భయ తల్లిదే ప్రధాన పాత్ర. కడుపుకోతను దిగమింగుతూ ఆమె చేసిన అవిశ్రాంత పోరాటం ఫలితంగానే దోషులకు ఉరిశిక్ష పడిందని చెప్పవచ్చు. అయితే ఆమెతో పాటు మరో మహిళ కూడా ఏకధాటిగా ఏడేళ్ల పాటు నల్ల దుస్తులు వేసుకుని మరీ న్యాయం కోసం పోరాడింది. డిఫెన్స్‌ లాయర్ల ఎత్తుగడలు తిప్పికొడుతూ క్షమించరాని తప్పు చేసిన ఆ మానవ మృగాలకు మరణశాసనం లిఖించింది. ఆ లాయరే సీమా కుష్వాహా. అలా అని అమె ప్రొఫెషనల్‌ లాయరేమీ కాదు. ట్రెయినీగా ప్రాక్టీస్‌ చేస్తూనే.. చేపట్టిన తొలి కేసులోనే విజయం సాధించింది. ‘నిర్భయ’కు న్యాయం జరగగడంలో కీలకపాత్ర పోషించి ప్రస్తుతం అందరి అభినందనలు అందుకుంటున్న ఆ ట్రెయినీ లాయర్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
nirbhaya-case-history-and-her-mother-struggle

నా కుమార్తెకు న్యాయం జరిగింది.. అయినా ఈ పోరాటం ఆగదు !

ఆమె సంతోషం వెనుక ఏడేళ్లకుపైగా పడిన ఆవేదన ఉంది. చట్టంలోని లొసుగులను వాడుకొని శిక్షను తప్పించుకొనేందుకు దోషులు చేస్తున్న ప్రయత్నాలను చూసి ఆమె ఒక దశలో నిస్సహాయంగా ఆక్రోశించారు.. ఏడ్చారు.. బాధపడ్డారు. న్యాయం జరగదేమో అని భయపడ్డారు. కానీ పోరాడటం మాత్రం ఆపలేదు. తన కుమార్తెను అత్యంత పాశవికంగా చంపిన మానవ మృగాలకు శిక్షపడేందుకు ఆమె సుదీర్ఘ న్యాయపోరాటమే చేశారు. ‘దోషులు చట్టాన్ని ఎలా తప్పుదోవ పట్టించారో అందరూ చూశారు. ఇంకా మన వ్యవస్థలో ఇలాంటి లోటుపాట్లు చాలా ఉన్నాయి. చట్టాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది’ అని సాక్షాత్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాలే పేర్కొనడం వాస్తవ పరిస్థితికి అద్దంపట్టింది. ‘నా బిడ్డను రక్షించుకోలేకపోయాను.. ఆమె కోసం పోరాడతా’ అని చెప్పిన మాటలను ఆశాదేవి నిజం చేసి చూపించారు.

Know More

women icon@teamvasundhara
jennifer-haller-became-the-first-person-in-history-to-test-a-vaccine-for-coronavirus
women icon@teamvasundhara
italian-nurse-share-the-perils-of-working-in-a-coronavirus-ward

ఎంత బాధైనా ఓర్చుకుంటా.. కానీ వృత్తిధర్మాన్ని మాత్రం వీడను!

కరోనా.. ప్రస్తుతం ప్రపంచమంతా దీని గురించే మాట్లాడుకుంటోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలకూ కంటి మీద కునుకు రానివ్వడం లేదు. మరి, మన పరిస్థితే ఇలా ఉంటే నిరంతరాయంగా కరోనా రోగులకు చికిత్స చేసే డాక్టర్లు, నర్సుల పరిస్థితి ఇంకెంత దయనీయంగా ఉంటుంది చెప్పండి..! తాము చికిత్స చేసే పేషెంట్స్‌ ద్వారా తమకెక్కడ ఈ వైరస్‌ సోకుతుందోనని క్షణం క్షణం బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి వారిది. అయినా తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ వైరస్‌ బాధితులను కాపాడుతున్నారు. వృత్తిధర్మమే తమ అంతిమ లక్ష్యం అంటూ చాటుతున్నారు. ఇదే కోవకి చెందుతుంది ఇటలీకి చెందిన అలేసియా బొనారీ అనే నర్సు. కొవిడ్‌-19 బాధితులకు చికిత్స చేసే క్రమంలో నిరంతరాయంగా ముఖానికి కట్టుకునే మాస్కుల కారణంగా ముఖమంతా కందిపోయిన తన ముఖాన్ని కెమెరాలో బంధించిన ఆమె.. ఆ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ.. ఈ బాధ్యతల్లో తానెదుర్కొన్న సవాళ్ల గురించి సుదీర్ఘమైన పోస్ట్‌ పెట్టింది. ప్రస్తుతం తన ఫొటోతో పాటు పోస్ట్‌ కూడా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Know More

women icon@teamvasundhara
nita-ambani-named-in-a-list-of-10-most-influental-women-in-sports

అందులో అలా ‘టాప్‌’ గా నిలుస్తున్నారు!

సంపదలో అపర కుబేరుడి సతీమణి అయినా, తన సేవా కార్యక్రమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నీతా అంబానీ. సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేసే ఆమె రిలయన్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలిగా, ఛైర్‌పర్సన్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దేశానికి సంబంధించిన పలు క్రీడా ప్రాజెక్టుల్లోనూ పాలుపంచుకొంటున్న నీతా.. గతంలో ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీ సభ్యురాలిగా కూడా పనిచేశారు. ఇక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ‘ముంబయి ఇండియన్స్‌’ టీం యజమానురాలిగా జట్టును ముందుండి నడిపిస్తున్నారామె. ఇలా క్రీడా రంగంలో తను అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఓ అరుదైన గౌరవం దక్కించుకున్నారు నీతా అంబానీ. 2020 సంవత్సరానికి గాను క్రీడల్లో అత్యంత ప్రభావశీలురైన మహిళల జాబితాలో టాప్‌-10లో చోటు సంపాదించారీ సూపర్‌ వుమన్‌.

Know More

women icon@teamvasundhara
7-women-who-take-over-modis-social-media-accounts-for-a-day

ప్రధాని సోషల్‌ మీడియా ఖాతాలతో వాళ్లేం చేశారంటే..!!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రధాని నరేంద్రమోదీ తన సామాజిక మాధ్యమాల నిర్వహణకు స్ఫూర్తిమంతమైన మహిళలకు అప్పగిస్తానని కొద్దిరోజుల క్రితమే ప్రకటించిన సంగతి విదితమే. ఈ క్రమంలో అలాంటి మహిళల కథలను, ప్రజలకు వాళ్లు అందిస్తోన్న సేవల గురించి #SheInspireUs అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్‌ మీడియా ద్వారా పంచుకోండంటూ ఆయన పిలుపునిచ్చారు. దీంతో దేశవ్యాప్తంగా ఎంతోమంది మహిళలు తమ కథలను, తమకు తెలిసిన వ్యక్తుల స్ఫూర్తిదాయక కథలను వివిధ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రధానితో పంచుకున్నారు. వీరిలో నుంచి ఆయన ఓ ఏడుగురు మహిళలను ఎంపిక చేసి.. మార్చి 8, ఆదివారం రోజున ఆయన ఖాతాలను పర్యవేక్షించే బాధ్యతలను వాళ్లకు అప్పగించారు. ఇంతకీ ఆ ఏడుగురు మహిళలెవరు..?సమాజానికి వాళ్లు చేస్తోన్న సేవ ఏంటి..? ప్రధాని సోషల్‌ మీడియా ఖాతాలతో వాళ్లేం చేశారు..?.. మొదలైన విషయాలు తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
meet-the-woman-achievers-awarded-with-nari-shakti-puraskar
women icon@teamvasundhara
farmer-hymavathi-got-vasundhara-puraskaram
women icon@teamvasundhara
singer-gopika-poornima-got-vasundhara-puraskaram
women icon@teamvasundhara
anne-ferrer-got-vasundhara-puraskaram