scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'నేను ఏ తప్పూ చేయలేదు.. అయినా నాకెందుకీ శిక్ష!'

'ఎయిడ్స్.. నిరోధక మార్గాలు తప్ప పూర్తిస్థాయి చికిత్స లేని వ్యాధి. సాధారణంగా ఈ వ్యాధి సోకిందని తెలిస్తే చాలు.. వారు తప్పు చేశారు కాబట్టే ఆ వ్యాధి వచ్చిందని చుట్టుపక్కల ఉన్న వారు బలంగా నమ్ముతారు. ఈ క్రమంలో బాధితులను వారి మాటలతో మానసికంగానూ హింసిస్తారు. ఓ మహిళ తాను ఎలాంటి తప్పు చేయకపోయినా ఈ మహమ్మారి బారిన పడి ఒకానొక దశలో జీవితాన్ని ముగించేసుకోవాలనుకుంది.. కానీ ఆమెకు వచ్చిన ఓ ఆలోచన ఆ నిర్ణయాన్ని మార్చేసింది. అంతేకాదు.. ఈ సమాజంలో ఆమె ఎదుర్కొన్న మాటల ఈటెలు, బాధాకరమైన సంఘటనలు.. తనని మానసికంగా మరింత బలంగా తీర్చిదిద్దాయి.. దాంతో ఆమె ఎయిడ్స్‌పై పోరాడడమే కాదు.. చుట్టుపక్కల వారికీ అవగాహన కల్పిస్తూ తోటి వ్యాధిగ్రస్తులకు అండగానూ నిలుస్తోంది. అసలేం జరిగిందో ఆమె మాటల్లోనే విందాం రండి.. నమస్కారం.'

Know More

Movie Masala

 
category logo

అందుకే వీరంతా ఈ ఏడాది వార్తల్లో నిలిచారు..!

Women who are in news 2019

వాళ్లేం చేయగలరు అన్న దగ్గర నుంచి... వారు చేయలేనిది ఏదీ లేదు... అన్న స్థాయికి ఎదిగారు మహిళలు. ఏ రంగం తీసుకున్నా పురుషులతో సమానంగా పోటీపడుతున్నారు. పురుషులతో పోలిస్తే సమాన అవకాశాలు దక్కకపోయినా తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్నారు ఎంతోమంది వనితలు. వారి వారి రంగాల్లో రాణిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. 2019కి వీడ్కోలు చెప్పే తరుణంలో ఈ ఏడాది వార్తల్లో నిలిచిన కొంతమంది వనితల విశేషాలు ఇప్పుడు చూద్దాం..

ద్యుతీ చంద్‌..

womennewsghg650-4.jpg

ఈ ఏడాది ఎక్కువగా వార్తల్లో నిలిచిన మహిళల్లో భారత స్ప్రింటర్‌ ద్యుతీ చంద్‌ ఒకరు. ప్రస్తుతం దేశంలో అత్యంత వేగంగా పరిగెత్తగల ద్యుతి... 2018లో జకర్తా వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో 100, 200 మీటర్ల విభాగాల్లో రెండు రజత పతకాలు సాధించింది. ఇక ఈ ఏడాది జరిగిన ‘ప్రపంచ యూనివర్సిటీ’ క్రీడల్లో స్వర్ణం అందుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా స్ప్రింటర్‌గా ద్యుతి చరిత్ర సృష్టించింది. దీంతోపాటు ద్యుతీ ఈ ఏడాది మరో అరుదైన గౌరవాన్ని సైతం అందుకుంది. ప్రఖ్యాత టైమ్‌ మ్యాగజైన్‌ ప్రకటించిన ‘టైమ్‌ 100 నెక్ట్స్‌’ జాబితాలో ద్యుతీ చంద్‌కు చోటు దక్కింది. 2020లో జరిగే ఒలింపిక్‌కు అర్హత సాధించడంపైనే ప్రస్తుతం తన ఫోకస్‌ ఉందని చెబుతోంది ఈ స్ప్రింటర్‌. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి, ఎన్నో అవమానాలు ఎదుర్కొని ప్రస్తుతం దేశం గర్వించదగ్గ క్రీడాకారిణిగా ఎదిగిన ద్యుతీ జీవిత కథ ఆధారంగా ఇప్పుడు బాలీవుడ్‌లో ఓ బయోపిక్ తెరకెక్కుతోంది. వృత్తి పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ ఈ ఏడాది వార్తల్లోకెక్కింది ద్యుతి... తన సమీప బంధువైన ఒక అమ్మాయితో సహజీవనం చేస్తున్నట్లు ప్రకటించి అప్పట్లో సంచలనం సృష్టించిందీ మేటి స్ప్రింటర్‌. ఇలా తమ స్వలింగ బంధం గురించి బయటపెట్టిన తొలి భారతీయురాలిగా నిలిచిందీ పరుగులరాణి

రీతూ కరిధాల్‌...

womennewsghg650-10.jpg

ఈ ఏడాది భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ‘చంద్రయాన్‌-2’ మిషన్‌ గురించి తెలిసిందే. ఈ ప్రయోగం ఆఖరి క్షణాల్లో విఫలమైనా.. భారత అంతరిక్ష చరిత్రలో ఒక కలికితురాయిగా నిలిచిందని చెప్పుకోవచ్చు. ‘చంద్రయాన్‌-2’ ప్రాజెక్టు దాదాపు సక్సెస్‌ కావడం వెనుక ఎంతోమంది మహిళల శ్రమ దాగుంది. అందులో ఒకరే ఈ ప్రాజెక్టు మిషన్‌ డైరెక్టర్‌ రీతూ కరిధాల్‌. ఇలా ఈ ప్రాజెక్టులో భాగం పంచుకొని ఈ ఏడాది రీతు వార్తల్లోకెక్కారు.

ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నగరంలో జన్మించిన రీతూకు చిన్ననాటి నుంచి అంతరిక్షంపై ఎంతో ఆసక్తి. ఈ క్రమంలోనే లక్నో విశ్వవిద్యాలయం నుంచి ఫిజిక్స్‌లో డిగ్రీ పట్టా పొంది, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో ఏరో స్పేస్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో మాస్టర్స్‌ పూర్తిచేశారు. అనంతరం 1997 నుంచి ఇస్రోలో ఏరోస్పేస్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మార్స్‌ ఆర్బిటార్‌ మిషన్‌... మంగళ్‌యాన్‌లో రీతు కీలక పాత్ర పోషించారు. భారత అంతరిక్ష రంగానికి ఈమె చేసిన సేవలకుగాను 2007లో అబ్దుల్‌ కలాం చేతుల మీదుగా ‘ఇస్రో యంగ్‌ సైంటిస్ట్‌’ అవార్డు కూడా అందుకున్నారు. అంతేకాకుండా తను విద్యనభ్యసించిన లక్నో యూనివర్సిటీ రీతూకు గౌరవ డాక్టరేట్‌ ఇచ్చి సత్కరించింది. ‘ఇండియన్‌ రాకెట్‌ ఉమన్‌’గా కూడా రీతూకు పేరుంది

హిమదాస్‌..

womennewsghg650-6.jpg

ఈ ఏడాది ఎక్కువగా వార్తల్లో నిలిచిన వారిలో భారత యంగ్‌ స్టార్‌ స్ప్రింటర్‌ హిమదాస్‌ ఒకరు. ఈ ఏడాది జరిగిన ఐరోపా అథ్లెటిక్స్‌ పోటీల్లో హిమదాస్ ఏకంగా ఐదు స్వర్ణాలను సాధించింది. 200 మీటర్ల విభాగంలో నాలుగు, 400 మీటర్ల కేటగిరీలో ఒక పసిడి పతకాన్ని అందుకుంది. అసోంలోని ధింగ్‌ అనే మారుమూల గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన హిమదాస్‌ ప్రపంచ అథ్లెటిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ ప్రతిష్టాత్మకంగా ప్రకటించే ‘30అండర్‌ 30’ జాబితాలో హిమదాస్‌ చోటు దక్కించుకోవడం విశేషం. అంతేకాకుండా ‘యూఎన్‌ చిల్డ్రన్స్‌ ఫండ్‌’ (యునిసెఫ్‌) హిమదాస్‌ను భారతదేశానికి తొలి యువ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించింది

పీవీ సింధు..

womennewsghg650-9.jpg

భారత క్రీడాభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు సింధు. తనదైన ఆటతీరుతో అనతి కాలంలోనే ఎంతో పేరు సంపాదించిందీ హైదరాబాదీ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌. ఈ ఏడాది కూడా సింధు జైత్రయాత్ర కొనసాగింది. ఆగస్టులో జరిగిన ‘వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌’ (ఉమెన్స్‌ సింగిల్స్‌)లో పసిడి పతకం సాధించి సంచలనం సృష్టించింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా సింధు రికార్డులకెక్కింది. అంతేకాదు ఈ ఏడాది ఫోర్బ్స్‌ ప్రకటించిన అత్యధిక పారితోషికం అంతుకున్న క్రీడాకారిణుల జాబితాలో సుమారు రూ.39 కోట్ల సంపాదనతో సింధు 13వ ర్యాంకును దక్కించుకుంది. ఇక త్వరలో జరగబోయే టోక్యో ఒలింపిక్స్‌ కోసం సింధు ప్రస్తుతం తీవ్రంగా శ్రమిస్తోంది. సింధు విజయాలకు గుర్తింపుగా తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలు ఆమెకు నజరానాలు, బహుమతులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హైదరాబాద్‌లోని లేక్‌ వ్యూ అతిథి గృహం ఓఎస్డీగా పోస్టింగ్‌ ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

ఆరోహి పండిట్‌..

womennewsghg650-2.jpg

మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరని చెప్పడానికి మరో ప్రత్యక్ష ఉదాహరణ ఆరోహి పండిట్‌. 400 కిలోల బరువున్న లైట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌లో ఒంటరిగా అట్లాంటిక్‌ సముద్రాన్ని చుట్టేసి ‘ఔరా నారీ’ అనిపించుకుంది ఆరోహి. ముంబైకి చెందిన ఆరోహికి చిన్ననాటి నుంచి సాహస యాత్రలు అంటే చాలా ఆసక్తి. దీంతో ఏవియేషన్‌లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత బాంబే ఫ్లయింగ్‌ క్లబ్‌లో శిక్షణ తీసుకుందామె. 23 ఏళ్ల ఆరోహి పండిట్‌ లైట్‌ స్పోర్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ‘సినస్‌ 912’ (మహి)లో 18 దేశాల మీదుగా సుమారు 37 వేల కిలోమీటర్లు ప్రయాణించి సాహసానికి మారుపేరుగా నిలిచింది. అంతేకాదు ఒంటరిగా అట్లాంటిక్‌ సముద్రాన్ని దాటిన తొలి మహిళా పైలట్‌గానూ చరిత్ర కెక్కింది ఆరోహి. 2018 జులైలో ప్రారంభమైన ఈ సాహస యాత్ర ఈ ఏడాది మేలో ముగిసింది. ఇలా ఈ ఏడాది ఆరోహి వార్తల్లో నిలిచింది

చంద్రాని మూర్ము..

womennewsghg650-3.jpg

రాజకీయాల్లో రాణించాలంటే అది కురువృద్ధులు, తలపండిన వారికి మాత్రమే సాధ్యమని భావిస్తుంటాం. అయితే ప్రజలకు సేవ చేయడానికి వయసుతో సంబంధం లేదని చాటి చెప్పింది ఒడిశాకు చెందిన చంద్రాని మూర్ము. ఈమె వయసు కేవలం 25 మాత్రమే. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి, అత్యంత పిన్న వయస్కురాలైన ఎంపీగా చంద్రాని చరిత్ర సృష్టించింది. బీటెక్‌ చేసిన చంద్రాని ఉద్యోగ వేటలో ఉన్న క్రమంలో అనూహ్య రీతిలో కియోంఝర్‌ నుంచి బీజేడీ అభ్యర్థిగా పార్టీ అధినేత నవీన్‌ పట్నాయక్‌ ఈమెను ఎంపిక చేశారు. ఈ క్రమంలోనే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ రెండుసార్లు ఎంపీగా పనిచేసిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అనంత నాయక్‌ను ఓడించింది. ఇలా చిన్న వయసులోనే పార్లమెంట్‌లో అడుగు పెట్టిన వ్యక్తిగా చంద్రాని ఈ ఏడాది వార్తల్లో నిలిచింది

అంజలీ సింగ్‌..

రంగమేదైనా తమకు తగిన ప్రోత్సాహం అందిస్తే ఏదైనా సాధిస్తామని చాటి చెప్పారు అంజలీ సింగ్‌. విదేశాల్లో భారతదేశానికి ప్రాతినిథ్యం వహించిన మొట్టమొదటి మహిళా మిలిటరీ దౌత్యవేత్తగా, వింగ్‌ కమాండర్‌గా అంజలీ సింగ్‌ సరికొత్త చరిత్రను లిఖించారు. రష్యాలోని భారత దౌత్య కార్యాలయంలో వాయుదళ ఉప సహాధికారిగా పదవి చేపట్టిన అంజలి ఈ ఘనతను సాధించారు. 2019 సెప్టెంబర్‌లో ఈ పదవిని స్వీకరించారు. బిహార్‌కు చెందిన అంజలి 17ఏళ్ల పాటు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో విధులు నిర్వర్తించారు. మిగ్‌-29 విమానం పైలట్‌గా అంజలి శిక్షణ తీసుకున్నారు.

ముత్తయ్య వనిత...

womennewsghg650-8.jpg

చంద్రయాన్‌-2 ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించి ఈ ప్రయోగం దాదాపు సఫలీకృతమవడంతో ఈ ఏడాది మరోసారి వార్తల్లోకెక్కారు మహిళా శాస్త్రవేత్త ముత్తయ్య వనిత. చెన్నైకి చెందిన ‘గిండీ’ నగరంలోని కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ నుంచి ‘ఎలక్ట్రానిక్స్‌ సిస్టం ఇంజినీర్‌’గా చదువు పూర్తి చేశారు. అనంతరం ‘భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ’ (ఇస్రో)లో శాటిలైట్‌కు సంబంధించిన ప్రాజెక్టులపై పనిచేశారు. భారత అంతరిక్ష రంగానికి ఆమె చేసిన సేవలకుగాను 2006లో ‘ఉత్తమ మహిళా’ శాస్త్రవేత్తగా అవార్డును అందుకున్నారు వనిత. గతంలో కొంత కాలం పాటు ఇస్రోలోని రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్స్‌ విభాగంలోనూ సేవలందించారు

గగన్‌దీప్‌ కాంగ్‌...

లండన్‌లోని ప్రఖ్యాత ‘రాయల్‌ సొసైటీ’ ఫెలోషిప్‌కు ఎంపికైన తొలి భారతీయ మహిళగా సంచలనం సృష్టించింది గగన్‌దీప్‌ కాంగ్‌. ఈ ఏడాది పరిశోధనల్లో విశేష సేవలందించిన 51 మంది శాస్త్రవేత్తల జాబితాలో తమిళనాడుకు చెందిన గగన్‌దీప్‌ స్థానం దక్కించుకున్నారు. వెల్లూరులోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీలో ‘గ్యాస్ట్రో ఇంటెస్టినల్‌ సైన్సెస్‌’ విభాగం పరిశోధకురాలిగా విధులు నిర్వర్తించారు. చిన్నారుల్లో వచ్చే రోటా వైరస్‌పై పరిశోధనలు చేసినందుకుగాను గగన్‌దీప్‌కు రాయల్‌ సొసైటీ గుర్తింపు లభించింది. ఈమె ప్రస్తుతం ఫరీదాబాద్‌లోని ‘ట్రాన్స్‌లేషనల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌’కు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

మింటీ అగర్వాల్‌...

ఈ ఏడాది పాకిస్థాన్‌ వైమానిక దళానికి చెందిన ఎఫ్‌-16 యుద్ధవిమానం జమ్ముకశ్మీర్‌లో నియంత్రణ రేఖను దాటుకుని భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చింది. ఈ సమయంలో వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ మిగ్ 21 యుద్ధవిమానంతో ఎఫ్‌-16ని తరుముతూ వెళ్లాడు. ఈ క్రమంలో ఆయన విమానం పడిపోయే క్రమంలో అభినందన్ పాకిస్థాన్‌ భూభాగంలో దూకేశాడు. దీంతో అభినందన్‌ను అక్కడి ఆర్మీ అధికారులు కస్టడీలోకి తీసుకొని, తిరిగి స్వదేశానికి పంపించిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో మొదటగా పాకిస్థాన్‌ విమానాలు భారత భూభాగంలోకి వచ్చాయన్న విషయాన్ని పైలట్లకు తెలియజేయడంలో మింటీ అగర్వాల్‌ నేతృత్వంలోని ‘సిగ్నల్‌ యూనిట్‌’ జట్టు కీలకపాత్ర పోషించింది. ఇందుకుగాను మింటీ అగర్వాల్‌ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా ‘యుధ్‌ సేవా మెడల్‌’ అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న తొలి మహిళగా మింటీ చరిత్ర సృష్టించారు

వీరితోపాటు అరుదైన ఎముకల వ్యాధి బారిన పడినప్పటికీ వీల్‌ఛైర్‌లోనే సివిల్స్‌ రాసిన కేరళ వాసి లతీషా, ఈ ఏడాది తిరువనంతపురం సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి దేశంలోనే తొలి అంధ ఐఏఎస్‌ అధికారిణిగా నిలిచిన ప్రాంజిల్‌ పాటిల్‌, ‘మిస్‌ టీన్‌ ఇంటర్నేషనల్‌-2019’ విజేతగా నిలిచిన ఆయుషీ ఢోలాకియా.. వంటి ఎందరో వనితలు తమ తమ రంగాల్లో అద్భుతంగా రాణిస్తూ ఈ ఏడాది వార్తల్లో వనితలుగా నిలిచారు. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని మనమూ కొత్త ఏడాదిలోకి అడుగిడదాం. మనమూ మన కెరీర్‌లో అభివృద్ధి పథంలో పయనిద్దాం!

హ్యాపీ న్యూ ఇయర్‌..!

women icon@teamvasundhara
a-brief-story-on-legendary-choreographer-‘mother-of-dance’-saroj-khan

ఆమె డ్యాన్స్‌కు ప్రేక్షక లోకం దాసోహం!

‘హవా హవాయి’, ‘ఏక్‌ దో తీన్‌’, ‘మెహెందీ లగా కే రఖ్నా’, ‘డోలారే డోలారే’.. ఇలాంటి జోష్‌ఫుల్‌ పాటలు మనం ఏ మూడ్‌లో ఉన్నా మనతో స్టెప్పులేయిస్తాయి. అంతేనా.. ఈ పాటల్లో నర్తించిన అందాల తారల అద్భుతమైన డ్యాన్స్‌ స్టెప్పులను కూడా జ్ఞప్తికి తెస్తాయి. మరి, అలాంటి సూపర్బ్ స్టెప్పులకు ఆన్‌స్క్రీన్‌ కేరాఫ్‌ అడ్రస్‌ మన ముద్దుగుమ్మలైతే.. తెరవెనుక ఆ నృత్య రీతుల్ని సమకూర్చిన ఘనత మాస్టర్‌ జీ సరోజ్‌ ఖాన్‌కే దక్కుతుంది. ఎన్నో బాలీవుడ్‌ హిట్‌ పాటలకు నృత్య దర్శకురాలిగా పనిచేసి, ఎందరో నటీనటులకు డ్యాన్స్‌ గురూగా మారిన సరోజ్‌.. సినీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. తన ఐకానిక్‌ డ్యాన్స్‌ మూమెంట్స్‌తో ‘మదర్‌ ఆఫ్‌ డ్యాన్స్‌’గా కీర్తి గడించిన ఈ కొరియోగ్రాఫర్‌ నేడు గుండెపోటుతో మరణించారు. గత కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆమె.. తన 71 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.. సినీ లోకాన్ని, ప్రేక్షకుల్ని, తన అభిమానుల్ని ఒంటరిని చేసి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఈ లెజెండరీ డ్యాన్సర్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..!

Know More

women icon@teamvasundhara
ekta-kapoor-shares-smriti-irani-old-photographs
women icon@teamvasundhara
sreedhanya-suresh-takes-charge-as-kozhikode-assistant-collector

ఈ కొత్త బాధ్యతతో నా జన్మ ‘ధన్య’మైంది!

ఆమె తల్లిదండ్రులిద్దరూ రోజువారీ కూలీలు.. పనిచేస్తే గానీ ఐదు వేళ్లూ నోట్లోకి వెళ్లలేని పరిస్థితి ఆ కుటుంబానిది.. ఇలా చిన్ననాటి నుంచి పేదరికమే ఆమెను అడుగడుగునా వెక్కిరించింది.. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఉన్నత చదువులు చదవాలని, దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సివిల్స్‌కు గురిపెట్టాలని అనుకోవడం అందని ద్రాక్షే అవుతుంది.. అయినా ఆమె తన కలను వీడలేదు. ఒక్కసారి కాదు, రెండుసార్లు విఫలమైనా ముచ్చటగా మూడోసారి సక్సెస్ అయింది. 2018 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకు సాధించి పలువురు ప్రముఖుల ప్రశంసలు పొందింది. అంతేకాదు కేరళ నుంచి సివిల్స్‌కు ఎంపికైన తొలి గిరిజన యువతిగా రికార్డు సృష్టించింది. ఆమే.. కేరళలోని కురిచియ అనే గిరిజన తెగకు చెందిన శ్రీధన్య సురేశ్. కరోనాతో పోరుకు సై అంటూ తాజాగా కోజికోడ్‌ జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీధన్య విజయ ప్రస్థానమిది.

Know More

women icon@teamvasundhara
manipur-woman-auto-driver-awarded-for-ferrying-covid-19-survivor

ఆ అమ్మాయి కోసం అర్థరాత్రి పూట 8 గంటలు ఆటో నడిపింది !

కనికరం లేకుండా మనుషుల ప్రాణాలను కబళిస్తోన్న కరోనా మహమ్మారి మనుషుల్లోని మానవత్వాన్ని కూడా మాయం చేస్తోంది. ఎక్కడ వైరస్‌ సోకుతుందేమోనన్న భయంతో చాలామంది కరోనా బాధితులను అంటరానివారిగా చూస్తున్నారు. ఇంతకుముందు రోడ్లపై అడగగానే ‘లిఫ్ట్‌’ ఇచ్చే వాహనదారులు నేడు వైరస్‌ భయంతో సామాన్యులకు కూడా సహకరించడానికి వెనకడుగు వేస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా నుంచి కోలుకున్న ఓ మహిళను తన ఆటోలో సొంతగూటికి చేర్చింది ఓ మహిళా ఆటోడ్రైవర్‌. ఒకటి, రెండు గంటలు కాదు... ఏకంగా 8 గంటల పాటు సుమారు 140 కిలోమీటర్ల దూరం ఆటోను నడిపి ఆ మహిళను గమ్యస్థానానికి చేర్చింది. అది కూడా అర్ధరాత్రి సమయంలో..!. మరి సాటి మనిషికి మనం కాకుండా మరెవరు సాయం చేస్తారని ప్రశ్నిస్తోన్న ఆ మహిళా ఆటోడ్రైవర్‌ గురించి మనమూ తెలుసుకుందాం రండి..!

Know More

women icon@teamvasundhara
all-you-need-to-know-about-jasleen-bhalla-the-voice-behind-corona-caller-tune

ఆ గొంతు ఈమెదే !

‘కరోనా వైరస్‌ సే ఆజ్‌ పూరా దేశ్‌ లడ్‌ రహా హై, యాద్‌ రహే హమే బీమారీసే లడ్‌నా హై, బీమార్‌ సే నహీ’... ఈ కరోనా కాలంలో ఎవరికి ఫోన్‌ చేసినా మొదట వినిపించే కాలర్‌ ట్యూన్‌ ఇదే. అయితే ఇలా ఓ ఆత్మీయురాలిగా, ఎంతో ఓపికతో కరోనా మహమ్మారి గురించి అవగాహన కల్పించే ఆ తియ్యటి గాత్రం ఎవరిదో మీరెప్పుడైనా ఆలోచించారా? దిల్లీకి చెందిన జస్లీన్‌ భల్లాదే ఆ గొంతు. వివిధ భారతీయ భాషల్లో అనువదించి రికార్డ్‌ చేసిన ఈ కాలర్‌ ట్యూన్‌కి మూడు భాషల్లో తన గొంతును అరువిచ్చారీ వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్ట్‌. దాదాపు పదేళ్లుగా ఈ రంగంలో కొనసాగుతోన్న ఆమె.. ఎన్నో ప్రకటనలు, రైళ్లు-విమానయాన సేవలకు సంబంధించిన గైడింగ్‌ వాయిస్‌ను కూడా అందించారు. ఈ నేపథ్యంలో జస్లీన్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..

Know More

women icon@teamvasundhara
mary-kom-interact-with-students-in-online-session

మగాళ్లు చేస్తున్నప్పుడు మనమెందుకు చేయలేం?

ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌... ప్రతిష్ఠాత్మక లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్యపతకం..ఇంకా అంతర్జాతీయంగా, జాతీయంగా ఎన్నెన్నో పతకాలు.. ప్రపంచంలోనే అత్యుత్తమ బాక్సర్‌గా అవార్డులు-రివార్డులు...ఇలా మహిళల బాక్సింగ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక పేజీ సృష్టించుకుంది మేరీకోమ్‌. ముగ్గురు పిల్లల తల్లిగా వారి ఆలనాపాలన చూసుకుంటూనే బాక్సింగ్‌ రింగ్‌లో రికార్డులు సృష్టిస్తోందీ మణిపూర్‌ మణిపూస. అదేవిధంగా రాజ్యసభ ఎంపీగా ప్రజలకు సేవలందిస్తోంది. అయితే తన విజయాల వెనక ఓ అసాధారణ పోరాటం దాగుందని చెబుతోంది మేరీకోమ్‌. పేదరికం, వివక్ష... ఇలా ఎన్నో అవరోధాలను అధిగమిస్తే కానీ ఈ గుర్తింపు రాలేదంటోందీ మణిపూర్‌ బాక్సింగ్‌ దిగ్గజం.

Know More

women icon@teamvasundhara
the-first-american-woman-to-walk-in-space-kathy-sullivan-became-the-first-woman-to-reach-the-deepest-point

నాడు అంతరిక్షంలో నడిచింది.. నేడు సముద్ర గర్భాన్ని ముద్దాడింది!

అది కాకులు దూరని కారడవి కన్నా, చీమలు దూరని చిట్టడవి కన్నా చిమ్మ చీకటితో కూడుకున్న ప్రాంతం. ధ్రువ ప్రాంతాల్లోలా గడ్డకట్టుకుపోయే అసాధారణమైన ఉష్ణోగ్రతలు అక్కడ నమోదవుతాయి. సూక్ష్మక్రిములు మాత్రమే తట్టుకొని జీవించడానికి అనువైన అస్థిరమైన వాతావరణం ఉంటుందక్కడ. మరి, అలాంటి ప్రతికూల వాతావరణంలోకి వెళ్లడానికి కాదు.. కనీసం దాని గురించి ఆలోచించడానికి కూడా ఎవరూ సాహసించరు. కానీ ఇలాంటి దుస్సాహసానికి పూనుకొని.. చరిత్ర సృష్టించింది అమెరికాకు చెందిన 68 ఏళ్ల డాక్టర్‌ క్యాథ్‌రిన్‌ సులివాన్‌. ఇప్పటికే అంతరిక్షంలో నడిచిన తొలి అమెరికన్‌ మహిళగా 37 క్రితం చరిత్రను తన పేరిట లిఖించుకున్న క్యాతీ.. ఇప్పుడు సముద్ర గర్భాన్నీ ముద్దాడింది. పసిఫిక్‌ మహా సముద్రంలోని మెరియానా ట్రెంచ్‌ అగాథంలోని లోతైన ప్రదేశం ‘ఛాలెంజర్‌ డీప్‌’ (సముద్ర గర్భంలోని అతి లోతైన ప్రదేశంగా దీన్ని పేర్కొంటారు) వరకు వెళ్లిన తొలి మహిళగా అరుదైన ఘనత సాధించిందీ అమెరికన్‌ వ్యోమగామి. ఇలా తన సాహసంతో నాడు అంతరిక్షంలో, నేడు సముద్ర గర్భంలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న ఈ అసాధారణ మహిళ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..

Know More

women icon@teamvasundhara
captain-swati-raval-opens-up-on-flying-air-india-flight-that-rescued-263-passengers-from-rome

నా కూతురి నుంచి దూరంగా ఉండేందుకు అదే మంచి మార్గమనిపించింది!

కొన్ని నెలల క్రితం కరోనా విజృంభణ తీవ్రంగా ఉండడంతో వైద్య సేవలు అందించలేక విదేశీయులను తమ సొంత దేశాలకు వెళ్లిపొమ్మంటూ ఇటలీ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అదే సమయంలో అంతర్జాతీయ విమాన సేవలు సైతం నిలిపి వేశారు. దీంతో ఇటలీలో ఉంటోన్న భారతీయులు దిక్కుతోచని స్థితిలో సతమతమయ్యారు. మరికొన్ని రోజులు అక్కడే ఉంటే తాము కూడా కరోనాకు బలవుతామనే భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కాలాన్ని గడిపారు. ఈ క్రమంలో ఇటలీలో చిక్కుకుపోయిన 263 మంది భారతీయులను మన దేశానికి సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఓ భారీ బోయింగ్‌ 777 విమానాన్ని సిద్ధం చేసింది ఎయిర్‌ ఇండియా సంస్థ. ఈ విమానానికి సారథ్యం వహించింది ఓ మహిళ. తనే కెప్టెన్ స్వాతి రావల్‌. కరోనా హాట్‌స్పాట్‌గా ఉన్న ఇటలీ లాంటి దేశం నుంచి మన వాళ్లను క్షేమంగా స్వదేశానికి చేర్చి.. రెస్క్యూ ఫ్లైట్‌కు సారథ్యం వహించిన తొలి మహిళా సివిలియన్‌ పైలట్‌గా చరిత్ర సృష్టించిందీ వీరనారి. అప్పటి తన ప్రయాణానికి సంబంధించిన కొన్ని సంఘటనలను ఇటీవల మళ్లీ గుర్తుకు తెచ్చుకుంది స్వాతి. ఈక్రమంలో తన అనుభవాలను షేర్‌ చేసుకుంది. మరి వాటిని ఆమె మాటల్లోనే విందాం రండి..

Know More

women icon@teamvasundhara
rija-abraham-gets-uk-corona-critical-worker-hero-award

పసిపిల్లను ఇంట్లో వదిలి కరోనా రోగులకు సేవ చేస్తోంది!

క్యాలెండర్‌లో నెలలు మారుతున్నా కరోనా మాత్రం నియంత్రణలోకి రావడం లేదు. రోజురోజుకీ తన ఉద్ధృతిని పెంచుకుంటూ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మరి, మనకే ఇలా ఉంటే నిత్యం కరోనా ఆస్పత్రుల్లోనే గడుపుతూ ఈ మహమ్మారి బారిన పడిన రోగులకు సేవలందించే డాక్టర్లు, నర్సుల పరిస్థితేంటి? ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత అప్రమత్తంగా ఉన్నా ఎప్పుడు, ఎవరి నుంచి తమకు ఈ వైరస్‌ సోకుతుందోనన్న భయం అనుక్షణం వారిని వెంటాడుతూనే ఉంటోంది. అయినా సరే...వృత్తి ధర్మానికే ఓటేస్తూ విధుల్లో కొనసాగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది వైద్య సిబ్బంది నెలల తరబడి ఇంటికి దూరంగా ఉంటూ కరోనా రోగులను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండుకు చెందిన ప్రవాస భారతీయురాలు రిజా అబ్రహాం కూడా తన 18 నెలల చిన్నారిని ఇంట్లో వదిలి కరోనా రోగులకు చికిత్స చేస్తోంది. వైరస్‌ వ్యతిరేక పోరులో భాగస్వామురాలవుతూ అందరి మన్ననలు అందుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె సేవలను గుర్తించిన అక్కడి ప్రభుత్వం ఆమెను ఓ అరుదైన అవార్డుతో గౌరవించింది.

Know More

women icon@teamvasundhara
the-reasons-behind-newzeland-becoming-virus-free-country

ఆమె ముందుచూపే కరోనా మహమ్మారి మెడలు వంచేసింది!

కరోనా ధాటికి ప్రపంచమంతా కకావికలమవుతోంది. అమెరికా, బ్రిటన్‌ లాంటి అగ్రదేశాల అధిపతులు సైతం ఈ వైరస్‌ విస్తృతిని అదుపు చేయలేక ఆపసోపాలు పడుతున్నారు. రోజురోజుకీ పెరిగిపోతున్న మరణాలు, పాజిటివ్‌ కేసులను కట్టడి చేయలేక చేతులెత్తేస్తున్న పరిస్థితి వారిది. అలాంటిది ఇంకా 40 ఏళ్లు కూడా నిండని న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డర్న్‌ మాత్రం ఈ మహమ్మారి మెడలను పూర్తిగా వంచేశారు. ఓ మహిళ ముందుచూపు ఎంత మేలు చేస్తుందో మరోసారి నిరూపించిన ఆమె తన పాలనా దక్షతతో కరోనా కోరలు పూర్తిగా పీకేసింది. తాజాగా ఆ దేశంలో మిగిలి ఉన్న చివరి కరోనా బాధితురాలు కూడా పూర్తిగా కోలుకుని ఇంటికి వెళ్లినట్లు అక్కడి అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఈ ప్రాణాంతక మహమ్మారిని పూర్తిగా నిర్మూలించిన అతి తక్కువ దేశాల జాబితాలో న్యూజిలాండ్‌ చేరింది.

Know More

women icon@teamvasundhara
kiran-mazumdar-shaw-named-ey-world-enterpreneur2020

‘బయోక్వీన్‌’ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి!

భారత్‌లో బయో టెక్నాలజీ అంటే టక్కున గుర్తొచ్చే పేరు కిరణ్‌ మజుందార్‌షా. 70 దశకంలో చిన్న సంస్థగా ప్రారంభమైన బయోకాన్‌ నేడు భారత్‌లోనే అతి పెద్ద బయో ఫార్మా కంపెనీగా రూపుదిద్దుకుందంటే.. అందుకు కిరణ్‌ వ్యాపార దక్షత, పట్టుదలే కారణం. ప్రస్తుతం ఆ సంస్థ ఛైర్‌పర్సన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోన్న ఆమె.. వ్యాపార రంగంలోనే కాదు, సామాజిక సేవలోనూ ముందున్నారు. ఆర్థిక అంతరాలతో సంబంధం లేకుండా అవసరమైన వారందరికీ వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు. బయోఫార్మా రంగానికి సంబంధించి ఆమె చేస్తోన్న సేవలకు గుర్తింపుగా ఇప్పటికే ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారీ సూపర్‌ వుమన్‌. ఈ క్రమంలో ఆమె తాజాగా మరో అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ ఏడాదికి గాను ప్రతిష్ఠాత్మక ఈవై వరల్డ్‌ ఎంట్రప్రెన్యూర్‌ పురస్కారానికి ఎంపికైన ఆమె ఈ అవార్డును అందుకున్న మూడో భారతీయురాలిగా అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నారు.

Know More

women icon@teamvasundhara
sonajharia-minz-becomes-the-second-tribes-woman-to-be-elected-as-a-vice-chancellor

ఆదివాసీనని ఇంగ్లిష్‌ మీడియం స్కూల్లో చేర్చుకోనన్నారు!

చిన్న పిల్లలు ఏదైనా పని చేయద్దంటే అదే చేస్తుంటారు.. ‘అది నీ వల్ల కాదు..’ అని ఎవరైనా అంటే.. ఎందుకు కాదు.. తప్పకుండా అవుతుందని చేసి మరీ చూపిస్తుంటారు. చిన్నతనం నుంచీ తనలో ఉన్న ఈ మొండితనమే నేడు తనను ఓ ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీకి వైస్‌-ఛాన్స్‌లర్‌ని చేసిందని అంటున్నారు జార్ఖండ్‌కు చెందిన ఆదివాసీ మహిళ సోనాఝారియా మిన్జ్‌. ఆదివాసీవంటూ ఇంగ్లిష్‌-మీడియం స్కూల్లో చేర్చుకోకపోయినా చదువుపై మక్కువ వీడలేదామె. ‘గణితంలో నువ్వు రాణించలేవు’ అన్నారని.. అదే సబ్జెక్టుపై పట్టు సాధించి మరీ.. ముచ్చటగా మూడుసార్లు వంద శాతం మార్కులు సంపాదించారామె. అదే పట్టుదలతో కష్టపడి చదివి.. ప్రతిష్ఠాత్మక జేఎన్‌యూలో కంప్యూటర్‌ పాఠాలు బోధించే స్థాయికి చేరుకున్నారు. ఇటీవలే జార్ఖండ్‌ దుమ్కాలోని సిడో కన్హు ముర్ము విశ్వవిద్యాలయ (ఎస్‌కేఎంయూ) వైస్‌-ఛాన్స్‌లర్‌గా నియమితులైన మిన్జ్‌.. ఈ పదవికి ఎంపికైన రెండో ఆదివాసీ మహిళగా చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలో చదువుకునే క్రమంలో తనకెదురైన సవాళ్లను ఓసారి ఇలా గుర్తు చేసుకున్నారు మిన్జ్‌.

Know More

women icon@teamvasundhara
uma-preman-saves-thousands-of-lives-with-her-trust
women icon@teamvasundhara
r-sreelekha-becomes-kerala-first-woman-dgp

‘రీటా మేరీ IPS’ నా ప్రతిబింబం!

ఆర్. శ్రీలేఖ.. కేరళ కేడర్ నుంచి 1987లో పోలీస్ ఆఫీసర్‌గా నియమితురాలైన మొట్టమొదటి మహిళ. ఇంతకీ ఆర్ అంటే ఆమె ఇంటిపేరు అనుకుంటున్నారా?? కాదండీ.. అది ఆమె మారు పేరు. ఆర్ అంటే రైడ్. కేరళలోని ప్రముఖుల ఇళ్లలో సోదాలు జరిపిన సీబీఐ రైడింగ్ టీంలో ఈమె కూడా ఒక ముఖ్య వ్యక్తి. అందుకే ఆమెని అంతా 'ఆర్ శ్రీలేఖ' అని పిలవడం ప్రారంభించారు. అంతేనా.. రెండేళ్ల క్రితం కేరళ డీజీపీ ర్యాంకు పొందిన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించిన ఆమె తాజాగా ఆ రాష్ట్ర డీజీపీగా పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకోనున్నారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి మహిళగా అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఓవైపు ఐపీఎస్ ఆఫీసర్‌గా సమర్థంగా విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు రచయిత్రిగా, మంచి సామాజిక వేత్తగా కూడా గుర్తింపు పొందారు. ఆమె ఛేదించిన మర్డర్ మిస్టరీల ఆధారంగా కొన్ని పుస్తకాలు కూడా రచించారు. ఆమె ఈ స్థాయికి చేరుకునే క్రమంలో ఎన్నో ఆటుపోట్లను సైతం ఎదుర్కొన్నారు.

Know More

women icon@teamvasundhara
hyderabad-women-making-face-shields-and-corona-material-for-hospitals
women icon@teamvasundhara
corona-virus-103-year-old-woman-recovers-from-corona-virus-celebrates-with-chilled-beer

103 ఏళ్ల బామ్మ కరోనాను జయించింది... చిల్డ్‌ బీర్‌తో సెలబ్రేట్‌ చేసుకుంది!

లాక్‌డౌన్‌ సడలింపులతో కరోనా మహమ్మారి మరింత ఉగ్రరూపం చూపిస్తోంది. ఇప్పటికే లక్షలాది మందిని బలి తీసుకున్న ఈ వైరస్‌ రోజురోజుకీ మరింత విజృంభిస్తోంది. దీంతో ప్రతి ఒక్కరూ ఆందోళనకు గురవుతున్నారు. ప్రత్యేకించి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులు ఎక్కడ ఈ మహమ్మారి బారిన పడతామోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అందుకు తగ్గట్టే ఇండియాతో పాటు పలు దేశాలు లాక్‌డౌన్‌ సడలింపులిచ్చినా వృద్ధులు మాత్రం బయటకు రాకూడదని మార్గదర్శకాలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే కరోనా హాట్‌స్పాట్‌గా మారిన అగ్రరాజ్యానికి వూరటనిస్తూ ఆ దేశానికి చెందిన ఓ103 ఏళ్ల వృద్ధురాలు కరోనా నుంచి పూర్తిగా కోలుకుంది.

Know More

women icon@teamvasundhara
sophy-thomas-appointed-kerala-high-court-gets-its-first-woman-registrar-general

ఇప్పుడు వాడిని చూస్తే చాలా సంతోషమేస్తోంది !

కేరళకు చెందిన సోఫీ థామస్‌ వ్యవసాయ కుటుంబంలో పుట్టింది. తెల్లకోటు వేసుకుని ప్రజల ప్రాణాలు కాపాడదామనుకుంది. కానీ యాదృచ్ఛికంగా మనసు మార్చుకుని న్యాయశాస్త్రం వైపు అడుగులేసింది. నల్లకోటు ధరించి బాధితుల పక్షాన నిలిచింది. అలా న్యాయవాదిగా, న్యాయమూర్తిగా అంచెలంచెలుగా రాణించిన ఆమె తాజాగా మరో అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఈ మేరకు ఆ రాష్ర్ట హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌గా నియమితులైన ఆమె ఈ ఘనతను సాధించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. మరి తెల్లకోటు వేసుకోవాలనుకుని నల్లకోటు వేసుకున్న సోఫీ థామస్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
suman-gawani-to-be-honoured-with-the-un-military-gender-advocate-of-the-year-award

శాంతి కపోతానికి కీర్తి కిరీటం!

హింసతో పెచ్చరిల్లే దేశం దక్షిణ సూడాన్‌. గొడవలు, కల్లోలాలు అక్కడ నిత్యకృత్యం. ఎటువైపు నుంచి ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియదు. ఈ పరిస్థితుల్లో మిలిటరీ పరిశీలకురాలిగా ఉన్న వారెవరైనా సాయుధులై ఉండటం రివాజు. భారతీయ సైన్యాధికారి మేజర్‌ సుమన్‌ గవానీ దీనికి భిన్నం. ఆమె ఆయుధాన్ని ఇంటి దగ్గరే వదిలి కార్యక్షేత్రంలోకి దిగుతారు. మహిళలు, పిల్లలతో ప్రేమగా మాట కలుపుతారు. కల్లోల ప్రాంతాల్లో ప్రేమామృతం కురిపిస్తారు. అలాగని విధుల్ని నిర్లక్ష్యం చేయరు. ఆ విలక్షణతకు, పనిలో రాజీ పడని తత్వానికి ప్రతిష్ఠాత్మక ‘ఐక్యరాజ్య సమితి జెండర్‌ అడ్వొకేట్‌ అవార్డు ఆఫ్‌ ది ఇయర్‌ - 2019’ వరించింది. ఈ పురస్కారం అందుకోనున్న తొలి భారతీయురాలిగా నిలిచారామె.

Know More

women icon@teamvasundhara
corona-virus-chennai-woman-eats-once-a-day-saves-the-rest-for-her-13-dogs

ఆ 13 కుక్కల కడుపు నింపేందుకు తన కడుపు మాడ్చుకుంటోంది!

సాధారణంగా కుక్కల కుండే విశ్వాసం మనుషులకు కూడా ఉండదంటారు. ద్వేషమంటే తెలియని ఈ మూగజీవాలను తిట్టినా..కొట్టినా అవి చూపించే విశ్వాసంలో ఏ మాత్రం వ్యత్యాసం ఉండదు. అందుకే ఎంతో మంది వాటికి ముద్దుపేర్లు పెట్టుకుని సొంత మనుషుల్లా చూసుకుంటుంటారు. ఈ నేపథ్యంలో చెన్నైకు చెందిన ఓ మహిళ ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 13 కుక్కలను పెంచి పోషిస్తోంది. 21 ఏళ్లుగా అవి తినడానికి కావాల్సిన ఆహారాన్ని సమకూర్చుతూ వాటికి ఏ లోటూ రానీయకుండా కాపాడుకుంటోంది. అలాగని తనేమీ శ్రీమంతురాలు కాదు...పని మనిషిగా, వంట మనిషిగా పనిచేసి జీవితాన్ని వెళ్లదీస్తోంది. అయితే కరోనా ప్రభావంతో ఆమెతో పాటు ఆ 13 కుక్కలకు ఆకలి కష్టాలు మొదలయ్యాయి. ఈక్రమంలో తన పెంపుడు కుక్కలకు కడుపునిండా తిండి పెట్టేందుకు ఈ చెన్నై మహిళ ఏం చేస్తోందో మీరే చూడండి...!

Know More

women icon@teamvasundhara
hyderabad-woman-lakshmi-doing-hydroponic-farming-and-earns-money

మట్టి లేకుండా సాగు.. మాణిక్యాలు కురిపిస్తోంది..!

అరక పట్టే పనిలేదు... మెరక దున్నే అవసరం అంతకన్నా లేదు... మాగాణం లేకున్నా.. ఇంటి ప్రాంగణాన్నే వ్యవసాయ క్షేత్రంగా మార్చేయొచ్చు.. కుళాయి నీటినే మితంగా సరిపెట్టుకోవచ్చు.. ఏడాది పొడవునా పంట పండించుకోవచ్చు.. ఇలాంటి కొత్తరకం సాగుబడితో ఊహించని దిగుబడులు సాధిస్తున్నారు భాగ్యనగర రైతు మండ్ల లక్ష్మి... ‘జల సాగు’ విధానంతో భళా అనిపించుకున్న ఈ ఆధునిక సేద్యకారిణి అనుభవాలివి. అన్నింట్లో హైటెక్‌ పద్ధతులు వచ్చినట్టే.. వ్యవసాయమూ కొత్తపుంతలు తొక్కుతోంది. తరిగిపోతున్న సహజ వనరులను సద్వినియోగం చేసుకునే క్రమంలో కొత్తరకం సేద్య విధానాలు తెరమీదికొస్తున్నాయి. భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్టుగా వినూత్న మార్పుగా చెప్పుకొంటున్న విధానం జల సాగు. అదే హైడ్రోపోనిక్‌ విధానం. ఇంకా చెప్పాలంటే నేల విడిచి సాగు చేయడమన్నమాట. ఈ పద్ధతిలో మట్టితో పని లేకుండా పంటలు పండిస్తున్నారు పలువురు ఔత్సాహిక రైతులు, వ్యవసాయంపై ఆసక్తి ఉన్న యువత. ఈ కోవకే చెందుతారు లక్ష్మి.

Know More

women icon@teamvasundhara
corona-virus-after-losing-son-to-corona-centenarian-granny-wins-battle-against-virus

కొడుకు బలైనా ఈ వందేళ్ల బామ్మ మాత్రం కరోనాను జయించింది!

ప్రపంచంపై కరోనా ప్రకోపం చల్లారడం లేదు. ఇప్పటికే లక్షలాది మందిని బలితీసుకున్న ఈ వైరస్‌ రోజురోజుకీ తన పరిధిని పెంచుకుంటోంది. ఇక రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడంతో వృద్ధులే ఎక్కువగా ఈ మహమ్మారికి బలవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అందుకే మనదేశంతో పాటు చాలా దేశాల్లో లాక్‌డౌన్ ఆంక్షల్లో సడలింపులిచ్చినా వృద్ధులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదని మార్గదర్శకాలు జారీ చేశారు. అయితే ఆరోగ్యకరమైన జీవనశైలి, సానుకూల దృక్పథం ఉంటే ఎలాంటి వ్యాధినైనా ఎదుర్కోగలమని ఇప్పటికే చాలామంది వయోవృద్ధులు నిరూపిస్తున్నారు. తద్వారా తమ లాంటి వారికి వూరటనిస్తూ బతుకుపై ఆశలు కల్పిస్తున్నారు. ఈకోవకే చెందుతుంది ఇండోర్‌కు చెందిన చందాబాయి. వయసులో సెంచరీ దాటిన ఈ బామ్మ కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఇటీవలే ఇంటికి చేరుకుంది.

Know More

women icon@teamvasundhara
after-beating-cancer-lady-home-guard-is-now-on-the-streets-to-fight-corona

క్యాన్సర్‌ నుంచి కోలుకున్న వెంటనే ఖాకీ దుస్తులు వేసుకుంది!

క్యాన్సర్‌... మందులేని ఈ మహమ్మారి ఎన్నో ఏళ్లుగా మనిషిని పట్టి పీడిస్తోంది. లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకుంటున్నా... వదలకుండా మళ్లీ తిరగబెడుతూ వేలాది మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి కారణంగానే ఇటీవల ఇద్దరు బాలీవుడ్‌ దిగ్గజాలు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇక కరోనా కాలంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు పలువురు వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాంటిది కళ్లారా క్యాన్సర్‌ మహమ్మారిని చూసిన ఓ మహిళా హోంగార్డు కరోనాపై పోరుకు రడీ అయ్యింది. తన ఆరోగ్యం కన్నా సామాన్య ప్రజల ప్రాణాలే ముఖ్యమంటూ వృత్తి ధర్మాన్ని పాటిస్తోంది. మరి ఆపత్కాలంలో తన వృత్తి పట్ల అంతటి అంకిత భావం చూపుతున్న ఆ కరోనా యోధురాలి గురించి మనమూ తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
corona-virus-a-beggar-woman-donates-quintal-rice-cash-to-the-needy

ఆకలి బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు...అందుకే ఈ చిట్టి సాయం!

‘సాయం చేయాలంటే మన దగ్గర డబ్బే ఉండాల్సిన అవసరం లేదు. మంచి మనసుంటే చాలు’ అన్న మాటలను నిరూపిస్తూ చాలామంది కరోనాపై పోరులో భాగస్వాములవుతున్నారు. సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా తమకు తోచిన సహాయం చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఇక చిన్న పిల్లలు అయితే తమ పిగ్గీ బ్యాంకులో పోగేసుకున్న సొమ్మంతా విరాళంగా అందించి పెద్దమనసు చాటుకుంటున్నారు. ఈక్రమంలో ఓ యాచకురాలు కూడా వైరస్‌ వ్యతిరేక పోరులో భాగస్వామురాలయింది. ఆకలి బాధ ఎలా ఉంటుందో స్వయంగా తెలిసిన ఆమె తన వంతు సాయంగా క్వింటాల్‌ (100 కేజీలు) బియ్యంతో పాటు చీరలు, యాచిస్తూ పోగేసిన డబ్బును విరాళంగా అందించి విశాల హృదయాన్ని చాటుకుంది.

Know More

women icon@teamvasundhara
usharani-manne-appointed-ficci-flo-chairperson-for-hyderabad-chapter

women icon@teamvasundhara
meet-90year-old-hamako-mori-the-worlds-oldest-video-game-youtuber

ఈ ‘గేమింగ్‌ గ్రాండ్‌మా’ గిన్నిస్‌ బుక్‌ రికార్డుల్లోకి కూడా ఎక్కింది!

సాధారణంగా వయసు పైబడుతున్న కొద్దీ ఒంట్లో సత్తువ తగ్గిపోతుంది. కంటి చూపు తగ్గిపోయి చిన్న చిన్న పనులు చేయడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చాలామంది మంచానికే పరిమితమవుతూ మనవళ్లు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తుంటారు. ఈక్రమంలో 90 ఏళ్ల వయసులోనూ ఎంతో హుషారుగా, ఉత్సాహంగా వీడియో గేమ్స్‌ ఆడుతోంది జపాన్‌కు చెందిన హమ్కో మోరీ. ఏదో సరదాకో, ఆటవిడుపుకో ఈ గేమ్స్‌ ఆడుతుందేమో అనుకునేరు? ఆన్‌లైన్‌ గేమ్స్‌కు సంబంధించి బోలెడు అనుభవమున్న ఆమె ‘ప్రపంచంలోనే అత్యధిక వయసున్న యూట్యూబ్‌ వీడియో గేమర్‌’ గా గిన్నిస్‌ బుక్‌ రికార్డుల్లోకి కూడా ఎక్కడం విశేషం.

Know More

women icon@teamvasundhara
woman-ips-officer-cooks-meal-at-midnight-for-hungry-women-migrants

అర్ధరాత్రి పూట వాళ్ల ఆకలి తీర్చిన ఆఫీసరమ్మ!

ఆమె ఓ జిల్లా పోలీస్‌ ఉన్నతాధికారి... వైరస్‌ వ్యతిరేక పోరులో భాగంగా చీకటి పడే వరకు విధులు నిర్వర్తించింది. డ్యూటీ ముగించుకుని అప్పుడే ఇంటికి చేరుకుంది. విధి నిర్వహణలో బాగా అలసిపోవడంతో నిద్రకు ఉపక్రమించింది. అయితే అర్ధరాత్రి సమయంలో ఆమెకు ఓ ఫోన్‌ వచ్చింది. ‘అమ్మా ఆకలేస్తోంది. మూడు రోజుల నుంచి ఏమీ తినలేదు. కడుపు కాలిపోతోంది’ అని అవతలి వైపు నుంచి ఓ ఆడగొంతు మాటలు వినిపించాయి. ఉన్నతాధికారులు సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో విసుక్కోవడమో, కింది స్థాయి అధికారులకు వారి బాధ్యతలను అప్పజెప్పడమో, లేకపోతే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచిస్తారు. కానీ ఆమె అలా చేయలేదు. మానవతా హృదయంతో అప్పటికప్పుడు స్వయంగా లెమన్ రైస్‌ తయారుచేసి 11 మంది ఆకలి బాధితుల కడుపు నింపింది. అలా అర్ధరాత్రి సమయంలో..అది కూడా ఆఫ్‌ డ్యూటీలో కూడా కరోనాపై పోరులో భాగస్వామురాలయింది విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి.

Know More

women icon@teamvasundhara
corona-virus-kerala-nurse-joins-in-hospital-after-diagnosed-from-corona

ఈ సిస్టర్‌ సంకల్ప శక్తి ముందు కరోనా ఓడిపోయింది..!

‘సిస్టర్‌.. జాగ్రత్త!’ అన్నారెవరో! ఫర్వాలేదులే అన్నట్టుగా చిన్నగా నవ్విందామె! కొన్నాళ్లకు.. ‘సిస్టర్‌.. జాగ్రత్త!’ అన్నారింకెవరో!! ‘నా ధర్మం నేను నిర్వర్తించాలి. భయపడితే ఎలా?’ అని సమాధానమిచ్చింది. ఇంకొన్నాళ్లకు.. ‘సిస్టర్‌.. జాగ్రత్త!’ అంటూ ఆ రాష్ట్ర మంత్రి ఫోన్‌ చేశారు. ‘ధన్యవాదాలు..’ అని చెప్పి కొత్త శక్తితో మళ్లీ విధుల్లో చేరింది. ఈ మూడు సంఘటనలు ఆమె శక్తిని తెలియజేసేవే! కరోనా బాధితులకు సేవలు చేసి.. తానూ వైరస్‌ బారిన పడి.. కొవిడ్‌పై గెలిచి మళ్లీ విధులకు హాజరవుతున్నారు కేరళ నర్సు రేష్మా మోహన్‌దాస్‌. ఆమెను వసుంధర పలకరించింది.. ఈ నర్సమ్మ అనుభవాలు ఆమె మాటల్లోనే..

Know More

women icon@teamvasundhara
corona-virus-9-months-pregnant-but-this-nurse-continues-to-serve-corona-patients

ప్రసవానికి సిద్ధం ...అయినా ఈ నర్సమ్మ డ్యూటీ మాత్రం మానలేదు!

9 నెలల నిండు గర్భిణీ అంటే సాధారణ సమయంలోనే ఇంట్లో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. అత్యవసరమైతే తప్ప వారిని అడుగుబయటపెట్టనివ్వకూడదు. ఇక కరోనా మహమ్మారి గర్భిణీలతో పాటు చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులపై అధిక ప్రభావం చూపుతుందని వైద్య, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకించి ఈ గడ్డుకాలంలో గర్భిణీలు మరింత అప్రమత్తంగా ఉండాలని వారు చెబుతున్నారు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కర్ణాటకకు చెందిన ఓ నర్సు 9 నెలల నిండు గర్భంతో రోగులకు వైద్య సేవలందిస్తోంది. మరికొద్ది రోజుల్లో ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనున్న ఆమె తన ఆరోగ్యం కన్నా ప్రజల ప్రాణాలే ముఖ్యమంటూ వృత్తి ధర్మాన్ని చాటుతోంది. మరి ఆపత్కాలంలోనూ వృత్తి పట్ల అంతటి అంకితభావం చూపుతున్న ఆ కరోనా యోధురాలి గురించి మనమూ తెలుసుకుందాం రండి.!

Know More