కరీనా ధరించిన ఆ మెటర్నిటీ డ్రస్ మేము రూపొందించిందే!
అకేషన్ ఏదైనా ఫ్యాషన్‌కే అధిక ప్రాధాన్యమిస్తున్నారు ఈ తరం మహిళలు. ఆఫీస్/కాలేజీలకు వెళ్లేటప్పుడు ధరించే క్యాజువల్ వేర్ దగ్గర్నుంచి పార్టీలు, ప్రత్యేక సందర్భాలకు ఎంచుకునే అవుట్‌ఫిట్స్ దాకా.. ఇలా ప్రతిసారీ ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవాలని ఆరాటపడుతున్నారు. అంతేనా.. గర్భం ధరించినా స్టైలిష్‌గా, కంఫర్టబుల్‌గా మెరిసిపోవాలనుకునే అతివల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. అయితే ఇలాంటి మెటర్నిటీ వేర్ గురించి మార్కెట్లో వెతికితే ఆయా దుస్తుల డిజైన్‌ను బట్టి వాటి ధర వేలకు వేలే ఉంటుంది. దీంతో చాలామంది కాబోయే అమ్మలు వాటిని కొనలేక నిరాశతోనే వెనుదిరగాల్సి వస్తుంది. అయితే ఇలాంటి వారి అవసరాన్ని అర్థం చేసుకున్నారు దిల్లీకి చెందిన అక్కచెల్లెళ్లు ఆంచల్ జౌరా, ఆష్నా షా. తక్కువ ధరలోనే నాణ్యమైన, సౌకర్యవంతమైన మెటర్నిటీ వేర్‌ను రూపొందిస్తూ కాబోయే అమ్మల మనసు దోచుకుంటున్నారు. అంతేకాదు.. బాలీవుడ్ టు-బి-మామ్ కరీనా కపూర్ కూడా వీరు రూపొందించిన ఓ క్యూట్ మెటర్నిటీ వేర్‌లో మెరిసిపోవడం, ఆ ఫొటోలు కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారడంతో అందరూ ఈ సిస్టర్స్ ఫ్యాషన్ లేబుల్ గురించి తెగ వెతికేస్తున్నారు. మరి, తమ స్వీయ అనుభవమే తమతో ఈ మెటర్నిటీ ఫ్యాషన్ బ్రాండ్‌ని ప్రారంభించేలా చేసిందంటోన్న ఈ అక్కాచెల్లెళ్ల సక్సెస్ స్టోరీ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..