scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

ఎట్టకేలకు ‘నిర్భయ’కు న్యాయం జరిగింది!

Four Nirbhaya rapists are hanged on 22nd January

2020 జనవరి 22..ఉదయం 7 గంటలు..

ఆరుగురు కీచకుల చేతిలో హత్యాచారానికి గురై కన్నుమూసిన ఓ అభాగ్యురాలి ఆత్మ శాంతించనుంది.

న్యాయం కోసం అలుపెరగని పోరాటం చేస్తోన్న ఓ కన్నతల్లికి మనశ్శాంతి దొరకనుంది.

తమ సహోదరికి ఎప్పుడెప్పుడు న్యాయం జరుగుతుందా? అని ఆశగా ఎదురుచూస్తోన్న కోట్లాది ఆడపిల్లల ఆకాంక్ష నిజం కానుంది.

చట్టం ఎవరికీ చుట్టం కాదని ..దేశంలో సగ భాగమైన అరవై కోట్ల మంది ఆడపడుచులకు అండగా ఉంటానని న్యాయ దేవత గర్వంగా చెప్పుకోనుంది.

ఎట్టకేలకు ఏడేళ్ల నిరీక్షణ తర్వాత ‘నిర్భయ’కు న్యాయం జరిగింది. మానవత్వానికే మచ్చ తెచ్చేలా ఆమె జీవితాన్ని కడతేర్చిన మానవ మృగాలకు అంతిమ సమయం ఆసన్నమైంది. ఇలాంటి కీచకులకు సమాజంలో బతికే హక్కులేదని సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఉరిశిక్ష తీర్పును అమలు చేసేందుకు టైం ఫిక్సయింది. ఈ క్రమంలో ఈనెల22న ఉదయం 7 గంటలకు తీహార్‌ జైలులో వీరిని చనిపోయేవరకు ఉరి తీయాలంటూ దిల్లీలోని పటియాలా హౌస్‌ కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు నలుగురు దోషులకు డెత్‌ వారెంట్లు కూడా జారీ చేసింది. దిల్లీ కోర్టు తీర్పుతో తన కూతురు ‘నిర్భయ’కు సరైన న్యాయం జరిగిందని తల్లి ఆశాదేవి హర్షం వ్యక్తం చేయగా...ఇక నిర్భయను తమ సహోదరిలా భావించిన ఆడపడుచులందరూ స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకుంటున్నారు. సంక్రాంతి పండగను ముందుగానే జరుపుకొంటున్నారు.

nirbhayarepistshang650-2.jpg

ఏడేళ్ల కన్నీటి పోరాటానికి తెర!

కామంతో కళ్లు మూసుకుపోయిన ఆరుగురు కీచకులు కదులుతున్న బస్సులోనే ‘నిర్భయ’ జీవితాన్ని కడతేర్చారు. కూతురి భవిష్యత్‌పై బోలెడు ఆశలు పెట్టుకున్న ఆమె తల్లిదండ్రుల ఆశలన్నిటినీ ఆవిరి చేశారు. ఏడేళ్ల క్రితం దేశ రాజధానిలో జరిగిన ‘నిర్భయ’ ఉదంతం దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈనేపథ్యంలో తన కూతురు లాంటి దీన స్థితి మరే ఆడబిడ్డకు రాకూడదని గట్టిగా నిర్ణయించుకుంది ‘నిర్భయ’ తల్లి ఆశాదేవి. తన కూతురి పట్ల అమానుషంగా ప్రవర్తించిన మానవ మృగాలకు ఉరిశిక్ష వేయాలని కోర్టుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగింది. ఆమె మొర ఆలకించిన సుప్రీం కూడా ఇలాంటి ఉన్మాదులకు సమాజంలో జీవించే హక్కులేదని మూడేళ్ల క్రితం తీర్చు ఇచ్చింది. కానీ కాలం చెల్లిన కొన్ని చట్టాలు దోషులకు అండగా నిలబడుతూ వచ్చాయి. ఇందులో భాగంగా తీర్పును సమీక్షించాలని కోరుతూ నిత్యం రివ్యూ పిటిషన్లు, క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేస్తూ తమ ప్రాణాలను కాపాడుకున్నారీ కీచకులు.

అయితే గతేడాది ఆఖరులో హైదరాబాద్‌లో జరిగిన ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌ తర్వాత నిర్భయకు కూడా సత్వర న్యాయం జరగాలన్న డిమాండ్లు బలంగా వినిపించాయి. ఈ క్రమంలో నిర్భయ దోషులకు వెంటనే ఉరి శిక్ష అమలు చేయాలని మరోసారి సుప్రీం మెట్లెక్కింది బాధితురాలి తల్లి ఆశాదేవి. అయితే అంతకన్నా ముందు గతేడాది ఫిబ్రవరిలోనే దోషులకు వెంటనే డెత్‌ వారెంట్లు జారీ చేయాలని దిల్లీ కోర్టును కోరిందామె. అదేవిధంగా ‘దిశ’ ఎన్‌కౌంటర్‌ తర్వాత మళ్లీ సుప్రీంను ఆశ్రయించి..తన కూతురికి న్యాయం చేయాలని అభ్యర్థించింది. ఆమె మొర ఆలకించిన దిల్లీ కోర్టు తాజాగా ఈ కేసులోని నలుగురు దోషులకు డెత్‌ వారెంట్లు జారీ చేస్తూ ఉరిశిక్ష తేదీని ఖరారు చేసింది. కోర్టు ఆదేశాలు అందుకున్న తీహార్‌ జైలు అధికారులు.. ఈనెల 22న ఉదయం 7 గంటలకు నలుగురు దోషులను ఉరితీసేందుకు కసరత్తులు ప్రారంభించారు.

నా కూతురి ఆత్మకు శాంతి..!

nirbhayarepistshang650-6.jpg

న్యాయం కోసం నిర్భయ తల్లిదండ్రులు చేస్తున్న పోరాటానికి తెరపడిందిఈ కేసులో దోషులకు డెత్‌ వారెంట్లు జారీ కాగానే ఉద్వేగానికి లోనైన ఆ తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. ‘ నా కూతురి ఆత్మకు శాంతి కలుగుతుందిప్పుడున్యాయస్థానం తీర్పుతో ప్రతి మహిళకు చట్టంపై నమ్మకంగౌరవం పెరుగుతాయిఇన్నాళ్లూ కాళ్లరిగేలా తిరిగా..ఇప్పటికి సమాధానం దొరికిందిదోషులకు సరైన శిక్ష పడిందిచాలా సంతోషంగా ఉన్నా..ఇప్పటికైనా నిర్భయకు న్యాయం జరిగిందినా కూతురు లాంటి బాధితులు మన దేశంలో చాలామంది ఉన్నారువారందరికీ న్యాయం జరగాలంటే నిందితులకు సరైన శిక్ష పడాల్సిందేఅప్పుడే నిర్భయ ఆత్మ మరింత సంతోషిస్తుందిభవిష్యత్తులో ఆడపిల్లలపై అత్యాచారానికి పాల్పడాలంటేనే భయపడాలిఅలా మన చట్టంలో మార్పులు రావాలినిర్భయ కేసులో ఆలస్యం జరిగినా..న్యాయమైన తీర్పు వచ్చిందిఈ కేసులో నాకు చేయూతనందించిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా’ అని చెప్పుకొచ్చింది నిర్భయ తల్లి ఆశాదేవి.

nirbhayarepistshang650-4.jpg

ఆరోజు ఏం జరిగిందంటే...!

దిల్లీలో పారా మెడికల్‌ కోర్సు చదువుతున్న ‘నిర్భయ’పై 2012 డిసెంబర్‌ 16న రాత్రి ఆరుగురు వ్యక్తులు కదులుతున్న బస్సులో అత్యంత దారుణంగా హత్యాచారానికి పాల్పడ్డారు. స్నేహితునితో కలిసి సినిమాకు వెళ్లి తిరిగి వస్తున్న నిర్భయ..ఇంటికి వెళ్లేందుకు అటుగా వచ్చిన బస్సు ఎక్కారు. అయితే బస్సును దారి మళ్లించిన దుండగులు ఆమె స్నేహితుడిని కొట్టి..బస్సులోనే ఆమెపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రతిఘటించేందుకు ప్రయత్నించగా తీవ్రంగా గాయపరిచారు. అనంతరం నెత్తురోడుతున్న నిర్భయను, ఆమె స్నేహితుడిని వేగంగా వెళ్తున్న బస్సులోంచి రోడ్డు మీదకు తోసేశారు. ముందు దిల్లీలో, ఆ తర్వాత సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందిన నిర్భయ కోలుకోలేక అదే నెల 29న సింగపూర్‌ ఆస్పత్రిలోనే కన్నుమూసింది. దేశ రాజధాని నడిబొడ్డున జరిగిన ఈ అమానవీయ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు ఎగసిపడ్డాయి.

విచారణ సాగిందిలా..!

2012, డిసెంబర్‌ 16: స్నేహితుడితో కలిసి ఇంటికి వెళ్లేందుకు బస్సెక్కిన నిర్భయపై ఆరుగురు యువకులు అత్యాచారం చేసి, తీవ్రంగా గాయపరిచారు. రోడ్డుపై నిస్సహాయ స్థితిలో, తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆమెను దిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రికి తరలించారు.

డిసెంబర్‌ 17: అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని దేశ వ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభం. రామ్‌సింగ్‌, అతడి తమ్ముడు ముకేష్‌, వినయ్‌ శర్మ, పవన్‌ గుప్తాలతో పాటు మరో ఇద్దరు ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు.

డిసెంబర్‌ 18: ప్రధాన నిందితుడు బస్‌ డ్రైవర్‌ రామ్‌సింగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

డిసెంబర్‌ 21: నిందితుల్లో ఒకడైన మైనర్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. ఆరో నిందితుడి ఆచూకీ కోసం హరియాణా, బిహార్‌లోని పలుచోట్ల పోలీసులు గాలించారు. చివరకు బిహార్‌లోని ఔరంగాబాద్‌లో పోలీసులకు చిక్కాడు అక్షయ్‌ సింగ్‌ ఠాకూర్‌.

డిసెంబర్‌ 22: అక్షయ్‌ని దిల్లీకి తీసుకొచ్చిన పోలీసులు.. ఆస్పత్రిలో బాధితురాలి స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేశారు.

nirbhayarepistshang650-3.jpg

డిసెంబర్‌ 23: నిందితులకు మరణశిక్ష వేయాలంటూ రోడ్డెక్కిన ప్రజల ఆందోళనలు ఉగ్రరూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో ఈ నిరసనలను అడ్డుకుంటూ సుభాష్‌ తోమర్‌ అనే కానిస్టేబుల్‌ తీవ్రంగా గాయపడ్డాడు.

డిసెంబర్‌ 25: గాయపడిన కానిస్టేబుల్‌ మృతి. బాధితురాలి ఆరోగ్యం విషమించిందని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.

డిసెంబర్‌ 26: శరీరంలోని అంతర్గత అవయవాలు పూర్తిగా దెబ్బతినడంతో బాధితురాలిని సింగపూర్‌లోని మౌంట్‌ ఎలిజబెత్‌ ఆస్పత్రికి తరలించారు.

డిసెంబర్‌ 29: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక ‘నిర్భయ’ తుదిశ్వాస విడిచింది. ఆమె మరణంతో ఎఫ్‌ఐఆర్‌లో మర్డర్‌ ఛార్జీ నమోదు చేశారు పోలీసులు.

2013, జనవరి 2: కేసు విచారణ కోసం ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టును ప్రారంభించారు అప్పటి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆల్తమాస్‌ కబీర్‌.

జనవరి 3: మైనర్‌ను మినహాయించి..మిగతా ఐదుగురు నిందితులపై మర్డర్‌, గ్యాంగ్‌ రేప్‌, అటెంప్ట్‌ టు మర్డర్‌, కిడ్నాపింగ్‌, అన్‌ నేచురల్‌ అఫెన్సెస్‌, డెకాయిటీ ఆరోపణలతో కూడిన ఛార్జిషీటును దాఖలు చేశారు.

జనవరి 28: నిందితుల్లో ఒకరు మైనర్‌ అని జువైనల్‌ జస్టిస్‌ బోర్డ్‌ (జేజేబీ) ధ్రువీకరించింది.

మార్చి 11: నిందితుల్లో కీలకమైన బస్‌ డ్రైవర్‌ రామ్‌సింగ్‌ తీహార్‌ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు.

జులై 11: జేజేబీ మైనర్‌ను దోషిగా తేల్చింది.

ఆగస్టు 22: నలుగురు నిందితులకు వ్యతిరేకంగా పాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో తుది వాదనలు ప్రారంభం.

ఆగస్టు 31: మైనర్‌కు మూడేళ్ల శిక్ష విధిస్తూ జేజేబీ నిర్ణయం తీసుకుంది.

సెప్టెంబర్‌ 10: ముకేష్‌, వినయ్‌, అక్షయ్‌, పవన్‌లను గ్యాంగ్‌ రేప్‌ సహా మొత్తం 13 నేరాలలో దోషులుగా కోర్టు తేల్చింది.

సెప్టెంబర్‌ 13: నలుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.

nirbhayarepistshang650-1.jpg

సెప్టెంబర్‌ 23: ట్రయల్‌ కోర్టు విధించిన ఉరిశిక్షపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది.

2014, జనవరి 3: నిందితులు అప్పీల్ చేసుకోవడంతో హైకోర్టు ఈ తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

మార్చి 13: పలు దఫాల విచారణల అనంతరం ట్రయల్‌ కోర్టు విధించిన ఉరిశిక్షను ఖరారు చేస్తూ హైకోర్టు తీర్పు ప్రకటించింది.

మార్చి 15: తీర్పుపై దోషులు సుప్రీంను ఆశ్రయించడంతో శిక్ష అమలుపై స్టే విధించింది హైకోర్టు.

2017, ఫిబ్రవరి 3: దోషులకు ఉరిపై సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభమైంది.

మే 5: హైకోర్టు తీర్పును ఖరారు చేస్తూ నలుగురు దోషులను ఉరి తీయాలని సుప్రీం తీర్పునిచ్చింది.

నవంబర్‌ 8: ఈ తీర్పుకు వ్యతిరేకంగా ముకేష్‌, వినయ్‌, పవన్‌ సుప్రీంలో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు.

nirbhayarepistshang650-7.jpg

2018, జులై 9: ముగ్గురు నిందితుల రివ్యూ పిటిషన్‌ను కొట్టివేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.

2019, ఫిబ్రవరి: దోషులకు వెంటనే డెత్‌ వారెంట్‌ జారీ చేయాలని నిర్భయ తల్లిదండ్రులు దిల్లీ కోర్టును ఆశ్రయించారు.

డిసెంబర్‌ 10: ఈ కేసులో నాలుగో నిందితుడైన అక్షయ్‌ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశాడు.

డిసెంబర్‌ 18: అక్షయ్‌ పిటిషన్‌ను కూడా కొట్టివేస్తూ సుప్రీం తీర్పు వెలువరించింది. రివ్యూ పిటిషన్‌ అంటే ఒకే కేసుపై పదే పదే వాదనలు వినడం కాదని సుప్రీం కాస్త ఘాటుగానే వ్యాఖ్యలు చేసింది.

2020 జనవరి 7: ఈనెల 22న ఉదయం 7 గంటలకు నలుగురు దోషులను తీహార్‌ జైలులో చనిపోయేవరకు ఉరితీయాలంటూ దిల్లీ హైకోర్టు డెత్‌ వారెంట్‌లు జారీ చేసింది.

నలుగురు దోషులకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ దిల్లీ కోర్టు తీర్పు వెలువరించడంతో నిర్భయ తల్లిదండ్రులతో పాటు చాలా మంది ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యమైనా న్యాయ దేవత నిర్భయకు సరైన న్యాయం చేసిందంటూ వ్యాఖ్యానిస్తు్న్నారు. గతేడాది చివర్లో ‘దిశ’ ను పొట్టన పెట్టుకున్న నిందితులు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. తాజాగా ‘నిర్భయ’ దోషులకు ఉరిశిక్ష ఖరారైంది. ఈ రెండు ఘటనలతోనైనా మనిషి రూపంలో తిరుగుతున్న కొన్ని మానవ మృగాల్లో మార్పు వస్తుందా? రాదా? అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.





women icon@teamvasundhara
corona-virus-women-stitching-face-masks-for-the-needy-inspires-many

కరోనాపై పోరులో మేము సైతం!

కరోనా ధాటికి మానవజాతి విలవిల్లాడిపోతోన్న నేపథ్యంలో.. ప్రపంచమంతా ఒక్కటై ఈ మహమ్మారిపై పోరాటం సాగిస్తోంది. మన దేశంలో కూడా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తికి మించి కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, మీడియా, పోలీస్‌.. తదితర అత్యవసర విభాగాలకు చెందిన ఉద్యోగులు కంటి మీద కునుకు లేకుండా తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. వీళ్లతో పాటు సామాజిక స్పృహ కలిగిన మరికొందరు సైతం ఈ ఆపద సమయంలో సమాజానికి తమ వంతు సహాయాన్ని అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తు్న్నారు. ఈ క్రమంలో కొంతమంది కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రాథమికంగా ఉపయోగించే మాస్కులను స్వయంగా రూపొందిస్తున్నారు. ఇలాంటి కొంతమంది మహిళామణుల గురించి తెలుసుకుందాం రండి..!

Know More

women icon@teamvasundhara
corona-virus-covid-19-indian-origin-covid-survivor-shares-her-experience

ఆ క్షణం చావు నా ముందున్నట్లనిపించింది!

కనికరం లేకుండా కోరలు చాస్తోన్న కరోనాకు అగ్రదేశాలు సైతం అతలాకుతలమవుతున్నాయి. ఈ మహమ్మారి కారణంగా బ్రిటన్‌లో ఇప్పటికే సుమారు 7వేల మంది మృత్యువాత పడగా, లక్షలాది మంది క్వారంటైన్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, ప్రిన్స్‌ చార్లెస్‌ లాంటి ప్రముఖులు కూడా ఈ వైరస్‌ బారిన పడ్డారంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ కరోనా కోరల్లో చిక్కుకొని తాను కూడా చావును చాలా దగ్గర్నుంచి చూశానని చెబుతోంది లండన్‌లో నివసిస్తోన్న రియా లఖానీ. భారతీయ సంతతికి చెందిన ఆమె కరోనా బారిన పడి ఇటీవలే కోలుకుంది. ఈ క్రమంలో చికిత్స తీసుకునే సమయంలో తనకెదురైన అనుభవాల గురించి సోషల్ మీడియాలో షేర్‌ చేసుకుందీ బ్రేవ్‌ లేడీ.

Know More

women icon@teamvasundhara
anm-and-aasha-workers-plays-a-major-role-in-corona-survey

వృత్తిధర్మం కోసం కరోనానూ లెక్క చేయడం లేదు..!

తుమ్మితే అనుమానంగా చూస్తున్నారు. దగ్గితే దూరం జరిగిపోతున్నారు. జ్వరం ఉందంటే.. ఆ వైపు వెళ్లడానికి జంకుతున్నారు. కానీ ఈ మహిళలు మాత్రం.. నిరంతరం శోధిస్తున్నారు. వైరస్‌ బారిన పడినవారిని వెతికి పట్టుకునే పనిలో ఉన్నారు. ఇంటింటికీ వెళ్తున్నారు.. వీధి వీధినీ జల్లెడ పడుతున్నారు వాళ్లే ఏఎన్‌ఎమ్‌లు, ఆశా కార్యకర్తలు.. కరోనా కట్టడికి వీళ్లు నడుం బిగించారు. అవమానాలు ఎదురైనా.. అనుమానితులను వదలడం లేదు. అయినవారే వద్దంటున్నా.. ఆపత్కాలంలో వెనుకడుగు వేసేది లేదంటున్నారు. కరోనా కల్లోలంపై జగతిని జాగృతం చేస్తున్న ఈ స్త్రీమూర్తుల కష్టాన్ని చదవండి..

Know More

women icon@teamvasundhara
britain-doctor-roopa-says-corona-patient-vomited-on-her-while-treatment

చికిత్స చేస్తుండగానే నా దుస్తులపై వాంతి చేసుకున్నాడు!

కరోనా వైరస్‌ కారణంగా కోట్లాది మంది ఇళ్లకు పరిమితమయ్యారు. అదే సమయంలో అదే కరోనాను కట్టడి చేసేందుకు వైద్యులు, నర్సులు కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్నారు. రోగులకు చికిత్స చేసే క్రమంలో తమకు వైరస్‌ సోకే ప్రమాదం పొంచి ఉన్నా ప్రాణాలను పణంగా పెట్టి మరీ వైద్య సేవలు అందజేస్తున్నారు ఎందరో వైద్య సిబ్బంది. విధి నిర్వహణలో భాగంగా నెలల తరబడి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ ప్రాణాంతక వైరస్‌పై పోరాటం కొనసాగిస్తున్నారు. వృత్తి ధర్మాన్ని నిక్కచ్చిగా పాటిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఈ కోవకే చెందుతారు బ్రిటన్‌కు చెందిన డాక్టర్‌ రూపా ఫారూఖీ. ఇంగ్లండ్‌లోని క్వీన్‌ ఎలిజబెత్‌ మదర్‌ ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారామె. ఈక్రమంలో విధి నిర్వహణలో భాగంగా తనకెదురైన సవాళ్లు, వాటిని అధిగమించిన తీరును తాజాగా అందరితో పంచుకున్నారు రూప.

Know More

women icon@teamvasundhara
jk-rowling-shares-a-video-that-helped-her-tide-over-covid-19-symptoms

కరోనా లక్షణాలతో బాధపడ్డా.. అయినా కోలుకున్నా!

కరోనా ప్రభావంతో అగ్రదేశమైన బ్రిటన్‌ కూడా అతలాకుతలమవుతోంది. ఏకంగా ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, ఆరోగ్య శాఖ మంత్రి, ప్రిన్స్ చార్లెస్‌ తదితర ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడడం గమనార్హం. చిన్నా, పెద్ద, పేద, ధనిక, సామాన్యుడు, సెలబ్రిటీ అన్న తేడాల్లేకుండా అందరినీ కబళిస్తోన్న వైరస్‌ కారణంగా బ్రిటన్‌లో సుమారు 5వేలమందికి పైగా మరణించారు. ఈక్రమంలో ఆ దేశానికి చెందిన ప్రముఖ రచయిత్రి, హ్యారీ పోటర్‌తో సరికొత్త మాయాలోకాన్ని సృష్టించిన జేకే రౌలింగ్‌ తాను కూడా కరోనా లక్షణాలతో బాధపడ్డానని ప్రకటించింది. అయితే వైద్యుడైన తన భర్త సూచించిన కొన్ని సలహాలను పాటించడంతో ఎటువంటి పరీక్షలు, చికిత్స చేయించుకోకుండానే ఈ మహమ్మారి నుంచి బయటపడ్డానని చెప్పుకొచ్చారామె. మరి ఆమె పాటించిన ఆ సలహాలేంటో మనమూ తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
nurse-shows-how-quickly-corona-can-spread-even-while-wearing-gloves

మనకు తెలియకుండానే వైరస్‌ ఇలా వ్యాపిస్తుంది.. జాగ్రత్త!

కనికరం లేకుండా కోరలు చాస్తోన్న కరోనాను కట్టడి చేసేందుకు ఆయా దేశాలు ఆపసోపాలు పడుతున్నాయి. వైరస్‌కు కేంద్ర బిందువైన చైనాలో కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ మిగతా దేశాలు ఈ మహమ్మారి ధాటికి అతలాకుతలం అవుతున్నాయి. ఈ వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే పలు దేశాలు లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నాయి. స్వీయ నిర్బంధం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని మార్గదర్శకాలు జారీ చేస్తున్నాయి. ఇక అత్యవసరంగా బయటికెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌజులు ధరించాలని వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. అయితే ఈ జాగ్రత్తలు పాటించినంత మాత్రాన ఈ వైరస్‌ వ్యాప్తిని పూర్తిగా అడ్డుకోలేమంటున్నారు మిచిగాన్‌కు చెందిన మోలీ లిక్సే. అక్కడి స్థానిక ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోన్న ఆమె... చేతులకు గ్లౌజులు ధరించినప్పటికీ వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదముందని ప్రయోగ పూర్వకంగా వివరించింది.

Know More

women icon@teamvasundhara
former-british-parliament-member-anna-soubry-praises-kerala-nurses

ఆమె నోట కేరళ నర్సుల మాట..!

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ఆరోగ్య కార్యకర్తలు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. దీంట్లో కేరళకు చెందిన నర్సులే కీలకపాత్ర పోషిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా ఉన్న నర్సుల్లో భారత్‌ నుంచి వెళ్లినవాళ్లే ఎక్కువట. అందులోనూ కేరళదే అగ్రస్థానం. కేరళలో చదువుకున్న 30 శాతం మంది నర్సులు అమెరికా, బ్రిటన్‌లో... 15 శాతం మంది ఆస్ట్రేలియాలో, 12 శాతం మంది మధ్య తూర్పు ప్రాంతంలో సేవలను అందిస్తున్నారు. బ్రిటిష్‌ పార్లమెంట్‌ మాజీ సభ్యురాలు అన్నా సౌబ్రి... తమ దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో కేరళ నర్సులు అందిస్తోన్న సేవలను ఎంతగానో ప్రశంసించారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ అవుతోంది. ‘విదేశాల నుంచి వచ్చిన నర్సులు మా దేశంలో పనిచేయడం వల్ల మాకెలాంటి ఇబ్బందీ లేదు. నిజానికి ప్రతిభా, సేవానిరతి ఉన్న భారతదేశానికి చెందిన నర్సులు.. ముఖ్యంగా కేరళ నర్సుల నుంచి మేమెంతో నేర్చుకున్నాం కూడా’ అని వారి సేవలను కొనియాడారు. ప్రస్తుతం కరోనా మహమ్మారితో పోరాడుతూ అత్యవసర సేవలను అందిస్తున్న వాళ్లలోనూ వీరే ముందున్నారు. యూకేలోని అత్యవసర సేవల బృందాల్లోనూ కేరళ నర్సులే మొదటి స్థానంలో ఉన్నారట.

Know More

women icon@teamvasundhara
england-captain-heather-knight-joins-nhs-to-bat-against-covid-19

ఈ ఖాళీ సమయం సేవకే అంకితం!

కరోనా భయంతో ప్రపంచమంతా షట్‌డౌన్‌ అయిపోయింది. డాక్టర్లు, పోలీసులు, మీడియా.. వంటి అత్యవసర సేవలు మినహా సామాన్యుల దగ్గర్నుంచి సెలబ్రిటీల దాకా అందరూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. ఇక ఇలాంటి సమయంలో మరీ అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటికొచ్చే సాహసం ఎవరైనా చేస్తారా చెప్పండి. కానీ అలాంటి సాహసమే చేసింది ఇంగ్లండ్‌ మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హీథర్‌ నైట్‌. క్వారంటైన్‌లో భాగంగా దొరికిన ఖాళీ సమయాన్ని మనమంతా విభిన్న రకాలుగా ఉపయోగించుకుంటుంటే.. ఈ ఇంగ్లండ్‌ స్కిప్పర్‌ మాత్రం ‘నా ఈ ఖాళీ సమయం సేవకే అంకితం..’ అంటూ ‘జాతీయ ఆరోగ్య సేవా సంస్థ (ఎన్‌హెచ్‌ఎస్‌)’లో వలంటీర్‌గా చేరిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా ఎన్‌హెచ్‌ఎస్‌లో తన సభ్యత్వాన్ని కూడా నమోదు చేసుకుందీ ఇంగ్లిష్‌ క్రికెట్‌ బ్యూటీ. ఇంతకీ హీథర్‌ ఎన్‌హెచ్‌ఎస్‌ వలంటీర్‌గా ఎలా సేవ చేస్తోందో తెలుసుకుందామా..?

Know More

women icon@teamvasundhara
friends-celebrate-teens-last-chemo-session-in-an-unique-way

సామాజిక దూరం పాటిస్తూనే సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చారు..!

ఎదుటివారికి ప్రేమను పంచాలనే మనసుండాలే కానీ, ప్రకృతి విపత్తులు సైతం వారికి అడ్డుగా నిలబడలేవు..! దీనికి ఉదాహరణగా నిలిచే ఓ సంఘటనే ఇటీవల అమెరికాలో చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన జాన్‌ క్రసిన్స్‌కి అనే నటుడు ‘ఈ వారంలో మీకు ఎదురైన స్ఫూర్తిదాయక కథ లేదా మిమ్మల్ని ఆనందానికి గురి చేసిన సంఘటనలను నాతో పంచుకోండి’ అంటూ ఇటీవల సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఈ పోస్ట్‌పై చాలామంది నెటిజన్లు స్పందించారు. కానీ, వీరిలో ఏప్రిల్‌ డాన్జ్‌ అనే మహిళ షేర్‌ చేసిన ఓ వీడియో జాన్‌తో పాటు నెటిజన్లను సైతం విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరి ఆ వీడియో ఏంటి..? దాని వెనకున్న కథేంటో మనమూ చూసేద్దామా..!

Know More

women icon@teamvasundhara
paramedic-applauded-by-her-neighborhood-in-uk

ఆమె సేవలకు కాలనీ అంతా చప్పట్ల వర్షం కురిసింది!

కరోనా ఆడుతోన్న విలయ తాండవానికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ మహమ్మారి బారిన పడకుండా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు స్వీయ నిర్బంధంలో ఉంటూ సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. కానీ, అత్యవసర సేవల కోసం కొన్ని రంగాలకు చెందిన వాళ్లు మాత్రం తమ విధుల్లో కొనసాగుతున్నారు. వీరిలో వైద్య రంగానికి చెందిన డాక్టర్లు, నర్సులు, కాంపౌండర్లు.. తదితర సిబ్బంది కూడా ఉన్నారు. వీళ్లు కరోనా లేదా ఇతర రోగాలతో ఆసుపత్రుల్లో చేరుతోన్న రోగులకు వైద్య సేవలందించేందుకు పగలు, రాత్రి అనే తేడాల్లేకుండా నిరంతరం పని చేస్తున్నారు. ముఖ్యంగా కొవిడ్‌-19 లక్షణాలున్న వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు వీళ్లు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ మహమ్మారితో పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో యూకేలో పారామెడిక్‌ (ఎమర్జెన్సీ కేర్‌ అసిస్టెంట్‌)గా సేవలందిస్తోన్న ఓ యువతి డ్యూటీకి వెళ్తుండగా తన కాలనీ వాసులంతా ఇంటి నుంచి బయటకు వచ్చి చప్పట్లతో ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

Know More

women icon@teamvasundhara
gwalior-women-making-masks-sanitizers-for-low-cost

ఆ మహిళల కృషితో అందుబాటు ధరల్లోనే మాస్కులు, శానిటైజర్లు!

ప్రపంచమంతా కరోనా వైరస్‌ అలుముకున్న ఈ తరుణంలో దాన్నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే వ్యక్తిగత పరిశుభ్రత, మాస్కులు ధరించడం ఎంత ముఖ్యమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మరి, ఓవైపు మార్కెట్లో లభించే మాస్కులు కొందామంటే వందలకు వందలు ఖర్చుపెట్టాల్సి వస్తోంది. మరోవైపు చేతులు శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించే శానిటైజర్ల కొరత కూడా ఏర్పడినట్లు మనం రోజూ వార్తల్లో వింటూనే ఉన్నాం. అయితే ఇక నుంచి మాస్కులు, శానిటైజర్ల విషయంలో ఎలాంటి ఇబ్బందీ పడాల్సిన అవసరం లేదంటున్నారు మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌లోని ఫూల్‌బాగ్‌కు చెందిన మహిళలు. ఈ క్రమంలోనే అక్కడి వందలాది మంది మహిళలు మాస్కులు, శానిటైజర్ల తయారీలో నిమగ్నమయ్యారు. ఇలా వీరు తయారుచేసిన ఈ ఉత్పత్తుల్ని తక్కువ ధరకే విక్రయిస్తూ కరోనా బారి నుంచి అందరినీ కాపాడడంలో పరోక్షంగా తమ వంతుగా కృషి చేస్తున్నారు. మరి, ఈ మహిళల గురించి, వారు తయారుచేస్తోన్న ఉత్పత్తుల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
women-share-her-experience-about-corona-symptoms-to-bring-awareness

నాలో ‘కరోనా’ అలా బయటపడింది!

ఒంట్లో కాస్త నలతగా ఉన్నా, దగ్గినా, తుమ్మినా వెంటనే.. ‘నాకూ ‘కరోనా’ వచ్చిందేమో.. అందుకే ఇలా అవుతోంది’ అని భయపడే పరిస్థితులు వచ్చాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా, విన్నా కరోనాకు సంబంధించిన వార్తలే వస్తున్న నేపథ్యంలో చాలామందిలో ఏదో తెలియని గుబులు మొదలైంది. మరీ ముఖ్యంగా యువతలో ఇది ఎక్కువగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రజల్లో ఇలాంటి భయాలను దూరం చేయాలనుకుంది కరోనా బారిన పడి క్రమంగా కోలుకుంటోన్న ఓ 22 ఏళ్ల అమెరికన్‌ అమ్మాయి. ఈ క్రమంలోనే తన ‘కరోనా అనుభవాలను’ నెటిజన్లతో పంచుకుంది. కరోనా తనను ఎలా అటాక్‌ చేసింది? రోజురోజుకీ తనలో ఎలాంటి లక్షణాలు కనిపించాయి? అనే విషయాలను ట్విట్టర్‌ ద్వారా పంచుకుంటూ అందరిలో ధైర్యం నింపుతోంది. మరి ఆ యువతి పంచుకున్న ‘కరోనా’ అనుభవాల గురించి మనమూ తెలుసుకుందామా..?

Know More

women icon@teamvasundhara
wife-of-coronavirus-doctor-writes-how-their-lives-have-changed

మూడు వారాల పాపాయిని నా భర్త చేతుల్లోకే తీసుకోలేదు!

‘ఈ ప్రపంచంలో దేవుడి తర్వాత అందరూ చేతులెత్తి మొక్కేది ఒక్క డాక్టర్లకే’...! ‘ఠాగూర్‌’ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి నోటి వెంట వచ్చిన ఈ డైలాగ్‌ ఒక్కటి చాలు...డాక్టర్ల గొప్పతనమేంటో చాటి చెప్పడానికి..! ఇక ‘వైద్యో నారాయణో హరి’ అంటూ వైద్యులను సాక్షాత్తూ నారాయణుడి (భగవంతుడు)తో పోల్చారు మన పెద్దలు. ప్రస్తుతం కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్యులను, నర్సులను చూస్తే చాలామందికి ఈ మాటలే గుర్తుకు వస్తాయి. రోగుల కారణంగా ఎక్కడ తమకు వైరస్‌ సోకుతుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూనే వారు వైద్య సేవలు అందిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా కుటుంబ సభ్యులకు సైతం దూరంగా ఉంటూ ప్రాణాంతక వైరస్‌ను తరిమికొట్టేందుకు తమ ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. తమ సేవా నిరతిని చాటుతున్నారు. ఈ క్రమంలో ఈ మహమ్మారి తమ జీవితాలను పూర్తిగా మార్చేసిందంటూ ఓ వైద్యుడి భార్య పెట్టిన పోస్ట్‌ ప్రస్తుతం అందరి మన్ననలు అందుకుంటోంది.

Know More

women icon@teamvasundhara
donatella-versace-donates-200000-euros-to-italy-hospital-to-help-fight-coronavirus

కరోనా బాధితుల కోసం ఈ తల్లీకూతుళ్లు ఏం చేశారో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కరోనా భయమే అలుముకుంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ఎన్నో దేశాల్లో తన విశ్వరూపాన్ని చూపుతోంది. మొదటి రెండు నెలలు చైనాను కుదిపేసిన ఈ వైరస్‌ ప్రస్తుతం కొన్ని దేశాల్ని ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. అలా కరోనా చెరబట్టిన దేశాల్లో ఇటలీ కూడా ఒకటి. రోజురోజుకీ అక్కడ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా మరణాల రేటు కూడా ఇటలీలో ఎక్కువేనని అధికారికంగా వెల్లడైన గణాంకాలు రుజువు చేస్తున్నాయి. అంతేకాదు.. అక్కడ రోజురోజుకీ రోగులు పెరిగిపోతుండడంతో వైద్య సదుపాయాలు కూడా కొరవడుతున్నాయి.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అక్కడి కరోనా బాధితులకు తనవంతుగా సహాయం చేయడానికి ముందుకొచ్చారు ప్రముఖ ఇటాలియన్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌ డొనాటెల్లా వెర్సేస్‌. తన కూతురు అలెగ్రా వెర్సేస్‌తో కలిసి మిలాన్‌లోని ఓ హాస్పిటల్‌కి కోటి రూపాయలకు పైగా విరాళం అందించి తన దాతృత్వాన్ని చాటుకుంది డొనాటెల్లా.

Know More

women icon@teamvasundhara
supreme-court-in-favor-of-permanent-commission-for-women-officers-in-the-navy

ఇక నేవీలోనూ నారీ శక్తి!

సాధారణంగా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ లాంటి సాయుధ దళాలంటే పురుషులే గుర్తుకు వస్తారు. ఇక్కడ మహిళలున్నా ఉన్నత అవకాశాలకు మాత్రం ఆమడదూరంలో ఉంటారు. ఈ వివక్ష ఏంటని ప్రశ్నిస్తే మాత్రం ‘ ఆడవాళ్లు అన్ని విభాగాల్లో పనిచేయలేరు. వారికి పురుషులతో సమానంగా శక్తి సామర్థ్యాలుండవు’ అని కుంటిసాకులు వెతుకుతుంటారు. ముఖ్యంగా ఆర్మీ, నేవీల్లాంటి దళాల్లో కొన్నేళ్లుగా ఈ వివిక్ష కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో గతనెలలో ఆర్మీలో పురుషులతో పాటు మహిళలకూ సమాన అవకాశాలు కల్పించాలని తీర్పునిచ్చిన సుప్రీం కోర్టు తాజాగా మరో చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. సైన్యంలో మాదిరిగానే నావికాదళంలోనూ మహిళలకు శాశ్వత కమిషన్‌ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో శారీరక లక్షణాలను సాకుగా చూపుతూ వారిని ఉన్నత అవకాశాలకు దూరం చేస్తున్న వారికి మరోసారి మొట్టికాయలు వేసింది.

Know More

women icon@teamvasundhara
-a-chinese-nurse-shares-her-experience-about-treating-corona-patients

అందుకే వాళ్లు దగ్గినా, తుమ్మినా దూరంగా వెళ్లలేం!

ఇప్పటికే చైనాను కకావికలం చేసిన కరోనా ప్రస్తుతం ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సుమారు 145 దేశాలకు పాకిన ఈ మహమ్మారి పేరు వింటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. మరి సామాన్యుల పరిస్థితే ఇలా ఉంటే కరోనా రోగులకు చికిత్స చేసే డాక్టర్లు, నర్సుల పరిస్థితి ఇంకెంత దయనీయంగా ఉంటుంది చెప్పండి. రోగుల కారణంగా ఎక్కడ ఆ మహమ్మారి తమకు సోకుతుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూనే వైద్య సేవలు అందిస్తున్న పరిస్థితి వారిది. అయినా తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ కరోనా బాధితులను కాపాడుతున్నారు. వృత్తిధర్మాన్ని చాటి చెబుతూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఈ కోవకే చెందుతుంది చైనాకు చెందిన ఫ్యాన్‌ అన్జి. చైనాలోని చాంగ్‌ కింగ్‌ పబ్లిక్‌ హెల్త్‌ మెడికల్‌ సెంటర్‌లో హెడ్‌ నర్సుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారామె. ఈ క్రమంలో విధి నిర్వహణలో భాగంగా తనకెదురైన సవాళ్లు, వాటిని అధిగమించిన తీరును అందరితో పంచుకున్నారు ఫ్యాన్‌.

Know More

women icon@teamvasundhara
us-woman-who-survived-coronavirus-shares-her-experience

అలా నేను కరోనాను జయించా !

చైనాలో పుట్టి ప్రస్తుతం ప్రపంచాన్నంతా కలవరపెడుతోంది కరోనా వైరస్‌ (కొవిడ్‌-19). ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం దీని తీవ్రతను పరిగణనలోకి తీసుకొని ఈ వ్యాధిని ‘మహమ్మారి’గా ప్రకటించింది. ఇక భారతదేశంలోనూ రోజురోజుకూ కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పరిస్థితిని సమీక్షిస్తూ.. ముందు జాగ్రత్త చర్యలు చేపడుతూ పలు మార్గదర్శకాలు జారీ చేస్తున్నాయి. అయితే ఇదేమీ ప్రాణాంతక వ్యాధి కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పాలకులు, అధికారులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే కరోనా బారిన పడి పూర్తిగా కోలుకున్న కేరళ వాసులను ఉదాహరణగా చూపిస్తూ ఊరట కలిగిస్తున్నారు. ఈ లిస్టులో తానూ ఉన్నానంటోంది 37 ఏళ్ల అమెరికన్‌ మహిళ. ఈ మహమ్మారి బారిన పడిన తాను పూర్తిగా కోలుకున్నానని చెబుతోందీ డేరింగ్‌ వుమన్‌. అంతేకాదు కరోనా భయంతో వణికిపోతున్న ప్రపంచానికి ఉపశమనం కలిగిస్తూ తన అనుభవాలను అందరితో షేర్‌ చేసుకుందీ అమెరికన్‌ లేడీ.

Know More

women icon@teamvasundhara
mexican-woman-strike-to-protest-against-gender-based-violence

ఆడవాళ్లు లేకపోతే ఎలా ఉంటుందో చూడండి !

ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే మెక్సికో నగర రహదారులన్నీ ఆరోజు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. కార్యాలయాలన్నీ వెలవెలబోయాయి. బడులన్నీ బోసిపోయాయి. కళాశాలల్లో కుర్రకారు హుషారు కనిపించనేలేదు. నిత్యం సందడిగా ఉండే షాపింగ్‌మాల్స్‌లో కూడా నిశ్శబ్దం రాజ్యమేలింది. అక్కడక్కడా ఒకరిద్దరు పురుషులు తప్పితే మచ్చుకు ఓ మహిళ జాడ కూడా కనిపించలేదు. ఈ పరిస్థితులను చూస్తుంటే ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ‘కరోనా’ మెక్సికోకు వచ్చిందేమో అనుకుంటున్నారా? అసలు విషయం అది కాదండోయ్‌...! మరి నిత్యం జన సమూహంతో సందడిగా ఉండే మెక్సికో నగరం మార్చి 9న ఎందుకు మూగబోయిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే..!

Know More

women icon@teamvasundhara
pv-sindhu-won-the-bbc-indian-sportswoman-of-the-year-2019-award

మహిళలుగా మనపై మనం నమ్మకముంచాలి!

‘కష్టే ఫలి’ అన్నారు పెద్దలు. ‘దాంతో పాటు మహిళలుగా మనపై మనం నమ్మకముంచాలి.. అప్పుడే విజయం మన ముంగిట వాలుతుంది..’ అంటోంది భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు. 2009లో బ్యాడ్మింటన్‌ క్రీడలోకి అడుగుపెట్టిన ఈ హైదరాబాదీ.. దశాబ్ద కాలంలోనే ఎన్నో విజయాలు అందుకొని దేశానికి పతకాల పంట పండించింది. తన కీర్తి కిరీటంలో మరెన్నో అవార్డులతో మురిసి మెరిసిన ఈ స్టార్‌ షట్లర్‌.. తాజాగా మరో ఘనత సాధించింది. ‘బీబీసీ ఇండియన్‌ స్పోర్ట్స్‌వుమన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - 2019’ అవార్డు గెలుచుకొని మరింత మంది అమ్మాయిలకు ప్రేరణగా నిలుస్తోందీ సూపర్బ్‌ షట్లర్‌. ఇక ఈ పురస్కారాల్లో భాగంగా పరుగుల రాణి పీటీ ఉషను ‘లైఫ్‌టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డు’తో సత్కరించింది బీబీసీ.

Know More

women icon@teamvasundhara
kerala-attukal-bhagavathy-temple

ఈ మహిళల శబరిమలై గురించి విన్నారా?

కేరళలోని అట్టుక్కల్‌ అమ్మవారి దేవాలయాన్ని మహిళా శబరిమలై అని పిలవొచ్చు. ఎందుకంటే ఇక్కడ జరిగే ప్రధాన పూజలు, అర్చనల్లో మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఈస్ట్‌ ఫోర్టు ప్రాంతంలో ఈ క్షేత్రం నెలకొని ఉంది. ఇక్కడ జరిగే అట్టుక్కల్‌ పొంగల్‌ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. కేవలం మహిళలు మాత్రమే లక్షల సంఖ్యలో పాల్గొనే వేడుక కావడంతో దీనికి ఆ ప్రాధాన్యం ఏర్పడింది. అట్టుక్కల్‌ భగవతి అమ్మవారి చరిత్ర కేరళ, తమిళనాడుకు చెందిన పురాణగాథల్లో కనిపిస్తుంది. సరస్వతి, మహాలక్ష్మి, పార్వతిల సమ్మిళిత రూపం ఆమెది. నాలుగు చేతులలో ఆయుధాలు ధరించి దుష్ట శిక్షణ-శిష్ట రక్షణ కోసం అవతరించిన మూర్తిగా కనిపిస్తారు. పెద్దఎత్తున భక్తులు ఇక్కడకు వచ్చి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. తొట్టంపట్టు అనే పేరుతో ఉన్న గీతంతో అమ్మవారిని భక్తులు కీర్తిస్తుంటారు.

Know More

women icon@teamvasundhara
free-sanitary-pads-in-noida-at-all-aqua-line-metro-stations-from-march-8-

ఆ మెట్రో స్టేషన్లో ఉచిత శ్యానిటరీ న్యాప్‌కిన్లు!

ప్రపంచవ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నప్పటికీ నేటికీ కొన్ని అంశాల్లో సమాజం విధించే కట్టుబాట్లు, మూఢనమ్మకాలు.. అమ్మాయిల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నాయి. అలా మహిళలను ఇబ్బందికి గురిచేస్తోన్న అంశాల్లో ‘నెలసరి’ ఒకటి. ప్రపంచాన్నే అరచేతిలో చూడగలిగేంత టెక్నాలజీ వచ్చినా కూడా.. ఇప్పటికీ మన దేశంలో కొన్ని ప్రదేశాల్లో నెలసరి సమయంలో వంటింట్లోకి అడుగుపెట్టకూడదని, ఇతరులను ముట్టుకోకూడదని.. ఆంక్షలు పెడుతూ ఉంటారు. మరికొన్ని ప్రాంతాల్లో నెలసరి పరిశుభ్రత గురించి అవగాహన లేకపోవడం వల్ల పలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇక ఇంకొన్ని చోట్ల అన్నీ అందుబాటులో ఉన్నా, వ్యక్తిగత పరిశుభ్రత గురించి అవగాహన ఉన్నప్పటికీ శ్యానిటరీ న్యాప్‌కిన్లు కొనలేని ఆర్థిక పరిస్థితితో ఇబ్బందిపడుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొనే మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లోని పాఠశాలలు బాలికలకు ఉచితంగా శ్యానిటరీ ప్యాడ్స్‌ అందిస్తున్నాయి. అయితే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా నోయిడా మెట్రో ట్రెయిన్‌ కార్పొరేషన్‌ కూడా మహిళలకు ఉచిత శ్యానిటరీ నాప్‌కిన్స్‌ వెండింగ్‌ మెషీన్స్‌ని ఏర్పాటు చేయడానికి సంసిద్ధమైంది. మరి, ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
anand-mahindra-applauds-pune-teacher-for-getting-bikers-off-footpaths

ఆ ఆంటీకి అభిమానినైపోయా!

అసలే ఇరుకు రోడ్లు, ఆపై లక్షలాది వాహనాలు, వీటికి తోడు దుమ్ము, ధూళి, పొగతో నిండుకున్న సిటీ రోడ్లపై నడిచి వెళ్లే పాదచారులకు అదొక పెద్ద ప్రహసనమని చెప్పవచ్చు. కనీసం నడిచి వెళ్లే దారి కూడా వారికి కనిపించదు. ఇక కొన్ని చోట్ల పాదచారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన ఫుట్‌పాత్‌లను కొందరు ఆక్రమించి వ్యాపారాలు చేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల అయితే గమ్య స్థానానికి త్వరగా చేరుకునే క్రమంలో కొందరు ద్విచక్ర వాహనదారులు ఏకంగా ఫుట్‌పాత్‌ల పైనుంచే తమ బైక్‌లు పోనిస్తుంటారు. ట్రాఫిక్‌ పోలీసులు లేరనో లేదంటే వారిని ఎవరూ గమనించట్లేదన్న ధీమాతోనే వారిలా నిబంధనలకు విరుద్ధంగా ఫుట్‌పాత్‌లపై విచ్చలవిడిగా బైక్‌లు నడుపుతుంటారు. పుణెలోని రోడ్లపై కూడా దాదాపు ఇదే పరిస్థితి. అయితే ఇటీవల ఆ నగరంలోని ఫుట్‌పాత్‌లపై బైక్‌లు నడుపుతున్న కొందరు వాహనదారులను ఓ మహిళ అడ్డుకుంది. అంతేకాదు సదరు వాహనదారులు ఫుట్‌పాత్‌ దిగి రోడ్డు మీదకు వచ్చేలా ‘క్లాస్‌ తీసుకుంది’ కూడా!

Know More

women icon@teamvasundhara
all-women-crew-ran-the-rajya-rani-express-train-from-bengaluru-to-mysore

ఆ రైలు నడిపింది అంతా ఆడవాళ్లే..!

‘పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో వృద్ధి సాధించడం అంత సులభం కాదు’.. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఏ రంగంలోనైనా మహిళలు పురుషులతో సమానంగా పని చేసేందుకు పోటీ పడుతున్నారు. ఎంత కష్టంతో కూడిన రంగమైనా సరే అందులో అడుగుపెట్టేందుకు సిద్ధపడుతున్నారు. వైద్యం, విద్య, రాజకీయాలు, జర్నలిజం, ఇంజినీరింగ్‌, ఆర్మీ, వ్యాపారం, నేవీ, పరిశోధన.. వంటి రంగాలతో పాటు.. ఫుడ్‌ డెలివరింగ్‌, క్యాబ్‌ డ్రైవింగ్‌, లోకోపైలట్‌, వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రఫీ.. మొదలైన అధిక శారీరక శ్రమతో కూడిన రంగాల్లో సైతం తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూ స్త్రీ శక్తిని చాటుతున్నారు ఈతరం అతివలు. ఈ క్రమంలో భారత రైల్వే శాఖలో పని చేస్తోన్న కొందరు మహిళా ఉద్యోగులు ఇటీవల చేసిన ఓ పని మన దేశంలో మహిళా సాధికారతకు అద్దం పడుతోంది. మరి వాళ్లు చేసిన ఆ పనేంటో మీరూ చూడండి.

Know More

women icon@teamvasundhara
former-india-hockey-captain-suraj-lata-devi-files-domestic-violence-case-against-husband

ఆటలో గెలిచినా... భర్త వేధింపులు తప్పలేదు!

ఆడవాళ్లు రాకెట్లలో ఆకాశంలోకి దూసుకెళ్తున్నారు...దేశ సరిహద్దులు దాటి క్రీడల్లో ఎన్నో పతకాలు సాధిస్తున్నారు. ఇలా ఎన్నో అడ్డంకులను అధిగమించి అన్నింటా ఘన విజయాలు సాధిస్తున్న మహిళలు గృహ హింసపై మాత్రం గెలవలేకపోతున్నారు. అనాదిగా వస్తున్న అదనపు కట్న వేధింపులు, అత్తింటి ఆరళ్లు వారిని ఇంకా వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది భర్త పెట్టే శారీరక, మానసిక హింసను భరిస్తూ కళ్లు మూసుకుని కాపురం చేస్తున్నారు. మరికొద్ది మంది భర్త పెట్టే బాధను భరించలేక తమ ఆవేదనను బయటకు వెళ్లగక్కుతున్నారు. ఇందులో సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో భారత మహిళా హాకీ జట్టు మాజీ కెప్టెన్‌ సూరజ్‌ లతా దేవి తన భర్త పెట్టే వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించింది.

Know More

women icon@teamvasundhara
welspun-ceo-deepali-goenka-dance-goes-viral

వాట్‌ యాన్‌ ఐడియా లేడీస్‌!

స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే ప్రపంచమంతా అరచేతిలో ఉన్నట్లే. ఇక సామాజిక మాధ్యమాల కారణంగా ప్రపంచంలో ఏ మూల ఏది జరిగినా క్షణాల్లో అందరికీ తెలిసిపోతుంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ వేలకొద్దీ వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. అందులో కొన్ని వీడియోలు ఆనందాన్ని పంచితే, మరికొన్ని ఆలోచింపజేస్తాయి. అప్పుడప్పుడు మనకు స్ఫూర్తినిచ్చే వీడియోలు కూడా ఇందులో ఉంటాయి. అలా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో కొన్ని వీడియోలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో భాగంగా ఒక మహిళా సీఈవో తన ఉద్యోగులతో కలిసి డ్యాన్స్‌ చేసి ఫ్రెండ్లీ వర్క్‌ ఎన్విరాన్‌మెంట్‌ను క్రియేట్‌ చేస్తే, వయొలిన్‌ వాయిస్తూ తన సర్జరీ ఒత్తిడిని చిత్తు చేసింది మరో మహిళ. ఇక మరో వీడియోలో కొవిడ్‌-19 వైరస్‌ నుంచి తప్పించుకునేందుకు ఓ మహిళ ఒంటి నిండా జిరాఫీ కాస్ట్యూమ్స్ ధరించి నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.

Know More

women icon@teamvasundhara
etv-bharat-gets-best-digital-news-startup-award

‘ఈటీవీ భారత్‌’కు ఉత్తమ డిజిటల్‌ న్యూస్‌ స్టార్టప్‌ అవార్డు

మీడియా రంగంలో దూసుకెళుతున్న ‘ఈటీవీ భారత్‌’ అరుదైన ఘనత సాధించింది. దక్షిణాసియా బెస్ట్‌ డిజిటల్‌ న్యూస్‌ స్టార్టప్‌ అవార్డును గెలుచుకుంది. డిజిటల్‌ మీడియా రంగంలో ఉత్తమ ఆవిష్కరణలకు గాను... వరల్డ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ న్యూస్‌ పేపర్స్‌ అండ్‌ న్యూస్‌ పబ్లిషర్స్‌ సంస్థ ‘వాన్‌-ఇఫ్రా’ ఈ పురస్కారాన్ని అందించింది. మంగళవారం దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ద క్వింట్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌ రీతూ కపూర్‌ చేతుల మీదుగా ‘ఈటీవీ భారత్‌’ డైరెక్టర్‌ బృహతి చెరుకూరి ఈ అవార్డును స్వీకరించారు. దాదాపు 100కు పైగా దేశాలకు చెందిన వివిధ వార్తాపత్రికలు, న్యూస్‌ ఏజెన్సీలు, పబ్లిషింగ్‌ సంస్థలకు వాన్‌-ఇఫ్రాలో సభ్యత్వాలు ఉన్నాయి. ఈ సంస్థ ఆధ్వర్యంలో రెండు రోజుల దక్షిణాసియా డిజిటల్‌ మీడియా-2020 సదస్సు మంగళవారం దిల్లీలో ప్రారంభమైంది. డిజిటల్‌ మీడియా విస్తృతి, సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, మార్కెటింగ్‌ తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తున్నారు.

Know More

women icon@teamvasundhara
woman-army-officers-should-be-appointed-in-command-posts-says-supreme-court

‘కమాండ్‌’ హోదా ఇవ్వాల్సిందే!

‘పాలిచ్చి పెంచిన తల్లులు సర్‌...! వాళ్లకు పాలించడం ఓ లెక్కా’ ...! కొద్ది రోజుల క్రితం విడుదలైన ‘అరవింద సమేత’ సినిమాలో ఆడవాళ్ల శక్తి సామర్థ్యాలను వర్ణిస్తూ ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగ్‌ ఇది. అంతటి శక్తి సామర్థ్యాలున్నాయి కాబట్టే చాలామంది మహిళలు పలు దేశాలకు అధ్యక్షులుగా, ప్రధానులుగా సేవలందిస్తున్నారు. ఆకాశంలో సగమంటూ రాకెట్లలో ఆకాశానికి పయనమవుతున్నారు. కానీ ఇంకా కొన్ని రంగాల్లో మహిళలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఆర్మీలో శారీరక కారణాలతో వారిని సైనిక సవాళ్లకు దూరం చేస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర విధానాలను తప్పుపడుతూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. సైనిక దళాల్లో ‘ఆమెకు’ కూడా అందలం కల్పించాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేసింది.

Know More

women icon@teamvasundhara
record-number-of-japanese-believe-women-should-after-after-giving-birth

ఎవరేమనుకున్నా సరే.. మేం పని చేస్తాం!

కొన్ని దశాబ్దాల క్రితం స్త్రీ అంటే సేవకురాలిగానే ఉండేది. కానీ ఇప్పుడు ఆమెలోని అనంతమైన శక్తి నలుదిశలా ప్రసరిస్తోంది. గతంలో అవకాశం లేక పురుషాధిక్యం ప్రబలిందే కానీ అవకాశం ఇస్తే పురుషులను మించగలం అని నిరూపిస్తోంది. ఇంటి బాధ్యతలతో పాటు వృత్తి బాధ్యతలను కూడా సమర్థంగా నిర్వర్తిస్తూ.. స్త్రీలు తమకంటే మిన్న కాదు అన్న పురుషుల చేతే శభాష్‌ అనిపించుకుంటోంది. ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు జపాన్‌ మహిళలు. స్త్రీలంటే పిల్లలను కనిపెట్టి, ఇంటిని శుభ్రంగా ఉంచే సేవకురాలు అనే సంప్రదాయ భావాన్ని చెరిపేసిన వీరు, అదే పురుషాధిక్య ప్రపంచంతో ‘వృత్తిలోనూ మీ భాగస్వామ్యం కావాలి’ అనిపిస్తున్నారు. అందుకు జపాన్‌ ప్రభుత్వం వర్కింగ్‌ ఉమెన్‌పై చేసిన ఓ సర్వే అద్దం పడుతోంది.

Know More

women icon@teamvasundhara
bhuj-college-girls-forced-to-remove-dress-to-check-up-period-checkup

ఛీ ఛీ... ఆధునిక యుగంలోనూ ఇంతటి అనాగరికమా?

కాలం మారుతోంది... కంప్యూటర్ల యుగం వచ్చేసింది... అంతా ఆధునిక భారతమంటూ ఎంతో గొప్పగా మాట్లాడుకుంటున్నాం. అయితే మహిళల విషయంలో ఇప్పటికీ కొన్ని చోట్ల కనిపిస్తున్న అనాగకరిక ఆచారాలు, మూఢనమ్మకాలు ఇంకా మనల్ని మధ్యయుగం నాటి మనుషులేనని గుర్తుచేస్తున్నాయి. ముఖ్యంగా నెలసరి విషయంలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష అంతా ఇంతా కాదు. పిరియడ్స్‌ సమయంలో మహిళలను ఇంట్లోకి రానివ్వకుండా అందరికీ దూరంగా ఉంచుతుంటారు. ఇంకొన్ని చోట్ల అయితే వారిని అంటరానివారిగా భావిస్తూ వూరి బయటే ఉండాలని కట్టుబాట్లు విధిస్తున్నారు. ఈ క్రమంలో పిరియడ్స్‌పై విద్యార్థినులకు అవగాహన కల్పించాల్సిన ఓ విద్యా సంస్థే అమ్మాయిలతో అమానుషంగా వ్యవహరించింది. మహిళల్లో సహజంగా జరిగే కొన్ని జీవక్రియల్లాగే ఇది కూడా ఒక సహజ ప్రక్రియ అని విద్యాబుద్ధులు నేర్పాల్పిన సిబ్బందే అమానవీయంగా ప్రవర్తించారు.

Know More

women icon@teamvasundhara
give-plants-as-a-gift-for-valentines-day

పూలకు బదులు మొక్కలిచ్చారు.. తల్లిదండ్రులకు ప్రేమ పంచారు!

‘తమ మనసులో దాగున్న ప్రేమను రోజాపూలు, ఇతర కానుకల ద్వారా తెలియజేసుకోవడం.. సినిమాలు-షికార్లు, పార్టీలు, రెస్టరంట్లలో లంచ్‌-డిన్నర్‌..’ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమికులు చేసే హడావిడి మామూలుగా ఉండదు. అయితే.. ‘ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రత్యేకంగా ఒక రోజంటూ అవసరం లేదని.. మీ భాగస్వామికి ప్రతిరోజూ, ప్రతిక్షణం ప్రేమను తెలియజేయచ్చని.. అందుకోసం వేలకు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదం’టూ కొందరు భావిస్తుంటారు. ఏదిఏమైనా పాశ్చాత్య సంస్కృతిలో పుట్టిన ఈ సంప్రదాయం ప్రస్తుతం అన్ని దేశాలకూ విస్తరించింది. అయితే ఒకరికొకరు ప్రేమను ఇచ్చిపుచ్చుకునే ఈ ప్రత్యేకమైన రోజున వేడుకల పేరుతో వృథా ఖర్చు చేయకుండా.. పర్యావరణహితంగా, చిన్నారుల్లో సంప్రదాయాల పట్ల అవగాహన పెంచేలా ఉంటే బాగుంటుంది కదూ!! అచ్చం.. ఇలాంటి ఆలోచనలకే శ్రీకారం చుట్టాయి బిహార్‌, గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వాలు. మరి, ఈ ‘వేలంటైన్స్‌ డే’ సందర్భంగా అందరికంటే భిన్నంగా వారేం చేశారో తెలుసుకోవాలనుందా..? అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..!

Know More

women icon@teamvasundhara
the-brihanmumbai-electricity-supply-and-transport-has-decided-to-hire-women-drivers

అలా ‘బెస్ట్‌’గా బస్సులనీ నడపబోతున్నారు !

మగవారితో సమంగా అడుగువేయలేని రోజుల్లోనే.. మేం చేతకాని వాళ్లం కాదు, ఏమైనా చేయగలం అని బస్సు స్టీరింగ్‌ పట్టిందో మహిళ. ఓ ముఖ్యమంత్రిని సైతం కదిలించి తాను అనుకున్నది సాధించింది. అప్పుడు ఆమె వేసిన బాట ఇప్పుడు ఎందరికో మార్గదర్శకంగా మారింది. అన్ని రంగాల్లో మహిళలకు ఎందుకు సమ ప్రాధాన్యం ఉండకూడదు ? అని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఆలోచించేలా చేసింది. ఈక్రమంలోనే ఇటీవల ‘బెస్ట్‌’ (బృహన్‌ ముంబై ఎలక్ట్రిసిటీ సప్లై అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌) మహిళల కోసం ఓ కీలక నిర్ణయం తీసుకొంది. మరింతకీ ఎవరా మహిళ ? ఏమిటి ఈ సంస్థ తీసుకున్న ఆ కీలక నిర్ణయం ? తెలుసుకుందాం రండి !

Know More

women icon@teamvasundhara
miss-universe-australia-olivia-molly-rogers-trolled-over-body-shaming

ఆ ఫొటో షేర్‌ చేయడమే నా తప్పా !

ఈ సమాజంలో స్త్రీ, పురుషులను చూసే దృక్కోణాలు వేరుగా ఉంటాయి. ఉదాహరణకు పెళ్లి సంబంధాలనే తీసుకోండి. అబ్బాయి గురించి అడిగేవారు అబ్బాయి ఏం చేస్తున్నాడని మాత్రమే అడుగుతారు. అదే అమ్మాయి గురించైతే... ఒడ్డూ, పొడుగు ఎంత ? రంగేంటి ? వంటా వార్పు వచ్చా ? ఉద్యోగం చేస్తోందా ? చేస్తే తర్వాత మానేస్తుందా ? ఇలా ప్రశ్నలు సాగుతూనే ఉంటాయి. ఇక సామాజిక మాధ్యమాల్లో అయితే స్త్రీలు ఏ ఫొటో పెట్టినా కంటికింపుగా కనిపించాలని భావిస్తుంటారు. అలా తమ అభిప్రాయానికి తగినట్లు అందంగా, ఆకర్షణీయంగా కనిపించకపోతే.. వారు ఎంతటి వారైనా, ఎన్ని గొప్ప విజయాలు సాధించినా సరే సామాజిక మాధ్యమాల్లో వారి పేర్లు ట్యాగ్‌ చేసి మరీ ట్రోలింగ్‌ చేస్తారు. ఇటీవల ఇలా నెటిజన్ల నుంచి విపరీతంగా బాడీ షేమింగ్‌ను ఎదుర్కొన్నారు ‘మిస్‌ యూనివర్స్‌ ఆస్ట్రేలియా 2017’ ఒలీవియా మోలీ రోగర్స్‌ !

Know More

women icon@teamvasundhara
these-cabs-are-for-women-by-women

స్త్రీలకు సురక్ష ఈ ‘సఖా’ !

బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్న శ్వేత వారాంత సెలవుల్ని తన సోదరి ఇంటి వద్ద గడిపి తిరిగి హాస్టల్‌కి వెళ్తోంది. ఆమె కోసం కోల్‌కతాలో ఉన్న ఆమె తండ్రి ఓ క్యాబ్‌ బుక్‌ చేశాడు. అయితే ఆమెను సురక్షితంగా తీసుకెళ్లాల్సిన ఆ క్యాబ్‌ డ్రైవర్‌ ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యం చేయబోయాడు. అదృష్టవశాత్తూ ఆమె అక్కడి నుంచి తప్పించుకోగా సదరు క్యాబ్ డ్రైవర్‌ను యాజమాన్యం విధుల నుంచి తప్పించి పోలీసులకు అప్పగించింది. ఇలా శ్వేత ఒక్కరే కాదు.. దేశ వ్యాప్తంగా క్యాబ్‌ సదుపాయాన్ని వినియోగించుకుంటున్న చాలామంది స్త్రీలు నిత్యం ఎదుర్కొంటున్న దుస్థితే ఇది. అందుకే దిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ స్త్రీల రక్షణ కోసం ‘ఫర్‌ ఉమెన్‌, బై ఉమెన్‌’ అంటోంది. అంటే ఏంటో? తెలుసుకుందాం రండి...

Know More