scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo
Relations Heart

వీలైతే నన్ను మన్నించు రాజు!

i feel very gulity when i think about you

పెళ్లికి ముందు మరో వ్యక్తిని ఇష్టపడడం తప్పే అయితే... వందలో ఎనభై మంది తప్పు చేసినట్లే’... ఇది త్రివిక్రమ్‌ సినిమాలో ఓ డైలాగ్‌. నిజమే జీవితంలో ఏదో ఒక సమయంలో ఒక వ్యక్తిని ఇష్టపడడం సర్వసాధారణమైన విషయం. నేనూ అలాగే ఓ వ్యక్తిని ఇష్టపడ్డాను. కానీ ఆ ఇష్టాన్ని వివాహం వరకు తీసుకెళ్లలేక పోయాను. ప్రస్తుతం నేను నా భర్తతో సంతోషంగానే ఉంటున్నాను, ఒక్క నువ్వు గుర్తొచ్చిన్నప్పుడు తప్ప.. రాజు!’ అని చెబుతోంది ఓ అమ్మాయి. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఆమె కథేంటో తన మాటల్లోనే...

హాయ్‌...

నా పేరు వర్షిణి... మాది గుంటూరు. నాకు ఒక చెల్లి ఉంది. మాకు పెద్దగా ఆస్తి పాస్తులు లేకపోయినా మా నాన్న మమ్మల్ని ఎలాంటి లోటు లేకుండా పెంచాడు. ఇంట్లో ఇద్దరం ఆడ పిల్లలమే.. అయినప్పటికీ మాకు ఏది కావాలని అడిగినా లేదనకుండా తీసుకొచ్చేవాడు. నేను టెన్త్‌ పూర్తి చేసే వరకూ గుంటూరుకు దగ్గర్లోని ఓ గ్రామంలో ఉండేవాళ్లం. అనంతరం పై చదువులకోసం రోజూ బస్సులో వెళ్లి రావడం ఇబ్బంది అవుతుందని నాన్న మా ఫ్యామిలీని గుంటూరుకు షిఫ్ట్‌ చేశాడు. అమ్మ కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకునేది. నా కూతుళ్లను ఎవరూ తక్కువగా చూడొద్దని ఎప్పటికప్పుడు కొత్త బట్టలు కొనిచ్చేది. గుంటూరులోనే నా ఇంటర్, డిగ్రీ పూర్తి చేశాను. నిజానికి నాకు బీటెక్‌ చేయాలని ఉన్నా... ఇంట్లో ఆర్థిక పరిస్థితి నా ఆశలకు కళ్లెం వేసింది. ఇక డిగ్రీ పూర్తయిన తర్వాత బెంగళూరు వెళ్లి ఏదైనా కంప్యూటర్‌ కోర్సు నేర్చుకొని సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ కొట్టాలనేది నా కల. కానీ ఇంట్లో ఆర్థిక పరిస్థితే అంతంతమాత్రం మా ఇద్దరిని చదివిపించడంతోనే సరిపోతుంది. ఇక బెంగళూరు ఏం వెళ్తాంలే అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. కానీ నా ఆసక్తి తెలిసిన అమ్మ ఎలాగైనా నువ్వు బెంగళూరు వెళ్లాలి. అమ్మాయిలు తమ కాళ్లపై తాము నిలబడితేనే ఈ సమాజంలో విలువ ఉంటుందని చెప్పి కోచింగ్‌ పంపడానికి నన్ను సిద్ధం చేసింది.

******

girlexpressherfeelings650-1.jpg

ఇక ఎలాగోలా బెంగళూరు చేరుకున్నాను. నాన్న కష్టపడి నా హాస్టల్‌, కోచింగ్‌కు ఫీజును సమకూర్చాడు. అక్కడే ఓ ఉమెన్స్‌ హాస్టల్‌లో చేరి కోచింగ్‌లో జాయిన్‌ అయ్యాను. అప్పుడే నా జీవితంలోకి అనుకోని అతిథిలా వచ్చాడు రాజు తనది చిత్తూరు. మేమిద్దరం ఒకే ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్‌ అయ్యాం. బెంగళూరులాంటి నగరంలో తెలుగు మాట్లాడే మరో వ్యక్తి ఉన్నాడంటేనే సహజంగా మాటలు కలిపేస్తాం. దాంతో రాజుతో నాకు మాటలు కలిశాయి. కానీ ఆ మాటలు నా జీవితాన్ని మార్చేస్తాయని అప్పుడు అనుకోలేదు. బెంగళూరు వెళ్లే ముందు నాన్న... ‘నువ్వు కచ్చితంగా ఉద్యోగం చేయాలని నిన్ను అక్కడికి పంపడం లేదు, నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి పంపిస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో నా తల దించుకునే పరిస్థితి మాత్రం తీసుకురాకు’ అని చెప్పి పంపించాడు. ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది నాన్న? అని నేనే ఎదురు ప్రశ్నించాను. ఇక ప్రతి రోజూ హాస్టల్‌, ఇన్‌స్టిట్యూట్‌తో రోజులు బిజీగా గడిచిపోతున్నాయి. రాజుతో సాన్నిహిత్యం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఏ చిన్న అవసరం వచ్చినా రాజునే పిలవడం ప్రారంభించాను. ఇద్దరం కలిసి షాపింగ్‌, సినిమాలకు వెళ్లడం సాధారణమైపోయింది. అతని మాటతీరు, నడవడిక నచ్చిన నేను నాకు తెలియకుండానే అతనితో ప్రేమలో పడిపోయాను. అది ప్రేమ అని తెలిసే లోపే రాజు లేక పోతే నేను లేనేమో అన్నంతలా మా బంధం బలపడిపోయింది. ఒక్క రోజు కూడా విడిచి ఉండలేని పరిస్థితి. ఒకసారి ఇంట్లో ఏదో పని ఉందని మూడు రోజుల పాటు రాజు చిత్తూరు వెళ్లాడు. అతను లేని ఆ మూడు రోజులు నాకు మూడు యుగాలుగా గడిచాయి. ఎప్పుడెప్పుడు రాజు వస్తాడా అని వేయి కళ్లతో ఎదురు చూసేదాన్నిఅలా రోజులు ఎంతో సంతోషంగా గడిచిపోతున్నాయి.

******

girlexpressherfeelings650-2.jpg

మా ఇద్దరికీ బెంగళూరులోనే ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. మధ్యలో చాలా సార్లు గుంటూరు వెళ్లొచ్చినా రాజు విషయం నాన్నకు చెప్పలేకపోయాను. కారణం... నాన్నకు ఈ ప్రేమ వ్యవహారాలంటే అస్సలు నచ్చవు. ఇక కాలం గడుస్తోంది.. ‘ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాం. ఒప్పుకోకపోవడానికి ఏం కారణముంటుంది? నువ్వు ధైర్యంగా మీ నాన్నకు చెప్పు’ అని రాజు అన్నాడు. తీరా ఒకసారి సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లినప్పుడు.. ‘నాన్న నాకు బెంగళూరులో రాజు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఒకే ఇన్‌స్టిట్యూట్‌లో కోచింగ్‌ తీసుకున్నాం, మేమిద్దరం ఇప్పుడు ఒకే ఆఫీసులో పని చేస్తున్నాం. నాకు జీవితాంతం రాజుతోనే ఉండాలని ఉంది. రాజును పెళ్లి చేసుకుంటాను’ అని చెప్పాను.

నేను చెప్పేది మొత్తం విన్న తర్వాత నాన్న ఒక్కసారిగా కోపంతో ఊగిపోయాడు. జీవితంలో నాన్నను ఎప్పుడూ అంత కోపంలో చూడలేదు. అంతెందుకు ఎప్పుడూ ఒక చిన్న మాట కూడా అనని నాన్న ఆ రోజు నాపై చేయి చేసుకున్నాడు. ఇలా నాన్న మా ప్రేమను వ్యతిరేకించడానికి ఇద్దరి కులాలు వేరు కావడం కూడా ఓ కారణమే! ‘నమ్మకంతో అంత దూరం పంపిస్తే ఇలా చేస్తావా? ఇకపై ఉద్యోగం లేదు ఏం లేదు ఇంట్లో ఉండు’ అని నన్ను బెంగళూరు వెళ్లకుండా ఆపేశారు. ఈ విషయాన్ని ఎలాగోలా రాజుకు చెప్పేశాను. ఎలాగైనా నన్ను తీసుకెళ్లిపో అని చెప్పాను. వారం రోజుల తర్వాత రాజు నన్ను తీసుకెళ్లడానికి గుంటూరు వచ్చాడు. అసలు ఆ రోజు ధైర్యం ఎలా వచ్చిందో తెలియదు కానీ.. రాజుతో వెళ్లిపోవడానికి బ్యాగ్‌ సిద్ధం చేసుకొని రడీగా ఉన్నాను. తీరా రాజు రాగానే రాత్రి 2 గంటల తర్వాత ఇంట్లో నుంచి వెళ్లిపోయాను. నాన్న, అమ్మ, చెల్లి ఏమవుతారో అని కూడా ఆలోచించలేకపోయాను. ప్రేమ మైకంలో ఉన్న వారికి మరో ఆలోచన రాదు... అని ఇందుకే అంటారేమో!

******

girlexpressherfeelings650-3.jpg

నేను ఇంట్లో నుంచి వెళ్లిన కొద్ది సేపటికే నాన్న నేను వెళ్లానన్న విషయాన్ని తెలుసుకున్నాడు. వెంటనే పోలీస్‌ స్టేషన్‌ వెళ్లి మిస్సింగ్‌ కంప్లైంట్‌ ఇచ్చాడు. దాంతో పోలీసులు నా ఫోన్‌ నెంబర్‌ను ట్రాక్‌ చేసి నన్ను, రాజును మధ్యలోనే అడ్డుకుని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ‘నా కూతురును ఎవరో కిడ్నాప్‌ చేశార’ని నాన్న పోలీసులకు తెలిపాడంటా అందుకే మా ఇద్దరిని అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే మేమిద్దరం మేజర్లం కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని పోలీసు అధికారులకు చెప్పాం. దానికి స్పందించిన ఎస్‌ఐ ‘కాసేపట్లో మీ పేరెంట్స్‌ వస్తున్నారు. వచ్చాక వాళ్లకు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు’ అని సమాధానం ఇచ్చాడు. నాన్న స్టేషన్‌కు వస్తున్నాడనడంతో ఒక్కసారిగా నా గుండె కొట్టుకునే వేగం పెరిగిపోయింది. తప్పు చేశానా? అన్న భావన మనసులో మెదులుతున్నా... నచ్చిన వాడిని ప్రేమించడంలో తప్పేముందని మరోవైపు నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. ఇంతలోనే నాన్న, అమ్మతో కలిసి స్టేషన్‌కు వచ్చారు. వారిద్దరి కళ్లలోనూ నీళ్లు తిరుగుతున్నాయి. ‘చదువుకుంటాను అంటే బెంగళూరు పంపాను చూడు... అదీ నేను చేసిన తప్పు...’ అని నాన్న బాధపడుతున్నాడు. ఇక అమ్మ అయితే ‘మా పరువు ఇప్పుడు నీ చేతిలోనే ఉంది, నువ్వు మేజర్‌వి కాబట్టి నీకు నచ్చినట్లు చేయొచ్చు. కానీ ఇప్పుడు నువ్వు మాతో ఇంటికి రాకపోతే తిరిగి వెళ్లేది మేం కాదు, మా శవాలే, ఏ రైలు కిందో పడి చనిపోతాం. ఇక మిగిలిన చెల్లి జీవితం నాశనమైపోతుంది. నీ కాళ్లు మొక్కుతానే వాడిని వదిలేసి ఇంటికి వచ్చేయ్‌’... అని ఏడుస్తూ చెబుతుంది. దీనికి తోడు పోలీసులు కూడా ‘ప్రేమ వివాహాలు అంత మంచివి కాదమ్మా.. మీ అమ్మ, నాన్న చెబుతోంది విను. నీ ఇష్టం కోసం ఒక కుటుంబాన్ని నాశనం చేస్తావా?’ అని కౌన్సెలింగ్‌ ఇవ్వడం మొదలుపెట్టారు. రాజుపై ఎంత ప్రేమ ఉన్నా... తల్లిదండ్రులు తమ శవాలను చూడాల్సి వస్తుందని చెబుతుండడంతో మా పేరెంట్స్‌తోనే వెళ్లడానికి నిశ్చయించుకున్నాను. ఆ క్షణం రాజు చేయి వదిలి నాన్న చేయి పట్టుకొని బయటకు వచ్చేశా. ఆ రోజు సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాం.

******

girlexpressherfeelings650-4.jpg

ఇక నాకు క్షణం ఒక యుగంలా గడిచింది. ఓవైపు మనసులో ఏదో తప్పు చేశానన్న భావన. మరోవైపు ఉద్యోగం మాన్పించేశారు. ఇక ఇంట్లో అందరి మధ్యే ఉన్నా ఒంటరితనం వేధించేది. అలా చాలా రోజుల పాటు గడిపాను. ఇక నన్ను అలా చూసిన మా పేరెంట్స్‌ నాకు పెళ్లి చేయడానికి సిద్ధమయ్యారు. ఒక రోజు పెళ్లి చూపుల కోసమని ఓ అబ్బాయి ఫొటో ఇచ్చారు. ‘మీ కోసం నేను ఎంతో ఇష్టపడ్డ రాజునే వదులుకున్నాను. ఇక ఈ పెళ్లి ఒక లెక్కా’... అన్నట్లు ఫొటో చూడకుండానే ఓకే చేశాను. మూడు నెలల్లో నా పెళ్లి జరిగిపోయింది. నా పెళ్లికి రాజు కూడా వచ్చాడట.. నాకు కనిపించకుండా దూరం నుంచి చూసి వెళ్లిపోయాడని తర్వాత నా స్నేహితులు చెప్పారు.

******

girlexpressherfeelings650-5.jpg

ప్రస్తుతం నాకు వివాహమై మూడేళ్లు అవుతోంది. మాకు ఇద్దరు పిల్లలు, మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. నా గతాన్ని మొత్తం ఆయనకు వివరించాను. పెద్ద మనసుతో అర్థం చేసుకున్న ఆయన ‘గతాన్ని మరిచిపోయి నాతో కొత్త జీవితాన్ని ప్రారంభించు’ అని చెప్పాడు. ఇప్పుడు మేము ఎంతో అన్యోన్యంగా ఉంటున్నాం. నేను కూడా పిల్లలు, భర్త ప్రేమతో గతాన్ని మరిచిపోయాను. కానీ అప్పుడప్పుడు రాజు ఎలా ఉన్నాడు? నాలాగే పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నాడా? అనే సందేహం కలుగుతూనే ఉంటుంది. ఇప్పటి వరకు ఎప్పుడూ రాజుతో మాట్లాడాలని అనిపించలేదు. అదేదో తప్పనే భావనతో కాదు... ప్రేమ కోసం ధైర్యం చేయని నేను మరోసారి అతని జీవితంలోకి వెళ్లడం ఇష్టం లేకే అలా చేస్తున్నాను. కానీ రాజు నా కళ్ల ముందుకు వస్తే మాత్రం ఒకే మాట చెప్పాలనుకుంటున్నాను. ‘ఆ రోజు మా పేరెంట్స్‌ కోసం ఒక్క మాట కూడా నీతో మాట్లాడకుండా వెళ్లిపోయినందుకు వీలైతే నన్ను మన్నించు రాజు’ అని! ప్రేమ దూరమైందని, ఇక జీవితం ముగిసి పోయిందనుకున్న నాకు దేవుడు భర్త రూపంలో మరో కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. మనకు నచ్చిన వారు మన జీవితం నుంచి వెళ్లిపోతే మనం నిరాశ చెందనక్కర్లేదు. ఏదో ఒక సమయంలో మన జీవితం మనకు అనుకూలంగా మారుతుందన్న ఆశతో ఆ క్షణం కోసం ఎదురుచూడాలి.

ఇంతకీ ఇదంతా మీకెందుకు చెబుతున్నానంటే... ఇటీవల కొంతమంది మహిళలు ప్రేమించిన సమయంలో ధైర్యం చేయక వేరే వ్యక్తులను వివాహం చేసుకుంటున్నారు. ఇష్టం లేని సంసారం చేయలేనంటూ జీవితాన్ని అర్థాంతరంగా ముగించే వారు లేకపోలేదు. అలా చేయడం వల్ల మిమ్మల్ని ఇష్టపడి మీ జీవితంలోకి వచ్చిన వారికి అన్యాయం చేసిన వారవుతారు. కాబట్టి మీ గతాన్ని ఓ మధుర జ్ఞాపకంగా మార్చుకొని, వారి మంచి కోరుకుంటూ, మీరూ ఆనందంగా గడిపేయండి. మీరే సర్వస్వంగా భావించే భాగస్వామికి మీ మనసులో దాగున్న పూర్తి ప్రేమను పంచండి. అప్పుడే గతం పదే పదే మీ మనసును తొలిచివేయకుండా ఆలుమగల అనుబంధం ఎలాంటి అరమరికల్లేకుండా ముందుకు సాగుతుంది.

ఇట్లు

వర్షిణి...




œË®ý-éÂx-ªá-«Õªý

'£¾Ç%Ÿ¿-§ŒÕ-ªÃ’¹¢Ñ QJ¥Â¹ ¤Äª¸½-Â¹×©Õ ÅŒ«Õ ÆGµ-“¤Ä-§ŒÖ-©ÊÕ, ÆÊÕ-¦µ¼-„Ã-©ÊÕ X¾¢ÍŒÕ-Â¹×¯ä „äC¹. ¨ QJ¥-¹©ð “X¾ÍŒÕ-J¢Íä ¹Ÿ±¿-¯Ã-©-Eo-šËÂÌ ¤Äª¸½-Â¹×©ä ª½ÍŒ-ªá-ÅŒ©Õ. Æ¢Ÿ¿Õ-«©x ¨ ¹Ÿ±¿-¯Ã-©ðxE „î¾h-„éÕ, Æ«®¾h„Ã-©Åî «®¾Õ¢-Ÿµ¿-ª½.-¯çšü „ç¦ü-å®j-šüÂ¹× ‡©Ç¢šË ®¾¢¦¢Ÿµ¿¢ ©äŸ¿Õ. ¨ QJ¥-¹-©ðE ¹Ÿ±¿©Õ, ¹Ÿ±¿-¯Ã-©Åî ‡«-J-éÂj¯Ã ƒ¦s¢C …¯Ão, Ʀµ¼u¢-ÅŒ-ªÃ©Õ …¯Ão ƒÂ¹ˆœ¿ ÂËxÂú Íä®Ï «ÖÂ¹× ÅçL-§ŒÕ-èä-§ŒÕ¢œË. Æ{Õ-«¢šË ¹Ÿ±¿, ¹Ÿ±¿-¯ÃEo „ç¦ü-å®j-šü-©ð¢* Åí©-T¢-ÍŒœ¿¢ «Ö“ÅŒ¢ ¨¯Ãœ¿Õ ¦ÇŸµ¿uÅŒ. ƢŌ-¹×-NÕ¢* ƒÅŒ-ª½“Åà ͌{d-X¾-ª½-„çÕiÊ ÍŒª½u-©Â¹× ¨¯Ãœ¿Õ ¦ÇŸµ¿uÅŒ «£ÏÇ¢-ÍŒŸ¿Õ.

 
   
 
 
 

Share Your Story

 
   
 
(Press ctrl+g to switch(English/Telugu))
 

women icon@teamvasundhara
story-of-an-aids-patient-who-is-fighting-with-it-and-creating-awareness-in-others

నేను ఏ తప్పూ చేయలేదు.. అయినా నాకెందుకీ శిక్ష!

ఎయిడ్స్.. నిరోధక మార్గాలు తప్ప పూర్తిస్థాయి చికిత్స లేని వ్యాధి. సాధారణంగా ఈ వ్యాధి సోకిందని తెలిస్తే చాలు.. వారు తప్పు చేశారు కాబట్టే ఆ వ్యాధి వచ్చిందని చుట్టుపక్కల ఉన్న వారు బలంగా నమ్ముతారు. ఈ క్రమంలో బాధితులను వారి మాటలతో మానసికంగానూ హింసిస్తారు. ఓ మహిళ తాను ఎలాంటి తప్పు చేయకపోయినా ఈ మహమ్మారి బారిన పడి ఒకానొక దశలో జీవితాన్ని ముగించేసుకోవాలనుకుంది.. కానీ ఆమెకు వచ్చిన ఓ ఆలోచన ఆ నిర్ణయాన్ని మార్చేసింది. అంతేకాదు.. ఈ సమాజంలో ఆమె ఎదుర్కొన్న మాటల ఈటెలు, బాధాకరమైన సంఘటనలు.. తనని మానసికంగా మరింత బలంగా తీర్చిదిద్దాయి.. దాంతో ఆమె ఎయిడ్స్‌పై పోరాడడమే కాదు.. చుట్టుపక్కల వారికీ అవగాహన కల్పిస్తూ తోటి వ్యాధిగ్రస్తులకు అండగానూ నిలుస్తోంది. అసలేం జరిగిందో ఆమె మాటల్లోనే విందాం రండి.. నమస్కారం.

Know More

women icon@teamvasundhara
treat-your-daughter-in-law-equal-to-your-daughter
women icon@teamvasundhara
a-woman-is-in-dilemma-about-her-mother-and-lover-help-her!
women icon@teamvasundhara
afghan-woman-shares-her-pathetic-story-about-taliban-attack-on-her

ఉద్యోగం చేస్తున్నానని కంటి చూపు కోల్పోయేలా చేశారు!

ఆడపిల్ల పుట్టడమే శాపంగా భావిస్తారక్కడ. అలాంటిది స్కూలుకెళ్తానంటే ఊరుకుంటారా? ‘చదువు, ఉద్యోగం నీకెందుకు? ఆ పనులు చేయాల్సింది మగాళ్లు! నువ్వు గడప దాటి బయటికి రావడానికి వీల్లేదు’ అంటూ పైగా బోలెడన్ని షరతులు! ఇలాంటి వివక్షను చూస్తూనే పెరిగింది అఫ్గానిస్థాన్‌కు చెందిన వహీదా బేగం. అయినా ఇలాంటి బెదిరింపులకు తలొగ్గే నైజం కాదామెది. కారణం.. తన తండ్రి అండ! ఆడపిల్ల అయితే ఏంటి .... మగాళ్లకు తీసిపోని విధంగా తనని తయారుచేయాలనుకున్నాడు వహీదా తండ్రి. అలా నాన్న చొరవతో చక్కగా చదువుకుని ప్రభుత్వ రంగంలో మంచి ఉద్యోగం సంపాదించిందామె. అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. వద్దని వారించినా ఉద్యోగం సంపాదించిందన్న నెపంతో అన్యాయంగా ఆమెపై దాడికి తెగబడ్డారు దుండగులు. ఆమెను తీవ్రంగా గాయపరచడమే కాదు.. ఆమె ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం కూడా కోల్పోయేలా చేశారు. అలాగని అదే తలచుకుంటూ కుమిలిపోకుండా, పడిలేచిన కెరటంలా విజృంభించిదామె.. ఓవైపు బాలికల హక్కులు, వారి విద్య కోసం అహర్నిశలూ శ్రమిస్తోంది. అతివలు తలచుకుంటే ఏదైనా సాధించగలరనే పోరాట స్ఫూర్తిని చాటుతూ తన జీవిత కథను పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
a-martyred-army-jawan-wife-shares-about-struggles-in-her-life

ఇదిగో వచ్చేస్తున్నా అన్నాడు.. వెళ్ళిపోయాడు.. ఈ గుండె కోత తీరేదెలా?

‘పుట్టుకతోనే తల్లిని పొట్టన పెట్టుకుంది’ అనే అపవాదును మూటగట్టుకుందామె! తల్లి లేని తన బాగోగులు చూడాల్సిన తండ్రి రెండో పెళ్లి చేసుకోవడంతో అమ్మమ్మ దగ్గరే పెరిగింది. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ పీజీ పూర్తి చేసింది. ఇలా అడుగడుగునా కష్టాలే పరిచయమైన ఆమెకు.. మహేష్ ఓ వెలుగు రేఖలా కనిపించాడు. అతడిని వలచింది.. అతనూ ఆమెను ఇష్టపడ్డాడు. పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ఓ వీర జవాను భార్యగా గర్వపడుతూనే.. విధి నిర్వహణలో తన భర్తకేమీ కాకూడదని వెయ్యి దేవుళ్లకు మొక్కిందామె. అలా మూడేళ్ల పాటు అన్యోన్యంగా సాగిన వారి జీవితంలో అనుకోని ఉపద్రవం.. తన భర్త వీర మరణం! మరికొన్ని రోజుల్లో వస్తాను.. నిన్ను తీసుకెళ్తాను.. అని బాస చేసిన భర్త దేశం కోసం ప్రాణాలర్పించినందుకు గర్వపడుతున్నా.. అతను లేని నా జీవితం శూన్యమంటూ, ఆ లోటు ఎప్పటికీ పూడ్చలేనిదంటూ కంటికి ధారగా విలపిస్తోంది. ఆ వీర జవాను భార్య కన్నీటి గాథే ఇది!

Know More

women icon@teamvasundhara
lets-excuse-them-be-happy
women icon@teamvasundhara
a-new-mom-who-is-nurse-shares-her-story-about-to-contribute-to-the-fight-against-covid-19

పచ్చి బాలింతవి.. కరోనా టైంలో డ్యూటీకి వెళ్లొద్దన్నారు!

‘వద్దమ్మా.. వద్దు..! అసలే నువ్వు పచ్చి బాలింతవి.. ఇలాంటి సమయంలో డ్యూటీకి వెళ్తే.. అటు నీకు, ఇటు పాపాయికి ఇద్దరికీ ముప్పే!’ అన్నారు ఆమె కుటుంబ సభ్యులు. కానీ అందుకు ఆమె ఒప్పుకోలేదు. వృత్తే దైవంగా భావించే ఆ నర్సు.. తన కుటుంబ సభ్యులను ఎలాగోలా ఒప్పించి కరోనాతో పోరుకు కదిలింది. కరోనాకు ముందు మెటర్నిటీ సెలవు కోసం తన సొంతూరుకు చేరుకున్న ఆమె.. ప్రసవానంతర సెలవు పూర్తయ్యే సరికి లాక్‌డౌన్‌ ఆంక్షల వల్ల ఇక్కడే ఆగిపోయింది. ఓవైపు డ్యూటీ చేయాలన్న తపన.. మరోవైపు వెళ్లలేని పరిస్థితి! అయినా మనసుంటే మార్గముంటుందన్నట్లు ఇంట్లో వాళ్లను ఎలాగోలా ఒప్పించి రాష్ట్ర సరిహద్దులు దాటింది.. తిరిగి విధుల్లో చేరింది..! అటు సరైన జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా విధుల్లో పాల్గొంటూనే, ఇటు తన చిన్నారినీ జాగ్రత్తగా చూసుకుంటున్నానంటోంది. మరి, చంటి బిడ్డతో కరోనాతో పోరు చేస్తోన్న ఈ కొవిడ్‌ వారియర్‌ కథేంటో మనమూ విందాం రండి..!

Know More

women icon@teamvasundhara
hyderabad-woman-shares-her-covid-experience-in-telugu

అనుకోని ప్రయాణం కరోనా తిప్పలు తెచ్చిపెట్టింది!

కరోనా దూకుడుకు కళ్లెం వేయాలంటే దాని అంతు చూసే వ్యాక్సిన్‌ రావాలి. మరి, అది ఎప్పుడు వస్తుందో తెలియదు.. అంతదాకా అన్ని పనులూ ఆపుకొని ఇంట్లో కూర్చుందామంటే కుదరదు. అందుకే కరోనాతో సహవాసం చేయడానికే అలవాటు పడిపోయారంతా! అయితే అటు గృహిణులు, ఇటు ఇంటి నుంచి పనిచేసే మహిళలు వైరస్‌ ముప్పు ఉందని తెలిసినా కొన్ని అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్లాల్సి రావచ్చు. అలా అనుకోకుండా తాను చేసిన ప్రయాణం వల్ల కరోనా బారిన పడ్డానంటోంది హైదరాబాద్‌కి చెందిన నీరజ. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ముప్పు ఎటు నుంచి ముంచుకొస్తుందో చెప్పలేమని ఓవైపు అందరినీ అలర్ట్‌ చేస్తూనే.. మరో వైపు వైరస్‌ సోకిందని ఆందోళన చెందకుండా ఆత్మవిశ్వాసాన్నే ఆయుధంగా మలచుకుంటే కరోనా మహమ్మారిని జయించవచ్చనడానికి తననే ఉదాహరణగా చూపుతోందామె. ఈ క్రమంలోనే తాను కరోనాపై గెలిచిన తీరును, తన అనుభవాలను మనందరితో ఇలా పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
meet-sneha-a-nurse-in-delhi-who-treats-covid-patients-as-her-family

కరోనాతో క్షణాల్లో వారి ఆరోగ్యం క్షీణించడం కళ్లారా చూశాను!

సాధారణంగా ఏదైనా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరితే కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు రోగికి కచ్చితంగా తోడుగా ఉంటారు. చికిత్స సమయంలో బంధువులు, సన్నిహితులు, స్నేహితులు కూడా హాస్పిటల్‌కు వచ్చి మనో ధైర్యం చెబుతుంటారు. కానీ కరోనా సోకి చికిత్స తీసుకునే రోగులకు ఇలాంటి సదుపాయాలేవీ ఉండవు. సామాజిక దూరం పాటిస్తూ ఆస్పత్రిలో ఉన్నంతసేపూ ఏకాకిగానే గడపాలి. ఫలితంగా వారు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో వైద్యులు, నర్సులే కరోనా బాధితుల కుటుంబ సభ్యులుగా మారిపోతున్నారు. వైరస్ తమకు సోకే ప్రమాదముందని తెలిసినా ప్రాణాలను పణంగా పెట్టి వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. ఈక్రమంలో దిల్లీలోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోన్న స్నేహ ఏడు నెలలుగా కరోనా బాధితులకు సేవలు చేస్తోంది. కరోనా రోగులను తన కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటూ వారిని ఆరోగ్యంగా తిరిగి ఇంటికి పంపిస్తోంది. ఈ నేపథ్యంలో గత నెలలో కరోనాను జయించి తిరిగి విధుల్లో నిమగ్నమైన ఆ నర్సు హృదయరాగమేంటో మనమూ విందాం రండి..!

Know More

women icon@teamvasundhara
navya-shares-her-covid-story-it-started-with-her-son-developing-flu-and-fever

మేమొకటి తలిస్తే.. కరోనా మరొకటి తలచింది!

కరోనా మనుషుల జీవితాలనే కాదు.. ప్రత్యేక సందర్భాల రూపురేఖల్ని కూడా మార్చేసింది..! అంతకుముందు వరకూ ఏ వేడుకైనా అందరితో కలిసి ఎంతో సంబరంగా జరుపుకొనే మనం ఇప్పుడు ఇంటికే పరిమితమై సింపుల్‌గా చేసుకోవాల్సి వస్తోంది. హైదరాబాద్‌కి చెందిన నవ్య కూడా తన కొడుకు పుట్టినరోజు వేడుకల విషయంలో ఇలాగే ఆలోచించింది. వాడి మొదటి పుట్టినరోజులాగే ఐదో పుట్టినరోజునూ ఘనంగా జరపాలనుకుంది.. అయినా కరోనా వల్ల అది సాధ్యం కాలేదు..! సరికదా.. సింపుల్‌గానైనా చేసుకుందామంటే అందుకూ కరోనా అడ్డుపడి.. మరోసారి తనను, తన కొడుకును నిరాశపరిచిందంటోంది. మరి, ఇంతకీ ఏమైంది? వాళ్ల బాబు పుట్టినరోజు వేడుకలు ఆగడానికి, కరోనాకు సంబంధమేంటి? రండి.. తన మాటల్లోనే తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
mumbai-girl-meghana-who-came-from-london-shares-her-covid-story-in-telugu

ఎందుకైనా మంచిదని టెస్ట్‌ చేయించుకుంటే పాజిటివ్ అని తేలింది!

కంటికి కనిపించకుండా, లక్షణాలు తెలియనివ్వకుండా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది కరోనా మహమ్మారి. దీని బారిన పడకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నించినా కొంతమందిలో ఇది బయటపడుతూ కలవరపెడుతోంది. తనకూ ఇలాంటి అనుభవమే ఎదురైందంటోంది ముంబయికి చెందిన మేఘన. ముందు నుంచీ అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎందుకైనా మంచిదని పరీక్ష చేయించుకుంటే పాజిటివ్‌గా తేలిందని చెబుతోందామె. అంతేకాదు.. కరోనా నుంచి కోలుకునే క్రమంలో తన జీవనశైలిలో ఎన్నో మార్పులొచ్చాయని.. ఆరోగ్యకరమైన అలవాట్లు, సానుకూల దృక్పథం ఉంటే కరోనాను సులభంగా జయించచ్చంటూ తన కొవిడ్‌ స్టోరీని ఇలా పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
kolkata-woman-shares-about-her-early-menopause-story-how-to-deal-with-it

30 ఏళ్లకే మెనోపాజ్‌.. అదో భయంకరమైన అనుభవం!

ఆడపిల్లకు అంతంత పెద్ద పెద్ద చదువులెందుకన్నారంతా! అయినా ఆ మాటలు ఆమె చెవికెక్కించుకోలేదు. కారణం ఆమెకు చదువంటే ప్రాణం. వయసొచ్చింది కదా పెళ్లి చేయమని బంధువులు పోరు పెట్టారు.. అయినా తన పూర్తి ధ్యాసను కెరీర్ పైనే ఉంచిందామె. ఇలా ఆమె సంకల్ప బలానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా తోడవడంతో ఉన్నత విద్యనభ్యసించి విదేశాల్లో ఉద్యోగం సంపాదించింది. తాను కోరుకున్న కెరీర్, చక్కటి జీతం.. రెండేళ్లు స్వేచ్ఛగా, సంతోషంగా జీవించింది. అక్కడే తనకు నచ్చిన అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. జీవితం సుఖంగా సాగుతోంది.. పిల్లలు పుడితే ఆ సంతోషం రెట్టింపవుతుందనుకుందా జంట. కానీ అంతలోనే మెనోపాజ్‌ రూపంలో ఆమెకు అనుకోని ఉపద్రవం ఎదురైంది. అప్పటికి ఆమె వయసు కేవలం ముప్ఫై అంటే ముప్ఫై ఏళ్లే! ‘ఇంత చిన్న వయసులోనే ఏంటి నాకీ కష్టం’ అని పిల్లల కోసం పరితపించిపోయింది. ఓ బిడ్డకు జన్మనిచ్చి మాతృత్వ మాధురిమలను ఆస్వాదించలేకపోయానే అని బాధపడింది.అన్ని దారులూ మూసుకుపోవడంతో ఇక చేసేది లేక ఓ పిల్లాడిని దత్తత తీసుకుందామె. అకాలంలో వచ్చిన మెనోపాజ్.. తల్లిని కావాలన్న తన కలను ఎలా కల్లలు చేసిందో పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
woman-shares-her-pregnancy-struggle-after-failed-several-ivf-attempts

ఐవీఎఫ్‌ ఫెయిలైనా.. ఆరోగ్యకరమైన జీవనశైలితో సహజంగానే తల్లయ్యా!

పెళ్లయిన ప్రతి మహిళా అమ్మతనం కోసం ఆరాటపడుతుంది.. ఎప్పుడెప్పుడు తల్లినవుతానా అని తపిస్తుంది. ఐర్లాండ్‌లోని డబ్లిన్‌కు చెందిన ఓ మహిళ కూడా అమ్మతనం కోసం ఎంతగానో పరితపించింది.. ఎన్నో ఆస్పత్రులు తిరిగింది.. ఎందరో డాక్టర్లను కలిసింది. అయినా తన కల నెరవేరకపోయేసరికి తల్లడిల్లింది. ఆఖరి ప్రయత్నంగా ఐవీఎఫ్‌ చికిత్స కూడా తీసుకుంది. అక్కడా ఆమెకు నిరాశే ఎదురైంది. ‘ఇక ఈ జీవితంలో నాకు అమ్మయ్యే యోగం లేదేమో’ అనుకుంటోన్న తరుణంలోనే దేవుడు వరమిచ్చినట్లు సహజంగానే గర్భం ధరించిందామె. పండంటి కూతురు పుట్టడంతో పట్టరానంత సంతోషంలో మునిగిపోయింది. ప్రస్తుతం తన కూతురితో, భర్తతో సంతోషంగా జీవిస్తోన్న ఆమె.. తనలాంటి వారి గురించి నాకెందుకులే అనుకోలేదు. అమ్మయ్యే క్రమంలో తనకు ఎదురైన సమస్యలు, సవాళ్లను నలుగురితో పంచుకోవాలనుకుంది.. తద్వారా అమ్మతనం కోసం ఆరాటపడుతోన్న మహిళల్లో స్ఫూర్తి నింపాలనుకుంది. ఇందుకోసం ఆన్‌లైన్‌ వేదికగా.. మహిళలకు ఉపయోగపడే ఎన్నో చిట్కాలను అందిస్తోన్న ఆమె అమ్మయ్యే క్రమంలో తనకెదురైన అనుభవాలను, సవాళ్లను ఇలా పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
woman-shares-her-experience-on-sexual-harassment-in-the-age-of-zoom-calls-and-covid-19

‘నాతో ఒక్క రోజు గడుపు.. నిన్నొదిలేస్తా’ అన్నాడు!

అసలే ఆర్థికంగా కష్టాల్లో ఉందామె.. దానికి తోడు కరోనా ప్రతికూల పరిస్థితులు ఆమెకున్న ఉద్యోగాన్ని లాగేసుకొని ఆమెను మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి. అయినా ఉద్యోగ ప్రయత్నాలు మానుకోలేదామె. తన పనితనం, ప్రతిభకు మెచ్చి ఓ కంపెనీ ఆమెకు ఉద్యోగమిచ్చింది.. అందులోనూ కరోనా కారణంగా ఇంటి నుంచే పని చేయమనే ఆఫర్‌ కూడా ఇచ్చింది. ‘నా అదృష్టమో, దేవుడి దయో గానీ.. ఉద్యోగమైతే వచ్చింది’ అని సంబరపడిపోయిందామె. ఇక తన కష్టాలు తీరిపోయినట్లే అనుకుంది.. కానీ అప్పట్నుంచి ఆ కష్టాలకు మించిన నరకం అనుభవిస్తానని ఊహించలేదామె. మరి, ఉద్యోగం చేద్దామంటే రోజూ వేధింపులే, మానేద్దామంటే మానేయలేని పరిస్థితి.. అంటూ తనకెదురైన చేదు అనుభవాలను మనతో పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
a-story-of-a-woman-who-lost-her-husband-due-to-honor-killed-in-telugu

ప్రేమా.. ప్రేమా.. ప్రేమించడం నేరమా..?!

ప్రేమ.. రెండు మనసుల్ని ఒక్కటి చేసే ఈ మధురమైన భావనకు కులమతాల తారతమ్యం లేదంటారు.. రూపు-రేఖలు ఎలా ఉన్నా పట్టించుకోదంటారు.. వయసుతో అసలు పనే లేదంటారు. ఇలా అన్నింటా ప్రేమదే అంతిమ విజయం. కానీ పరువు దగ్గరికొచ్చే సరికి మాత్రం దీనికి ఎప్పుడూ ఓటమే ఎదురవుతుంది. ప్రేమతో ఒక్కటై ‘ఇక నిండు నూరేళ్లు నీతోనే నా బతుకు!’ అని బాస చేసుకున్న జంటల ఆనందాన్ని ఆవిరి చేస్తోందీ ఎందుకూ కొరగాని ఈ పరువు. అర్థం చేసుకునే వ్యక్తి దొరకడం అదృష్టమంటారు. అలాంటి వ్యక్తిని ప్రేమిస్తే తప్పా? అతనితో జీవితాన్ని పంచుకోవడం నేరమా? పెద్దల దృష్టిలో వారికి నచ్చని వారిని ప్రేమిస్తే పరువు పోతుంది కానీ వారు ఆ ప్రేమను చంపేసి నలుగురిలో హంతుకులుగా మారితే అది పరువు తక్కువ కాదా? ఇలా పరువు-ప్రతిష్టల పేరుతో ప్రేమను చంపేసి ఏం సాధిస్తారు? అంతులేని దుఃఖం తప్ప! అంటూ తన మనసులోని ఆవేదనను పంచుకుంటోంది ఎంతగానో ప్రేమించిన తన భర్తను పోగొట్టుకున్న ఓ అభాగ్యురాలు. మరి, ఆమె హృదయరాగమేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
a-rape-survivor-shares-her-story-and-alerting-other-women-in-telugu

అన్నయ్య అని నమ్మితే కోరిక తీర్చమన్నాడు!

వారిద్దరూ ఒకే కంపెనీలో పని చేస్తున్నారు. ఉండే ప్రదేశాలు, ఆఫీస్‌ సమయాలు కూడా ఒకటే కావడంతో రోజూ కారులో కలిసే ఆఫీస్‌కి వచ్చి వెళ్తుంటారు. కరోనా కారణంగా బయట తగిన రవాణా సౌకర్యాలు కూడా లేకపోవడంతో ‘హమ్మయ్య.. నాకు నా కొలీగ్‌ కారైనా ఉంది.. ఈ సౌకర్యం కూడా లేక తిప్పలు పడే వారు ఎందరో!’ అంటూ సంతోషించిందా అమ్మాయి. కానీ ఆ సంతోషం అంతలోనే ఆవిరవుతుందని, తాను సౌకర్యం అనుకున్న ఆ కారే తన పాలిట కామ పాశమవుతుందని ఊహించలేదా యువతి. ఒక తోబుట్టువుగా తాను నమ్మిన వ్యక్తే తన కోరిక తీర్చమంటూ అడిగే సరికి జీర్ణించుకోలేకపోయిందామె. ఇక ఈ ఘోరాన్ని ఆపే ప్రయత్నంలో తీవ్ర గాయాలై ఆస్పత్రి పాలైంది మరో మహిళ. ఇలాంటి అయోమయ పరిస్థితుల్లో తనకు జరిగిన అన్యాయానికి కుంగిపోవాలో, తన వల్ల సాటి మహిళ కోరి కష్టాలు కొని తెచ్చుకుందని బాధపడాలో తెలియని అయోమయంలో ఆ చేదు జ్ఞాపకాన్ని పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
a-medico-shares-her-tougher-experiences-about-covid-19-and-give-some-basic-precautions-to-all-of-us

అలా బయటికొచ్చేముందు ఒక్కసారి మీ వాళ్లను గుర్తు తెచ్చుకోండి..!

‘ఏంటో ఈ మాయదారి కరోనా మహమ్మారి రోజురోజుకీ విరుచుకుపడుతోందే తప్ప ఏమాత్రం శాంతించట్లేదు.. దీనికి టీకా ఎప్పుడొస్తుందో? ఈ గండం నుంచి ఎప్పుడు గట్టెక్కుతామో?’.. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఇదే కోరుకుంటున్నారు. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోన్న మనమేమో వైరస్‌ ముప్పు ఎటు నుంచి ముంచుకొస్తుందోనని భయపడుతుంటే.. కొందరేమో అసలు వైరసే లేనట్లు ప్రవర్తిస్తున్నారు. బయటికి వచ్చే ముందు కనీసం మాస్కైనా పెట్టుకోని వారు కొందరైతే.. సామాజిక దూరాన్ని పూర్తిగా గాలికొదిలేశారు మరికొందరు. నెలలు గడుస్తోన్నా, వైరస్‌ గురించి అందరిలో అవగాహన వచ్చినా.. ఇలాంటి వారి వల్లే దేశంలో కరోనా విలయతాండవం చేస్తోందని అంటోంది ఓ మెడికో. తద్వారా వారి చుట్టూ ఉన్న వారే కాదు.. వైద్యులపై కూడా మోయలేనంత భారం పడుతోందని, అది వారిని అటు శారీరకంగా, ఇటు మానసికంగా కుంగదీస్తోందని చెబుతూ తమ వెతల్ని ఇలా మనందరితో పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
suicide-attempt-to-radio-job-in-telugu

చేదు బాల్యం.. విషపు యవ్వనం.. నాకు నేర్పిన జీవితపాఠాలు!

'తేనెలొలుకు బాల్యం నిత్యనూతన మధుర జ్ఞాపకం'.. కానీ అది ఆమె విషయంలో నిజం కాలేదు. 'ఉరకలెత్తే యవ్వనం, భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే కలలు, ఆశల పరంపర'.. అది కూడా ఆమె విషయంలో కలగానే మిగిలిపోయింది. దాంతో కుంగిపోయింది.. వేదనపడింది.. ఆత్మహత్యకు ప్రయత్నించింది.. కానీ ప్రతి పుట్టుకకు ఒక అర్థం, పరమార్థం ఉంటుందనే జీవిత సత్యాన్ని కాస్త ఆలస్యంగానైనా గ్రహించిందామె. పడిలేచిన కెరటంలా భవిష్యత్తును గెలిపించుకుంది. ఓడిన జీవితం నుంచి గెలుపు బాటలు పరచుకుని, స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. తనలా జీవిత సాగరాన్ని ఈదుతోన్న ఎంతోమందిలో స్ఫూర్తి రగిలించడానికి తన కథను పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
pcos-sufferer-laura-faulkner-to-walk-100-miles-to-raise-money---with-her-baby-in-a-sling

women icon@teamvasundhara
noida-doctor-shares-her-weird-experiences-wearing-sanitary-napkins-along-with-diapers

పీపీఈ.. శ్యానిటరీ ప్యాడ్స్‌.. ఆ రోజుల్లో మా బాధ ఏమని చెప్పగలం?!

పొత్తి కడుపులో నొప్పి, నడుం నొప్పి, అధిక రక్తస్రావం, మూడ్‌ స్వింగ్స్‌.. ఇలా శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యల్ని తీసుకొస్తుంది నెలసరి. ఇలాంటి ప్రతికూల సమయంలో మనమైతే ఏం చేయాలనుకుంటాం.. హాయిగా వేడివేడి నీళ్లతో స్నానం చేసి.. రోజంతా విశ్రాంతి తీసుకోవాలనుకుంటాం. కనీసం మనకు ఆ అవకాశమైనా ఉంది.. కానీ రాత్రింబవళ్లు కరోనా బాధితులకు సేవ చేయడంలో నిమగ్నమైన వైద్యులు, నర్సులు పిరియడ్స్‌ సమయంలోనూ విధులకు హాజరు కావాల్సిందేనని అంటోంది ఓ యువ వైద్యురాలు. రక్తస్రావం ఎక్కువైనా ఏడెనిమిది గంటల పాటు శ్యానిటరీ న్యాప్‌కిన్‌ మార్చుకోవడానికి కూడా వీల్లేని దుర్భర స్థితి ఒకవైపు, వేడి పుట్టించే పీపీఈ కిట్లు మరోవైపు.. అంటూ కరోనా బాధితులకు సేవలందించే క్రమంలో తనకెదురైన కొన్ని సవాళ్లను, అనుభవాలను మన ముందుంచే ప్రయత్నం చేశారామె.

Know More

women icon@teamvasundhara
a-sad-story-of-a-human-trafficking-victim-in-telugu

అతని భార్యగా జీవించే అర్హత నాకు ఉందా..?

చక్కగా చదువుకొంటూ.. ఆడుతూ పాడుతూ హుషారుగా ఉండే అమ్మాయి.. 12 ఏళ్ల వయసులో కిడ్నాప్‌కు గురైంది. తానెక్కడున్నానో తెలియని పరిస్థితుల్లో కొన్నేళ్ల పాటు కాలం గడిపింది. గాలి చొరబడని గదుల్లో, ముక్కుపుటాలదిరిపోయే వాసనల మధ్య కాలం వెళ్లదీసింది. వ్యభిచార గృహంలో ఎందరి చేతుల్లోనో అత్యాచారానికి గురైంది. కన్నవారికి దూరమై పుట్టెడు కష్టాలనుభవించిన ఆ చిన్నారి ఈ రొంపి నుంచి బయటపడి అమ్మానాన్న దగ్గరికి వెళ్లాలని, వారి ప్రేమలో తడిసిముద్దవ్వాలని కోరుకొంది. కొంతకాలానికి ఆ నరక కూపం నుంచి బయటపడింది. కానీ విధి చిత్రమైంది. తల్లిదండ్రులను ఆమెకు దూరం చేసింది. ఆ బాధ నుంచి తేరుకొన్న ఆమె చదువుకొని ప్రస్తుతం ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. తన గతం తెలిసిన ఓ అబ్బాయితో జీవితం పంచుకోవాలో వద్దో సతమతమవుతూ, బాధాకరమైన తన జీవిత గాధను ఇలా పంచుకుంటోంది..

Know More

women icon@teamvasundhara
how-to-be-independent-in-telugu

మీరు స్వేచ్ఛగానే జీవిస్తున్నారా?

'స్వాతంత్య్రమే నా జన్మ హక్కు' అన్నారు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు బాలగంగాధర్ తిలక్. ప్రతి మనిషి స్వేచ్ఛగా, స్వతంత్రంగా బతకగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం సిద్ధిస్తుంది. ప్రత్యేకించి మహిళల విషయానికొస్తే ప్రస్తుతం పురుషులతో సమానంగా స్త్రీలు కూడా సంపాదిస్తున్నారు. అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. వారికి వారు స్వతంత్రంగా, స్వేచ్ఛగా జీవిస్తున్నారు. అయితే డబ్బు, కెరీర్... ఇలాంటి వాటిలోనే కాదు.. జీవితానికి సంబంధించిన అన్ని అంశాల్లోనూ స్వతంత్రంగా జీవించగలిగితేనే మనం కోరుకునే సంతృప్తి లభిస్తుంది. ఈ క్రమంలో స్వతంత్రంగా, స్వేచ్ఛగా జీవించడానికి దోహదపడే కొన్ని అంశాలేంటో ఒక్కసారి చూద్దాం...

Know More

women icon@teamvasundhara
kerala-nurse-who-tests-positive-for-covid-19-shares-her-experience

ఇంట్లోనే చికిత్స తీసుకున్నా.. కరోనా నుంచి వేగంగా కోలుకున్నా!

గత ఆరు నెలలుగా కంటికి కనిపించని శత్రువుతో అలుపెరగని యుద్ధం చేస్తున్నారు వైద్యులు, నర్సులు. ఊపిరాడనివ్వని పీపీఈ కిట్లను ధరిస్తూనే కరోనా రోగులకు ఊపిరి పోస్తున్నారు. కొవిడ్‌ రోగులకు సేవలందించే క్రమంలో దురదృష్టవశాత్తూ కొందరు వైద్యులు, నర్సులు అదే మహమ్మారి బారిన పడుతున్నారు. ఇదే క్రమంలో కేరళకు చెందిన ఓ నర్సు కొన్ని రోజుల క్రితం ఇలాగే కరోనా బారిన పడింది. ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండి చికిత్స తీసుకున్న ఆమె ఇటీవల కరోనాను జయించింది. ఈ సందర్భంగా హోం ఐసోలేషన్‌లో ఉండి ట్రీట్‌మెంట్‌ తీసుకోవడం వల్లనే కొవిడ్‌ నుంచి వేగంగా కోలుకున్నానని చెబుతున్న ఆమె కరోనా కథేంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
girl-saying-a-story-about-her-friend-on-this-friendship-day

తన స్నేహమే నా జీవితాన్ని నిలబెట్టింది..!

'నీకంటూ ఏ తోడూ లేనప్పుడు కూడా నీ తోడుగా నడిచొచ్చే ధైర్యమే స్నేహం'! నిజమే.. ఏ స్వార్థం లేకుండా కేవలం మన మంచిని మాత్రమే కోరుకునే వారే నిజమైన స్నేహితులు. అందుకే సందర్భానికి తగినట్లుగా అమ్మలా, నాన్నలా, తోబుట్టువులా మన వెన్నంటే ఉంటూ మనల్ని సన్మార్గంలో నడిచేలా చేయడానికి ప్రయత్నిస్తుంటారు మన ఫ్రెండ్స్. అంతేకాదు.. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి వారు అందించే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఇందుకు నా జీవితమే ఉదాహరణ అంటోంది ఓ అమ్మాయి. 'స్నేహితుల దినోత్సవం' సందర్భంగా తన ప్రాణ స్నేహితురాలి గురించి చెప్పేందుకు ఇలా మన ముందుకు వచ్చింది..

Know More

women icon@teamvasundhara
durban-woman-shares-experience-and-warns-communities-to-take-corona-virus-seriously

కరోనాకి ఎలాంటి తేడాల్లేవు.. ఏమవుతుందిలే అనుకోవద్దు.. జాగ్రత్త!

‘యుక్తవయసులో ఉన్న వారికి కరోనా సోకదు.. ఒకవేళ సోకినా దాని ప్రభావం అంతగా ఉండదు.. కొవిడ్కు సాధారణ ఫ్లూ లక్షణాలే ఉంటాయి..’ ఇవీ ప్రస్తుతం ఈ మహమ్మారి గురించి చాలామందిలో నెలకొన్న భిన్నాభిప్రాయాలు. అయితే కంటికి కనిపించకపోయినా ప్రపంచాన్నే పట్టి పీడిస్తోన్న ఈ భూతం గురించి అంత అలక్ష్యం పనికిరాదంటోందో యువతి. మనిషి-మనిషికీ తన ఉనికిని మార్చుకుంటూ విరుచుకుపడుతోన్న ఈ వైరస్‌.. ఎలాంటి లక్షణాలు లేకుండానే ఎంతోమందిని బలి తీసుకుంటోంది. అలాంటి మహమ్మారితో కొన్ని వారాలు నరకం అనుభవించానని, ప్రతి ఒక్కరూ ఈ వైరస్‌ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని చెబుతోందీ యువతి. ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న బాధ గురించి పంచుకుంటే కొందరైనా ఈ మహమ్మారిని సీరియస్‌గా తీసుకొని జాగ్రత్తపడతారన్న చిన్ని ఆశతోనే తన కరోనా కథను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నానంటోందీ పాతికేళ్ల అమ్మాయి.

Know More

women icon@teamvasundhara
covid-survivor-doctor-leads-by-example-donates-plasma

అందుకే వెంటనే ప్లాస్మాను దానం చేశాను!

మానవాళి మనుగడకు సవాల్‌ విసురుతోంది కరోనా. కంటికి కనిపించని ఈ వైరస్‌ ధాటికి ప్రపంచ దేశాలన్నీ గడగడలాడుతున్నాయి. ఈక్రమంలో ప్రస్తుతం మందు లేని ఈ మహమ్మారి నుంచి మానవ జాతిని రక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్ర్తవేత్తలు, వైద్య నిపుణులు విస్తృత పరిశోధనలు కొనసాగిస్తున్నారు. అయితే పూర్తిస్థాయి వ్యాక్సిన్‌ ప్రజలందరికీ అందుబాటులోకి రావడానికి ఎంత సమయం పడుతుందో కచ్చితంగా చెప్పలేం. ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్‌తో ఆరోగ్యం విషమించిన వారికి ప్రాణదాతలా పనిచేస్తోంది ప్లాస్మా థెరపీ. అందుకే వివిధ రాష్ర్ట ప్రభుత్వాలు కరోనా నుంచి కోలుకొని ప్లాస్మా దానం చేస్తున్న వారికి పలు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. అదేవిధంగా చిరంజీవి, నాగార్జున, అమల, సాయిధరమ్‌ తేజ్‌, వెంకటేష్‌ తదితర సెలబ్రిటీలు కూడా సోషల్‌ మీడియా వేదికగా ప్లాస్మా దానంపై అవగాహన కల్పిస్తున్నారు.

Know More

women icon@teamvasundhara
35-years-old-uk-woman-beats-corona-virus-after-130-days

130 రోజులు చావుతో పోరాడింది.. ఇక నాకు దక్కదేమో అనుకున్నా!

కరోనా...పేరు వింటేనే వెన్నులో వణుకు తెప్పిస్తోన్న ఈ వైరస్‌ ఏ మాత్రం శాంతించడం లేదు. ఇప్పటికే లక్షలాది మందిని బలి తీసుకున్న ఈ మహమ్మారి రోజురోజుకీ మరింత విజృంభిస్తోంది. ప్రత్యేకించి లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత కుప్పలు తెప్పలుగా పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రత్యేకించి వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఈ మహమ్మరి పేరు వింటేనే హడలిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంగ్లండ్‌కు చెందిన ఓ మహిళ 130 రోజుల పాటు కరోనాతో పోరాడి కోలుకుంది. తన చికిత్సా కాలంలో 105 రోజులు వెంటిలేటర్‌పైనే ఉన్న ఆమె మానసిక స్థైర్యంతో ఈ మహమ్మారిని ఓడించింది. తద్వారా తనలాంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, కరోనా బాధితులకు వూరటనిచ్చింది.

Know More