scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Video Gallery

Movie Masala

 
category logo

నా భార్య నా కన్నా ఎక్కువగానే సంపాదిస్తోంది!

Genelia And Riteish Deshmukh Shares Unknown Facts About Each Other

ప్రేమించి పెళ్లి చేసుకున్న బాలీవుడ్‌ సెలబ్రిటీ జంటల్లో జెనీలియా-రితేష్‌ దేశ్‌ముఖ్‌ జోడీ కూడా ఒకటి. ఎనిమిదేళ్ల క్రితం ఏడడుగులు నడిచిన ఈ లవ్లీ కపుల్‌ రీల్ లైఫ్‌లో మాదిరిగానే రియల్ లైఫ్‌లో కూడా ఎంతో సరదాగా ఉంటారు. ఒకరిపై ఒకరు తమ ప్రేమను చూపిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. ఈ క్రమంలో దాంపత్య బంధానికి సరైన నిర్వచనంలా కనిపించే జెనీలియా-రితేష్‌ తాజాగా ఓ టీవీ షోకు హాజరయ్యారు. ఇందులో భాగంగా తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నారు.

View this post on Instagram

A post shared by Genelia Deshmukh (@geneliad) on


‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ..’ అన్న డైలాగును మన తెలుగు ప్రేక్షకులు ఇంకా గుర్తు పెట్టుకున్నారంటే.. తెరపై ఆ సన్నివేశాన్ని అంత బాగా పండించిన జెనీలియా గొప్పతనమే..! ‘బొమ్మరిల్లు’, ‘బాయ్స్‌’, ‘హ్యాపీ’, ‘రెడీ’, ‘ఆరెంజ్‌’.. వంటి తెలుగు చిత్రాలతో పాటు తమిళ, మలయాళీ, మరాఠీ, హిందీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించిన ఈ చిన్నది బాలీవుడ్‌ హ్యాండ్‌సమ్‌ హీరో రితేష్‌ దేశ్‌ముఖ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తమ మొదటి సినిమా ‘తుఝే మేరీ కసమ్‌’ చిత్రీకరణలో మొదటిసారిగా కలుసుకున్న వీరిద్దరూ అప్పుడే ప్రేమలో పడిపోయారు. తొమ్మిదేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ లవ్లీ కపుల్‌ పెద్దల ఆశీర్వాదంతో 2012లో పెళ్లి పీటలెక్కారు. వారి ప్రేమకు గుర్తుగా రియాన్, రాహుల్‌ అనే ఇద్దరు కొడుకులు పుట్టారు. ఇక వివాహం తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన ఈ అందాల తార ప్రస్తుతం తన ఇద్దరు కుమారులతో అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోంది.

View this post on Instagram

A post shared by Genelia Deshmukh (@geneliad) on


జెనీలియా భర్త అనగానే నాకు కోపం వచ్చింది!
ఇటీవల కరోనా నుంచి కోలుకున్న జెనీలియా తన భర్తతో కలిసి ఓ కార్యక్రమానికి హాజరైంది. ఈ సందర్భంగా వివాహానంతరం దక్షిణాదికి వచ్చిన సమయంలో జరిగిన ఓ సరదా విషయాన్ని రితేష్‌ గుర్తు చేసుకున్నాడు. ‘మాకు వివాహమైన తర్వాత కొంత కాలానికి సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ కోసం బెంగళూరు వచ్చాను. ఆ సమయంలో అదే క్రికెట్‌ లీగ్‌లో పాల్గొన్న ఇద్దరు సెలబ్రిటీలు నన్న చూసి ‘మీరు జెనీలియా భర్త కదా’ అని అడిగారు. ఆ మాటతో నా ఇగో కొంచెం హర్ట్ అయింది. కోపం కూడా వచ్చింది. వెంటనే వాళ్ల దగ్గరకు వెళ్లి ‘దక్షిణాదిలో మాత్రమే నేను ‘జెనీలియా భర్తని’.. కానీ మహారాష్ట్రలో మాత్రం ‘రితేష్‌ భార్య జెనీలియా’ అని సమాధానమిచ్చాను. దానికి వారు ‘సర్.. మహారాష్ట్రలోనే ఆమెను రితేష్‌ భార్య అంటారు. కానీ కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక...ఇలా ఇన్ని రాష్ట్రాల్లో ‘జెనీలియా భర్త రితేష్‌’ అనే అంటారు’ అని సమాధానమిచ్చారు. వాళ్లు చెప్పిన మాటలు నాకు బాగా నవ్వు తెప్పించాయి’ అని గత స్మృతులను గుర్తు చేసుకున్నారీ రొమాంటిక్‌ కపుల్.

View this post on Instagram

A post shared by Genelia Deshmukh (@geneliad) on


ఆ సినిమా మాకో సరికొత్త అనుభూతి!
2003లో రిలీజైన ‘తుఝే మేరీ కసమ్‌’ సినిమాలో ప్రేమికులుగా నటించారు రితేష్‌-జెనీలియా. అప్పటికే ప్రేమలో ఉన్న ఈ లవ్లీ బర్డ్స్‌ మరుసటి ఏడాదే ‘మస్తీ’ అనే సినిమాలో భార్యాభర్తలుగా నటించడం విశేషం. ‘మస్తీ’ సినిమా కోసం మిలాప్‌ జవేరి (రైటర్‌) మా ఇద్దరినీ ఇంద్రకుమార్‌ (డైరెక్టర్‌)కు పరిచయం చేశాడు. ఈ సినిమాలో మేం భార్యాభర్తలుగా నటించాం. విచిత్రమేమిటంటే అంతకుముందు ఏడాదే మా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇక ఈ సినిమాలో మేమిద్దరం పెళ్లి చేసుకునే సీన్‌ కూడా ఉంటుంది. అలా ఈ షూటింగ్‌ సీక్వెన్స్‌ మాకో సరికొత్త అనుభూతినిచ్చాయి’ అని రితేష్‌ గుర్తు చేసుకున్నాడు.

View this post on Instagram

A post shared by Genelia Deshmukh (@geneliad) on


భవిష్యత్‌ గురించి ఆలోచించలేదు!
ఇక జెనీలియా కూడా ‘మస్తీ’ సినిమా షూటింగ్‌ అనుభవాలను అందరితో షేర్‌ చేసుకుంది. ‘రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు భవిష్యత్‌ గురించి మేమిద్దరం పెద్దగా ఆలోచించేవాళ్లం కాదు. అసలు మా ప్రేమ పెళ్లి పీటల దాకా చేరుతుందో?లేదో? అనే విషయం కూడా మాకు తెలియదు. కానీ ఈ సినిమాలో భాగంగా మేమిద్దరం పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది’ అని చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

View this post on Instagram

A post shared by Genelia Deshmukh (@geneliad) on


మీ కంటే నేనే ఎక్కువగా కోరుకుంటున్నా!
‘మస్తీ’ సినిమాలో భాగంగా ఓ సీన్‌లో తన సంపాదన అంతటినీ భార్య (జెనీలియా) చేతిలో పెడతాడు రితేష్. ఈ సందర్భంగా నిజ జీవితంలో కూడా ఇలాగే చేస్తారా అన్న ప్రశ్నకు రితేష్‌ స్పందిస్తూ ‘నా భార్య నా కన్నా ఎక్కువగా సంపాదిస్తోంది. ఈ విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను’ అని చెప్పుకొచ్చాడీ హ్యాండ్‌సమ్‌ హీరో. ఇక సినిమాల్లో జెనీలియా రీ ఎంట్రీపై స్పందిస్తూ ‘తను సినిమాల్లో నటించాలని మీరందరూ ఎలా కోరుకుంటున్నారో నేను కూడా అంతకన్నా ఎక్కువగానే కోరుకుంటున్నా. ఇందులో భాగంగా ఓ మరాఠీ చిత్రంలో మేమిద్దరం నటించాలనుకుంటున్నాం. ఎందుకంటే ఆమెకు మరాఠీ బాగా తెలుసు. ఆమెతో కలిసి నటించే అవకాశం వస్తే అసలు వదులుకోను. త్వరలోనే నా కోరిక నెరవేరుతుందని అనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చాడు.

View this post on Instagram

A post shared by Genelia Deshmukh (@geneliad) on


అప్పుడే సినిమాల్లోకి వస్తాను!
ఇదే విషయంపై జెనీలియా స్పందిస్తూ ‘నా ఇద్దరు పిల్లలకు ఐదేళ్లు నిండాయి. ఇప్పుడిప్పుడే ఊహ తెలుస్తోంది. అందుకే మరి కొన్ని రోజులు నేను వారి వెంటే ఉండాలనుకుంటున్నాను. వారు ఎప్పుడైతే స్కూల్కెళ్లి సొంతంగా స్నేహితులను సంపాదించుకుంటారో అప్పుడే సినిమాల్లో నటించే విషయం గురించి ఆలోచిస్తాను. అప్పటివరకు నా దృష్టంతా నా పిల్లల పైనే కేంద్రీకరించాలనుకుంటున్నాను’ అని అంటోందీ ముద్దుగుమ్మ.





gynecologist Ask Psychology Expert
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి


Know More

women icon@teamvasundhara
how-to-build-successful-in-law-relationships

ఇలా చేస్తే అత్తిల్లూ పుట్టిల్లే..!

అప్పటిదాకా పుట్టింట్లో ఎంతో స్వేచ్ఛగా, గారాబంగా పెరిగిన ఆడపిల్ల పెళ్లయ్యాక అత్తింట్లో అడుగుపెట్టగానే ఆమెపై ఎన్నో బరువు బాధ్యతలు వచ్చిపడతాయి. మరి, వాటన్నింటినీ బ్యాలన్స్ చేసుకుంటూ ముందుకు సాగితేనే అటు పుట్టింటి గౌరవాన్ని, ఇటు మెట్టినింటి అనురాగాన్ని సొంతం చేసుకోవచ్చు. అయితే అప్పుడే అత్తారింట్లో అడుగుపెట్టిన అమ్మాయికి ఇవన్నీ కొత్తగానే అనిపిస్తాయి. ఏ విషయంలో ఎలా మెలగాలో అర్థం కాని పరిస్థితి వారిది. అన్నింటికంటే ముఖ్యంగా అత్తింటి వారితో నడుచుకునే విధానం, అత్తమామలకిచ్చే గౌరవమర్యాదలు, వారి అభిరుచులేంటి.. వంటివన్నీ తెలుసుకొని ముందుకు సాగితేనే మెట్టినింటిని కూడా పుట్టింటిలా మార్చుకోవచ్చు. అంతేకాదు.. ఇలా చేయడం వల్ల పెళ్లి తర్వాత అమ్మానాన్నలుగా భావించే అత్తమామలతో సఖ్యత కూడా ఏర్పడుతుంది.. ఇద్దరి మధ్య అనుబంధం మరింత దృఢమవుతుంది. అయితే ఇందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మరి, అవేంటో తెలుసుకొని ఆచరిస్తే అత్తింటి అనుబంధంలో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదించవచ్చు.

Know More

women icon@teamvasundhara
bedtime-rules-for-happy-couple

పడక గదే ప్రణయతీరం!

భార్యాభర్తల బంధం.. అదో మధురమైన అనుబంధం. ఆ బంధాన్ని పటిష్టం చేసే అంశాలు చాలానే ఉంటాయి. ముఖ్యంగా రొమాన్స్, ఒకరితో ఒకరు ఏకాంతంగా గడపడం.. వంటివి వాటిలో మరింత కీలకమైనవి. అయితే పగలంతా ఎవరి పనుల్లో వారు నిమగ్నమవడంతో ఇరువురూ కలిసి గడిపేందుకు కాస్త సమయమైనా దొరక్కపోవచ్చు. అలాంటప్పుడు ఇందుకు సరైన సమయం రాత్రి.. సరైన ప్రదేశం పడకగదే..! మరి అంతటి విలువైన సమయాన్ని భాగస్వామి కోసం కేటాయించి, పడకగదిని ప్రణయతీరంగా మార్చుకోవాలంటే దంపతులు అలవర్చుకోవాల్సిన విషయాలు కొన్నున్నాయంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. వీటితో ఆలుమగల అనుబంధం ఆజన్మాంతం శాశ్వతమవుతుందని సూచిస్తున్నారు. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
my-parents-always-give-more-importance-to-my-siblings-than-me-what-should-i-do?

అలా చేస్తున్న నా తల్లిదండ్రుల్ని మార్చేదెలా?

మేడమ్‌.. నా వయసు 24. మేము ముగ్గురం అక్కచెల్లెళ్లం.. మా తల్లిదండ్రులకు నేను రెండో సంతానం. ప్రస్తుతం నేను ఉద్యోగం చేస్తున్నాను. మా తల్లిదండ్రులు నాతో తప్ప మిగతా ఇద్దరితో బాగానే ఉంటారు. ఇంటి పనులు నాతోనే ఎక్కువగా చేయిస్తుంటారు. నా పట్ల వాళ్లు అలా ప్రవర్తిస్తుంటే రెండో అమ్మాయిగా పుట్టడమే నేను చేసిన తప్పేమో అనిపిస్తుంది. ‘అవసరానికి నేను.. ప్రేమను పంచడానికి మాత్రం వాళ్లు కావాలా?’ అనిపిస్తుంది. ఒక్కోసారైతే ఇవన్నీ భరించలేక చనిపోవాలనిపిస్తుంది. ఏమైనా అంటే ‘నీకు వాళ్లిద్దరి మీద అసూయ’ అని తిడతారు. అసలు నేనంటే అంత ఇష్టం లేనప్పుడు ఇంకా నేను ఎందుకు బతికున్నానా అనిపిస్తుంది. ఈ సమస్య నుంచి ఎలా బయట పడాలో అర్థం కావట్లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
kalki-koechlin-shares-her-love-story-with-israeli-boyfriend-guy-hershberg-through-beautiful-note-on-instagram

మా ప్రేమకథలోనూ మరపు రాని తీపి గుర్తులెన్నో!

ప్రేమలో ఉన్నా, రిలేషన్‌షిప్‌లో ఉన్నా, పెళ్లి చేసుకున్నా.. చాలా జంటలు ఒకరి కోసం మరొకరు తమ అభిరుచుల్ని మార్చుకుంటాయి.. అలా చేస్తేనే ఒకరిపై ఒకరికి ప్రేముందని నమ్మే జంటలూ లేకపోలేదు. అయితే ప్రేమంటే అటవాట్లను, సంప్రదాయాలను మార్చుకోవడం కాదని, ఒకరి అభిరుచుల్ని మరొకరు గౌరవించడమే అసలైన అనురాగం అంటోంది బాలీవుడ్‌ డింపుల్‌ బ్యూటీ కల్కి కొచ్లిన్‌. ఇజ్రాయెల్‌కు చెందిన మ్యుజీషియన్‌ గై హెర్ష్‌బెర్గ్‌తో గత మూడేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో సాఫో అనే ముద్దుల పాపకు జన్మనిచ్చింది. అప్పట్నుంచి అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోన్న ఈ చక్కనమ్మ.. సందర్భం వచ్చినప్పుడల్లా తన వ్యక్తిగత విషయాలను సైతం సోషల్‌ మీడియాలో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తన బాయ్‌ఫ్రెండ్‌ గైతో ఏర్పడిన తొలి పరిచయం దగ్గర్నుంచి.. ఈ మూడేళ్ల అనుబంధంలోని కొన్ని తీపి గుర్తుల్ని నెమరువేసుకుంటూ ఇన్‌స్టా వేదికగా సుదీర్ఘ పోస్ట్‌ పెట్టిందీ అందాల తార.

Know More

women icon@teamvasundhara
wrestlers-sangeeta-phogat-bajrang-punia-tie-knot

మా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది!

కెరీర్‌ పరంగా వారిద్దరి దారులు ఒకటే. అందుకే ఆటతో పాటు అభిరుచులు కూడా తొందరగానే కలిశాయి. స్నేహంతో మొదలైన వారి పరిచయం ప్రేమగా చిగురు తొడిగింది. ఆ మరుక్షణం నుంచే ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నారు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా పరస్పరం సహాయ సహకారాలు అందించుకున్నారు. సంతోష క్షణాలను కలిసి సెలబ్రేట్‌ చేసుకున్నట్లే కన్నీళ్లొచ్చినప్పుడు ఒకరినొకరు ఓదార్చుకున్నారు. ఈ క్రమంలో తమ ప్రేమ బంధాన్ని శాశ్వతమైన వివాహ బంధంగా మార్చుకోవాలనుకున్నారు. అందుకు పెద్దల ఆశీర్వాదం కూడా తోడయింది. దీంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా పెళ్లిపీటలెక్కారు. వారే స్టార్‌ రెజ్లర్లు సంగీతా ఫోగట్‌- బజరంగ్‌ పునియా. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ తాజాగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.

Know More

women icon@teamvasundhara
benefits-of-having-a-partner-who-is-foodie

భాగస్వామి భోజనప్రియులైతే ఆనందమే!

అబ్బబ్బా.. మీతో వేగలేక ఛస్తున్నా.. ఎంత భోజనప్రియులైతే మాత్రం రోజుకో స్పెషల్ వంటకం అంటే ఎలా కుదురుతుంది చెప్పండి? వంట చేసేది మీరైనా, నేనైనా దానికి సరుకులు మాత్రం కావాల్సిందేగా.. అంటోంది మీరా తన భర్తతో.. కొంతమంది తమ భాగస్వామి భోజనప్రియులైతే దానిని సమస్యగా భావిస్తారు. అయితే ఇలాంటివారితో ఉండడం వల్ల కూడా ఎన్నో లాభాలున్నాయంటున్నారు నిపుణులు.. ఆహార పదార్థాలను అమితంగా ఇష్టపడేవారిలో ఎన్నో మంచి లక్షణాలుంటాయట. దాంతో వారి జీవితం సాఫీగా సాగిపోయే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. మరి, భోజన ప్రియుల్లో ఉండే అలాంటి కొన్ని మంచి లక్షణాలేంటో తెలుసుకుందామా?

Know More

women icon@teamvasundhara
feelings-when-your-best-friend-gets-married

నెచ్చెలి వివాహంలో మదిపొంగే భావాలెన్నో..!

దేవుడు తల్లిదండ్రులను, తోబుట్టువులను మనకిచ్చి కేవలం స్నేహితులను మాత్రమే ఎంచుకునే అవకాశాన్ని మనకు అందించాడు. అలాంటి స్నేహితుల్లో కొంతమంది మనకు ప్రాణంగా, ఇంట్లోవాళ్లతో సమానంగా లేదా కొన్నిసార్లు వారి కంటే ఎక్కువే అన్నట్లుగా మనసుకు దగ్గరవుతారు. అలాంటి ప్రాణస్నేహితురాలికి పెళ్లి కుదిరిందంటే.. ఎంత ఆనందమో కదా..! తన పెళ్లిలో హడావిడి చేస్తూ, ఇల్లంతా హంగామా సృష్టిస్తూ, కలియదిరుగుతూ ఆనందాన్ని అందరితోనూ పంచుకుంటారు. అయితే స్నేహితురాలి పెళ్లంటే కేవలం ఆనందం మాత్రమే కాదు.. మరెన్నో భావోద్వేగాలు మది నిండా ఉప్పొంగుతుంటాయి. మరి, తన నెచ్చెలి వివాహ సమయంలో ఓ అమ్మాయి ఏమనుకుంటుందో.. ఎలా ఫీలవుతుందో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
i-was-not-going-to-marry-until-he-went-down-his-knees-says-kajal

నా కోసం మా ఆయన దానిపై ప్రేమను వదులుకోవాల్సిందే!

ప్రేమికులు తమ ప్రేమను ఒకరికొకరు తెలియజేసుకునే సందర్భం వాళ్ల జీవితాల్లో ఎంతో అపురూపమైనది. ఆ అద్భుత క్షణాలను మధుర జ్ఞాపకాలుగా మార్చుకోవాలని అందరూ అనుకోవడం సహజం. ఈ క్రమంలో - నవలలు, సినిమాల్లో మాదిరిగా - తన కలల రాకుమారుడు మోకాళ్ల పైన నిల్చొని, గులాబీ పువ్వు అందించి మరీ తనకు లవ్ ప్రపోజ్ చేయాలని అందరూ అనుకోకపోయినా కొంతమంది అనుకునే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో తనకు కాబోయే వాడు కూడా అలాగే ప్రేమను వ్యక్త పరచాలని కోరుకున్నానంటోంది కాజల్‌ అగర్వాల్‌. గత నెల చివరిలో తన ప్రియుడు గౌతమ్‌ కిచ్లూతో కలిసి ఏడడుగులు నడిచిందామె. ప్రస్తుతం మాల్దీవుల్లో తమ హనీమూన్‌ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోందీ లవ్లీ జంట. ఈ సందర్భంగా తమ రిలేషన్‌షిప్‌, వివాహం గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నారీ క్యూట్‌ కపుల్.

Know More

women icon@teamvasundhara
things-happen-when-ended-toxic-relations

అలాంటి బంధాలకు దూరమైతేనే మంచిది!

'బ్రేకప్..', 'విడాకులు..' పదం ఏదైనా సరే.. ఒక బంధం నుంచి తప్పుకున్నట్లు ప్రకటించే పదాలివి! జీవితంలో అమితమైన సంతోషాన్ని కలిగించాల్సిన బంధాలు ఒక్కోసారి ఎనలేని బాధకూ కారణమవుతాయి. మానసికంగా, శారీరకంగా అంతులేని వేదనను మిగులుస్తాయి. అన్నివిధాలా కుంగదీసి ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తాయి. అలాంటి సందర్భాలలో ఒక్కోసారి ఆ బంధం నుంచి శాశ్వతంగా తప్పుకోవాల్సి వస్తుంది.అది ఎంత బాధాకరమైనా ఇలాంటి పరిస్థితులలో అలాంటి విషపూరిత బంధం నుంచి తప్పుకోవడమే మంచిదంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు.ఇలా చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉంటాయని వారు సూచిస్తున్నారు. అవేంటో మనమూ తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
things-you-should-never-say-over-text-message

వీటి గురించి మెసేజ్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త!

'నువ్వున్న కిటికీ ఏవైపో వెతికీ వాట్సాప్ చేస్తావా?? మబ్బుల్ని కదిపి.. మొహమాట పెట్టి చంద్రున్ని తెస్తాగా..' అంటూ తన ప్రియురాలిపై ఉన్న ప్రేమని పాటరూపంలో వ్యక్తం చేశాడు ఓ సినీకవి. ఆయనే కాదు.. ఈరోజుల్లో సందేశం ఏదైనా సరే.. చాలావరకు ఫోన్ ద్వారానే ఒకరి నుంచి మరొకరికి చేరడం కామనైపోయింది. అందుకే సెల్ మోగిన ప్రతిసారీ గుండెలో గంటలు కొట్టుకుంటూ ఉంటాయి. ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి తిరిగి రాత్రి నిద్రపోయేంత వరకు చాలామందికి చాలా రకాల సందేశాలు పంపిస్తూ ఉంటాం. అయితే అన్ని విషయాలనూ ఇలా టెక్ట్స్ రూపంలో పంపించడం అంత మంచిది కాదంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. ముఖ్యంగా కొన్ని విషయాలకు సంబంధించినంత వరకు అసలు మెసేజ్ చేయకపోవడమే ఉత్తమం అని సూచిస్తున్నారు. అలా అనడానికి కారణం ఏంటి? ఇంతకీ ఆ విషయాలేంటి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే..

Know More

women icon@teamvasundhara
ideas-to-celebrate-your-wedding-anniversary-in-telugu

'పెళ్లిరోజు' జీవితాంతం గుర్తుండిపోయేలా..!

'ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ.. నాతిచరామి..' అంటూ వధూవరుల్ని ఒక్కటి చేసే అత్యద్భుతమైన ఘట్టమే వివాహం. ఇలా అందరి ముందు చేసిన బాసలు కలకాలం నిలుపుకోవాలంటే దంపతుల మధ్య అన్ని అంశాల్లోనూ సమన్వయం చాలా ముఖ్యం. ఇందుకోసం మామూలు రోజుల్లో ఒకరితో ఒకరు ప్రేమగా మసలుకోవడమే కాదు.. పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి ప్రత్యేక సందర్భాల్లోనూ మీ ప్రేమకు కాస్త కొత్తదనం జోడించి సరికొత్తగా సెలబ్రేట్ చేసుకుంటే అవి మీ ఇద్దరికీ మరపురాని మధురానుభూతులుగా మిగిలిపోతాయి. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య అనుబంధం కూడా మరింత బలపడే అవకాశం ఉంటుంది. అందుకే ఈసారి మీ పెళ్లిరోజు కోసం మీరూ ఇలా ప్లాన్ చేసి చూడండి...

Know More

women icon@teamvasundhara
sushmita-sen-opens-up-about-finding-love-in-15-years-younger-rohman-shawl

నన్ను అర్థం చేసుకున్న వాడు దొరకడం నా అదృష్టం!

‘ప్రేమకు వయసు, అందచందాలు, అంతస్తులతో సంబంధం లేదు... అది ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరి మీద పుడుతుందో ఎవరూ చెప్పలేరు’.. సినిమాల్లో ఎక్కువగా వినిపించే ఈ డైలాగ్‌ నిజ జీవితంలోనూ చాలామంది విషయంలో నిరూపితమైంది. అలాంటి వారిలో బాలీవుడ్‌ లవ్లీ కపుల్‌ సుస్మితా సేన్‌-రోమన్‌ షాల్‌ జంట కూడా ఒకటి. గత కొంత కాలంగా డేటింగ్‌లో ఉన్న ఈ ప్రేమ పక్షుల వయసుల మధ్య సుమారు 15 ఏళ్ల వ్యత్యాసం ఉంది. అయితే ఇటీవల 45వ వసంతంలోకి అడుగుపెట్టింది సుస్మిత. ఈ సందర్భంగా తన ప్రియుడితో తనకున్న ప్రేమబంధం గురించి పలు ఆసక్తికర విషయాలను అందరితో షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
how-to-change-my-husband-attitude-in-telugu

women icon@teamvasundhara
how-to-bond-with-each-other-in-courtship-days

నిశ్చితార్థం తర్వాత బంధం మరింత బలపడేలా..!

నిశ్చితార్థం.. అతి త్వరలో జీవితంలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది... మీ కలల రాకుమారుడితో కలిసి నడవబోయే సమయం ఆసన్నమైందని చెప్పే వేడుక. ఈ కార్యక్రమం తర్వాత ప్రతి ఒక్కరికీ పెళ్లి గురించిన ఆలోచనలతో నిద్ర కరవవుతుందంటే అతిశయోక్తి కాదు. నిశ్చితార్థం జరుపుకొన్న జంట మూడుముళ్లు పడే ఆ అపురూపమైన క్షణం కోసం ఎదురుచూస్తుంటారు. అంతవరకు ఇద్దరూ ఫోన్‌లోనే ఎన్నెన్నో కబుర్లు చెప్పుకొంటూ సమయం గడుపుతుంటారు. తమ భవిష్యత్తుకి సంబంధించిన విషయాల గురించి చర్చించుకుంటుంటారు. అప్పుడప్పుడూ అలా సరదాగా షికార్లకు కూడా వెళుతుంటారు. ఇదిగో ఇలా పెళ్లికి ముందు సరదాగా గడిపే ఈ కాస్త సమయమే ఆ తర్వాతి జీవితానికి పునాదిగా మారుతుందంటే మీరు నమ్ముతారా? పెళ్లికి ముందు గడిపే సమయం చాలా అమూల్యమైనది. ఆ సమయంలో చెప్పుకొన్న వూసులు, తిరిగిన ప్రదేశాలు ఆ తర్వాత గుర్తు చేసుకొని మురిసిపోయే జంటలెన్నో..! అయితే ఈ సమయాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా గడపడంతో పాటు మీ బంధం మరింత దృఢమయ్యేలా ఏం చేయాలో తెలుసుకొందామా...

Know More

women icon@teamvasundhara
germany-couple-behind-corona-vaccine-in-telugu

ఆ కరోనా వ్యాక్సిన్‌ వెనక ఉన్న దంపతులు వీరే!

కంటికి కనిపించకుండానే మానవాళి మనుగడకు సవాల్‌ విసురుతోంది కరోనా. మధ్యలో కొంచెం కనికరించినా మళ్లీ సెకండ్‌ వేవ్‌ అంటూ పలు ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. ఈ సమయంలో ఈ వైరస్‌ నుంచి మానవ జాతిని రక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు నిరంతరంగా పరిశోధనలు కొనసాగిస్తున్నారు. వ్యాక్సిన్‌ తయారీ కోసం కంటి మీద కునుకు లేకుండా శ్రమిస్తున్నారు. ఇప్పటికే చాలా వ్యాక్సిన్‌లు ప్రయోగాల్లో ఉండగా ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ సంస్థలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ 90 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు ఆ కంపెనీల ప్రతినిధులు తెలిపారు. దీంతో అందరిలో ఆశలు రేకెత్తిస్తోందీ వ్యాక్సిన్. అయితే ఈ టీకా తయారీ వెనక ఓ జంట అలుపెరగని కృషి ఉంది.

Know More

women icon@teamvasundhara
i-am-afraid-to-go-for-second-marriage-too-because-of-my-nature

దానివల్ల రెండో పెళ్లంటే భయమేస్తోంది.. ఏంచేయను?

మేడం.. నా వయసు 30సం||. నాది చాలా మెతక స్వభావం. నలుగురితోనూ కలవాలంటే చాలా సిగ్గు, భయం. అమ్మానాన్న నాకు చాలా సంబంధాలు చూశారు. కానీ నా స్వభావం కారణంగా నన్ను చేసుకోవడానికి మంచి సంబంధాల వాళ్లు ఎవరూ తొందరగా ముందుకు రాలేదు. ఆ తర్వాత 2015లో నాకు ఒక సంబంధం కుదిరింది. వాళ్లు నన్ను చేసుకుంటానని వెంట పడడంతో మంచి సంబంధమని చేసుకున్నాం. కానీ పెళ్లయ్యాక కూడా నా మెతక స్వభావం కారణంగా అత్తారింట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. మా అత్తగారు చాలా డామినేటింగ్‌గా ఉండేవారు. ఆయన, అత్తయ్య.. ఏం చెబితే అది చేసేదాన్ని. భయం కారణంగా ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. కనీసం నా భర్తకు దగ్గరయ్యేందుకు కూడా సిగ్గు, భయం ఉండేవి. ఈ పద్ధతి మా అత్తగారు వాళ్లకి నచ్చలేదు. నన్ను ఎలాగైనా వదిలించుకోవాలని అనుకున్నారు.

Know More

women icon@teamvasundhara
couple-photoshoot-ideas-in-telugu

పెళ్లిలో ఫొటోషూట్ అందంగా ఇలా..!

'మేడమ్, కొంచెం నవ్వండి ప్లీజ్..' 'మీరిద్దరూ ఇంకాస్త దగ్గరగా జరగండి.. సర్.. మీరు మేడమ్ భుజాలపై చేతులు తీయకండి..' 'మీరు కదలకండి మేడమ్.. ఫొటో సరిగ్గా రావట్లేదు..' అబ్బబ్బా.. ఈ గోలంతా ఏంటని అనుకుంటున్నారు కదూ.. పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది కదా.. పెళ్లి చేసుకోబోయే కొత్త జంటలు ఫొటోల మీద ఫొటోలు దిగడానికి సిద్ధమైపోతుంటారు. ఎందుకంటే పెళ్లిలో వాళ్లే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కదా!! పెళ్లి తంతును కవర్ చేయడం.. వధూవరులిద్దరినీ వేర్వేరు యాంగిల్స్‌లో ఫొటోల్లో బంధించడం.. ఇవన్నీ ఇప్పుడు ఫొటోషూట్ ప్యాకేజీలో భాగమే. ఈ క్రమంలో పెళ్లిలో వధూవరుల ఫొటోలు అందంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందామా?

Know More

women icon@teamvasundhara
neha-kakkar-rohanpreet-opened-about-their-cutest-love-story-in-telugu

చూడగానే అతను నాకోసమే పుట్టాడేమో అనిపించింది!

కొంతమందిని చూడగానే ‘ఈ అబ్బాయి భలే హ్యాండ్‌సమ్‌గా ఉన్నాడే’ అనిపిస్తుంది. అదే మన మనసుకు నచ్చిన వాడు కనిపిస్తే ‘ఈ అబ్బాయి నాకోసమే పుట్టాడేమో’ అని మన మనసు చక్కిలిగింతలు పెడుతుంది. రోహన్‌ప్రీత్‌ను చూడగానే తన మనసూ అలాగే పులకరించిపోయిందంటోంది కొత్త పెళ్లి కూతురు, బాలీవుడ్‌ సింగర్‌ నేహా కక్కర్‌. తొలి చూపులోనే ప్రేమలో పడిపోయిన ఈ అందాల జంట.. మొదట మనసుల్ని ఇచ్చిపుచ్చుకున్నారు.. ఆపై ఒకరు లేని మరొకరు శూన్యమనుకున్నారు.. అందుకే ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టి తమ ప్రేమను శాశ్వతం చేసుకున్నారు. అయితే అందరికీ వీరిది ప్రేమ వివాహమే అని తెలిసినా.. అసలు అది ఎక్కడ మొదలైంది? ఇద్దరిలో ఎవరు ముందు ప్రపోజ్‌ చేశారు? అన్న సందేహాలు చాలామందిలో ఉండే ఉంటాయి. అందుకే ఈ అందాల జంట పంచుకున్న తమ అందమైన ప్రేమకథను ప్రముఖ ఫ్యాషనర్‌ అనితా డోంగ్రే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో వీరిద్దరి లవ్‌స్టోరీ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.

Know More

women icon@teamvasundhara
why-too-much-attachment-is-bad-for-love-life

అది హద్దుల్లో ఉంటేనే ముద్దు..!

ప్రేమ.. ఇద్దరు వ్యక్తుల మనసులను ముడిపెట్టే ఈ సాధనం.. మితిమీరితే అవే మనసుల మధ్య మంటలు కూడా పుట్టించగలదు. అందుకే దేనికైనా హద్దులుండాలంటారు పెద్దలు. కానీ కొంతమంది తమ భాగస్వామిని అపరిమితంగా ప్రేమిస్తూ వారిపై అంతులేని ప్రేమ కురిపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి అపారమైన ప్రేమ మంచిదే అయినప్పటికీ ఒక్కోసారి దానివల్ల వైవాహిక బంధంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. దంపతుల మధ్య మితిమీరిన ప్రేమ వల్ల తలెత్తే ఆ ఇబ్బందులేంటి? వాటిని ఎలా పరిష్కరించుకోవాలి? మొదలైన విషయాలు మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
friends-for-7-years-dated-for-3-the-kajal-aggarwal-and-gautam-kitchlu-love-story

మూడేళ్ల ప్రేమ.. ఏడేళ్ల స్నేహం.. నూరేళ్ల బంధం!

కెరీర్‌ పరంగా వారిద్దరి దారులు పూర్తిగా భిన్నం.. అయినా మనసులు కలిశాయి.. ఏళ్ల పాటు స్నేహం చేశారు.. ప్రేమించుకున్నారు.. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నారు. మనసులోని ప్రేమను తెలుపుకోవడానికి ప్రత్యేకించి ప్రపోజల్‌ అవసరం లేదని, ఒకరి మనసులో ఒకరున్నారని తెలుసుకుంటే చాలనుకున్నారు. పందిరికి అల్లుకున్న మల్లెతీగలా కలిసిపోయిన వారు ఇటీవలే తమ ప్రేమ బంధాన్ని శాశ్వతమైన వివాహ బంధంగా మార్చుకున్నారు. ఆ క్యూట్‌ కపుల్‌ మరెవరో కాదు.. అందాల భామ కాజల్‌ అగర్వాల్‌ - వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లు. ‘చందమామ’ పెళ్లనగానే కుర్రకారు హృదయాలు ద్రవించిపోయాయి.. ‘అసలు తనది ప్రేమ పెళ్లా.. పెద్దలు కుదిర్చిన వివాహమా..?’ అంటూ చాలామంది మనసుల్లో ఎన్నో ప్రశ్నలు రేకెత్తాయి. ఒక్క ఇంటర్వ్యూతో వాటన్నింటికీ ఈ కొత్త పెళ్లికూతురు చెక్‌ పెట్టేసింది. ఇటీవలే ఓ మ్యాగజీన్‌కిచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రేమ-పెళ్లి గురించి బోలెడన్ని కబుర్లు పంచుకుందీ ‘డార్లింగ్‌’ బేబ్‌. మరి, ఈ మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ ప్రేమకథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
is-it-the-main-reason-for-me-to-not-getting-married??

నా పెళ్లి కుదరకపోవడానికి అదే కారణమా??

మేడమ్.. నా వయసు 32సం||. నేను నలుగురిలో కలిసిపోయి మాట్లాడలేను. చాలా మెతక స్వభావం. అలాగే తెలివితేటలు కూడా తక్కువని అనిపిస్తుంది. నా సమస్య ఏంటంటే.. కొన్ని సంవత్సరాల క్రితం నుంచి మా ఇంట్లో పెద్దవాళ్లు నాకు సంబంధాలు చూస్తున్నారు. ఐదేళ్ల క్రితం ఒక సంబంధం వచ్చింది. అన్నీ కుదిరాయి అనుకుంటున్న సమయంలో అతడికి ఏదో వ్యాధి ఉందని తెలియడంతో ఆ సంబంధం వదులుకున్నాం. ఆ తర్వాత మరొక సంబంధం కుదుర్చుకున్నాం. ఆ పెళ్లికొడుకు నాతో వారం రోజులు మాట్లాడిన తర్వాత వాళ్ల ఇంట్లో సమస్యల గురించి చెప్పాడు. అవి నచ్చక ఆ సంబంధం కూడా వదులుకున్నాం. ఆ తర్వాత నుంచి పెద్దలు సంబంధాలు చూడడం, కుదిరింది అనుకున్న తర్వాత వాళ్లు నాతో ఫోన్‌లో మాట్లాడడం.. నాకు నచ్చనివి ఏవో ఒకటి చెప్పడంతో నాకు నేనుగా చాలా సంబంధాలు వదులుకున్నా. పోనీ అసలు ఫోన్ మాట్లాడడం ఆపేద్దామని అనుకుంటే అవతలివాళ్లు ఎలాంటి వారో అని భయంగా ఉంది. ఏ సంబంధం చూసినా నాకు అనుకూలంగా లేదనే అనిపిస్తోంది. వచ్చే వ్యక్తితో సంతోషంగా ఉండలేను అనే అనిపిస్తోంది. అలాని నాకు పెళ్లంటే ఇష్టం లేదని కాదు. కానీ ఇలా ఎందుకు జరుగుతోందో నాకు కూడా అర్థం కావడం లేదు. మా ఇంట్లో పెద్దవాళ్లు కూడా నువ్వు అసలు పెళ్లి చేసుకుంటావా? ఆ ఉద్దేశం ఉందా? లేదా? అని తరచూ అడుగుతున్నారు. నా సమస్యకి పరిష్కారం చెప్పండి. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
actress-kajal-weds-gautham-kitchlu-in-telugu

కాజల్‌-గౌతమ్‌.. మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌!

మిస్‌ కాజల్‌ అగర్వాల్‌ మిసెస్‌గా ప్రమోషన్‌ పొందింది. తన ప్రియుడు గౌతమ్‌ కిచ్లుతో కలిసి ఏడడుగులు నడిచింది. కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక ముంబయిలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు షేర్ చేస్తున్నారు. మరి మూడుముళ్ల బంధంతో తన సరికొత్త ప్రయాణానికి నాంది పలికిన మన ‘చందమామ’ పెళ్లి విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
please-tell-me-how-to-convince-my-boyfriend-to-marry-me

అతడిని పెళ్లికి ఎలా ఒప్పించాలి?

మేడం.. నేను ఒకబ్బాయిని ప్రేమించా. కానీ ఇప్పుడు పెళ్లి వరకు వచ్చేసరికి అతను నన్ను కాదంటున్నాడు. కారణం అడిగితే- 'మా ఇంట్లో చూసిన అమ్మాయినే చేసుకుంటాను.. వేరే కులానికి చెందిన అమ్మాయితో పెళ్లికి మావాళ్లు ఒప్పుకోరు..' అంటున్నాడు. నేను మా ఇంట్లో మా ప్రేమ విషయం చెప్పా. అమ్మానాన్న కూడా మా పెళ్లికి అంగీకరించారు. కానీ అతడు పెళ్లికి నిరాకరించడంతో ఇద్దరం విడిపోయాం. ఇది జరిగి దాదాపు 8 నెలలు అవుతోంది. ఇప్పటికీ నేను తనని మరచిపోలేకపోతున్నాను. 24గం|| అతని ఆలోచనలే! ఎవరు ఎంత చెప్పినా.. వేరొకరిని నా జీవిత భాగస్వామిగా చేసుకునేందుకు నా మనసు అంగీకరించట్లేదు. గత 8 నెలలుగా రోజూ ఏడుస్తూనే ఉన్నా. ఈ ఆలోచనల కారణంగా తలనొప్పి రావడమే కాదు.. డిప్రెషన్‌లోకి కూడా వెళ్లిపోయా. నాకు చనిపోవాలని ఉంది. మావాళ్లు అతన్ని మరిచిపోయి వాళ్లు చూసిన సంబంధం చేసుకోమంటున్నారు. నాకు మాత్రం నేను ప్రేమించిన వ్యక్తినే పెళ్లాడాలని ఉంది. అతన్ని ఎలా మార్చుకోవాలో చెప్పగలరు. అలాగే ప్రస్తుతం నేనున్న పరిస్థితి నుంచి బయటపడడానికి మార్గం కూడా సూచించగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
old-couple-meet-after-215-days-due-to-corona-pandemic
women icon@teamvasundhara
couple-do-some-these-things-for-their-friendship-alive

ఆలుమగల స్నేహం ఆజన్మాంతం నిలవాలంటే..!

'ఎన్నెన్నో జన్మల బంధం నీదీ-నాదీ..' అన్నట్లుగా.. భార్యాభర్తల బంధం అంటేనే జన్మజన్మల అనుబంధం. మరి అది ఎప్పటికీ నిత్యనూతనంగా ఉండాలంటే.. ఇద్దరి మధ్య మమతానురాగాలు, ప్రేమ, ఆప్యాయతలు.. వంటివి ఎంత ముఖ్యమో.. ఇద్దరి మధ్య స్నేహబంధం బలంగా ఉండడం కూడా అంతే కీలకం. ఆలుమగల మధ్య ఉండే ఏ చిన్న దూరాన్నైనా దగ్గరచేసి వారి ప్రేమను శాశ్వతం చేసే శక్తి స్నేహానికి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. దంపతుల్ని ఒక్కటి చేసే ఈ స్నేహబంధం వారి మధ్య కలకాలం నిలిచిపోవాలంటే వారిరువురూ కలిసి చేయాల్సిన పనులు కొన్నున్నాయంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
actress-anita-confirms-pregnancy-with-hilarious-video

అవును... మేం తల్లిదండ్రులం కాబోతున్నాం!

త్వరలో తమకు పుట్టబోయే బుజ్జి పాపాయిని వూహించుకోవడం, ఎప్పుడెప్పుడు తమ ముద్దుల చిన్నారిని చేతుల్లోకి తీసుకుందామా అని ఆత్రంగా ఎదురుచూడడం... ఇలా ప్రతిక్షణం పుట్టబోయే బిడ్డ ఆలోచనల్లోనే గడపడం తల్లయ్యే ప్రతి మహిళకు సహజమే. ప్రస్తుతం అలాంటి మధురానుభూతినే ఆస్వాదిస్తోంది అనిత హస్సానందాని. ‘నువ్వు-నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అందాల తార 2013లో రోహిత్‌ రెడ్డితో కలిసి ఏడడుగులు నడిచింది. ఈ క్రమంలో పెళ్లయిన తర్వాత సుమారు ఏడేళ్ల తర్వాత అమ్మగా ప్రమోషన్‌ పొందనున్న ఆమె, సోషల్‌ మీడియా వేదికగా అందరితో ఈ శుభవార్తను షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
ways-to-choose-the-right-life-partner-in-telugu
women icon@teamvasundhara
meghana-raj-shares-pics-from-her-baby-shower-late-husband-chiranjeevi-is-also-part-of-it

చిరూ... ఇదే కదా నువ్వు కోరుకున్నది!

అతనితో ఆమెది పదేళ్ల ప్రేమ బంధం. రెండేళ్ల దాంపత్య బంధం. ఆ ప్రేమ బంధానికి ప్రతి రూపంగా ఒక పండంటి బిడ్డను కూడా తమ లైఫ్‌లోకి ఆహ్వానించాలనుకుంది. ఇక తన జీవితంలో అంతా ఆనందమయమే అనుకుంది. కానీ అన్నీ అనుకున్నట్లు జరిగితే అది జీవితమెందుకు అవుతుంది? భర్తతో కలిసి నిండు నూరేళ్లు జీవించాలనుకున్న ఆమె కలలు భర్త హఠాన్మరణంతో కల్లలయ్యాయి. కొన్ని నెలల క్రితం గుండెపోటుతో కన్నుమూసిన కన్నడ నటుడు చిరంజీవి సర్జా సతీమణి మేఘనా రాజ్‌ విషాదాంత ప్రేమకథ ఇది. భర్త మరణించే నాటికి మూడు నెలల గర్భంతో ఉన్న మేఘన సీమంతం వేడుక తాజాగా జరిగింది. అయితే ఈ వేడుకల్లో చిరంజీవి కూడా పాలుపంచుకున్నారు.. ఎలాగంటారా? అయితే ఇది చదవండి..

Know More

women icon@teamvasundhara
neena-gupta-reveals-why-she-decided-to-get-married-at-50-and-daughter-masaba-reaction-to-it

అందుకే నేను రెండోసారి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది!

మన కాళ్ళ పైన మనం నిలబడినా, ఎంత అభివృద్ధి సాధించామనుకుంటున్నా- ఇప్పటికీ భర్తకు దూరంగా ఉన్న మహిళలు, వితంతువులు, ఒంటరి తల్లులను సమాజం కొంత చులకన భావనతోనే చూస్తుంది. ఎన్నో అవమానాలకు గురి చేస్తుంది. అందుకే నలుగురిలో తలెత్తుకుని నడవాలంటే ఇప్పటికీ మహిళలకు ఓ తోడు తప్పనిసరే అవుతోంది. ఈ నేపథ్యంలో తాను కూడా సమాజంలో గౌరవంగా బతికేందుకే రెండో వివాహం చేసుకున్నాను అంటున్నారు నీనా గుప్తా. వైవిధ్యమైన నటనతో నాలుగు దశాబ్దాలుగా బాలీవుడ్‌ ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ అలనాటి అందాల తార వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నారు. ఎలాంటి భేషజాలు, సంకోచం లేకుండా ముక్కుసూటిగా మాట్లాడే ఆమె... తాజాగా తన రెండో వివాహం, కూతురు మసాబా గురించి పలు ఆసక్తికర విషయాలను అందరితో షేర్‌ చేసుకున్నారు.

Know More

women icon@teamvasundhara
habits-of-people-who-make-friends-easily-in-telugu
women icon@teamvasundhara
psychologist-advice-on-love-problem-in-telugu

ఆ అబ్బాయిని నేను మతాంతర వివాహం చేసుకోవడం కరక్టేనా?

హాయ్‌ మేడమ్.. నా వయసు 23 సంవత్సరాలు. నేనొక అబ్బాయిని ప్రేమిస్తున్నాను.. అయితే మా ఇద్దరి మతాలూ వేరు.. నాకోసం అతను మా మతంలోకి మారాడు. మా ఇంట్లో వాళ్లతో కూడా మాట్లాడి పెళ్లికి ఒప్పించాడు. కానీ ఈ మధ్య తనతో నా జీవితం ఎలా ఉంటుంది? భవిష్యత్తులో ఏవైనా సమస్యలు వస్తాయా? అన్న ఆలోచనలు వస్తున్నాయి. తన మీద నాకు నమ్మకం ఉంది.. బాగా చూసుకుంటాడు.. కానీ అప్పుడప్పుడు డిఫరెంట్‌గా ప్రవర్తిస్తుంటాడు. చిన్న చిన్న విషయాలకే నేను సహకరించడం లేదని కోపగించుకోవడం, గొడవ పడడం చేస్తుంటాడు. తను ఇంకా సెటిల్‌ అవ్వలేదు. జాబ్‌ గురించి వెయిట్‌ చేస్తున్నాడు. నేను బీపీవోలో వర్క్‌ చేస్తున్నాను. పెళ్లయ్యాక కూడా జాబ్‌ చేస్తాను. వాళ్లది పేద కుటుంబం. సొంత ఇల్లు కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేను అతనిని మతాంతర వివాహం చేసుకోవడం కరక్టేనా?దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
simple-steps-to-being-a-happier-couple-in-telugu

కాస్త రొమాన్స్ కూడా జోడించాల్సిందే..!

'నీ జతగా నేనుండాలి.. నీ ఎదలో నే నిండాలి.. నీ కథగా నేనే మారాలి..' అనే పాట తరహాలో దంపతులిద్దరూ జీవితాంతం ఒకరికొకరు తోడూ నీడగా ఉంటూ, ఒకరి మనసులో మరొకరు నిండిపోతూ, ఒకరి వూపిరి మరొకరై ముందుకు సాగుతుంటే.. ఆ బంధం ఎప్పటికీ నిత్యనూతనమవుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. భార్యాభర్తలంటే కేవలం ప్రేమను పంచుకోవడం మాత్రమే కాదు.. ఒకరి అభిరుచుల్ని మరొకరు గౌరవించుకోవడం, ఒకరికి బాధ కలిగితే మరొకరు 'నేనున్నా'నంటూ ఓదార్చడం... మీదైన ప్రత్యేక శైలిలో సర్‌ప్రైజ్ చేయడం.. వంటివి కూడా ముఖ్యమే. అయితే వీటికి కొంత రొమాన్స్ కూడా జోడిస్తే ఆ బంధంలోని మధురానుభూతి శిఖరాగ్రానికి చేరుతుంది. మరి అదెలాగో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
dealing-with-pouting-partner-in-telugu

'అలక' తీర్చడంలోనే ఉంది అసలైన ప్రేమ!

'అలిగితివా.. సఖీ.. ప్రియా.. కలత మానవా..' 'కోపమా నాపైనా.. ఆపవా ఇకనైనా..' ఇలా పాడుకుంటూ భార్యాభర్తలిద్దరూ ఒకరి అలక మరొకరు తీరుస్తుంటే ఎంత ముచ్చటగా ఉంటుందో కదండీ! సంసారమన్నాక అప్పుడప్పుడూ చిరు కోపాలు, తాపాలు, అలకలు.. మామూలే. నిజంగా చెప్పాలంటే భార్యాభర్తల బంధంలో ప్రేమకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో.. ఇలాంటి చిర్రుబుర్రులకు కూడా అంతే ప్రాముఖ్యం ఉంటుంది. అప్పుడప్పుడూ ఇలాంటి చిలిపి తగాదాలు, బుంగమూతి పెట్టడాలు చేస్తేనే ఒకరిపై మరొకరికి ఎంత ప్రేముందో అర్థమవుతుంది. తద్వారా ఆ బంధం మరింత బలపడుతుంది. అయితే అలగడం వరకూ బాగానే ఉంటుంది కానీ అది తీర్చడానికి మాత్రం కష్టపడాల్సిందే.. ఇంతకీ భాగస్వామి అలక తీర్చే మార్గాలేంటో మీకు చెప్పనే లేదు కదూ!! ఇదిగో ఇవే.

Know More

women icon@teamvasundhara
due-to-various-family-problems-i-am-getting-suicidal-tendencies-how-to-overcome-it

నా ముందే అమ్మ అలా.. భరించలేకపోతున్నాను.. ఏం చేయాలి?

హలో మేడం. నేను చాలా అయోమయంలో ఉన్నాను. మా అమ్మ తన ఎక్స్‌లవర్‌తో రిలేషన్ మెయింటైన్ చేస్తోంది. ఆయనకు నేనంటే నచ్చదు. కాబట్టి వాళ్లు నన్ను భారంగానే ఫీలవుతారు. ఇక, మా నాన్న వేరే ఆమెని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు. నేను నా కుటుంబానికి దూరంగా హాస్టల్లో ఉంటాను. లాక్ డౌన్ సమయంలో ఇంటికొచ్చాను. అయితే నేను ఉన్నానని కూడా చూడకుండా అమ్మావాళ్లు చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. భరించలేకపోతున్నాను. ఈ విషయాలన్నీ చెప్పుకోవడానికి నాకు ఎవరూ లేరు.. ఉన్నా అన్నీ చెప్పుకోలేను కూడా. అందుకే నాలో నేనే కుమిలిపోతున్నాను.

Know More

women icon@teamvasundhara
my-boyfriend-rejected-me-after-two-years-relationship-what-to-do?

రెండేళ్ల రిలేషన్ తర్వాత కుజ దోషం ఉందని వద్దంటున్నాడు!

మేడమ్‌.. నేను ఒక అబ్బాయితో రెండు సంవత్సరాలుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. పెళ్లి చేసుకుందామని ఫిక్స్‌ అయ్యాం. కరోనా వల్ల కొంత గ్యాప్‌ వచ్చింది. ఇప్పుడేమో ‘నువ్వు వద్దు.. మా తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు.. జాతకంలో కుజ దోషం ఉంది’ అని మాట మారుస్తున్నాడు. మేము కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు చాలా ఉన్నాయి. నేను జరిగిందంతా ఒక లాయర్‌కి చెప్పాను. ఆయన కేస్‌ ఫైల్‌ చేయిద్దాం అంటున్నారు. ఆ అబ్బాయి ‘నీ మీద మనసు విరిగిపోయింది.. ఏం చేసినా పెళ్లి చేసుకోను పో’ అంటున్నాడు. తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
gutta-jwala-engaged-to-hero-vishnu-in-telugu

మా ఇద్దరి జీవితాలకు కొత్త ఆరంభమిది!

కెరీర్‌ పరంగా ఎన్నో విజయాలు సాధించిన వారిద్దరూ ఓ పెళ్లి వేడుకలో మొదటిసారిగా కలుసుకున్నారు. దాంపత్య జీవితానికి సంబంధించి గతంలో వారిద్దరికీ చేదు అనుభవాలే ఎదురుకావడంతో ఆ కొత్త పరిచయం వారికో కొత్త అనుభూతినిచ్చింది. ఒకరి మనసులోకి మరొకరు చొచ్చుకుపోయేలా చేసింది. వారి వైవాహిక జీవితాలు మిగిల్చిన చేదు అనుభవాలను మరిచిపోయేలా చేసింది. ఇక పెళ్లితో తమ అనుబంధాన్ని మరింత శాశ్వతం చేసుకోవాలనుకున్న ఆ జంట మరో ముందడుగేసింది. వారే స్టార్‌ షట్లర్‌ గుత్తా జ్వాల- తమిళ హీరో విష్ణు విశాల్‌. రెండేళ్ల నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ అందాల జంట తాజాగా ఉంగరాలు మార్చుకుంది. ఈ సందర్భంగా త్వరలో కొత్త జీవితం ప్రారంభించనున్న ఈ జోడీకి పలువురు ప్రముఖులతో పాటు నెటిజన్లు అభినందనలు చెబుతున్నారు.

Know More