scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఈ ఇద్దరిలో ఎవరి ప్రేమను అంగీకరించాలి? మీరే చెప్పండి!'

'ఏదైనా సరే కంటికింపుగా లేకపోతే మనసుకు నచ్చదంటారు. మరి ప్రేమ సంగతి ఏంటి ? ఒకరికి మనపై ఉండే ప్రేమ కూడా అంతేనా ? చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటేనే మనసుకు నచ్చుతామా ? ఈలోకంలో ఒక అమ్మాయి, అబ్బాయి తమ అభిప్రాయాలు ఒకటే కావడం వల్ల, ఒకరికొకరు నచ్చి ప్రేమలో పడుతున్నారా? లేక కేవలం ఆకర్షణతోనే ఒక్కటవుతున్నారా? ఇలా ప్రేమ గురించి తికమకపడుతూ సతమతమవుతోంది రాగిణి. ఇందుకు కారణం... ఉన్నట్టుండి ఇద్దరు యువకులు ఆమెకు తమ మనసులోని ప్రేమను తెలపడమే ! ఒకరు తొలుత తాను ప్రేమించిన వ్యక్తి అయితే.. మరొకరు తనను ప్రేమించిన వ్యక్తి. అందుకే ఇద్దరిలో ఎవర్ని ఎంచుకోవాలో అర్థం కాక మన సహాయం కోరుతోంది రాగిణి. ఆమె హృదయరాగమేంటో ఓసారి విని మీ అభిప్రాయంతో ఆమెకో పరిష్కారాన్ని చూపండి !'

Know More

Movie Masala

 
category logo

నాకు నీతో కలిసి జీవించడం మాత్రమే తెలుసు!

Anasuya celebrates her tenth wedding anniversary in Telugu

అనసూయా భరద్వాజ్‌... తెలుగు నాట సినిమా స్టార్స్‌తో సమానంగా క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ స్టార్‌ యాంకర్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఓ వైపు బుల్లితెరపై రాణిస్తూనే... మరోవైపు బిగ్‌ స్ర్కీన్‌పై ‘రంగమ్మత్త’ లాంటి పాత్రలతో సినీ అభిమానులను అలరిస్తోందీ అందాల సుందరి. సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉండే ఆమె తన వృత్తిగత, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పోస్టులను షేర్‌ చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సోషల్‌ మీడియా వేదికగా తన భర్తకు శుభాకాంక్షలు తెలుపుతూ కొన్ని ఆసక్తికరమైన పోస్టులు షేర్‌ చేసింది.


19 ఏళ్ల ప్రేమ, 10 ఏళ్ల దాంపత్య బంధం!
బుల్లితెరపై క్రేజీ యాంకర్‌గా గుర్తింపు సొంతం చేసుకున్న అనసూయ పదేళ్ల క్రితం సుశాంక్‌ భరద్వాజ్‌తో కలిసి పెళ్లిపీటలెక్కింది. అంతకు ముందు తొమ్మిదేళ్లు ప్రేమలో మునిగితేలిన ఈ అందాల జంట పదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు(జూన్‌5) వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. వీరిద్దరి పదేళ్ల ప్రేమకు గుర్తుగా అయాన్ష్‌, శౌర్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈక్రమంలో తమ పదో వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సోషల్‌ మీడియా ద్వారా తన భర్తకు శుభాకాంక్షలు తెలిపింది అనసూయ. ముందుగా ట్విట్టర్‌ వేదికగా ‘ 19 ఏళ్ల ప్రేమ బంధం! 10 ఏళ్ల వైవాహిక బంధం! నా జీవిత భాగస్వామి సుశాంక్‌కు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మన బంధం ఇలాగే శాశ్వతంగా కొనసాగాలని కోరుకుంటున్నా’ అంటూ లవ్‌ ఎమోజీలను పోస్ట్‌ చేసింది.


నా బలం..బలహీనత అన్నీ నువ్వే!
అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన భర్త సుశాంక్‌తో సరదాగా దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ ఇలా రాసుకొచ్చింది ‘నా బలం.. నా బలహీనత.. నా భయం.. నా బ్యాలన్స్‌.. అన్నీ నువ్వే! నువ్వు లేకపోతే ఏం చేసేదాన్నో నాకే తెలియదు. ప్రతిసారీ మనం పోట్లాడుకున్నప్పుడు మరెప్పుడూ నీతో మాట్లాడకూడదని అనుకుంటాను. కానీ నేనొక ఫూల్‌ని! నాకు నీతో కలిసి జీవించడం మాత్రమే తెలుసు. అంతకుమించి నాకు మరొకటి తెలియదు. మన ప్రేమ బంధానికి సంబంధించి ఇది పదో వివాహ వార్షికోత్సవం కావొచ్చు. కానీ మన బంధం ఎప్పటికీ ఇలాగే శాశ్వతంగా ఉంటుందని నాతో పాటు నీకు కూడా తెలుసు. థానోస్‌ ఇన్ఫినిటీ స్టోన్స్‌ను ప్రేమించినంత గొప్పగా నేను నిన్ను ప్రేమిస్తున్నా!’ అని తన భర్తపై ఉన్న ప్రేమకు అక్షర రూపమిచ్చింది అనసూయ.

View this post on Instagram

Pati Patni aur Mausam♥️🧿🌫

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on


పతీ, పత్నీ ఔర్‌ మౌసమ్‌!
ఇక మరో పోస్టులో భాగంగా ఆహ్లాదకర వాతావరణంలో తన భర్తతో దిగిన ఫొటోలను షేర్‌ చేస్తూ ‘పతీ, పత్నీ ఔర్‌ మౌసమ్‌’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది!


ప్రపంచాన్ని కాపాడుకుందాం..!
టీవీ షోలు, సినిమాలతో నిత్యం బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడూ సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటుంది అనసూయ. ఈ నేపథ్యంలో ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ పురస్కరించుకుని మొక్కలు నాటిందామె. అనంతరం వాటికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ అందరం కలిసి ఈ ప్రపంచాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చింది.


అది సరైన పద్ధతి కాదు!
ప్రస్తుతం సినిమా ఇండస్ర్టీలో ‘ఫ్యాన్స్‌ వార్‌’ ముదురుతోంది. స్టార్‌ హీరోల అభిమానులు పరస్పరం కించ పరుచుకుంటూ, ఇతర హీరోలు, హీరోయిన్లపై అసభ్యకర కామెంట్లు పెడుతున్నారు. తాజాగా ‘బంగారం’ హీరోయిన్‌ మీరా చోప్రా కూడా ఇలాంటి వేధింపులకు గురైంది. ఈక్రమంలో తన ఫ్యాన్స్‌కు సంబంధించి ఓ వీడియోను పోస్ట్‌ చేసింది అనసూయ.

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on


అందరికీ థ్యాంక్స్‌!
‘హాయ్ ఫ్రెండ్స్‌ ఎలా ఉన్నారు? ఎలాంటి షూటింగ్‌లు లేకపోవడంతో నేనయితే చాలా ఖాళీగా ఉన్నాను(నవ్వుతూ). అయితే అందరికో గుడ్‌ న్యూస్‌. మరో పది, పదిహేను రోజుల్లో మా షూట్‌లు మళ్లీ మొదలవుతాయి. షెడ్యూల్స్‌ కూడా ప్రిపేర్‌ చేసుకుంటున్నాం. అప్పటివరకు ఇలా సోషల్‌ మీడియా ద్వారా అందరికీ టచ్‌లోనే ఉంటాం. ఇందులో భాగంగా ఈరోజు ‘థ్యాంకింగ్‌’ అనే విషయంపై మాట్లాడాలని మీ ముందుకొచ్చాను. ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నా అభిమానులే..! కాబట్టి ముందుగా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక ప్రతిరోజూ నేను సూర్యోదయాన్ని చూసే అవకాశం కల్పించిన దేవుడికి కూడా ధన్యవాదాలు. వీరితో పాటు మంచిగానో, చెడుగానో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌ చెబుతున్నాను. గత వారం నుంచి సినిమా ఇండస్ర్టీలో ‘ఫ్యాన్స్ వార్‌’ అన్న పదం బాగా వినిపిస్తోంది. నా 11 ఏళ్ల ఈ కెరీర్‌ను ఒకసారి విశ్లేషించుకుంటే ‘ఫ్యాన్‌’ అన్న పదం బాగా మారిపోయింది. సినిమా సెలబ్రిటీలను అతిగా ఆరాధించడం, ఇతర హీరోలు, హీరోయిన్లపై అసభ్యకర కామెంట్లు చేయడం ఇందులో భాగమే. గతంలో కొన్ని సామాజిక విషయాలపై నేను స్పందించినప్పుడు కొందరు నాతోపాటు నా పిల్లలు, నా భర్తపై అసభ్యకర కామెంట్లు చేశారు. సినిమా ఇండస్ర్టీలో చాలామంది ఎంతో కష్టపడి స్వయం కృషితో ఎదిగిన వారే. అలాంటి వారిపై ‘ఫ్యాన్స్‌ క్లబ్‌ ’ పేరుతో ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేయడం సరైన పద్ధతి కాదు’ అని చెప్పుకొచ్చిందీ క్రేజీ యాంకర్‌.

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on


నా ఫ్యాన్స్‌ అంతా నా కుటుంబ సభ్యులే!
ఈ సందర్భంగా ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు పలు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్ లలో తన పేరుతో ఉన్న ఫ్యాన్స్‌ క్లబ్‌ పేజీలు, గ్రూపులను ఒక్కొక్కటిగా చదువుతూ వారందరికీ థ్యాంక్స్‌ చెప్పింది అనసూయ. ‘నా ఫ్యాన్స్‌ను ఎప్పుడూ నా కుటుంబ సభ్యుల్లాగానే భావిస్తాను. అయితే నా ఫ్యాన్స్‌ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. ఎందుకంటే నా అభిమానులు నా పేరుతో ప్రత్యేకంగా క్రియేట్‌ చేసుకున్న ఫ్యాన్స్‌ పేజీలు, సోషల్‌ మీడియా గ్రూపుల్లో వేరే వారి గురించి ఎలాంటి దూషణలు, అసభ్యకర కామెంట్లు లేవు. నాకిలాంటి అభిమానులు ఉన్నందుకు నేనెంతో అదృష్టవంతురాలిని’ అని చెప్పుకొచ్చిందీ అందాల తార.

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on





gynecologist Ask Psychology Expert
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి


Know More

women icon@teamvasundhara
my-husband-neglects-me-what-to-do?

పాప పుట్టినా ఆయనలో మార్పు రాలేదు.. ఏం చేయమంటారు?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఏడు సంవత్సరాలు అవుతోంది. మా ఆయనకు నలుగురు అక్కలు, ఆయన ఒక్కరే. పెళ్లైన తర్వాత మొదటి నాలుగు సంవత్సరాలు వాళ్ల అక్కల డెలివరీలు.. ఆ పిల్లల మొదటి పుట్టిన రోజు వేడుకలు.. ఇలాగే గడిచిపోయింది. మా ఆయన అక్కలకు, అత్తమామలకు రోజూ సేవ చేయాలి. లేకుంటే నన్ను బెదిరించేవారు. మా అమ్మ వాళ్ల ఇంట్లో వదిలేసేవారు. పంచాయతీ పెట్టి మా అత్తగారు ఎలా చెప్తే అలా వింటే తీసుకెళ్లడం చేశారు. ఇదంతా భరించలేక షీటీమ్స్‌ని కలిశాను. వారు మమ్మల్ని కౌన్సెలింగ్‌ చేసి ఒక సంవత్సరం వరకు మా ఇద్దరినీ ఎవరూ డిస్టర్బ్‌ చేయొద్దని చెప్పారు. నన్ను తిరిగి తీసుకెళ్లాక అత్తమామలు మా ఆయనతో మాట్లాడడం మానేశారు. దాంతో ఆయన కూడా నాతో కొన్ని రోజులు మాట్లాడడం మానేశాడు.

Know More

women icon@teamvasundhara
ways-to-get-closer-to-your-partner-in-telugu

ఒకరికొకరు దగ్గరయ్యే దారులెన్నో!

దాంపత్య బంధంలో ప్రతి క్షణమూ భార్యాభర్తలిద్దరికీ ఎన్నో మరపురాని మధురానుభూతుల్ని పంచుతుంది. ఇక పెళ్త్లెన కొత్తలో అయితే ఇలాంటి మధుర భావనలకు అంతుండదంటే అది అతిశయోక్తి కాదు. 'నువ్వు లేకుండా నేనొక్క క్షణం కూడా ఉండలేను' అన్న రీతిలో ఒకరినొకరు కాసేపైనా వదిలిపెట్టకుండా సమయం గడుపుతుంటారు కొందరు. అదే మరికొందరైతే పెళ్త్లె పట్టుమని పది రోజులు కూడా గడవక ముందే పని.. పని.. అంటూ తమ ఉద్యోగంపైనే శ్రద్ధ చూపిస్తుంటారు. ఫలితంగా భాగస్వామికి దగ్గర కావడానికి కూడా ప్రయత్నించరు. దీంతో తొలిరోజుల్లోనే వారి అనుబంధంలో అసంతృప్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఇది తర్వాత మరింత పెరిగే ప్రమాదమూ లేకపోలేదు. కాబట్టి పెళ్త్లెన నాటి నుంచే దంపతులిద్దరూ వారి ఉద్యోగానికి ఓవైపు సమయం కేటాయిస్తూనే.. మరోవైపు ఒకరితో మరొకరు వీలైనంత ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించడం మంచిది. ఈ నేపథ్యంలో భార్యాభర్తలిద్దరిలో ఒకరికొకరు దగ్గరగా ఉన్నామనే భావన కలగడానికి కొన్ని పద్ధతులను పాటించాలంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
i-am-suffering-from-my-sister-problem-what-to-do?

అక్క సమస్య నన్ను ఇబ్బంది పెడుతోంది.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు ఇద్దరు అక్కలు ఉన్నారు. నేనే చిన్నదాన్ని. మా పెద్దక్కకి మూడు సంవత్సరాల క్రితం పెళ్లయింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆమె భర్త, అత్తమామల నుంచి వేధింపులు ఎదుర్కొంటోంది. ఆ గొడవలన్నీ నా కళ్లెదుటే జరిగాయి. అవి నా మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దానివల్ల నేను మిగతా విషయాల్లో ఏకాగ్రత చూపలేకపోతున్నాను. అంతేకాదు.. మా రెండో అక్కకి, నాకు పాతికేళ్ళు వస్తున్నాయి. ఇప్పటికీ పెద్దక్క సమస్యలు తీరకపోవడంతో మా తల్లిదండ్రులు మాకు పెళ్లి చేయాలంటేనే భయపడుతున్నారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి. నా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి. సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
why-too-much-attachment-is-bad-for-love-life

అది హద్దుల్లో ఉంటేనే ముద్దు..!

ప్రేమ.. ఇద్దరు వ్యక్తుల మనసులను ముడిపెట్టే ఈ సాధనం.. మితిమీరితే అవే మనసుల మధ్య మంటలు కూడా పుట్టించగలదు. అందుకే దేనికైనా హద్దులుండాలంటారు పెద్దలు. కానీ కొంతమంది తమ భాగస్వామిని అపరిమితంగా ప్రేమిస్తూ వారిపై అంతులేని ప్రేమ కురిపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి అపారమైన ప్రేమ మంచిదే అయినప్పటికీ ఒక్కోసారి దానివల్ల వైవాహిక బంధంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. దంపతుల మధ్య మితిమీరిన ప్రేమ వల్ల తలెత్తే ఆ ఇబ్బందులేంటి? వాటిని ఎలా పరిష్కరించుకోవాలి? మొదలైన విషయాలు మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
i-dont-want-to-get-married-my-parents-are-not-listening-me-what-to-do?

పెళ్లొద్దంటున్నా మా పేరెంట్స్ వినడం లేదు... ఏం చేయాలి?

మేడమ్‌.. నా వయసు 28 సంవత్సరాలు. నా సమస్యల్లా నా తల్లిదండ్రులే. వారు నా కెరీర్‌ కోసం ఎంతో సహాయం చేశారు. కానీ వారి ఆలోచనలు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాయి. నచ్చని విషయాల్లో నన్ను బలవంతపెట్టడం నాకు అస్సలు ఇష్టముండదు. గత కొన్నేళ్లుగా ఇలాంటి పరిస్థితులు నన్ను ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఇదే విషయాన్ని వారికి చెబితే దాన్ని ఓ జోక్‌లా తీసిపారేస్తున్నారు. అంతేకాదు.. నేను ఎమోషనల్‌ డ్రామా ఆడుతున్నానని అంటున్నారు. అయినా సహిస్తున్నా వారు లెక్కచేయట్లేదు. ‘ఇప్పుడు నీ టైం బాలేదు.. పెళ్లి చేస్తే అన్నీ సర్దుకుంటాయ’ని అంటున్నారు. కానీ పెళ్లి చేసుకొని బాధ్యతలు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు ఒంటరిగా బతకాలని ఉంది. ఈ విషయం చెబితే వాళ్లు కటువుగా మాట్లాడుతున్నారు. దయచేసి సలహా ఇవ్వగలరు.

Know More

women icon@teamvasundhara
sakshi’s-sweet-and-lovable-birthday-wishes-to-husband-dhoni
women icon@teamvasundhara
my-spouse-is-spying-on-me-what-to-do?

మా ఆయన ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావట్లేదు!

హాయ్‌ మేడమ్‌.. నాకు పెళ్లై 8 సంవత్సరాలు అవుతోంది. నాలుగేళ్ల పాప కూడా ఉంది. ఈ మధ్య నా భర్త చేష్టలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. ఆయన ఐటీ సెక్టర్‌లో పని చేస్తుంటారు. ఆయన ప్రవర్తన చూస్తుంటే నా ఫోన్‌ హ్యాక్‌ చేశాడేమో అనిపిస్తోంది. ఆయన్ని టెస్ట్‌ చేద్దామని నేను ఓ రోజు నా ఫ్రెండ్‌తో ఫోన్లో మాట్లాడాను. మేము ఏదైతే ఫోన్లో మాట్లాడుకున్నామో ఆయన అవే విషయాలను నా దగ్గర ప్రస్తావిస్తున్నాడు. అడిగితే కొలీగ్‌తో జరిగిన డిస్కషన్‌ అని చెబుతున్నాడు. నేను ఒకవేళ ఫోన్‌ వాడకుండా పక్కన పెట్టేస్తే ఆ రోజంతా బాగానే ఉంటున్నాడు. ఇలా ఆయన వింత ప్రవర్తన వల్ల నాకు ఒత్తిడి, ఆందోళన మొదలయ్యాయి. నేనంటే తనకు ఇష్టమే.. అయినా ఇదంతా ఎందుకు చేస్తున్నాడో అర్థం కావడం లేదు. ఈ సమస్య నుంచి నేనెలా బయటపడాలి?

Know More

women icon@teamvasundhara
bedtime-rules-for-happy-couple

పడక గదే ప్రణయతీరం!

భార్యాభర్తల బంధం.. అదో మధురమైన అనుబంధం. ఆ బంధాన్ని పటిష్టం చేసే అంశాలు చాలానే ఉంటాయి. ముఖ్యంగా రొమాన్స్, ఒకరితో ఒకరు ఏకాంతంగా గడపడం.. వంటివి వాటిలో మరింత కీలకమైనవి. అయితే పగలంతా ఎవరి పనుల్లో వారు నిమగ్నమవడంతో ఇరువురూ కలిసి గడిపేందుకు కాస్త సమయమైనా దొరక్కపోవచ్చు. అలాంటప్పుడు ఇందుకు సరైన సమయం రాత్రి.. సరైన ప్రదేశం పడకగదే..! మరి అంతటి విలువైన సమయాన్ని భాగస్వామి కోసం కేటాయించి, పడకగదిని ప్రణయతీరంగా మార్చుకోవాలంటే దంపతులు అలవర్చుకోవాల్సిన విషయాలు కొన్నున్నాయంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. వీటితో ఆలుమగల అనుబంధం ఆజన్మాంతం శాశ్వతమవుతుందని సూచిస్తున్నారు. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
how-to-overcome-my-fear?

అమ్మ వల్లే అలా జరిగింది.. ఆ భయం పోయేదెలా?

నమస్తే మేడమ్.. నాకు పెళ్త్లె 3 సంవత్సరాలైంది. నా భయమే నా సమస్య. చిన్నప్పుడు నేను ధైర్యంగానే ఉండేదాన్ని. ఎవరైనా ఏమైనా అంటే వాళ్లకు తగ్గట్టే సమాధానం ఇచ్చేదాన్ని. కానీ, మా అమ్మ నన్ను 'అలా మాట్లాడకూడదు.. ఇలా మాట్లాడకూడదు..' అని నా మనసుని సున్నితంగా మార్చింది. అలాగే కొన్ని పరిస్థితులు, కొంతమంది మాటలు, ప్రవర్తన వల్ల మరింత సెన్సిటివ్‌గా మారాను. ధైర్యం కూడా కోల్పోయాను. ఇప్పుడు కొంతమందిని చూస్తేనే భయం వేస్తోంది. నేను ఫోన్లో మాట్లాడినా, నా పక్కనున్న వాళ్లు వేరే వాళ్లతో కాల్ మాట్లాడుతున్నా నాకు గుండె దడ వస్తుంది.. చేతులు వణికిపోతుంటాయి. వాళ్లను తలచుకుంటే కోపం, ఏడుపు వచ్చేస్తుంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
signs-how-to-know-you-will-be-happy-in-marriage-life-in-telugu

ఇలా ఉంటే మీరు వారి గుండెల్లో ఉన్నట్లే!

'నీ జతగా నేనుండాలి.. నీ ఎదలో నే నిండాలి.. నీ కథగా నేనే మారాలి..' ఏ దంపతులైనా ఇంత అన్యోన్యంగా, ప్రేమగా కలిసి ఉండాలని, ఎలాంటి అరమరికల్లేకుండా తమ సంసార నావ హాయిగా ముందుకు సాగిపోవాలని కోరుకుంటారు. అయితే భాగస్వామిలో కొన్ని లక్షణాలు కనిపిస్తే వాటి ద్వారా వారితో జీవితం అంతా సంతోషంగా జీవించగలమా? లేదా? అనే విషయంలో ఒక అంచనాకి రావచ్చంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. ఈ లక్షణాలు భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా మెలిగేందుకు బాగా ఉపకరిస్తాయట! అంతేనా.. ఇవి వారి మధ్య ఉన్న ప్రేమని రెట్టింపు చేసి బంధాన్ని మరింత దృఢపరుస్తాయట! ఇంతకీ ఆ లక్షణాలేంటో ఓసారి మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
newly-wed-couple-donates-50-beds-oxygen-cylinders-to-rural-hospital-in-maharashtra

అందరూ బాధలో ఉన్నారని తమ సంతోషాన్ని వదులుకున్నారు!

మనం ఏ విషయంలోనైనా రాజీ పడతామేమో గానీ పెళ్లి విషయంలో మాత్రం అస్సలు రాజీ పడం. వరుడి దగ్గర్నుంచి.. కల్యాణ మంటపం దాకా అన్నీ మనకు నచ్చినవే ఎంచుకుంటాం. ఇక ‘నా పెళ్లికి అంతమందిని పిలవాలి.. ఇంత ఘనంగా చేయాల’ని మన పేరెంట్స్‌కి ఆర్డర్‌ కూడా పాస్‌ చేస్తుంటాం. అయితే కరోనా రాకతో అందరి పెళ్లి కలలు తారుమారైపోతున్నాయి. ఈ క్రమంలో కొందరు ఏదో తూతూ మంత్రంగా పెళ్లి తంతు కానిచ్చేస్తుంటే.. మరికొందరు ఈ వేడుకను వాయిదా వేసుకుంటున్నారు. ఇంకొందరేమో సింపుల్‌గా పెళ్లి చేసుకొని.. మిగిలిన డబ్బుల్ని కరోనా బాధితుల కోసం విరాళంగా అందిస్తు్న్నారు. ఈ మూడో కోవలోకే చెందుతారు మహారాష్ట్రకు చెందిన ఓ కొత్త జంట. అందరూ బాధలో ఉన్న ఈ పరిస్థితుల్లో తాము వేడుకగా పెళ్లి చేసుకోవడం తగదని.. సింపుల్‌గానే మనువాడి.. తాము పెళ్లి కోసం పోగు చేసుకున్న మిగతా సొమ్మును ఓ కొవిడ్‌ సెంటర్‌కు విరాళంగా ఇచ్చారు. అలా ఈ కొత్త జంట దాతృత్వం ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తోంది.

Know More

women icon@teamvasundhara
how-to-help-a-partner-with-anxiety-in-telugu

అతిగా ఆందోళన చెందేవారితో జాగ్రత్తగా ఇలా..!

18ఏళ్ల తపస్వి ఎప్పుడు చూసినా ఆందోళనగా ఉన్నట్లే కనిపిస్తుంది.. చదువుకి సంబంధించిన విషయాల గురించే పదేపదే ఆలోచిస్తూ ఉంటుంది.. 28ఏళ్ల శ్రీదివ్య ఒక ఎమ్మెన్సీలో జాబ్ చేస్తోంది. ఆమె కూడా ఎప్పుడు చూసినా తన కుటుంబం, ఉద్యోగం.. ఇలా ఏదో ఒక విషయం గురించి ఆందోళన చెందుతూనే ఉంటుంది.. వీరే కాదు.. మన చుట్టుపక్కల ఉన్న చాలామంది వ్యక్తుల్లో ప్రతి చిన్న విషయానికీ విపరీతంగా ఆలోచించేవారు, ఆందోళన చెందేవారు.. ఎందరో! సాధారణంగా ఇటువంటివారు సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. అందుకే వారితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. అందులోనూ ఇప్పుడు ఈ కరోనా వచ్చాక ప్రస్తుతం దాని గురించి అందరిలోనూ విపరీతమైన భయాందోళనలు పెరిగిపోయాయి మరి, ఇలాంటి వ్యక్తులతో మనం ఎలా మసలుకోవాలి? వారి ఆందోళన తగ్గించడానికి ఏం చేయాలి.. మొదలైన విషయాలు మనమూ ఓసారి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
chiranjeevi-sarja-wife-meghana-raj-pens-a-heart-breaking-note

women icon@teamvasundhara
dying-husband-plans-anniversary-surprise-for-wife-and-emails-daughter

ఈ భర్త చనిపోయి పది నెలలైనా తన భార్యను అలా సర్‌ప్రైజ్‌ చేశాడు!

ఆలుమగల బంధానికి సంబంధించి పెళ్లి రోజుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మామూలు రోజుల్లో ఎలా ఉన్నా ఆ రోజు మాత్రం తమ ప్రేమకు కాస్త కొత్తదనం జోడించి సెలబ్రేట్‌ చేసుకుంటే అది మరపురాని మధురానుభూతిగా మిగిలిపోతుంది. అయితే పది నెలల క్రితం మరణించిన ఓ వ్యక్తి తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తన భార్యకు వూహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. తన సతీమణికి ఇష్టమైన గులాబీ పూలు, ఫొటోలు, వంటకాలను రడీ చేసి తమ పెళ్లి రోజును ఘనంగా సెలబ్రేట్‌ చేశాడు. అదేంటి పది నెలల క్రితం చనిపోయిన వ్యక్తి ఇవన్నీ ఎలా చేశాడనుకుంటున్నారా? అయితే ఈ కథ చదవండి మరి..!

Know More

women icon@teamvasundhara
ways-to-cool-your-partner-after-quarrel-in-telugu
women icon@teamvasundhara
a-short-and-crispy-love-story-of-indian-archers-deepika-kumari-and-atanu-das-ahead-of-their-wedding-on-june-30th

అప్పుడే మా మనసుల్లో ప్రేమ గంట మోగింది!

వారిద్దరూ ట్రైనింగ్‌లో భాగంగా ఓ అకాడమీలో కలుసుకున్నారు. ఒకరినొకరు చూసుకోగానే తామిద్దరి మధ్యా ఎన్నో ఏళ్లుగా ఆత్మీయ బంధం ఉందేమో అన్న ఫీలింగ్‌ కలిగింది ఆ ఇద్దరికీ. ఆ భావనే వారిని తక్కువ సమయంలోనే మంచి స్నేహితులుగా మార్చింది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ స్నేహానికి మించిన అనుభూతుల్ని చవి చూసిందా జంట. అదే ప్రేమని తెలుసుకున్న వారు పెద్దల అంగీకారంతో రెండేళ్ల క్రితం నిశ్చితార్థం చేసుకొని ఈ లాక్‌డౌన్‌లో పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతున్నారు. వారే ది ఫేమస్‌ ఆర్చరీ కపుల్‌ దీపికా కుమారి - అతాను దాస్‌. గతేడాదే పెళ్లి పీటలెక్కాలనుకున్నా అది కుదురకపోవడంతో టోక్యో ఒలింపిక్స్‌ తర్వాతైనా ఏడడుగులు నడవాలనుకున్నారీ జంట. అయితే అంతలోనే లాక్‌డౌన్‌ రావడం, టోక్యో ఒలింపిక్స్‌ వాయిదా పడడంతో ఈ లాక్‌డౌన్‌లోనే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అలా జూన్‌ 30న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టేందుకు రడీ అవుతోందీ ఆర్చరీ జంట. ఈ నేపథ్యంలో ఈ అందాల జంట ప్రేమ కబుర్లు, పెళ్లి విశేషాలేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
neena-gupta-praises-daughter-masabas-work-in-heart-felt-video

అలా నా కూతురెప్పుడూ నన్నడగలేదు!

పిల్లల ఆనందమే పరమావధిగా భావించే తల్లిదండ్రులు.. వారు ఏ చిన్న విజయం సాధించినా సంతోషంతో ఉప్పొంగిపోతుంటారు. తమ పిల్లల విజయాన్ని చుట్టుపక్కల వారందరితోనూ పంచుకుంటూ మురిసిపోతుంటారు. అయితే తన కూతురు మసాబా గుప్తా విషయంలో తానెప్పుడూ ఇలా చేయలేదని బాధపడుతోంది అలనాటి అందాల తార నీనా గుప్తా. ఫ్యాషన్‌ ఐకాన్‌గా ఎంతో గుర్తింపు సాధించిన తన కుమార్తెను కనీసం ఒకసారి కూడా అభినందించలేకపోయానంటోంది నీనా. అయితే లాక్‌డౌన్ రూపంలో తన ముద్దుల కూతురు గురించి అందరితో షేర్‌ చేసుకునే చక్కటి అవకాశం లభించిందంటూ ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్‌ చేసిందీ తార.

Know More

women icon@teamvasundhara
my-husband-is-chatting-with-another-woman-on-phone-how-to-change-his-attitude?
women icon@teamvasundhara
meghana-and-chiranjeevi-sarja-beautiful-love-story-ended-too-soon

ఈ అందమైన ప్రేమకథను చూసి కాలానికి కన్ను కుట్టిందేమో!

సినిమా రంగంలో ఉన్న వారిద్దరూ అనుకోకుండా పరిచయమయ్యారు. మంచి స్నేహితులుగా మారారు. అభిప్రాయాలు, అభిరుచులు కలవడంతో పదేళ్ల పాటు ప్రేమలో మునిగి తేలారు. అనంతరం పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి పీటలెక్కారు. తమ ప్రేమ బంధాన్ని మరింత పరిపూర్ణం చేసుకునేందుకు ఒక పండంటి బిడ్డను కూడా తమ లైఫ్‌లోకి ఆహ్వానించేందుకు రడీ అయ్యారు. అయితే వారి అన్యోన్య దాంపత్యాన్ని చూసి కాలానికి కన్ను కుట్టిందేమో! నిండు నూరేళ్లు కలిసి జీవించాలన్న వారి కలలను కల్లలు చేసి ఇద్దరినీ విడదీసింది. ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన కన్నడ నటుడు చిరంజీవి సర్జా, ఆయన సతీమణి మేఘనా రాజ్‌ల అందమైన ప్రేమకథ ఇలా మధ్యలోనే విషాదాంతమైంది. అప్పటివరకు తనతో కలిసున్న సర్జా హఠాన్మరణం మేఘనకు తీరని శోకాన్ని మిగిల్చింది. అందుకే అంత్యక్రియల సమయంలో ఆమెను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు.

Know More

women icon@teamvasundhara
ask-these-questions-before-marriage-

పెళ్లికి ముందే ఈ ప్రశ్నలు అడగండి !

పెళ్లంటే నూరేళ్ల పంట..! జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ నిండు నూరేళ్లు ఆనందంగా గడపడమే వివాహ బంధానికి అసలైన అర్ధం. కానీ, ప్రస్తుత పరిస్థితులు ఇందుకు భిన్నంగా తయారయ్యాయి. మూడు ముళ్ల బంధం మూన్నాళ్ల ముచ్చటగా మారిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అభిప్రాయభేదాలు, ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం లేకపోవడం, ఆర్ధికపరమైన విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండడం, పిల్లలు లేకపోవడం.. ఇలా రకరకాల కారణాలతో ఎన్నో జంటలు పెళ్లైన కొన్నాళ్లకే విడిపోతున్నాయి. తమ సమస్యలను పరిష్కరించుకోలేక విడాకుల కోసం న్యాయస్థానాల ముందు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో పెళ్లికి ముందే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం వల్ల చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయి. ఇలా చేయడం వల్ల ఒకరిపై ఒకరికి పూర్తి అవగాహన రాకపోయినా.. తాము చేసుకోబోయే వ్యక్తి ఆలోచన విధానాన్ని కొంతమేరకు అంచనా వేసే అవకాశం మాత్రం కచ్చితంగా ఉంటుంది. ఈ క్రమంలో పెళ్లికి ముందు తాము చేసుకోబోయే వాళ్లను వధువు/వరుడు అడగాల్సిన కొన్ని ప్రశ్నలేంటో చూసేద్దామా..!

Know More

women icon@teamvasundhara
sonam-kapoor-celebrates-her-35th-birthday

women icon@teamvasundhara
corona-virus-health-care-worker-mom-meets-daughters-after-2-months-emotional-video-goes-viral

అమ్మ ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది!

ప్రపంచంలో ఎవరి ప్రేమకైనా ప్రత్యామ్నాయం దొరుకుతుంది. కానీ అమ్మ ప్రేమకు మాత్రం ఎలాంటి ప్రత్యా్మ్నాయముండదు. కరోనా కారణంగా ప్రస్తుతం వైద్యులైన చాలామంది తల్లులు కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. కనీసం పిల్లలను కూడా చూడకుండా నెలల పాటు ఆస్పత్రిలోనే ఉంటూ కరోనా బాధితులను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఈక్రమంలో ఇంగ్లండ్‌కు చెందిన డాక్టర్‌ సూసీ కూడా విధి నిర్వహణలో భాగంగా పదేళ్లు వయసు కూడా దాటని తన ఇద్దరు పిల్లలకు తొమ్మిది వారాల పాటు దూరమైంది. అయితే తాజాగా కొంచెం సమయం దొరకడంతో తన పిల్లలను చూడాలనుకున్న ఆమె వారికో సర్‌ప్రైజ్‌ ఇచ్చింది.

Know More

women icon@teamvasundhara
sakshi-singh-comments-on-dhoni-long-hairstyle-in-telugu

అలా అయితే ధోనీని మరోసారి కన్నెత్తి కూడా చూసేదాన్ని కాదేమో!

మహేంద్ర సింగ్‌ ధోనీ... క్రికెట్‌ గురించి తెలిసినవారికి ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. కెరీర్‌ ప్రారంభంలో ధనాధన్‌ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న ధోనీ తన ఆహార్యంతోనూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రత్యేకించి తన పొడవాటి హెయిర్‌స్టైల్‌తో యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు. అంతేకాదు చాలామంది అభిమానులు, యువత ధోనీ హెయిర్‌స్టైల్‌ను అనుకరించారు. ఇలా ఎందరినో ఆకట్టుకున్న ధోనీ హెయిర్‌స్టైల్‌ అతడి సతీమణి సాక్షికి ఏ మాత్రం నచ్చలేదట. తాజాగా ధోనీ ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ ఛాట్‌లో పాల్గొన్న ఆమె తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
hardik-pandya-and-natasa-stankovic-announce-pregnancy
women icon@teamvasundhara
sachin-and-anjali-celebrates-their-25th-wedding-anniversary

ఈ ప్రేమ బంధానికి పాతిక వసంతాలు!

‘చూసి చూడంగానే నచ్చేశావే’ అని చెప్పుకొనే ‘లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌’పై విభిన్న రకాల అభిప్రాయాలున్నాయి. ‘ఇద్దరి మధ్య ప్రేమ పుట్టేందుకు సమయంతో పనిలేదని’ అని కొందరంటే...మరికొందరు ఇందులో ప్రేమ ఉండదని కేవలం ఆకర్షణ మాత్రమే ఉంటుందని చెబుతారు. అంతేకాదు తొలిచూపు ప్రేమ అబద్ధమని, ఇలాంటి రిలేషన్‌షిప్స్‌ ఎక్కువకాలం సాగవని కూడా అంటుంటారు. అయితే ‘లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌’లోనూ ప్రేమ ఉంటుందని తమ బంధంతో అక్షరాలా నిజమని నిరూపించారు సచిన్ తెందూల్కర్‌- అంజలి. ముప్పై సంవత్సరాల క్రితం ముంబై ఎయిర్‌పోర్టులో మొదలైన వీరి పరిచయం క్రమంగా స్నేహంగా మారింది. ఆ తర్వాత ప్రేమగా మారింది. అలా ప్రేమ బంధాన్ని 1995 మే 25న మూడుముళ్ల బంధంగా మార్చుకున్నారు. అంటే వీరి వివాహమై సరిగ్గా పాతికేళ్లు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ఈ ముచ్చటైన జంటకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
ludhiana-businessman-names-shop-‘gupta-and-daughters’-after-his-daughters

ఇప్పుడు ‘అండ్‌ డాటర్లూ’ వచ్చేస్తున్నారు..!

పురుషాధిక్యమనే భావన ఇంటినుంచే మొదలవుతుందంటారు. ఇప్పటికీ చాలా కుటుంబాల్లో కుమారులకిచ్చిన విలువ కూతుళ్లకు ఇవ్వరు. ఇక వారసత్వం అనేది కుమారులకు మాత్రమే సొంతమనే భావన చాలామందిలో ఉంటుంది. అందుకే తమ వ్యాపార సంస్థలు, దుకాణాలకు తమ సోదరుల, కుమారుల పేర్లు (అండ్‌ సన్స్‌, అండ్‌ బ్రదర్స్‌) మొదలైనవి వచ్చేలా సైన్‌ బోర్డులు పెడుతుంటారు. ఈ పరిస్థితుల్లో పంజాబ్‌కు చెందిన ఓ మెడికల్‌ స్టోర్‌ యజమాని తన కూతురే తన వారసులని ఓ సైన్‌ బోర్డు పెట్టాడు. ఈ మేరకు ‘గుప్తా అండ్‌ డాటర్స్‌’ పేరుతో అతడు పెట్టిన సైన్‌ బోర్డు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది.

Know More

women icon@teamvasundhara
rana-and-miheeka-shares-their-traditional-dress-photos

పెళ్లి సందడి షురూ అయింది!

బ్యాచిలర్‌ లైఫ్‌కి బై..బై...చెబుతోన్న భళ్లాల దేవుడి(రానా) ఇంట్లో పెళ్లి సందడి షురూ అయింది. ఇటీవల సోషల్‌ మీడియా వేదికగా తన ప్రేమ విషయాన్ని ప్రకటించిన ఈ యంగ్‌ హీరో ఇక త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడు. తన ప్రియురాలు మిహీకా బజాజ్‌తో కలిసి జీవితం పంచుకునేందుకు రడీ అవుతున్నారు. కొద్ది రోజుల క్రితమే తన ప్రేయసిని అందరికీ పరిచయం చేసిన రానా తాజాగా మరోసారి తనకు కాబోయే సతీమణితో దిగిన ఫొటోలను ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో సంప్రదాయ దుస్తులు ధరించి ముసిముసి నవ్వులు చిందిస్తున్న రానా-మిహీకల ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Know More

women icon@teamvasundhara
anilkapoor-shares-his-love-story-with-wife-sunita

ఆ రోజు తను నవ్వుతుంటే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి!

సినిమాల్లో చూపించినట్లు నిజ జీవితంలోని ప్రేమ కథలు చాలా వరకు పెళ్లి దాకా చేరకపోవచ్చు. కెరీర్‌, ఫ్యామిలీ, స్టేటస్‌...ఇలా ఏదో ఒక కారణంతో ప్రేమించుకున్న ప్రతి జంట పెళ్లి పీటలెక్కకపోవచ్చు. ఇదే సమయంలో ఎలాంటి ఒడిదొడుకులకైనా ఎదురెళ్లి తమ ప్రేమను గెలిపించుకున్న జంటలు చాలానే ఉంటాయి. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌- సునీతా కపూర్‌ దంపతుల ప్రేమకథ కూడా అలాంటిదే. ప్రతి ఒక్కరి లైఫ్‌లో కెరీర్‌, లవ్‌ అనేవి రెండు వేర్వేరు అంశాలని, ఒకదానితో మరొకటి ముడిపెట్టకూడదని చెప్పే ఈ లవ్లీ కపుల్‌ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి 36 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తమ పెళ్లి రోజును పురస్కరించుకుని దంపతులిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అదే సందర్భంలో తమ పెళ్లినాటి ముచ్చట్లను అందరితో షేర్‌ చేసుకుంటూ మురిసిపోయారు.

Know More

women icon@teamvasundhara
interesting-facts-about-rana-fiancee-miheeka-bajaj

ఈ భళ్లాల దేవుడి ప్రేమకథ అక్కడే మొదలైంది!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ది మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్స్‌లో ఒకడిగా ఉన్న యంగ్ హీరో రానా దగ్గుబాటి త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. రిలేషన్‌షిప్‌కి సంబంధించి ఎప్పుడూ నోరు విప్పని ఈ ‘భళ్లాల దేవుడు’ మిహీకా బజాజ్ తో లవ్‌లో ఉన్నానని చెప్పి తన అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చాడు. సోషల్ మీడియా వేదికగా తన ప్రియురాలిని పరిచయం చేస్తూ ‘ఆమె అంగీకారం తెలిపింది’ అని లవ్ సింబల్‌ను జతచేస్తూ ఓ పోస్ట్ షేర్ చేశాడు. దీంతో కొద్ది రోజులుగా రానా లవ్‌స్టోరీ హాట్‌టాపిక్‌గా మారింది. ఇదే క్రమంలో గూగుల్ మోస్ట్ సెర్చ్‌డ్ సెలబ్రిటీగా మారిపోయింది మిహీక.

Know More

women icon@teamvasundhara
mothers-day-special-feature
women icon@teamvasundhara
mothers-day-significance

ఒక కూతురు తల్లికిచ్చిన కానుకే ఈ 'మదర్స్ డే'!

అన్నదమ్ముల్లా మనల్ని ఒకరు ఆడించొచ్చు, అక్కచెల్లెళ్లుగా మనకి ఒకరు తోడుండచ్చు, నాన్నలా ఒకరు మన బాధ్యత తీసుకోవచ్చు కానీ అమ్మలా మరొకరు మనల్ని చూసుకోలేరు. అటువంటి అమ్మకి ప్రేమని వ్యక్తపరచడానికి, మనసారా థ్యాంక్స్ చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఓ రోజు ఉంటే బాగుంటుంది కదూ.. అందుకే ఈ మదర్స్ డే ! అయితే ప్రతి సంవత్సరం 'మదర్స్ డే' జరుపుకుంటున్నాం సరే ! కానీ అసలు ఈ ఐడియా ఎవరిది ? ఎప్పుడైనా ఆలోచించారా ? ఒక తల్లి నవమాసాలు మోసి బిడ్డని కన్నట్లే.. ఒక కూతురు తన తల్లి కోరిక నెరవేర్చడానికి తొమ్మిదేళ్లు నిరీక్షించి ఈ 'మదర్స్ డే' ఆలోచనను అమల్లో పెట్టింది. ఆ కూతురి పేరే 'అన్నా జార్విస్'. ఇంతకీ అమ్మల కోసం ప్రత్యేకంగా ఒక రోజు ఎందుకు కావాలనుకుంది ? తెలియాలంటే ఇది చదవండి మరి !

Know More

women icon@teamvasundhara
irfan-khan-wife-heartfelt-message-about-her-husband

ఇర్ఫాన్‌...నీ మీద నాకున్న కోపం అదే..!

‘మా జీవితాలు సినిమాలకేమీ తక్కువ కాదు..!’ అంటోంది బాలీవుడ్‌ దివంగత నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ సతీమణి సుతపా సిక్దర్‌. ఇర్ఫా్న్‌, సుతపాలది 35 ఏళ్ల అనుబంధం. బాబిల్‌, అయాన్‌ అనే ఇద్దరు కుమారులు వీరి ప్రేమకు ప్రతిరూపాలు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా వీళ్లిద్దరూ ఒకరికొకరు తోడుగా నిలుస్తూ వాటిని అధిగమించారు. ఇర్ఫాన్‌ గత కొద్దికాలంగా క్యాన్సర్‌ (Neuro Endocrine Tumour)తో పోరాడుతూ ఇటీవలే మరణించిన సంగతి విదితమే. ఇర్ఫాన్‌ మరణం ఆయన కుటుంబ సభ్యులనే కాదు.. యావత్‌ సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ క్రమంలో తన భర్తతో తనకున్న అనుబంధం గురించి సుతపా ఇటీవలే సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
corona-virus-groom-ties-mangalasutra-to-phone-while-video-call-wedding

ఇప్పుడు ఫోన్లో ఒక ముడే... లాక్‌డౌన్‌ తర్వాత మిగతా రెండు ముళ్ళూ వేయించుకుంటా!

‘ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి... ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరీ’... మనిషి జీవితంలో ఎంతో ప్రత్యేకంగా పరిగణించే ‘పెళ్లి’ వేడుక గురించి ఓ సినీ కవి చెప్పిన మాటలివి. ఇలా రెండు జీవితాలు ఒక్కటయ్యే ఈ వేడుకను పదికాలాల పాటు అందరికీ గుర్తుండిపోయేలా జరుపుకోవాలని కోరుకుంటారు వధూవరులు. ఈనేపథ్యంలో బంధుమిత్రులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా పెళ్లిపీటలెక్కాలనుకుంటారు. కానీ కరోనా పుణ్యమా అని ప్రస్తుతం పెళ్లిళ్ల పద్ధతే మారిపోయింది. పట్టుమని పదిమంది కూడా లేకుండానే పెళ్లిళ్లు జరిగిపోతున్నాయి. అది కూడా సామాజిక దూరం పాటిస్తూ ముఖానికి మాస్కులు కట్టుకునే ఈ తతంగమంతా పూర్తి చేయాల్సిన పరిస్థితి. ఇదే క్రమంలో కేరళకు చెందిన ఓ జంట మరింత వినూత్నంగా పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.

Know More

women icon@teamvasundhara
ankita-konwar-post-on-the-occasion-of-bihu