scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'కరోనా వల్ల ఉద్యోగం పోయినా.. ఇలా సొంతంగా బతుకుతున్నా!'

'కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆరోగ్యపరంగా, మానసికంగా, ఆర్థికంగా కుంగదీస్తోంది. ఇంకెందరికో ఉద్యోగాలు కోల్పోయి ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. దీంతో అప్పటిదాకా స్వతంత్రంగా బతికిన తాము డబ్బు కోసం మరొకరి దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితి వచ్చిందని ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ఈ విపత్కర పరిస్థితి తన వృత్తి జీవితంలోనూ చిచ్చు పెట్టిందని అంటోంది ఓ మహిళ. అయినా అధైర్య పడకుండా సంపాదన కోసం మరో మార్గం వెతుక్కున్నానని, ఈ క్రమంలో నలుగురికి సహాయపడుతూ మరీ సంపాదించడం సంతృప్తిగా అనిపిస్తోందని చెబుతోందామె. ఇలా తన వంతుగా కుటుంబానికి అండగా నిలవడం ఎంతో సంతోషంగా ఉందంటూనే.. తన జీవితంలో కరోనా తెచ్చిన కష్టాల గురించి ఇలా మనందరితో పంచుకుంది.'

Know More

Movie Masala

 
category logo

మధురమైన ప్రేమకు ‘రోజాపూల’తో శ్రీకారం!

Valentines Week 2020 Rose Day Special

‘ప్రేమ’.. రెండక్షరాల పదం.. రెండు గుండెల చప్పుడు.. రెండు మనసుల కలయిక. ఆ మనసుల్లోని మధురానుభూతుల్ని ఒకరికొకరు పంచుకోవడానికి ప్రేమికులు జరుపుకొనే పండగే ‘ప్రేమికుల దినోత్సవం’. ఈ సందర్భంగా విదేశాల్లో ‘రోజ్ డే’తో మొదలుపెట్టి ‘ప్రపోజ్ డే’, ‘చాక్లెట్ డే’, ‘టెడ్డీ డే’.. ఇలా రోజుకో పేరుతో ఏడు రోజుల పాటు ఏకంగా వారోత్సవాలే జరుపుకొంటారు ప్రేమికులు. ఇక ఎనిమిదో రోజు ‘వాలెంటైన్స్ డే’ను పెద్దఎత్తున సెలబ్రేట్ చేసుకుంటారు. ఇలా ఎనిమిది రోజుల పాటు జరిగే వాలెంటైన్స్‌ డే వేడుకల్లో దేని ప్రత్యేకత దానిదే. రాన్రానూ ఈ సంస్కృతి మన దగ్గరా విస్తరిస్తోంది. ఈ క్రమంలో ప్రేమికుల వారోత్సవాల్లో మొదటి రోజైన ‘రోజ్‌ డే’ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం రండి..

valentineweekroseday650-2.jpg
రంగురంగుకో అర్థం..
ప్రేమికులు తమ మనసులోని భావాలను తెలుపుకోవడానికి ఉపయోగించే వాటిలో విలువైనవి ‘రోజా పూలు’. వీటిని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ ప్రేమను వ్యక్తపరచుకుంటారు. అయితే ఈ పూలలో చాలా రంగులుంటాయి. ఒక్కో రంగును బట్టి ఒక్కో అర్థం ఉంటుంది.

roseday650.jpg
* ఎరుపు: ఎరుపు రంగు రోజా ప్రత్యేకత అందరికీ తెలిసిందే. దీన్ని పవిత్ర ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. ఇవి నిష్కల్మషమైన ప్రేమకు, గౌరవానికి ప్రతీకలు. అందుకే ప్రేమికులు ఒకరిపై మరొకరికి పవిత్ర ప్రేమ ఉందని ఈ ఎరుపు రంగు రోజా పూల ద్వారా తెలుపుకొంటారు.

valentineweekroseday650-5.jpg
* తెలుపు: తెలుపు రంగు రోజాలను ఎక్కువగా పెళ్లిళ్లలో ఉపయోగిస్తుంటారు. అందుకే వీటిని ‘బ్రైడల్ రోజెస్’ అని కూడా అంటారు. ఇవి ప్రేమ, శాంతి, స్నేహం, అమాయకత్వం, నమ్మకానికి ప్రతీకగా నిలుస్తాయి.

valentineweekroseday650-6.jpg

* గులాబీ: రోజా పూలలో గులాబీ రంగుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రంగు ఒక వ్యక్తి రూపలావణ్యాన్ని, మృదు స్వభావాన్ని పర్‌ఫెక్ట్‌గా తెలియజేస్తుంది. ఎదుటివారు సంతోషంగా ఉండటాన్ని మనం కోరుకుంటున్నామని వారికి తెలియాలంటే ఈ రోజా పూలను అందిస్తే సరి.

valentineweekroseday650-7.jpg
* పసుపు: పసుపు రంగు రోజాపూలను ఎక్కువగా ‘స్నేహితుల దినోత్సవం’ రోజున ఇచ్చిపుచ్చుకుంటారు. వీటిని స్నేహానికి, ప్రాణాలిచ్చేంత ప్రేమకు, దయాగుణానికి చిహ్నాలుగా చెబుతుంటారు.

valentineweekroseday650-8.jpg
* లావెండర్: ఈ రంగు రోజా పూలకు ‘వాలెంటైన్ ఫ్లవర్స్’గా పేరుంది. తొలిచూపులోనే పుట్టిన ప్రేమను తెలియజేయడానికి ఈ రంగు పూలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇవి ఒకరిపై ఒకరికి ఉండే నిజాయతీని తెలియజేస్తాయి.

valentineweekroseday650-9.jpg
* ఆరెంజ్: రొమాంటిక్ ఆలోచనలకు, వూహలకు ప్రతీక ఆరెంజ్ రంగు రోజా పూలు. ఇవి వ్యక్తిలో ఉండే కోరికలను, ఉత్సాహాన్ని తెలుపుతాయి.

valentineweekroseday650-4.jpg
రంగురంగుల రోజాపూలతో తయారుచేసిన బొకే మనలోని విభిన్న భావాల్ని వ్యక్తం చేస్తుంది. ఉదాహరణకు.. ఎరుపు, తెలుపు రంగులతో తయారుచేసిన బొకే ఐకమత్యానికి; పసుపు, ఎరుపు రంగులతో తయారుచేసిన బొకే ఆనందానికి ప్రతీకలుగా నిలుస్తాయి.

సంఖ్యల్లో దాగున్న ‘ప్రేమ’!

రోజ్ డే సందర్భంగా ప్రేమికులు ఇచ్చిపుచ్చుకునే రోజాపూల సంఖ్యకు కూడా ప్రాముఖ్యం ఉంది. మరి మనం అందించే రోజా పూల సంఖ్య ఎంత ఉంటే ఎలాంటి భావాలను వ్యక్తపరచచ్చో చూద్దామా..
* 1 : తొలిచూపులో కలిగిన ప్రేమ నాది..
* 2 : జీవితాంతం నీకు తోడుంటా..
* 3 : నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
* 5 : నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను.
* 6 : నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. చాలా మిస్సవుతున్నాను.
* 7 : నీ మాయ(ఆకర్షణ)లో పడిపోయా..
* 9 : ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా..

valentineweekroseday650-3.jpg
* 10 : నువ్వు చాలా అందంగా ఉన్నావు.
* 11 : నీకంటే విలువైంది నాకు ఈ లోకంలో లేదు.
* 12 : నీతో ఉండడం నిజంగా నా అదృష్టం.
* 13 : ఇద్దరం ఎప్పటికీ మంచి ఫ్రెండ్స్‌గా ఉందాం.
* 15 : నిజంగా చెప్పాలంటే క్షమించూ!
* 20 : ఎప్పటికీ నీ చెంతే ఉంటా.
* 21 : ఇక జీవితాంతం నీతోనే..
* 24 : నా మనసులో చెరగని ముద్ర నువ్వే..
* 25 : అభినందనలు.
* 36 : మనం గడిపిన రొమాంటిక్ క్షణాలు నాకు ఎప్పటికీ గుర్తే.
* 40 : నాది నిజమైన ప్రేమ.
* 99 : తుదిశ్వాస వరకూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా..
* 100 : నా సర్వస్వం నీకే అర్పితం.
* 101 : నీకంటే నాకెవరూ ఎక్కువ కాదు.
* 108 : నన్ను పెళ్లి చేసుకుంటావా?
* 365 : రోజూ నీ ధ్యాసలోనే..
* 999 : సృష్టి ఉన్నంత వరకూ నా ప్రేమ శాశ్వతం.

‘వాలెంటైన్‌ వీక్‌’లో భాగంగా మొదటి రోజున జరుపుకునే ‘రోజ్ డే’ కేవలం ప్రేమికులకు మాత్రమే కాదు.. ఎవరైనా సెలబ్రేట్‌ చేసుకోవచ్చు. మనసులోని భావాలను బట్టి రోజాపూల రంగు, సంఖ్యను ఎంచుకుని మీ భాగస్వామికి మీ ప్రేమను వ్యక్తపరచండి.





gynecologist Ask Psychology Expert
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి


Know More

women icon@teamvasundhara
anasuya-celebrates-her-tenth-wedding-anniversary-in-telugu

నాకు నీతో కలిసి జీవించడం మాత్రమే తెలుసు!

అనసూయా భరద్వాజ్‌... తెలుగు నాట సినిమా స్టార్స్‌తో సమానంగా క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ స్టార్‌ యాంకర్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఓ వైపు బుల్లితెరపై రాణిస్తూనే... మరోవైపు బిగ్‌ స్ర్కీన్‌పై ‘రంగమ్మత్త’ లాంటి పాత్రలతో సినీ అభిమానులను అలరిస్తోందీ అందాల సుందరి. సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉండే ఆమె తన వృత్తిగత, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పోస్టులను షేర్‌ చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సోషల్‌ మీడియా వేదికగా తన భర్తకు శుభాకాంక్షలు తెలుపుతూ కొన్ని ఆసక్తికరమైన పోస్టులు షేర్‌ చేసింది.

Know More

women icon@teamvasundhara
corona-virus-health-care-worker-mom-meets-daughters-after-2-months-emotional-video-goes-viral

అమ్మ ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది!

ప్రపంచంలో ఎవరి ప్రేమకైనా ప్రత్యామ్నాయం దొరుకుతుంది. కానీ అమ్మ ప్రేమకు మాత్రం ఎలాంటి ప్రత్యా్మ్నాయముండదు. కరోనా కారణంగా ప్రస్తుతం వైద్యులైన చాలామంది తల్లులు కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. కనీసం పిల్లలను కూడా చూడకుండా నెలల పాటు ఆస్పత్రిలోనే ఉంటూ కరోనా బాధితులను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఈక్రమంలో ఇంగ్లండ్‌కు చెందిన డాక్టర్‌ సూసీ కూడా విధి నిర్వహణలో భాగంగా పదేళ్లు వయసు కూడా దాటని తన ఇద్దరు పిల్లలకు తొమ్మిది వారాల పాటు దూరమైంది. అయితే తాజాగా కొంచెం సమయం దొరకడంతో తన పిల్లలను చూడాలనుకున్న ఆమె వారికో సర్‌ప్రైజ్‌ ఇచ్చింది.

Know More

women icon@teamvasundhara
sakshi-singh-comments-on-dhoni-long-hairstyle-in-telugu

అలా అయితే ధోనీని మరోసారి కన్నెత్తి కూడా చూసేదాన్ని కాదేమో!

మహేంద్ర సింగ్‌ ధోనీ... క్రికెట్‌ గురించి తెలిసినవారికి ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. కెరీర్‌ ప్రారంభంలో ధనాధన్‌ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న ధోనీ తన ఆహార్యంతోనూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రత్యేకించి తన పొడవాటి హెయిర్‌స్టైల్‌తో యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు. అంతేకాదు చాలామంది అభిమానులు, యువత ధోనీ హెయిర్‌స్టైల్‌ను అనుకరించారు. ఇలా ఎందరినో ఆకట్టుకున్న ధోనీ హెయిర్‌స్టైల్‌ అతడి సతీమణి సాక్షికి ఏ మాత్రం నచ్చలేదట. తాజాగా ధోనీ ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ ఛాట్‌లో పాల్గొన్న ఆమె తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
sachin-and-anjali-celebrates-their-25th-wedding-anniversary

ఈ ప్రేమ బంధానికి పాతిక వసంతాలు!

‘చూసి చూడంగానే నచ్చేశావే’ అని చెప్పుకొనే ‘లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌’పై విభిన్న రకాల అభిప్రాయాలున్నాయి. ‘ఇద్దరి మధ్య ప్రేమ పుట్టేందుకు సమయంతో పనిలేదని’ అని కొందరంటే...మరికొందరు ఇందులో ప్రేమ ఉండదని కేవలం ఆకర్షణ మాత్రమే ఉంటుందని చెబుతారు. అంతేకాదు తొలిచూపు ప్రేమ అబద్ధమని, ఇలాంటి రిలేషన్‌షిప్స్‌ ఎక్కువకాలం సాగవని కూడా అంటుంటారు. అయితే ‘లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌’లోనూ ప్రేమ ఉంటుందని తమ బంధంతో అక్షరాలా నిజమని నిరూపించారు సచిన్ తెందూల్కర్‌- అంజలి. ముప్పై సంవత్సరాల క్రితం ముంబై ఎయిర్‌పోర్టులో మొదలైన వీరి పరిచయం క్రమంగా స్నేహంగా మారింది. ఆ తర్వాత ప్రేమగా మారింది. అలా ప్రేమ బంధాన్ని 1995 మే 25న మూడుముళ్ల బంధంగా మార్చుకున్నారు. అంటే వీరి వివాహమై సరిగ్గా పాతికేళ్లు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ఈ ముచ్చటైన జంటకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
ludhiana-businessman-names-shop-‘gupta-and-daughters’-after-his-daughters

ఇప్పుడు ‘అండ్‌ డాటర్లూ’ వచ్చేస్తున్నారు..!

పురుషాధిక్యమనే భావన ఇంటినుంచే మొదలవుతుందంటారు. ఇప్పటికీ చాలా కుటుంబాల్లో కుమారులకిచ్చిన విలువ కూతుళ్లకు ఇవ్వరు. ఇక వారసత్వం అనేది కుమారులకు మాత్రమే సొంతమనే భావన చాలామందిలో ఉంటుంది. అందుకే తమ వ్యాపార సంస్థలు, దుకాణాలకు తమ సోదరుల, కుమారుల పేర్లు (అండ్‌ సన్స్‌, అండ్‌ బ్రదర్స్‌) మొదలైనవి వచ్చేలా సైన్‌ బోర్డులు పెడుతుంటారు. ఈ పరిస్థితుల్లో పంజాబ్‌కు చెందిన ఓ మెడికల్‌ స్టోర్‌ యజమాని తన కూతురే తన వారసులని ఓ సైన్‌ బోర్డు పెట్టాడు. ఈ మేరకు ‘గుప్తా అండ్‌ డాటర్స్‌’ పేరుతో అతడు పెట్టిన సైన్‌ బోర్డు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది.

Know More

women icon@teamvasundhara
rana-and-miheeka-shares-their-traditional-dress-photos

పెళ్లి సందడి షురూ అయింది!

బ్యాచిలర్‌ లైఫ్‌కి బై..బై...చెబుతోన్న భళ్లాల దేవుడి(రానా) ఇంట్లో పెళ్లి సందడి షురూ అయింది. ఇటీవల సోషల్‌ మీడియా వేదికగా తన ప్రేమ విషయాన్ని ప్రకటించిన ఈ యంగ్‌ హీరో ఇక త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడు. తన ప్రియురాలు మిహీకా బజాజ్‌తో కలిసి జీవితం పంచుకునేందుకు రడీ అవుతున్నారు. కొద్ది రోజుల క్రితమే తన ప్రేయసిని అందరికీ పరిచయం చేసిన రానా తాజాగా మరోసారి తనకు కాబోయే సతీమణితో దిగిన ఫొటోలను ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో సంప్రదాయ దుస్తులు ధరించి ముసిముసి నవ్వులు చిందిస్తున్న రానా-మిహీకల ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Know More

women icon@teamvasundhara
anilkapoor-shares-his-love-story-with-wife-sunita

ఆ రోజు తను నవ్వుతుంటే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి!

సినిమాల్లో చూపించినట్లు నిజ జీవితంలోని ప్రేమ కథలు చాలా వరకు పెళ్లి దాకా చేరకపోవచ్చు. కెరీర్‌, ఫ్యామిలీ, స్టేటస్‌...ఇలా ఏదో ఒక కారణంతో ప్రేమించుకున్న ప్రతి జంట పెళ్లి పీటలెక్కకపోవచ్చు. ఇదే సమయంలో ఎలాంటి ఒడిదొడుకులకైనా ఎదురెళ్లి తమ ప్రేమను గెలిపించుకున్న జంటలు చాలానే ఉంటాయి. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌- సునీతా కపూర్‌ దంపతుల ప్రేమకథ కూడా అలాంటిదే. ప్రతి ఒక్కరి లైఫ్‌లో కెరీర్‌, లవ్‌ అనేవి రెండు వేర్వేరు అంశాలని, ఒకదానితో మరొకటి ముడిపెట్టకూడదని చెప్పే ఈ లవ్లీ కపుల్‌ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి 36 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తమ పెళ్లి రోజును పురస్కరించుకుని దంపతులిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అదే సందర్భంలో తమ పెళ్లినాటి ముచ్చట్లను అందరితో షేర్‌ చేసుకుంటూ మురిసిపోయారు.

Know More

women icon@teamvasundhara
interesting-facts-about-rana-fiancee-miheeka-bajaj

ఈ భళ్లాల దేవుడి ప్రేమకథ అక్కడే మొదలైంది!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ది మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్స్‌లో ఒకడిగా ఉన్న యంగ్ హీరో రానా దగ్గుబాటి త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. రిలేషన్‌షిప్‌కి సంబంధించి ఎప్పుడూ నోరు విప్పని ఈ ‘భళ్లాల దేవుడు’ మిహీకా బజాజ్ తో లవ్‌లో ఉన్నానని చెప్పి తన అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చాడు. సోషల్ మీడియా వేదికగా తన ప్రియురాలిని పరిచయం చేస్తూ ‘ఆమె అంగీకారం తెలిపింది’ అని లవ్ సింబల్‌ను జతచేస్తూ ఓ పోస్ట్ షేర్ చేశాడు. దీంతో కొద్ది రోజులుగా రానా లవ్‌స్టోరీ హాట్‌టాపిక్‌గా మారింది. ఇదే క్రమంలో గూగుల్ మోస్ట్ సెర్చ్‌డ్ సెలబ్రిటీగా మారిపోయింది మిహీక.

Know More

women icon@teamvasundhara
give-a-kitchen-holiday-for-your-mother-on-this-mothers-day
women icon@teamvasundhara
mothers-day-significance

ఒక కూతురు తల్లికిచ్చిన కానుకే ఈ 'మదర్స్ డే'!

అన్నదమ్ముల్లా మనల్ని ఒకరు ఆడించొచ్చు, అక్కచెల్లెళ్లుగా మనకి ఒకరు తోడుండచ్చు, నాన్నలా ఒకరు మన బాధ్యత తీసుకోవచ్చు కానీ అమ్మలా మరొకరు మనల్ని చూసుకోలేరు. అటువంటి అమ్మకి ప్రేమని వ్యక్తపరచడానికి, మనసారా థ్యాంక్స్ చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఓ రోజు ఉంటే బాగుంటుంది కదూ.. అందుకే ఈ మదర్స్ డే ! అయితే ప్రతి సంవత్సరం 'మదర్స్ డే' జరుపుకుంటున్నాం సరే ! కానీ అసలు ఈ ఐడియా ఎవరిది ? ఎప్పుడైనా ఆలోచించారా ? ఒక తల్లి నవమాసాలు మోసి బిడ్డని కన్నట్లే.. ఒక కూతురు తన తల్లి కోరిక నెరవేర్చడానికి తొమ్మిదేళ్లు నిరీక్షించి ఈ 'మదర్స్ డే' ఆలోచనను అమల్లో పెట్టింది. ఆ కూతురి పేరే 'అన్నా జార్విస్'. ఇంతకీ అమ్మల కోసం ప్రత్యేకంగా ఒక రోజు ఎందుకు కావాలనుకుంది ? తెలియాలంటే ఇది చదవండి మరి !

Know More

women icon@teamvasundhara
irfan-khan-wife-heartfelt-message-about-her-husband

ఇర్ఫాన్‌...నీ మీద నాకున్న కోపం అదే..!

‘మా జీవితాలు సినిమాలకేమీ తక్కువ కాదు..!’ అంటోంది బాలీవుడ్‌ దివంగత నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ సతీమణి సుతపా సిక్దర్‌. ఇర్ఫా్న్‌, సుతపాలది 35 ఏళ్ల అనుబంధం. బాబిల్‌, అయాన్‌ అనే ఇద్దరు కుమారులు వీరి ప్రేమకు ప్రతిరూపాలు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా వీళ్లిద్దరూ ఒకరికొకరు తోడుగా నిలుస్తూ వాటిని అధిగమించారు. ఇర్ఫాన్‌ గత కొద్దికాలంగా క్యాన్సర్‌ (Neuro Endocrine Tumour)తో పోరాడుతూ ఇటీవలే మరణించిన సంగతి విదితమే. ఇర్ఫాన్‌ మరణం ఆయన కుటుంబ సభ్యులనే కాదు.. యావత్‌ సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ క్రమంలో తన భర్తతో తనకున్న అనుబంధం గురించి సుతపా ఇటీవలే సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
corona-virus-groom-ties-mangalasutra-to-phone-while-video-call-wedding

ఇప్పుడు ఫోన్లో ఒక ముడే... లాక్‌డౌన్‌ తర్వాత మిగతా రెండు ముళ్ళూ వేయించుకుంటా!

‘ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి... ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరీ’... మనిషి జీవితంలో ఎంతో ప్రత్యేకంగా పరిగణించే ‘పెళ్లి’ వేడుక గురించి ఓ సినీ కవి చెప్పిన మాటలివి. ఇలా రెండు జీవితాలు ఒక్కటయ్యే ఈ వేడుకను పదికాలాల పాటు అందరికీ గుర్తుండిపోయేలా జరుపుకోవాలని కోరుకుంటారు వధూవరులు. ఈనేపథ్యంలో బంధుమిత్రులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా పెళ్లిపీటలెక్కాలనుకుంటారు. కానీ కరోనా పుణ్యమా అని ప్రస్తుతం పెళ్లిళ్ల పద్ధతే మారిపోయింది. పట్టుమని పదిమంది కూడా లేకుండానే పెళ్లిళ్లు జరిగిపోతున్నాయి. అది కూడా సామాజిక దూరం పాటిస్తూ ముఖానికి మాస్కులు కట్టుకునే ఈ తతంగమంతా పూర్తి చేయాల్సిన పరిస్థితి. ఇదే క్రమంలో కేరళకు చెందిన ఓ జంట మరింత వినూత్నంగా పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.

Know More

women icon@teamvasundhara
how-to-maintain-your-relationships-strong-in-this-quarantine
women icon@teamvasundhara
ankita-konwar-post-on-the-occasion-of-bihu

మా మధ్య జరిగిన ‘ఎగ్‌ ఫైట్‌’లో నేనే గెలిచా!

వాళ్లిద్దరి మధ్య వయసుతేడా 26 ఏళ్లు.. కానీ.. ప్రేమకు మనసే తప్ప.. వయసుతో పనేముందని నిరూపించారు బాలీవుడ్‌ లవ్లీ కపుల్‌ మిలింద్‌ సోమన్‌ - అంకితా కొన్వర్‌. ‘ఏజ్‌ గ్యాప్‌ ఈజ్‌ జస్ట్‌ ఎ నంబర్‌’ అంటూ ఇద్దరూ వయోభేదాన్ని లెక్కచేయకుండా, ఇతరుల విమర్శలను కొట్టిపారేస్తూ తమ ప్రేమ బంధాన్ని శాశ్వతమైన అనుబంధంగా మలచుకున్నారు. ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తపరచుకోవడంలో ఎప్పుడూ వెనకాడని ఈ జంట.. తమ ప్రేమ పాఠాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటుంటారు. ట్రావెల్‌ లవర్స్‌ అయిన ఈ అందాల జంట.. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంట్లోనే ఉంటూ ఎంజాయ్‌ చేస్తూ.. ఆ విశేషాలను సోషల్‌ మీడియా ద్వారా అందరితో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే అంకిత తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్‌ నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఇంతకీ ఏంటా పోస్టు? అందులో ఉన్న సారాంశమేంటి? రండి తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
covid19---corona-virus:-keeping-friends-in-video-chat-man-proposes-her-girlfriend-during-this-quarantine-time

ఈ క్వారంటైన్‌ లవ్‌ ప్రపోజల్‌ చూశారా?

కరోనా మనుషుల మధ్య సామాజిక దూరం పెంచిందేమో కానీ.. వారి మధ్య ఉండే ప్రేమానురాగాల్ని ఏమాత్రం తగ్గించలేకపోయింది. అయితే కరోనా విజృంభిస్తోన్న ఈ తరుణంలో లాక్‌డౌన్‌ కారణంగా రోజంతా ఇంట్లో గడపలేక ఇబ్బందులు పడుతోన్న వారు కొందరైతే.. సరైన ప్రణాళిక ఉంటే ఈ లాక్‌డౌన్‌ సమయాన్ని మన మనసుకు నచ్చినట్లు ఎంజాయ్‌ చేయొచ్చు అని నిరూపిస్తున్నారు మరికొందరు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో గడపడం, పాత స్నేహాలను గుర్తు చేసుకొని వారిని పలకరించడం, ఇంటి పనుల్లో పాల్గొనడం, అభిరుచులపై దృష్టి పెట్టడం, కొత్త విషయాలు తెలుసుకోవడం.. మొదలైనవి చేస్తున్నారు. అంతేకాదు, తమ అనుభవాలు, ఆనందాలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటున్నారు కూడా! ఈ క్రమంలో ఓ ప్రేమికుడు తన ప్రేయసికి స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో లవ్‌ ప్రపోజ్‌ చేశాడు. ప్రపంచమంతా సామాజిక దూరం పాటిస్తోన్న ఇలాంటి పరిస్థితుల్లో అతడికి ఇది ఎలా సాధ్యమైందనుకుంటున్నారా..? అయితే ఇది చదవండి.

Know More

women icon@teamvasundhara
here-are-the-things-you-can-know-about-your-partner-through-work-from-home
women icon@teamvasundhara
stanford-couple-arranged-their-marriage-with-5-guests-amid-coronavirus-lockdown

కరోనా.. మా పెళ్లిని ఆపలేకపోయింది!

పెళ్లి.. కేవలం రెండక్షరాల మాట కాదు.. రెండు జీవితాలు పెనవేసుకుని జీవితాంతం కలిసి బతుకుతామనే బాస.. కష్టమైనా.. సుఖమైనా.. ఒకరికొకరం తోడుగా నిలుస్తామనే ప్రమాణం. అందుకే వివాహ వేడుకను వధూవరులిద్దరూ తమ జీవితాంతం గుర్తుండిపోయేంత అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలోనే తమ బంధువర్గాన్నంతా పిలిచి వారి ఆశీర్వాదాలు అందుకుంటారు. కానీ ప్రస్తుతం కరోనా ప్రభావంతో పెళ్లిళ్లు కళ తప్పాయి. ఈ నేపథ్యంలో కొందరు తమ పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటుంటే.. మరికొందరు నిరాండంబరంగా తంతును ముగించేస్తున్నారు. క్యాలిఫోర్నియా స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్‌ చదువుతోన్న ఓ ప్రేమ జంట కూడా కరోనా మా పెళ్లిని ఆపలేదంటూ తాజాగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలో కేవలం ఐదుగురు సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారీ లవ్లీ కపుల్. మరి, ఈ ముద్దుల జంట ప్రేమ, పెళ్లి ముచ్చట్లేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
elderly-couple-adrian-baker-and-stuart-baker-lost-their-lives-6-minutes-apart-during-coronavirus

women icon@teamvasundhara
husband-proves-social-distance-is-only-for-people-but-not-for-their-love

నీ పక్కన ఉండలేకపోతున్నా.. కానీ ఇక్కడే ఉన్నా..!

అతనికి తన భార్యంటే ప్రాణం..! వివాహ సమయంలో జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టంలో తోడుగా ఉంటానని తన భార్యకు ప్రమాణం చేశాడు. అయితే కొద్ది నెలల క్రితమే ఆమెకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఉందని తెలియడంతో.. అప్పట్నుంచి తన భార్యను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఈ క్రమంలో జరిగిన అన్ని రకాల చికిత్సలకు అతను ఆమెకు తోడుగా ఉన్నాడు. కానీ, ఇటీవల కీమోథెరపీ చికిత్స జరిగే సమయంలో మాత్రం అతనికి ఆ అవకాశం దక్కలేదు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఆస్పత్రి యాజమాన్యం పేషెంట్స్‌ను తప్ప మరెవరినీ ఆస్పత్రిలోకి అనుమతించలేదు. దీంతో అతను ఓ ప్లకార్డుపై ‘నీకు తోడుగా నేనున్నా..!’ అనే సందేశాన్ని రాసి ఆస్పత్రి బయటే కూర్చున్నాడు. ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండడంతో ఆ భర్తపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజన్లు.

Know More

women icon@teamvasundhara
husband-creates-home-as-restaurant-for-wife

ఈ భర్త తన భార్య కోసం ఏం చేశాడో మీరే చూడండి..!

కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది. గంటగంటకీ కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. వైరస్‌ను అడ్డుకునే క్రమంలో దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్‌ను ఎంతో సవాల్‌గా తీసుకున్నాయి. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంటి నుంచి బయట అడుగు పెట్టలేని పరిస్థితులు వచ్చాయి. అయితే ఈ కరోనా మహమ్మారి పుట్టక ముందు వరకు ఎంచక్కా రెస్టరంట్లు, షాపింగ్‌లంటూ ఎంజాయ్‌ చేసిన వారంతా ఇప్పుడు తమ తమ ఇళ్లలో బిక్కుబిక్కుమంటున్నారు. కానీ అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఆ లాక్‌డౌన్‌ సమయంలో తన భార్యకు ఓ అందమైన సర్‌ప్రైజ్‌ అందించి ఆమె మనసు గెలుచుకోవడమే కాదు.. వార్తల్లోనూ నిలిచాడు. వివరాల్లోకి వెళితే..

Know More

women icon@teamvasundhara
take-care-of-aged-parents-during-corona-lockdown-time

కరోనా అలర్ట్: కని, పెంచిన వారిని.. కంటికి రెప్పలా చూడండి!

కరోనా’ (కోవిడ్-19) వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తుండడంతో ప్రపంచమంతా చిగురుటాకు లా వణికి పోతోంది. కులం, మతం, ప్రాంతం, దేశంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘లాక్‌డౌన్’ పేరుతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ‘ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ’ పోలీసులు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇక వయసు మళ్లిన వారు ఈ వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువనే విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల మరణిస్తున్న వారిలో వృద్ధులే ఎక్కువని లెక్కలు కూడా చెబుతున్నాయి. మరి ప్రస్తుతం అంతా ఇళ్లకే పరిమితమవుతోన్న సమయంలో.. వయసు మళ్లిన మీ తల్లిదండ్రులను.. అవ్వ, తాతలను జాగ్రత్తగా చూసుకుంటున్నారా? మిమ్మల్ని కని, పెంచిన వారిని కరోనా నుంచి ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Know More

women icon@teamvasundhara
unadkat-and-maxwell-announces-their-engagement-with-their-girl-friends

సోల్‌ మేట్స్‌ దొరికేశారు!

జయదేవ్‌ ఉనాద్కత్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌... ప్రస్తుతం ప్రత్యేక పరిచయం అవసరం లేని క్రికెటర్ల పేర్లు. రంజీ ట్రోఫీ పోరులో సౌరాష్ర్ట జట్టును ఛాంపియన్‌గా నిలిపి ఉనాద్కత్‌ అందరి నోళ్లల్లో నానుతుండగా, తన దూకుడైన బ్యాటింగ్‌తో ఇప్పటికే భారతీయులకు ఆరాధ్య క్రికెటర్‌గా మారిపోయాడు ఆసీస్‌ క్రికెటర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌. ఈక్రమంలో తమ ఆటతీరుతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న ఈ క్రికెటర్లు త్వరలో ఓ ఇంటివారు కాబోతున్నారు. తమ మనసుకు నచ్చిన నెచ్చెలితో కలిసి కొత్త జీవితం ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా తాజాగా తమ ప్రియురాళ్లతో కలిసి ఉంగరాలు మార్చుకున్నారీ క్రికెటర్స్‌.

Know More

women icon@teamvasundhara
ayushmann-celebrates-19-years-of-togetherness-with-wife-tahira

19 ఏళ్ల క్రితం అర్ధరాత్రి అలా ప్రపోజ్‌ చేశా!

ప్రేమకు సమయం, సందర్భమనేది ఉండదు. ఎందుకంటే అది ఎప్పుడు, ఎవరి మీద, ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. కానీ ఆ ప్రేమను తెలియజేయాలంటే మాత్రం కచ్చితంగా మంచి ముహూర్తం చూసుకోవాలి. అందుకే చాలామంది తమ మనసుకు నచ్చినవారు హ్యాపీమూడ్‌లో ఉన్నప్పుడు తమ ప్రేమను చెబుతుంటారు. అలా ఎదుటివారి ప్రేమను గెలుచుకున్న ఆ ఆనందక్షణాలు ఎవరికైనా మధుర జ్ఞాపకమే. ఈ క్రమంలో బాలీవుడ్‌లో వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆయుష్మాన్‌ ఖురానా, తన ప్రేమ విషయాన్ని కూడా అంతే వైవిధ్యంగా వ్యక్తపరిచాడట. సరిగ్గా 19 ఏళ్ల క్రితం ఇదే రోజున ( మార్చి16న) తన సతీమణి తహీరా కశ్యప్‌కు ప్రపోజ్‌ చేసిన ఈ హ్యాండ్సమ్‌ హీరో... అప్పటి మధుర జ్ఞాపకాలను మళ్లీ గుర్తుకు తెచ్చుకున్నాడు.

Know More

women icon@teamvasundhara
sheela-kaur-gets-married-to-a-businessman

women icon@teamvasundhara
sameera-reddy-flip-the-switch-challenge-with-her-mother-in-law

ఈ సెలబ్రిటీ అత్తాకోడళ్ల సరదా ఛాలెంజ్‌ చూశారా?

అత్తాకోడళ్ల అనుబంధానికి సంబంధించి మన సమాజంలో భిన్నాభిప్రాయాలున్నాయి. అత్తాకోడళ్లంటే ఒకరంటే ఒకరికి పడదని, ఒకే ఇంట్లో ఉన్నా భిన్న ధృవాలుగా వ్యవహరిస్తుంటారని, వీరికి ఏ విషయాల్లోనూ పొసగదని చాలామంది అనుకుంటారు. అయితే అత్తమ్మ అంటే అమ్మకు ప్రతిరూపమని, కోడలు కూడా ఓ కూతురు లాంటిదే అని చాటిచెబుతున్న అత్తా కోడళ్లు కూడా మన చుట్టూ చాలామందే ఉన్నారు. అలాంటి కోవకే చెందుతారు సమీరా రెడ్డి-మంజ్రీ వర్దే. అత్తాకోడళ్లే అయినా తమ ఇద్దరి మధ్య తల్లీ-కూతుళ్లకు మించిన అనుబంధం ఉందని వీరిద్దరూ నిరూపిస్తున్నారు . ఈక్రమంలో ప్రస్తుతం టిక్‌టాక్‌లో ట్రెండ్‌ అవుతున్న ‘ఫ్లిఫ్‌ ది స్విచ్‌’ ఛాలెంజ్‌లో సరదాగా పాల్గొని సందడి చేశారీ సెలబ్రిటీ అత్తాకోడళ్లు.

Know More

women icon@teamvasundhara
marykom-and-k-onler-kom-celebrates-their-15th-marriage-anniversary

మమ్మల్ని ఇలా ముడి వేసినందుకు ఆ దేవుడికి థ్యాంక్స్‌ !

సాధారణంగా ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందంటారు. అయితే అందరూ కాకపోయినా... కొందరి ఆడవాళ్ల గెలుపు వెనక కూడా మగాళ్లుంటారు. ఇండియన్‌ స్టార్‌ బాక్సర్‌ మేరీకోమ్‌ దంపతులను చూస్తే ఈ మాట నిజమేననిపిస్తుంది. ఓ వైపు బాక్సింగ్‌ రింగ్‌లో ప్రత్యర్థులపై పంచ్‌ల వర్షం కురిపిస్తూనే... మరోవైపు ముగ్గురు పిల్లల తల్లిగా వారి ఆలనాపాలన చూసుకుంటోందీ లెజెండరీ బాక్సర్‌. వీటితో పాటు అదనంగా రాజ్యసభ సభ్యురాలిగా ప్రజలకు సేవలందిస్తోందామె. ఇలా కెరీర్‌, కుటుంబం, పిల్లలు..ఇలా అన్నింటినీ సమన్వయం చేసుకొని బాక్సింగ్‌ రింగ్‌లో రాణించాలంటే ఓ మహిళకు కత్తిమీద సామే అని చెప్పుకోవచ్చు. అయితే తన భర్త సహకారంతో వీటన్నింటినీ చక్కగా సమన్వయం చేసుకుంటున్నానని చెబుతోంది మేరీకోమ్‌. ఆయన అందించిన ప్రోత్సాహం వల్లే బాక్సింగ్‌లో అరుదైన విజయాలు సాధించానంటోంది. సరిగ్గా పదిహేనేళ్ల క్రితం ఇదే రోజు (మార్చి 12)న పెళ్లి పీటలెక్కారు మేరీకోమ్‌-కె ఒన్లర్‌. ఈక్రమంలో తమ పెళ్లి రోజును పురస్కరించుకుని దంపతులిద్దరూ తమ పెళ్లి నాటి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.

Know More

women icon@teamvasundhara
tips-to-become-your-husband-as-your-best-friend

women icon@teamvasundhara
allu-arjun-sneha-celebrates-their-9th-wedding-anniversary

ఈ బంధం ‘అల్లు’కొని తొమ్మిదేళ్లయింది..!

టాలీవుడ్‌కి సంబంధించి ప్రేమ వివాహం చేసుకున్న సెలబ్రిటీ జంటల్లో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, స్నేహల జంట కూడా ఒకటి. కొన్ని సంవత్సరాల క్రితం ఒక పెళ్లి వేడుకలో తొలిసారి కలుసుకున్నారీ లవ్లీ కపుల్‌. అలా తమ మధ్య ఉన్న స్నేహబంధం ప్రేమగా మారి.. పెళ్లికి దారి తీసింది. 2011, మార్చి 6న బన్నీ-స్నేహ దంపతులు ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. వీరికి అయాన్‌, అర్హ అనే ఇద్దరు పిల్లలున్నారు. బన్నీకి తన కుటుంబమంటే ప్రాణం. తను వృత్తిగతంగా ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబానికి తగిన సమయాన్ని కేటాయిస్తుంటాడు. పండగలు, పుట్టినరోజులు, ప్రత్యేక సందర్భాలను భార్యాపిల్లలతో కలిసి జరుపుకొంటుంటాడు. బన్నీ, స్నేహల వివాహం జరిగి నేటికి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తన భార్యకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతూ సోషల్‌ మీడియాలో ఓ ప్రత్యేక పోస్టు పెట్టాడు మన స్టైలిష్‌ స్టార్‌.

Know More

women icon@teamvasundhara
tamilnadu-sub-collector-ask-free-medical-service-instead-of-dowry

అందుకే డాక్టర్‌నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు!

సాధారణంగా ఓ అమ్మాయికి పెళ్లి ఫిక్సయితే, ఆ అమ్మాయి తండ్రికి ఎదురయ్యే మొదటి ప్రశ్న ‘అబ్బాయికి కట్నమెంత ఇస్తున్నారు?’ అని. దీంతో పాటు పెళ్లి లాంఛనాల కింద వరుడికి అందించే కానుకల విషయం కూడా చర్చకు వస్తుంది. అంతలా మన సమాజంలో వేళ్లూనుకుపోయింది వరకట్న దురాచారం. కట్నం తీసుకోవడమనేది చట్టరీత్యా నేరమైనా దానిని అడగడం ఇంకా తమ హక్కుగా భావిస్తోంది వరుడి కుటుంబం. అయితే ఇప్పడిప్పుడే వరకట్నం విషయంలో నేటి యువత ఆలోచనా ధోరణి క్రమక్రమంగా మారుతోంది. ప్రధానంగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ లాంటి ఉన్నత విద్యావంతులు ఈ సామాజిక దురాచారాన్ని రూపుమాపేందుకు తమదైన శైలిలో కృషిచేస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన ఓ ఐఏఎస్‌ అధికారి కూడా ఎలాంటి కట్న కానుకలు తీసుకోకుండానే కల్యాణం చేసుకున్నాడు. అయితే వరకట్నం బదులు భార్యతో ఓ ఆసక్తికర ఒప్పందం కుదుర్చుకున్నాడీ వరుడు.

Know More

women icon@teamvasundhara
keeping-mum-dad-pens-a-heartfelt-tribute-to-his-wife-she-has-their-second-child

ఇలాంటి భర్త ఉంటే ఎంత అదృష్టమో కదూ!

మాతృత్వమనేది మహిళలకు మాత్రమే సొంతమైన ఓ గొప్ప వరం. అందుకే పెళ్లయిన అమ్మాయిలందరూ వీలైనంత త్వరగా అమ్మగా ప్రమోషన్‌ పొందాలని కోరుకుంటారు. అయితే మాతృత్వమనేది ఓ మహిళకు ఎంత గొప్ప వరమో ఈక్రమంలో అంతటి అగ్ని పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గర్భం ధరించినప్పటి నుంచి బిడ్డకు జన్మనిచ్చేంత వరకు ఆమెకు అడుగడుగునా సవాళ్లే ఎదురవుతాయి. వీటిని అధిగమించి పురిటి నొప్పులను తట్టుకుని ఓ బిడ్డను ప్రసవించడమనేది తల్లికి పునర్జన్మ లాంటిదే. ఈ క్రమంలో ఓ కొత్త ప్రాణానికి రూపమిచ్చేందుకు తన భార్య పడిన కష్టం, వేదనకు అక్షర రూపమిచ్చాడు ఓ భర్త. తన భార్య నవమాసాల ప్రయాణాన్ని తన కుమారుడికి వివరిస్తూ సోషల్‌ మీడియాలో అతడు షేర్‌ చేసిన పోస్ట్‌ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Know More

women icon@teamvasundhara
konkona-sen-and-ranvir-shorey-file-for-divorce-after-five-years-of-separation

అవును.. మేమిద్దరం విడిపోయాం!

పెళ్లిలో అగ్ని సాక్షిగా ఏకమై, ఏడడుగులు నడిచిన భార్యాభర్తలు...నిండు నూరేళ్లు అలాగే కలిసుండాలని కోరుకుంటారు. అందుకు తగ్గట్టే కొందరి దంపతుల కాపురం ఎలాంటి కలహాల్లేకుండా సాఫీగా సాగిపోతుంది. ఇక ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలొచ్చినా కొన్ని జంటలు ఒకరికొకరు అర్థం చేసుకుంటూ సర్దుకుపోతుంటే మరికొన్ని జంటలు సంసారమనే సాగరంలో సర్దుకుపోలేకపోతున్నాయి. కలిసుండి కలహాల కాపురం కొనసాగించే బదులు పరస్పర అంగీకారంతో విడిపోతున్నాయి. ఇందులో సామాన్యులే కాదు సెలబ్రిటీ జంటలు కూడా ఉన్నాయి. తాజాగా బాలీవుడ్‌ నటి, దర్శకురాలు కొంకణా సేన్‌ శర్మ తన భర్తతో అధికారికంగా విడిపోయేందుకు కోర్టు మెట్లెక్కగా, మరో నటి భాగ్యశ్రీ కూడా ఒకానొక సమయంలో తన భర్తతో దూరంగా ఉన్నానంటూ ప్రకటించింది.

Know More

women icon@teamvasundhara
richa-chadda-and-ali-fazal-going-to-be-married

అభిరుచులే మమ్మల్ని కలిపాయి!

దీపికా-రణ్‌వీర్‌, సోనమ్‌-ఆనంద్‌, అనుష్క-విరాట్‌, బిపాసా-కరణ్‌, కరీనా-సైఫ్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే బాలీవుడ్‌ ప్రేమ పక్షుల జాబితా చాలా పెద్దదే అవుతుంది. ప్రేమతో మొదలైన వీరి బంధం పెళ్లితో ఏకమై ఎంతో అన్యోన్యంగా కొనసాగుతోంది. ఇలాంటి ప్రణయబంధంలోకి బాలీవుడ్‌కు చెందిన మరో ప్రేమ జంట అడుగిడనుందా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. బాలీవుడ్‌ క్యూట్‌ కపుల్స్‌లో ఒకరిగా పేరుగాంచిన రిచా చద్దా, అలీ ఫజల్‌ త్వరలోనే పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారట. కొన్నేళ్ల నుంచి డేటింగ్‌లో ఉన్న ఈ మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ కపుల్‌ తాజాగా మాల్దీవుల వెకేషన్‌లో సందడి చేస్తోంది. ఈ క్రమంలో త్వరలోనే పెళ్లి పీటలెక్కేందుకు నిర్ణయించుకున్నారని వార్తలు వస్తున్నాయి. మరి, ఇంతకీ ఈ అందాల జంట పెళ్లి ఎప్పుడు? ఎక్కడ జరగనుంది?అసలు వీరి ప్రేమ కథ ఎప్పుడు, ఎలా మొదలైంది? తెలియాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే..!

Know More

women icon@teamvasundhara
i-dont-understand-his-behavior

అతడిని ప్రేమించేస్తానేమోనని భయంగా ఉంది..!

నేను ఇంజినీరింగ్‌ చదువుతున్నా. ఆర్థిక భారమైనా అమ్మానాన్నలు కష్టపడి చదివిస్తున్నారు. నేను ఇంటికి దూరంగా ఓ స్నేహితురాలితో కలిసి గది అద్దెకి తీసుకుని ఉంటున్నా. ఆ విషయాలన్నీ నేను ఎప్పుడూ ఎవరితో చెప్పుకోను. ఒకసారి అనుకోకుండా బస్సులో మా లెక్చరర్‌ ఒకరు కలిశారు. మాటల సందర్భంలో కుటుంబ నేపథ్యం, స్నేహితురాలితో ఉంటున్న విషయాలన్నీ ...అమ్మానాన్నలే అతనికి చెప్పారు. దాంతోపాటూ ‘మా అమ్మాయిని బాగా చదివించండి’ అని కోరారు. ఆ రోజు నుంచీ మా లెక్చరర్‌ ప్రవర్తనలో చాలా తేడా. ఫోన్‌ చేయడం మొదలు పెట్టాడు. సెలవు రోజున ‘సినిమా టికెట్లు తీసుకోమంటావా, పార్కుకి వెళదామా..’ అంటూ అడుగుతున్నాడు. ఒకసారి ఏకంగా గది దగ్గరకే వచ్చాడు. దాంతో నా స్నేహితురాలు నా గురించి తప్పుగా అనుకోవడం మొదలుపెట్టింది. ఇవన్నీ మా లెక్చరర్‌తో గట్టిగా చెప్పలేకపోతున్నా. అతని ఆలోచన ఏంటో తెలియట్లేదు. అమ్మానాన్నలు చెప్పినందుకు శ్రద్ధ తీసుకుంటున్నాడా.. లేదంటే నామీద ఆసక్తి చూపుతున్నాడా అన్నది అర్థం కావట్లేదు. నేను అతడిని ప్రేమించేస్తానేమోనని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వండి. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
smelling-partner-shirt-can-make-good-sleep

భాగస్వామి దుస్తులు చెంతనుండగా.. నిద్రమాత్రలు ఏలనో!

స్త్రీ, పురుషుల బంధం గురించి ఎంతోమంది కవులు, ఎంతో అద్భుతంగా వర్ణించిన సందర్భాలున్నాయి. ‘ప్రేమించిన వ్యక్తి పక్కన ఉంటే చాలు.. అదే స్వర్గమని, ప్రేయసి లేత బుగ్గపై మొటిమ కూడా ముత్యంతో సమానమని, చివరికి చెమట చుక్క కూడా మంచి గంధమే అని’.. ఇలా ప్రేమికుల మనోభావాలకు అద్దం పడతాయీ వర్ణనలు. నిజంగా మనసారా ప్రేమించిన ఒక వ్యక్తి సాన్నిహిత్యంలో ఉంటే ఇలాంటి భావనే కలుగుతుందా? అంటే.. ప్రేమలో ఉన్న వాళ్లు మాత్రం వెంటనే అవునని సమాధానమిస్తారు. అయితే ప్రేమించిన వ్యక్తి పక్కన ఉంటేనే కాదు... చివరికి వారు వేసుకున్న దుస్తుల నుంచి వచ్చే వాసన కూడా భాగస్వాములను సానుకూలంగా ప్రభావితం చేస్తుందట. నమ్మలేకపోతున్నారు కదూ! కానీ ఇది అక్షరాల నిజం. కెనడా పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఇంతకీ వారు చేసిన ఆ పరిశోధన, అందులో తేలిన ఆ ఆసక్తికర అంశాలు ఏమిటో చూద్దాం రండి.. నిద్రలేమి... వినడానికి ఇది చిన్న సమస్యే అయినా అనుభవించే వారికి మాత్రం ఇదో నరకం. పడుకోగానే నిద్రపోతే.. ‘అబ్బా ఎంత అదృష్టవంతులు.. పడుకోగానే నిద్రలోకి జారుకుంటారు’ అనే రోజులివి. పని ఒత్తిడి, గ్యాడ్జెట్‌ల వాడకం పెరుగుతుండడం, మారుతున్న ఆహారపు అలవాట్లు.. ఇలా నిద్రలేమికి గల కారణాలెన్నో. ఇక నిద్రలేమి మరెన్నో ఆరోగ్య సమస్యలకూ కారణమవుతోంది. అయితే కొంతమంది దీన్ని అధిగమించడానికి నిద్రమాత్రలను ఉపయోగిస్తుంటారు. ఇది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తోన్నా పట్టించుకోరు.

Know More

women icon@teamvasundhara
bipasa-karan-cute-photos

ముద్దుల జంట.. చూసేందుకు రెండు కళ్లూ చాలవంట..!

బాలీవుడ్‌ స్వీట్‌ కపుల్స్‌లో బిపాసా బసు, కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ ఒకరు. చూడముచ్చటగా.. నిన్ననే పెళ్లైందా అన్నట్లు ఎప్పుడూ చాలా రొమాంటిక్‌గా కనిపిస్తారీ క్యూట్‌ కపుల్‌. వివాహమై నాలుగేళ్లు గడుస్తోన్నా.. తమ జీవితంలో వచ్చే ప్రతి ప్రత్యేక సందర్భాన్నీ సరికొత్తగా సెలబ్రేట్‌ చేసుకుంటూ, వెకేషన్స్‌కి వెళ్తూ తమ అనుబంధాన్ని నిత్యనూతనం చేసుకుంటున్నారీ మంకీ కపుల్‌. ఇక వీరి మధ్య ఉండే అన్యోన్యతకు ఇద్దరూ కలిసి దిగే ఫొటోలే ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలుస్తాయని చెప్పచ్చు. ‘మంకీలవ్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఇద్దరూ కలిసి దిగిన లవ్లీ ఫొటోస్‌ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు బిప్స్‌-కరణ్‌. ఆదివారం (ఫిబ్రవరి 23) కరణ్‌ సింగ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రస్తుతం ఈ జంట మాల్దీవుల్లో తెగ సందడి చేస్తోంది. అంతేనా.. అక్కడి బీచుల్లో కలియతిరుగుతూ, సముద్రంలో జలకాలాడుతూ ఆ మధురానుభూతులను ఫొటోల్లో బంధిస్తూ.. తమ అభిమానులతో పంచుకుంటోందీ ముద్దుల జంట. మరి, ఆ క్యూట్‌ పిక్స్‌తో పాటు గతంలో పలు సందర్భాల్లో ఇద్దరూ కలిసి దిగిన కొన్ని అందమైన ఫొటోలపై మనమూ ఓ లుక్కేద్దామా..?

Know More

women icon@teamvasundhara
how-to-change-my-husband-behavior

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత