scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఈ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

Movie Masala

 
category logo

పెళ్లితో నూరేళ్ల బంధానికి వెల్‌కమ్‌ చెప్పారు!

Celebrities who got married in 2019

సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన పెళ్లి వేదికలు.. హుషారెత్తించే బారాత్‌, సంగీత్‌ పార్టీలు.. కనువిందు చేసే మెహెందీ, హల్దీ ఫంక్షన్లు..విందులు..వినోదాలు..ఇంకా అంగరంగ వైభవంగా జరిగే ఇతర వివాహ కార్యక్రమాలు..వెరసి సెలబ్రిటీల పెళ్లి వేడుకల్లో ఉండే సందడే వేరు. ఈ సందర్భంగా కొత్త దంపతులను ఆశీర్వదించడానికి తారాలోకం మొత్తం ఒకేచోట చేరుతుంది. అందుకే సినీతారలు, క్రీడాకారులు..వంటి సెలబ్రిటీల షాదీలు జరుగుతున్నాయంటే అందరి కళ్లూ అటువైపే చూస్తుంటాయి. నూతన వధూవరులు ధరించిన దుస్తులు, అలంకరించుకున్న ఆభరణాలు..తదితర విషయాలన్నీ తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో త్వరలోనే కొత్త సంవత్సరం రాబోతుంది..మరి 2019లో పెళ్లిపీటలెక్కి కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన కొందరు సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం రండి..!

శ్లోకా మెహతా-ఆకాశ్‌ అంబానీ

అపర కుబేరుడు అంబానీ ఇంట ఏ వేడుకైనా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక పెళ్లంటే..ఎంత హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో ముఖేష్‌-నీతా దంపతుల కుమారుడు ఆకాశ్‌ అంబానీ..వజ్రాల వ్యాపారి రస్సెల్‌ మెహతా కూతురు శ్లోకా మెహతా వివాహం ఈ ఏడాది మార్చి 9న ఎంతో వైభవంగా జరిగింది. ముంబయి వేదికగా జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో భాగంగా కొత్త దంపతులను ఆశీర్వదించడానికి అతిరథ మహారథులంతా కదిలివచ్చారు. ‘గ్రాండ్‌ వెడ్డింగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ గా నిలిచిన ఈ వివాహ వేడుకలో అమితాబ్‌, ఐశ్వర్యారాయ్‌, రేఖ, బోనీ కపూర్‌, జుహీచావ్లా, రజనీకాంత్ , సచిన్‌-అంజలి, ఏక్తా కపూర్‌, ఆమిర్‌ఖాన్‌-కిరణ్‌రావ్‌, అక్షయ్‌-ట్వింకిల్‌ ఖన్నాతో పాటు పీవీసింధు, గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌, బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ దంపతులు, ఐరాస మాజీ జనరల్‌ సెక్రటరీ బాన్‌ కీ మూన్‌..వంటి అంతర్జాతీయ ప్రముఖులు సైతం సందడి చేశారు.

View this post on Instagram

A post shared by Akash Ambani (@ambani_akash) on

సాయేషా సైగల్‌- ఆర్య

పడేసావే..పడేసావే’ అంటూ హీరో ఆర్యను తన ప్రేమలో పడేసుకుంది బాలీవుడ్‌ బ్యూటీ సాయేషా సైగల్‌. బాలీవుడ్‌ దిగ్గజ నటులు సైరాభాను-దిలీప్‌కుమార్‌ల మనవరాలైన ఆమె ‘అఖిల్‌’ సినిమాతో మన తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది. 2018లో విడుదలైన ‘గజనీ కాంత్‌’ సినిమా షూటింగ్‌లో ప్రేమలో పడ్డ సాయేషా-ఆర్య ఏడాది పాటు తమ ప్రేమను రహస్యంగా ఉంచారు. ఈ ఏడాది ‘ప్రేమికుల రోజు’న తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా బయటపెట్టిన ఈ ముద్దుల జంట.. మార్చి10న హైదరాబాద్‌ ఫలక్‌నుమా ప్యాలస్‌ వేదికగా పెళ్లిపీటలెక్కింది. ముస్లిం వివాహ సంప్రదాయ పద్ధతిలో జరిగిన వీరి ‘నిఖా’ కార్యక్రమానికి టాలీవుడ్, బాలీవుడ్‌, కోలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు

పూజా బాత్రా-నవాబ్‌ షా

View this post on Instagram

We Did ♥️

A post shared by Pooja Batra Shah (@poojabatra) on

సిసింద్రీ’ సినిమాలో నాగార్జునతో కలిసి సందడి చేసిన పూజా బాత్రా.. ‘దేవీ పుత్రుడు’, ‘డిక్టేటర్‌’ సినిమాల్లో విలన్‌ క్యారక్టర్లతో టాలీవుడ్‌లో మెరిసిన నవాబ్‌షా ఈ ఏడాది జులై4 రహస్యంగా వివాహం చేసుకున్నారు. పెళ్లయ్యాక పదిరోజుల తరువాత తమ వివాహ విషయాన్ని బయటపెట్టారీ లవ్లీ కపుల్‌. ఓ కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా మొదలైన వీరి పరిచయం..ఆ తర్వాత ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో దిల్లీలోని ఆర్య సమాజం సంప్రదాయాల ప్రకారం తమ ప్రేమబంధాన్ని వైవాహిక బంధంగా మార్చుకున్నారీ లవ్లీకపుల్‌. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, స్నేహితులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమాలు, అమెరికన్‌ షోలలో నటిస్తున్న పూజకు 2002లోనే ఓ వైద్యుడితో పెళ్లయింది. అయితే కొన్ని కారణాల వల్ల 2011లో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.

సౌందర్య – విషగణ్‌

రజనీకాంత్‌ రెండో కుమార్తె సౌందర్య, నటుడు -పారిశ్రామికవేత్త విషగణ్‌ వనంగమూడితో కలిసి ఈ ఏడాదే ఏడడుగులు నడిచింది. ఫిబ్రవరి 8న ప్రి వెడ్డింగ్‌ రిసెప్షన్‌తో మొదలైన ఈ పెళ్లి వేడుకలు 11వరకు అంగరంగ వైభవంగా జరిగాయి. చెన్నైలోని ఎం ఆర్సీ నగర్‌లోని లీలా ప్యాలస్‌ వేదికగా జరిగిన వీరి వివాహానికి తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, స్టాలిన్‌, కమల్‌హాసన్‌, మణిరత్నం, సుహాసిని, మోహన్‌బాబు, సుబ్బరామిరెడ్డి, ప్రభు, రాఘవలారెన్స్‌, మీనా, ఆండ్రియా, మంజిమా మోహన్‌ వంటి అతిరథ మహారథులు హాజరయ్యారు. రజనీ కూతురుగానే కాకుండా గ్రాఫిక్‌ డిజైనర్‌గా, దర్శకనిర్మాతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సౌందర్యకు 2010లో అశ్విన్‌ అనే వ్యాపారవేత్తతో వివాహమైంది. అయితే వ్యక్తిగత కారణాలతో ఈ జంట 2017లో విడాకులు తీసుకుంది. ఇక విషగణ్‌కు కూడా గతంలో కనిఖ అనే అమ్మాయితో పెళ్లయింది. వీరు కూడా వ్యక్తిగత కారణాలతో కొంత కాలానికే విడాకులతో వేరయ్యారు.

అర్చన - జగదీశ్‌

నేను’ సినిమాతో వెండితెరకు పరిచయమై ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంలోని ‘లల్లీ’ క్యారక్టర్‌తో ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది అర్చన. వీటితో పాటు ‘శ్రీరామదాసు’, ‘ఖలేజా’ తదితర చిత్రాల్లో సందడి చేసిన ఈ తెలుగందం నవంబర్‌ 14న హెల్త్‌కేర్‌ సంస్థ ఉపాధ్యక్షుడు జగదీశ్‌తో కలిసి ఏడడుగులు నడిచింది. అంతకు ముందు కొంతకాలం పాటు ప్రేమలో మునిగితేలిన ఈ లవ్‌బర్డ్స్‌ పెద్దల అంగీకారంతో అక్టోబర్‌లో ఉంగరాలు మార్చుకున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌ వేదికగా పూలదండలు మార్చుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారీ లవ్లీ కపుల్‌. ఇరుకుటుంబ సభ్యులు, స్నేహితులు, పలువరు సినీ ప్రముఖులు హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు

View this post on Instagram

A post shared by Archana Jagadeesh (@archanashastryofficial) on

ఆశ్రితా శెట్టి - మనీష్‌ పాండే

నీవెవ్వరో’ అంటూ ‘ఎన్‌ హెచ్‌4’ సినిమాలోని ఒకే ఒక్క పాటతో తెలుగు ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకుంది ఆశ్రితా శెట్టి. ఈ సినిమాతో పాటు పలు తమిళ సినిమాల్లో తన అందం, అభినయంతో ఇట్టే ఆకట్టుకుందీ అందాల తార. కుర్రకారు కలల రాణిగా మారిపోయిన ఆమె అందానికి యంగ్‌ క్రికెటర్‌ మనీష్‌ పాండే కూడా క్లీన్‌ బౌల్డయ్యాడు. ప్రేమలో ఉన్నంత కాలం ప్రైవసీని పాటించిన ఈ జంట కొన్ని రోజుల క్రితమే తమ డేటింగ్‌ విషయాన్ని బయటపెట్టింది. వీరి ప్రేమకు పెద్దల అంగీకారం కూడా తోడవడంతో డిసెంబర్‌ 2న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారీ క్యూట్‌ కపుల్‌. ముంబైలోని ఓ హోటల్‌లో అంగరంగవైభవంగా జరిగిన ఈజంట వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు.

View this post on Instagram

2.12.2019 ❤️

A post shared by Ashrita Shetty (@ashritashetty_) on

ఆనమ్‌ మీర్జా - అసదుద్దీన్‌

హైదరాబాద్‌కు సంబంధించి ఈ ఏడాది గ్రాండ్‌గా జరిగిన వెడ్డింగ్‌ ఈవెంట్లలో ఆనమ్‌-అసద్‌ల పెళ్లి కూడా ఒకటి. టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా సోదరి ఆనమ్‌ మీర్జా, మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ కుమారుడు అసదుద్దీన్‌ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. తమ ప్రేమకు ఇరుకుటుంబ సభ్యులు కూడా అంగీకారం తెలపడంతో డిసెంబర్‌ 11న ‘నిఖా’ ద్వారా ఒక్కటయ్యారీ లవ్లీ కపుల్‌. ముస్లిం సంప్రదాయ పద్ధతిలో అంగరంగ వైభవంగా జరిగిన వీరి వివాహానికి పలువురు ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ క్రమంలో టెన్నిస్‌ స్టార్‌ సానియా కూడా సెలబ్రిటీలతో పోటీ పడి డ్యాన్స్‌ చేసింది.

View this post on Instagram

A post shared by Sania Mirza (@mirzasaniar) on

వీరు కూడా పెళ్లిపీటలెక్కారు..!

* ‘ఒకరికి ఒకరు’ చిత్రంతో పాటు పలు తెలుగు చిత్రాల్లో సందడి చేసిన ఆర్తి ఛాబ్రియా మారిషస్‌కి చెందిన చార్టర్డ్‌ అకౌంటెంట్‌తో కలిసి పెళ్లిపీటలెక్కింది. జూన్‌ 24న ముంబయి వేదికగా వీరి వివాహం జరిగింది.

* బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ, కాంట్రవర్షియల్‌ క్వీన్‌ రాఖీ సావంత్‌..యూకేకు చెందిన రితేశ్‌ను పెళ్లిచేసుకున్నట్లు ఆగస్టులో ఇన్‌స్టా వేదికగా ప్రకటించింది.

View this post on Instagram

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on

* ‘మిర్చి’, ‘మిరపకాయ్‌’ సినిమాలతో పాటు పలు హిట్‌ సినిమాల్లో నటించిన రీచా గంగోపాధ్యాయ కూడా తన బ్యాచిలర్‌ లైఫ్‌కు గుడ్‌ బై చెప్పేసింది. అమెరికన్‌ బాయ్‌ ఫ్రెండ్‌ జోయ్‌తో కలిసి డిసెంబర్‌ 17న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిందీ బార్బీ గర్ల్‌.

*ఇక రెజ్లింగ్‌ క్వీన్‌ బబితా ఫోగట్‌ తన ‘నచ్‌ బలియే’ జోడీ వివేక్‌ సుహాగ్‌తో కలిసి ఏడడుగులు నడిచింది. డిసెంబర్‌ 2న వీరి వివాహం జరిగింది.

View this post on Instagram

A post shared by Geeta Phogat❤️Pawan Saroha 👫 (@geetaphogat) on

* అదేవిధంగా బుల్లితెరపై సందడి చేస్తోన్న పూజా రామచంద్రన్‌, పల్లవి, మేఘనా, లహరి, అస్మిత, సమీర తదితరులు కూడా ఈ ఏడాది తమ జీవిత భాగస్వామితో కలిసి కొత్త జీవితం ప్రారంభించారు.  





gynecologist Ask Psychology Expert
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి


Know More

women icon@teamvasundhara
smelling-partner-shirt-can-make-good-sleep

భాగస్వామి దుస్తులు చెంతనుండగా.. నిద్రమాత్రలు ఏలనో!

స్త్రీ, పురుషుల బంధం గురించి ఎంతోమంది కవులు, ఎంతో అద్భుతంగా వర్ణించిన సందర్భాలున్నాయి. ‘ప్రేమించిన వ్యక్తి పక్కన ఉంటే చాలు.. అదే స్వర్గమని, ప్రేయసి లేత బుగ్గపై మొటిమ కూడా ముత్యంతో సమానమని, చివరికి చెమట చుక్క కూడా మంచి గంధమే అని’.. ఇలా ప్రేమికుల మనోభావాలకు అద్దం పడతాయీ వర్ణనలు. నిజంగా మనసారా ప్రేమించిన ఒక వ్యక్తి సాన్నిహిత్యంలో ఉంటే ఇలాంటి భావనే కలుగుతుందా? అంటే.. ప్రేమలో ఉన్న వాళ్లు మాత్రం వెంటనే అవునని సమాధానమిస్తారు. అయితే ప్రేమించిన వ్యక్తి పక్కన ఉంటేనే కాదు... చివరికి వారు వేసుకున్న దుస్తుల నుంచి వచ్చే వాసన కూడా భాగస్వాములను సానుకూలంగా ప్రభావితం చేస్తుందట. నమ్మలేకపోతున్నారు కదూ! కానీ ఇది అక్షరాల నిజం. కెనడా పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఇంతకీ వారు చేసిన ఆ పరిశోధన, అందులో తేలిన ఆ ఆసక్తికర అంశాలు ఏమిటో చూద్దాం రండి.. నిద్రలేమి... వినడానికి ఇది చిన్న సమస్యే అయినా అనుభవించే వారికి మాత్రం ఇదో నరకం. పడుకోగానే నిద్రపోతే.. ‘అబ్బా ఎంత అదృష్టవంతులు.. పడుకోగానే నిద్రలోకి జారుకుంటారు’ అనే రోజులివి. పని ఒత్తిడి, గ్యాడ్జెట్‌ల వాడకం పెరుగుతుండడం, మారుతున్న ఆహారపు అలవాట్లు.. ఇలా నిద్రలేమికి గల కారణాలెన్నో. ఇక నిద్రలేమి మరెన్నో ఆరోగ్య సమస్యలకూ కారణమవుతోంది. అయితే కొంతమంది దీన్ని అధిగమించడానికి నిద్రమాత్రలను ఉపయోగిస్తుంటారు. ఇది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తోన్నా పట్టించుకోరు.

Know More

women icon@teamvasundhara
bipasa-karan-cute-photos

ముద్దుల జంట.. చూసేందుకు రెండు కళ్లూ చాలవంట..!

బాలీవుడ్‌ స్వీట్‌ కపుల్స్‌లో బిపాసా బసు, కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ ఒకరు. చూడముచ్చటగా.. నిన్ననే పెళ్లైందా అన్నట్లు ఎప్పుడూ చాలా రొమాంటిక్‌గా కనిపిస్తారీ క్యూట్‌ కపుల్‌. వివాహమై నాలుగేళ్లు గడుస్తోన్నా.. తమ జీవితంలో వచ్చే ప్రతి ప్రత్యేక సందర్భాన్నీ సరికొత్తగా సెలబ్రేట్‌ చేసుకుంటూ, వెకేషన్స్‌కి వెళ్తూ తమ అనుబంధాన్ని నిత్యనూతనం చేసుకుంటున్నారీ మంకీ కపుల్‌. ఇక వీరి మధ్య ఉండే అన్యోన్యతకు ఇద్దరూ కలిసి దిగే ఫొటోలే ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలుస్తాయని చెప్పచ్చు. ‘మంకీలవ్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఇద్దరూ కలిసి దిగిన లవ్లీ ఫొటోస్‌ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు బిప్స్‌-కరణ్‌. ఆదివారం (ఫిబ్రవరి 23) కరణ్‌ సింగ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రస్తుతం ఈ జంట మాల్దీవుల్లో తెగ సందడి చేస్తోంది. అంతేనా.. అక్కడి బీచుల్లో కలియతిరుగుతూ, సముద్రంలో జలకాలాడుతూ ఆ మధురానుభూతులను ఫొటోల్లో బంధిస్తూ.. తమ అభిమానులతో పంచుకుంటోందీ ముద్దుల జంట. మరి, ఆ క్యూట్‌ పిక్స్‌తో పాటు గతంలో పలు సందర్భాల్లో ఇద్దరూ కలిసి దిగిన కొన్ని అందమైన ఫొటోలపై మనమూ ఓ లుక్కేద్దామా..?

Know More

women icon@teamvasundhara
lessons-to-learn-from-shiv-and-parvathi-for-todays-couple
women icon@teamvasundhara
how-to-change-my-husband-behavior

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
strength-of-marriage-depend-on-the-husbands-job-status

బంధాన్ని నిలిపేది భర్త ఉద్యోగమేనా..?

‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అని ఎప్పుడోనే చెప్పారు జర్మన్‌కు చెందిన ప్రముఖ తత్త్వవేత్త, ఆర్థికవేత్త కార్ల్‌మార్క్స్‌. ‘డబ్బుకు ప్రేమ అవసరం లేదు కానీ, ప్రేమకు డబ్బు కావాలి’. ఇది ఓ సినిమాలో హీరో తన ప్రేయసితో చెప్పే డైలాగ్‌. అయితే ‘బంధాలు నిలిచి ఉండాలంటే కావాల్సింది డబ్బులు కాదు ప్రేమే’, ‘డబ్బులు శాశ్వతం కాదు, మనుషుల మధ్య ఉండే ప్రేమలే శాశ్వతం’ అని మరికొందరు వాదిస్తుంటారు. ఇవి చెప్పడానికే బాగుంటాయి కానీ డబ్బులేనిది ఈ ప్రపంచం ముందుకు నడవదనేది జగమెరిగిన సత్యం. ఇదేదో గాలికి చెబుతున్న మాటలు కావు. ప్రఖ్యాత హార్వర్డ్‌ యూనివర్సిటీ చేసిన ఓ అధ్యయనంలో తేలింది. ‘భర్త ఆర్థిక, ఉద్యోగ పరిస్థితులు బంధంపై ఎంతవరకు ప్రభావం చూపుతాయన్న’ అంశంపై చేసిన సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా..?

Know More

women icon@teamvasundhara
questions-to-ask-your-partner-before-marriage

పెళ్లికి ముందే ఈ ప్రశ్నలు అడగండి !

పెళ్లంటే నూరేళ్ల పంట..! జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ నిండు నూరేళ్లు ఆనందంగా గడపడమే వివాహ బంధానికి అసలైన అర్ధం. కానీ, ప్రస్తుత పరిస్థితులు ఇందుకు భిన్నంగా తయారయ్యాయి. మూడు ముళ్ల బంధం మూన్నాళ్ల ముచ్చటగా మారిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అభిప్రాయభేదాలు, ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం లేకపోవడం, ఆర్ధికపరమైన విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండడం, పిల్లలు లేకపోవడం.. ఇలా రకరకాల కారణాలతో ఎన్నో జంటలు పెళ్లైన కొన్నాళ్లకే విడిపోతున్నాయి. తమ సమస్యలను పరిష్కరించుకోలేక విడాకుల కోసం న్యాయస్థానాల ముందు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో పెళ్లికి ముందే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం వల్ల చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయి. ఇలా చేయడం వల్ల ఒకరిపై ఒకరికి పూర్తి అవగాహన రాకపోయినా.. తాము చేసుకోబోయే వ్యక్తి ఆలోచన విధానాన్ని కొంతమేరకు అంచనా వేసే అవకాశం మాత్రం కచ్చితంగా ఉంటుంది. ఈ క్రమంలో పెళ్లికి ముందు తాము చేసుకోబోయే వాళ్లను వధువు/వరుడు అడగాల్సిన కొన్ని ప్రశ్నలేంటో చూసేద్దామా..!

Know More

women icon@teamvasundhara
shriya-sharan-opens-up-about-her-love-life

మా ప్రేమకథ అక్కడే మొదలైంది!

సుమారు 19 ఏళ్ల క్రితం ‘ఇష్టం’ సినిమాతో ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రియ. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు ఆంగ్ల సినిమాల్లోనూ నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. రజనీకాంత్‌, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి అగ్ర హీరోలతో పాటు పవన్‌, ప్రభాస్‌, మహేశ్‌ లాంటి యువ హీరోలతోనూ ఆడిపాడిందీ ముద్దుగుమ్మ. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రత్యేక పాటలతో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న ఈ అందాల తార 2018 మార్చిలో రహస్యంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రష్యాకు చెందిన టెన్నిస్‌ ఆటగాడు ఆండ్రీ కొశ్చీవ్‌తో కలిసి ఏడడుగులు నడిచిన ఆమె, ఇప్పటివరకు ఎప్పుడూ తన భర్త గురించి కానీ, తన ప్రేమకథ గురించి కానీ ఎప్పుడూ నోరు విప్పలేదు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా ప్రేమ, పెళ్లితో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుందీ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
tollywood-hero-nitin-posts-his-marriage-photos-social-media

‘సింగిల్’ అన్నాడు... ‘మింగిల్‌’ అయిపోతున్నాడు !

టాలీవుడ్‌లో ఇండస్ట్రీలో ది మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్స్‌లో ఒకడిగా ఉన్న యంగ్‌ హీరో నితిన్‌.. పెళ్లి గురించి ఎప్పుడు ప్రస్తావన తీసుకొచ్చినా దాటేసేవాడు. కానీ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో భాగంగా ప్రస్తుతం తాను ప్రేమలో ఉన్నానని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా మొన్నటివరకు తన పెళ్లి గురించి ఎలాంటి చడీచప్పుడూ లేకుండా ఉన్న నితిన్‌.. తాజాగా ఏకంగా తన వివాహ ప్రారంభ వేడుకలకు సంబంధించిన ఫొటోలను పోస్ట్‌ చేసి అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేశాడు.. గతకొన్ని రోజులుగా తన స్నేహితురాలితో ప్రేమలో ఉన్న నితిన్‌ మరికొన్ని రోజుల్లో ఓ ఇంటి వాడు కాబోతున్నాడన్నమాట! ఇంతకీ నితిన్‌ మనసు కొల్లగొట్టిన ఆ లక్కీ గర్ల్‌ ఎవరో, వీళ్ల ప్రేమకథేంటో మనమూ తెలుసుకుందామా!!

Know More

women icon@teamvasundhara
follow-me-couples-set-a-new-trend-in-their-photoshoot

‘ఫాలో ఫాలో మీ’ అంటోన్న ఈ జంట కథేంటో తెలుసా?

ప్రయాణాలంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. అందులోనూ మనకిష్టమైన వారితో, మనసుకు నచ్చిన వారితో ఓ వెకేషన్‌కో, టూర్‌కో వెళితే ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేం. విహారయాత్రలతో మనసుకు ప్రశాంతత దొరకడంతో పాటు మనుషుల మధ్య బంధాలు మరింత దృఢంగా మారతాయి. అందుకే చాలామంది బిజీ లైఫ్‌ నుంచి బ్రేక్‌ తీసుకొని మరీ ఏడాదికోసారో, రెండుసార్లో ఔటింగ్‌కు వెళుతుంటారు. అయితే రష్యాకు చెందిన ఓ ప్రేమజంట పదేళ్లుగా ప్రపంచమంతా పర్యటిస్తూనే ఉంది. వివిధ దేశాల్లోని చారిత్రక ప్రదేశాలు, దేవాలయాలు, పురాతన కట్టడాలు, మ్యూజియంలను చుట్టేస్తోంది. ఈ క్రమంలో ఓవైపు తమ కళ్లతో ఆ అందమైన ప్రదేశాలను చూస్తూనే, మరోవైపు తమ కెమెరా కళ్లతో ఆ మధురానుభూతులను బంధిస్తున్నారు. అనంతరం ఆ అందాలను ‘ఫాలోమీ’ సిరీస్‌ పేరుతో ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. మరి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమ్‌ సొంతం చేసుకున్న ఈ ‘ఫాలోమీ’ ఫొటో సిరీస్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి..!

Know More

women icon@teamvasundhara
famous-love-dialogues-in-tollywood-movies

ప్రేమ గురించి ఇలా చెబితే ఫిదా అయిపోరూ?!

‘ప్రేమ.. రెండక్షరాల మహా కావ్యం. ప్రతి మనిషి అన్వేషణ ప్రేమ కోసమే. ఈ ప్రపంచం ఇంత అందంగా ఉందంటే అది కేవలం ప్రేమ వల్లే’.. ఇదీ ప్రేమలో ఉన్న వారికి కలిగే భావన. గతించిన చరిత్రలో, ప్రస్తుత వర్తమానంలో ఎంతోమంది గొప్ప ప్రేమికుల గురించి మనం వినే ఉంటాం. ఇక ఫిబ్రవరి 14వచ్చిందంటే చాలు.. ప్రేమికులు తమ మనసులోని భావాలను వ్యక్తం చేయడానికి తహతహలాడుతుంటారు. అప్పటికే ప్రేమ మైకంలో తేలియాడుతున్న వారు ఈ ప్రత్యేకమైన రోజున తమ ప్రియమైన వారిని ఎలా ఇంప్రెస్‌ చెయ్యాలని ఆలోచిస్తే.. మొదటిసారి ప్రేమను వ్యక్తపరచాలనుకునే వారికి వేలంటైన్స్‌ డే ఓ మధురానుభూతిగా మిగిలిపోతుందని చెప్పుకోవచ్చు. ఇలా నిజ జీవితంలోనే కాదు.. వెండితెరపైనా ఎన్నో ప్రేమ కావ్యాలు సినీ ప్రియుల మనసును తాకాయి. అందులోని పాటలే కాదు.. డైలాగ్స్‌ కూడా ఈతరం ప్రేమికులు తమ ప్రియమైన వారితో చెబుతూ తమ మనసులోని ప్రేమను పంచుకోవడం మనం చూస్తూనే ఉంటాం.. ఈక్రమంలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తెలుగు చిత్రాల్లోని కొన్ని పాపులర్‌ లవ్‌ డైలాగ్స్‌పై ఓ లుక్కేద్దామా!!

Know More

women icon@teamvasundhara
different-hugs-have-different-meanings

కౌగిలింతకో కథ!

ఏదైనా ఆందోళన, తీవ్రమైన బాధలో ఉన్న వ్యక్తిని మనస్ఫూర్తిగా గుండెలకు హత్తుకోండి.. దెబ్బకు వాళ్ల బాధంతా పరార్‌!! ఇదేదో సినిమాలోని డైలాగ్‌ అనుకుని తేలికగా తీసుకోకండి. నిజంగానే కౌగిలింతకు ఎంతో పవర్‌ ఉంది. మనిషి మూడ్‌ని మార్చేసే శక్తి హగ్‌లో ఉందని ఇప్పటికే పరిశోధకులు శాస్త్రీయంగా కనుగొన్నారు కూడా! జనవరి 12న ఏకంగా ‘నేషనల్‌ హగ్‌ డే’గా నిర్వహిస్తున్నారంటేనే కౌగిలింత గొప్పతనమేంటో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు... వేలంటైన్స్‌ వీక్‌లో భాగంగా ఫిబ్రవరి 12ను ‘హగ్‌ డే’గా జరుపుకోవడం మనకు తెలిసిందే. ఈ ప్రత్యేకమైన రోజున తమకు నచ్చిన వ్యక్తులను ఆప్యాయంగా కౌగిలించుకొని తమ ప్రేమను వ్యక్తం చేస్తారు ప్రేమపక్షులు. మరి, ఆప్యాయంగా ఇచ్చే ఈ కౌగిలింతలో ఎన్నో రకాలు, వాటికి మరెన్నో అర్థాలున్నాయన్న విషయం మీకు తెలుసా? రిలేషన్‌షిప్‌ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఏ హగ్‌కు ఏ అర్థముందో ఇప్పుడు తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
surprising-gifts-for-your-valentine

నచ్చిన వారికి మెచ్చిన ‘కానుకి’ద్దాం..!

ఎటు చూసినా ప్రేమ మయం.. ఎంత ఆస్వాదించినా తనివి తీరదు ప్రేమలోని మాధుర్యం.. ఎక్కడ చూసినా ప్రేమికులంతా ఏకమై పండగలా జరుపుకొనే ‘ప్రేమికుల దినోత్సవం’ వచ్చేస్తోంది. తాము ప్రేమించిన వ్యక్తిపై తమ మనసులోని అందమైన భావాలను తెలియజేయాలని, బహుమతులతో వారిని మరింతగా సర్‌ప్రైజ్‌ చేయాలని ప్రేమికులంతా ఆరాటపడుతుంటారు. అయితే మారుతున్న కాలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన రోజున ఇచ్చిపుచ్చుకునే బహుమతుల విషయంలోనూ ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మరి, అలా ఈతరం ప్రేమికుల్ని కట్టిపడేస్తున్న కొన్ని వెరైటీ ప్రేమ కానుకలపై మీరూ ఓ లుక్కేయండి. వీటిలో మీకు నచ్చిన, మీ ప్రియమైన వారు మెచ్చిన కానుకను ఎంచుకొని దాన్ని వారికి ఈ వేలంటైన్స్ డే కానుకగా అందించేయండి.. వారి మనసును మరోసారి దోచేయండి..

Know More

women icon@teamvasundhara
arvind-kejriwal-and-sunitha-kejriwal-love-story

కేజ్రీవాల్‌ క్రేజీ లవ్‌స్టోరీ విన్నారా?

‘ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది’ ఉన్నట్లే తన విజయం వెనుక తన భార్య సునీతా కేజ్రీవాల్‌ ఉందంటున్నారు ముచ్చటగా మూడోసారి దిల్లీ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కనున్న అరవింద్‌ కేజ్రీవాల్‌. ఇటీవలే జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు 62సీట్లు గెలుచుకొని విజయదుందుభి మోగించింది ఆప్‌. ‘ఇంత గొప్ప విజయం వెనుక నా భార్య సునీత ఉంది.. ఆమె లేకుంటే ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తికి గుర్తింపే లేదు.. నా భార్యే నా విజయ రహస్యం..’ అంటూ చెబుతున్నారు కేజ్రీ. సహధర్మచారిణిగా తన ప్రతి బాధ్యతను నెరవేర్చుతూ, ఎల్లప్పుడూ భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈరోజు తన భర్త దిల్లీ పీఠానికి ముచ్చటగా మూడోమారు అధిపతిగా మారేందుకు ప్రేరణగా నిలిచారామె. ఈ నేపథ్యంలో ఈ ముచ్చటైన జంట ప్రేమకబుర్లేంటో మనమూ చదివేద్దామా..!!

Know More

women icon@teamvasundhara
man-proposes-to-girlfriend-in-front-of-eiffel-tower

‘ఈఫిల్‌ టవర్‌’ సాక్షిగా ‘ఐ లవ్యూ’ చెప్పాడు!

‘ప్రేమికుల దినోత్సవం’ వచ్చేస్తోంది. ‘వేలంటైన్‌ వీక్‌’ పేరుతో ఇప్పటికే ప్రపంచమంతా ‘ప్రేమ’ సంబరాల్లో మునిగిపోయింది. ఇక ‘ఫిబ్రవరి 14’ కోసం ఆతృతగా ఎదురుచూస్తూ కొంతమంది ప్రేమికులు తమ ప్రియమైన వారిని ఎక్కడ కలవాలో, ఏ బహుమతి ఇవ్వాలో, ఆరోజంతా ఎలా వారితో గడపాలో ప్లాన్స్‌ వేసుకుంటున్నారు. మరికొంతమంది తాము ప్రేమించిన వ్యక్తికి తమ మనసులోని ప్రేమను తెలియజేసేందుకు సర్‌ప్రైజ్‌లతో సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో న్యూయార్క్‌లో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన ఓ యువకుడు ‘ఈఫిల్‌ టవర్‌’ సాక్షిగా తన ప్రేయసికి ప్రపోజ్‌ చేశాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో తన మనసులోని భావాలను పాట రూపంలో వ్యక్తపరుస్తూ తన ప్రియురాలి చేతికి రింగ్‌ తొడిగాడు.

Know More

women icon@teamvasundhara
valentine-week-promise-day-special-in-telugu

డియర్‌.. మన ‘ప్రేమ బాసలన్నీ’ నిలబెట్టుకుంటావ్‌ కదూ!

ప్రేమ.. రెండు హృదయాల్ని పెనవేసే ఈ రెండక్షరాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రేమ అనే సముద్రంలో ముగినిపోయిన వారికి ఈ లోకం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఎప్పుడు చూసినా తమలో తాము మాట్లాడుకోవడం, ముసిముసిగా నవ్వుకోవడం, ప్రేమించిన వారి తలపుల్లో తడిసిపోవడం.. ఇలా ఆ బంధంలోని తియ్యదనం వర్ణనాతీతం. అలా ప్రేమికుల్లో కలిగే భావాల్ని ఒకరితో ఒకరు పంచుకోవడానికి పుట్టిందే ప్రేమికుల దినోత్సవం. ఒక్కరోజు కాదు.. ఏకంగా ఏడు రోజుల పాటు జరుపుకునే ఈ వేలంటైన్ వీక్‌లో ఒక్కో రోజుకూ ఒక్కో ప్రత్యేకత ఉంది. ఈ క్రమంలో ప్రేమికులు పరస్పరం చేసుకునే ప్రమాణాలకు సాక్ష్యంగా నిలుస్తుంది ‘ప్రామిస్ డే’. సుఖమైనా, కష్టమైనా ఎల్లప్పుడూ తమ వెన్నంటే ఉంటామని బాస చేస్తే సరిపోదు.. వాటిని ఆచరణలో పెట్టాలన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి.

Know More

women icon@teamvasundhara
how-a-single-girl-can-celebrate-valentines-day

వేలంటైన్స్‌డే... ఒంటరిగానూ సెలబ్రేట్ చేసుకోవచ్చు!

వేలంటైన్స్ డే వచ్చిదంటే చాలు.. ప్రతి హృదయం 'ఐయామ్ ఇన్ లవ్.. ఐయామ్ ఇన్ లవ్' అంటూ పాటలు పాడేస్తుంది. కొత్తగా ప్రేమలో పడ్డవారి సందడి గురించి ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. మొత్తం ప్రపంచంలోని ప్రేమంతా తమలోనే నిండినట్లు.. ఏడాది మొత్తం ప్రేమను ఒకేరోజు చూపించేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు.. కానీ వేలంటైన్స్ డే రోజు ఒంటరిగా ఉండేవారి పరిస్థితేంటి? ప్రత్యేకంగా ఏముంది? ఇతర రోజుల్లాగే ఇదీ గడిచిపోతుంది అనుకుంటున్నారు కదూ.. అయితే ప్రేమ అనేది కేవలం జంటల మధ్య ఉండేది మాత్రమే కాదు.. అది విశ్వవ్యాప్తమైనది.. అందుకే ప్రేమికుల రోజును జంటగా లేని వారు కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. మరి, ఈ వేలంటైన్స్ డేకి మీరూ సింగిల్ అయితే దీన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో చూద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
grandpa-puts-my-wife-as-status-after-facebook-asks-him-whats-on-his-mind

నా మనసు నిండా నా భార్యే కదా ఉంది!

ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘ప్రేమికుల రోజు’ హడావిడే కనిపిస్తోంది. ఇక ప్రేమ పక్షులైతే ‘రోజ్‌ డే’, ‘ప్రపోజ్‌ డే’ పేరుతో ఇప్పటికే ‘వేలంటైన్‌ వీక్‌’ సంబరాలు షురూ చేసేశారు. ఇందులో భాగంగా కొంతమంది ‘ఫిబ్రవరి 14’ కోసం ఎదురుచూస్తూ, తాము ప్రేమించిన వ్యక్తికి తమ మనసులోని ప్రేమను తెలియజేసేందుకు సర్‌ప్రైజ్‌లతో సిద్ధమవుతున్నారు. మరికొంతమంది ప్రేమ కవితలు, ప్రేమ సందేశాలను సోషల్‌మీడియాలో స్టేటస్‌లుగా పెడుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియా అంటే అసలు తెలియని ఓ పెద్దాయన ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన ఓ స్టేటస్‌ నెటిజన్ల ప్రశంసలందుకుంటోంది.

Know More

women icon@teamvasundhara
facebook-coo-sheryl-sandberg-engaged-with-tom-bernathal

చేదు జ్ఞాపకాల్ని మరిచి.. కొత్త జీవితంలోకి!

అంతకుముందు అప్పటి వరకూ వారికి పరిచయమే లేదు... ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా వారిద్దరూ మొదటిసారిగా కలుసుకున్నారు. దాంపత్య జీవితానికి సంబంధించి వారిద్దరికీ చేదు అనుభవాలే ఎదురుకావడంతో ఆ పరిచయం వారికో కొత్త అనుభూతినిచ్చింది. ఒకరి మనసులోకి మరొకరు చొచ్చుకుపోయేలా చేసింది. వారి వైవాహిక జీవితాలు మిగిల్చిన విషాదాలను మరిచిపోయేలా చేసిందీ పరిచయం. ఇక పెళ్లితో తమ అనుబంధాన్ని మరింత శాశ్వతం చేసుకోవాలనుకున్నారు. అందుకే ఇటీవలే నిశ్చితార్థం చేసుకుని తమ ప్రేమను శాశ్వతం చేసుకున్నారు. వారే ఫేస్‌బుక్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ షెరిల్‌ శాండ్‌బర్గ్‌, ఓ కన్సల్టింగ్‌ కంపెనీ సీఈవో టామ్‌ బెర్నథాల్‌. గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ ఇటీవలే ఉంగరాలు మార్చుకున్నారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియా వేదికగా తమ ఎంగేజ్‌మెంట్‌ విషయాన్ని ప్రకటించారీ లవ్లీ కపుల్‌.

Know More

women icon@teamvasundhara
my-husband-is-good-but-i-am-facing-problem-with-his-sister

ఆ విషయం మా ఆయనకు ఎలా చెప్పాలి?

నమస్తే మేడమ్‌. నాకు పెళ్లై రెండేళ్లవుతోంది. నేను, నా భర్త విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాం. మరో ఆరు నెలల్లో స్వదేశానికి రాబోతున్నాం. మా దాంపత్య జీవితం బాగానే ఉంది.. కానీ మావారి అక్క వల్ల నాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నన్ను ప్రాణంగా ప్రేమించే నా భర్త తన అక్క గురించి ఏ మాట చెప్పినా ఊరుకోడు. ఆమె మా ఇంట్లో ఒక్క రోజుంటే చాలు.. ఆ రోజంతా మా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఆమెకు పెళ్లై పదేళ్లవుతుంది. అయినా మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకుంటుంది. మా ఆయన కూడా ఆమె చెప్పినదానికల్లా తలూపుతారు. మా పెళ్లయిన దగ్గర్నుంచి ఇదే వ్యవహారం కొనసాగుతోంది. మా వారి అక్క కూతురు ఫోన్లో ఏమడిగినా అప్పటికప్పుడు కొనివ్వాల్సిందే. మా ఆయన ఫంక్షన్‌కి వెళ్లేటప్పుడు ఏ డ్రస్ వేసుకోవాలో కూడా మా ఆడపడుచే చెబుతుంది. ఇలాంటివి తట్టుకోలేక ఉద్యోగం పేరు చెప్పి దూరంగా ఉంటున్నాం.

Know More

women icon@teamvasundhara
valentines-week-2020-rose-day-special

మధురమైన ప్రేమకు ‘రోజాపూల’తో శ్రీకారం!

‘ప్రేమ’.. రెండక్షరాల పదం.. రెండు గుండెల చప్పుడు.. రెండు మనసుల కలయిక. ఆ మనసుల్లోని మధురానుభూతుల్ని ఒకరికొకరు పంచుకోవడానికి ప్రేమికులు జరుపుకొనే పండగే ‘ప్రేమికుల దినోత్సవం’. ఈ సందర్భంగా విదేశాల్లో ‘రోజ్ డే’తో మొదలుపెట్టి ‘ప్రపోజ్ డే’, ‘చాక్లెట్ డే’, ‘టెడ్డీ డే’.. ఇలా రోజుకో పేరుతో ఏడు రోజుల పాటు ఏకంగా వారోత్సవాలే జరుపుకొంటారు ప్రేమికులు. ఇక ఎనిమిదో రోజు ‘వాలెంటైన్స్ డే’ను పెద్దఎత్తున సెలబ్రేట్ చేసుకుంటారు. ఇలా ఎనిమిది రోజుల పాటు జరిగే వాలెంటైన్స్‌ డే వేడుకల్లో దేని ప్రత్యేకత దానిదే. రాన్రానూ ఈ సంస్కృతి మన దగ్గరా విస్తరిస్తోంది. ఈ క్రమంలో ప్రేమికుల వారోత్సవాల్లో మొదటి రోజైన ‘రోజ్‌ డే’ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
a-man-reminisces-about-the-love-of-his-life-with-a-little-help-from-google

కంటతడి పెట్టిస్తోన్న గూగుల్‌ ప్రకటన..!

‘జ్ఞాపకాలు.. చెడ్డవైనా, మంచివైనా ఎప్పుడూ మనతోనే ఉంటాయి. జీవితాంతం వాటిని మోయక తప్పదు..!’.. ‘తొలిప్రేమ’ సినిమాలో హీరో వరుణ్‌ తేజ్‌ చెప్పిన ఈ డైలాగ్‌ చాలామంది హృదయాలను తాకే ఉంటుంది. మనిషి జీవితం అనేక బంధాలతో ముడిపడి ఉంటుంది. ఈ ప్రయాణంలో సంతోషాలు.. బాధలు.. చిరునవ్వులు.. నిట్టూర్పులు.. కన్నీళ్లతో కూడిన ఎన్నో అనుభవాలు మనకు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో కలిసి పంచుకునే జ్ఞాపకాలు ఎప్పటికీ మరపురానివే..! ఎందుకంటే మన జీవితంలో ఎక్కువభాగం మనకు తోడుగా ఉండేది వాళ్లే..! ఈ నేపథ్యంలో భార్యాభర్తల అనుబంధం గురించి గూగుల్‌ రూపొందించిన ఓ ప్రకటన వీక్షకుల హృదయాలను తాకుతోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ఈ వీడియోను చూసి భావోద్వేగానికి గురవుతున్నారు.. కంటతడి పెడుతున్నారు. మరి ఆ విశేషాలేంటో మీరూ చూసేయండి.

Know More

women icon@teamvasundhara
husband-builds-a-plane-home-for-wife

ఈ భర్త తన భార్య కోసం ఏం చేశాడో తెలుసా?

ఒక వ్యక్తిపై మనకున్న ప్రేమను వ్యక్తపరచడానికి ఎన్నో మార్గాలుంటాయి. కొందరు ఒక చిన్న పువ్వు ఇచ్చి తమ ప్రేమను చెబితే.. మరికొందరు ఖరీదైన బహుమతులతో ఎదుటివారిని ఫిదా చేసేస్తారు. ఇక భార్య ముంతాజ్‌పై తనకున్న ప్రేమకు చిహ్నంగా షాజహాన్‌ ఏకంగా తాజ్‌ మహల్‌నే నిర్మించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి గొప్ప ప్రేమికులు గతించిన చరిత్రలోనే కాదు.. వర్తమానంలోనూ ఉన్నారు. తాజాగా ఇలాంటి ఓ అపర ప్రేమికుడికి సంబంధించిన వార్త ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. భార్యపై ఉన్న ప్రేమతో ఏకంగా విమానంలాంటి ఇంటిని నిర్మించి అభినవ షాజహాన్‌గా పేరు తెచ్చుకున్నాడు నైజీరియాకు చెందిన ఓ వ్యక్తి. ఇంతకీ ఎవరతను? ఆయన లవ్‌స్టోరీ ఏంటో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి.

Know More

women icon@teamvasundhara
billgates-daughter-jennifer-engaged-nayel-nassar

అపర కుబేరుడి కూతురు..మనువాడబోతోంది !

ఆమె అపర కుబేరుడి గారాలపట్టి.. అందులోనూ చూడగానే ఆకట్టుకునే అందం...అతనేమో ప్రొఫెషనల్‌ హార్స్‌ రైడర్‌. బిలియనీర్‌ కూతురైనా.. స్టార్‌ స్టేటస్‌కు దూరంగా ఉంటూ సింపుల్‌ లైఫ్‌ను లీడ్‌ చేస్తున్న ఆమె సింప్లిసిటీకి ఆ హార్స్‌ రైడర్‌ ఫిదా అయితే.. తనకెంతో ఇష్టమైన గుర్రపు స్వారీ పోటీల్లో ఆ హార్స్‌ రైడర్‌ సాధిస్తోన్న రికార్డులకు ఆ సెలబ్రిటీ కిడ్‌ ముగ్ధురాలైంది. అలా పాఠాలు చదువుకునే వయసులోనే ప్రేమ పాఠాలు నేర్చుకున్నారు. ఇద్దరి అభిరుచులతో పాటు మనసులు కూడా కలవడంతో ఇక తమ ప్రేమ బంధాన్ని పెళ్లితో శాశ్వతం చేసుకోవాలనుకున్నారు. అందుకు పెద్దల ఆశీర్వాదం కూడా తోడవడంతో త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతోంది ఆ జంట. వారే ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్‌ పెద్ద కూతురు జెన్నిఫర్‌ గేట్స్‌- ఈజిప్టుకు చెందిన ప్రొఫెషనల్‌ హార్స్ రైడర్‌ నాయెల్‌ నాసర్‌. ఈ క్రమంలో ఇటీవల మంచు కొండల సాక్షిగా ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకుందీ క్యూట్‌ జోడీ.

Know More

women icon@teamvasundhara
how-to-overcome-my-marriage-phobia

అలా అయితే నేను ఇష్టం లేని పెళ్లి చేసుకోవాల్సిందేనా?

నమస్తే మేడం.. నా వయసు 33 సంవత్సరాలు. నా తల్లిదండ్రులు నాకు ఏడేళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయినా ఒక్క సంబంధం కూడా కుదరడం లేదు. ఏదైనా సంబంధం వచ్చి మాకు ఏమాత్రం నచ్చకపోయినా వాళ్లు నన్నే చేసుకుంటానని పట్టుబడుతున్నారు. ఒకవేళ ‘సంబంధం బాగుంది.. కొన్ని విషయాలు సర్దుకుపోవచ్చులే..’ అనుకుంటే మాత్రం వాళ్లు నన్ను చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. మాకు నచ్చకపోవడం అంటే నేను కానీ, నా తల్లిదండ్రులు కానీ ఏ విషయంలోనూ(చదువు, ఉద్యోగం, కుటుంబం.. వంటి విషయాల్లో) సర్దుకుపోలేనివిధంగా ఉంటున్నాయి కొన్ని సంబంధాలు. ఇదే పరిస్థితి ఏడేళ్లుగా కొనసాగుతోంది. ఏదైనా సంబంధం వచ్చి నేను అబ్బాయిని ఇష్టపడ్డానంటే.. వాళ్లు నన్ను చేసుకోరని ముందే అర్థమవుతోంది. దాంతో చాలా నిరాశగా ఉంటుంది.

Know More