scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఈ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

Movie Masala

 
category logo

21 ఏళ్ల ప్రేమ బంధం వీగిపోయింది..!

Arjun Rampal and Mehr Jesia granted divorce

అప్పుడే మోడలింగ్‌లోకి అడుగుపెట్టాడతను. కానీ అప్పటికే మోడలింగ్‌ కెరీర్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందామె. ఇద్దరూ కలిసి పలు ఫ్యాషన్‌ షోలలో పాల్గొన్నారు. చెట్టపట్టాలేసుకొని ర్యాంప్‌పై నడిచారు. ఈ క్రమంలోనే వారి మధ్య ఏదో తెలియని ఫీలింగ్‌ మొదలైంది. త్వరలోనే ఆ ఫీలింగ్‌ని ప్రేమ అని గ్రహించిన వీరు తమ అనుబంధాన్ని శాశ్వతమైన పెళ్లిబంధంగా మార్చుకున్నారు. అయితే ఇలా మొదలైన తమ ప్రేమ శాశ్వతం కాదని, భవిష్యత్తులో విడిపోతామని అప్పుడు వారికి తెలియలేదు. సంసార సాగరంలోని ఒడిదొడుకుల్ని తట్టుకుంటూ 21 ఏళ్ల పాటు ప్రేమను పంచుకున్న ఈ జంట తాజాగా విడాకులతో సెపరేట్‌ అయిపోయింది. వారెవరో మీకు ఇప్పటికే అర్థమైపోయుంటుంది. యస్‌.. వారే ఒకప్పటి మోడల్స్‌ కమ్‌ యాక్టర్స్‌ అర్జున్‌ రాంపాల్‌ - మెహ్ర్‌ జెస్సియాలు. విడిపోతున్నామని గతేడాది అధికారిక ప్రకటన చేసిన ఈ జంటకు.. ముంబయి బాంద్రాలోని ఓ కోర్టు తాజాగా విడాకులు మంజూరు చేసింది. దాంతో వీరిద్దరి ఫ్యాన్సే కాదు.. సినీ ఇండస్ట్రీ కూడా షాక్‌కు గురైంది. ఈ నేపథ్యంలో వీరి ప్రేమ, పెళ్లి, విడాకులకు సంబంధించిన కొన్ని ఆసక్తికర అంశాల గురించి తెలుసుకుందాం..

arjunrampalmehardivorce650-5.jpg

మెహ్ర్‌ జెస్సియా 1980లోనే తన మోడలింగ్‌ కెరీర్ ప్రారంభించింది. 1986లో ‘మిస్‌ ఇండియా’ పోటీల్లో గెలుపొందిన ఆమె.. ఫస్ట్‌ జనరేషన్‌ ఆఫ్ ఇండియన్‌ సూపర్‌ మోడల్స్‌లో ఒకరిగా పేరు సంపాదించుకుంది. ఇక కాలేజీ రోజుల నుంచే మోడలింగ్‌లోకి అడుగుపెట్టిన అర్జున్‌.. 2001లో ‘ప్యార్‌ ఇష్క్‌ ఔర్‌ మొహబ్బత్‌’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆపై ‘వాదా’, ‘ఓం శాంతి ఓం’, ‘రాక్‌ ఆన్‌’, ‘హౌజ్‌ఫుల్‌’, ‘రాక్‌ ఆన్‌ - 2’.. వంటి పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ‘నాస్తిక్‌’ అనే సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడీ హ్యాండ్‌సమ్‌ హంక్‌.

arjunrampalmehardivorce650-2.jpg

మోడలింగ్‌తో మొదలైన ‘ప్రేమ’!

అర్జున్‌ తన మోడలింగ్‌ కెరీర్‌ ప్రారంభించే సమయానికి జెస్సియా ఆల్‌రడీ ఈ రంగంలో తనదైన గుర్తింపు సంపాదించుకొని ఫేమస్‌ మోడల్‌గా తన కెరీర్‌లో దూసుకుపోతోంది. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి పలు ఫ్యాషన్‌ షోలలో పాల్గొనడం, కొన్ని షోలలో ఒకే డిజైనర్‌కి జంటగా షో స్టాపర్‌గా నిలవడం, చెట్టపట్టాలేసుకొని ర్యాంప్‌ వాక్‌ చేయడం.. ఇలా కాలం కరిగిపోతున్న కొద్దీ వీరిద్దరి మనసుల్లో ఒకరిపై ఒకరికి ప్రేమ చిగురించింది. ఇలా తమ మనసులో మొదలైన ఈ ఫీలింగ్‌ని కొన్నాళ్ల తర్వాత పంచుకున్న ఈ జంట.. తమ ప్రేమ బంధాన్ని శాశ్వతమైన అనుబంధంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు పెద్దలూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో 1998లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిందీ అందాల జంట. అయితే వయసులో జెస్సియా అర్జున్‌ కంటే రెండేళ్లు పెద్ద. అయినా కూడా నిజమైన ప్రేమకు వయసు అడ్డు కాదని భావించి.. తమ ప్రేమను శాశ్వతం చేసుకున్న ఈ క్యూట్‌ కపుల్‌.. అప్పట్లో బాలీవుడ్‌లోనే ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’ కపుల్‌లా పేరుతెచ్చుకుంది. అర్జున్‌-జెస్సియాల ప్రేమ బంధానికి గుర్తుగా 2002లో మైరా, 2008లో మహికా అనే ఇద్దరు కూతుళ్లు జన్మించారు.

arjunrampalmehardivorce650-1.jpg

అప్పట్నుంచే రూమర్స్‌ మొదలయ్యాయి!

బాలీవుడ్‌లో క్యూట్‌ కపుల్‌గా పేరుగాంచిన ఈ అందాల జంట.. పెళ్లికి ముందే కాదు.. పెళ్లి తర్వాత కూడా చాలా ఫ్యాషన్‌ షోలలో పాల్గొని జంటగా ర్యాంప్‌పై హొయలుపోయారు. అంతేకాదు.. 2006లో ‘ఛేంజింగ్‌ గణేశా’ అనే తమ సొంత నిర్మాణ సంస్థ ద్వారా ‘ఐ సీ యూ’ అనే సినిమాను కూడా రూపొందించిందీ ముద్దుల జంట. ఇలా కెమెరా ముందు, వెనుక ఎంతో అన్యోన్యంగా ఉంటూ దంపతులందరికీ ఆదర్శంగా నిలిచిన ఈ జంటపై 2011 నుంచి రూమర్స్‌ రావడం మొదలయ్యాయి. అర్జున్‌-జెస్సియాల మధ్య విభేదాలొస్తున్నాయని, అందుకు హృతిక్‌ రోషన్‌ భార్య సుసానే ఖాన్‌తో అర్జున్‌ రిలేషన్‌షిప్‌ కొనసాగిస్తుండడమే కారణమంటూ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఇలా ఒక్కసారి కాదు.. చాలాసార్లే వీరి గురించి రూమర్స్‌ వచ్చాయి. వాటన్నింటినీ అర్జున్‌ - జెస్సియాలిద్దరూ ఖండించడంతో పాటు ఎంతో హ్యాపీగా కెమెరా ముందు కనిపించడం, వివిధ ఫ్యాషన్‌ షోలలో జంటగా పాల్గొనడం, సెలబ్రిటీ పార్టీల్లో భాగం కావడం.. ఇలా తామిద్దరం ఎంతో హ్యాపీగా ఉన్నామంటూ చెప్పకనే చెప్పిందీ జంట. అంతేకాదు.. అర్జున్‌ సినిమాల్లోకి అడుగుపెట్టాక తన భార్య జెస్సియాతో కలిసి కేన్స్‌ చిత్రోత్సవంలో కూడా పాల్గొనడంతో ఈ రూమర్స్‌ కాస్త తగ్గుముఖం పట్టాయి.

అయితే ఆపై కొన్నాళ్లకు వీరుండే బంగ్లాలో ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగిందట. ఇద్దరూ ఒకరిపై ఒకరు గట్టిగా అరుచుకున్నారట కూడా! దాంతో అర్జున్‌ ఆ ఇంట్లో నుంచి బయటికి వస్తూ మరోసారి కెమెరా కంటికి చిక్కాడు. తద్వారా వీరిద్దరి మధ్య విభేదాలు మీడియాలో మరోసారి చర్చనీయాంశమైంది. ఇలా తరచూ గొడవలు పడుతూ ఉండడం కంటే విడిపోయి ఎవరి జీవితాల్లో వారు హ్యాపీగా ఉండడం మంచిదని ఒక నిర్ణయానికొచ్చిన ఈ జంట.. తామిద్దరం విడిపోతున్నామంటూ గతేడాది మేలో ఓ ఉమ్మడి ప్రకటన ద్వారా వెల్లడించి తమ ఫ్యాన్స్‌ని షాక్‌కు గురిచేశారు.

arjunrampalmehardivorce650-6.jpg

20 ఏళ్ల బంధానికి స్వస్తి!

నమ్మకం, నిజాయతీ కలిస్తేనే అది నిజమైన ప్రేమబంధం అవుతుందని బలంగా నమ్మే అర్జున్‌ - జెస్సియాలు ‘తామిద్దరం ఇకపై కలిసుండలేం.. విడిపోతున్నామం’టూ సంయుక్త ప్రకటన చేయడంతో తమ ఫ్యాన్స్‌, ఇతర సెలబ్రిటీలు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. ‘మా 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎంతో ప్రేమ పొందాం.. ఎన్నో మధురానుభూతులు మా సొంతమయ్యాయి.. ఇప్పుడు మా దారులు వేరయ్యాయి. అయినా ఎలాంటి పరిస్థితిలోనైనా ఒకరికొకరు తోడుంటాం.. ఇద్దరం చాలా ప్రైవేట్‌గా ఉండే వ్యక్తులం. ఇప్పుడూ అదే ప్రైవసీని కోరుకుంటున్నాం.. ఇంతకుమించి ఇంకేమీ చెప్పాలనుకోవట్లేదు. మీ ఆదరాభిమానాలకు థ్యాంక్యూ. బంధం వీగిపోవచ్చు.. కానీ ప్రేమ ఎప్పటికీ నిలిచి ఉంటుంది..’ అంటూ ఉమ్మడి స్టేట్‌మెంట్‌ ద్వారా తామిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్‌ 30న వీరిద్దరూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకోగా.. తాజాగా (నవంబర్‌ 21) ప్రత్యేక వివాహ చట్టం ముంబయి బాంద్రాలోని ఓ కోర్టు ప్రిన్సిపల్‌ జడ్జి శైలజా సావంత్‌ ఈ జంటకు విడాకులు మంజూరు చేశారు. కూతుళ్లు మైరా, మహికాలు తల్లి జెస్సియాతో కలిసి ఉంటారని తీర్పు వెలువరించారు. ఇలా దాదాపు 21 ఏళ్ల పాటు వైవాహిక జీవితాన్ని ఆస్వాదించిన వీరిద్దరూ శాశ్వతంగా సెపరేట్‌ అయిపోవడంతో వీరి ఫ్యాన్స్‌తో పాటు ఇతర సెలబ్రిటీలూ విస్మయానికి గురయ్యారు.

arjunrampalmehardivorce650-3.jpg

గ్యాబ్రియెల్లాతో డేటింగ్‌!

మొదటి భార్య జెస్సియాతో విడాకులకు ముందు నుంచే దక్షిణాఫ్రికా మోడల్‌, ప్రపంచంలోనే సెక్సీయెస్ట్‌ విమెన్‌లో ఒకరిగా పేరుగాంచిన గ్యాబ్రియెల్లా డెమెట్రియాడెస్‌తో డేటింగ్‌ చేస్తున్నాడు అర్జున్‌. 2009లో ‘మిస్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ బాలీవుడ్‌’గా ఫేమసైన ఆమెను ఆ లీగ్‌లో భాగంగానే కలుసుకొని మనసు పారేసుకున్నాడీ కండల వీరుడు. అయితే అప్పట్నుంచి ఈ విషయాన్ని ఎంతో గోప్యంగా ఉంచిన ఈ జంట.. గతేడాది అర్జున్‌-జెస్సియాలు ఉమ్మడిగా విడాకుల ప్రకటన చేసిన తర్వాతే అఫీషియల్‌గా కెమెరా ముందుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎప్పుడైతే అర్జున్‌.. తన గర్ల్‌ఫ్రెండ్‌ గ్యాబ్రియెల్లా ఓ పాపాయికి జన్మనివ్వబోతోందని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించడంతో అప్పుడే తమ ప్రేమ విషయం అధికారికంగా బయటికి పొక్కింది.

arjunrampalmehardivorce650-4.jpg

ఈ జులైలో గ్యాబ్రియెల్లా పండంటి బాబుకు జన్మనిచ్చింది. దీంతో మరోసారి తండ్రయిన అర్జున్‌.. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ మురిసిపోవడమే కాదు.. తన చిన్నారికి అరిక్‌ రాంపాల్‌ అనే పేరు కూడా పెట్టుకున్నాడు. ప్రస్తుతం తన గర్ల్‌ఫ్రెండ్‌ గ్యాబ్రియెల్లా, తన బుజ్జాయి అరిక్‌తో కలిసి హ్యాపీగా ఉన్నాడీ రొమాంటిక్‌ హీరో.

ప్రేమతో కూడిన వైవాహిక బంధంలో అప్పుడప్పుడూ కొన్నిసార్లు కలతలు కూడా తొంగిచూస్తాయి. దంపతులిద్దరూ వాటిని సర్దుకొని పోయినప్పుడే ఆ బంధం నిలబడుతుంది. అయినా కూడా వారి మధ్య విభేదాలొస్తున్నాయంటే ఇక వారిద్దరూ కలిసి ఉండి అనుక్షణం గొడవలు పడడం కంటే విడిపోయి ఎవరి జీవితాల్లో వారు హ్యాపీగా ఉండడం మేలు.. సో.. అర్జున్‌-జెస్సియాలు విడిపోవడానికి కారణాలేవైనా వారిద్దరూ తమ తమ జీవితాల్లో ఆనందంగా ఉండాలని, సక్సెస్‌ఫుల్‌గా ముందుకు దూసుకెళ్లాలని మనమూ కోరుకుందాం..!!





gynecologist Ask Psychology Expert
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి


Know More

women icon@teamvasundhara
husband-creates-home-as-restaurant-for-wife

ఈ భర్త తన భార్య కోసం ఏం చేశాడో మీరే చూడండి..!

కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది. గంటగంటకీ కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. వైరస్‌ను అడ్డుకునే క్రమంలో దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్‌ను ఎంతో సవాల్‌గా తీసుకున్నాయి. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంటి నుంచి బయట అడుగు పెట్టలేని పరిస్థితులు వచ్చాయి. అయితే ఈ కరోనా మహమ్మారి పుట్టక ముందు వరకు ఎంచక్కా రెస్టరంట్లు, షాపింగ్‌లంటూ ఎంజాయ్‌ చేసిన వారంతా ఇప్పుడు తమ తమ ఇళ్లలో బిక్కుబిక్కుమంటున్నారు. కానీ అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఆ లాక్‌డౌన్‌ సమయంలో తన భార్యకు ఓ అందమైన సర్‌ప్రైజ్‌ అందించి ఆమె మనసు గెలుచుకోవడమే కాదు.. వార్తల్లోనూ నిలిచాడు. వివరాల్లోకి వెళితే..

Know More

women icon@teamvasundhara
take-care-of-aged-parents-during-corona-lockdown-time

కరోనా అలర్ట్: కని, పెంచిన వారిని.. కంటికి రెప్పలా చూడండి!

కరోనా’ (కోవిడ్-19) వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తుండడంతో ప్రపంచమంతా చిగురుటాకు లా వణికి పోతోంది. కులం, మతం, ప్రాంతం, దేశంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘లాక్‌డౌన్’ పేరుతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ‘ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ’ పోలీసులు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇక వయసు మళ్లిన వారు ఈ వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువనే విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల మరణిస్తున్న వారిలో వృద్ధులే ఎక్కువని లెక్కలు కూడా చెబుతున్నాయి. మరి ప్రస్తుతం అంతా ఇళ్లకే పరిమితమవుతోన్న సమయంలో.. వయసు మళ్లిన మీ తల్లిదండ్రులను.. అవ్వ, తాతలను జాగ్రత్తగా చూసుకుంటున్నారా? మిమ్మల్ని కని, పెంచిన వారిని కరోనా నుంచి ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Know More

women icon@teamvasundhara
unadkat-and-maxwell-announces-their-engagement-with-their-girl-friends

సోల్‌ మేట్స్‌ దొరికేశారు!

జయదేవ్‌ ఉనాద్కత్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌... ప్రస్తుతం ప్రత్యేక పరిచయం అవసరం లేని క్రికెటర్ల పేర్లు. రంజీ ట్రోఫీ పోరులో సౌరాష్ర్ట జట్టును ఛాంపియన్‌గా నిలిపి ఉనాద్కత్‌ అందరి నోళ్లల్లో నానుతుండగా, తన దూకుడైన బ్యాటింగ్‌తో ఇప్పటికే భారతీయులకు ఆరాధ్య క్రికెటర్‌గా మారిపోయాడు ఆసీస్‌ క్రికెటర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌. ఈక్రమంలో తమ ఆటతీరుతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న ఈ క్రికెటర్లు త్వరలో ఓ ఇంటివారు కాబోతున్నారు. తమ మనసుకు నచ్చిన నెచ్చెలితో కలిసి కొత్త జీవితం ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా తాజాగా తమ ప్రియురాళ్లతో కలిసి ఉంగరాలు మార్చుకున్నారీ క్రికెటర్స్‌.

Know More

women icon@teamvasundhara
ayushmann-celebrates-19-years-of-togetherness-with-wife-tahira

19 ఏళ్ల క్రితం అర్ధరాత్రి అలా ప్రపోజ్‌ చేశా!

ప్రేమకు సమయం, సందర్భమనేది ఉండదు. ఎందుకంటే అది ఎప్పుడు, ఎవరి మీద, ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. కానీ ఆ ప్రేమను తెలియజేయాలంటే మాత్రం కచ్చితంగా మంచి ముహూర్తం చూసుకోవాలి. అందుకే చాలామంది తమ మనసుకు నచ్చినవారు హ్యాపీమూడ్‌లో ఉన్నప్పుడు తమ ప్రేమను చెబుతుంటారు. అలా ఎదుటివారి ప్రేమను గెలుచుకున్న ఆ ఆనందక్షణాలు ఎవరికైనా మధుర జ్ఞాపకమే. ఈ క్రమంలో బాలీవుడ్‌లో వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆయుష్మాన్‌ ఖురానా, తన ప్రేమ విషయాన్ని కూడా అంతే వైవిధ్యంగా వ్యక్తపరిచాడట. సరిగ్గా 19 ఏళ్ల క్రితం ఇదే రోజున ( మార్చి16న) తన సతీమణి తహీరా కశ్యప్‌కు ప్రపోజ్‌ చేసిన ఈ హ్యాండ్సమ్‌ హీరో... అప్పటి మధుర జ్ఞాపకాలను మళ్లీ గుర్తుకు తెచ్చుకున్నాడు.

Know More

women icon@teamvasundhara
sheela-kaur-gets-married-to-a-businessman

women icon@teamvasundhara
sameera-reddy-flip-the-switch-challenge-with-her-mother-in-law

ఈ సెలబ్రిటీ అత్తాకోడళ్ల సరదా ఛాలెంజ్‌ చూశారా?

అత్తాకోడళ్ల అనుబంధానికి సంబంధించి మన సమాజంలో భిన్నాభిప్రాయాలున్నాయి. అత్తాకోడళ్లంటే ఒకరంటే ఒకరికి పడదని, ఒకే ఇంట్లో ఉన్నా భిన్న ధృవాలుగా వ్యవహరిస్తుంటారని, వీరికి ఏ విషయాల్లోనూ పొసగదని చాలామంది అనుకుంటారు. అయితే అత్తమ్మ అంటే అమ్మకు ప్రతిరూపమని, కోడలు కూడా ఓ కూతురు లాంటిదే అని చాటిచెబుతున్న అత్తా కోడళ్లు కూడా మన చుట్టూ చాలామందే ఉన్నారు. అలాంటి కోవకే చెందుతారు సమీరా రెడ్డి-మంజ్రీ వర్దే. అత్తాకోడళ్లే అయినా తమ ఇద్దరి మధ్య తల్లీ-కూతుళ్లకు మించిన అనుబంధం ఉందని వీరిద్దరూ నిరూపిస్తున్నారు . ఈక్రమంలో ప్రస్తుతం టిక్‌టాక్‌లో ట్రెండ్‌ అవుతున్న ‘ఫ్లిఫ్‌ ది స్విచ్‌’ ఛాలెంజ్‌లో సరదాగా పాల్గొని సందడి చేశారీ సెలబ్రిటీ అత్తాకోడళ్లు.

Know More

women icon@teamvasundhara
marykom-and-k-onler-kom-celebrates-their-15th-marriage-anniversary

మమ్మల్ని ఇలా ముడి వేసినందుకు ఆ దేవుడికి థ్యాంక్స్‌ !

సాధారణంగా ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందంటారు. అయితే అందరూ కాకపోయినా... కొందరి ఆడవాళ్ల గెలుపు వెనక కూడా మగాళ్లుంటారు. ఇండియన్‌ స్టార్‌ బాక్సర్‌ మేరీకోమ్‌ దంపతులను చూస్తే ఈ మాట నిజమేననిపిస్తుంది. ఓ వైపు బాక్సింగ్‌ రింగ్‌లో ప్రత్యర్థులపై పంచ్‌ల వర్షం కురిపిస్తూనే... మరోవైపు ముగ్గురు పిల్లల తల్లిగా వారి ఆలనాపాలన చూసుకుంటోందీ లెజెండరీ బాక్సర్‌. వీటితో పాటు అదనంగా రాజ్యసభ సభ్యురాలిగా ప్రజలకు సేవలందిస్తోందామె. ఇలా కెరీర్‌, కుటుంబం, పిల్లలు..ఇలా అన్నింటినీ సమన్వయం చేసుకొని బాక్సింగ్‌ రింగ్‌లో రాణించాలంటే ఓ మహిళకు కత్తిమీద సామే అని చెప్పుకోవచ్చు. అయితే తన భర్త సహకారంతో వీటన్నింటినీ చక్కగా సమన్వయం చేసుకుంటున్నానని చెబుతోంది మేరీకోమ్‌. ఆయన అందించిన ప్రోత్సాహం వల్లే బాక్సింగ్‌లో అరుదైన విజయాలు సాధించానంటోంది. సరిగ్గా పదిహేనేళ్ల క్రితం ఇదే రోజు (మార్చి 12)న పెళ్లి పీటలెక్కారు మేరీకోమ్‌-కె ఒన్లర్‌. ఈక్రమంలో తమ పెళ్లి రోజును పురస్కరించుకుని దంపతులిద్దరూ తమ పెళ్లి నాటి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.

Know More

women icon@teamvasundhara
tips-to-become-your-husband-as-your-best-friend

women icon@teamvasundhara
allu-arjun-sneha-celebrates-their-9th-wedding-anniversary

ఈ బంధం ‘అల్లు’కొని తొమ్మిదేళ్లయింది..!

టాలీవుడ్‌కి సంబంధించి ప్రేమ వివాహం చేసుకున్న సెలబ్రిటీ జంటల్లో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, స్నేహల జంట కూడా ఒకటి. కొన్ని సంవత్సరాల క్రితం ఒక పెళ్లి వేడుకలో తొలిసారి కలుసుకున్నారీ లవ్లీ కపుల్‌. అలా తమ మధ్య ఉన్న స్నేహబంధం ప్రేమగా మారి.. పెళ్లికి దారి తీసింది. 2011, మార్చి 6న బన్నీ-స్నేహ దంపతులు ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. వీరికి అయాన్‌, అర్హ అనే ఇద్దరు పిల్లలున్నారు. బన్నీకి తన కుటుంబమంటే ప్రాణం. తను వృత్తిగతంగా ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబానికి తగిన సమయాన్ని కేటాయిస్తుంటాడు. పండగలు, పుట్టినరోజులు, ప్రత్యేక సందర్భాలను భార్యాపిల్లలతో కలిసి జరుపుకొంటుంటాడు. బన్నీ, స్నేహల వివాహం జరిగి నేటికి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తన భార్యకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతూ సోషల్‌ మీడియాలో ఓ ప్రత్యేక పోస్టు పెట్టాడు మన స్టైలిష్‌ స్టార్‌.

Know More

women icon@teamvasundhara
tamilnadu-sub-collector-ask-free-medical-service-instead-of-dowry

అందుకే డాక్టర్‌నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు!

సాధారణంగా ఓ అమ్మాయికి పెళ్లి ఫిక్సయితే, ఆ అమ్మాయి తండ్రికి ఎదురయ్యే మొదటి ప్రశ్న ‘అబ్బాయికి కట్నమెంత ఇస్తున్నారు?’ అని. దీంతో పాటు పెళ్లి లాంఛనాల కింద వరుడికి అందించే కానుకల విషయం కూడా చర్చకు వస్తుంది. అంతలా మన సమాజంలో వేళ్లూనుకుపోయింది వరకట్న దురాచారం. కట్నం తీసుకోవడమనేది చట్టరీత్యా నేరమైనా దానిని అడగడం ఇంకా తమ హక్కుగా భావిస్తోంది వరుడి కుటుంబం. అయితే ఇప్పడిప్పుడే వరకట్నం విషయంలో నేటి యువత ఆలోచనా ధోరణి క్రమక్రమంగా మారుతోంది. ప్రధానంగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ లాంటి ఉన్నత విద్యావంతులు ఈ సామాజిక దురాచారాన్ని రూపుమాపేందుకు తమదైన శైలిలో కృషిచేస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన ఓ ఐఏఎస్‌ అధికారి కూడా ఎలాంటి కట్న కానుకలు తీసుకోకుండానే కల్యాణం చేసుకున్నాడు. అయితే వరకట్నం బదులు భార్యతో ఓ ఆసక్తికర ఒప్పందం కుదుర్చుకున్నాడీ వరుడు.

Know More

women icon@teamvasundhara
keeping-mum-dad-pens-a-heartfelt-tribute-to-his-wife-she-has-their-second-child

ఇలాంటి భర్త ఉంటే ఎంత అదృష్టమో కదూ!

మాతృత్వమనేది మహిళలకు మాత్రమే సొంతమైన ఓ గొప్ప వరం. అందుకే పెళ్లయిన అమ్మాయిలందరూ వీలైనంత త్వరగా అమ్మగా ప్రమోషన్‌ పొందాలని కోరుకుంటారు. అయితే మాతృత్వమనేది ఓ మహిళకు ఎంత గొప్ప వరమో ఈక్రమంలో అంతటి అగ్ని పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గర్భం ధరించినప్పటి నుంచి బిడ్డకు జన్మనిచ్చేంత వరకు ఆమెకు అడుగడుగునా సవాళ్లే ఎదురవుతాయి. వీటిని అధిగమించి పురిటి నొప్పులను తట్టుకుని ఓ బిడ్డను ప్రసవించడమనేది తల్లికి పునర్జన్మ లాంటిదే. ఈ క్రమంలో ఓ కొత్త ప్రాణానికి రూపమిచ్చేందుకు తన భార్య పడిన కష్టం, వేదనకు అక్షర రూపమిచ్చాడు ఓ భర్త. తన భార్య నవమాసాల ప్రయాణాన్ని తన కుమారుడికి వివరిస్తూ సోషల్‌ మీడియాలో అతడు షేర్‌ చేసిన పోస్ట్‌ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Know More

women icon@teamvasundhara
konkona-sen-and-ranvir-shorey-file-for-divorce-after-five-years-of-separation

అవును.. మేమిద్దరం విడిపోయాం!

పెళ్లిలో అగ్ని సాక్షిగా ఏకమై, ఏడడుగులు నడిచిన భార్యాభర్తలు...నిండు నూరేళ్లు అలాగే కలిసుండాలని కోరుకుంటారు. అందుకు తగ్గట్టే కొందరి దంపతుల కాపురం ఎలాంటి కలహాల్లేకుండా సాఫీగా సాగిపోతుంది. ఇక ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలొచ్చినా కొన్ని జంటలు ఒకరికొకరు అర్థం చేసుకుంటూ సర్దుకుపోతుంటే మరికొన్ని జంటలు సంసారమనే సాగరంలో సర్దుకుపోలేకపోతున్నాయి. కలిసుండి కలహాల కాపురం కొనసాగించే బదులు పరస్పర అంగీకారంతో విడిపోతున్నాయి. ఇందులో సామాన్యులే కాదు సెలబ్రిటీ జంటలు కూడా ఉన్నాయి. తాజాగా బాలీవుడ్‌ నటి, దర్శకురాలు కొంకణా సేన్‌ శర్మ తన భర్తతో అధికారికంగా విడిపోయేందుకు కోర్టు మెట్లెక్కగా, మరో నటి భాగ్యశ్రీ కూడా ఒకానొక సమయంలో తన భర్తతో దూరంగా ఉన్నానంటూ ప్రకటించింది.

Know More

women icon@teamvasundhara
richa-chadda-and-ali-fazal-going-to-be-married

అభిరుచులే మమ్మల్ని కలిపాయి!

దీపికా-రణ్‌వీర్‌, సోనమ్‌-ఆనంద్‌, అనుష్క-విరాట్‌, బిపాసా-కరణ్‌, కరీనా-సైఫ్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే బాలీవుడ్‌ ప్రేమ పక్షుల జాబితా చాలా పెద్దదే అవుతుంది. ప్రేమతో మొదలైన వీరి బంధం పెళ్లితో ఏకమై ఎంతో అన్యోన్యంగా కొనసాగుతోంది. ఇలాంటి ప్రణయబంధంలోకి బాలీవుడ్‌కు చెందిన మరో ప్రేమ జంట అడుగిడనుందా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. బాలీవుడ్‌ క్యూట్‌ కపుల్స్‌లో ఒకరిగా పేరుగాంచిన రిచా చద్దా, అలీ ఫజల్‌ త్వరలోనే పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారట. కొన్నేళ్ల నుంచి డేటింగ్‌లో ఉన్న ఈ మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ కపుల్‌ తాజాగా మాల్దీవుల వెకేషన్‌లో సందడి చేస్తోంది. ఈ క్రమంలో త్వరలోనే పెళ్లి పీటలెక్కేందుకు నిర్ణయించుకున్నారని వార్తలు వస్తున్నాయి. మరి, ఇంతకీ ఈ అందాల జంట పెళ్లి ఎప్పుడు? ఎక్కడ జరగనుంది?అసలు వీరి ప్రేమ కథ ఎప్పుడు, ఎలా మొదలైంది? తెలియాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే..!

Know More

women icon@teamvasundhara
i-dont-understand-his-behavior

అతడిని ప్రేమించేస్తానేమోనని భయంగా ఉంది..!

నేను ఇంజినీరింగ్‌ చదువుతున్నా. ఆర్థిక భారమైనా అమ్మానాన్నలు కష్టపడి చదివిస్తున్నారు. నేను ఇంటికి దూరంగా ఓ స్నేహితురాలితో కలిసి గది అద్దెకి తీసుకుని ఉంటున్నా. ఆ విషయాలన్నీ నేను ఎప్పుడూ ఎవరితో చెప్పుకోను. ఒకసారి అనుకోకుండా బస్సులో మా లెక్చరర్‌ ఒకరు కలిశారు. మాటల సందర్భంలో కుటుంబ నేపథ్యం, స్నేహితురాలితో ఉంటున్న విషయాలన్నీ ...అమ్మానాన్నలే అతనికి చెప్పారు. దాంతోపాటూ ‘మా అమ్మాయిని బాగా చదివించండి’ అని కోరారు. ఆ రోజు నుంచీ మా లెక్చరర్‌ ప్రవర్తనలో చాలా తేడా. ఫోన్‌ చేయడం మొదలు పెట్టాడు. సెలవు రోజున ‘సినిమా టికెట్లు తీసుకోమంటావా, పార్కుకి వెళదామా..’ అంటూ అడుగుతున్నాడు. ఒకసారి ఏకంగా గది దగ్గరకే వచ్చాడు. దాంతో నా స్నేహితురాలు నా గురించి తప్పుగా అనుకోవడం మొదలుపెట్టింది. ఇవన్నీ మా లెక్చరర్‌తో గట్టిగా చెప్పలేకపోతున్నా. అతని ఆలోచన ఏంటో తెలియట్లేదు. అమ్మానాన్నలు చెప్పినందుకు శ్రద్ధ తీసుకుంటున్నాడా.. లేదంటే నామీద ఆసక్తి చూపుతున్నాడా అన్నది అర్థం కావట్లేదు. నేను అతడిని ప్రేమించేస్తానేమోనని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వండి. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
smelling-partner-shirt-can-make-good-sleep

భాగస్వామి దుస్తులు చెంతనుండగా.. నిద్రమాత్రలు ఏలనో!

స్త్రీ, పురుషుల బంధం గురించి ఎంతోమంది కవులు, ఎంతో అద్భుతంగా వర్ణించిన సందర్భాలున్నాయి. ‘ప్రేమించిన వ్యక్తి పక్కన ఉంటే చాలు.. అదే స్వర్గమని, ప్రేయసి లేత బుగ్గపై మొటిమ కూడా ముత్యంతో సమానమని, చివరికి చెమట చుక్క కూడా మంచి గంధమే అని’.. ఇలా ప్రేమికుల మనోభావాలకు అద్దం పడతాయీ వర్ణనలు. నిజంగా మనసారా ప్రేమించిన ఒక వ్యక్తి సాన్నిహిత్యంలో ఉంటే ఇలాంటి భావనే కలుగుతుందా? అంటే.. ప్రేమలో ఉన్న వాళ్లు మాత్రం వెంటనే అవునని సమాధానమిస్తారు. అయితే ప్రేమించిన వ్యక్తి పక్కన ఉంటేనే కాదు... చివరికి వారు వేసుకున్న దుస్తుల నుంచి వచ్చే వాసన కూడా భాగస్వాములను సానుకూలంగా ప్రభావితం చేస్తుందట. నమ్మలేకపోతున్నారు కదూ! కానీ ఇది అక్షరాల నిజం. కెనడా పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఇంతకీ వారు చేసిన ఆ పరిశోధన, అందులో తేలిన ఆ ఆసక్తికర అంశాలు ఏమిటో చూద్దాం రండి.. నిద్రలేమి... వినడానికి ఇది చిన్న సమస్యే అయినా అనుభవించే వారికి మాత్రం ఇదో నరకం. పడుకోగానే నిద్రపోతే.. ‘అబ్బా ఎంత అదృష్టవంతులు.. పడుకోగానే నిద్రలోకి జారుకుంటారు’ అనే రోజులివి. పని ఒత్తిడి, గ్యాడ్జెట్‌ల వాడకం పెరుగుతుండడం, మారుతున్న ఆహారపు అలవాట్లు.. ఇలా నిద్రలేమికి గల కారణాలెన్నో. ఇక నిద్రలేమి మరెన్నో ఆరోగ్య సమస్యలకూ కారణమవుతోంది. అయితే కొంతమంది దీన్ని అధిగమించడానికి నిద్రమాత్రలను ఉపయోగిస్తుంటారు. ఇది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తోన్నా పట్టించుకోరు.

Know More

women icon@teamvasundhara
bipasa-karan-cute-photos

ముద్దుల జంట.. చూసేందుకు రెండు కళ్లూ చాలవంట..!

బాలీవుడ్‌ స్వీట్‌ కపుల్స్‌లో బిపాసా బసు, కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ ఒకరు. చూడముచ్చటగా.. నిన్ననే పెళ్లైందా అన్నట్లు ఎప్పుడూ చాలా రొమాంటిక్‌గా కనిపిస్తారీ క్యూట్‌ కపుల్‌. వివాహమై నాలుగేళ్లు గడుస్తోన్నా.. తమ జీవితంలో వచ్చే ప్రతి ప్రత్యేక సందర్భాన్నీ సరికొత్తగా సెలబ్రేట్‌ చేసుకుంటూ, వెకేషన్స్‌కి వెళ్తూ తమ అనుబంధాన్ని నిత్యనూతనం చేసుకుంటున్నారీ మంకీ కపుల్‌. ఇక వీరి మధ్య ఉండే అన్యోన్యతకు ఇద్దరూ కలిసి దిగే ఫొటోలే ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలుస్తాయని చెప్పచ్చు. ‘మంకీలవ్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఇద్దరూ కలిసి దిగిన లవ్లీ ఫొటోస్‌ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు బిప్స్‌-కరణ్‌. ఆదివారం (ఫిబ్రవరి 23) కరణ్‌ సింగ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రస్తుతం ఈ జంట మాల్దీవుల్లో తెగ సందడి చేస్తోంది. అంతేనా.. అక్కడి బీచుల్లో కలియతిరుగుతూ, సముద్రంలో జలకాలాడుతూ ఆ మధురానుభూతులను ఫొటోల్లో బంధిస్తూ.. తమ అభిమానులతో పంచుకుంటోందీ ముద్దుల జంట. మరి, ఆ క్యూట్‌ పిక్స్‌తో పాటు గతంలో పలు సందర్భాల్లో ఇద్దరూ కలిసి దిగిన కొన్ని అందమైన ఫొటోలపై మనమూ ఓ లుక్కేద్దామా..?

Know More

women icon@teamvasundhara
how-to-change-my-husband-behavior

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
strength-of-marriage-depend-on-the-husbands-job-status

బంధాన్ని నిలిపేది భర్త ఉద్యోగమేనా..?

‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అని ఎప్పుడోనే చెప్పారు జర్మన్‌కు చెందిన ప్రముఖ తత్త్వవేత్త, ఆర్థికవేత్త కార్ల్‌మార్క్స్‌. ‘డబ్బుకు ప్రేమ అవసరం లేదు కానీ, ప్రేమకు డబ్బు కావాలి’. ఇది ఓ సినిమాలో హీరో తన ప్రేయసితో చెప్పే డైలాగ్‌. అయితే ‘బంధాలు నిలిచి ఉండాలంటే కావాల్సింది డబ్బులు కాదు ప్రేమే’, ‘డబ్బులు శాశ్వతం కాదు, మనుషుల మధ్య ఉండే ప్రేమలే శాశ్వతం’ అని మరికొందరు వాదిస్తుంటారు. ఇవి చెప్పడానికే బాగుంటాయి కానీ డబ్బులేనిది ఈ ప్రపంచం ముందుకు నడవదనేది జగమెరిగిన సత్యం. ఇదేదో గాలికి చెబుతున్న మాటలు కావు. ప్రఖ్యాత హార్వర్డ్‌ యూనివర్సిటీ చేసిన ఓ అధ్యయనంలో తేలింది. ‘భర్త ఆర్థిక, ఉద్యోగ పరిస్థితులు బంధంపై ఎంతవరకు ప్రభావం చూపుతాయన్న’ అంశంపై చేసిన సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా..?

Know More

women icon@teamvasundhara
questions-to-ask-your-partner-before-marriage

పెళ్లికి ముందే ఈ ప్రశ్నలు అడగండి !

పెళ్లంటే నూరేళ్ల పంట..! జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ నిండు నూరేళ్లు ఆనందంగా గడపడమే వివాహ బంధానికి అసలైన అర్ధం. కానీ, ప్రస్తుత పరిస్థితులు ఇందుకు భిన్నంగా తయారయ్యాయి. మూడు ముళ్ల బంధం మూన్నాళ్ల ముచ్చటగా మారిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అభిప్రాయభేదాలు, ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం లేకపోవడం, ఆర్ధికపరమైన విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండడం, పిల్లలు లేకపోవడం.. ఇలా రకరకాల కారణాలతో ఎన్నో జంటలు పెళ్లైన కొన్నాళ్లకే విడిపోతున్నాయి. తమ సమస్యలను పరిష్కరించుకోలేక విడాకుల కోసం న్యాయస్థానాల ముందు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో పెళ్లికి ముందే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం వల్ల చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయి. ఇలా చేయడం వల్ల ఒకరిపై ఒకరికి పూర్తి అవగాహన రాకపోయినా.. తాము చేసుకోబోయే వ్యక్తి ఆలోచన విధానాన్ని కొంతమేరకు అంచనా వేసే అవకాశం మాత్రం కచ్చితంగా ఉంటుంది. ఈ క్రమంలో పెళ్లికి ముందు తాము చేసుకోబోయే వాళ్లను వధువు/వరుడు అడగాల్సిన కొన్ని ప్రశ్నలేంటో చూసేద్దామా..!

Know More

women icon@teamvasundhara
shriya-sharan-opens-up-about-her-love-life

మా ప్రేమకథ అక్కడే మొదలైంది!

సుమారు 19 ఏళ్ల క్రితం ‘ఇష్టం’ సినిమాతో ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రియ. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు ఆంగ్ల సినిమాల్లోనూ నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. రజనీకాంత్‌, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి అగ్ర హీరోలతో పాటు పవన్‌, ప్రభాస్‌, మహేశ్‌ లాంటి యువ హీరోలతోనూ ఆడిపాడిందీ ముద్దుగుమ్మ. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రత్యేక పాటలతో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న ఈ అందాల తార 2018 మార్చిలో రహస్యంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రష్యాకు చెందిన టెన్నిస్‌ ఆటగాడు ఆండ్రీ కొశ్చీవ్‌తో కలిసి ఏడడుగులు నడిచిన ఆమె, ఇప్పటివరకు ఎప్పుడూ తన భర్త గురించి కానీ, తన ప్రేమకథ గురించి కానీ ఎప్పుడూ నోరు విప్పలేదు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా ప్రేమ, పెళ్లితో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుందీ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
tollywood-hero-nitin-posts-his-marriage-photos-social-media

‘సింగిల్’ అన్నాడు... ‘మింగిల్‌’ అయిపోతున్నాడు !

టాలీవుడ్‌లో ఇండస్ట్రీలో ది మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్స్‌లో ఒకడిగా ఉన్న యంగ్‌ హీరో నితిన్‌.. పెళ్లి గురించి ఎప్పుడు ప్రస్తావన తీసుకొచ్చినా దాటేసేవాడు. కానీ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో భాగంగా ప్రస్తుతం తాను ప్రేమలో ఉన్నానని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా మొన్నటివరకు తన పెళ్లి గురించి ఎలాంటి చడీచప్పుడూ లేకుండా ఉన్న నితిన్‌.. తాజాగా ఏకంగా తన వివాహ ప్రారంభ వేడుకలకు సంబంధించిన ఫొటోలను పోస్ట్‌ చేసి అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేశాడు.. గతకొన్ని రోజులుగా తన స్నేహితురాలితో ప్రేమలో ఉన్న నితిన్‌ మరికొన్ని రోజుల్లో ఓ ఇంటి వాడు కాబోతున్నాడన్నమాట! ఇంతకీ నితిన్‌ మనసు కొల్లగొట్టిన ఆ లక్కీ గర్ల్‌ ఎవరో, వీళ్ల ప్రేమకథేంటో మనమూ తెలుసుకుందామా!!

Know More

women icon@teamvasundhara
follow-me-couples-set-a-new-trend-in-their-photoshoot

‘ఫాలో ఫాలో మీ’ అంటోన్న ఈ జంట కథేంటో తెలుసా?

ప్రయాణాలంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. అందులోనూ మనకిష్టమైన వారితో, మనసుకు నచ్చిన వారితో ఓ వెకేషన్‌కో, టూర్‌కో వెళితే ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేం. విహారయాత్రలతో మనసుకు ప్రశాంతత దొరకడంతో పాటు మనుషుల మధ్య బంధాలు మరింత దృఢంగా మారతాయి. అందుకే చాలామంది బిజీ లైఫ్‌ నుంచి బ్రేక్‌ తీసుకొని మరీ ఏడాదికోసారో, రెండుసార్లో ఔటింగ్‌కు వెళుతుంటారు. అయితే రష్యాకు చెందిన ఓ ప్రేమజంట పదేళ్లుగా ప్రపంచమంతా పర్యటిస్తూనే ఉంది. వివిధ దేశాల్లోని చారిత్రక ప్రదేశాలు, దేవాలయాలు, పురాతన కట్టడాలు, మ్యూజియంలను చుట్టేస్తోంది. ఈ క్రమంలో ఓవైపు తమ కళ్లతో ఆ అందమైన ప్రదేశాలను చూస్తూనే, మరోవైపు తమ కెమెరా కళ్లతో ఆ మధురానుభూతులను బంధిస్తున్నారు. అనంతరం ఆ అందాలను ‘ఫాలోమీ’ సిరీస్‌ పేరుతో ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. మరి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమ్‌ సొంతం చేసుకున్న ఈ ‘ఫాలోమీ’ ఫొటో సిరీస్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి..!

Know More

women icon@teamvasundhara
famous-love-dialogues-in-tollywood-movies

ప్రేమ గురించి ఇలా చెబితే ఫిదా అయిపోరూ?!

‘ప్రేమ.. రెండక్షరాల మహా కావ్యం. ప్రతి మనిషి అన్వేషణ ప్రేమ కోసమే. ఈ ప్రపంచం ఇంత అందంగా ఉందంటే అది కేవలం ప్రేమ వల్లే’.. ఇదీ ప్రేమలో ఉన్న వారికి కలిగే భావన. గతించిన చరిత్రలో, ప్రస్తుత వర్తమానంలో ఎంతోమంది గొప్ప ప్రేమికుల గురించి మనం వినే ఉంటాం. ఇక ఫిబ్రవరి 14వచ్చిందంటే చాలు.. ప్రేమికులు తమ మనసులోని భావాలను వ్యక్తం చేయడానికి తహతహలాడుతుంటారు. అప్పటికే ప్రేమ మైకంలో తేలియాడుతున్న వారు ఈ ప్రత్యేకమైన రోజున తమ ప్రియమైన వారిని ఎలా ఇంప్రెస్‌ చెయ్యాలని ఆలోచిస్తే.. మొదటిసారి ప్రేమను వ్యక్తపరచాలనుకునే వారికి వేలంటైన్స్‌ డే ఓ మధురానుభూతిగా మిగిలిపోతుందని చెప్పుకోవచ్చు. ఇలా నిజ జీవితంలోనే కాదు.. వెండితెరపైనా ఎన్నో ప్రేమ కావ్యాలు సినీ ప్రియుల మనసును తాకాయి. అందులోని పాటలే కాదు.. డైలాగ్స్‌ కూడా ఈతరం ప్రేమికులు తమ ప్రియమైన వారితో చెబుతూ తమ మనసులోని ప్రేమను పంచుకోవడం మనం చూస్తూనే ఉంటాం.. ఈక్రమంలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తెలుగు చిత్రాల్లోని కొన్ని పాపులర్‌ లవ్‌ డైలాగ్స్‌పై ఓ లుక్కేద్దామా!!

Know More

women icon@teamvasundhara
different-hugs-have-different-meanings

కౌగిలింతకో కథ!

ఏదైనా ఆందోళన, తీవ్రమైన బాధలో ఉన్న వ్యక్తిని మనస్ఫూర్తిగా గుండెలకు హత్తుకోండి.. దెబ్బకు వాళ్ల బాధంతా పరార్‌!! ఇదేదో సినిమాలోని డైలాగ్‌ అనుకుని తేలికగా తీసుకోకండి. నిజంగానే కౌగిలింతకు ఎంతో పవర్‌ ఉంది. మనిషి మూడ్‌ని మార్చేసే శక్తి హగ్‌లో ఉందని ఇప్పటికే పరిశోధకులు శాస్త్రీయంగా కనుగొన్నారు కూడా! జనవరి 12న ఏకంగా ‘నేషనల్‌ హగ్‌ డే’గా నిర్వహిస్తున్నారంటేనే కౌగిలింత గొప్పతనమేంటో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు... వేలంటైన్స్‌ వీక్‌లో భాగంగా ఫిబ్రవరి 12ను ‘హగ్‌ డే’గా జరుపుకోవడం మనకు తెలిసిందే. ఈ ప్రత్యేకమైన రోజున తమకు నచ్చిన వ్యక్తులను ఆప్యాయంగా కౌగిలించుకొని తమ ప్రేమను వ్యక్తం చేస్తారు ప్రేమపక్షులు. మరి, ఆప్యాయంగా ఇచ్చే ఈ కౌగిలింతలో ఎన్నో రకాలు, వాటికి మరెన్నో అర్థాలున్నాయన్న విషయం మీకు తెలుసా? రిలేషన్‌షిప్‌ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఏ హగ్‌కు ఏ అర్థముందో ఇప్పుడు తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
surprising-gifts-for-your-valentine

నచ్చిన వారికి మెచ్చిన ‘కానుకి’ద్దాం..!

ఎటు చూసినా ప్రేమ మయం.. ఎంత ఆస్వాదించినా తనివి తీరదు ప్రేమలోని మాధుర్యం.. ఎక్కడ చూసినా ప్రేమికులంతా ఏకమై పండగలా జరుపుకొనే ‘ప్రేమికుల దినోత్సవం’ వచ్చేస్తోంది. తాము ప్రేమించిన వ్యక్తిపై తమ మనసులోని అందమైన భావాలను తెలియజేయాలని, బహుమతులతో వారిని మరింతగా సర్‌ప్రైజ్‌ చేయాలని ప్రేమికులంతా ఆరాటపడుతుంటారు. అయితే మారుతున్న కాలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన రోజున ఇచ్చిపుచ్చుకునే బహుమతుల విషయంలోనూ ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మరి, అలా ఈతరం ప్రేమికుల్ని కట్టిపడేస్తున్న కొన్ని వెరైటీ ప్రేమ కానుకలపై మీరూ ఓ లుక్కేయండి. వీటిలో మీకు నచ్చిన, మీ ప్రియమైన వారు మెచ్చిన కానుకను ఎంచుకొని దాన్ని వారికి ఈ వేలంటైన్స్ డే కానుకగా అందించేయండి.. వారి మనసును మరోసారి దోచేయండి..

Know More

women icon@teamvasundhara
arvind-kejriwal-and-sunitha-kejriwal-love-story

కేజ్రీవాల్‌ క్రేజీ లవ్‌స్టోరీ విన్నారా?

‘ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది’ ఉన్నట్లే తన విజయం వెనుక తన భార్య సునీతా కేజ్రీవాల్‌ ఉందంటున్నారు ముచ్చటగా మూడోసారి దిల్లీ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కనున్న అరవింద్‌ కేజ్రీవాల్‌. ఇటీవలే జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు 62సీట్లు గెలుచుకొని విజయదుందుభి మోగించింది ఆప్‌. ‘ఇంత గొప్ప విజయం వెనుక నా భార్య సునీత ఉంది.. ఆమె లేకుంటే ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తికి గుర్తింపే లేదు.. నా భార్యే నా విజయ రహస్యం..’ అంటూ చెబుతున్నారు కేజ్రీ. సహధర్మచారిణిగా తన ప్రతి బాధ్యతను నెరవేర్చుతూ, ఎల్లప్పుడూ భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈరోజు తన భర్త దిల్లీ పీఠానికి ముచ్చటగా మూడోమారు అధిపతిగా మారేందుకు ప్రేరణగా నిలిచారామె. ఈ నేపథ్యంలో ఈ ముచ్చటైన జంట ప్రేమకబుర్లేంటో మనమూ చదివేద్దామా..!!

Know More

women icon@teamvasundhara
man-proposes-to-girlfriend-in-front-of-eiffel-tower

‘ఈఫిల్‌ టవర్‌’ సాక్షిగా ‘ఐ లవ్యూ’ చెప్పాడు!

‘ప్రేమికుల దినోత్సవం’ వచ్చేస్తోంది. ‘వేలంటైన్‌ వీక్‌’ పేరుతో ఇప్పటికే ప్రపంచమంతా ‘ప్రేమ’ సంబరాల్లో మునిగిపోయింది. ఇక ‘ఫిబ్రవరి 14’ కోసం ఆతృతగా ఎదురుచూస్తూ కొంతమంది ప్రేమికులు తమ ప్రియమైన వారిని ఎక్కడ కలవాలో, ఏ బహుమతి ఇవ్వాలో, ఆరోజంతా ఎలా వారితో గడపాలో ప్లాన్స్‌ వేసుకుంటున్నారు. మరికొంతమంది తాము ప్రేమించిన వ్యక్తికి తమ మనసులోని ప్రేమను తెలియజేసేందుకు సర్‌ప్రైజ్‌లతో సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో న్యూయార్క్‌లో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన ఓ యువకుడు ‘ఈఫిల్‌ టవర్‌’ సాక్షిగా తన ప్రేయసికి ప్రపోజ్‌ చేశాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో తన మనసులోని భావాలను పాట రూపంలో వ్యక్తపరుస్తూ తన ప్రియురాలి చేతికి రింగ్‌ తొడిగాడు.

Know More