scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'అత్తారింటి వేధింపులను ఎదిరించా... జీవితంలో గెలిచా..!'

'విజయవాడకి చెందిన ఒక అమ్మాయికి పద్దెనిమిదేళ్ల వయసులోనే తల్లిదండ్రులు పెళ్లి చేసేశారు. ఆ తర్వాత కోటి ఆశలతో అత్తారింట అడుగుపెట్టిన ఆమెకి అక్కడ గృహహింస, అదనపు వరకట్న వేధింపులు ఆహ్వానం పలికాయి.. క్రమంగా అత్తింటి వారి ఆగడాలు పెచ్చుమీరడంతో అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. బతుకుతెరువు కోసం తనకి వచ్చిన కుట్లు, అల్లికలతో చిన్న షాపు మొదలుపెట్టింది. ప్రస్తుతం తానే సొంతంగా ఒక వ్యాపారాన్ని నిర్వహించే స్థాయికి చేరింది. ఇంతకీ ఆమె ఎవరు.. ఏం జరిగింది.. ఈ స్థాయికి ఎలా చేరింది.. మొదలైన వివరాలన్నీ తెలియాలంటే ఇది చదవాల్సిందే..'

Know More

Movie Masala

 
category logo

ఈ బొబ్బట్లు భలే పసందు..!

Different types of bobbatlu and their health benefits in telugu

తెలుగు వారు కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ జరుపుకొనే పండగే ఉగాది. ఈ క్రమంలోనే శార్వరి నామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ ప్లవ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది. ఎన్నో ఆశలు, ఆశయాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోయే మనకు షడ్రుచులతో స్వాగతం పలుకుతుందీ పండగ. అయితే ఉగాది అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆరు రుచుల సంగమమైన ఉగాది పచ్చడి.. ఆ తర్వాత ఎంతో తియ్యతియ్యగా నోరూరించే బొబ్బట్లు. బొబ్బట్టు, భక్ష్యాలు, ఒబ్బట్టు, పోలీ.. ఇలా పేరేదైనా వాటి రుచి మాత్రం అమోఘమని చెప్పుకోవాలి. సాధారణంగా ఈ బొబ్బట్లను శెనగపప్పు / పెసరపప్పు.. వంటి వాటితోనే ఎక్కువగా చేస్తుంటారు. మరి, విభిన్న పదార్థాలతో తయారుచేసిన ఈ వెరైటీ బొబ్బట్లను మీరెప్పుడైనా ప్రయత్నించారా? లేదా.. అయితే ఈసారి వీటిని ప్రయత్నించి చూడండి.. ఇటు కమ్మని రుచిని ఆస్వాదిస్తూనే.. అటు సంపూర్ణ ఆరోగ్యాన్నీ సొంతం చేసుకోండి.

గుమ్మడికాయ డేట్స్ బొబ్బట్లు

ugadibobbatlu650-01.jpg

కావాల్సినవి
* గుమ్మడికాయ తరుగు - ఒక కప్పు (పైన చెక్కు తీసేసి సన్నగా తరుగుకోవాలి)
* డేట్స్ - 10 (గింజలు తీసి తరిగి పెట్టుకోవాలి)
* రవ్వ - అర కప్పు
* నెయ్యి - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
* చక్కెర - ఒక కప్పు
* యాలకుల పొడి - పావు టీస్పూన్
* మైదా - ఒక కప్పు
* గోధుమపిండి - అర కప్పు
* ఉప్పు - చిటికెడు
* నూనె - రెండు టేబుల్‌స్పూన్లు
* నీళ్లు - పిండి కలపడానికి సరిపడా
తయారీ
ముందుగా ఒక ప్యాన్‌లో నెయ్యి వేసి రవ్వను కాస్త దోరగా వేయించాలి. ఆ తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన గుమ్మడికాయ తరుగును, డేట్స్ తరుగు కూడా వేసి ఐదు నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు దీనిలో చక్కెర, యాలకుల పొడి వేసి చక్కెర కరిగే వరకూ కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమాన్ని వేరే బౌల్‌లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఆపై దీన్ని స్టఫింగ్ కోసం చిన్న చిన్న బాల్స్‌లా తయారుచేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బౌల్‌లో మైదా, గోధుమపిండి, ఉప్పు, కొద్దిగా నూనె వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఆపై దీన్ని ఓ అరగంట పాటు నాననిచ్చి.. చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. వీటిని పూరీల్లా వత్తుకొని అందులో ఇందాక తయారుచేసి పెట్టుకున్న గుమ్మడి మిశ్రమాన్ని స్టఫ్ చేసుకొని చివర్లు మూసేయాలి. ఇలా తయారైన ముద్దను చేతి మునివేళ్లతో గుండ్రంగా, కాస్త మందంగా వత్తుకోవాలి. ప్యాన్‌పై నూనె వేస్తూ వీటిని రెండువైపులా కాల్చుకుంటే ఎంతో రుచికరంగా ఉండే గుమ్మడికాయ బొబ్బట్లు సిద్ధం.. వీటిని నెయ్యితో వడ్డించుకున్నా లేదంటే ప్లెయిన్‌గా తిన్నా బాగుంటాయి.

ఓట్స్ కొబ్బరి బొబ్బట్లు

ugadibobbatlu650-02.jpg

కావాల్సినవి
* ఓట్స్ - అరకప్పు
* కొబ్బరి పొడి - అరకప్పు
* బెల్లం - ముప్పావు కప్పు
* యాలకుల పొడి - ఒక టీస్పూన్
* నెయ్యి - కొద్దిగా
* పాలు - పావు కప్పు
* గోధుమపిండి - ఒక కప్పు
* ఉప్పు - చిటికెడు
* నూనె - ఒక టేబుల్‌స్పూన్
తయారీ
ముందుగా ఒక బౌల్‌లో గోధుమపిండి, ఉప్పు, కొద్దిగా నూనె వేసి నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీన్ని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఆలోపు స్టఫింగ్ కోసం సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం ఓట్స్, కొబ్బరిపొడి, యాలకుల పొడి, బెల్లం.. ఈ నాలుగింటినీ మిక్సీలో వేసి మెత్తటి పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్‌లో నెయ్యి వేసి ఈ మిశ్రమాన్ని అందులో వేసి కాసేపు వేయించుకోవాలి. ఆపై ఇందులో పాలు పోసి ఉండలు కట్టకుండా కలుపుతుండాలి. ఈ మిశ్రమం ఉండలు కట్టుకోవడానికి వీలుగా తయారయ్యేదాకా ఇలా కలుపుకోవాలి. ఆపై దీన్ని దించి చల్లారనిచ్చి స్టఫింగ్ కోసం చిన్న చిన్న బాల్స్‌లా చేసుకోవాలి. ఇప్పుడు గోధుమపిండిని పూరీల్లా వత్తుకొని ఈ బాల్స్‌ని వాటిలో స్టఫ్ చేయాలి. ఈ ఉండల్ని చేతి మునివేళ్లతో గుండ్రంగా, కావాల్సిన పరిమాణాల్లో చేసుకొని ప్యాన్‌పై నెయ్యి వేస్తూ ఇరువైపులా కాల్చుకోవాలి. అంతే.. ఎంతో సింపుల్‌గా, టేస్టీగా ఉండే ఓట్స్ కొబ్బరి బొబ్బట్లు రుచిచూడడానికి రడీ అయిపోయినట్లే..! వీటిని నెయ్యితో లేదంటే హాట్‌గా కావాలనుకుంటే మురుకులతో కూడా సర్వ్ చేసుకోవచ్చు.

డ్రైఫ్రూట్స్ బొబ్బట్లు

ugadibobbatlu650-03.jpg

కావాల్సినవి
* బాదంపప్పు - అరకప్పు
* జీడిపప్పు - అరకప్పు
* వాల్‌నట్స్ - అరకప్పు
* నువ్వులు - ఒక టేబుల్‌స్పూన్
* గసగసాలు - ఒక టేబుల్‌స్పూన్
* కొబ్బరిపొడి - ఒక కప్పు
* బెల్లం - ఒకటిన్నర కప్పు
* గోధుమపిండి - ఒకటిన్నర కప్పు
* ఉప్పు - చిటికెడు
* నెయ్యి - కొద్దిగా
* నూనె - కొద్దిగా
తయారీ
ముందుగా ఒక బౌల్‌లో గోధుమపిండి, ఉప్పు, కొద్దిగా నూనె వేసి నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీన్ని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం తయారుచేసుకోవాలి. ఇందులో భాగంగా ముందుగా డ్రైఫ్రూట్స్‌ని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆపై నువ్వులు, గసగసాల్ని కూడా మిక్సీలో వేసి మెత్తటి పౌడర్‌లా చేసుకోవాలి. ఈ రెండింటినీ కలుపుకోవాలి. ఆ తర్వాత స్టౌపై బౌల్ పెట్టి తురిమిన బెల్లం వేసి కొన్ని నీళ్లు పోయాలి. ఇది పూర్తిగా కరిగిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఇందాక తయారుచేసుకున్న పౌడర్ మిశ్రమంలో వేసి ముద్దలాగా కలుపుకోవాలి. వీటిని స్టఫింగ్ కోసం చిన్న చిన్న ఉండల్లా తయారుచేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలుపుకున్న చపాతీ పిండిని తీసుకొని పూరీల్లా వత్తుకోవాలి. వాటి మధ్యలో డ్రైఫ్రూట్స్ బాల్స్‌ని పెట్టి చివర్లు మూసేయాలి. ఇలా తయారుచేసుకున్న బాల్స్‌ని మునివేళ్లతో చిన్న చిన్న పూరీల సైజులో వత్తుకోవాలి. వీటిని ప్యాన్‌పై నెయ్యి వేస్తూ ఇరువైపులా కాల్చుకుంటే ఎంతో రుచికరంగా ఉండే డ్రైఫ్రూట్స్ బొబ్బట్లు సిద్ధమైన్నట్లే..

రవ్వ కేసరి బొబ్బట్లు

ugadibobbatlu650-04.jpg

కావాల్సినవి
* రవ్వ - ఒక కప్పు
* చక్కెర - రెండు కప్పులు
* నీళ్లు - ఒక కప్పు
* పాలు - ఒక కప్పు
* జీడిపప్పులు - 10
* బాదంపప్పులు - 5
* కిస్‌మిస్‌లు - 10
* యాలకుల పొడి - ఒక టీస్పూన్
* మైదాపిండి - రెండు కప్పులు
* ఉప్పు - చిటికెడు
* నూనె - ఐదు టీస్పూన్లు
* నెయ్యి - కొద్దిగా
తయారీ
ముందుగా స్టౌ మీద ప్యాన్ పెట్టి రవ్వను దోరగా వేయించుకోవాలి. ఇందులో చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పాలు, కొన్ని నీళ్లు పోసి మిశ్రమం ఉండలు కట్టకుండా చిక్కపడేంత వరకూ కలుపుతుండాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి పోసి, యాలకుల పొడి వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మరో ప్యాన్‌లో కాస్త నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్‌ని దోరగా వేయించుకోవాలి. వీటిని ఇందాక పక్కన పెట్టుకున్న రవ్వ కేసరి మిశ్రమంలో వేసి మరోసారి కలిపి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో మైదాపిండి, ఉప్పు, కొద్దిగా నూనె వేసి నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీన్ని పావుగంట పాటు పక్కన పెట్టి.. ఆపై చిన్న చిన్న ముద్దలా చేసుకొని పూరీల్లా వత్తుకోవాలి. ఇందులో స్టఫింగ్ కోసం తయారుచేసుకున్న కేసరి మిశ్రమపు ఉండను ఉంచి చివర్లు మూసేయాలి. ఈ ముద్దను గుండ్రంగా పూరీ సైజులో వత్తుకొని ప్యాన్‌పై వేసి నెయ్యితో ఇరువైపులా కాల్చుకుంటే చూడగానే నోరూరించే రవ్వ కేసరి బొబ్బట్లు సిద్ధం.

క్యారట్ కొబ్బరి బొబ్బట్లు

ugadibobbatlu650-05.jpg

కావాల్సినవి
* తురిమిన క్యారట్ - అరకప్పు
* పచ్చికొబ్బరి తురుము - అరకప్పు
* యాలకుల పొడి - అర టీస్పూన్
* బాదంపప్పు పొడి - మూడు టీస్పూన్లు
* జీడిపప్పు పొడి - మూడు టీస్పూన్లు
* చక్కెర - ఒక కప్పు
* గోధుమపిండి - ఒక కప్పు
* ఉప్పు - చిటికెడు
* నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు
తయారీ
ముందుగా ఒక బౌల్‌లో గోధుమపిండి, ఉప్పు, కొద్దిగా నెయ్యి వేసి నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీన్ని ఓ అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌపై ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసి కొబ్బరి తురుము, క్యారట్ తురుమును దోరగా వేయించుకోవాలి. ఆపై ఇందులో చక్కెర కూడా వేసి చక్కెర కరిగి, క్యారట్ ఉడికేంత వరకూ సిమ్‌లో కలుపుతూ ఉండాలి. ఆపై యాలకుల పొడి, జీడిపప్పు పొడి, బాదంపప్పు పొడి వేసి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. దీన్ని చల్లారనిచ్చి స్టఫింగ్ కోసం చిన్న చిన్న ఉండల్లా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండిని చిన్న చిన్న ముద్దల్లా తీసుకొని పూరీల్లా వత్తుకోవాలి. అందులో క్యారట్ మిశ్రమాన్ని పెట్టి చివర్లు మూసేయాలి. వీటిని చేతి మునివేళ్లతో గుండ్రంగా, మనకు కావాల్సిన పరిమాణాల్లో వత్తుకొని ప్యాన్‌పై నెయ్యితో ఇరువైపులా కాల్చుకుంటే క్యారట్ కొబ్బరి బొబ్బట్లు రడీ.

ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా!

ఇలా మనం తయారుచేసుకున్న ఈ వెరైటీ బొబ్బట్లు మనకు రుచిని పంచడమే కాదు.. ఆరోగ్యాన్నీ అందిస్తాయి. ఇందుకు వాటిలో మనం వాడిన పదార్థాల్లోని పోషకాలే కారణం.

ugadibobbatlu650-06.jpg
* ఎన్నో విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉన్న డేట్స్‌లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ శరీరానికి తక్షణ శక్తిని అందించడంతో పాటు రక్తహీనతను నివారిస్తుంది.. మలబద్ధకం సమస్యనూ తగ్గిస్తుంది. అలాగే వీటిలోని క్యాల్షియం ఎముకలు దృఢంగా మారేందుకు దోహదపడుతుంది.
* గుమ్మడికాయలో ఉండే పీచు పదార్థం, పొటాషియం, విటమిన్ సి.. వంటివి శరీరంలో బీపీని అదుపులో ఉంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో, మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో గుమ్మడికి సాటి వేరేదీ లేదంటే అతిశయోక్తి కాదు.
* నెయ్యి జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. అలాగే ఇందులోని బ్యుటిరికామ్లం రోగనిరోధక శక్తిని పెంచుతుందని పలు పరిశోధనల్లో తేలింది. అంతేకాదు.. ఆకలి వేయాలన్నా, బరువు తగ్గాలన్నా నెయ్యిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం చాలా అవసరం.

ugadibobbatlu650-07.jpg
* రక్త ప్రసరణ మెరుగవడానికి, నోటి దుర్వాసనను పోగొట్టడానికి, శరీరంలోని మలినాలను బయటికి పంపించేయడానికి, గొంతు సంబంధ ఇబ్బందులను తగ్గించడానికి.. ఇలా పలు సమస్యలను దూరం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడంలో యాలకుల పాత్ర కీలకమే అని చెప్పుకోవచ్చు.
* రక్తంలోని చక్కెర స్థాయుల్ని అదుపులో ఉంచుకోవడానికి ఓట్స్ బాగా తోడ్పడతాయి. అలాగే ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి కూడా ఇది మంచి ఆహారం. చిన్నారుల్లో ఆస్తమా, మలబద్ధకం వంటి సమస్యల్నీ దూరం చేస్తుంది.
* కొబ్బరిలోని ల్యూరికామ్లం, బయో యాక్టివ్ సమ్మేళనాలు ఆరోగ్యానికి ఎంతో అవసరం. అలాగే ఇందులో కాపర్, క్యాల్షియం, మాంగనీసు, మెగ్నీషియం, జింక్.. వంటి ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.
* శరీరంలోని అనవసర పదార్థాలను తొలగించి కాలేయాన్ని సంరక్షించడంలో బెల్లం పాత్ర కీలకం. ఇది జీర్ణశక్తిని పెంచడంతో పాటు ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు చర్మంలోని ఫ్రీరాడికల్స్‌ని నిర్మూలించి చర్మాన్ని నవయవ్వనంగా మారుస్తాయి.
* డ్రైఫ్రూట్స్‌లో భాగంగా బాదంపప్పులు బరువును అదుపులో ఉంచడంలో, రక్తంలోని చక్కెర స్థాయుల్ని కంట్రోల్ చేయడంలో తోడ్పడతాయి. వాల్‌నట్స్‌లో క్యాన్సర్‌తో పోరాడే గుణాలున్నాయి. అలాగే ఇవి మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. జీడిపప్పులోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు జీవనక్రియల్ని మెరుగుపరచడంలో సహకరిస్తాయి. కిస్‌మిస్‌లు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంతో పాటు శరీరంలో ఐరన్ స్థాయుల్ని పెంచడంలో తోడ్పడతాయి. అలాగే ఎముకల్ని దృఢంగా చేయడంలోనూ ఇవి కీలకపాత్ర పోషిస్తాయి.

ugadibobbatlu650-08.jpg
* శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి నువ్వుల్ని మించిన ఆహారం వేరే లేదనడంలో సందేహం లేదు. అలాగే ఇవి రక్తహీనతను తగ్గిస్తాయి.. హార్మోన్లను బ్యాలన్స్ చేయడంతో పాటు గుండె ఆరోగ్యాన్నీ సంరక్షిస్తాయి.
* గసగసాలు మహిళల్లో సంతానోత్పత్తిని పెంచడానికి తోడ్పడతాయి. అలాగే జీర్ణశక్తిని పెంచడం, నిద్రలేమిని తరిమికొట్టడం, శరీరానికి తక్షణ శక్తిని అందించడం.. వంటివన్నీ గసగసాల ద్వారా సాధ్యమవుతాయి.
* కంటి ఆరోగ్యాన్ని సంరక్షించడంలో క్యారట్‌లోని విటమిన్ ఎ బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో అధికంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు ఏ అనారోగ్యాన్నైనా ఇట్టే తరిమికొడతాయి. దంత సంరక్షణకు, చర్మ సౌందర్యాన్ని చేకూర్చడానికి కూడా క్యారట్ బాగా ఉపయోగపడుతుంది.

Photos: Screengrab

women icon@teamvasundhara
juices-to-beat-the-summer-heat-in-telugu
women icon@teamvasundhara
tasty-summer-special-recipes-with-chia-seeds-in-telugu
women icon@teamvasundhara
shilpa-shetty-shares-her-must-try-recipe-mango-mousee

శిల్ప చెప్పిన ఈ మ్యాంగో మౌసీని మీరూ ట్రై చేస్తారా?

వేసవి అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది మామిడిపండ్లే. నోరూరించే ఈ తియ్యతియ్యటి పండ్లతో రకరకాల జ్యూస్‌లు, ఐస్‌క్రీమ్‌లు, షెర్బత్‌లు, మిల్క్‌షేక్‌లు, ఆహార పదార్థాలు చేసుకుని ఆస్వాదిస్తాం. ఈ క్రమంలో అటు రుచిపరంగా, ఇటు ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేసే ఈ సూపర్‌ ఫ్రూట్‌తో ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ‘మ్యాంగో మౌసీ’ బెటర్‌ అని చెబుతోంది బాలీవుడ్‌ బ్యూటీ శిల్పాశెట్టి. ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతోనే ఎంతో సులభంగా, వేగంగా దీనిని తయారుచేసుకోవచ్చని ఆమె చెబుతోంది. మరి వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించే ఈ సమ్మర్‌ రెసిపీ తయారీ గురించి మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
ugadi-special-recipes-in-telugu
women icon@teamvasundhara
to-beat-summer-heat-try-this-home-made-fruit-custard

ఈ రెసిపీతో వేసవి తాపాన్ని తీర్చుకుందాం!

వేసవిలో దాదాపు ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే సమస్య డీహైడ్రేషన్‌. శరీరంలోని నీరు చెమట రూపంలో బయటికి వెళ్లిపోవడం వల్ల తలెత్తే ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటాం. లీటర్ల కొద్దీ నీటిని తాగడంతో పాటు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ.. వంటివి తీసుకుంటూ శరీరంలో నీటి స్థాయుల్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తాం. ఈక్రమంలో వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటే పిస్తా మ్యాంగో ఫ్రూట్‌ కస్టర్డ్‌ను తయారుచేసుకొని తీసుకోవడం మేలంటున్నారు ప్రముఖ చెఫ్‌ మేఘనా కామ్దార్‌. ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో ఎంతో సులభంగా, త్వరగా దీనిని తయారు చేసుకోవచ్చని ఆమె చెబుతున్నారు. మరి వేసవి తాపాన్ని తగ్గించే ఈ సమ్మర్‌ రెసిపీ తయారీ గురించి మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
musk-melon-or-kharbuja-why-you-must-have-it-in-summer?-in-telugu
women icon@teamvasundhara
5-traditional-yet-delicious-sankranthi-recipes-that-one-shouldnt-miss

నోరూరించే ఈ సంక్రాంతి వంటకాలు రుచి చూసేద్దామా..!

‘సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా.. సరదాలు తెచ్చిందే తుమ్మెదా..’ అంటూ తెలుగు ప్రజలంతా సరదాగా ఆడుతూ పాడుతూ చేసుకునే అతి ముఖ్యమైన పండగే మకర సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమ.. ఇలా ముచ్చటగా మూడు రోజులపాటు జరుపుకునే ఈ పండగలో భాగంగా రంగురంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బిళ్లు, కోడిపందాలు.. వంటి ఎన్నో ప్రత్యేకతలుంటాయి. అంతేనా.. పండగొచ్చిందంటే చాలు.. ప్రత్యేకమైన పిండి వంటలతో తెలుగు లోగిళ్లన్నీ ఘుమఘుమలాడతాయి. కొత్త పంట చేతికొచ్చే ఈ ఆనందంలో వివిధ రకాల ప్రత్యేక వంటకాల్ని చేసుకొని ఇంటిల్లిపాదీ ఆస్వాదిస్తుంటారు. మరి, ఈ సంక్రాంతి సందర్భంగా పండగ ఆనందాన్ని రెట్టించే, అతిథులకు నోరూరించే అలాంటి కొన్ని స్పెషల్‌ రెసిపీస్‌ మీకోసం..

Know More

women icon@teamvasundhara
health-benefits-of-sankranthi-special-recipes-in-telugu

మితంగా తింటే ఈ పిండివంటల్లో ఆరోగ్య ప్రయోజనాలూ ఎన్నో!

'సంబరాల సంకురాత్రి.. వూరంతా పిలిచింది..' అన్నట్లుగా సంక్రాంతి పండగ సంబరాలనే కాదు.. ఎన్నో రకాల పిండి వంటల్ని కూడా మోసుకొస్తుంది. ఈ పండక్కి ఏ ఇంటి ముంగిలి చూసినా రంగురంగుల రంగవల్లికలతో ఎలాగైతే కళకళలాడుతుంటుందో.. అలాగే ప్రతి ఇల్లూ వివిధ రకాల పిండివంటలతో ఘుమఘుమలాడుతుంటుంది. పండక్కి వారం ముందు నుంచే వీటిని తయారు చేయడంలో నిమగ్నమైపోతారు గృహిణులు. వీటిలో ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది సంక్రాంతి పొంగలి. దీంతో పాటు సకినాలు, అరిసెలు, జంతికలు.. ఇలా ఎన్నో.. ఎన్నెన్నో.. దేని ప్రత్యేకత దానిదే. అయితే ఈ వంటకాలన్నీ రుచికరంగా ఉంటూ నోరూరించడమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. మంచివి. ఈ క్రమంలో సంక్రాంతి పండుగకు చేసుకునే కొన్ని పిండి వంటలు, వాటి వల్ల ఆరోగ్య పరంగా కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
5-delicious-cake-recipes-for-christmas

ఈ కేక్స్‌తో ‘క్రిస్మస్‌’ ఎంతో స్పెషల్‌ !

ప్రపంచమంతా సంవత్సరం పొడవునా ఎదురుచూసే క్రిస్మస్‌ పండగ వచ్చేసింది.. మరి ఈ కలర్‌ఫుల్‌ ఫెస్టివల్‌ను జరుపుకోవడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారా?? క్రిస్మస్‌ అనగానే గుర్తొచ్చేది అందమైన క్రిస్మస్‌ ట్రీ, క్రిస్మస్‌ గిఫ్ట్స్‌, నోరూరించే స్పెషల్‌ వంటకాలు.. ఇలా ఇంకెన్నో..! వంటకాలంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది క్రిస్మస్‌ కేక్స్‌ గురించి! చిన్నపిల్లల దగ్గరినుంచీ పెద్దల వరకూ ఎంతో ఇష్టంగా తినే కేక్స్‌ను ఎంతో ప్రత్యేకంగా తయారుచేస్తారు. మరి మీరు ఈసారి ఎలాంటి కేక్స్‌ తయారుచేయబోతున్నారు?? ఎప్పుడూ రొటీన్‌గా చేసుకునేవి కాకుండా, ఈసారి ఈ కొత్త రకం కేకులు ట్రై చేసి చూడండి.. మరి అవేంటో.. ఎలా తయారుచేయాలో చూసేద్దాం రండి..!

Know More

women icon@teamvasundhara
try-these-special-idly-recipes
women icon@teamvasundhara
try-these-hot-soups-in-winter

చలికాలంలో ఈ సూప్స్‌తో వెచ్చవెచ్చగా!

ఏ కాలంలోనైనా అది తినాలి ఇది కావాలి అనిపిస్తుంది కానీ చలికాలంలో మాత్రం ఏం తిన్నా వేడివేడిగా తినాలనిపిస్తుంది. ఈ క్రమంలో రెండు ముద్దలు ఎక్కువే తినేస్తుంటారు చాలామంది. మరి ఓ వైపు చలి చంపేస్తుంటే ఇక వ్యాయామం సంగతి పట్టించుకునే వారు ఎంతమంది ఉంటారు చెప్పండి. దాని సంగతి దేవుడెరుగు అనుకునేవారు ఎంతమందో! ఇలా రెండుమూడు ముద్దలు ఎక్కువ తినడం, అటు వ్యాయామమూ చేయకపోవడం వల్ల చలికాలం పూర్తయ్యేసరికి బరువు పెరిగేస్తుంటారు చాలామంది. అందుకే అటు వేడివేడిగా కడుపు నిండుగా, ఇటు మీ ఫిట్‌నెస్‌ని కూడా కోల్పోకుండా ఉండాలంటే ఈ చలికాలంలో సూప్స్‌ ట్రై చేయడం బెటర్‌. మరి అలా నోరూరిస్తూ చలిని దూరం చేసే ఈ సూప్స్‌ని ఒకసారి మీరూ ట్రై చేసి రుచి చూడండి!

Know More

women icon@teamvasundhara
want-to-make-poha-laddoos?try-shilpa-shetty-super-easy-and-healthy-recipe

రుచికరమైన ఈ అటుకుల లడ్డూ మనమూ ట్రై చేద్దామా?!

శిల్పాశెట్టి... బాలీవుడ్‌కు సంబంధించి ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించే నటీమణుల జాబితాలో ముందుంటుందీ ముద్దుగుమ్మ. నిత్యం వ్యాయామాలు, యోగాసనాలతో పాటు ఆరోగ్యకరమైన వంటకాల వీడియోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో ఆరోగ్య స్పృహ పెంచడం శిల్పకు అలవాటు. ఈ క్రమంలో ఇప్పటికే రాగి దోసె, ఓట్స్‌ ఇడ్లీ, ఓట్స్‌ ఉప్మా, బేసన్‌ కొకోనట్‌ బర్ఫీ, బనానా బ్రెడ్‌.. వంటి ఎన్నో రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాలను తన ఫ్యాన్స్‌కు పరిచయం చేసిందీ అందాల తార. ఇక ఇప్పుడు పోహా (అటుకులు)తో లడ్డూ తయారుచేసి మన ముందుకు తెచ్చింది. మరి, ఈ టేస్టీ లడ్డూను శిల్ప ఎలా తయారుచేసిందో ఆమె పోస్ట్‌ చేసిన వీడియోలో చూసి మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
prepare-kheema-biryani-on-this-sunday-in-telugu
women icon@teamvasundhara
dasara-naivedyalu-and-their-health-benefits-in-telugu

నవరాత్రుల నైవేద్యాలు.. పోషకాల నిలయాలు!

నవరాత్రుల్లో తొమ్మిది రోజులపాటు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం అనవాయితీ.. కేవలం పూజే కాదు.. ప్రసాదంగా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను ఏరోజుకారోజు చేసి ప్రత్యేకంగా సమర్పించడం కూడా సహజమే.. పది రోజుల పాటు విభిన్న అవతారాల్లో దర్శనమిచ్చే ఆ శక్తిస్వరూపిణికి ఇష్టమైన వంటకాలేంటో మన అందరికీ తెలుసు.. కానీ వాటిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలున్నాయని కూడా మీకు తెలుసా? నిజం.. అమ్మవారి ప్రసాదాల్లో మనకు తక్షణ శక్తినిచ్చే గుణంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే లక్షణం కూడా ఉండడం విశేషం. మరి, ఏయే ప్రసాదాల్లో ఎలాంటి గుణాలుంటాయో.. తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
shilpa-shetty-cooks-healthy-ragi-dosa-in-telugu

ఈ రాగి దోశ తింటే ఆరోగ్యానికెంతో మంచిది!

శిల్పా శెట్టి.. ఫిట్‌నెస్‌, ఆరోగ్యం వంటి విషయాల్లో ఎంతో పకడ్బందీగా ఉంటుందీ బ్యూటీ. ఈ నేపథ్యంలోనే ఆరోగ్యకరమైన వంటకాల్ని తయారుచేస్తూ తన యూట్యూబ్‌ ఛానల్‌లో, సోషల్‌ మీడియా పేజీల్లో పోస్ట్‌ చేస్తుంటుంది. అంతేకాదు.. వాటిలోని పోషక విలువల్ని సైతం వీడియోలో వివరిస్తూ తన ఫ్యాన్స్‌లో ఆరోగ్యం పట్ల అవగాహనను మరింతగా పెంచుతుంటుందీ యమ్మీ మమ్మీ. తాజాగా ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోగ్యకరమైన, రుచికరమైన రాగి దోశను మన ముందుకు తీసుకువచ్చింది శిల్ప. ఈ వీడియోను ఇన్‌స్టాలో, తన యూట్యూబ్‌ ఛానల్‌లో పంచుకుంటూ ఓ సుదీర్ఘ పోస్ట్‌ రాసుకొచ్చిందీ బాలీవుడ్‌ అందం.

Know More

women icon@teamvasundhara
eat-tasty-and-loose-weight-with-overnight-oats-in-telugu

'ఓవర్ నైట్ ఓట్స్'తో బరువు తగ్గండి.!

అప్పట్లో పెద్దవాళ్లు రాత్రిపూట ఒక కుండలోనో, గిన్నెలోనో అన్నం మెత్తగా కలిపి, అందులో పాలుపోసి, కాసింత పెరుగువేసి మూతపెట్టేవారు. ఇలా తోడుపెట్టిన అన్నాన్ని 'తరవాణీ' అంటారు కొన్ని ప్రాంతాల్లో. పొలం పనులకి వెళ్లేవారు, ఆఫీసులకు వెళ్లేవారు, చదువుకోడానికి వెళ్లే పిల్లలూ ఎంచక్కా పొద్దున్నే పచ్చిమిరప కాయలో, ఉల్లిపాయలో, ఏ పచ్చడో వేసుకుని అది తిని వెళ్లేవారు..! తర్వాత బోలెడన్ని టిఫిన్లు వచ్చేశాయ్. అయితే 'ఓల్డ్ ఈజ్ గోల్డ్' అన్నట్లు ఇప్పుడు అన్నిట్లోనూ రెట్రో ఫ్యాషన్లు, పద్ధతులు ప్రాచుర్యం పొందుతున్నట్లు బ్రేక్‌ఫాస్ట్ విషయంలో కూడా పాతపద్ధతులు వచ్చేస్తున్నాయ్. 'ఓవర్ నైట్ ఓట్స్' కాన్సెప్ట్ కూడా సరిగ్గా ఇలాంటిదే.!ఒక రకంగా మన చద్దన్నానికి ఇది వెస్ట్రనైజ్‌డ్ వెర్షన్ అనమాట.! చద్దన్నం బలాన్నిస్తే, ఓవర్‌నైట్ ఓట్స్ పోషకాలను అందిస్తూ అధిక బరువు తగ్గడానికి సహాయపడతాయి.

Know More

women icon@teamvasundhara
vegan-day-special-recipes-to-prepare-at-home-in-telugu

ఆహా! ఏమి ఈ వీగన్ వంటల రుచి!

వీగన్ డైట్.. ప్రస్తుతం సామాన్యుల దగ్గర్నుంచి సెలబ్రిటీల వరకు ఫాలో అవుతోన్న ఆహార పద్ధతి ఇది. ఇలా వీగన్స్‌గా మారిపోతూ మూగజీవాల పట్ల తమకున్న ప్రేమను చాటుకోవడమే కాదు.. ఆరోగ్యకరమైన ఆహార పద్ధతినీ అవలంబిస్తున్నారు చాలామంది. మాంసం, గుడ్లతో పాటు పాలు, జంతువుల నుంచి ఉత్పత్తయ్యే పదార్థాలకు పూర్తి దూరంగా ఉంటూ కేవలం మొక్కల నుంచి లభించే పదార్థాలను మాత్రమే తమ మెనూలో చేర్చుకోవడమే వీగనిజం ముఖ్యోద్దేశం. అయితే ఈ వీగన్ డైట్‌ని నేరుగా ఆహారంలో భాగం చేసుకోవడమే కాదు.. దీంతో వివిధ రకాల వంటకాలను కూడా చేసుకొని రుచికరంగా లాగించేయచ్చు. అలాంటి కొన్ని యమ్మీ యమ్మీ వీగన్ రెసిపీస్ ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
immunity-boosting-recipes-for-this-ganesh-chaturthi-in-telugu

వినాయకుడికీ ఇమ్యూనిటీని పెంచే నైవేద్యాలు!

పండగంటేనే బోలెడన్ని పిండి వంటలు, నైవేద్యాలు. వాటిని తయారుచేసి దేవుడికి ఎప్పుడెప్పుడు నైవేద్యం పెడతామా.. మనమెప్పుడు లాగించే స్తామా అని ఎదురుచూస్తుంటాం. అలాంటి పిండి వంటల హడావిడి ‘వినాయక చవితి’తో మళ్లీ మొదలైంది. అయితే ఈ పండక్కి ఎప్పుడూ విభిన్న స్వీట్లు, మోదక్‌, ఉండ్రాళ్లు.. వంటివన్నీ తయారుచేసి ఆ బొజ్జ గణపయ్యను ప్రసన్నం చేసుకుంటుంటాం. అయితే ఈసారి కరోనా ప్రతికూల పరిస్థితులున్న నేపథ్యంలో చవితి నైవేద్యాల్లో కూడా రోగనిరోధక శక్తిని పెంచే వంటకాలకు ప్రాధాన్యమివ్వడం మంచిది. తద్వారా మనం కరోనా బారిన పడకుండా జాగ్రత్తపడడంతో పాటు ఆ పార్వతీ తనయుడి ఆశీస్సులు కూడా అందుకోవచ్చు. మరి, రోగనిరోధక శక్తిని పెంచే ఆ పిండి వంటలేంటో, వాటిని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
try-these-special-sweets-to-impress-your-brother-on-rakhi

ముద్దుల సోదరుడికి నోరూరించే మిఠాయి..!

హాయ్.. నా పేరు శ్రావ్య. ఈ కాలం అమ్మాయినే అయినా నేను సంప్రదాయాలంటే ఆసక్తి చూపిస్తా. అందుకే ఈ రాఖీ పౌర్ణమికి మా అన్నయ్య కోసం ఓ ప్రత్యేకమైన రాఖీ తయారుచేయించా. మా ఇద్దరి ఫొటోతో రూపొందించిన పర్సనలైజ్‌డ్ రాఖీ అది. కేవలం ట్రెండీ టచ్ మాత్రమే కాదు.. ఇటు సంప్రదాయబద్ధంగానూ ఉండేలా ప్లాన్ చేశా. అంతేకాదు.. ఈ రక్షాబంధన్‌కి మా అన్నయ్య నోరు తీపి చేయడానికి నేనే ప్రత్యేకంగా మిఠాయిలు తయారుచేసి తనపై నాకున్న ప్రేమను చాటాలనుకుంటున్నా. మరి, ఇంతా అంతా కాదు.. నాకున్న ప్రేమనంతా చాటాలంటే ఒక్క మిఠాయి సరిపోతుందా? అందుకే ఒకటి, రెండు కాదు.. చాలా రకాల స్వీట్లను స్వయంగా తయారుచేయాలనుకుంటున్నా. అవేంటో మీరూ తెలుసుకుందురు గానీ రండి..

Know More

women icon@teamvasundhara
shilpa-shetty-cooks-healthy-upma-with-oats-and-sattu

శిల్ప చెప్పిన ఈ ఓట్స్ ఉప్మా మీరూ ట్రై చేస్తారా?

బాలీవుడ్‌కు సంబంధించి ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించే నటీమణుల జాబితాలో ముందు వరుసలో ఉంటుంది శిల్పాశెట్టి. వ్యాయామాలు, యోగాసనాలు, ఆరోగ్యకరమైన రెసిపీలు... తదితర విషయాల్లో ఆమెకు మంచి అవగాహన కూడా ఉంది. అందుకే ఈ విషయాలకు సంబంధించి తనకు తెలిసిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అందరితో పంచుకుంటుందీ అమ్మడు. ఈక్రమంలో ఇటీవలే మాంసాహారానికి స్వస్తి చెప్పి పూర్తి వెజిటేరియన్‌గా మారిపోయిన శిల్ప సోషల్‌ మీడియా వేదికగా ఓ టేస్టీ అండ్‌ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌ను అందరికీ పరిచయం చేసింది. ఇంతకీ ఏంటా బ్రేక్‌ఫాస్ట్‌?దాన్నెలా తయారుచేయాలో తెలుసుకుందాం రండి...!

Know More

women icon@teamvasundhara
how-to-make-yogurt-sweet-potato-for-easy-breakfast
women icon@teamvasundhara
eat-this-tasty-sugar-free-ice-cream-in-this-summer

టేస్టీ టేస్టీ షుగర్ ఫ్రీ ఐస్‌క్రీమ్..!

ఈ వేసవి కాలంలో చల్లచల్లని నోరూరించే ఐస్‌క్రీమ్ తినాలని ఎవరికి అనిపించదు చెప్పండి..! అయితే సాధారణంగా బయట తయారు చేసే ఐస్‌క్రీమ్స్‌లో చక్కెర అధిక మొత్తంలో ఉంటుంది. తక్కువ కార్బోహైడ్రేట్లుండే ఆహారం తీసుకుంటూ బరువును అదుపులో ఉంచుకునే వారు బయట తయారుచేసే ఫుల్లీ షుగర్ లోడెడ్ ఐస్‌క్రీమ్స్‌ని తినడం వల్ల మొదటికే మోసం వస్తుంది. మరి, అలా జరగకుండా ఉండాలంటే ఐస్‌క్రీమ్ మానేయాలా.. అంటారా? ఏం అక్కర్లేదు. చక్కెర వాడకుండా ఇంట్లోనే తయారుచేసే షుగర్ ఫ్రీ ఐస్‌క్రీమ్‌ను తీసుకుంటే అటు ఐస్‌క్రీమ్ తినాలన్న కోరికా తీరుతుంది.. ఇటు బరువు పెరుగుతామన్న భయమూ ఉండదు.. అలాంటి ఓ షుగర్ ఫ్రీ ఐస్‌క్రీమ్ రెసిపీనే ఇది..!

Know More

women icon@teamvasundhara
steps-to-prepare-mamidi-laddu
women icon@teamvasundhara
tasty-recipes-for-mothers-day-2020

అమ్మ కోసం కమ్మని కేక్స్‌ చేసేద్దాం..!

ప్రేమ, అనురాగం, ఆప్యాయత, త్యాగం.. ఇలా ఎన్నో సద్గుణాల కలబోత అమ్మ. అలాంటి అమ్మ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేమన్నది అక్షర సత్యం. అయితే ఏటా మే రెండో ఆదివారాన్ని ‘మాతృ దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. బోలెడన్ని కానుకలిస్తూ, ప్రేమ పంచుతూ అమ్మకు మనసారా కృతజ్ఞత చెప్పుకుంటున్నాం. అలాంటి సందర్భం ఈ ఏడాది కూడా రానే వచ్చింది. ఈ క్రమంలో ఈ ప్రత్యేకమైన రోజున కమ్మని వంటకాలతో అమ్మ నోరు తీపి చేయడం పరిపాటే. అయితే కరోనా కాచుక్కూర్చున్న ఈ ప్రతికూల పరిస్థితుల్లో బయటికెళ్లలేం. మరి, అమ్మతో కేక్‌ కట్‌ చేయించడమెలా అని ఆలోచిస్తున్నారా? ఇంట్లో దొరికే వస్తువులతోనే ఎంతో ఈజీగా కేక్‌ తయారుచేస్తే సరి.. అలాంటి కొన్ని రెసిపీలు ఈ ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా మీకోసం..

Know More

women icon@teamvasundhara
rakul-bakes-banana-chocolate-cookies-and-shares-the-recipe

భ్రమరాంబ ‘బనానా కుకీస్‌’ చేసింది..!

ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించే నటీమణుల జాబితాలో ముందు వరుసలో ఉంటుంది స్మైలింగ్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. వ్యాయామాలు, యోగాసనాలు, ఆరోగ్యకరమైన రెసిపీలు.. తదితర విషయాల్లో రకుల్‌కు మంచి అవగాహన కూడా ఉంది. అందుకే ఈ విషయాలకు సంబంధించి తనకు తెలిసిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా పంచుకొంటుంటుందీ అమ్మడు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా గత కొన్ని రోజులుగా రకుల్‌ ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తన ఫిట్‌నెస్‌పై మరింత శ్రద్ధ పెట్టడం, కుటుంబ సభ్యులతో గడపడంతో పాటు.. పలు ఆరోగ్యకరమైన రెసిపీలను కూడా తయారుచేస్తూ సోషల్‌ మీడియా వేదికగా అందరితో పంచుకుంటుంది. ఈ క్రమంలో రకుల్‌ ఇటీవలే షేర్‌ చేసిన రెసిపీ ఏంటో మీరే చూడండి.

Know More

women icon@teamvasundhara
senior-actress-neena-gupta-introduces-new-breakfast-recipe

బ్రేక్‌ఫాస్ట్‌కి ఈ ‘ఆలూ బ్రెడ్‌ రోల్స్‌’ ట్రై చేద్దామా?

లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కువ శాతం మంది ఇళ్లకే పరిమితమయ్యారు. సాధారణ రోజుల్లో హోటళ్లు, రెస్టరంట్‌ల చుట్టూ తిరుగుతూ నచ్చినవి తినేవారు ఇప్పుడు ఇంటి భోజనాన్నే అలవాటు చేసుకుంటున్నారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ దగ్గర్నుంచి రాత్రి డిన్నర్‌ వరకు ప్రతి ఒక్కటి తమకు నచ్చినవి.. అందులోనూ వెరైటీ వంటకాల్ని ప్రయత్నిస్తూ విభిన్న రుచుల్ని ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది తారలు సైతం వంటింట్లో వెరైటీ వంటకాలు చేస్తూ ఆ రెసిపీస్‌ని అందరితో పంచుకుంటున్నారు తాజాగా ప్రముఖ బాలీవుడ్‌ నటి నీనా గుప్తా కూడా సోషల్‌ మీడియా వేదికగా ఓ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్‌ను మనందరికీ పరిచయం చేసింది. ఇంతకీ ఏంటా బ్రేక్‌ఫాస్ట్‌? దాన్నెలా తయారుచేయాలో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
celebrities-tasty-quarantine-cook-ups

ఈ తారల వంటకాలు.. మనమూ ట్రై చేద్దామా?

షూటింగ్స్‌, పార్టీలు, అవార్డ్‌ ఫంక్షన్లు.. ఇలా వివిధ కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా గడిపే మన సినీ తారలు.. ఈ క్వారంటైన్‌ సమయాన్ని అనుకోకుండా దొరికిన వరంలా భావిస్తున్నారు. ఈ క్రమంలో తమ కుటుంబ సభ్యులతో గడపడంతో పాటు తమకంటూ కాస్త సమయాన్ని కేటాయించుకునే అద్భుత అవకాశంలా ఈ టైమ్‌ని అందిపుచ్చుకుంటున్నారు. అందుకే ఈ లాక్‌డౌన్‌ రోజుల్లో వారికి నచ్చిన పనులు చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమ పాకశాస్త్ర నైపుణ్యానికి మెరుగులు దిద్దుతూ అభిమానులకు సరికొత్త రుచులను పరిచయం చేస్తున్నారు కొంతమంది తారలు. రుచితోపాటు.. ఆరోగ్యాన్ని కూడా అందిస్తోన్న ఆ రెసిపీలేంటో తెలుసుకొని మనమూ ట్రై చేద్దామా మరి!

Know More

women icon@teamvasundhara
royal-chefs-prepares-choclate-cup-cake-on-elizabeths-birthday-shares-recipe

రాణీ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలతో...!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారితో పోరాడే క్రమంలో ప్రజలు సామాజిక దూరం, స్వీయ నిర్బంధం పాటిస్తూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ సమయంలో జరుపుకోవాల్సిన వివాహాలు, పెళ్లిరోజులు, శుభకార్యాలు, పుట్టినరోజు వేడుకలు, ప్రత్యేక సందర్భాలు.. మొదలైన కార్యక్రమాలను అయితే తూతూ మంత్రంగా జరుపుకోవడం లేదా వాయిదా వేయడం చేస్తున్నారు. సామాన్యులకు మాత్రమే కాదు ప్రముఖులకూ ఈ ఇబ్బందులు తప్పట్లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ఇంగ్లండ్‌ రాణి ఎలిజబెత్‌-2 తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకోవడం గమనార్హం. ఈ క్రమంలో రాణీ వారికి సంబంధించిన అధికారిక వ్యవహారాలు చూసుకునే ‘ది రాయల్‌ ఫ్యామిలీ’ బృందం ఆమె కోసం ఓ రుచికరమైన రెసిపీని తయారు చేసింది. అంతేకాదు, ఈ స్పెషల్‌ రాయల్‌ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో రాయల్‌ ఫ్యామిలీ బృందం సోషల్‌ మీడియా ద్వారా వివరంగా పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
the-quarantine-cooking-skills-of-celebrities

women icon@teamvasundhara
health-benefits-of-sri-rama-navami-naivedyams

నవమి నైవేద్యంతో మేలైన ఆరోగ్యం!

'శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం.. సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం.. ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం.. రామం.. నిశాచర వినాశకరం నమామి..' కోరిన కోర్కెలు తీర్చే కోదండరాముడి పుట్టినరోజునే మనం 'శ్రీరామనవమి'గా జరుపుకొంటాం. ఈ రోజున ఎక్కడ చూసినా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా శ్రీరాముడికి ప్రీతిపాత్రమైన బెల్లం పానకం, వడపప్పు, చలిమిడి.. నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత ఈ పదార్థాల్ని అందరికీ ప్రసాదంగా పంచిపెడతారు. ఈ క్రమంలో వీటి తయారీ విధానం, వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
alia-prepares-sabji-recipe-for-the-first-time
women icon@teamvasundhara
try-these-hot-soups-in-winter

చలికాలంలో ఈ సూప్స్‌తో వెచ్చవెచ్చగా!

ఏ కాలంలోనైనా అది తినాలి ఇది కావాలి అనిపిస్తుంది కానీ చలికాలంలో మాత్రం ఏం తిన్నా వేడివేడిగా తినాలనిపిస్తుంది. ఈ క్రమంలో రెండు ముద్దలు ఎక్కువే తినేస్తుంటారు చాలామంది. మరి ఓ వైపు చలి చంపేస్తుంటే ఇక వ్యాయామం సంగతి పట్టించుకునే వారు ఎంతమంది ఉంటారు చెప్పండి. దాని సంగతి దేవుడెరుగు అనుకునేవారు ఎంతమందో! ఇలా రెండుమూడు ముద్దలు ఎక్కువ తినడం, అటు వ్యాయామమూ చేయకపోవడం వల్ల చలికాలం పూర్తయ్యేసరికి బరువు పెరిగేస్తుంటారు చాలామంది. అందుకే అటు వేడివేడిగా కడుపు నిండుగా, ఇటు మీ ఫిట్‌నెస్‌ని కూడా కోల్పోకుండా ఉండాలంటే ఈ చలికాలంలో సూప్స్‌ ట్రై చేయడం బెటర్‌. మరి అలా నోరూరిస్తూ చలిని దూరం చేసే ఈ సూప్స్‌ని ఒకసారి మీరూ ట్రై చేసి రుచి చూడండి!

Know More

women icon@teamvasundhara
easy-to-do-pasta-dishes-for-busy-moms-in-telugu
women icon@teamvasundhara
mouth-watering-diwali-special-recipes
women icon@teamvasundhara
world-food-day-2019-special-recipe-in-telugu
women icon@teamvasundhara
ganesh-chaturthi-festival-special-receips
women icon@teamvasundhara
how-to-make-yogurt-sweet-potato-for-easy-breakfast
women icon@teamvasundhara
tasty-chips-recipes-in-telugu

¨ *XýqE ¹ª½-¹-ª½-©Ç-œË¢-Íä-§ŒÕ¢œË..!

„ïÃ-Âé¢.. ²Ä§ŒÕ¢-“ÅÃ©Õ Æ©Ç „ÃÊ X¾œ¿Õ-Ōբ˜ä Âê½¢-ÂÃ-ª½¢’à \Ÿçj¯Ã A¯Ã-©-E-XÏ¢-ÍŒœ¿¢ ®¾£¾Ç•¢. Âí¢ÅŒ-«Õ¢C ƒ¢šðx¯ä X¾Âî-œÎ©ð, ®¾„çÖ-²Ä©ð Í䮾Õ-¹ע˜ä.. «ÕJ-Âí¢-Ÿ¿ª½Õ “X¾A-²ÄK \¢ Íä²Äh¢©ä Æ¢{Ö ¦§ŒÕ{ ÊÕ¢* *Xýq ÅçÍŒÕa-¹ע-{Õ¢-šÇª½Õ. Æ¢Ÿ¿Õ-©ðÊÖ ƒ©Ç¢šË *Xýq Æ¢˜ä XÏ©x-©Â¹× ÍÃ©Ç ƒ†¾d¢ ¹؜ÄÊÖ..! «ÕJ ‡X¾Ûpœ¿Ö ¦¢’Ã-@Ç-Ÿ¿Õ¢-X¾-Åî¯ä ÂùעœÄ.. NNŸµ¿ ª½ÂÃ-©Õ’Ã.. Âî¾h ‚ªî-’¹u-¹-ª½¢’à *Xýq ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®¾Õ-Âî-«-œ¿-„çÕ-©Ç’î Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..„ïÃ-Âé¢.. ²Ä§ŒÕ¢-“ÅÃ©Õ Æ©Ç „ÃÊ X¾œ¿Õ-Ōբ˜ä Âê½¢-ÂÃ-ª½¢’à \Ÿçj¯Ã A¯Ã-©-E-XÏ¢-ÍŒœ¿¢ ®¾£¾Ç•¢. Âí¢ÅŒ-«Õ¢C ƒ¢šðx¯ä X¾Âî-œÎ©ð, ®¾„çÖ-²Ä©ð Í䮾Õ-¹ע˜ä.. «ÕJ-Âí¢-Ÿ¿ª½Õ “X¾A-²ÄK \¢ Íä²Äh¢©ä Æ¢{Ö ¦§ŒÕ{ ÊÕ¢* *Xýq ÅçÍŒÕa-¹ע-{Õ¢-šÇª½Õ. Æ¢Ÿ¿Õ-©ðÊÖ ƒ©Ç¢šË *Xýq Æ¢˜ä XÏ©x-©Â¹× ÍÃ©Ç ƒ†¾d¢ ¹؜ÄÊÖ..! «ÕJ ‡X¾Ûpœ¿Ö ¦¢’Ã-@Ç-Ÿ¿Õ¢-X¾-Åî¯ä ÂùעœÄ.. NNŸµ¿ ª½ÂÃ-©Õ’Ã.. Âî¾h ‚ªî-’¹u-¹-ª½¢’à *Xýq ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®¾Õ-Âî-«-œ¿-„çÕ-©Ç’î Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon@teamvasundhara
mango-recipes
women icon@teamvasundhara
tasty-lassi-recipes-in-telugu
women icon@teamvasundhara
mouthwatering-recipe-of-pumpkin-jelly-cake
women icon@teamvasundhara
masala-chai-recipe-in-telugu
women icon@teamvasundhara
try-these-festive-recipes-for-sri-rama-navami