scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'నేను ఏ తప్పూ చేయలేదు.. అయినా నాకెందుకీ శిక్ష!'

'ఎయిడ్స్.. నిరోధక మార్గాలు తప్ప పూర్తిస్థాయి చికిత్స లేని వ్యాధి. సాధారణంగా ఈ వ్యాధి సోకిందని తెలిస్తే చాలు.. వారు తప్పు చేశారు కాబట్టే ఆ వ్యాధి వచ్చిందని చుట్టుపక్కల ఉన్న వారు బలంగా నమ్ముతారు. ఈ క్రమంలో బాధితులను వారి మాటలతో మానసికంగానూ హింసిస్తారు. ఓ మహిళ తాను ఎలాంటి తప్పు చేయకపోయినా ఈ మహమ్మారి బారిన పడి ఒకానొక దశలో జీవితాన్ని ముగించేసుకోవాలనుకుంది.. కానీ ఆమెకు వచ్చిన ఓ ఆలోచన ఆ నిర్ణయాన్ని మార్చేసింది. అంతేకాదు.. ఈ సమాజంలో ఆమె ఎదుర్కొన్న మాటల ఈటెలు, బాధాకరమైన సంఘటనలు.. తనని మానసికంగా మరింత బలంగా తీర్చిదిద్దాయి.. దాంతో ఆమె ఎయిడ్స్‌పై పోరాడడమే కాదు.. చుట్టుపక్కల వారికీ అవగాహన కల్పిస్తూ తోటి వ్యాధిగ్రస్తులకు అండగానూ నిలుస్తోంది. అసలేం జరిగిందో ఆమె మాటల్లోనే విందాం రండి.. నమస్కారం.'

Know More

Movie Masala

 
category logo

ఈ తారల వంటకాలు.. మనమూ ట్రై చేద్దామా?

Celebrities Tasty Quarantine Cook Ups

షూటింగ్స్‌, పార్టీలు, అవార్డ్‌ ఫంక్షన్లు.. ఇలా వివిధ కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా గడిపే మన సినీ తారలు.. ఈ క్వారంటైన్‌ సమయాన్ని అనుకోకుండా దొరికిన వరంలా భావిస్తున్నారు. ఈ క్రమంలో తమ కుటుంబ సభ్యులతో గడపడంతో పాటు తమకంటూ కాస్త సమయాన్ని కేటాయించుకునే అద్భుత అవకాశంలా ఈ టైమ్‌ని అందిపుచ్చుకుంటున్నారు. అందుకే ఈ లాక్‌డౌన్‌ రోజుల్లో వారికి నచ్చిన పనులు చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమ పాకశాస్త్ర నైపుణ్యానికి మెరుగులు దిద్దుతూ అభిమానులకు సరికొత్త రుచులను పరిచయం చేస్తున్నారు కొంతమంది తారలు. రుచితోపాటు.. ఆరోగ్యాన్ని కూడా అందిస్తోన్న ఆ రెసిపీలేంటో తెలుసుకొని మనమూ ట్రై చేద్దామా మరి!

View this post on Instagram

A post shared by Lisa Lalvani (@lisahaydon) on

లీసా హెడెన్‌ బ్రెడ్‌ టైం!

క్వారంటైన్‌ సమయాన్ని కుటుంబంతో కలిసి గడుపుతున్న అందాల భామ లీసా హెడెన్‌.. అందరికీ నచ్చే ఈ బ్రెడ్‌ రెసిపీని తయారుచేయమని చెబుతోంది. అంతేకాదు.. ఈ రెసిపీ తయారీలో చిన్న చిన్న పనుల్లో పిల్లల్ని భాగం చేయడం వల్ల వారిని కూడా బిజీగా ఉంచచ్చని తల్లులందరికీ సూచిస్తోంది. మరి, ఈ రెసిపీ తయారీని తన ఇన్‌స్టా ద్వారా పంచుకుంటూ..‘ఈ బ్రెడ్‌ రెసిపీ చాలా బాగుంటుంది. దీని తయారీలో పిల్లలను కూడా భాగం చేయచ్చు.. పిండిని కలపడం, ముద్దలు చేయడం, వాటిని రోల్‌ చేయడం.. ఇలా చిన్న చిన్న పనులతో పిల్లల్ని కొన్ని గంటలపాటు బిజీగా ఉండేలా చేయచ్చు. ఈ బ్రెడ్‌ రెసిపీని ఎలా తయారుచేయాలో ఇప్పుడు చూద్దాం..’ అంటూ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని ఇన్‌స్టా పోస్ట్‌ రూపంలో పంచుకుందీ ముద్దుగుమ్మ.

బ్రెడ్‌ రెసిపీ..

కావాల్సిన పదార్థాలు

* పిండి (మీకు నచ్చినది ఎంచుకోవచ్చు) - మూడున్నర కప్పులు

* ఈస్ట్‌ - 2 టేబుల్‌ స్పూన్స్‌

* నూనె - కప్పులో మూడో వంతు

* పంచదార - 3 టేబుల్‌ స్పూన్స్‌

* ఉప్పు - టేబుల్‌ స్పూన్‌

* నీళ్లు - తగినన్ని

celebscookinglockdown650-1.jpg

తయారీ విధానం

ముందుగా ఒవెన్‌ని 180 డిగ్రీల వద్ద ప్రి-హీట్‌ చేసుకొని పెట్టుకోవాలి. అరకప్పు గోరువెచ్చని నీటిలో 2 టేబుల్‌ స్పూన్ల ఈస్ట్‌ వేసి కలిపి ఓ 10 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు ఓ వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో 2 కప్పుల వేడి నీటిని పోసుకోవాలి. ఆపై నూనె, పంచదార, ఉప్పు వేసి కలుపుకోవాలి. చివరగా పిండి, ఈస్ట్‌ కలిపిన నీళ్లను పోసుకుని పిండి చేతికి అంటుకోకుండా మృదువుగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని మీకు నచ్చిన ఆకారాల్లో కాస్త మందంగా ఒత్తుకొని బేకింగ్‌ ట్రేలో పెట్టుకుని 180 డిగ్రీల వద్ద 45 నిమిషాల పాటు బేక్‌ చేసుకోవాలి. అంతే.. టేస్టీ బ్రెడ్‌ సిద్ధం.నీనా గుప్తా ‘దేశీ పిజ్జా’ ట్రై చేద్దామా..!

View this post on Instagram

A post shared by Neena Gupta (@neena_gupta) on

ఇటాలియన్‌ పిజ్జాను ఇండియన్‌ స్టైల్‌లో తయారుచేసింది సీనియర్‌ యాక్ట్రెస్‌ నీనా గుప్తా.. ఈ దేశీ పిజ్జా వీడియోను ఇన్‌స్టా ద్వారా పంచుకుంటూ..‘దేశీ పిజ్జా.. పైన కాస్త బటర్‌ని జత చేసుకోండి..’ అంటూ క్యాప్షన్‌ జోడించింది నీనా.

దేశీ పిజ్జా రెసిపీ..

కావాల్సిన పదార్థాలు

* గోధుమ పిండి (మీకు నచ్చిన పిండి కూడా వాడుకోవచ్చు) – కప్పు

* బటర్‌/ పనీర్‌ – టాపింగ్‌కి తగినంత (తురుముకోవాలి)

* రింగ్స్‌లా కట్‌ చేసిన ఉల్లిపాయలు – 1

* గుండ్రంగా కట్‌ చేసిన టొమాటో ముక్కలు – 1

* పిజ్జా సాస్‌ – కప్పు

* ఉడికించి, ముక్కలుగా కట్‌ చేసిన బంగాళాదుంప – 1

* సన్నని ముక్కలుగా కట్‌ చేసిన క్యాప్సికం – 1

* ఉప్పు – తగినంత

* పచ్చి మిరపకాయలు – రెండు (సన్నగా కట్‌ చేసినవి)

* గరం మసాలా – టీస్పూన్‌

View this post on Instagram

A post shared by Neena Gupta (@neena_gupta) on

తయారీ విధానం

ఇప్పుడు పిండిని ఓ గిన్నెలో తీసుకుని అందులో ఉప్పు వేసి కొద్దికొద్దిగా నీటిని చేర్చుతూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని చపాతీలా ఒత్తుకుని దానిపై పిజ్జా సాస్‌ రాసుకుని.. దానిపై పనీర్‌, క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయలు, కట్‌ చేసిన పచ్చి మిరపకాయలు, టొమాటో ముక్కలు, బంగాళాదుంప ముక్కలు.. ఇలా అన్నింటినీ అచ్చం పిజ్జాపై పరిచినట్లుగా పరవాలి. చివరగా దానిపై గరం మసాలా, తురిమిన బటర్‌ని చల్లుకొని ఒవెన్‌లో 180 డిగ్రీల వద్ద ఓ అరగంటపాటు బేక్‌ చేస్తే సరి. దేశీ స్టైల్‌లో పిజ్జా తయారైనట్లే!శిల్పాశెట్టి సమ్మర్‌ డ్రింక్‌!

View this post on Instagram

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

శిల్పాశెట్టి.. యోగా క్వీన్‌ మాత్రమే కాదు.. హెల్దీ డైట్‌ని పాటించడంలో, ఆ రెసిపీలను తన ఫ్యాన్స్‌కి చేసి చూపించడంలో అందరికంటే ముందుంటుంది. అయితే ఎండలు ముదురుతోన్న ఈ సమయంలో శరీరానికి కూలింగ్‌ ఎఫెక్ట్‌ని అందించే ఓ హెల్దీ డ్రింక్‌ని మన ముందుకు తీసుకొచ్చేసిందీ యమ్మీ మమ్మీ. ఈ డ్రింక్‌ రెసిపీని తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ.. ‘అసలే ఎండాకాలం.. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మనం బయట తిరగకపోయినా.. ఈ హాట్‌ సమ్మర్‌లో మన శరీరం తేమను కోల్పోయి డీహైడ్రేషన్‌కి గురవడం సహజం. అలాగే మనలో చాలామంది ఈ కాలంలో ఆకలి వేయట్లేదంటూ తిండి మానేస్తుంటారు. అలాంటి వారు ప్రొటీన్‌, ఫైబర్‌ పుష్కలంగా లభించే ఈ డ్రింక్‌ను తీసుకోవచ్చు. ఇది డీహైడ్రేషన్‌ సమస్యను కూడా తగ్గిస్తుంది. తక్షణ శక్తిని అందించడంతో పాటు బరువును అదుపు చేస్తుంది..’ అంటూ ఈ సమ్మర్‌డ్రింక్‌లో దాగున్న ఆరోగ్య రహస్యాల గురించి వివరించింది శిల్ప.

సత్తు డ్రింక్

కావాల్సిన పదార్థాలు

* వేయించిన కాబూలీ శెనగల పిండి - 3 టేబుల్‌ స్పూన్స్

* ఆమ్‌చూర్‌ పౌడర్‌ - అర టీస్పూన్‌

* జీలకర్ర పొడి - అర టీస్పూన్‌

* పుదీనా, కొత్తిమీర తరుగు - టీస్పూన్‌

* ఉప్పు - తగినంత

* నిమ్మరసం - టీస్పూన్‌

* కట్‌ చేసిన పచ్చి మిరపకాయ – 1

* నీళ్లు - తగినన్ని

View this post on Instagram

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

తయారీ విధానం

ఇప్పుడు పైన తెలిపిన పదార్ధాలన్నింటినీ మిక్సీ జార్‌లో వేసి తగినన్ని నీళ్లు, ఐస్‌ ముక్కలు వేసి మిక్సీ పట్టాలి. ఈ డ్రింక్‌ని గ్లాస్‌లోకి తీసుకుని పైన పచ్చి మిరపకాయ ముక్కల్ని గార్నిష్‌ చేసుకుంటే సరిపోతుంది. అంతే.. ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన సత్తు డ్రింక్ రడీ..సమీర మెక్సికన్‌ స్పెషల్‌!

View this post on Instagram

A post shared by Sameera Reddy (@reddysameera) on

సినిమాలకు విరామం ప్రకటించి ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ని బోలెడంతగా ఎంజాయ్‌ చేస్తోన్న సమీరారెడ్డి.. ఈ క్వారంటైన్‌ సమయంలో తన పాకశాస్త్ర ప్రావీణ్యానికి మరింతగా పదునుపెడుతోంది. ఈ క్రమంలోనే తన అత్తయ్యతో కలిసి మెక్సికన్‌ చంకీ సల్సా రెసిపీని తయారుచేసి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిందీ బాలీవుడ్‌ మామ్‌.

మెక్సికన్‌ చంకీ సల్సా

కావాల్సిన పదార్థాలు

* టొమాటోలు - 2

* ఉల్లిపాయ - 1

* క్యాప్సికం - 1

* పచ్చి మిరపకాయలు - 2

* టొమాటో కెచప్‌ - 2 టేబుల్‌ స్పూన్స్‌

* వెనిగర్‌ - టేబుల్‌ స్పూన్‌

celebscookinglockdown650-2.jpg

తయారీ విధానం

టొమాటోలు సన్నగా కట్‌ చేసుకుని ఓ బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు వాటిని చేతితో లేదా మ్యాషర్‌ని ఉపయోగించి మ్యాష్‌ చేసుకోవాలి. మిగిలిన ఉల్లిపాయ, క్యాప్సికం, పచ్చి మిరపకాయలను సన్నని ముక్కలుగా కట్‌ చేసుకుని మ్యాష్‌ చేసిన టొమాటోకి జత చేసుకోవాలి. చివరగా టొమాటో కెచప్‌, వెనిగర్‌ కలిపితే చాలు.. మెక్సికన్‌ చంకీ సల్సా సిద్ధమైనట్లే..!


మరి, ఆలస్యమెందుకు ఈ లాక్‌డౌన్‌ సమయంలో మీరూ ఈ వెరైటీ వంటకాలు తయారు చేసి మీ ఇంటిల్లిపాదికీ విందు చేయండి..

Photos: Instagram

women icon@teamvasundhara
eat-this-tasty-sugar-free-ice-cream-in-this-summer

టేస్టీ టేస్టీ షుగర్ ఫ్రీ ఐస్‌క్రీమ్..!

ఈ వేసవి కాలంలో చల్లచల్లని నోరూరించే ఐస్‌క్రీమ్ తినాలని ఎవరికి అనిపించదు చెప్పండి..! అయితే సాధారణంగా బయట తయారు చేసే ఐస్‌క్రీమ్స్‌లో చక్కెర అధిక మొత్తంలో ఉంటుంది. తక్కువ కార్బోహైడ్రేట్లుండే ఆహారం తీసుకుంటూ బరువును అదుపులో ఉంచుకునే వారు బయట తయారుచేసే ఫుల్లీ షుగర్ లోడెడ్ ఐస్‌క్రీమ్స్‌ని తినడం వల్ల మొదటికే మోసం వస్తుంది. మరి, అలా జరగకుండా ఉండాలంటే ఐస్‌క్రీమ్ మానేయాలా.. అంటారా? ఏం అక్కర్లేదు. చక్కెర వాడకుండా ఇంట్లోనే తయారుచేసే షుగర్ ఫ్రీ ఐస్‌క్రీమ్‌ను తీసుకుంటే అటు ఐస్‌క్రీమ్ తినాలన్న కోరికా తీరుతుంది.. ఇటు బరువు పెరుగుతామన్న భయమూ ఉండదు.. అలాంటి ఓ షుగర్ ఫ్రీ ఐస్‌క్రీమ్ రెసిపీనే ఇది..!

Know More

women icon@teamvasundhara
drink-these-cool-lassies-in-this-hot-summer
women icon@teamvasundhara
steps-to-prepare-mamidi-laddu
women icon@teamvasundhara
tasty-recipes-for-mothers-day-2020

అమ్మ కోసం కమ్మని కేక్స్‌ చేసేద్దాం..!

ప్రేమ, అనురాగం, ఆప్యాయత, త్యాగం.. ఇలా ఎన్నో సద్గుణాల కలబోత అమ్మ. అలాంటి అమ్మ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేమన్నది అక్షర సత్యం. అయితే ఏటా మే రెండో ఆదివారాన్ని ‘మాతృ దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. బోలెడన్ని కానుకలిస్తూ, ప్రేమ పంచుతూ అమ్మకు మనసారా కృతజ్ఞత చెప్పుకుంటున్నాం. అలాంటి సందర్భం ఈ ఏడాది కూడా రానే వచ్చింది. ఈ క్రమంలో ఈ ప్రత్యేకమైన రోజున కమ్మని వంటకాలతో అమ్మ నోరు తీపి చేయడం పరిపాటే. అయితే కరోనా కాచుక్కూర్చున్న ఈ ప్రతికూల పరిస్థితుల్లో బయటికెళ్లలేం. మరి, అమ్మతో కేక్‌ కట్‌ చేయించడమెలా అని ఆలోచిస్తున్నారా? ఇంట్లో దొరికే వస్తువులతోనే ఎంతో ఈజీగా కేక్‌ తయారుచేస్తే సరి.. అలాంటి కొన్ని రెసిపీలు ఈ ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా మీకోసం..

Know More

women icon@teamvasundhara
rakul-bakes-banana-chocolate-cookies-and-shares-the-recipe

భ్రమరాంబ ‘బనానా కుకీస్‌’ చేసింది..!

ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించే నటీమణుల జాబితాలో ముందు వరుసలో ఉంటుంది స్మైలింగ్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. వ్యాయామాలు, యోగాసనాలు, ఆరోగ్యకరమైన రెసిపీలు.. తదితర విషయాల్లో రకుల్‌కు మంచి అవగాహన కూడా ఉంది. అందుకే ఈ విషయాలకు సంబంధించి తనకు తెలిసిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా పంచుకొంటుంటుందీ అమ్మడు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా గత కొన్ని రోజులుగా రకుల్‌ ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తన ఫిట్‌నెస్‌పై మరింత శ్రద్ధ పెట్టడం, కుటుంబ సభ్యులతో గడపడంతో పాటు.. పలు ఆరోగ్యకరమైన రెసిపీలను కూడా తయారుచేస్తూ సోషల్‌ మీడియా వేదికగా అందరితో పంచుకుంటుంది. ఈ క్రమంలో రకుల్‌ ఇటీవలే షేర్‌ చేసిన రెసిపీ ఏంటో మీరే చూడండి.

Know More

women icon@teamvasundhara
senior-actress-neena-gupta-introduces-new-breakfast-recipe

బ్రేక్‌ఫాస్ట్‌కి ఈ ‘ఆలూ బ్రెడ్‌ రోల్స్‌’ ట్రై చేద్దామా?

లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కువ శాతం మంది ఇళ్లకే పరిమితమయ్యారు. సాధారణ రోజుల్లో హోటళ్లు, రెస్టరంట్‌ల చుట్టూ తిరుగుతూ నచ్చినవి తినేవారు ఇప్పుడు ఇంటి భోజనాన్నే అలవాటు చేసుకుంటున్నారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ దగ్గర్నుంచి రాత్రి డిన్నర్‌ వరకు ప్రతి ఒక్కటి తమకు నచ్చినవి.. అందులోనూ వెరైటీ వంటకాల్ని ప్రయత్నిస్తూ విభిన్న రుచుల్ని ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది తారలు సైతం వంటింట్లో వెరైటీ వంటకాలు చేస్తూ ఆ రెసిపీస్‌ని అందరితో పంచుకుంటున్నారు తాజాగా ప్రముఖ బాలీవుడ్‌ నటి నీనా గుప్తా కూడా సోషల్‌ మీడియా వేదికగా ఓ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్‌ను మనందరికీ పరిచయం చేసింది. ఇంతకీ ఏంటా బ్రేక్‌ఫాస్ట్‌? దాన్నెలా తయారుచేయాలో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
royal-chefs-prepares-choclate-cup-cake-on-elizabeths-birthday-shares-recipe

రాణీ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలతో...!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారితో పోరాడే క్రమంలో ప్రజలు సామాజిక దూరం, స్వీయ నిర్బంధం పాటిస్తూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ సమయంలో జరుపుకోవాల్సిన వివాహాలు, పెళ్లిరోజులు, శుభకార్యాలు, పుట్టినరోజు వేడుకలు, ప్రత్యేక సందర్భాలు.. మొదలైన కార్యక్రమాలను అయితే తూతూ మంత్రంగా జరుపుకోవడం లేదా వాయిదా వేయడం చేస్తున్నారు. సామాన్యులకు మాత్రమే కాదు ప్రముఖులకూ ఈ ఇబ్బందులు తప్పట్లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ఇంగ్లండ్‌ రాణి ఎలిజబెత్‌-2 తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకోవడం గమనార్హం. ఈ క్రమంలో రాణీ వారికి సంబంధించిన అధికారిక వ్యవహారాలు చూసుకునే ‘ది రాయల్‌ ఫ్యామిలీ’ బృందం ఆమె కోసం ఓ రుచికరమైన రెసిపీని తయారు చేసింది. అంతేకాదు, ఈ స్పెషల్‌ రాయల్‌ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో రాయల్‌ ఫ్యామిలీ బృందం సోషల్‌ మీడియా ద్వారా వివరంగా పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
the-quarantine-cooking-skills-of-celebrities

women icon@teamvasundhara
health-benefits-of-sri-rama-navami-naivedyams

నవమి నైవేద్యంతో మేలైన ఆరోగ్యం!

'శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం.. సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం.. ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం.. రామం.. నిశాచర వినాశకరం నమామి..' కోరిన కోర్కెలు తీర్చే కోదండరాముడి పుట్టినరోజునే మనం 'శ్రీరామనవమి'గా జరుపుకొంటాం. ఈ రోజున ఎక్కడ చూసినా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా శ్రీరాముడికి ప్రీతిపాత్రమైన బెల్లం పానకం, వడపప్పు, చలిమిడి.. నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత ఈ పదార్థాల్ని అందరికీ ప్రసాదంగా పంచిపెడతారు. ఈ క్రమంలో వీటి తయారీ విధానం, వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
alia-prepares-sabji-recipe-for-the-first-time
women icon@teamvasundhara
5-traditional-yet-delicious-sankranthi-recipes-that-one-shouldnt-miss

నోరూరించే ఈ సంక్రాంతి వంటకాలు రుచి చూసేద్దామా..!

‘సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా.. సరదాలు తెచ్చిందే తుమ్మెదా..’ అంటూ తెలుగు ప్రజలంతా సరదాగా ఆడుతూ పాడుతూ చేసుకునే అతి ముఖ్యమైన పండగే మకర సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమ.. ఇలా ముచ్చటగా మూడు రోజులపాటు జరుపుకునే ఈ పండగలో భాగంగా రంగురంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బిళ్లు, కోడిపందాలు.. వంటి ఎన్నో ప్రత్యేకతలుంటాయి. అంతేనా.. పండగొచ్చిందంటే చాలు.. ప్రత్యేకమైన పిండి వంటలతో తెలుగు లోగిళ్లన్నీ ఘుమఘుమలాడతాయి. కొత్త పంట చేతికొచ్చే ఈ ఆనందంలో వివిధ రకాల ప్రత్యేక వంటకాల్ని చేసుకొని ఇంటిల్లిపాదీ ఆస్వాదిస్తుంటారు. మరి, ఈ సంక్రాంతి సందర్భంగా పండగ ఆనందాన్ని రెట్టించే, అతిథులకు నోరూరించే అలాంటి కొన్ని స్పెషల్‌ రెసిపీస్‌ మీకోసం..

Know More

women icon@teamvasundhara
try-these-hot-soups-in-winter

చలికాలంలో ఈ సూప్స్‌తో వెచ్చవెచ్చగా!

ఏ కాలంలోనైనా అది తినాలి ఇది కావాలి అనిపిస్తుంది కానీ చలికాలంలో మాత్రం ఏం తిన్నా వేడివేడిగా తినాలనిపిస్తుంది. ఈ క్రమంలో రెండు ముద్దలు ఎక్కువే తినేస్తుంటారు చాలామంది. మరి ఓ వైపు చలి చంపేస్తుంటే ఇక వ్యాయామం సంగతి పట్టించుకునే వారు ఎంతమంది ఉంటారు చెప్పండి. దాని సంగతి దేవుడెరుగు అనుకునేవారు ఎంతమందో! ఇలా రెండుమూడు ముద్దలు ఎక్కువ తినడం, అటు వ్యాయామమూ చేయకపోవడం వల్ల చలికాలం పూర్తయ్యేసరికి బరువు పెరిగేస్తుంటారు చాలామంది. అందుకే అటు వేడివేడిగా కడుపు నిండుగా, ఇటు మీ ఫిట్‌నెస్‌ని కూడా కోల్పోకుండా ఉండాలంటే ఈ చలికాలంలో సూప్స్‌ ట్రై చేయడం బెటర్‌. మరి అలా నోరూరిస్తూ చలిని దూరం చేసే ఈ సూప్స్‌ని ఒకసారి మీరూ ట్రై చేసి రుచి చూడండి!

Know More

women icon@teamvasundhara
5-delicious-cake-recipes-for-christmas

ఈ కేక్స్‌తో ‘క్రిస్మస్‌’ ఎంతో స్పెషల్‌ !

ప్రపంచమంతా సంవత్సరం పొడవునా ఎదురుచూసే క్రిస్మస్‌ పండగ వచ్చేసింది.. మరి ఈ కలర్‌ఫుల్‌ ఫెస్టివల్‌ను జరుపుకోవడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారా?? క్రిస్మస్‌ అనగానే గుర్తొచ్చేది అందమైన క్రిస్మస్‌ ట్రీ, క్రిస్మస్‌ గిఫ్ట్స్‌, నోరూరించే స్పెషల్‌ వంటకాలు.. ఇలా ఇంకెన్నో..! వంటకాలంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది క్రిస్మస్‌ కేక్స్‌ గురించి! చిన్నపిల్లల దగ్గరినుంచీ పెద్దల వరకూ ఎంతో ఇష్టంగా తినే కేక్స్‌ను ఎంతో ప్రత్యేకంగా తయారుచేస్తారు. మరి మీరు ఈసారి ఎలాంటి కేక్స్‌ తయారుచేయబోతున్నారు?? ఎప్పుడూ రొటీన్‌గా చేసుకునేవి కాకుండా, ఈసారి ఈ కొత్త రకం కేకులు ట్రై చేసి చూడండి.. మరి అవేంటో.. ఎలా తయారుచేయాలో చూసేద్దాం రండి..!

Know More

women icon@teamvasundhara
delicious-recipes-with-custard-apple
women icon@teamvasundhara
try-out-this-tasty-zucchini-fries-this-winter-in-telugu
women icon@teamvasundhara
world-egg-day-2019-special-recipe-egg-boats-with-french-baguette
women icon@teamvasundhara
curd-rice-with-cauliflower-a-healthy-recipe-by-upasana
women icon@teamvasundhara
tasty-chips-recipes-in-telugu

¨ *XýqE ¹ª½-¹-ª½-©Ç-œË¢-Íä-§ŒÕ¢œË..!

„ïÃ-Âé¢.. ²Ä§ŒÕ¢-“ÅÃ©Õ Æ©Ç „ÃÊ X¾œ¿Õ-Ōբ˜ä Âê½¢-ÂÃ-ª½¢’à \Ÿçj¯Ã A¯Ã-©-E-XÏ¢-ÍŒœ¿¢ ®¾£¾Ç•¢. Âí¢ÅŒ-«Õ¢C ƒ¢šðx¯ä X¾Âî-œÎ©ð, ®¾„çÖ-²Ä©ð Í䮾Õ-¹ע˜ä.. «ÕJ-Âí¢-Ÿ¿ª½Õ “X¾A-²ÄK \¢ Íä²Äh¢©ä Æ¢{Ö ¦§ŒÕ{ ÊÕ¢* *Xýq ÅçÍŒÕa-¹ע-{Õ¢-šÇª½Õ. Æ¢Ÿ¿Õ-©ðÊÖ ƒ©Ç¢šË *Xýq Æ¢˜ä XÏ©x-©Â¹× ÍÃ©Ç ƒ†¾d¢ ¹؜ÄÊÖ..! «ÕJ ‡X¾Ûpœ¿Ö ¦¢’Ã-@Ç-Ÿ¿Õ¢-X¾-Åî¯ä ÂùעœÄ.. NNŸµ¿ ª½ÂÃ-©Õ’Ã.. Âî¾h ‚ªî-’¹u-¹-ª½¢’à *Xýq ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®¾Õ-Âî-«-œ¿-„çÕ-©Ç’î Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..„ïÃ-Âé¢.. ²Ä§ŒÕ¢-“ÅÃ©Õ Æ©Ç „ÃÊ X¾œ¿Õ-Ōբ˜ä Âê½¢-ÂÃ-ª½¢’à \Ÿçj¯Ã A¯Ã-©-E-XÏ¢-ÍŒœ¿¢ ®¾£¾Ç•¢. Âí¢ÅŒ-«Õ¢C ƒ¢šðx¯ä X¾Âî-œÎ©ð, ®¾„çÖ-²Ä©ð Í䮾Õ-¹ע˜ä.. «ÕJ-Âí¢-Ÿ¿ª½Õ “X¾A-²ÄK \¢ Íä²Äh¢©ä Æ¢{Ö ¦§ŒÕ{ ÊÕ¢* *Xýq ÅçÍŒÕa-¹ע-{Õ¢-šÇª½Õ. Æ¢Ÿ¿Õ-©ðÊÖ ƒ©Ç¢šË *Xýq Æ¢˜ä XÏ©x-©Â¹× ÍÃ©Ç ƒ†¾d¢ ¹؜ÄÊÖ..! «ÕJ ‡X¾Ûpœ¿Ö ¦¢’Ã-@Ç-Ÿ¿Õ¢-X¾-Åî¯ä ÂùעœÄ.. NNŸµ¿ ª½ÂÃ-©Õ’Ã.. Âî¾h ‚ªî-’¹u-¹-ª½¢’à *Xýq ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®¾Õ-Âî-«-œ¿-„çÕ-©Ç’î Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon@teamvasundhara
homemade-healthy-juices-to-beat-the-summer-heat
women icon@teamvasundhara
yummy-ice-cream-for-diabetes
women icon@teamvasundhara
take-this-drink-to-beat-the-summer-heat
women icon@teamvasundhara
cake-pops-recipe
women icon@teamvasundhara
health-benefits-of-sri-rama-navami-naivedyams
women icon@teamvasundhara
try-these-special-idly-recipes-on-world-idly-day
women icon@teamvasundhara
colorful-recipes-for-colorful-holi
women icon@teamvasundhara
fasting-food-for-shivaratri-
women icon@teamvasundhara
know-how-to-prepare-tandoori-chai-at-home
women icon@teamvasundhara
amritsari-papad-paneer-making-in-telugu
women icon@teamvasundhara
aalu-pickle
women icon@teamvasundhara
sankranthi-special-sweets-for-you
women icon@teamvasundhara
chinese-chicken-corn-soup
women icon@teamvasundhara
celebrate-this-christmas-with-these-recipes
women icon@teamvasundhara
preparation-of-brazilian-custard
women icon@teamvasundhara
punjabi-dum-aloo
women icon@teamvasundhara
try-these-diabetes-friendly-breakfast-recipes
women icon@teamvasundhara
the-tasty-snack-jaipuri-pyaaz-ki-kachori-recipe-is-here
women icon@teamvasundhara
try-this-tasty-kaju-butter-masala-recipe
women icon@teamvasundhara
tasty-chicken-recipes-in-telugu
women icon@teamvasundhara
how-to-make-bath-cake
women icon@teamvasundhara
sravanamasam-recipes