నోరూరించే ఈ సంక్రాంతి వంటకాలు రుచి చూసేద్దామా..!
‘సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా.. సరదాలు తెచ్చిందే తుమ్మెదా..’ అంటూ తెలుగు ప్రజలంతా సరదాగా ఆడుతూ పాడుతూ చేసుకునే అతి ముఖ్యమైన పండగే మకర సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమ.. ఇలా ముచ్చటగా మూడు రోజులపాటు జరుపుకునే ఈ పండగలో భాగంగా రంగురంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బిళ్లు, కోడిపందాలు.. వంటి ఎన్నో ప్రత్యేకతలుంటాయి. అంతేనా.. పండగొచ్చిందంటే చాలు.. ప్రత్యేకమైన పిండి వంటలతో తెలుగు లోగిళ్లన్నీ ఘుమఘుమలాడతాయి. కొత్త పంట చేతికొచ్చే ఈ ఆనందంలో వివిధ రకాల ప్రత్యేక వంటకాల్ని చేసుకొని ఇంటిల్లిపాదీ ఆస్వాదిస్తుంటారు. మరి, ఈ సంక్రాంతి సందర్భంగా పండగ ఆనందాన్ని రెట్టించే, అతిథులకు నోరూరించే అలాంటి కొన్ని స్పెషల్ రెసిపీస్ మీకోసం..