చిన్నారులకూ హాయినిచ్చే మసాజ్..!
మసాజ్ చేయించుకోవడమంటే ఎవరికిష్టముండదు చెప్పండి.. ఎందుకంటే దీనివల్ల మనసుకు, శరీరానికి చాలా ప్రశాంతంగా, రిలాక్స్డ్గా అనిపిస్తుంది. పిల్లల విషయంలోనూ అంతే.. మసాజ్‌లో ఉండే జెంటిల్, రిథమిక్, సూతింగ్ స్ట్రోక్స్ వల్ల శరీరంలో హార్మోన్లు ఉత్తేజితమవుతాయి. పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడానికి మసాజ్ చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు.. పాపాయి రిలాక్స్ కావడానికి, తల్లులకు పిల్లలకు మధ్య ఉండే బంధం మరింత బలపడటానికి కూడా ఈ ప్రక్రియ మరింత ఉపయోగపడుతుంది. ఏంటీ.. మసాజ్‌కి ఇంత చరిత్ర ఉందా అనుకుంటున్నారా? అవును మరి.. ఇంతకీ పిల్లలకు అసలు మసాజ్ ఎలా చేయాలి? ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? తెలుసుకుందాం రండి..