కాయగూరలు, పండ్లను ఇలా ఈజీగా శానిటైజ్ చేద్దాం..!
ప్రస్తుత కరోనా ప్రతికూల పరిస్థితుల్లో బయటి నుంచి ఏది కొని ఇంటికి తెచ్చినా భయమే! ఎందుకంటే ఆ వస్తువుతో వైరస్ ఎక్కడ మన ఇంట్లోకి ప్రవేశిస్తుందోనని! అందుకే ఇంటికి తెచ్చిన వస్తువునల్లా శానిటైజ్ చేయడం మనకు అలవాటైపోయింది. అయితే ఓవైపు ఇంటి పని, మరోవైపు ఆఫీస్ పని, ఇతర బాధ్యతలతో సతమతమైపోతున్న మనకు శానిటైజేషన్ అంటేనే విసుగొచ్చేస్తుంది.. ఇక రెండుమూడు రోజులకోసారి తెచ్చుకునే కాయగూరలు, పండ్లను శుభ్రం చేయలేక చాలామంది మహిళలకు తల ప్రాణం తోకకొస్తుందని చెప్పాలి. అయితే ఇకపై ఆ శ్రమ అక్కర్లేదు. ఎందుకంటే కాయగూరలు, పండ్లను నిమిషాల్లో శానిటైజ్ చేసే గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చేశాయి. అందుబాటు ధరల్లో లభించే వాటిని ఒకసారి కొని ఇంటికి తెచ్చుకున్నామంటే వంటింట్లో పని మరింత సులువవుతుంది. మరి, కాయగూరలు-పండ్లను శుభ్రం చేసే ఆ గ్యాడ్జెట్సేంటో మనమూ తెలుసుకుందాం రండి...