అందాల తార కాజోల్ కారులోంచి చెయ్యి చూపుతున్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా- ‘ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఐదు సూత్రాలను పాటించాలి.. అవేంటంటే..
1. చేతులు కారు లోపల పెట్టండి..
2. విండోస్ మూయండి
3. ఇప్పుడు కారుని నడపండి.
4. అలా ఇంటికి వెళ్లండి.
5. ఇక బయటకు రాకండి’ అంటూ ‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవ’ శుభాకాంక్షలు తెలిపింది. ఇలా బయట తిరక్కుండా ఇంటి పట్టునే ఉంటూ కరోనా జాగ్రత్తలు తప్పకుండా పాటించాలనే విషయాన్ని చెప్పకనే చెప్పింది ఈ ముద్దుగుమ్మ.
బాలీవుడ్ నటి దిశా పటానీ ప్రముఖ నటుడు జాకీచాన్‌తో దిగిన ఫొటోని పోస్ట్ చేస్తూ అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
మెగా డాటర్ నిహారిక కొణిదెల గులాబీ దుస్తులు ధరించిన తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
అందాల తార శిల్పా శెట్టి ‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా అందరూ మాస్క్ ధరించి కరోనాకి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి అంటూ ఓ వీడియోని పోస్ట్ చేసింది.
నటి నైనా గంగూలీ డంబెల్‌ని పట్టుకున్న ఫొటోని పోస్ట్ చేస్తూ ‘అందరూ ఫిట్‌గా ఉండండి’ అని చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ బ్యూటీ అనుష్కా శర్మ తన భర్త విరాట్ కోహ్లిని పైకి లేపడానికి ప్రయత్నించిన ఓ వీడియోని పోస్ట్ చేసింది. దీనికి ‘నేను చేశానా?’ అని అభిమానులను అడిగింది.
నటి అమైరా దస్తూర్ నవ్వుతోన్న తన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘హాస్యానికి కాలం ఉండదు. ఊహకు వయసు ఉండదు. కలలకు అంతముండదు’ అంటూ తన తాజా ఫొటోని పోస్ట్ చేసింది.
అందాల తార మాధురీ దీక్షిత్ ‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా వ్యాయామం చేస్తున్న వీడియోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ప్రతిజ్ఞ చేద్దాం’ అని చెప్పుకొచ్చింది.
అందాల తార లక్ష్మీ రాయ్ తన తాజా ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘జీవితంలో ఎప్పుడూ ఓటమి ఉండదు. అయితే విజయం లేదా నేర్చుకోవడం ఉంటుంది’ అని రాసుకొచ్చింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిని చూసేద్దామా...