scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'అత్తారింటి వేధింపులను ఎదిరించా... జీవితంలో గెలిచా..!'

'విజయవాడకి చెందిన ఒక అమ్మాయికి పద్దెనిమిదేళ్ల వయసులోనే తల్లిదండ్రులు పెళ్లి చేసేశారు. ఆ తర్వాత కోటి ఆశలతో అత్తారింట అడుగుపెట్టిన ఆమెకి అక్కడ గృహహింస, అదనపు వరకట్న వేధింపులు ఆహ్వానం పలికాయి.. క్రమంగా అత్తింటి వారి ఆగడాలు పెచ్చుమీరడంతో అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. బతుకుతెరువు కోసం తనకి వచ్చిన కుట్లు, అల్లికలతో చిన్న షాపు మొదలుపెట్టింది. ప్రస్తుతం తానే సొంతంగా ఒక వ్యాపారాన్ని నిర్వహించే స్థాయికి చేరింది. ఇంతకీ ఆమె ఎవరు.. ఏం జరిగింది.. ఈ స్థాయికి ఎలా చేరింది.. మొదలైన వివరాలన్నీ తెలియాలంటే ఇది చదవాల్సిందే..'

Know More

Movie Masala

category logo

మనం ఎక్కడ ఉంటే అక్కడే మ్యాజిక్!

Latest posts of celebrities in Instagram

ఒకప్పుడు మహిళలంటే కేవలం వంటింటికే పరిమితం అన్నట్టుగా ఉండేది. కానీ కొందరు మహిళలు కాలక్రమేణా తమ చుట్టూ ఉన్న ఆంక్షల చట్రాల నుండి బయటకు వస్తున్నారు. తమదైన ప్రతిభతో, సమర్థతతో ముందుకు దూసుకుపోతున్నారు. అయినా చాలామంది మహిళలు ఇంకా కట్టుబాట్ల బందిఖానాలో చిక్కుకుపోతూనే ఉన్నారు. అందుకోసమే మహిళలను చైతన్యపరచడానికి వారికంటూ ఓ రోజుని జరుపుకొంటున్నారు. అదే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’. ఈ రోజు మహిళలకు ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి ఏడాది ఒక్కో థీమ్‌తో ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సారి #ChooseToChallenge అంటూ సవాల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు తారలు ఇన్‌స్టాపురములో ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.
సొట్ట బుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠి #ChooseToChallenge అంటూ తన ఫొటోని పోస్ట్‌ చేసింది. దీనికి ‘ ‘నేను చేయలేను’ అనేది ఏదీ ఉండదు. పెట్టుకున్న లక్ష్యంపై స్పష్టత ఉండి, పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం సాధించగలుగుతారు. అలాగే సమయం వచ్చినప్పుడు మీకు ఏం కావాలి అనే దానిపై స్పష్టత వస్తుంది. ‘నేను చేయగలను’ అన్న సానుకూల దృక్పథాన్ని అలవాటు చేసుకోండి. ప్రయత్నించడాన్ని ఎప్పుడూ ఆపకండి. అలాగే నేర్చుకోవడాన్ని కొనసాగించండి. దానిని మీ నుండి ఎవరూ దూరం చేయలేరు. నేను మార్పు కోసం ఛాలెంజ్‌ చేస్తున్నాను. మీరూ మార్పు కోసం సిద్ధంగా ఉన్నారా?’ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Lavanya T (@itsmelavanya)

బాలీవుడ్‌ అందాల తార బిపాసా బసు ‘ఎక్కడ మహిళ ఉంటుందో అక్కడ మ్యాజిక్‌ ఉంటుంది’ అంటూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. టాలీవుడ్‌ భామ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా ఇదే వ్యాఖ్యని పోస్ట్‌ చేసి శుభాకాంక్షలు తెలియజేసింది.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

అందాల తార రోజా అద్భుతమైన మహిళలకు ‘మహిళా దినోత్సవ’ శుభాకాంక్షలు అని తన ఫొటోని పోస్ట్‌ చేసింది.

టాలీవుడ్ నటి సిమ్రత్ కౌర్ తన తాజా ఫొటోను పోస్ట్ చేస్తూ- ‘ఈ సృష్టిలో ఉన్న మంచి అంశాలన్నింటికీ మనమంతా అర్హులమే.. మనం చేయలేనిది ఏదీ లేదు. మనమంతా బలవంతులమే.. మనమే ఒక మ్యాజిక్. మనందరం సూపర్ విమెన్ మే’ అని రాసుకొచ్చింది.

తెలుగు తార అంజలి మహిళా దినోత్సవ సందర్భంగా ‘వకీల్‌ సాబ్‌’ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్‌ని అభిమానులతో పంచుకుంది. ఈ పోస్టర్‌లో హీరో పవన్‌ కళ్యాణ్‌ వెనక ముగ్గురు మహిళలు నిల్చొని ఉన్నారు. దీనికి ‘ప్రపంచంలోని అతివలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’ అనే వ్యాఖ్యని జోడించింది.

View this post on Instagram

A post shared by Anjali (@yours_anjali)

అందాల తార లక్ష్మీ రాయ్ తన తాజా ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘అమేజింగ్‌ వనితలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. దేనినైనా సాధించగల సత్తా మనలో ఉంది. అందుకే మన విజయాలను ప్రపంచం సెలబ్రేట్ చేస్తోంది’ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

తెలుగు తార నందినీ రాయ్‌ ‘మీకు మీరుగా ఉండండి.. మీకేం కావాలో అది చేయండి.. ఇతరులు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో అని చింతించకండి’ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Nandini Rai (@nandini.rai)

బాలీవుడ్ నటి మల్లికా శెరావత్‌ తన ఫొటోని పోస్ట్‌ చేస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ‘మహిళలుగా మనం సాధించగలిగిన వాటికి పరిమితులు లేవు’ అంటూ మిషెల్ ఒబామా రాసిన వ్యాఖ్యని జత చేసింది. https://www.instagram.com/p/CMJbSsxJ4ZP/
నటి సుహాసిని ‘హ్యాపీ డే’ అంటూ ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘మహిళలందరూ పని చేసేవారే. కానీ, కొంతమంది మాత్రమే జీతం తీసుకుంటున్నారు’ అని రాసి ఉంది.

బాలీవుడ్‌ నటి మాధురీ దీక్షిత్‌ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కొన్ని ఫొటోలను పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘నా ప్రయాణంలో భాగమైన, నాకు స్ఫూర్తినిచ్చిన మహిళలందరికీ ధన్యవాదాలు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ ‘నేను నటించిన చిత్రాల్లో ఏ బలమైన మహిళ పాత్ర మీకు బాగా నచ్చింది’ అని అభిమానులను అడిగింది.

women icon@teamvasundhara
latest-posts-celebrities-in-instagram

ఆక్సిజన్‌ అవసరమైతే ఇలా చేద్దాం..!

అందాల తార సోఫీ చౌదరి ఆక్సిజన్‌ లెవెల్స్‌ పెంచుకోవడం కోసం చేసే ప్రోనింగ్‌కి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘కరోనా కేసులు మునపటి కంటే అధికంగా నమోదవుతున్నాయి.. ఆక్సిజన్‌ కొరత వేధిస్తోంది.. ఈ సమయంలో ఇంటి దగ్గరే ఆక్సిజన్‌ స్థాయులను పెంచుకోవడానికి ప్రోనింగ్‌ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పద్ధతికి వైద్యపరమైన ఆమోదం కూడా ఉంది. అయితే గర్భిణులు, వెన్నునొప్పి, కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలున్నవారు ఈ పద్ధతిని అనుసరించకూడదు. దీనిని పాటించే ముందు డాక్టరుని ఓసారి సంప్రదించండి. కానీ, ఇది చాలామందిని హాస్పిటల్‌కు వెళ్లకుండా నివారిస్తుంది’ అని చెప్పుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

celebrities-holi-celebrations
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

సంతోషాన్ని పంచుకోండి.. కరోనాని కాదు..!

నటి, నిర్మాత మంచు లక్ష్మి ‘వండర్ విమెన్’ అంటూ స్ఫూర్తిమంతమైన మహిళల గాథలను తన అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా డిజైనర్‌ అనితా సాగర్‌ గురించి పోస్ట్ చేసింది. ‘గత మూడు వారాల నుంచి మీకు స్ఫూర్తిమంతమైన మహిళల గురించి తెలియజేస్తున్నాను. తాజాగా ప్రముఖ డిజైనర్‌ సాగర్‌ తెనాలి భార్య, అనితా సాగర్‌ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. హైదరాబాద్‌లో సాగర్‌ తెనాలి అనే ప్రముఖ డిజైనర్‌ ఉండేవారు. ఆయన 2016లో గుండెపోటుతో మరణించారు. ఆయన మంచి ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలని, అంతర్జాతీయ వేదికలపై తన దుస్తులు ప్రదర్శించాలని కలలు కన్నారు. ఆయన కలలను తన భార్య అనితా సాగర్‌ నిజం చేయాలనుకుంది. దానిని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ఫ్యాషన్‌ డిజైనింగ్‌ నేర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ తల్లిదండ్రులు, అత్తమామల సహకారంతో తన సంకల్పాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తోంది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అవును.. దానికి నా దగ్గర సాక్ష్యం ఉంది!

బాలీవుడ్‌ నటి, నిర్మాత ట్వింకిల్‌ ఖన్నా తన పాపను ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్న ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘మనం కేవలం మన పిల్లల బాగోగులు చూసుకోవడం వరకు మాత్రమే పరిమితం కావద్దు. విభిన్న ఐడియాలతో వారి మెదళ్లను నింపాలి. అలాగే వారి బలాలను గుర్తిస్తూనే బలహీనతలను మర్చిపోయేలా చేయాలి. అంతేకానీ, బలహీనతలను ఎత్తి చూపద్దు. అలాగే మన పిల్లలు ఎదుర్కొనే సమస్యలను గుర్తించి, వాటినుండి బయటకు తీసుకురావడానికి వారికి తగిన సమయం కేటాయించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇవన్నీ తప్పకుండా పాటిస్తే కొంత కాలానికి మనకి మనంగా ఉంటూనే మన పిల్లలకు తల్లిలాగా ఉండగలుగుతాం’ అంటూ #perfectlyimperfectparenting అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించింది.