ప్రముఖ యాంకర్ సుమ కనకాల స్కూల్ యూనిఫాం ధరించిన ఒక ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా- ‘వావ్.. ఈ ఫొటో ఎన్నో మధురమైన జ్ఞాపకాలను గుర్తుకు తెస్తోంది. ఆ అందమైన రోజులను నేను ఎప్పుడూ గుర్తు చేసుకుంటాను. సినిమా ఆధారిత టీవీ కార్యక్రమాలు అప్పుడప్పుడే మొదలవుతున్నాయి. అలాంటి పాత్రలను పోషించడం ఎంతో సరదాగా ఉండేది. ఈ ఫొటో అలాంటి కార్యక్రమానికి సంబంధించినదే' అని చెప్పుకొచ్చింది.
టాలీవుడ్ నటి రాశీఖన్నా తన తాజా ఫొటోని పోస్ట్ చేస్తూ ‘కొన్నిసార్లు కాలంలో వెనక్కి వెళ్లాలనిపిస్తుంది. గతాన్ని మార్చడానికి కాదు.. కొన్ని క్షణాలను మరోసారి ఆస్వాదించడానికి. ఈ అందమైన రోజు లాగే’ అని రాసుకొచ్చింది.
మిల్కీ బ్యూటీ తమన్నా తన స్నేహితురాలి వివాహానికి హాజరైంది. ఈ సందర్భంగా దిగిన కొన్ని ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది.
నటి శ్రీదేవి చీరలో దిగిన తన అందమైన ఫొటోలను పోస్ట్ చేస్తూ ‘మనం ఎంత అద్భుతంగా మలుచుకుంటే జీవితం అంత అద్భుతంగా ఉంటుంది’ అనే అర్థం వచ్చే వ్యాఖ్యని జోడించింది.
బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ గౌరవ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా తన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది.
క్యారక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి జిమ్లో దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది. దీనికి ‘విజయం అనేది మనం రోజూ చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడప్పుడూ చేసే వాటి మీద కాదు’ అనే వ్యాఖ్యని జోడించింది.
‘జబర్దస్త్’ యాంకర్ అనసూయ ‘సుప్రభాతం.. కొచ్చి’ అంటూ కేరళలోని కొచ్చిలో ఉన్న తన తాజా ఫొటోని పోస్ట్ చేసింది. 'కొత్త రోజు..కొత్త ప్రారంభం..’ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది.
అందాల భామ మాళవిక శర్మ ‘మీకు నచ్చిన పని చేయండి’ అంటూ తన తాజా ఫొటోని పోస్ట్ చేసింది.
బాలీవుడ్ సుందరి మల్లికా శెరావత్ ‘సమ్మర్ వైబ్స్’ అంటూ తన తాజా ఫొటోని పోస్ట్ చేసింది.
టాలీవుడ్ నటి అను ఇమ్మాన్యుయెల్- 'కాఫీతో బద్ధకం, మూడీనెస్ పరార్' అంటూ కాఫీ తాగుతున్న ఫొటోను పోస్ట్ చేసింది.
టాలీవుడ్ అందాల భామ శ్రియ - తన భర్త తనని ఎత్తుకొన్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. వీటికి- 'నన్నెత్తుకో బేబీ' అనే హ్యాష్ ట్యాగ్ జోడించింది.
అందాల తార మీనా- 'డిఫరెంట్ మూడ్స్' అంటూ నవ్వుతున్న ఫొటోలను పంచుకుంది.
సొట్టబుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠి తన ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా- ‘మిమ్మల్ని మీరు నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు’ అని అడుగుతోంది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై మీరూ ఓ లుక్కేయండి...