టాలీవుడ్ నటి రేణూ దేశాయ్ తన కూతురు ఆద్య నవ్వుతోన్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘ఆద్య ఈ రోజు ఉదయం ‘మమ్మీ.. నా పుట్టినరోజుకు ఇంకా 22 రోజులు ఉంది’ అని చెప్పింది. మరో నెలలో బర్త్‌డే అనేసరికి ఆ ఆనందం ఈ క్యూటీ మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది’ అని రాసుకొచ్చింది.
టాలీవుడ్ నటి సమంత అక్కినేని తన అందమైన ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘స్వీయ ప్రేమను మించిన ప్రేమ లేదు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీకు సంతోషాన్ని కలిగించే పనులను ఎక్కువగా చేయండి. అలాగే ఆ మధుర జ్ఞాపకాలను పోస్ట్ చేస్తూ ‘మీ కోసం మీరు (యూ ఫర్ యూ) అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేసి నన్ను ట్యాగ్ చేయండి’ అని రాసుకొచ్చింది.
నటి, నిర్మాత మంచు లక్ష్మి షిర్డీ సాయిబాబాని దర్శించుకుంది. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ ఫిట్నెస్ ఫ్రీక్ రకుల్ ప్రీత్ సింగ్ తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా తండ్రితో దిగిన ఫొటోలను పోస్ట్ చేస్తూ ‘నేను ఎక్కడ నుంచి ప్రారంభించాలి? ఎక్కడ ముగించాలి? మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానో మాటల్లో చెప్పలేకపోతున్నాను. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ఎదిగాను. ఎన్నో రకాలుగా నన్ను ముందుండి నడిపించారు. మీరే నా సూపర్ హీరో. మిమ్మల్ని ఎల్లప్పుడూ గర్వపడేలా చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. 60వ జన్మదిన శుభాకాంక్షలు నాన్నా. నేను మీపై చూపించే ప్రేమకు అవధుల్లేవు’ అని రాసుకొచ్చింది.
నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం ‘లవ్ స్టోరీ’. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో గాయని మంగ్లీ ‘సారంగ దరియా’ అంటూ ఓ పాట పాడింది. అయితే ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్ ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో నిలిచింది. ఇదే విషయాన్ని స్క్రీన్‌షాట్ ద్వారా మంగ్లీ తన అభిమానులతో పంచుకుంది. మరి, మీరూ ఆ పాటను ఓసారి చూసేయండి...
అందాల భామ సిమ్రత్ కౌర్ ‘త్రో బ్యాక్’ అంటూ తన అందమైన ఫొటోని పోస్ట్ చేసింది.
బాలీవుడ్ సుందరి బిపాసా బసు సైక్లింగ్ చేస్తోన్న వీడియోని తన అభిమానులతో పంచుకుంది.
దక్షిణాది తార నమిత ‘బౌ వావ్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సందర్భంగా ఆ చిత్ర షూటింగ్ సందర్భంగా చేసిన కొన్ని స్టంట్స్‌కి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది. దీనికి ‘గొప్ప పని చేయడానికి కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది’ అని రాసుకొచ్చింది.
బాలీవుడ్ తార జాన్వీ కపూర్ ‘బ్యాక్ టు బ్లాక్’ అంటూ బ్లాక్ డ్రస్సులో దిగిన అందమైన ఫొటోలను పోస్ట్ చేసింది.
దక్షిణాది భామ నిత్యా మేనన్ తన స్నేహితులతో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
బాలీవుడ్ తార సారా అలీ ఖాన్ ‘కొత్త రోజు, కొత్త వారం, కొత్త నెల’ అంటూ తన అందమైన ఫొటోలను పోస్ట్ చేసింది.
అందాల తార శ్రియా శరణ్ జంతువులతో సరదాగా గడిపిన వీడియోలను పోస్ట్ చేసింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...