బాలీవుడ్ భామ కరీనా కపూర్ పండంటి బాబుకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ‘21-02-2021.. అబ్బాయి పుట్టాడు. టిమ్‌కి బుడ్డి తమ్ముడు వచ్చాడు’ అని రాసుకొచ్చింది.
అందాల తార నోరా ఫతేహి ‘పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్’గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు, మద్దతుదారులకు ధన్యవాదాలు తెలిపింది.
టాలీవుడ్ తార అనిత ఇటీవలే బాబుకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. బాబుకి ‘ఆరవ్’ అనే పేరు కూడా పెట్టారు. అయితే అనిత.. తన డెలివరీకి సంబంధించి ఓ ఫన్నీ వీడియోని పోస్ట్ చేసింది. ఈ వీడియోలో పొట్ట భాగంలో టపాసు పేలినట్టు.. ఆ తర్వాత ఆరవ్ బయటకు వచ్చినట్టు రూపొందించారు. మరి, మీరూ ఆ ఫన్నీ వీడియోని చూసేయండి.
నటి రేణూ దేశాయ్ తన పెట్స్‌తో దిగిన అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
బాలీవుడ్ నటి షమితా శెట్టి ‘మండే మోటివేషన్’ అంటూ కండరాలకు సంబంధించిన వ్యాయామాలు చేసిన వీడియోని పోస్ట్ చేసింది.
కన్నడ భామ ధన్యా బాలకృష్ణన్ తన తాజా అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
నటి నిషా అగర్వాల్ తన అందమైన ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘ఆత్మవిశ్వాసం అనేది ఓ అద్భుతమైన శక్తి. కాబట్టి, మిమ్మల్ని మీరు నమ్మడం మొదలుపెట్టండి.. మ్యాజిక్ మొదలవుతుంది’ అని రాసుకొచ్చింది.
టాలీవుడ్ నటి భానుశ్రీ ‘యాక్షన్’ అంటూ షూటింగ్లో భాగంగా ఫైట్ చేస్తోన్న వీడియోని పోస్ట్ చేసింది.
సొట్టబుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠి ‘ హాకీ నేపథ్యంలో తెరకెక్కిన ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ సినిమా పోస్టర్ని పోస్ట్ చేస్తూ మార్చి 5న థియేటర్లలో విడుదల కానుందని తెలిపింది.
నితిన్, రష్మిక జంటగా నటించిన ‘భీష్మ’ చిత్రం విడుదలై ఏడాదైంది. ఈ సందర్భంగా రష్మిక, నితిన్‌తో దిగిన ఓ ఫొటోని పోస్ట్ చేసింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...