జర్మన్ మోడల్ ఎవ్లీన్ శర్మ తన తాజా ఫొటోని పోస్ట్ చేస్తూ - 'మీరే మార్పవ్వాలి.. సమస్య కాదు.. మీరు వచ్చేటప్పటి కన్నా పోయేటప్పుడు ఈ భూమి మరింత మెరుగైన ప్రదేశంగా ఉండేలా చేయండి' అంటూ పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో- గో గ్రీన్, ప్లాంట్ బేస్డ్ అనే హ్యాష్ ట్యాగ్స్‌ని జోడించింది.
ప్రముఖ యాంకర్ సుమ కనకాల తన తాజా ఫొటోని పోస్ట్ చేస్తూ ‘సంతోషంగా ఉండడమే నా జీవన విధానం.. ఆ విషయంలో నన్ను నేనే ప్రేమించుకుంటాను కూడా.. మరి మీరు?’ అని రాసుకొచ్చింది.
టాలీవుడ్ నటి మంచు లక్ష్మి ‘పిట్టకథలు’ అనే వెబ్‌సిరీస్‌లో ‘స్వరూపక్క’గా నటించింది. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ‘స్వరూపక్క స్టైల్’ అంటూ కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
అందాల తార అమలాపాల్ ‘మీ జీవితమే ఈ ప్రపంచానికి ఒక సందేశం. అయితే అది స్ఫూర్తిదాయకంగా ఉండేలా చూసుకోండి’ అని చెప్పుకొచ్చింది.
తెలుగు తార తేజస్వీ మదివాడ ‘కమిట్మెంట్’ అంటూ తన తాజా అందమైన ఫొటోని పోస్ట్ చేసింది.
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ‘వెడ్నెస్ డే విజ్డం’ అంటూ ‘జీవితంలో ఒక ద్వారం మూసుకుపోతే.. మరోసారి అదే ద్వారాన్ని తీయడానికి ప్రయత్నించండి.. ఎందుకంటే అది ద్వారం.. అది అలానే పని చేస్తుంది’ అని అర్థం వచ్చే వ్యాఖ్యని ఫొటో రూపంలో పోస్ట్ చేశారు. అంతేకాదు.. ‘విజయం సాధించేవరకు ప్రయత్నించడం ఆపద్దు’ అని చెప్పుకొచ్చారు.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ షూటింగ్లో భాగంగా దిగిన ఓ ఫొటోని పోస్ట్ చేసింది.
నటి నమ్రత తన భర్త మహేష్ బాబు నటించిన ‘మురారి’ చిత్ర షూటింగ్లో దిగిన ఓ ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘మురారి సినిమా 20 వసంతాలను పూర్తి చేసుకుంది. మహేష్ నటించిన చిత్రాల్లో ఈ చిత్రమంటే నాకెంతో ఇష్టం. ఈ చిత్రం ఎప్పటికీ పాతబడదు. దీనిలోని హాస్యం, సంగీతం, మొదలైనవి ఎంతో ప్రత్యేకమైనవి. అవి ఇప్పటి చిత్రాల్లో కనిపించవు. సోనాలీ బింద్రేతో కుదిరిన ఆ కెమిస్ట్రీని ఎవరు మరిచిపోతారు చెప్పండి. ఈ చిత్రం క్లాసిక్ చిత్రాల్లో నిలిచిపోతుంది’ అని రాసుకొచ్చింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...