బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా రోజా పూల దగ్గర కూర్చున్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘ఈ రోజా పూల మధ్యన నువ్వు కూడా ఉండాలని కోరుకుంటున్నాను నిక్’ అని రాసుకొచ్చింది.
కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్ ‘వాలెంటైన్ హ్యాంగోవర్’ లో ఉన్నానంటూ ఓ ఫొటోని పోస్ట్ చేసింది.
ఎమ్మెల్యే, నటి రోజా ‘కోటి వృక్షార్చన’లో భాగంగా మొక్కలు నాటింది. ఈ సందర్భంగా తీసిన వీడియోని పోస్ట్ చేస్తూ ‘‘కోటి వృక్షార్చన’లో భాగంగా నా వంతు సహకారం అందించాను. ఈ కార్యక్రమం పచ్చదనం, పరిశుభ్రత, కాలుష్య రహితమైన తెలుగు రాష్ట్రాల కోసం ఉపయోగపడుతుంది’ అని చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ భామ షమితా శెట్టి శిల్ప కూతురితో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు కన్నా.. నువ్వు పుట్టి సంవత్సరం అయ్యిందంటే నమ్మబుద్ద్ధి కావడం లేదు. కాలం వేగంగా పరుగెడుతోంది.. ఈ దేవుడి ఆశీస్సులు నీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను’ అని రాసుకొచ్చింది.
గాయని సునీత ‘లవ్ ఈజ్ ఇన్ ది ఎయిర్.. హ్యాపీ వాలెంటైన్స్ డే’ అంటూ సముద్రపు ఒడ్డున దిగిన అందమైన తన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
సొట్టబుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠి ‘మంచి దృశ్యమైతే తప్ప వెనక్కి తిరిగి చూడకండి’ అంటూ తదేకంగా చూస్తున్న ఫొటోని పోస్ట్ చేసింది.
టాలీవుడ్ భామ సమంత తన భర్తతో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘చైతూ భర్తగా లభించినందుకు నేనెంతో అదృష్టవంతురాలిని. మేమిద్దరం దిగిన ఫొటోలు కావాలంటే క్రిస్మస్ వరకు ఆగాల్సిందే..’ అని రాసుకొచ్చింది.
అందాల తార నిక్కీ గల్రానీ మేకప్ లేకుండా దిగిన తన ఫొటోని పోస్ట్ చేసింది.
‘జెర్సీ’ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ గన్ని తన వైపే పెట్టుకొని నవ్వుతోన్న ఫొటోని పోస్ట్ చేసింది.
జర్మన్ మోడల్ ఎవ్లీన్ శర్మ ‘మండే మోటివేషన్’ అంటూ ‘ఏది ఎలా జరగాలో అది ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. మనం చేయాల్సిందల్లా ఆ ప్రక్రియను నమ్మడమే’ అని రాసుకొచ్చింది.
నటి కృతి కర్బంద ‘త్రోబ్యాక్’ అంటూ గతంలో దిగిన ఓ ఫొటోని పోస్ట్ చేసింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...