బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా అందమైన పూల చెట్టు దగ్గర దిగిన తన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘ప్రకృతికి ఎలాంటి ఫిల్టర్లు అవసరం లేదు.. దానికదే ఒక కూల్ ఫిల్టర్..!’ అని చెప్పుకొచ్చింది.
అందాల తార సమంత అక్కినేని తన తాజా ఫొటోని అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ నటి పాయల్ రాజ్‌పుత్ ఏదో ఆలోచిస్తున్నట్టుగా దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘ఆలోచనల ప్రవాహంలో నన్ను నేను మర్చిపోయాను’ అని రాసుకొచ్చింది.
బాలీవుడ్ తార మల్లికా శెరావత్ తెలుపు రంగు డ్రస్సులో దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది. దీనికి ‘నాకు ఇష్టమైన రంగుల్లో తెలుపు కూడా ఒకటి.. మరి మీకు?’ అని అభిమానులను అడిగింది.
కేరళ కుట్టి అమలా పాల్ తన అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘మనంతట మనం చెప్పకుండానే మనమెవరమో తెలిపేదే స్టైల్’ అనే వ్యాఖ్యని జోడించింది.
సెలబ్రిటీ సిస్టర్స్ షమితా శెట్టి, శిల్పా శెట్టిలు ఒకే ఎటైర్‌లో మెరిసిపోతున్న మోషన్ పిక్చర్‌ని పోస్ట్ చేశారు.
టాలీవుడ్ తార హన్సిక ‘అంచనాలకు వాస్తవాలకు మధ్య తేడా’ అంటూ కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది.
నటి, నిర్మాత మంచు లక్ష్మి ‘వర్క్ మోడ్’ అంటూ తన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
‘జెర్సీ’ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ నటుడు విశాల్‌తో కలిసి దిగిన ఓ ఫొటోని పోస్ట్ చేసింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...