టాలీవుడ్ భామ రాశీ ఖన్నా స్విమ్మింగ్ పూల్ దగ్గర దిగిన ఓ అందమైన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
తెలుగు భామ అంజలికి బ్లాక్ అండ్ వైట్ రంగులు అంటే ఎంతో ఇష్టమట. ఈ విషయాన్ని చెబుతూ అవే రంగులు ఉన్న కుర్చీలో నల్లటి దుస్తులు ధరించిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
నటి వితిక తన తాజా ఫొటోని పోస్ట్ చేస్తూ ‘సంతోషం అనేది ఒక ఎంపిక మాత్రమే.. ఫలితం కాదు’ అని రాసుకొచ్చింది.
అందాల తార హన్సిక మంచుతో ఆడుకుంటోన్న ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా తనకు మంచు అంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది.
అందాల భామ పాయల్ రాజ్‌పుత్ తన బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫొటోలను పోస్ట్ చేసి అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
దక్షిణాది తార నమిత మూగజీవానికి ఆహారం పెడుతున్న వీడియోని అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘అందరూ శునకాల్లాగే ఎలాంటి షరతులూ లేకుండా నిస్వార్ధంగా ప్రేమించగలిగితే ఈ ప్రపంచం ఎంతో అద్భుతంగా ఉంటుంది’ అంటూ ఎంకె క్లింటన్ రాసిన కొటేషన్‌ని పోస్ట్ చేసింది. అంతేకాదు.. ‘మూగజీవాల పట్ల దయ చూపించడం వల్ల మనకి వచ్చే నష్టం ఏమీ ఉండదు. అది ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు’ అని రాసుకొచ్చింది. కాగా, నమిత ‘బౌ వావ్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ వీడియో అక్కడ తీసిందే..!
టాలీవుడ్ నటి ప్రియమణి పోల్కా డాట్స్ ఉన్న చీరని ధరించిన ఫొటోని పోస్ట్ చేసింది.
పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే ‘రాధే శ్యామ్’ చిత్రంలో నటిస్తోంది. ఈ సందర్భంగా ఆ చిత్ర టీజర్‌కి డబ్బింగ్ చెబుతోన్న ఫొటోని అభిమానులతో పంచుకుంది.
సొట్టబుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠి నటించిన ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హాకీ స్టిక్ పట్టుకొని దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు దంపతులు ఈ రోజు తమ 16వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహేష్ సతీమణి తన భర్తతో దిగిన ఓ క్యూట్ ఫొటోని పోస్ట్ చేసింది. వారి గారాల పట్టి సితార కూడా తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ తమ కుటుంబ ఫొటోని అభిమానులతో పంచుకుంది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి..