అందాల తార నమిత వ్యాయామం చేస్తోన్న వీడియోని అభిమానులతో పంచుకుంది. మరో తార లక్ష్మీ రాయ్ జిమ్‌లో బాక్సింగ్ చేస్తోన్న వీడియోని పోస్ట్ చేస్తూ ‘వ్యాయామం మరీ ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదు.. కానీ క్రమం తప్పకుండా చేయాలి’ అని రాసుకొచ్చింది.
టాలీవుడ్ భామ సురభి హీరోయిన్గా నటించిన ‘శశి’ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఆ చిత్ర ప్రమోషన్లలో భాగంగా తన తాజా ఫొటోని అభిమానులతో పంచుకుంది.
బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ పూదోటలో సరదాగా గడిపిన అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
సొట్టబుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠి తన ఫొటోలను పోస్ట్ చేస్తూ ‘ఏదైతే మిమ్మల్ని ఈ రోజు బాధిస్తుందో.. రేపు అదే మిమ్మల్ని బలవంతులుగా మారుస్తుంది’ అని రాసుకొచ్చింది.
బాలీవుడ్ భామ మల్లికా శెరావత్ ‘ఆనందకరమైన క్షణాలు’ అంటూ తన తాజా ఫొటోలను పోస్ట్ చేసింది.
బాలీవుడ్ తార అమైరా దస్తూర్ తన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘మీ మనసులో ఏది దాచినా అది మీ కళ్లల్లో తెలిసిపోతుంది’ అని చెప్పుకొచ్చింది.
యాంకర్ శ్రీముఖి ‘హోలా గోవా’ అంటూ గోవాలో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
‘జబర్దస్త్’ యాంకర్ అనసూయ తాజా ఎపిసోడ్‌కి సంబంధించిన ఇంట్రో సాంగ్‌కి స్టెప్పులేసిన వీడియోని పోస్ట్ చేసింది.
బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ మౌనంగా ఉన్న ఫొటోలను పోస్ట్ చేసింది.
నటి ఊర్వశీ రౌతెల రికార్డింగ్ రూమ్‌లో పాట పాడుతున్నట్టుగా దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేయండి మరి...