మెగా కోడలు ఉపాసన కొణిదెల తన తాత, అమ్మమ్మలతో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘అమ్మమ్మ, తాతలకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీ దగ్గర్నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఇక ఇందులోని చివరి ఫొటో మంచి సందేశాన్నిస్తోంది’ అని రాసుకొచ్చింది.
బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘ప్రపంచమంతా తిరిగాను.. కానీ ఇక్కడ దొరికినంత ఉత్సాహం మరెక్కడా దొరకలేదు’ అంటూ తనలోని దేశభక్తిని చాటుకుంది.
కన్నడ భామ రష్మిక మందన ‘ఛలో’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమయ్యిందన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం నేటితో మూడు వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ చిత్రానికి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్‌ని అభిమానులతో పంచుకుంది రష్మిక.
మిల్కీ బ్యూటీ తమన్నా ‘ఎఫ్3’ చిత్రంలో నటిస్తోంది. ఈ సందర్భంగా మొదటి రోజు షూటింగ్లో భాగంగా దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది. దీనికి ‘మీ హారిక (చిత్రంలోని పాత్ర పేరు) ఈసారి మరింత అల్లరి చేయడానికి మీ ముందుకు వస్తోంది.. చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. మొదటిరోజు, షూటింగ్, ఎఫ్3చిత్రం వంటి హ్యాష్‌ట్యాగ్‌లను కూడా జోడించింది. క్యారక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి కూడా ఈ చిత్రంలో నటిస్తోంది. ఆమె హీరో వెంకటేష్, తమన్నాలతో పాటు దిగిన గ్రూప్ ఫొటోని అభిమానులతో పంచుకుంది.
అందాల భామ దియా మీర్జా తన తాజా ఫొటోని పోస్ట్ చేస్తూ ‘మనకు నచ్చిన పని చేస్తున్నప్పుడు మనం ఊహించిన దానికంటే ఎక్కువే చేయగలం’ అని రాసుకొచ్చింది.
అందాల భామ లక్ష్మీ రాయ్ తన ఫొటోని అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘మనందరం ఒకే ఆటలో ఉన్నాం.. కానీ ఆడే స్థాయులు వేరు!’ అనే వ్యాఖ్యని జోడించింది.
బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనమ్ కపూర్ ‘త్రోబ్యాక్’ అంటూ తన భర్త తనకు ప్రపోజ్ చేస్తోన్న మధుర క్షణాన్ని అభిమానులతో పంచుకుంది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేయండి...