టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా తన తాజా ఫొటోని పోస్ట్ చేస్తూ ‘గొప్ప పనులు చేయడానికే మీరిక్కడున్నారన్న విషయం ప్రతిరోజూ గుర్తుచేసుకోండి..’ అని రాసుకొచ్చింది.
డ్యాన్సర్ దీప్తీ సునైనా తన తాజా ఫొటోలను పోస్ట్ చేస్తూ ‘నేను ఇది చేయలేను అనుకున్నప్పుడు మీరు గతంలో చేసిన పనిని ఓసారి గుర్తుతెచ్చుకోండి’ అని చెప్పుకొచ్చింది.
దక్షిణాది తార క్యాథరిన్ ట్రెసా తన పెట్‌తో సరదాగా గడిపిన వీడియోని పోస్ట్ చేసింది. దీనికి ‘రోజు ఉత్సాహంగా ప్రారంభం కానప్పుడు చక్కటి ఔషధం ఏమిటంటే మీ పెట్‌తో సరదాగా గడపడమే!’ అని చెప్పుకొచ్చింది.
తెలుగు భామ సమీరా రెడ్డి తన కూతురు నైరా తనకు మేకప్ వేస్తోన్న ఫన్నీ వీడియోని అభిమానులతో పంచుకుంది.
టెన్నిస్ తార సానియా మీర్జా ‘మీకు నచ్చినట్టుగా ఉండండి’ అని చెబుతోంది.
బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ కారులో కూర్చుని సరదాగా హమ్మింగ్ చేస్తున్నట్టుగా ఉన్న వీడియోని పోస్ట్ చేసింది.
గాయని సునీత ‘ఫ్రెండ్స్ ఫరెవర్’ అంటూ సుమ, అనితలతో దిగిన ఫొటోలని అభిమానులతో పంచుకుంది.
అందాల భామ నిషా అగర్వాల్ నవ్వుతోన్న ఫొటోని పోస్ట్ చేస్తూ ‘మంచి ఫొటో రావాలంటే ఆ నవ్వులో సహజత్వం ఉట్టిపడాలి! మరి మీరేమంటారు?’ అని తన అభిమానులను అడిగింది.
అందాల భామ ఊర్వశీ రౌతెల మొసలికి ఆహారం పెడుతోన్న వీడియోని అభిమానులతో పంచుకుంది.
దక్షిణాది తార లక్ష్మీ రాయ్ తన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘మీ పాత్రను మీకంటే బాగా ఎవరూ చేయలేరు’ అని రాసుకొచ్చింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై మీరూ ఓ లుక్కేయండి...