సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార దుబాయ్ టూర్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సముద్రపు ఒడ్డున దిగిన ఓ ఫొటోని పోస్ట్ చేస్తూ ‘ఇసుక.. ఉప్పునీరు.. సూర్యాస్తమయం.. ఓ మధుర జ్ఞాపకం!’ అనే క్యాప్షన్‌ని జోడించింది.
టాలీవుడ్ భామ సాయేషా సైగల్ సంతోషంగా ఉన్న ఫొటోని పోస్ట్ చేసింది.
క్యారక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి తన సహ నటుడు జీవీ ప్రకాశ్‌తో కలిసి సెట్లో నవ్వుతోన్న ఫొటోని పోస్ట్ చేసింది.
బాలీవుడ్ భామ కరీనా కపూర్ రెండోసారి గర్భం ధరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె 2016 నాటి ఫొటోతో ప్రస్తుత ఫొటోని కలిపి ‘అప్పుడు.. ఇప్పుడు..’ అన్న క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది.
అందాల తార లక్ష్మీ రాయ్ తన తాజా ఫొటోని పోస్ట్ చేస్తూ ‘ఇంకొకరి మాటలకు ప్రతిధ్వనిలా మారకుండా మీ సొంత గొంతుక వినిపించండి!’ అని చెప్పుకొచ్చింది.
సొట్టబుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠి జిమ్‌లో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘ఈరోజు ఎలాంటి మోటివేషనల్ కొటేషన్ లేదు. ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత వ్యాయామం చేయడం మొదలుపెట్టాను. అందుకే మిమ్మల్ని వ్యాయామం చేయమని చెప్పను’ అంటోంది.
అందాల తార ఊర్వశీ రౌతెల ‘వరల్డ్ సెక్సీయెస్ట్ సూపర్ మోడల్ - 2021’ జాబితాలో టాప్-10లో చోటుదక్కించుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా నిలిచింది.. ఈ సందర్భంగా తన సంతోషాన్ని పంచుకుంటూ దేవుడికి, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేయండి మరి...