క్యారక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి అందమైన చీరలో పతంగులు ఎగరేసే చోట సందడి చేసింది. ఈ సందర్భంగా దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
గాయని సునీత ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలో రెండు ఆవులు రైతు భుజంపై తలవాల్చి నిద్ర పోతున్నట్లుగా ఉంది. దీనికి ‘సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.. అంతర్జాలంలో నేను చూసిన వాటిలో ఇదే బెస్ట్ ఫొటో’ అనే వ్యాఖ్యని జోడించింది.
‘మహానటి’ కీర్తి సురేశ్ పండగ సందర్భంగా అందంగా ముస్తాబైన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ‘జస్ట్ లైక్ దట్’ అంటూ తన అందమైన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
‘జబర్దస్త్’ యాంకర్ అనసూయ పండగ వేళ లంగావోణీలో అందంగా రడీ అయిన ఫొటోలను పోస్ట్ చేసింది.
సూపర్ స్టార్ మహేష్‌బాబు గారాల పట్టి సితార ‘స్పెయిన్ డైరీస్’ అంటూ గతంతో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ‘ఆ సమయంలో అన్నతో కలిసి ఇసుక కోటలు కడుతున్నా’ అని చెప్పుకొచ్చింది.
నటి రష్మీ గౌతమ్ తన తాజా ఫొటోని పోస్ట్ చేస్తూ ‘అద్భుతమైన 2021 కోసం ఎదురుచూస్తున్నాను.. ‘ఈ విశ్వం పట్ల మనం ప్రేమ, కరుణ ప్రదర్శిస్తే మనకూ తిరిగి అవే దక్కుతాయి’ అనే వ్యాఖ్యని జోడించింది.
‘జెర్సీ’ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ ‘త్రోబ్యాక్’ అంటూ తన అందమైన ఫొటోని పోస్ట్ చేసింది.
అలనాటి తార, ‘జబర్దస్త్’ జడ్జి రోజా తన అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
గాయని మంగ్లీ ‘క్రాక్’ మూవీ సక్సెస్ మీట్లో మెరిసింది. ఈ సందర్భంగా మాస్ మహారాజ రవితేజతో దిగిన ఓ ఫొటోని పోస్ట్ చేసింది.
మెగా డాటర్ నిహారిక కొణిదెల సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకొంది. ఈ సందర్భంగా తన భర్త చైతన్యతో పాటు కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది.
అందాల తార నిషా అగర్వాల్ తన భర్త, బాబుతో సరదాగా పతంగులు ఎగురవేస్తున్న ఫొటోని పోస్ట్ చేసింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపైన ఓ లుక్కేయండి!