అందాల భామ రుహానీ శర్మ తన తాజా ఫొటోని పోస్ట్ చేస్తూ ‘మీ అందరికీ లోహ్రి, పొంగల్, మకర సంక్రాంతి శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చింది.
టాలీవుడ్ భామ మంచు లక్ష్మి తన కూతురు నిర్వాణ, కుటుంబ సభ్యులతో కలిసి దిగిన అందమైన ఫొటోలను పోస్ట్ చేస్తూ ‘మీ గతాన్ని భోగి మంటల్లో కలిపేయండి.. ప్రతికూలతలకు గుడ్ బై చెప్పి.. మంచి భవిష్యత్తుని ఆహ్వానించండి. మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు.. మనందరం ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుందాం’ అని రాసుకొచ్చింది.
క్యారక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి ‘భోగి పండుగ శుభాకాంక్షలు’ అంటూ భోగి మంట దగ్గర దిగిన ఫొటోని పోస్ట్ చేసింది.
నటి హిమజ ‘భోగి’ శుభాకాంక్షలు తెలుపుతూ అందమైన లొకేషన్లో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
మనందరం జరుపుకొనే భోగి పండుగని ఉత్తరాదిన ‘లోహ్రి’గా జరుపుకొంటారు. బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్ తన భర్త రోహన్ ప్రీత్ సింగ్తో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా అందరికీ లోహ్రి శుభాకాంక్షలు తెలిపింది. వీరిద్దరికీ ఇటీవలే వివాహం జరిగింది.
బుల్లితెర బ్యూటీ హీనా ఖాన్ కేక్ పట్టుకొని దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
కేరళ కుట్టి సాయి పల్లవి తను నటిస్తోన్న ‘విరాట పర్వం’ చిత్రానికి సంబంధించిన పోస్టర్ని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు’ తెలిపింది.
అందాల భామ అనుపమా పరమేశ్వరన్ డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్తో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేస్తోన్న ’18 పేజీలు’ చిత్రంలో అనుపమ హీరోయిన్గా నటిస్తోంది.
ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ‘అల్లుడు అదుర్స్’ చిత్ర షూటింగ్ సందర్భంగా దిగిన ఓ వీడియోని పోస్ట్ చేసింది. దీనికి ‘మైనస్ ఆరు డిగ్రీల చలిలో.. మా హీరో.. నేను’ అంటూ రాసుకొచ్చింది. బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
అందాల తార వరలక్ష్మీ శరత్ కుమార్ తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఆమె నటించిన ‘క్రాక్’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. ఈ సందర్భంగా ప్రేక్షకులను ఉద్దేశిస్తూ ‘మీ ఆదరాభిమానాలకు ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చింది.
టాలీవుడ్ ఫిట్నెస్ ఫ్రీక్ రకుల్ ప్రీత్ సింగ్ సైక్లింగ్ చేస్తోన్న వీడియోని అభిమానులతో పంచుకుంది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...