కొత్త జంట నిహారిక, చైతన్య దంపతులు తమ హానీమూన్ ట్రిప్‌ని ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు. ‘ఓకే.. ఇక తిరిగి పని మొదలు పెట్టాలి’ అంటూ తను నటించబోయే వెబ్‌సిరీస్ పూజా కార్యక్రమం ఫొటోలను అభిమానులతో పంచుకుంది నిహారిక. అంతేకాదు.. తను దీనికోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్టు తెలిపింది.
ప్రముఖ నటి ఊర్వశీ రౌతెల ‘ఐ లవ్ యూ’ అంటూ తన తాజా ఫొటోని అభిమానులతో పంచుకుంది.
నటి హిమజ నవ్వుతోన్న తన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘ప్రతి రోజూ ప్రత్యేకమైనదే. అలాంటి రోజును ఆస్వాదించడం మన అదృష్టం. అందుకే నవ్వుతూ రోజుని ప్రారంభించండి..’ అని రాసుకొచ్చింది.
అలనాటి నటి రోజా తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
అందాల తార కియారా అడ్వాణీ వ్యాయామం చేస్తోన్న వీడియోని పోస్ట్ చేస్తూ ‘ఛార్జ్డ్ ఫర్ 2021’ అని రాసుకొచ్చింది.
టాలీవుడ్ నటి సమంత తన తాజా ఫొటోని అభిమానులతో పంచుకుంది.
గాయని సునీత తన పసుపు ఫంక్షన్‌కి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది.
నటి నమ్రతా శిరోద్కర్ తన కూతురు సితార బాల్కనీలో నిల్చొన్న ఫొటోని పోస్ట్ చేస్తూ ‘తనే నా ప్రపంచం’ అని అర్థం వచ్చేలా వ్యాఖ్యని జోడించింది.
అలనాటి తార మీనా ‘1994 వర్సెస్ 2021’ అంటూ సీతాకోకచిలుక బొమ్మ ముందు నిలబడిన ఫొటోలను పోస్ట్ చేసింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...