కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్ ‘బై 2020, హే 2021’ అంటూ తనకు సంబంధించిన మూడు ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా వాటికి ఆసక్తికరమైన వ్యాఖ్యలను జోడించింది.. అవేంటంటే..
1. అరే.. మళ్లీ ఒక సంవత్సరం వృథా చేశాను.. ఛా...!
2. పోనీలే.. ‘ఇదంతా కరోనా వల్లే.. కరోనా వల్లే..’!
3. హమ్మయ్యా!! ఈసారి నా వల్ల వేస్ట్ కాలేదులే!
‘చందమామ’ కాజల్ అగర్వాల్ 'న్యూ ఇయర్ లోకి అడుగు పెట్టేస్తున్నాం' అనే హ్యాష్ టాగ్ తో తన స్నేహితులతో కలిసి జంప్ చేస్తున్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘ఎవరు బాగా చేశారు’ అనే వ్యాఖ్యని జత చేసింది.
బాలీవుడ్ తార కరీనా కపూర్ తను నటించిన ఓ చిత్రంలోని ఫొటోని పోస్ట్ చేస్తూ ‘ఇది ఏ చిత్రం లోనిది? ఏ పాట?’ అని అభిమానులను అడిగింది.
టాలీవుడ్ భామ రెజీనా సంప్రదాయ దుస్తుల్లో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
అందాల తార నేహా శర్మ ఫ్లోరిడాలోని బీచ్‌లో సందడి చేస్తోన్న వీడియోని అభిమానులతో పంచుకుంది.
సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా తన తాజా ఫొటోని పోస్ట్ చేస్తూ ‘2021 కోసం ఎదురు చూస్తున్నాను. కొత్త సంవత్సరం కోసం ఇంతకు ముందెన్నడూ ఇంతలా ఎదురుచూడలేదు. ఎందుకో తెలుసా?’ అని అడుగుతోంది.
టాలీవుడ్ నటి నమ్రతా శిరోద్కర్ ‘పెళ్లిళ్లకు వెళ్లేటప్పుడు... జాగ్రత్తగా ఉండండి’ అని చెబుతోంది.
టెన్నిస్ తార సానియా మీర్జా తన అందమైన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
‘సంవత్సరంలోని చివరి రెండు రోజులు’ అంటూ తన తాజా ఫొటోని పోస్ట్ చేసింది బాలీవుడ్ తార కరిష్మా.
మహేష్ బాబు గారాల పట్టి సితార కొవిడ్ టెస్ట్ చేయించుకుంది. దానికి సంబంధించిన వీడియోని పోస్ట్ చేస్తూ ‘నేను మొదటిసారి కొవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. టెస్ట్ చేయించుకునే ముందు చాలా భయపడ్డాను. కానీ అమ్మ నా చేతులు పట్టుకొని పక్కనే నిల్చొని ధైర్యాన్నిచ్చింది. మీరు ఎవరైనా స్నేహితులు, కుటుంబ సభ్యులను కలిసినప్పుడు తప్పకుండా కొవిడ్ టెస్ట్ చేయించుకోండి. నేను అదే చేశాను. నిజం చెప్పాలంటే.. ఈ టెస్ట్ అంత ఇబ్బందిగా ఏమీ లేదు. నొప్పి కూడా లేదు. కాబట్టి అందరం కొవిడ్ టెస్ట్ చేయించుకొని ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం..! అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చింది.
మెగా కోడలు ఉపాసన కొణిదెల, భర్త రాంచరణ్‌తో కలిసి క్వారంటైన్లో ఉంది. ఈ సందర్భంగా ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది.
‘మహానటి’ కీర్తి సురేశ్ ‘స్పెయిన్ డైరీస్’ అంటూ గతంలో తను స్పెయిన్ లో ఉన్నప్పుడు దిగిన ఓ త్రో బ్యాక్ ఫొటోని అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలో కీర్తి పావురాలతో ఆడుకుంటూ కనిపించింది.
ప్రముఖ యాంకర్ సుమ షూటింగ్‌కి రడీ అవుతున్న వీడియోని అభిమానులతో పంచుకుంది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...