టాలీవుడ్ నటి వితిక నవ్వుతోన్న తన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
దక్షిణాది తార శృతి హాసన్ ‘మై పీప్స్’ అంటూ తన స్నేహితులతో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
నటి అదితీ రావు హైదరీ తన ఫొటోని పోస్ట్ చేస్తూ- 'తుఫాను ఎంత తీవ్రంగా ఉంటే ఇంద్రధనస్సు అంత అందంగా ఉంటుంది' అంటూ కష్టాల తర్వాత వచ్చే సుఖాలు అంత తీయగా ఉంటాయని చెప్పకనే చెప్పింది.
అందాల భామ సిమ్రత్ కౌర్ మంచులో నిలబడిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘నా ఫాలోవర్ల సంఖ్య 6 లక్షలకు చేరినందుకు సంతోషంగా ఉంది. నాకు మంచు అంటే ఎంత ఇష్టమో మీరే చూడండి.. ఫొటో తీస్తున్నప్పుడు మాత్రం చలిగా అనిపించింది’ అని రాసుకొచ్చింది.
ముంబయి బ్యూటీ సాయేషా సైగల్ ‘వింటర్ వైబ్స్’ అంటూ తన తాజా ఫొటోని పోస్ట్ చేసింది.
‘ప్రకృతితో ముచ్చట్లు’ అంటూ ఓ పార్క్లో తాబేలు పక్కన కూర్చున్న ఫొటోని పోస్ట్ చేసింది నటి సోనాలీ బింద్రే.
బుల్లితెర భామ హీనా ఖాన్ సముద్రపు ఒడ్డున సేద తీరుతున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
‘జబర్దస్త్’ యాంకర్ అనసూయ నవ్వుతూ తన భర్తతో కలిసి సరదాగా గడిపిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది.
బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా తన తాజా ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘ఈ సంవత్సరపు చివరివారం.. 2021 ఏం తీసుకొస్తుందో అని ఆశగా ఉంది. మరి మీకు?’ అని రాసుకొచ్చింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...