టెన్నిస్ తార సానియా మీర్జా ఎడారిలో దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘అద్భుతమైన జ్ఞాపకాలను ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉండదు’ అని అర్థం వచ్చే వ్యాఖ్యని జత చేసింది.
అందాల తార భాగ్యశ్రీ ‘కాఫీ టైమ్ స్టోరీస్’ అంటూ తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
‘మహానటి’ కీర్తి సురేశ్ తను నటిస్తోన్న ‘రంగ్‌దే’ చిత్ర పోస్టర్ని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మీకు, మీ కుటుంబ సభ్యులకు వైకుంఠ ఏకాదశి మరియు గీతా జయంతి శుభాకాంక్షలు!’ అని చెప్పుకొచ్చింది.
ఈటీవీలో ప్రసారమవుతోన్న ఖతర్నాక్ కామెడీ షో ‘జబర్దస్త్’ 400వ ఎపిసోడ్‌ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా యాంకర్ అనసూయ ‘ఫెంటాస్టిక్ 400’ అంటూ టీం మెంబర్స్‌తో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది.
బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ‘చలికాలం.. మార్నింగ్ ఎఫెక్ట్’ అంటూ తన తాజా ఫొటోని పోస్ట్ చేసింది.
బాలీవుడ్ తార ప్రియాంకా చోప్రా ‘క్రిస్మస్ స్పిరిట్’ అంటూ తన భర్త నిక్ జోనాస్‌తో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. చలికాలం కావడంతో దంపతులిద్దరూ స్వెట్టర్ ధరించగా తమ పెట్‌కు కూడా బుజ్జి స్వెట్టర్ వేశారు.
అందాల తార అమీషా పటేల్ షూటింగ్లో భాగంగా శ్రీనగర్ వెళ్లింది. ఈ సందర్భంగా దాల్ లేక్ వద్ద దిగిన ఓ అందమైన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ భామ రాశీ ఖన్నా ‘ఇది పెళ్లిళ్ల సీజన్’ అంటూ అందంగా ముస్తాబైన ఫొటోలను పోస్ట్ చేసింది. వాటిపై ఓ లుక్కేయండి మరి...
‘కళ్లు ఎప్పుడూ అబద్ధం చెప్పవు’ అంటోంది అందాల భామ లక్ష్మీ రాయ్.
కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్ కొత్త అటైర్లో మెరిసిపోతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రం నేడు థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా రిలీజ్ పోస్టర్ని అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ నటి తేజస్వి మదివాడ ‘మీరు ఎలా ఉంటే అలానే కనిపించండి.. ఎలా కనిపిస్తారో అలాగే ఉండండి' అంటూ తన తాజా ఫొటోని పోస్ట్ చేసింది.
వీరితో పాటు పలువురు తారలు ‘క్రిస్మస్’ పర్వదినం సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెట్టారు. వాటి కోసం ఈ కింది లింక్‌ని క్లిక్ చేయండి.
అందాల తారల క్రిస్మస్ వేడుకలు చూశారా?