అందాల తార ఐశ్వర్యా రాజేష్ తన తల్లితో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మా.. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం నువ్వే.. లవ్యూ అమ్మా’ అని రాసుకొచ్చింది.
అందాల తార రేణూ దేశాయ్ చీకట్లో విద్యుత్ దీప కాంతుల్లో నిలబడిన ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘ప్రతీకారానికి బదులు ప్రశాంతతను నమ్ముకున్న మహిళని ఎవరూ బాధపెట్టలేరు’ అని చెప్పుకొచ్చింది.
ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్గా నటిస్తోన్న ‘సోలో బ్రతుకే సో బెటరు’ చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ సందర్భంగా తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ బికినీ ధరించి సముద్రపు ఒడ్డున కూర్చున్న ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘శుభోదయం మిత్రులారా! నా జీవితంలో నేను సందర్శించిన ప్రదేశాల్లో నాకు బాగా నచ్చింది మెక్సికో. ఇది ఎంతో అందమైనది, కానీ అంచనాలకు అందనిది. ఈ ఫొటో మెక్సికోలోని ‘తులుం’ అనే చిన్న ద్వీపంలో తీసింది’ అని చెప్పుకొచ్చింది.
సొట్టబుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠి పింక్ కలర్ పలాజో కుర్తీలో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది. దీనికి ‘అందరిలో ఒకరిగా కాకుండా.. మీకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకోండి’ అని అర్థం వచ్చే వ్యాఖ్యని జత చేసింది.
అందాల తార సంయుక్తా హెగ్డే డ్యాన్స్ చేస్తోన్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘ప్రియమైన నృత్యమా, నా జీవితంలోకి నువ్వు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నువ్వు లేకుంటే నేను లేను. నువ్వు నాలో స్ఫూర్తి నింపుతున్నావు’ అంటూ డ్యాన్స్‌పై తనకున్న ప్రేమను వ్యక్తపరిచింది.
అందాల తార లక్ష్మీ రాయ్ టాలీవుడ్ నటులు చిరంజీవి, నాగార్జునలను కలిసింది. ఈ సందర్భంగా వారితో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
బాలీవుడ్ తార సోనాక్షీ సిన్హా వ్యాయామం చేస్తోన్న ఫొటోని అభిమానులతో పంచుకుంది.
ఈ రోజు (డిసెంబర్ 23)ని దేశవ్యాప్తంగా ‘కిసాన్ దివస్ (రైతుల దినోత్సవం)’గా జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా యాంకర్ సుమ, నిర్మాత మంజులా ఘట్టమనేనిలు రైతులకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి ప్రాధాన్యం, విశిష్టతల గురించి వివరించారు.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిని ఓ సారి చూసేద్దామా...