మెగా డాటర్, కొత్త పెళ్లి కూతురు నిహారిక తన పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో జరుపుకుంది. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ నటి రాశీ ఖన్నా తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది. వాటిని ఓసారి చూసేద్దాం రండి...
‘గురు’ హీరోయిన్ రితికా సింగ్ సూర్యాస్తమయ సమయాన నది ఒడ్డున నడుస్తోన్న ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘ముంగిపులు కూడా చాలా అందంగా ఉంటాయనడానికి సూర్యాస్తమయమే నిదర్శనం!’ అనే వ్యాఖ్యని జతచేసింది.
టాలీవుడ్ నటి అనిత తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
అందాల భామ సాయేషా సైగల్ తన భర్త ఆర్యతో దిగిన ఓ ఫొటోని పోస్ట్ చేసింది.
బుల్లితెర నటి సుజితా ధనుష్ ‘హ్యాపీ వర్కింగ్ డే’ అంటూ తన తాజా ఫొటోలను పోస్ట్ చేసింది. దీనికి వర్క్, తెలంగాణ, హైదరాబాద్ హ్యాష్‌ట్యాగ్‌లను కూడా జోడించింది.
‘చందమామ’ కాజల్ అగర్వాల్ తన భర్తతో కలిసి రూపొందించిన ఓ వీడియోని అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ నటి సోనల్ చౌహాన్ బోట్లో కూర్చుని దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘2021వైపు పయనిస్తున్నా..’ అనే వ్యాఖ్యని జత చేసింది.
అందాల భామ హంసా నందిని స్విమ్మింగ్‌పూల్ పక్కన సేద తీరుతోన్న తన అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిని ఓసారి చూద్దాం రండి...