మిల్కీ బ్యూటీ తమన్నా పుట్టిన రోజు సందర్భంగా సాయి లక్ష్మి అనే అభిమాని అందమైన ఫొటోఫ్రేమ్ని బహుమతిగా ఇచ్చారు. ఆ ఫొటోని పోస్ట్ చేస్తూ ‘ఈ గిఫ్ట్ ఎంతో క్యూట్‌గా ఉంది.. నాకు సంబంధించిన ప్రతి అంశం గురించి ఎంతగానో ఆలోచించి, నా ప్రపంచాన్ని ఇందులో పొందుపరిచారు. నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్యూ సో మచ్’ అంటూ తన అభిమానికి ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలిపిందీ మిల్కీ బ్యూటీ.
అందాల భామ కియారా అడ్వాణి హీరో వరుణ్ ధావన్ తో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. వీరిద్దరూ ‘జగ్ జగ్ జీయో’ చిత్రంలో నటిస్తున్నారు.
ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ‘సోలో బ్రతుకే సో బెటరు’ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా చిత్ర ప్రమోషన్లలో భాగంగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ చిత్రం ఈ నెల 25 న విడుదల కానుంది.
కేరళ కుట్టి మంజిమా మోహన్ తన తాజా ఫొటోని అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ సంతోషంగా గడపడమే అత్యంత ముఖ్యమైన విషయం’ అని అర్థం వచ్చే వ్యాఖ్యని జత చేసింది.
తెలుగు భామ అంజలి పచ్చని ప్రకృతి నడుమ దిగిన అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
అందాల భామ మనీషా కోయిరాలా నేపాల్ లోని చారిత్రక ప్రదేశం పఠాన్ దర్బార్ స్క్వేర్ దగ్గర ఒంటరిగా నడుస్తోన్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘సౌందర్య అన్వేషణలో కొన్నిసార్లు ఒంటరిగా ప్రయాణించాల్సి రావచ్చు’ అని చెప్పుకొచ్చింది.
కన్నడ భామ నిక్కీ గల్రానీ ‘మై సూపర్ స్టార్స్’ అంటూ తన పెట్స్‌తో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
మహానటి కీర్తి సురేశ్ తన స్నేహితురాలి వివాహానికి హాజరైంది. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఇవి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి తన సెల్ఫీని పోస్ట్ చేసింది. దీనికి ‘నేను వారాంతం కోసం వేచి చూస్తున్నాను.. మీరేం చేస్తున్నారు?’ అనే వ్యాఖ్యని జత చేసింది.
ముంబయి బ్యూటీ జెనీలియా తన తండ్రితో దిగిన ఫొటోని పోస్ట్ చేస్తూ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. మరి, వాటిపై ఓ లుక్కేద్దాం రండి...