నటి నిషా అగర్వాల్ తన సోదరి కాజల్ అగర్వాల్‌ని హగ్ చేసుకున్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా- ‘ఇప్పటికీ అక్క పెళ్లి ముచ్చట్లే గుర్తుకు వస్తున్నాయి.. ఇంకా ఆ వేడుకలు పూర్తయినట్లే లేదు..’ అని చెప్పుకొచ్చింది.
‘ఐస్‌క్రీమ్’ బ్యూటీ తేజస్వీ మదివాడ రెక్కలు చాచి పక్షి లాగా ఎగరడానికి ప్రయత్నిస్తున్న ఓ ఫొటోని పోస్ట్ చేసింది. ఆ చెట్టుకు ఓ పంజరం కూడా ఉంది. దీనికి 'పంజరం నుంచి బయటపడ్డావు.. రెక్కలు విప్పి స్వేచ్ఛగా విహరించు' అంటూ రుమి రాసిన ఓ వ్యాఖ్యని జత చేసింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార తన సోదరి అనౌష్కతో సరదాగా గడిపిన ఫొటోని అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. పక్కనే కూర్చున్నా.. మా మధ్య ఉండే ప్రేమ, అనుబంధం ఎప్పటికీ ఒకేలా ఉంటాయి’ అని రాసుకొచ్చింది.
‘బిగ్‌బాస్’ బ్యూటీ హిమజ తన కాశీ యాత్రకు సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంది.
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన తండ్రి బోనీ కపూర్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా తండ్రితో దిగిన చిన్నప్పటి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంది.
తెలుగు భామ అంజలి తన పెట్ పోలోతో దిగిన అందమైన ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా తన పెట్‌కి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
టాలీవుడ్ ఫిట్నెస్ ఫ్రీక్ రకుల్ ప్రీత్ సింగ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటింది. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను పంచుకుంటూ ‘ఆలస్యమయినా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నాను. నన్ను నామినేట్ చేసిన అక్కినేని చైతన్యకి ధన్యవాదాలు. నేను మూడు మొక్కలు నాటాను. అయితే నేను వేరే నటులను నామినేట్ చేయదలచుకోలేదు. కానీ నా ప్రతి అభిమానిని మూడు మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించాలని కోరుతున్నాను. పుడమిని పచ్చగా ఉంచడం మన కర్తవ్యం. ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టిన పార్లమెంట్ సభ్యుడు సంతోష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు’ అని రాసుకొచ్చింది.
టాలీవుడ్ నటి రేణూ దేశాయ్ కూతురు ఆద్య పియానో వాయిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోని రేణూ తన అభిమానులతో పంచుకుంది.
హీరో మహేష్ బాబు సోదరి మంజులా ఘట్టమనేని తన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘ఈ సృష్టిలోనే మనుషులుగా మనకు ఓ ప్రత్యేకత ఉంది.. మన చుట్టూ జరిగే అంశాలపై మనకు ఒక అవగాహన ఉంటుంది. అన్నిటినీ తెలుసుకోగలిగిన తెలివితేటలుంటాయి.. మీరు అనుకున్న దానికంటే మీరు ఎక్కువ తెలివైనవారు. ధైర్యవంతులు.. మీరు దేన్నైనా సాధించగలరన్న విషయం మీకే తెలియదు.. మీరు చేయాల్సిందల్లా మిమ్మల్ని మీరు నమ్మడం.. ముందడుగు వేయడం. ఇప్పుడు చెప్పండి.. మీరు ఈ రోజు కొత్తగా ఏం చేయడానికి సిద్ధపడుతున్నారు’ అని రాసుకొచ్చింది.
వీరితో పాటు పలువురు తారలు తమ అప్డేట్లను అభిమానులతో పంచుకున్నారు. వాటిని చూసేద్దామా...!