‘కొన్ని సందర్భాల్లో మనం చేయాల్సిందల్లా రొటీన్‌ని బ్రేక్ చేసి సరదాగా గడపడమే’ అంటూ అందాల తార జెనీలియా తన తాజా ఫొటోని పోస్ట్ చేసింది.
టాలీవుడ్ నటి అక్కినేని సమంత తమ గార్డెన్లో వ్యాయామం చేస్తోన్న వీడియోని అభిమానులతో పంచుకుంది.
మిల్కీ బ్యూటీ తమన్నా తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ భామ లక్ష్మీ రాయ్ ‘మీకు మీరుగా ఉండడానికి మరొకరి అనుమతి అవసరం లేదు’ అంటూ తన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
దుబాయ్ వేదికగా జరిగిన వుమెన్ టీ20 ఛాలెంజ్ ట్రోఫీని స్మృతి మంధాన నేతృత్వంలోని ట్రైల్బ్లేజర్స్ టీమ్ గెలుచుకుంది. ఈ సందర్భంగా స్మృతి.. ట్రోఫీని అందుకున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
అందాల భామ అదితి రావు హైదరి పింక్ కలర్ డ్రస్ ధరించిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా
‘నేను పింక్‌ని నమ్ముతాను.
నవ్వడం వల్ల ఎక్కువ కెలోరీలు కరుగుతాయని నమ్ముతాను.
ముద్దు పెట్టుకోవడాన్ని నేను నమ్ముతాను..
అన్ని ఫలితాలు ప్రతికూలంగా వచ్చినప్పుడు దృఢంగా ఉండాలని నేను నమ్ముతాను.
సంతోషంగా ఉండే అమ్మాయిలు అందంగా ఉంటారని నేను నమ్ముతాను.
నా దృష్టిలో రేపు అంటే కేవలం మరొక రోజు మాత్రమే.. నేను అద్భుతాలను నమ్ముతాను’ అంటూ ఆడ్రీ హెప్బర్న్ రాసిన వ్యాఖ్యని జతచేసింది.
‘జెర్సీ’ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ సోషల్ మీడియా డిస్టెన్సింగ్’ అంటూ పచ్చటి పరిసరాల్లో పచ్చిక పైన సేద తీరుతున్న ఫొటోని పోస్ట్ చేసింది.
ప్రముఖ యాంకర్ సుమ కనకాల తన తాజా ఫొటోని పోస్ట్ చేస్తూ ‘ఎలా జీవించాలో తెలిస్తే జీవితం ఎంతో సరదాగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చింది.
అందాల తార సన్నీ లియోన్ మాస్క్ పెట్టుకున్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మేకప్ తొలగిపోకుండా ఇలా మాస్క్ పెట్టుకునే షూటింగ్ మధ్యలో జాగ్రత్తగా ఉంటున్నాను’ అని చెప్పుకొచ్చింది.
కన్నడ భామ ధన్యా బాలక్రిష్ణన్ ‘వెడ్డింగ్ గౌన్ లో దిగిన తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ తను నటిస్తోన్న ‘నాగిన్’ సినిమాకు సంబంధించిన కొన్ని రకాల ఆర్ట్ వర్క్‌లను అభిమానులతో పంచుకుంది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిని చూసేద్దాం రండి...