సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార తన పిన్నితో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది.
అందాల భామ కృతి సనన్ వ్యాయామం చేస్తోన్న ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘రూమ్ పొడవును కొలుస్తున్నాను’ అనే వ్యాఖ్యని జత చేసింది.
కొత్త దంపతులు కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లులు హనీమూన్‌ని మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను కాజల్ అభిమానులతో పంచుకుంది.
‘జబర్దస్త్’ యాంకర్ అనసూయ తన తాజా ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘సోమవారం ఉదయం మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. ‘నేనో అద్భుతమైన వ్యక్తిని.. నేను ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలను’’ అని రాసుకొచ్చింది.
టాలీవుడ్ నటి అక్కినేని సమంత పెట్‌తో సరదాగా దిగిన ఓ ఫొటోని పోస్ట్ చేసింది.
బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా ‘సోమవారం ఎలా ఉండాలనుకుంటాం.. ఎలా ఉంటుంది’ అంటూ రెండు ఫొటోలను పోస్ట్ చేసింది.
బాలీవుడ్ భామ మల్లికా శెరావత్.. కమలా హ్యారిస్‌తో దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ నటి వితిక సామజవరగమన కార్యక్రమానికి హాజరైంది. ఈ సందర్భంగా గాయని సునీతతో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘టాలీవుడ్లో గాయని సునీత అంటే నాకు చాలా ఇష్టం. ఆమె వస్త్రధారణకు వీరాభిమానిని. ఆమె చాలామందికి స్ఫూర్తిదాయకురాలు.. సామజవరగమన బృందానికి కృతజ్ఞతలు’ అని చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ షూటింగ్లో పాల్గొన్న వీడియోని అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ భామ హంసానందిని సాయంత్రపు వేళలో దిగిన తన అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘ఇలాంటి సాయంత్రపు వేళలంటే నాకెంతో ఇష్టం.. మరి మీ వీకెండ్ ఎలా గడిచింది? అంటూ అభిమానులను అడుగుతోంది.
మెగా డాటర్ నిహారిక తన సిస్టర్స్‌తో దిగిన ఓ ఫొటోని పోస్ట్ చేసింది.
బాలీవుడ్ తార జాన్వీ కపూర్ తాజాగా కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘ఓ రోజంతా 1950ల్లో ఉన్నట్లు భావించాను.. ఎంజాయ్ చేశాను’ అని చెప్పుకొచ్చింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...